23, మార్చి 2011, బుధవారం

సమస్యా పూరణం - 264 (శ్రీరామునిఁ జూచి సీత)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ........
శ్రీరామునిఁ జూచి సీత చీకొట్టెఁ గదా!

22 కామెంట్‌లు:

 1. ఆ రావణుడరుదెంచగ,
  మారాడక గరిక బట్టి మధ్యన, యెన్నో
  మారులు మది దలచి తలచి
  శ్రీరాముని, జూచి సీత ఛీ కొట్టెగదా!

  రిప్లయితొలగించండి
 2. శంకరార్యా! ధన్యవాదములు.నా బ్లాగును మొదటగా వీక్షించి ఆసీస్సులందించినందులకు వందన శతములు.మీ విలువైన సూచనలు, సలహాలు,సవరణలు సదా కోరుచున్నాను.కృతజ్ఞతలు.

  రిప్లయితొలగించండి
 3. మంత్రిప్రగడ వేంకట బాలసుబ్రహ్మణ్యం గారి భావానికి నా పద్యరూపం ........
  రారమ్మనె శూర్పణఖయు
  శ్రీరామునిఁ జూచి; సీత చీకొట్టెఁ గదా
  యా రమణిని; తత్ఫలముగ
  నా రావణుఁ జేత నామె యపహృత యయ్యెన్.

  రిప్లయితొలగించండి
 4. హనుమచ్ఛాస్త్రి గారూ,
  చాలా బాగుంది మీ పూరణ. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 5. మారీచుమారె లేడిగ
  శ్రీరాముని జూసి ! సీత చీకొట్టె గదా
  యారావణుమోహముగని,
  శ్రీ రామాయణముజూడ సీతా వ్యధయే!

  రిప్లయితొలగించండి
 6. పీతాంబర్ గారూ,
  మీ పూరణ చక్కగా ఉంది. అభినందనలు.
  "మారీచు మారె లేడిగ" అనేకంటె "మారీచు డయ్యె లేడిగ" అంటే బాగుంటుంది.

  రిప్లయితొలగించండి
 7. ఘోరాటవిఁ విడెనని నిం
  దారోపణచేఁ దననెలతను,విని తనచి
  న్నారుల్ పలుచన చేయగ
  శ్రీరాముని, జూచి సీత ఛీ కొట్టెగదా!

  రిప్లయితొలగించండి
 8. మంత్రిప్రగడ వేంకట బాలసుబ్రహ్మణ్యంబుధవారం, మార్చి 23, 2011 10:30:00 AM

  గురువు గారూ,
  ధన్యవాదములు
  - మంత్రిప్రగడ వేంకట బాలసుబ్రహ్మణ్యం

  రిప్లయితొలగించండి
 9. మందు జనులకు నిజముగ విందు గాదె! ఈ సమస్య ఎలా ఉంది? శంకరయ్య గారూ...

  రిప్లయితొలగించండి
 10. నారాయణువేషమ్మున
  యారావణుజూచిసీత ఆహా! కుటిలా!
  నారాముడుకాడనియా
  శ్రీరాముని జూచి సీత ఛీకొట్టె గదా!

  రిప్లయితొలగించండి
 11. అందరూ చక్కటి విరుపుతో పూరణలు అందించారు. నేను సమస్యని యదాతథముగా పూరించటానికి ప్రయత్నిస్తాను.అయోధ్యాకాండ,ముప్పైవ సర్గలోని శ్లోకమే ప్రేరణ:
  శ్లో. కిం త్వా మన్యత వైదేహ: పితామే మిథిలాధిప:
  రామ జామాతరం ప్రాప్య స్త్రియం పురుష విగ్రహమ్.
  తాత్పర్యము: సీతాదేవి రామునితో అంటున్నట్లు: నాథా, నన్ను వెంటతీసుకొని పోవటానికి ఘోరారణ్యం, పులులు, సింహాలు వుంటాయని భయపడుతున్నావా? మా జనకుడేమను కొనునో తెలుసా, మా అల్లుడు పురుష రూపములో నున్నస్త్రీయే!అని.
  మనవి: ఈ శ్లోకానికి పండితులు చాలా ప్రాముఖ్యం ఇస్తారు.
  నాపద్యం:
  ఘోరాటవి,రావల దన,
  శ్రీరామునిఁ జూచి సీత చీకొట్టెఁ గదా
  ఔరా!నాజనకుఁడనును
  నా రాముడు పురుష రూప నారియట౦చున్!

  రిప్లయితొలగించండి
 12. మిత్రుల పూరణలు చాలా బాగున్నాయి. చందరశేఖరుల వివరణ బాగుంది. బాల సుబ్రహ్మణ్యం గారి భావము అందముగా ఉంది, దానికి గురువుగారి అల్లిక చాలా బాగుంది.

  నోరార పిలుచు ప్రేమను
  శ్రీ రాముని జూచి సీత ; ఛీ కొట్టె గదా
  యా రావణు ముఖ మందుట
  కారడవిని దన్ను బట్ట కాపురుషుడునిన్ !

  రిప్లయితొలగించండి
 13. వీరుఁడితండని వలచెను
  శ్రీరామునిఁ జూచి సీత, చీకొట్టెఁ గదా
  చోరుని రావణుని, సదా
  శ్రీరామ పదములు గొల్చు సీతకు ప్రణతుల్!!

  రిప్లయితొలగించండి
 14. అందరికీ వందనములు .
  అందరి పూరణలూ
  అలరించు చున్నవి
  01)
  _____________________________________

  గారాబము లొలుకు మిగుల
  శ్రీరాముని జూచి ,సీత ! - చీ కొట్టె ,గదా
  గారాబ మెంత జూపిన
  యా రావణు తృణమ నెంచి - యవనిజ మదిలో !
  _____________________________________

  గారాబము = ప్రేమము
  గారాబము = గొప్పతనము
  _____________________________________

  రిప్లయితొలగించండి
 15. 02)
  ______________________________________

  వీరావేశము , యాయా
  వారము బట్టిన, తనయులు - పరివారముతో
  పోరాటము గెల్చి; నిలుప
  శ్రీ రాముని ! జూచి సీత - చీ కొట్టె గదా !
  ______________________________________

  యాయావారము = అశ్వమేధ యాగాశ్వము
  ______________________________________

  రిప్లయితొలగించండి
 16. శంకరార్యా!ధన్యవాదములు.మీ పూరణము ప్రశస్తముగా ఉన్నది. కవిమిత్రుల అందరి పూరణలు చాల బాగున్నవి.

  రిప్లయితొలగించండి
 17. అందరి పూరణలూ మనోజ్ఞంగా ఉన్నాయి.
  కిశోర మహోదయుని స్ఫూర్తితో:

  పోరాడుచు మూర్చిల్లిన
  శ్రీరామునిఁ జూచి, సీత చీకొట్టెఁ గదా
  'ఓరీ కొట్టిరె తండ్రిని
  మీరే?' యని బాలకులను మిగుల బొగులుచున్

  రిప్లయితొలగించండి
 18. ఊకదంపుడు గారూ,
  అద్భుతంగా ఉంది మీ పూరణ. అభినందనలు.

  వెంకటప్పయ్య గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.

  చంద్రశేఖర్ గారూ,
  మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.

  నరసింహ మూర్తి గారూ,
  పూరణ చక్కగా ఉంది. అభినందనలు.
  తప్పులు కావు కాని ఇలా ఉంటే బాగుంటుం దనిపించింది.
  యా రావణు ముఖ మం(దే)
  కారడవిని దన్ను బట్ట కాపురుషుడు(గాన్).

  సత్యనారాయణ గారూ
  మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.

  వసంత్ కిశోర్ గారూ,
  మీ రెండు పూరణలూ బాగున్నాయి. అభినందనలు.
  మొదటి పూరణలో "యా రావణు తృణమ నెంచి - యవనిజ మదిలో" అనడం కంటె "యా రావణు తృణ మటంచు నాత్మఁ దలఁచుచున్" అంటే ఎలా ఉంటుంది?

  మిస్సన్న గారూ,
  అత్యుత్తమంగా ఉంది మీ పూరణ. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 19. కవిమిత్రుల పూరణలు నాకు ఈ రెండు టపాలను గుర్తుకుతెచ్చాయండి
  ఒకటి
  రెండు

  రిప్లయితొలగించండి
 20. క్రూరమ్మౌ మాటలతో
  కారాగారమును జేరి కార్పణ్యముతో
  నా రావణుండు తెగడగ
  శ్రీరామునిఁ , జూచి సీత చీకొట్టెఁ గదా!

  రిప్లయితొలగించండి

 21. తీరని నిద్రను కలలో
  వేరొక ధ్యాసనుచు లేక వేదన మీరన్
  ఆ రావణు వేషమనుచు
  శ్రీరామునిఁ జూచి సీత చీకొట్టెఁ గదా!

  రిప్లయితొలగించండి