7, సెప్టెంబర్ 2016, బుధవారం

సమస్య - 2136 (తల్లికి మీసముల్ మొలిచె...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...

"తల్లికి మీసముల్ మొలిచెఁ దండ్రికి లే వది యేమి చిత్రమో"
లేదా...
"తల్లికి మీసములు మొలిచెఁ దండ్రికి లేవే"

81 కామెంట్‌లు:



  1. చల్లగ బుడతడు పుట్టెను
    తల్లికి, మీసములు మొలిచెఁ దండ్రికి, లేవే
    లల్లీ నీతమ్ము డితడు!
    అల్లీ బిల్లీ యనంగ నాడుకొనమ్మా !

    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబీ గారూ,
      విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'ఆడుకొనుమమ్మా' అనడం సరియైనది. అక్కడ 'ఆడుకొనంగన్' అనండి.

      తొలగించండి
  2. కల్లుకి బానిస మగడై
    యిల్లు మరువ బూని సతియునిడుములకెదురై
    పిల్లల బెంచగ వారల
    తల్లికి మీసములు మొలిచెఁ దండ్రికి లేవే

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కళ్యాణ్ గారూ,
      కుటుంబాన్ని పోషించవలసిన తండ్రి పట్టించుకొనకుంటే తల్లి ఆ బాధ్యతను వహించి పురుషధర్మాన్ని పాటించిందన్న మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'కల్లుకు' అనండి.

      తొలగించండి
  3. ఉల్లము క్షోభిత మొందగ
    తల్లికి మీసములు మొలిచెఁ , దండ్రికి లేవే
    చెల్లని మాటలు దేనికి
    కల్లలు పలుకంగ వలదు కలత పడంగా

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అక్కయ్యా,
      సమస్యను చెల్లని మాటగా సమర్థించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'కలతపడంగన్' అనండి.

      తొలగించండి
  4. వల్లికి గేహ కాంతికినిబాసెను దీధితి స్త్రీ సువాదులున్
    తల్లడ మందినారిచట దండ్రి యహంకృతి హెచ్చెపో యనన్
    కల్లయెగాదె తండ్రి కొరగాని వినమ్రత నుల్లసిల్ల నా
    తల్లికి మీసముల్ మొలిచె తండ్రికి లేవది యేమి చిత్రమో

    రిప్లయితొలగించండి
  5. తెల్లని దేహచ్ఛాయకు
    వల్లె యన న్నాతికెన్ని వగ వాటికలో
    చల్లనిచూపులకెగబడ
    తల్లికి మీసములు మొలిచె దండ్రికి లేవే

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పిట్టా సత్యనారాయణ గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      'వగవాటిక'...?

      తొలగించండి
  6. క్రొవ్విడి వెంకట రాజారావు:

    ఉల్లము నుల్లస బర్చగ
    నల్లిన చిత్రమిదియెనని యాప్తుడు జూపన్
    మెల్లగ నవ్వుచు నడిగితి
    తల్లికి మీసములు మొలిచె దండ్రికి లేవే.

    తల్లియె దండ్రిగ దండ్రియె
    దల్లిగ మారిన నటనము దరిశించిన యా
    పిల్లలు గురుతెరిగి ననున్
    తల్లికి మీసములు మొలిచె దండ్రికి లేవే.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. క్రొవ్విడి వేంకట రాజారావు గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      'గురు తెరిగి యనన్' అనండి.

      తొలగించండి
  7. చెల్లని మాటల పతియును
    చెల్లించు కొనెడి సతియన చిలిపిగ లోకుల్
    అల్లరి సేయుదు రీవిధి
    తల్లికి మీసములు మొలిచెఁ దండ్రికి లేవే"

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అశ్వత్థ నారాయణ మూర్తి గారూ,
      లోక పరిహాసంగా మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  8. తల్లి పుడమి పులకించగ
    నల్లనిమేఘమ్ముతండ్రి నయముగ గురియన్
    రెల్లు పొడమగా దోచెను
    తల్లికి మీసములు మొలిచె తండ్రికి లేవే

    రిప్లయితొలగించండి
  9. పిల్లడు బొమ్మలు గీసెను
    తల్లియుదండ్రనుచు జూపె తన యక్కకు,నో
    యల్లరివాడాయని యనె
    "తల్లికి మీసములు మొలిచెఁ దండ్రికి లేవే!"

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
      తల్లికి మీసాలు పెట్టి పిల్లవాడు గీచిన చిత్రాన్ని గురించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  10. "వందేహం గణనాయకమ్"పద్యాలను కవితా హృదయంతో ప్రకటించిన మాన్యులు శంకరయ్య గారికి హార్దిక నమస్సుమాంజలులు.
    ఈ రోజు పూరణము.

    మెల్లగ వచ్చిన మార్పున
    తల్లికి మీసములు మొలిచె, దండ్రికి లేవే
    కల్ల యిదికాదు మిత్రమ
    తెల్లమగు నిట్టి విషయము తర్కింపంగన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పొన్నెకంటి సూర్యనారాయణ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  11. అల్లన పుత్రుడు తేగా
    మెల్లగ మందును నెల పరిమితముగ వాడన్
    నల్లగ మారెను కురులే
    తల్లికి, మీసములు మొలిచె దండ్రికి, లేవే?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. హనుమచ్ఛాస్త్రి గారూ,
      కేశవర్ధిని తైలాన్ని గురించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  12. అల్లాయేమీచిత్రము
    తల్లికిమీసములుమొలిచెదండ్రికిలేవే
    తల్లికిమీసములుండిన
    దల్లులునికసాటియౌనుదండ్రులకిలలో

    రిప్లయితొలగించండి
  13. పిల్లడి దక్షత ముదమౌ
    తల్లికి, మీసములు మొలిచెఁ దండ్రికి, లేవే?
    యెల్లలు సంతోషమునకు!
    జిల్లా నేలెడు ప్రభుత్వ సేవకుఁడైనన్!!

    రిప్లయితొలగించండి
  14. బల్లిదుడగు వేషంబని
    మెల్లగ రంగులు పులుముచు మీసము మరచెన్!
    అల్లన క్షవరము మరచిన
    తల్లికి మీసములు మొలిచెఁ; దండ్రికి లేవే!!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. టేకుమళ్ళ వేంకటప్పయ్య గారూ,
      రంగస్థల నటుల విషయమై మీరు చేసిన పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  15. తల్లికిమీసముల్ మొలిచెదండ్రికిలేవదియేమిచిత్రమో
    యుల్లముతల్లడిల్లెమరియూర్పులువచ్చెనుజూడగానవి
    న్దల్లికిమీసముల్ మొలిచితండ్రికిలేమికిగానగాభళా
    యల్లదెయెట్టులీజరుగుహాభగవంతుడ!మాకయిప్పుడున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సుబ్బారావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      '...యెట్టులీ'?.. యెట్టులన్ అని ఉండాలనుకుంటాను.

      తొలగించండి
  16. గు రు మూ ర్తి ఆ చా రి
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

    తల్లియు కూతురున్ మరియు త౦డ్రియు
    …………… పోవుచు ను౦డ దారిలో

    అల్లరి దొ౦గ బిడ్డ మెడ య౦దలి
    ……………… హారము లాగ , పట్టె నా

    తల్లి చటుక్కున న్నతని | తాడన జేయుచు
    ………………… రక్కె వ్యాఘ్రి యై |


    తల్లికి మీసముల్ మొలిచె త౦డ్రికి
    ………… లే వది యేమి చిత్రమో !

    { వ్యాఘ్రి = ఆడ పులి }

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గురుమూర్తి ఆచారి గారూ,
      పౌరుషాన్ని ప్రదర్శించిన తల్లిని గురించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  17. ఫెళ్లని జవాబు లిచ్చెను
    తల్లికి-మీసములు మొలిచె- తండ్రికి లేవే
    కొల్లలుగ నప్పు ? లుండుట
    కిల్లైనను లేదటంచు నిది యది వదరెన్
    (మూతి మీద మీసాలు రాగనే అమ్మా నాన్నలని ఎదిరించేశాడు అనే ఒక లోకోక్తి)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ధనికొండ రవిప్రసాద్ గారూ,
      మీ పూరణ వైవిధ్యంగా ఉంది. అభినందనలు.

      తొలగించండి
  18. పిల్లతనమ్ము దాటి యిక పెద్దగ సుద్దులు నేర్పుచుండెగా
    తల్లికి ! మీసముల్ మొలిచె , తండ్రికి లే వది యేమి చిత్రమో
    ఇల్లును నాస్తిపాస్తులని యెంతయు గేలి యొనర్చె బాపురే
    పిల్లలు పిల్లలట్లు కనుపింపరుగా ! కలికాల మియ్యదే.
    (పిల్లవానికి కాస్త మూతి మీద మీసాలు రాగానే అమ్మా నాన్నలకి వంకలు పెట్టటం నేర్చాడనే లోకోక్తి )

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రవిప్రసాద్ గారూ,
      కందంలో చెప్పిన భావాన్నే విస్తరించి వృత్తంలో చక్కగా చెప్పారు. బాగుంది పూరణ అభినందనలు.

      తొలగించండి
  19. కల్లయ సుమ్మి మానినులు గాతరు లన్న చరిత్ర లందునన్
    వెల్లువ లయ్య గాధ లిల వీర వరేణ్య లతాంగు లెన్నగం
    బిల్లి యనంగఁ దాఁ దగదు పెక్కులు ధైర్యము సాహసమ్ములుం
    దల్లికి, మీసముల్ మొలిచెఁ దండ్రికి లే వది యేమి చిత్రమో


    వెల్లువగ కేశ సంపద
    తల్లికి, మీసములు మొలిచెఁ దండ్రికి, లేవే
    పిల్లకు రెండును వింతగ
    మెల్లగ రావచ్చు నేమొ మీద శిరమునన్

    రిప్లయితొలగించండి
  20. కల్లయుగాదు సత్యమిది కంఠముబల్కు మగాడిరీతిగా|
    తల్లికి మీసముల్ మొలిచె|తండ్రికి లేవది యేమిచిత్రమో?
    పిల్లికిజూడగా గలవు పిల్లల తండ్రికి లేకపోవుటా?
    అల్లరి మేనకోడలన ?అంతరమందున వేదనేగదా? {కొన్నిలోపాలతోఅలాజరుగుటతక్కువఐనాతప్పుగాదు}
    2.పిల్లలు నాటకమునుగని
    తల్లికి మీసములు మొలచె|తండ్రికి లేవే?
    మెల్లగ అన్నను నడుగగ?
    చెల్లీ వేషముల యందు చెల్లు నదంతే.

    రిప్లయితొలగించండి
  21. పెల్లున మాటలు సడలగ
    తల్లికి, మీసములుమొలిసె తండ్రికి, లే వే
    యెల్లలు నాకంచు తలచి
    యెల్లెడలను తిరుగుచుండె హేలగ ధృతితో

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'మొలిచె..'

      తొలగించండి
  22. చెల్లగు జడ కురుచ బడియె
    తల్లికి! మీసములు మొలిచె తండ్రికి! లేవే
    ఎల్లలు క్రొత్త దనమునకు!
    పిల్లల కూడి నడచుటయె పెద్దఱికమగున్!

    (ఆ తరం తల్లులకు జడలుండేవి, తండ్రులకు మీసాలుండేవి కావు - అదే కుటుంబంలోని ఈ తరం తల్లులకు పొట్టి జుట్లు, తండ్రులకు మీసాలు వచ్చేశాయి. క్రొత్త దనం తెచ్చే మార్పులను పిల్లల వలెనే పెద్దలు కూడా ఆమోదించాలి, అదే పెద్దఱిక మవుతుంది).

    రిప్లయితొలగించండి
  23. అల్లరి పనులను జేసెడి
    లల్లియె నొక బొమ్మవేసి రష్మికి జూపన్
    గొల్లుమని నవ్వి యిట్లనె
    తల్లికి మీసములు మొలిచె తండ్రికి లేవే?

    వ్యాపారి మాటలు...

    నల్లని కేశములమరెను
    తల్లికి, మీసములుమొలిచె తండ్రికి, లేవే
    వెల్లువగ కురులు బాబుకు
    చల్లని తైలంబొసగెద చౌకగ గొనుడీ!!!



    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శైలజ గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. ముఖ్యంగా రెండవది ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
      'లల్లియె యొక...' అనండి.

      తొలగించండి
  24. చల్లని మానసమది, మా
    తల్లికి, మీ సములు, మొలిచె తండ్రికిలే, వే
    రొల్లక నుల్లము నందున
    నెల్లలు లేకా మమతల నేమందునిలన్!

    మొలచు=అంకురించు

    రిప్లయితొలగించండి
  25. పిల్లలు లేక మ్రొక్కులని, పేరుగడించిన తీర్ధయాత్రలన్
    తల్లిని జేయ నేగుచునె, దర్శనమొందగ వైద్యు, డామెకున్
    చల్లగ దెల్పె పూరుషుని చక్కని లక్షణమున్నదంచు, చిం
    తల్లికి మీసముల్ మొలిచెఁ దండ్రికి లే వది యేమి చిత్రమో

    నిన్నటి దత్తపదికి నా పూరణ

    తనరె మన కధలు సదా నవగాధలే,
    రామదాసు రగిలె రాముఁపైన
    వింటివా నరకము నంటె నసురుడని
    వినర భక్తి గదుర వింత కథను !

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. భాగవతుల కృష్ణారావు గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      ఈనాటి పూరణలో 'చిన్న+తల్లి' చింతల్లి కాదు.

      తొలగించండి
  26. పల్లెను పడ్చువాడు పడు పాట్లను జూచిన వారు జెప్పగా
    నుల్లము నందు యోచనలు నుబ్బె కుమారుని పెండ్లి చేయ నా
    తల్లికి, మీసముల్ మొలిచెఁ , దండ్రికి లే వది యేమి చిత్రమో
    పిల్లల మంచి చెడ్డలను బ్రేమగ చూచును తల్లియే కదా

    రిప్లయితొలగించండి
  27. మల్లయది పేడిమూతియె
    యల్లతనికి పైడితల్లి యనుఁగు కొమరుఁడౌ
    నెల్లరు 'తల్లీ!' యందురు,
    తల్లికి మీసములు మొలిచెఁ దండ్రికి లేవే!

    రిప్లయితొలగించండి
  28. మల్లయ యన్న రైతు జనమాన్యుఁడు సౌమ్యుఁడు పేడిమూతితో
    నెల్లపు డుండువాఁ డతని కాత్మజుఁ డొక్కఁడు పైడితల్లి పే
    రెల్లరు వానిఁ దల్లి యని యెంతయొ ముద్దుగఁ బిల్చుచుందు రా
    తల్లికి మీసముల్ మొలిచెఁ దండ్రికి లే వది యేమి చిత్రమో!

    రిప్లయితొలగించండి
  29. బల్లికి,నల్లికి లేనివి
    పిల్లికి మీసములు మొలిచె|తండ్రికిలేవే?
    పిల్లికి వేటాడుటకై
    మెల్లన వాసనలు బంచ?మెక్కుటకొరకై|
    2.చెల్లును కృష్ణరాయలకు చిక్కని చక్కనిమీసముల్ సుమా|
    చెల్లున నల్లనయ్య కవి?చేడియ ముద్దులకడ్డమంచు.యే
    తల్లికి మీసముల్ మొలిచె?తండ్రికి లేవది యేమి చిత్రమో?
    అల్లన కృష్ణు డెంచె నట ఆశనిరాశల మూల మౌ ననిన్.

    రిప్లయితొలగించండి
  30. ఈశ్వరప్ప గారూ,
    మీ మొదటి పూరణలో తల్లిని పిల్లిని చేశారు. దానివల్ల యతి తప్పింది.
    రెండవ పూరణలో భావం సందిగ్ధంగా ఉంది.

    రిప్లయితొలగించండి
  31. కల్లలు కాదు బావ తన కన్నుల జూచె నుగాండ లోన నే
    పిల్లయు తండ్రినిం దనకు పెద్దగ నెంచదు కన్నవారిలో
    తల్లియె సర్వశక్తి మయి తండ్రికి మాన్యత నాస్తి చూడగా
    తల్లికి మీసముల్ మొలిచెఁ దండ్రికి లే వది యేమి చిత్రమో!

    (క్షమించాలి. కేవలం పూరణ కోసం మాత్రమే ఈ ఆరోపణ)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మిస్సన్న గారూ,
      మీ పూరణ బాగుంది. అభినందనలు.
      ఐనా 'ఉగాండా' దాకా ఎందుకు వెళ్ళినట్టు?

      తొలగించండి
    2. హహహ గురువుగారూ మనవాళ్ళని అనే ధైర్యం లేదు.

      తొలగించండి
  32. నల్లని కేశములు గలవు

    తల్లికి; మీసములు మొలిచె దండ్రికి; లేవే

    పిల్లల కని సందియ పడ

    మెల్లగ నవి వచ్చుననుచు మెలతయు పలికెన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పిన్నక నాగేశ్వర రావు గారూ,
      విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  33. పల్లెన జీవనమ్ము పెను భారము తెల్పగ శక్యమే నిలన్
    తెల్లని మల్లెలన్ ముడువ తీరిక యన్నది చిక్కబోవదా
    తల్లికి, మీసముల్ మొలుచు తండ్రికి లేవది యెంతచిత్రమో
    అల్లన గాంచినన్ క్షవరపంగడు లుండవు క్రోసు దవ్వునన్

    ఢిల్లికి రాజైన కొడుకె
    తల్లికి, మీసములు మొలిచె దండ్రికి, లేవే
    యెల్లలిక,గర్వముపెరిగె
    ముల్లెలు సాధించనెంచి మురిపము పెరిగెన్

    రిప్లయితొలగించండి
  34. ఆర్యా
    వగల రాణి అంటే అందాల రాణి ఐనప్పుడు వగ వాటిక beauty parlour

    రిప్లయితొలగించండి
  35. Beauty parlours లోకి వెళ్ళి నందువల్ల ఆ అపచారం దాపురించింది.కెమికల్సు కారణం.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. వగ అంటే దుఃఖం. విలాసం, శృంగార చేష్ట అనే అర్థాలు కూడా ఉన్నాయి. వగలాడి అంటే విలాసవతి లేక మాయలాడి. కాని అందగత్తె అని కాదు. మీరన్నట్టు ఒప్పుకున్నా అక్కడ వగల వాటిక అనవలసి ఉంటుంది.

      తొలగించండి
  36. మెల్లగ కాంగ్రెసున్ విరిచి మేలు ప్రధానిగ నెన్నికౌచునున్
    చల్లగ పాకినిన్ విరిచి చక్కగ రెండగు ముక్కలౌచునున్
    గొల్లున జైలునన్ విసిరి గొప్పగ నేతల;...నిందిరమ్మయౌ
    తల్లికి మీసముల్ మొలిచెఁ దండ్రికి లే వది యేమి చిత్రమో!

    రిప్లయితొలగించండి