19, మార్చి 2011, శనివారం

సమస్యా పూరణం - 260 (తిరుమలేశునిఁ దిట్టిన)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ........
తిరుమలేశునిఁ దిట్టిన సిరులు గలుగు.

21 కామెంట్‌లు:

 1. గోలి హనుమచ్ఛాస్త్రి.

  చూడ తిట్టగు "రా" యన్న,చోద్య మదియె!
  భక్తి ఉప్పొంగ ఆర్తినీ మనసు నిలిపి
  ఆదు కొనుము 'రా'!ఈయ 'రా'!అభయ మనుచు
  తిరుమలేశుని దిట్టిన సిరులు గలుగు.

  రిప్లయితొలగించండి
 2. హనుమచ్ఛాస్త్రి గారూ,
  చక్కగా సమర్థిస్తూ సమస్యను పూరించారు. చాలా బాగుంది. అభినందనలు.
  రెండవ పాదంలో యతి తప్పింది. "భ, మ"లకు యతిమైత్రి లేదు. "భు, ము"లకు ఉంది.
  "భక్తి ఉప్పొంగ ఆర్తిని భావమున నిడి" అంటే సరి.

  రిప్లయితొలగించండి
 3. శంకరార్యా! ధన్యవాదములు.
  'భక్తి ఉప్పొంగ ఆర్తితో భజన సలిపి '
  అంటే యెలా వుంటుంది.


  గోలి హనుమచ్ఛాస్త్రి.

  రిప్లయితొలగించండి
 4. హనుమచ్ఛాస్త్రి గారూ,
  ఈ మార్పు బ్రహ్మాండంగా ఉంది.

  రిప్లయితొలగించండి
 5. కవి మిత్రులకు విజ్ఞప్తి!సమస్యలకు (పూరణ)మార్గాలు రెండో మూడో ఉండవచ్చు.ముందుగా ఒకరు నడచి వెళ్ళారని సిద్ధంగా వున్న మన ప్రయాణాన్ని ఆపుకొనుట యెందుకు?మార్గం ఒకటే అయినా యెవరి(పద్య) పాదాలు,నడక వారివి,అనుకరణ అనుకోనక్కరలేదని నా అభిప్రాయం.వినూత్న పదాలతో యెక్కువమంది పాల్గొని'శంకరాభరణానికి ' నిండుదనాన్ని చేకూర్చాలని నా మనవి.

  బ్లాగు వీక్షకులు కూడా తమ అభిప్రాయాలు పంచుకోవాలని కోరుతున్నాను.మాస్టారు గారి శంకరా భరణానికి మరింత వన్నె తేవాలని కోరుతున్నాను.


  గోలి హనుమచ్ఛాస్త్రి.

  రిప్లయితొలగించండి
 6. ముడుపు గట్టితి,మ్రొక్కితి ,కడుయిడుముల
  కోర్చి కొండ నెక్కితి ,కోర్కె గోరితి,పలు
  రీతుల గొలిచితి,నికనే రీతి నిపుడు
  తిరుమలేశుని దిట్టిన సిరులు గలుగు?

  రిప్లయితొలగించండి
 7. పీతాంబర్ గారూ,
  మీ పూరణ అద్భుతంగా ఉంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 8. ఫండు వచ్చు ఫారిను నుండి, మెండుగ మత
  మార్పిడులు సేయ, హైందవ మతము పైన
  బురద చల్లిన చాలును ముందు, కాన
  తిరుమలేశునిఁ దిట్టిన సిరులు గలుగు!!

  రిప్లయితొలగించండి
 9. సిరిని గలిగిన దైవము సిక్కవచ్చు
  సిరియు మరిలేక పరపతి సిద్ధ ముగను
  వరుస నిలిచిన కోపమే వచ్చు; ఎట్లు
  తిరుమలేశునిఁ దిట్టిన సిరులు గలుగు!

  రిప్లయితొలగించండి
 10. ప్రశ్నాత్మకంగా పూరించిన పీతాంబర్ గారి పూరణ,మత మార్పిడుల పరంగా చేసిన సత్యనారాయణ గారి పూరణ,దర్శనంకోసం క్యూ లోనిలిచిన భక్తుని అసహనం ద్వారా చేసిన మందాకిని గారి పూరణ అలరించాయి. అభినందనలు.

  గోలి హనుమచ్ఛాస్త్రి.

  రిప్లయితొలగించండి
 11. సత్యనారాయణ గారూ,
  వాస్తవాన్ని కళ్ళకు కట్టినట్టు తెలిపారు మీ పూరణలో. తమ మతం, దేవుడి గొప్పతనాన్ని చెప్పుకుంటే తప్పు లేదు. కాని అన్య మత విశ్వాసాలను, దేవుళ్ళను తిట్టడానికే కొందరు ప్రాధాన్యతను ఇస్తారు. అంతెందుకు? మన మతంలోనే హేతువాదులు, నాస్తికులు అనే పేళ్ళతో మన దేవుళ్ళను తిట్టేవాళ్ళు ఎందరో ఉన్నారు. శతాబ్దాలుగా అన్నిటినీ సహిస్తూ వస్తున్నాం. నిన్నటి దాకా ఎంతో విశ్వాసంతో కొలిచిన దేవుళ్ళు మతం మార్చుకున్న క్షణం నుండి "సైతాన్లు" అవుతారు. ఏమిటో చిత్రం!
  మంచి విషయాన్ని ఎన్నుకున్నారు. అనేక ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి
 12. మందాకిని గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 13. పరమ భక్తితో కొండకు పరుగు దీసి
  నిండు మనమున కొలిచితి మెండు గాను
  కొండ నున్నది కరగని బండ రాయి
  తిరుమ లేశుని దిట్టిన సిరులు గలుగు !

  రిప్లయితొలగించండి
 14. మందాకిని గారూ చక్కని పద్యాలు వ్రాస్తున్నారు,అభినందనలు. మిత్రుల పూరణలు చాలా బాగున్నాయి. దైవములో నమ్మకము లేని వారు మిన్నక ఉండవచ్చు. నమ్మక ముంటే దైవము సర్వాంతర్వ్యామి. సనాతన ధర్మములో గొప్పతనము యే దైవమును నిందించక పోవడము. మన ఆధ్యాత్మిక సంపద చాలా గొప్పది.

  విశ్వమంతయు నొక్కడే విశ్వనాథు
  పొందు లాభము సున్నయె నింద చేయ
  ముక్తి మార్గము నెఱుగక మూర్ఖులండ్రు
  "తిరుమలేశుని దిట్టిన సిరులు గల్గు "

  రిప్లయితొలగించండి
 15. మూర్తి గారూ!
  ధన్యవాదాలు.
  సనాతన ధర్మం లోని ముఖ్యవిషయాన్ని చక్కగా వివరించారు.

  రిప్లయితొలగించండి
 16. కలియుగంబున నీకు రక్ష కలనైన
  తిరుమలేశునిఁ దిట్టిన సిరులు గలుగు
  నవియు పాపపు సిరులురా, అంగ లార్చి
  నిప్పు మూట గట్టు కొనకు నింద జేసి (పాపి)!
  మనవి: మొదట కొంచెం ఘాటు గానే వ్రాసి, తర్వాత సభా మర్యాద కోసం తగ్గించాను. కోట్ల మంది కొలిచే కలియుగ పత్యక్ష దైవాన్ని తిట్టేవారి కోసం బ్రాకెట్లో మాట.

  రిప్లయితొలగించండి
 17. అందరికీ వందనములు.
  అందరి పూరణలూ
  అలరించు చున్నవి !

  01)
  ______________________________________

  నిండు మనమున బూజింప - నిర్మలముగ
  పొంద గలమ ఖండ సిరులు ! - మదము పెరిగి
  దేవ దేవు , నధములమై - ఏ విధమున
  తిరుమలేశుని , దిట్టిన - సిరులు గలుగు ?
  ______________________________________

  రిప్లయితొలగించండి
 18. రాజేశ్వరి గారూ,
  పద్యం సలక్షణంగా ఉంది.
  కొండమీది బండరాయిని కొలిస్తే కరగలేదు. సరె, తిడితే సిరులు కలుగుతాయా?

  నరసింహమూర్తి గారూ,
  అత్యుత్తమంగా ఉంది మీ పూరణ. అభినందనలు.

  చంద్రశేఖర్ గారూ,
  దైవనింద చేయడం "ఫ్యాషన్" అయింది. ఏంచేస్తాం! పరనింద చేయడం మనకు మన సంస్కృతి నేర్పలేదు.
  చక్కని పూరణ. అభినందనలు.

  వసంత్ కిశోర్ గారూ,
  నమ్మిన వారికి తిరుమలేశుడు కొంగు బంగారం అన్న విషయాన్ని చక్కగా చెప్పారు మీ పూరణలో. చాలా బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి