గోలి హనుమచ్ఛాస్త్రి గారూ, మీ రెండు పూరణలూ బాగున్నాయి. అభినందనలు. మొదటి పూరణ మూడవ పాదంలో గణదోషాన్ని నేను ఎత్తిచూపేలోగా మీరే సవరించారు. సంతోషం! గన్నవరపు వారు నేనొప్పని తప్పును చూపి వెటనే ఆ వ్యాఖ్యను తొలగించారు. మీరు "ఒదలి"ని ఇంకా "వదలి" పెట్టలేదు. "శంకలు విడి" అందాం.
గన్నవరపు నరసింహ మూర్తి గారూ, మీ రెండు పూరణలూ బాగున్నాయి. అభినందనలు. మొదటి పూరణ దేవతలు వుష్ణువును వేడుకొన్న విధంగా పూరించడం బాగుంది. ఇక రెండవ పూరణలో సమస్య పాదాన్ని అజ్ఞానుల్ మాటగా చెప్పి సమర్థించారు. మంచి ఊహ. మీ మూడవ పూరణ ఇప్పుడే చేరింది. చింతలు దీర్చే "చింతా" వారు మనకున్నారు. నిజమే. కాని మూడవ పాదమే అర్థం కాలేదు.
గురువు గారూ మీరు యిచ్చే సమస్యలు నెల వంకలు ( శంకరుని భూషణము ) ఆ వంకరలతో చక్కని ఇంద్ర ధనస్సు లు చేయమంటారు, మా లేఖిని కుంచెతో, అదే నా భావము. చంద్ర వంక అంటే దుష్ట సమాసమని చంద్ర రేఖ అన్నాను. మీకు ధన్యవాదములు.
మిస్సన్న గారూ, మీరేదో తొందరలో ఉండి ఈ పద్యాన్ని వ్రాసి సరిచూసుకోకుండా పోస్ట్ చేసి ఉంటారని నా భావన. మంచి భావం. కాకుంటే చిన్న దోషాలు. "అతని చేయి" అన్వయం కుదరడం లేదు. మూడవ పాదం చివర రెండక్షరాలు లోపించడంతో గణదోషం. నా సవరణ .... (బ్రాకెట్లలో ఉన్నవి) బోయ పాము పురుగు ముక్తిని బొందవే! అమిత భక్తి గొలువ (నడిగి నంత) శంకరుండొసంగు, సంకటములు (పెడఁ) బాపు, తనను జే(ర) ప్రాపు జూపు.
మందాకిని గారూ అతని చేయి అంటే శంకరుడు తన చేతిని అందిస్తాడు అని నా భావం. కొంచెం సందిఘ్దంగా ఉంది కదూ ఎవరి చేయి భక్తుడిదా లేక భగవంతు డిదా అని. మార్చడానికి ప్రయత్నిస్తానండీ.
గురువుగారూ,మందాకిని గారూ, ధన్యవాదములు, ఇప్పుడూ నప్పుతుంది తన్వి బదులు తనయ అంటే - తల్లి స్వగతంగా ఇంకా చక్కగా నప్పుతుంది. ముందు స్మరుడికి గోడువెళ్ళబోసుకుంటునట్టు వ్రాద్దమనుకున్నాను - తన్వి అనటం వల్ల, నాకేలా అనకుండా సుమగాత్రికిన్నేల అనటం వల్ల తల్లికి కూడ అన్వయం కుదురుతోంది. అపర్ణ అప్పటికే చిక్కియున్నది అని చెప్పటానికి తన్వి యని. కోమలత్వాన్ని సూచించడానికి సుమగాత్రి అని అన్నాను, లేని కోపం తెచ్చిపెట్టుకొని ప్రదర్శించటనికి, వైరుధ్యం సూచించటానికి - శూలి, స్థాణు, జడుడు మొ!!వి. పైగా తనుగా వలచిన ప్రేమిక - ఎప్పుడో ఒకప్పుడు ఈయనేమిటి ఇంకా దిగిరాడు అని అనుకోకుండ ఉంటుందంటారా. ఎవరి తలపైనా పర్లేదు, మందాకినీ సలిల చందన చర్చితుడు అనుగ్రహిస్తే - అంతే చాలు.
మందాకినిగారూ ! రవి గారి "బ్లాగాడిస్తా" లో పద్య రచన for dummies-oct 4,2010 చదవండి ముందు http://blaagadistaa.blogspot.com/search/label/%E0%B0%AA%E0%B0%A6%E0%B1%8D%E0%B0%AF%E0%B0%82
గోలి హనుమచ్ఛాస్త్రి.
రిప్లయితొలగించండిశంక లొదలి మదిని సద్బుద్ధి గొల్చిన
శంకరుం డొసంగు; సంకటములు
దీర్చి దరిని జేర్చి,దివ్యముగను
చాలినన్ని సిరులు సౌఖ్యములను.
శ్రీలు శుభము లీయ శివమెత్తి యసురులు
రిప్లయితొలగించండిధ్వంస కాండ చేయ ధరణి యందు
సురలు హరిని జేరి మొరలిడి పలికిరి
శంకరుండొసంగు సంకటములు.
గోలి హనుమచ్ఛాస్త్రి.
రిప్లయితొలగించండి(చిన్న సవరణతో)
శంక లొదలి మదిని సద్బుద్ధి గొల్చిన
శంకరుం డొసంగు; సంకటములు
దీర్చి దరిని జేర్చి,దేహయాత్రను జేయ
చాలినన్ని సిరులు సౌఖ్యములను.
గోలి హనుమచ్ఛాస్త్రి.
రిప్లయితొలగించండిసంతసమ్ము గూర్ప శంకరాభరణము
బ్లాగు నందు నెపుడు బాగు గాను
పద్య పాద మిచ్చి పద్యము పూరింప
శంకరుం డొసంగు సంకటములు (సమస్యలు)
సంకురాత్రినాడు చల్దన్నమునుతిని,
రిప్లయితొలగించండిపొద్దుపోవు వరకు పవ్వళించి,
పరమ శివుని రాత్రి పప్పన్నములు తిన
శంకరుం డొసంగు సంకటములు.
ఆవురావు రనుచు అంకోపరిని దీసి
రిప్లయితొలగించండిశంకరాభరణము చదువ బోవ
పలుగురాళ్ళ వంటి పద్యపాదములతో
శంకరుం డొసంగు సంకటములు!
శంకరయ్య గారికి క్షమాపణలతో!!
అందరికీ వందనములు.
రిప్లయితొలగించండిఅందరి పూరణలూ
అబ్బుర పరచు చున్నవి.
మీరంతా పప్పులో కాలేస్తున్నారు.
సంకటాలు దీర్చే శంకరుణ్ణే చూస్తున్నారు
కాని..............
01)
__________________________________________
శంకరా భరణము - సందర్శనము వల్ల
శంక లెన్నొ దీరు - సర్వులకును !
శంభుప్రియ గూడ - సతమత మగు రీతి
శంకరుం డొసంగు - సంకటములు.
________________________________________
సంకటములు = కఠిన మైన సమస్యలు
________________________________________
సుర లసురులు,నరులు పరులుగా నెంచక
రిప్లయితొలగించండిశివము లీయు భవుఁడు శివుడు మృడుడు
అసుర భావ మొదవ నజ్ఞానులను మాట
శంకరుండొసంగు సంకటములు.
వంకలు పలు బెట్టు వారికి ,శంకలు
రిప్లయితొలగించండికలుగుట సహజము, సకలము వంక
రగను, టింకరగను నగుపించెడుమతికే
శంకరుండొసంగు సంకటములు.
శంక లేల మనకు సంకటములు దీర్ప
రిప్లయితొలగించండిచింత వారు మనకు చెంత నుండ!
చంద్రరేఖ లందు నింద్ర చాపము గూర్ప
శంకరుండొసంగు సంకటములు !
శంకరాభరణముఁ జూసి జంకువారైనా శంకరార్యుల వారి బ్లాగుఁ జూసి జింకపిల్లల మల్లే వత్తురిచటికి తెలిసి తెలిసీ.
రిప్లయితొలగించండిశంకరాభరణము - శంకరుని ఆభరణము - సర్పము.
నా మీద కృపయుంచి సహృదయులైన కవిగురువులలో ఏ ఒక్కరైనా ఈ భావంతో వ్రాయగలరు.
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
రిప్లయితొలగించండిమీ రెండు పూరణలూ బాగున్నాయి. అభినందనలు.
మొదటి పూరణ మూడవ పాదంలో గణదోషాన్ని నేను ఎత్తిచూపేలోగా మీరే సవరించారు. సంతోషం! గన్నవరపు వారు నేనొప్పని తప్పును చూపి వెటనే ఆ వ్యాఖ్యను తొలగించారు. మీరు "ఒదలి"ని ఇంకా "వదలి" పెట్టలేదు. "శంకలు విడి" అందాం.
గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
మీ రెండు పూరణలూ బాగున్నాయి. అభినందనలు.
మొదటి పూరణ దేవతలు వుష్ణువును వేడుకొన్న విధంగా పూరించడం బాగుంది. ఇక రెండవ పూరణలో సమస్య పాదాన్ని అజ్ఞానుల్ మాటగా చెప్పి సమర్థించారు. మంచి ఊహ.
మీ మూడవ పూరణ ఇప్పుడే చేరింది. చింతలు దీర్చే "చింతా" వారు మనకున్నారు. నిజమే. కాని మూడవ పాదమే అర్థం కాలేదు.
చింతా రామకృష్ణారావు గారూ,
శివరాత్రికి ఉపవాసం చేయకుంటే సంకటములా? బాగుంది. మీ పూరణ ఉత్తమం. అభినందనలు.
హరి గారూ,
చాలా బాగుంది మీ పూరణ. అభినందనలు.
(ఇక మనలో మాట ... ఊరికే హాస్యానికి ....)
అప్పటికీ నేను ఏరి కోరి దుష్కర ప్రాసలు లేకుండా, మరీ క్లిష్టత లేని సమస్యలనే ఇస్తున్నాను కదా! :-)
అంతెందుకు ... ? నిన్నటి వారాంతపు సమస్యా పూరణానికి గోలి హనుమచ్ఛాస్త్రి గారిచ్చింది "భీష్ముని జంపె భీము డతి భీకరలీల జగము మెచ్చగన్" అని. ఈ "ష్మ" ప్రాస మిత్రులకు కష్టమని నేను చేసిన మార్పును చూసారు కదా.
వసంత్ కిశోర్ గారూ,
మీ మొదటి పూరణ నాకు సంతోషాన్ని కలిగించింది.
కాని "శంభుప్రియ" అన్నచో గణదోషం. సవరించండి.
మంద పీతాంబర్ గారూ,
"శంకిత మతికి సంకటములా?" బాగుంది మీ పూరణ. అభినందనలు.
మందాకిని గారూ,
సంతోషం. మీ భావాన్ని కవి మిత్రు లెవరైనా ఛందోబద్ధం చేస్తారేమో చూద్దాం.
గోలి హనుమచ్ఛాస్త్రి.
రిప్లయితొలగించండిమందాకిని గారి కోరికపై నా శక్తిమేర ప్రయత్నము చేశాను.
సర్ప మదియె కాద శంకరాభరణము
శంకరుండొసంగు సంకటములు
శంకరార్య మమ్ము సవరించు చుండగా
ఆడుకొందు మచట భయము లేదు
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
రిప్లయితొలగించండిమంచి ప్రయత్నం. సంతోషం.
చివరి పాదంలో యతి తప్పింది.
"ఆడుకొందు మట భయంబు లేక" అంటే సరి!
శంకరార్యా! ధన్యవాదములు. ఒదలిని వదలి పెట్టాలనే అనుకున్నాను.ఎందుకో ఇంకా నన్ను వదలి పెట్ట లేదు.ఇకనైనా గట్టిగా వదిలించుకునే ప్రయత్నం చేస్తాను.
రిప్లయితొలగించండిగోలి హనుమచ్ఛాస్త్రి.
గురువు గారూ మీరు యిచ్చే సమస్యలు నెల వంకలు ( శంకరుని భూషణము ) ఆ వంకరలతో చక్కని ఇంద్ర ధనస్సు లు చేయమంటారు, మా లేఖిని కుంచెతో, అదే నా భావము. చంద్ర వంక అంటే దుష్ట సమాసమని చంద్ర రేఖ అన్నాను. మీకు ధన్యవాదములు.
రిప్లయితొలగించండిఅపర్ణ స్వగతం:
రిప్లయితొలగించండితన్వి దనను గోరి తపమును బూనంగ
శివుడు! మృడుడు,జడుడు,చేఁగొనకనె,
శూలి, స్థాణుమూర్తి, సుమగాత్రికిన్నేల (సుమగాత్రికిన్ ఏల)
శంకరుండొసంగు సంకటములు?
ఊకదంపుడు గారు, బాగుంది.
రిప్లయితొలగించండికానీ ఇది అపర్ణ స్వగతం లా కన్నా తల్లి మేనాదేవి (హిమవంతుని పత్ని) స్వగతంలా ఉంది అనిపిస్తుంది. ఏమంటారు?
అందరి పూరణలూ
రిప్లయితొలగించండిఅబ్బుర పరచు చున్నవి.
1అ)(1 కి సవరణ)
__________________________________________
శంకరా భరణము - సందర్శనము వల్ల
శంక లెన్నొ దీరు - సర్వులకును !
శంభు పత్ని గూడ - సతమత మగు రీతి
శంకరుం డొసంగు - సంకటములు.
________________________________________
సంకటములు = కఠిన మైన సమస్యలు
________________________________________
శాస్త్రిగారూ, బాగుంది. ధన్యవాదాలు.
రిప్లయితొలగించండిఊకదంపుడు గారూ,
రిప్లయితొలగించండిమంచి పూరణ. అభినందనలు.
మందాకిని గారి మాటకూడ నిజమే.
మోహంతో మోహినికీ, భక్తికి లొంగి యమునికీ, భక్తిని పరీక్షించుటకై శిరియాళునికీ శంకరుఁడొసంగె సంకటములని ఒకే పద్యంలో చెపితే బాగుంటుందని నా భావన.
రిప్లయితొలగించండిమందాకిని గారూ,
రిప్లయితొలగించండిమీ భావానికి నా పద్యరూపం .....
మోహపరవశుఁడయి మోహినీదేవికి,
భక్తుఁ డొకని మెచ్చి భానుజునకు,
అరయ భక్తిఁ దెలియ శిరియాళునకు వలె
శంకరుండొసంగు సంకటములు.
శంకరార్యా!మూడు కన్నుల వాని గురించి మూడు సంఘటనలను మూడు పాదాల్లో ముచ్చటగా చాలాబాగా చెప్పారు.
రిప్లయితొలగించండిగోలి హనుమచ్ఛాస్త్రి.
గురువు గారూ మీ పూరణ అమోఘం.
రిప్లయితొలగించండిబోయ పాము పురుగు ముక్తిని బొందవే!
అమిత భక్తి గొలువ నతని చేయి
శంకరుండొసంగు, సంకటములు
బాపు, తనను జేరు ప్రాపు జూపు.
గురువుగారూ 'చంద్రవంక' దుష్ట సమాస మవుతుందా?
కృతజ్ఞురాలను గురువుగారూ,
రిప్లయితొలగించండిచాలా బాగా వచ్చింది పద్యం.
మిస్సన్నగారూ, "నతని చేయి" ?
కొంచెం వివరించరూ!
మిస్సన్న గారూ,
రిప్లయితొలగించండిమీరేదో తొందరలో ఉండి ఈ పద్యాన్ని వ్రాసి సరిచూసుకోకుండా పోస్ట్ చేసి ఉంటారని నా భావన. మంచి భావం. కాకుంటే చిన్న దోషాలు.
"అతని చేయి" అన్వయం కుదరడం లేదు. మూడవ పాదం చివర రెండక్షరాలు లోపించడంతో గణదోషం. నా సవరణ .... (బ్రాకెట్లలో ఉన్నవి)
బోయ పాము పురుగు ముక్తిని బొందవే!
అమిత భక్తి గొలువ (నడిగి నంత)
శంకరుండొసంగు, సంకటములు (పెడఁ)
బాపు, తనను జే(ర) ప్రాపు జూపు.
మందాకిని గారూ అతని చేయి అంటే శంకరుడు తన చేతిని అందిస్తాడు అని నా భావం.
రిప్లయితొలగించండికొంచెం సందిఘ్దంగా ఉంది కదూ ఎవరి చేయి భక్తుడిదా లేక భగవంతు డిదా అని. మార్చడానికి ప్రయత్నిస్తానండీ.
గురువు గారూ మీరన్నది అక్షారాలా నిజం. ఇంత తప్పుల తడకగా ఎప్పుడూ వ్రాయ లేదేమో. మీ సవరణలకు కృతజ్ఞుణ్ణి. క్షమించండి.
రిప్లయితొలగించండిమందాకినీ గారూ అదీ సంగతి.
సవరించిన పూరణ కాదు గురువుగారు సంస్కరించిన పూరణ :
బోయ పాము పురుగు ముక్తిని బొందవే!
అమిత భక్తి గొలువ నడిగి నంత
శంకరుండొసంగు, సంకటములపెడఁ
బాపు, తనను జేర ప్రాపు జూపు.
గురువుగారూ,మందాకిని గారూ,
రిప్లయితొలగించండిధన్యవాదములు, ఇప్పుడూ నప్పుతుంది తన్వి బదులు తనయ అంటే - తల్లి స్వగతంగా ఇంకా చక్కగా నప్పుతుంది.
ముందు స్మరుడికి గోడువెళ్ళబోసుకుంటునట్టు వ్రాద్దమనుకున్నాను - తన్వి అనటం వల్ల, నాకేలా అనకుండా సుమగాత్రికిన్నేల అనటం వల్ల తల్లికి కూడ అన్వయం కుదురుతోంది.
అపర్ణ అప్పటికే చిక్కియున్నది అని చెప్పటానికి తన్వి యని. కోమలత్వాన్ని సూచించడానికి సుమగాత్రి అని అన్నాను, లేని కోపం తెచ్చిపెట్టుకొని ప్రదర్శించటనికి, వైరుధ్యం సూచించటానికి - శూలి, స్థాణు, జడుడు మొ!!వి.
పైగా తనుగా వలచిన ప్రేమిక - ఎప్పుడో ఒకప్పుడు ఈయనేమిటి ఇంకా దిగిరాడు అని అనుకోకుండ ఉంటుందంటారా.
ఎవరి తలపైనా పర్లేదు, మందాకినీ సలిల చందన చర్చితుడు అనుగ్రహిస్తే - అంతే చాలు.
భవదీయుడు
ఊకదంపుడు
మెడన నాగ వంక ,ఎడమన గిరిజాంక,
రిప్లయితొలగించండితలన చంద్ర వంక ,కేల ఢంక .
శంకరుండొసంగు సంకటములు దీర్చ
జింక రీతి రండు జంకు వీడి!
మందాకినిగారూ !
రిప్లయితొలగించండిరవి గారి "బ్లాగాడిస్తా" లో
పద్య రచన for dummies-oct 4,2010 చదవండి ముందు
http://blaagadistaa.blogspot.com/search/label/%E0%B0%AA%E0%B0%A6%E0%B1%8D%E0%B0%AF%E0%B0%82