అందరికీ మహాశివుని కరుణా కటాక్ష వీక్షణములు లభించుగాక ! _______________________________________
అందరికీ వందనములు. అందరి పూరణలూ అలరించు చున్నవి. _______________________________________
చిన్న వయసు నందే ఎవరైనా మరణిస్తే ఆ వార్త విన్నప్పుడు గాని ఆ శవాన్ని చూచి నప్పుడు గాని ఎవరి నోటి నుండైనా వెలువడే దదే గదా ! "శివ శివ ఎంత ఘోరం జరిగింది" అని !
01) _______________________________________
"శిష్టు డెట్లు పల్కు శివ శివ యని "జూడ రంగ మయ్య యైన - జంగ మయ్య గాని శవము గాంచ - గనె "శివ శివ" యంద్రు చిన్న వయసునందె - శివుని జేర ! _______________________________________
రంగమయ్య = విష్ణు భక్తుడు జంగమయ్య = శివ భక్తుడు _______________________________________
కవిమిత్రులారా, చిన్న సవరణతో (తే.గీ ని ఆ.వె. గా మార్చాను). శంకరాద్వైత సంపన్న చయను డగుబొ నిత్య మాచ మించు నియమ వేళ కేశవాది నామము లందు చేర్చి సత్య శిష్టుఁ డెట్లు పల్కు శివ శివ యని?
జిగురు సత్యనారాయణ గారూ, ప్రశస్తంగా ఉంది మీ పూరణ. అభినందనలు.
చంద్రశేఖర్ గారూ, సమస్యను కొత్త కోణంలో పూరించారు. అభినందనలు. సవరించిన తర్వాత కూడ కొన్ని లోపాలున్నాయి. నా సవరణ .... అతఁడు చూడ శంక రాద్వైతమును నమ్ము; నిత్య మాచ మించు నియమ మందు కేశవాది నామ కీర్తన మొనరించు శిష్టుఁ డెట్లు పల్కు శివ శివ యని?
వసంత్ కిశోర్ గారూ, మన్నించాలి. ఆలస్యంగా చూసాను. మంచి భావంతో సమస్యను పూరించారు. అభినందనలు. కాని రంగమయ్య "హరి హరి!" అనో "రామ రామ" అనో అంటాడు కాని "శివ శివ!" అంటాడా? అప్రస్తుతం కావచ్చు కాని ... ఒక ముచ్చట ... నా పేరు శంకరయ్య అయినా నేను విష్ణుభక్తుణ్ణి. నేను విద్యార్థిగా ఉన్నప్పుడు వ్రాసిన "శ్రీశ శతకం", "వరద శతకం" రెండూ విష్ణువును సంబోధించినవే.
అజ్ఞాత గారూ, నేను విష్ణుభక్తుణ్ణి అనే అన్నాను కాని శివద్వేషిని అనలేదు కదా. "ఏకం సత్ - బహుధా వదంతి విప్రాః" సూక్తిని నమ్మేవాణ్ణి. మా ఇలవేల్పు వేములవాడ రాజరాజేశ్వర స్వామి.
వసంత్ కిశోర్ గారూ, నిజమే. ఇంత వరకు శివ పరమైన రచన ఏదీ చేయ లేదు. వరంగల్ జిల్లా ధర్మసాగర్ మండలంలో ఉన్న గట్టు మల్లికార్జున స్వామిపై శతకం వ్రాయాలనే ఆలోచన ఎంతో కాలంగా ఉంది. ఇక మొదలు పెట్టాలి.
దుష్టు లైన వారి దునుమంగ శంభుండు
రిప్లయితొలగించండిపాశు పదము నీయ, పరమ శివుని
శిష్టు డెట్లు పల్కు శివ శివ యని గాక
వేరొకండ నేల వినుతి చేయు?
గోలి హనుమచ్ఛాస్త్రి.
రిప్లయితొలగించండిహరికి భక్తు డయిన ఆ వశిష్టాచారి
హరుని నామ మొల్ల డసలు అతడు
శివుని రాత్రి నాడు చెప్పిచూడగ ఆవ
శిష్టు డెట్లు పల్కు శివ శివ యని?
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండికాలవహ్నిసహితఫాలనేత్రదహిత
రిప్లయితొలగించండినిజవపుఁడెలమి మనసిజుఁడు దవిలి
నొడలుఁ గోలుపోవ, నోరార - నామావ
శిష్టుఁ డెట్లు పల్కు శివ శివ యని?
రామచంద్ర యనుచు రక్తిఁ బొందు మదిని,
రిప్లయితొలగించండిదశరధాత్మజుఁడని దరిని జేరు,
చిత్త మందు మెలఁగ సీతాపతి, గురు వ
శిష్టుఁ డెట్లు పల్కు శివ శివ యని !
శైవ వైష్ణవములు దీవరించిన వేళ
రిప్లయితొలగించండిరంగ రంగ యనునె జంగమయ్య ?
స్వప్నమందునైన , వైష్ణవ భక్త వి
శిష్టుఁ డెట్లు పల్కు శివ శివ యని?
మంద పీతాంబర్ గారూ,
రిప్లయితొలగించండి"శిష్టు డెట్లు పల్కు శివ శివ యని గాక" అంటూ చక్కని పూరణ నిచ్చారు. అభినందనలు.
కాని పాశుపతము పొరపాటున పాశుపదము అని టైపయింది.
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
"వశిష్టుడు" అని పూరించడం బాగుంది. మంచి పూరణ. అభినందనలు.
"హరుని నామ మొల్ల డసలు అతడు" అన్నదానిని "హరుని నామ మొల్ల డనవరతము" అంటే ఎలా ఉంటుంది?
రవి గారూ,
"నామావశిష్టుడు" అని పూరించడం చాలా బాగుంది. ఉత్తమమైన పూరణ. అభినందనలు.
గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
మీ పూరణ చాలా బాగుంది. మీరూ గోలి వారి బాట పట్టారు. బాగుంది. అభినందనలు.
శిష్టుఁ డెట్లు పల్కు శివ శివ యనినచో:
రిప్లయితొలగించండి"భక్తి తోడను, యనురక్తి తోడ,
శక్తి తోడ, నీహ సక్తిని విడనాడి,
ముక్తి మోహమందు మునిగి" యందు.
శిష్టు లైన పెద్దలు, మిత్రులు శ్రేష్ఠమైన పూరణలతో శివ స్మరణ జేశారు.
రిప్లయితొలగించండిఅందరికీ వందనాలు.
శంకరార్యా! మంచి సవరణ సూచించారు.ధన్యవాదములు.శివరాత్రి నాడు శివ నామస్మరణ తో పద్యాలు వ్రాయించిన మీకు,వ్రాయింపజేసిన మిస్సన్న గారికి నమస్సులు.
రిప్లయితొలగించండిగోలి హనుమచ్ఛాస్త్రి.
అప్పుడప్పుడు మేము పడే అవస్థ కూడా చెప్పాలి గదండీ ! స్థాన బలము అని వేమన గారు నుడివారు !
రిప్లయితొలగించండిఅన్య దేశమందు నధికారులను దోడ
చర్చి నందు నుండ చర్చ లందు
చిత్త మందు తలచు శివనామమును తక్క
శిష్టుఁ డెట్లు పల్కు శివ శివ యని !
డా. విష్ణు నందన్ గారూ,
రిప్లయితొలగించండిధన్యోస్మి! ఎంత మంచి పూరణ నిచ్చారు? ధన్యవాదాలు.
మిస్సన్న గారూ,
బాగుంది మీ పూరణ అభినందనలు.
అది "ఇహాసక్తి" అనుకుంటాను ....?!
గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
నిజమే కదా! చర్చిలో "హర హర మహాదేవ శంభో శంకరా!" అని గొతెత్తి అనలేము కదా! బాగుంది మీ పూరణ. అభినందనలు.
గురువు గారూ ఈహము నందు సక్తి (ఆసక్తి) అని వాడేను.
రిప్లయితొలగించండిమరి యెంత వరకూ సమంజసమో మీరే చెప్పాలి.
కాని పక్షంలో :
శిష్టుఁ డెట్లు పల్కు శివ శివ యనినచో:
"భక్తి తోడను, యనురక్తి తోడ,
నార్తి తోడ, నైహి కాసక్తి విడనాడి
ముక్తి మోహమందు మునిగి" యందు.
మిస్సన్న గారూ,
రిప్లయితొలగించండిమీరు ఆ రూట్లో వచ్చారా? నేను తప్పుగా భావించాను. మన్నించండి.
మిస్సన్న గారు , సవరించిన పాఠానికే నా వోటు !!!
రిప్లయితొలగించండిగురువు గారూ మీరు పెద్దలు. అలా పెద్ద మాటలు అనవద్దు.
రిప్లయితొలగించండివిష్ణు నందనుగారు సవరించిన పద్యమే మేలన్నారు గదా.
ఆర్యా విష్ణు నందను గారూ! కృతజ్ఞతలు.
రామచంద్రుడు కడు త్రాగుబోతనుచును
రిప్లయితొలగించండిశిష్టుఁ డెట్లు పల్కు? శివ శివ యని
చెవులు మూసు కొనును చెవిసోకినంతట,
పలుకు వానికేమి విలువ కలదు?
గురువులు ,సోదరులు అందరికి మహా శివరాత్రి శుభా కాంక్షలు
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిశంకరాద్వైత సంపన్న చయను డగుబొ
రిప్లయితొలగించండినిత్య మాచమనము చేయు నియమ వేళ
కేశవాది నామము లందు చేర్చి సత్య
శిష్టుఁ డెట్లు పల్కు శివ శివ యని?
అందరికీ
రిప్లయితొలగించండిమహాశివుని కరుణా కటాక్ష వీక్షణములు
లభించుగాక !
_______________________________________
అందరికీ వందనములు.
అందరి పూరణలూ
అలరించు చున్నవి.
_______________________________________
చిన్న వయసు నందే ఎవరైనా మరణిస్తే
ఆ వార్త విన్నప్పుడు గాని
ఆ శవాన్ని చూచి నప్పుడు గాని
ఎవరి నోటి నుండైనా వెలువడే దదే గదా !
"శివ శివ ఎంత ఘోరం జరిగింది"
అని !
01)
_______________________________________
"శిష్టు డెట్లు పల్కు శివ శివ యని "జూడ
రంగ మయ్య యైన - జంగ మయ్య
గాని శవము గాంచ - గనె "శివ శివ" యంద్రు
చిన్న వయసునందె - శివుని జేర !
_______________________________________
రంగమయ్య = విష్ణు భక్తుడు
జంగమయ్య = శివ భక్తుడు
_______________________________________
కవిమిత్రులారా, చిన్న సవరణతో (తే.గీ ని ఆ.వె. గా మార్చాను).
రిప్లయితొలగించండిశంకరాద్వైత సంపన్న చయను డగుబొ
నిత్య మాచ మించు నియమ వేళ
కేశవాది నామము లందు చేర్చి సత్య
శిష్టుఁ డెట్లు పల్కు శివ శివ యని?
జిగురు సత్యనారాయణ గారూ,
రిప్లయితొలగించండిప్రశస్తంగా ఉంది మీ పూరణ. అభినందనలు.
చంద్రశేఖర్ గారూ,
సమస్యను కొత్త కోణంలో పూరించారు. అభినందనలు.
సవరించిన తర్వాత కూడ కొన్ని లోపాలున్నాయి. నా సవరణ ....
అతఁడు చూడ శంక రాద్వైతమును నమ్ము;
నిత్య మాచ మించు నియమ మందు
కేశవాది నామ కీర్తన మొనరించు
శిష్టుఁ డెట్లు పల్కు శివ శివ యని?
శంకరార్యా !
రిప్లయితొలగించండినన్ను మరచినారు !
మాస్టారూ, మెరుగులు దిద్దినందుకు ధన్యవాదాలు.
రిప్లయితొలగించండివసంత్ కిశోర్ గారూ,
రిప్లయితొలగించండిమన్నించాలి. ఆలస్యంగా చూసాను.
మంచి భావంతో సమస్యను పూరించారు. అభినందనలు.
కాని రంగమయ్య "హరి హరి!" అనో "రామ రామ" అనో అంటాడు కాని "శివ శివ!" అంటాడా?
అప్రస్తుతం కావచ్చు కాని ... ఒక ముచ్చట ...
నా పేరు శంకరయ్య అయినా నేను విష్ణుభక్తుణ్ణి. నేను విద్యార్థిగా ఉన్నప్పుడు వ్రాసిన "శ్రీశ శతకం", "వరద శతకం" రెండూ విష్ణువును సంబోధించినవే.
"శివాయ విష్ణురూపాయ శివ రూపాయ విష్ణవే
రిప్లయితొలగించండిశివస్య హృదయం విష్ణుః విష్ణుశ్చ హృదయం శివహ
యధ్శివమయో విష్ణురేవం విష్ణుమయ శివః" - కృష్ణ యజుర్వేదియ స్కంధోపనిషత్
శివకేశవుల మధ్య అంతరాలను చూసేవారికి రౌరవాది నరకాలు సంప్రాప్తం అవుతాయంటారు
ఆ దుర్వార్త విన్నప్పుడు
రిప్లయితొలగించండిఅసంకల్పితంగా ఎవరైనా శివ శివ
అంటారనే నా భావన
ఎలాగంటే
అష్ట భాషా ప్రవీణుడి మాతృభాష
తెలుకోవాలంటే - వాడికి బాధ కలిగిస్తే అప్రయత్నంగా
మాతృ భాషే పలికినట్లు !
మీ శతక రచనకు అభినందనలు !
మరి శంకరుణ్ణి పాపం ఇప్పటికీ అలా ఒదిలేసారా !
శతకం వ్రాయకుండా ?
అజ్ఞాత గారూ,
రిప్లయితొలగించండినేను విష్ణుభక్తుణ్ణి అనే అన్నాను కాని శివద్వేషిని అనలేదు కదా. "ఏకం సత్ - బహుధా వదంతి విప్రాః" సూక్తిని నమ్మేవాణ్ణి. మా ఇలవేల్పు వేములవాడ రాజరాజేశ్వర స్వామి.
వసంత్ కిశోర్ గారూ,
నిజమే. ఇంత వరకు శివ పరమైన రచన ఏదీ చేయ లేదు. వరంగల్ జిల్లా ధర్మసాగర్ మండలంలో ఉన్న గట్టు మల్లికార్జున స్వామిపై శతకం వ్రాయాలనే ఆలోచన ఎంతో కాలంగా ఉంది. ఇక మొదలు పెట్టాలి.
గురువుగారూ మీ శ్రీశ, వరద శతకాలను బ్లాగులో ఉంచవచ్చును కదా.
రిప్లయితొలగించండి