ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ........
మందు జనుల కెల్ల విందు గాదె!
ఈ సమస్యను సూచించిన టేకుమళ్ళ వెంకటప్పయ్య గారికి ధన్యవాదాలు.
కవి మిత్రులకు మనవి ....
"భల్లూకము చదువుకొనఁగ బడిలోఁ జేరెన్" నిజానికి ఇది ఈరోజు నేనిచ్చిన సమస్య. ఆ తర్వాత నిన్నటి వ్యాఖ్యలు చూస్తుంటే వెంకటప్పయ్య గారు ఇచ్చిన సమస్య కనిపించింది. అది బాగుందనిపించి వారిచ్చిన తేటగీతి పాదాన్ని ఆటవెలదిగా మార్చి ఇస్తూ పోస్ట్‌ను సవరించాను. తీరా చూస్తే అప్పటికే "భల్లూకము" హారం తదితర అగ్రిగేటర్‌లలో దర్శన మిచ్చింది. మీరు తికమక పడకుండా ఈ వివరణ. ఎలాగూ రేపటి సమస్య "భల్లూకమే" క్వొశ్చెన్ పేపర్ లీకయింది. ముందే పూరణలు వ్రాసి సిద్ధంగా ఉంచుకోండి.
కవి మిత్రులకు మనవి ....
"భల్లూకము చదువుకొనఁగ బడిలోఁ జేరెన్" నిజానికి ఇది ఈరోజు నేనిచ్చిన సమస్య. ఆ తర్వాత నిన్నటి వ్యాఖ్యలు చూస్తుంటే వెంకటప్పయ్య గారు ఇచ్చిన సమస్య కనిపించింది. అది బాగుందనిపించి వారిచ్చిన తేటగీతి పాదాన్ని ఆటవెలదిగా మార్చి ఇస్తూ పోస్ట్‌ను సవరించాను. తీరా చూస్తే అప్పటికే "భల్లూకము" హారం తదితర అగ్రిగేటర్‌లలో దర్శన మిచ్చింది. మీరు తికమక పడకుండా ఈ వివరణ. ఎలాగూ రేపటి సమస్య "భల్లూకమే" క్వొశ్చెన్ పేపర్ లీకయింది. ముందే పూరణలు వ్రాసి సిద్ధంగా ఉంచుకోండి.
అందరికీ వందనములు.
రిప్లయితొలగించండి01)
___________________________________
చెలిమి తోడ మెలగు - చిన్నారు లిద్దరి
పెళ్ళి జరుగు చుండె - పెళ్ళు మనుచు
కళ్ళు చెదరు నట్టి - కల్యాణ మంటప
మందు ! జనుల కెల్ల - విందు గాదె !
___________________________________
వసంత్ కిశోర్ గారూ,
రిప్లయితొలగించండిమనోహరమైన పూరణ మీది. అభినందనలు.
బంధ మున్న వారు బంధుజనము గాన
రిప్లయితొలగించండిమందు త్రాగు వారు మందు జనులు,
సబ్సిడీల నిచ్చి సారాయి పోసిన
'మందుజనుల ' కెల్ల విందు గాదె!
02)
రిప్లయితొలగించండి_________________________________
ఊరి చివర గుడిని - ఉత్సవ మొనరించి
ఊరి నెల్ల బిలువ - నుత్సు కముగ
అంద రచట జేర - యన్న సంతర్పణ
మందు ,జనుల కెల్ల - విందు గాదె !
__________________________________
పిల్లలకును పెద్ద లెల్లవారలకును
రిప్లయితొలగించండిఇండ్ల,పనుల చోట్ల నెల్లడెల్ల
ఆడె, డమ్ము వార్కి, నరయ క్రికెట్ దేశ
మందు జనుల కెల్ల విందు గాదె!
[ఆడె, డమ్ము వార్కి= ఆడెడి, అమ్మెడి వారికి]
వీరు,సచిను,హరి,జహీరుడు,యువరాజు,
రిప్లయితొలగించండిగౌతముండు ,ధోని ఘనత మీర
కాంతు లీను విశ్వ కప్పు గెలువ,దేశ
మందు జనుల కెల్ల విందు గాదె?
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిపండు వెన్నె లందు నిండు చందమామ
రిప్లయితొలగించండికనుల విందు జేయు కవిత లల్ల
మదిని హాయి గొలుపు మామ గగన
మందు జనుల కెల్ల విందు గాదె ?
కవిమిత్రులందరూ 'మందు ' ను రకరకాలుగా మార్చి పూరించారు.
రిప్లయితొలగించండికిశొర్ గారి 'మందు ' విందులు చేసింది.
వూకదంపుడు గారి 'మందు ' క్రికెట్టాడించింది.
పీతాంబర్ గారి 'మందు ' కప్పు గెలిపించినట్లుంది.
మిస్సన్నగారి 'మందు ' రైతన్నను చూపించింది.
రాజేశ్వరి గారి 'మందు ' వెన్నెల పంచింది.
అందరికీ అభినందనలు.
వెతల బారి నుండి వెలుగు దారుల వైపు
రిప్లయితొలగించండిపయన మగుట కొఱకు పడును వెతలు
దారి కనగ లేక దరి దోచ కున్నచో మత్తు
మందు జనుల కెల్ల విందు గాదె ?
రాజేశ్వరి గారూ! నాలుగవ పాదంలో 'మత్తు ' ఎక్కువైందండీ!
రిప్లయితొలగించండిదున్న భూమి నిచ్చి దుక్కి టెడ్లను యిచ్చి
రిప్లయితొలగించండిపైరు వేయ కొంత పైక మిచ్చి
బడుగు బాగు కొఱకు పాటు వడియెడు కా-
మందు జనుల కెల్ల విందు గాదె!
రాజేశ్వరి గారూ! క్షమించాలి. 'మత్తు ' ఎక్కువ అయినది మూడవ పాదానికి.
రిప్లయితొలగించండిమిత్రుల పూరణలు మనోహరముగా ఉన్నాయి.
రిప్లయితొలగించండిచెలువ మూరు గాధఁ జెప్పఁగ మురువైన
శైలి యందుఁ గవిత సౌరభమ్ము
రసము లెన్నొ గూడి రంజింప మదిఁ గావ్య
మందు జనుల కెల్ల విందు గాదె !!
సరదాకు చేస్తున్న పూరణ, కవి మిత్రులు అన్యథా భావించ వలదని మనవి:
రిప్లయితొలగించండిప్రేమగా పిలుచును బీరు బాటిలు సదా
....................... రమ్యమైనది కదా రమ్ముఁజూడ!
వెతలు మరవ వచ్చు విస్కీ యొకటి యున్న
........................ కీలకమగును టకీల ప్రజకు!
వైను త్రాగంగ డివైను చెంతకు చేర్చు
......................... బ్రాందీయె లోకపు భ్రాంతి మాపు!
సారాయె మందుల సారాశమయ్యెను
.......................... కల్లు ఘనతఁ జూడు కళ్లు తెఱచి!
త్రాగు బోతులనుచు త్రాగని వారలు
పలుకు గాని నిజము తెలియ లేరు
త్రాగినంత తెలియు దాని గొప్పతనము
మందు జనుల కెల్ల విందు గాదె!
అవును కదా ? ఈ మత్తేమి టో గానీ గమ్మత్తు గా ఉంది. .లాభం లేదు .గురువు గారూ ! మీరు రావలసిందే మరి [ సరదాకి మాత్రమె .]
రిప్లయితొలగించండిహనుమచ్ఛాస్త్రి గారూ,
రిప్లయితొలగించండిపసందైన పూరణ మీది. అభినందనలు.
వసంత్ కిశోర్ గారూ,
అన్నసంతర్పణ మందు విందు చేసారు. బాగుంది. అభినందనలు.
"ఉత్సుకము" అనే పదం లేదు (నాకు తెలిసినంత వరకు). అక్కడ "ఉత్సుకతను" అందాం.
ఊకదంపుడు గారూ,
మంచి విషయాన్ని ఎత్తుకున్నారు పూరణకు. అభినందనలు.
తప్పులు కాదు కాని కొద్ది సవరణలు అవసర మనిపించింది. ఎల్లడెల్ల ... ? ఆడెడి + అమ్మువారు = ఆడెడి యమ్మువారు. (బ్రాకెట్లో) నా సవరణలతో మీ పద్యం .....
పిల్లలకును పెద్ద లెల్లవారల (కైన
నిండ్ల బయట నెల్ల యెడల నాడు
వారి కమ్మువారి క)రయ క్రికెట్ దేశ
మందు జనుల కెల్ల విందు గాదె!
పీతాంబర్ గారూ,
ఇంతకు క్రితమే భారత్ గెలిచినందుకు వీధుల్లో టపాసులు కాల్చి "కనువిందు" చేసారు అభిమానులు. మీ పూరణ బాగుంది. అభినందనలు.
రాజేశ్వరి గారూ,
మీ రెండు పూరణలూ బాగున్నాయి. అభినందనలు.
మొదటి పూరణ మొదటి పాదంలో గణం తప్పింది. "నిండైన చంద్రుడు" అందాం.
రెండవ పూరణలో మిత్రులు చెప్పినట్లు "మత్తు" ఎక్కువయింది. "దారి కనగ లేక దరి దోచకన్ మత్తు" అందాం.
మిస్సన్న గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.
"దుక్కిటెడ్లను + ఇచ్చి" అన్నప్పుడు యడాగమం రాదు. "దుక్కిటెడ్ల నొసంగి" అందాం.
నరసింహ మూర్తి గారూ,
"మురువైన" పూరణ నిచ్చారు. సంతోషం! అభినందనలు.
సత్యనారాయణ గారూ,
రకరకాలైన మందులతో విందే చేసారు. ధన్యవాదాలు.
అన్నీ విన్నవే ఒక్క టకీల తప్ప. అన్నట్టు జిన్ను, వోడ్కా ఏం పాపం చేసాయి? అసలయింది మరొకటుంది ... అదే ... గుడంబా!
అందరి పూరణలూ చక్కగా యున్నవి !
రిప్లయితొలగించండిశంకరార్యా !
ధన్యవాదములు !
జాలము నందు గల " ఆంధ్ర భారతి " నిఘంటువు నందు
ఈ విధముగా నున్నది !
_________________________________________
ఉత్సుకము
బ్రౌణ్య తెలుగు-ఇంగ్లీష్ నిఘంటువు
ut-sukamu. [Skt.] adj. Strenuous, zealously active, earnest, zealous ఉత్సాహము గల.
__________________________________________
హమ్మ గురువుగారూ, మీకు ఇన్ని పేర్లు తెలుసనుకోలేదు! మీకోసం, సరదాగా, తెలుగు మాష్టారిని ఆట పట్టించే కోతి శిష్యుడిగా:
రిప్లయితొలగించండిశంకరయ్య గారు చకచకా జెప్పెరా
జిన్ను వోడ్క తళుకు జిలుగు లెల్ల
టక్కు లాడియైన టకిల గావలెనట
మందు జనుల కెల్ల విందు గాదె!
(బెమ్మ కైన పుట్టు రిమ్మ తెగులు)
చంద్రశేఖరుల వారు ఊకదంపుడు గారి మిశ్రమముని నాదిగా భావించి మా డాలసు నగరములో ప్రచారము చేస్తున్నారు. ఈ దేశములో చట్టవిరుధ్ధముగా మూన్ షైన్ ( చంద్రభాసురము )అనే మద్యము చేస్తారు. మరి గురువుగారు చెప్పే గుడంబా వంటిదేమో !
రిప్లయితొలగించండిసరే, చంద్రశేఖరులు ! పంచడానికి నేను సిద్ధమే ! అక్కయ్యగారూ ఎన్నాళ్ళు మడిగట్టుకొని కూర్చుంటాము ? రండి విందుకి!
శంకరయ్య గారు సభఁ దీర్చి యుండంగ
చంద్రశేఖరుండు చంద్ర భాసు
రమ్ముఁ దెచ్చె, మూర్తి రంజుగా కలిపీయు
మందు జనుల కెల్ల విందు గాదె !
విశ్వ మోహనుండు వీరుండు , రాముండు
రిప్లయితొలగించండిధరణి జాత సీత కరము బట్టు
వేడుక గను,నవమినాడుభద్రాచల
మందు, జనుల కెల్ల విందు గాదె!
అమ్మ భయం లేదు .అక్క భయం అసలే లేదు ! ఎంత అమెరికాలో ఉంటే మాత్రం ? ఎం......త ...ధైర్యం ? ? ? ?
రిప్లయితొలగించండిగురువు గారూ సవరణకి ధన్యవాదాలు.
రిప్లయితొలగించండిసత్యనారాయణ గారు ఇచ్చిన అష్ట విధ 'మందు ' లను గ్రహించి,చంద్రశెఖర్ గారి,మూర్తి గారి గ 'మ్మత్తైన ' మాటలు ఆస్వాదిస్తూ క్రిందికి వచ్చేసరికి పీతాంబర్ గారు ఒక్కసారిగా భద్రాచలం రాముని వద్దకు తీసుకెళ్ళారు.. వెంటనే ఆ మత్తు వదిలేసి భక్తి మత్తు లోకి వెళ్ళా..మొత్తానికి అందరూ మత్తులో ముంచినవారే! అందరికీ అభినందనలు.
రిప్లయితొలగించండివసంత్ కిశోర్ గారూ,
రిప్లయితొలగించండినాది పొరపాటే. మన్నించాలి. అందుకే "నాకు తెలిసినంత వరకు" అన్నాను. "ప్రకుర్వతే కస్య మనో న సోత్సుకమ్" అని ఋతుసంహారంలోని ప్రయోగం.
చంద్రశేఖర్ గారూ,
నన్ను లక్ష్యంగా చేసికొని చెప్పినా పద్యం బాగుంది. అభినందనలు.
నరసింహ మూర్తి గారూ,
మన బ్లాగులో గత కొంతకాలంగా చర్చనీయాంశమౌతున్న "చంద్రభాసురం" సంగతే మరిచి పోయాను. గుర్తు చేసినందుకు ధన్యవాదాలు. పద్యం బాగుంది. అభినందనలు.
పీతాంబర్ గారూ,
భక్తి సుధతో మత్తెక్కించన మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
రాజేశ్వరక్కా,
ఎంతైనా ఈ తరం కుర్రాళ్ళు! గురువులన్నా, అక్కలన్నా భయభక్తులు లేకుండా పోతున్నది. ప్చ్ ... ఏంచేద్దాం? .... "చంద్రభాసుర పాన యోగ్యతా ప్రాప్తిరస్తు!" అని ఆశీర్వదిద్దాం. :-)
హనుమచ్ఛాస్త్రి గారూ,
ధన్యవాదాలు.
జి ఎస్ జీ !
రిప్లయితొలగించండిఇంతకీ " టకీల " అంటే ఏమిటో ?
మాస్టారూ! ఉన్నదున్నట్టు చెప్పండి-నాపద్యం చదివాక నవ్వుకొన్నారా లేక తిట్టుకొన్నారా? మాకు చిన్నప్పటి నుంచి మ౦చి తెలుగు మాస్టార్లు దొరకటం వల్ల వాళ్ళతో చనువుగా వుండే వాళ్ళం.మీతో కూడా అంతే (నవ్వుతూ). "గొడవ చేసే కుర్రాళ్ళు లేకపోతే క్లాసు చప్పగావుంటుందర్రా, పీకలదాకా మేసి గుర్రు పెట్టి నిద్రపోయే మొగుడిలాగా" అనేవారు మా మాష్టారు శ్రీకంఠశాస్త్రి గారు. అక్షరభిక్ష పెట్టిన మహానుభావులు.
రిప్లయితొలగించండివసంత కిశోర్ గారూ, టెకీల (Tequila)అనేది ఒక అగావే అనే ఒక చెట్టు నుండి తీసే స్పానిష్ కల్లు. ఇకపోతే టెకీల అనేది మెక్సికో దేశంలో ఒక వూరు పేరు. ఆ వూళ్ళో ఈ అగావే చెట్లు యెక్కువగా పెరుగుతాయి. అందుకని ఆ కల్లు (distilled spirit)కి టెకీల అని పేరు పెట్టారు. టెకీలా తాగుతూ మెక్సికన్లు పాటలు పాడుతూ డాన్సు చేస్తారు. టెకీలా పాటల ట్యూన్ బాగుంటుంది. అదీ కథ.
రిప్లయితొలగించండిచంద్ర శేఖర్ గారూ !
రిప్లయితొలగించండిచా లా చాలా ధన్య వాదములు !
కొత్త విషయం చెప్పారు !
మూర్తిగారూ , మీరూ ,జి ఎస్ జీ
అక్కడే ఉంటారా లేక
అప్పుడప్పుడు
వెళ్తుంటారా ?
నాకు ఈ శషభిషలు పనికి రావండీ.
రిప్లయితొలగించండిచూడబోతే అందరూ తాగుబోతులే నాయె.
(సరదాకి - మన్నించాలి)
మిస్సన్న మహాశయా !
రిప్లయితొలగించండిఎందుకంత ఉక్రోషం ?
మూర్తిగారు అందరికీ విందిస్తున్నారు !
అదీ గురువుగారి సమక్షంలో !
అందరిలో మీరూ ఉన్నారుగా !
ఎలా తప్పించుకుంటారు ?
చంద్రశేఖర్ గారూ,
రిప్లయితొలగించండిమనస్ఫూర్తిగా నవ్వుకున్నాను.
అక్షరభిక్ష పెట్టిన గురుదేవులను స్మరించడం మీ సంస్కారాన్ని తెలియ జేస్తున్నది. సంతోషం.
మిస్సన్న గారూ,
రిప్లయితొలగించండిమీరు అగ్నిహోత్రావధాను లెప్పు డయ్యారు?
మీ కధ మాకు చెప్పకండి మిస్సన్న మహాశయా! మీరు ఆస్థాయి మహాత్ములు-వరూధిని, తూగుటుయ్యాల, విడెము, అందులోనూ కర్పూర ము రెండుపాళ్ళు వేసిన విడెము, ద్రాక్ష రసము, సుగంధ ద్రవ్యాలు, సువాసనలు, పిల్లతెమ్మెరలూ... మరి మేమో, ఏదో చల్లగా వుండే ద్రవ పదార్ధాలతో సరిపెట్టుకొనే సాధారణ సాధుజనులము.
రిప్లయితొలగించండిసారా సేవించే సాధుజనులు!
రిప్లయితొలగించండిగురువు గారూ సవరణకి ధన్యవాదాలు.
రిప్లయితొలగించండి