శ్రీ చింతా రామ కృష్ణా రావు ,మిస్సన్నమరియు గోలి గారల పూరణలు ఉత్తమముగా ,వైవిధ్యభరితంగా ఉన్నాయి
"కోటి విద్య లెల్ల కూటికేననుమాట" వెన్నుదట్ట,ఉన్న కన్ను మూసి కారు నడుపు నేర్పు గని మెచ్చిరి,జన మెల్ల ! కన్ను వలన మేలు గలిగె !
(ఒకే ఒక కన్ను గలిగి ,పొట్ట కోసం ,ఉన్న కన్నుకు గంతలు కట్టు కొని కారు నడిపే విద్య నేర్చి జనుల రంజింప జేస్తూ జీవితం గడుపుచున్నాడనే భావంతో పూరించాను . భావాన్ని correct గా communicate చేయలేదనే నా అనుమానం )
నమస్కారం శంకరయ్య గారూ.. బాగున్నారా! కొన్ని సమస్యల వల్ల నేను మీ సమస్యా పూరణలలో ప్రతి రోజూ పాలు పంచుకోలేక పోతున్నందుకు బాధగానే ఉంది మరి. సమయం ఉన్నప్పుడు తప్పకుండా రాస్తాను. ఉంటాను. నమస్తే.
ఈ మధ్యన నా మెయిలులో ఒక హాస్య స్ఫోరకమైన ప్రసంగం వచ్చింది. నాకు తలచు కొంటూంటే తెగ నవ్వొచ్చేస్తూంది. తోటి మిత్రులు కూడా హాయిగా నవ్వు కొంటారని దాన్ని క్రింద పొందుపరుస్తున్నాను.
ఇద్దరు కవి మిత్రులు ఒక కవి సమ్మేళనం జరపడం గురించి ముచ్చ టించు కొంటున్నారు.
మొదటి ఆయన అన్నారు: >" ఇది కాక, ఛాయాచిత్రం చూసి వర్ణన కోరే అవకాశం కూడా ఆలోచిస్తున్నాను. దీనిని 'చిత్ర'కవిత్వం అంటారా? ":-)
రెండవ ఆయన ఇలా సమాధాన మిచ్చారు: నా మటుక్కి నాకు తోచిందేమిటంటే 'చాయ' గారి ఫోటోలు పంపి వర్ణించమంటే అది చాయా కవిత్వం ఔతుంది, అదే 'చిత్ర' గారి ఫోటోలు పంపితే .... చిత్ర కవిత్వం ఔతుంది. ఇక్కడ చాయా చిత్రం అన్నారు అది కాస్తా నీడలా నల్లగా (negetive film) ఉందనుకోండి "ఏమని వర్ణింతురా " అనుకుంటూ మనం ఏమైనా వర్ణించేయచ్చు, అది చదివితే 'విచిత్ర కవిత్వం ' అనీ అనిపించవచ్చు .. 'సో.. అది' సంగతి. నచ్చితే సంధి చేసుకోండి ..
మందాకిని గారూ మీ పద్య ప్రయత్నానికి అభినందనలు. మాళవీ మల్లేశ్వరులపై చెప్పిన పద్యము ఒప్పై యున్నది.
మీ పద్యానికి కంద పద్య లక్షణాలన్నీ సరి పోయాయి. రెండు,నాల్గవ పాదములలో మొదటి అక్షరానికి,నాల్గవ గణము మొదటి అక్షరానికి యతి కలుస్తే అది కందము అవుతొంది. మీకు పద్యము నడక తెలిసింది కాబట్టి యతులు సమకూర్చడము కష్టము కాదు.
కోడీహళ్ళి మురళీ మోహన్ గారూ, మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు. "కన్ను + అనుచు" అన్నప్పుడు యడాగమం రాదు కదా. "కన్నటంచు" అందాం. మనలో మాట .... మొన్న ఒక సినిమాలో "కళ్ళు చిదంబరం" నటించిన సన్నివేశాన్ని చూసినప్పుడు ఈ సమస్య తట్టింది. వెంటనే పద్యమూ రాసిపెట్టుకున్నాను. తీరా సమస్యకు వచ్చిన మొట్టమొదటి పూరణలోనే మీరు ఆ విషయాన్ని ప్రస్తావించారు. సంతోషం! నా పూరణ ఇది....
చేసె బ్యాంకులోనఁ జిన్న యుద్యోగమ్ము "కళ్ళు" చిత్ర మెంతొ ఘనతఁ దెచ్చె నతఁడె నటుఁడు మన చిదంబర మతనికి మెల్లకన్ను వలన మేలు గలిగె.
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ, "అదీ ఒకందుకు మంచిదే" కథను నేపథ్యంగా చేసుకొన్న మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు. "బలిని ఈయ" ను "బలినొసంగ" అందాం. ఇక మనలో మాట! మొన్న సమస్యను, దాని పూరణను రాసి పెట్టుకొని, నిన్న ఇలా సమస్యను ఇచ్చానో లేదో కోడిహళ్ళి వారు నేను అనుకున్న భావంతో పూరణ పంపారు. నా పూరణను పైన వ్యాఖ్యగా పెట్టాను. చూడండి. లాభం లేదనుకొని నిన్న మరో పూరణ సిద్ధం చేసుకున్నాను. ఇప్పుడు చూస్తే అదే భావంతో మీ పూరణ కనిపించింది. నా పూరణ .....
వేఁట కేఁగి రాజు బాటఁ దప్పిన నాట వికులు పట్టి తుదకు విడిచిపెట్టి రంగవికలుఁడు బలి కర్హుండు గాఁడని మెల్లకన్ను వలన మేలు గలిగె.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిమెల్ల కన్ను యనుచు మేలమాడిరటంచు
రిప్లయితొలగించండిచింతమానుమయ్య చిత్తమందు
ఖ్యాతినొందలేదె కళ్ళు చిదంబరం
మెల్ల కన్ను వలన మేలు గలిగె.
జ్ఞాన నేత్ర మిచ్చి కరుణించె పరమాత్మ.
రిప్లయితొలగించండిలోక మెల్ల నతడె ప్రాకటమయె.
కలిగి యున్నశివుని కను చుంటి నీజగ
మెల్ల. కన్ను వలన మేలు గలిగె.
రామ కృష్ణారావు గారి పూరణ నిరుపమానం.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండికన్ను లేక లేదు కలియుగం బని యండ్రు
రిప్లయితొలగించండిమేలు గ్రుడ్డి కన్న మెల్ల యండ్రు
'తెలివి కంట' జూడ తెల్లమౌ నీవైన
మెల్ల, కన్ను వలన మేలు గలిగే.
జగమెల్లా అందరిలో, అన్నింటిలో దేవుడిని చూడటానికే ఈ కళ్ళు అంటున్న శ్రీ చింతా రామకృష్ణారావు గారి పూరణ అత్యద్భుతం
రిప్లయితొలగించండి- మంత్రిప్రగడ వేంకట బాలసుబ్రహ్మణ్యం
గోలి హనుమచ్ఛాస్త్రి.
రిప్లయితొలగించండిబలిని ఈయ నెంచి మాంత్రికు డొక్కడు
మాటు వేసి పట్టి మంగ పతిని
వాడి కళ్ళు చూచి వలదని వదలెను
మెల్ల కన్ను వలన మేలు కలిగె.
శ్రీ చింతా రామ కృష్ణా రావు ,మిస్సన్నమరియు గోలి గారల పూరణలు ఉత్తమముగా ,వైవిధ్యభరితంగా ఉన్నాయి
రిప్లయితొలగించండి"కోటి విద్య లెల్ల కూటికేననుమాట"
వెన్నుదట్ట,ఉన్న కన్ను మూసి
కారు నడుపు నేర్పు గని మెచ్చిరి,జన
మెల్ల ! కన్ను వలన మేలు గలిగె !
(ఒకే ఒక కన్ను గలిగి ,పొట్ట కోసం ,ఉన్న కన్నుకు గంతలు కట్టు కొని కారు నడిపే విద్య నేర్చి జనుల రంజింప జేస్తూ జీవితం గడుపుచున్నాడనే భావంతో పూరించాను . భావాన్ని correct గా communicate చేయలేదనే నా అనుమానం )
శ్రీ కొడీహళ్ళ మురళీ మోహన్ గారి పూరణ చాలా బావుంది .
రిప్లయితొలగించండిగురువుగారి ఆశీస్సులతో, అందఱి దీవెనలతో
రిప్లయితొలగించండిమా కులదైవమైన మాళవీ మల్లేశ్వరులను ప్రార్థిస్తూ పద్యము రాసే ప్రయత్నం.
మీ సూచనలు నాకు శిరోధార్యము.
సర్పము దాల్చిన ఈశ్వర!
దర్పమునర్థాంగియై యమరు మాళవికా!
సర్పముఁ గట్టిన బాలుడ!
దర్పము నణచుకొన నాకు బుద్ధి గరపరే!
సమస్యకు సంబంధం లేకుండా స్పందిస్తున్నందుకు మన్నించాలి.
శంకరాభరణము యొక్క దయతో, శంకరాభరణము బ్లాగులో
మెల్లకన్నైనా గుడ్డికన్నుకన్నా మేలని ....(అర్థమే చేసుకోలేని వారిని చూచినపుడు, తప్పులు దిద్దుకోడానికైనా మాన్యుల సహకారం అభ్యర్థించటం మేలని ...) ధైర్యం చేశాను.
సూర్యుడొక్క కంట సోముడింకో కంట
రిప్లయితొలగించండివెలుగు లీయ ధరను వెలసినట్టి
తిరుమలేశ మిమ్ము దెలియ తొలగు భవ
మ్మెల్ల కన్ను వలన మేలు గలిగె.
పెండ్లి చూపులనుచు పెద్దన్న పోరగ
రిప్లయితొలగించండితప్ప దనుచు దాను తరలి వెళ్ళె!
కళ్ళు మెల్ల లాగ కనులను పెట్టగ
మెల్ల కన్ను వలన మేలు గలిగె
నమస్కారం శంకరయ్య గారూ.. బాగున్నారా! కొన్ని సమస్యల వల్ల నేను మీ సమస్యా పూరణలలో ప్రతి రోజూ పాలు పంచుకోలేక పోతున్నందుకు బాధగానే ఉంది మరి. సమయం ఉన్నప్పుడు తప్పకుండా రాస్తాను. ఉంటాను. నమస్తే.
రిప్లయితొలగించండిరెండు కళ్ళనంచు తొండి జేయనొకడు
రిప్లయితొలగించండిరెంటిలోన మిగిలె నొంటి, మెల్ల!
దారి తెన్ను లేని దయనీయ స్థితిలోన
మెల్ల కన్ను వలన మేలు గలిగె.
తల్లి కలతనొంది ధరకుదిగుగ తండ్రి
రిప్లయితొలగించండితిరిగి తిరిగి జేరె తిరుమలకును
దర్శనమ్ము నొంది తరియింపనీలోక
మెల్ల, కన్ను వలన మేలు గలిగె.
అందరికీ వందనములు !
రిప్లయితొలగించండిఅందరి పూరణలూ
అలరించు చున్నవి !
01)
____________________________________
కన్ను లేక నేమి - కాన లేరు జనులు
కన్ను గలిగె నేని - కార్య సిద్ధి !
కన్ను గలుగ , జూడ - గలము గదా జగ
మెల్ల !కన్ను వలన - మేలు గలిగె.
____________________________________
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిరంగు రంగు లీను రత్నగర్భ మనది
రిప్లయితొలగించండివింత సోయ గమ్ము వెదకి చూడ
చూడ భాగ్య మనగ జగతి సుందర
మెల్ల కన్ను వలన మేలు కలిగె !
ఈ మధ్యన నా మెయిలులో ఒక హాస్య స్ఫోరకమైన ప్రసంగం వచ్చింది.
రిప్లయితొలగించండినాకు తలచు కొంటూంటే తెగ నవ్వొచ్చేస్తూంది.
తోటి మిత్రులు కూడా హాయిగా నవ్వు కొంటారని దాన్ని క్రింద పొందుపరుస్తున్నాను.
ఇద్దరు కవి మిత్రులు ఒక కవి సమ్మేళనం జరపడం గురించి ముచ్చ టించు కొంటున్నారు.
మొదటి ఆయన అన్నారు:
>" ఇది కాక, ఛాయాచిత్రం చూసి వర్ణన కోరే అవకాశం కూడా ఆలోచిస్తున్నాను.
దీనిని 'చిత్ర'కవిత్వం అంటారా? ":-)
రెండవ ఆయన ఇలా సమాధాన మిచ్చారు:
నా మటుక్కి నాకు తోచిందేమిటంటే 'చాయ' గారి ఫోటోలు పంపి వర్ణించమంటే అది చాయా కవిత్వం ఔతుంది, అదే 'చిత్ర' గారి ఫోటోలు పంపితే .... చిత్ర కవిత్వం ఔతుంది. ఇక్కడ చాయా చిత్రం అన్నారు అది కాస్తా నీడలా నల్లగా (negetive film) ఉందనుకోండి "ఏమని వర్ణింతురా " అనుకుంటూ మనం ఏమైనా వర్ణించేయచ్చు, అది చదివితే 'విచిత్ర కవిత్వం ' అనీ అనిపించవచ్చు .. 'సో.. అది' సంగతి. నచ్చితే సంధి చేసుకోండి ..
మిత్రుల పూరణలు చాలా బాగున్నాయి. శ్రీ చింతా రామకృష్ణరావు గారి పూరణ తలమానికముగా శోభిల్లుతున్నది.
రిప్లయితొలగించండిమెల్ల కన్ను వాఁడు మేలిమి హృదయుండు
అక్షి దాన మొసగె నంత మందు
గోళ దాన ఫలము గోదాన ఫలమన
మెల్ల కన్ను వలన మేలు గలిగె !
మందాకిని గారూ మీ పద్య ప్రయత్నానికి అభినందనలు. మాళవీ మల్లేశ్వరులపై చెప్పిన పద్యము ఒప్పై యున్నది.
రిప్లయితొలగించండిమీ పద్యానికి కంద పద్య లక్షణాలన్నీ సరి పోయాయి. రెండు,నాల్గవ పాదములలో మొదటి అక్షరానికి,నాల్గవ గణము మొదటి అక్షరానికి యతి కలుస్తే అది కందము అవుతొంది. మీకు పద్యము నడక తెలిసింది కాబట్టి యతులు సమకూర్చడము కష్టము కాదు.
అందగత్తెను మనువాడగ, మగనిని
రిప్లయితొలగించండిలేమ మెచ్చ లేక లేచి పోయె
కడకు దొరికె మెల్ల కన్ను భార్య, కనఁగ
మెల్ల కన్ను వలన మేలు గలిగె!!
మూర్తి గారు,
రిప్లయితొలగించండిమీకు మరీ మరీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.
యమరు స్థానంలో "నువిద!"
నాకు స్థానంలో "సుంత "
రాస్తే సరిపోతుందనుకుంటున్నాను.ఏమంటారు?
కోడీహళ్ళి మురళీ మోహన్ గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
"కన్ను + అనుచు" అన్నప్పుడు యడాగమం రాదు కదా. "కన్నటంచు" అందాం.
మనలో మాట ....
మొన్న ఒక సినిమాలో "కళ్ళు చిదంబరం" నటించిన సన్నివేశాన్ని చూసినప్పుడు ఈ సమస్య తట్టింది. వెంటనే పద్యమూ రాసిపెట్టుకున్నాను. తీరా సమస్యకు వచ్చిన మొట్టమొదటి పూరణలోనే మీరు ఆ విషయాన్ని ప్రస్తావించారు. సంతోషం! నా పూరణ ఇది....
చేసె బ్యాంకులోనఁ జిన్న యుద్యోగమ్ము
"కళ్ళు" చిత్ర మెంతొ ఘనతఁ దెచ్చె
నతఁడె నటుఁడు మన చిదంబర మతనికి
మెల్లకన్ను వలన మేలు గలిగె.
చింతా రామకృష్ణారావు గారూ,
రిప్లయితొలగించండిమెల్లకన్నును జ్ఞాననేత్రంగా మార్చిన మీ పూరణ అద్భుతంగా ఉంది. ధన్యవాదాలు.
మిస్సన్న గారూ,
జ్ఞాననేత్రాన్ని తెలుగీకరించిన మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
రిప్లయితొలగించండి"అదీ ఒకందుకు మంచిదే" కథను నేపథ్యంగా చేసుకొన్న మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
"బలిని ఈయ" ను "బలినొసంగ" అందాం.
ఇక మనలో మాట!
మొన్న సమస్యను, దాని పూరణను రాసి పెట్టుకొని, నిన్న ఇలా సమస్యను ఇచ్చానో లేదో కోడిహళ్ళి వారు నేను అనుకున్న భావంతో పూరణ పంపారు. నా పూరణను పైన వ్యాఖ్యగా పెట్టాను. చూడండి.
లాభం లేదనుకొని నిన్న మరో పూరణ సిద్ధం చేసుకున్నాను. ఇప్పుడు చూస్తే అదే భావంతో మీ పూరణ కనిపించింది.
నా పూరణ .....
వేఁట కేఁగి రాజు బాటఁ దప్పిన నాట
వికులు పట్టి తుదకు విడిచిపెట్టి
రంగవికలుఁడు బలి కర్హుండు గాఁడని
మెల్లకన్ను వలన మేలు గలిగె.
మంద పీతాంబర్ గారూ,
రిప్లయితొలగించండిఅభినందనలు. మీ పూరణలో భావసందిగ్ధత నాకైతే కనిపించలేదు. బాగుంది.
మందాకిని గారూ,
మంచి పద్యం. గన్నవరపు వారు చెప్పినట్లు యతి తప్పింది. బ్రాకెట్లలో నా సవరణలతో మీ పద్యం ......
సర్పము దాల్చిన ఈశ్వర!
దర్పమునర్థాంగియై (మెదలు) మాళవికా!
సర్పముఁ గట్టిన బాలుడ!
దర్పము నణచుకొన (బెద్ధి దయ నా కిడరే)!
మీ పద్య రచన కొనసాగించండి. విజయోస్తు!
గురువుగారు,
రిప్లయితొలగించండిధన్యురాలిని.
సనత్ శ్రీపతి గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగుంది. అభినందనలు.
"సోముడింకో కంట" ను "సోముడింకొక కంట" అంటే బాగుంటుంది కదా.
టేకుమళ్ళ వెంకటప్పయ్య గారూ,
సంతోషం! బాగున్నాను. బహుకాల దర్శనం.
చమత్కారభరితమైన మీ పూరణ బాగుంది. అభినందనలు.
"కళ్ళు మెల్ల లాగ కనులను పెట్టగ" అన్నప్పుడు "కళ్ళు, కనులు" అని పునరుక్తి తోస్తున్నది. దానిని " కళ్ళు మెల్ల లాగ గనుపట్ట పెట్టగ" అంటే ఎలా ఉంటుంది?
నచికేత్ గారూ,
మీరూ చాలా కాలంగా ఈ బ్లాగును శీతకంట చూస్తున్నారు.
మీ పద్యం బాగుంది. అభినందనలు.
ఊకదంపుడు గారూ,
రిప్లయితొలగించండిఅద్భుతమైన పూరణ. ధన్యవాదాలు.
"దిగగ" అనేది "దిగుగ" అని టైపాటు దొర్లింది.
వసంత్ కిశోర్ గారూ,
చాలా బాగుంది మీ పూరణ. అభినందనలు.
రాజేశ్వరి నేదునూరి గారూ,
మీ పూరణ నిర్దోషంగా చక్కగా ఉంది. అభినందనలు.
గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
చాలా బాగుంది మీ పూరణ. అభినందనలు.
జిగురు సత్యనారాయణ గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.
మందాకిని గారూ.
రిప్లయితొలగించండినా సవరణకే సవరణ. అది "బెద్ధి" కాదు. "బుద్ధి" అని గమనించండి.
గురువు గారూ, నాతెలుగు వొకాబులరీ కాస్త తక్కువ కనుక అన్ని పూరణలూ సాధ్యం కావడం లేదు, చేయగలిగిన వాటికి పూరణలు ఇస్తున్నాను.
రిప్లయితొలగించండిమెల్లకన్ను మీద మెండైన పద్యంబు
రిప్లయితొలగించండిలెన్నొ నుడివినారు మిన్నగాను
వింత గొలుపు కొత్త విషయాలు తెలిసేను
మెల్ల కన్ను వలన మేలు గలిగె