13, సెప్టెంబర్ 2016, మంగళవారం

సమస్య - 2142 (అక్కనుఁ బెండ్లియాడె...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...

"అక్కనుఁ బెండ్లియాడె నొక డందరు సంభ్రమ మంది చూడఁగన్"
లేదా...
"అక్కనుఁ బెండ్లాడె నొక్కఁ డందరు చూడన్"

99 కామెంట్‌లు:

  1. చక్కని చుక్కగు నీరమ
    ణక్కనుఁ బెండ్లాడె నొక్కఁ డందరు చూడన్
    చెక్కిలి మీటుచు ప్రియముగ
    నక్కున చేర్చంగ నతడు యానం దమునన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అక్కయ్యా,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      చివర '...యానందించెన్' అనండి... అన్వయం కుదురుతుంది.

      తొలగించండి
  2. కం. అక్కను మించును చెల్లెలు
    చక్కదనము లోన మరియు చదువుల;నయినన్
    ఎక్కువ విలువిడి నడతకు
    అక్కను బెండ్లాడె నొక్క డందరు చూడన్.

    రిప్లయితొలగించండి
  3. ఉ. అక్కను మించిపోవు గద అందము నందున చెల్లి కాంచగన్
    చక్కని చుక్కయేను తను చందురు మించిన ముద్దు మోముతో
    పెక్కురు చెప్పినన్ వినక బ్రేమకె యెక్కువ విల్వ నిచ్చుచున్
    అక్కను బెండ్లియాడె నొక డందరు సంభ్రమ మంది చూడగన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గుఱ్ఱం జనార్దన రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'ఇచ్చుచున్+అక్కను' అని విసంధిగా వ్రాయరాదు. 'ఇచ్చి యా। యక్కను...' అనండి.

      తొలగించండి
  4. చుక్కను మించుయం దమని సొంపగు కన్నుల సోయగమ్ములన్
    మక్కువ మీరప్రీ తిగని మానస మందున సంతసం బుతో
    నిక్కము సౌమ్యగం ధమట నీలలి తాంగియ టంచునెంచి మా
    అక్కనుఁ బెండ్లియాడె నొక డందరు సంభ్రమ మంది చూడగన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అక్కయ్యా,
      మీ వృత్త పూరణ బాగున్నది. అభినందనలు.
      కాని అన్ని సుగుణాలున్న ఆవిడను పెళ్ళి చేసుకుంటే అందరూ సంభ్రమపడడం ఎందుకు?

      తొలగించండి


  5. చక్కటి జవరాలగు మా
    అక్కనుఁ బెండ్లాడె నొక్కఁ డందరు చూడన్
    చుక్కలు దిగివచ్చెను మా
    చక్కగ నడిరేయినందు చందము గానన్

    జిలేబి

    రిప్లయితొలగించండి
  6. క్రొవ్విడి వెంకట రాజారావు:

    చక్కని చుక్కగు అక్కకు
    దృక్కులు నివ్వగ దలచుచు తీపిని నాపై
    తక్కువ జేయగ నొప్పున
    అక్కను బెండ్లాడె నొక్కడందరు జూడన్.

    రిప్లయితొలగించండి
  7. క్రొవ్విడి వెంకట రాజారావు:

    చక్కగ బెండ్లి జూపులకు సాగిన వాడట పిల్లయక్కపై
    మక్కువ గూడగా నడిగి మాటలు చక్కగ రాకయున్ననా
    చుక్కకు పాటియౌ బ్రదుకు జూపగ దీటుగ నాడుతోడుదౌ
    అక్కను బెండ్లియాడె నొక డందరు సంభ్రమ మొంది యుండగన్.

    (ఆడుతోడు = చెల్లెలు)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. క్రొవ్విడి వేంకట రాజారావు గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
  8. దిక్కుల రేనికి తమ్ముడు
    పక్కిని వాహనముగ గొని బరగెడి వాడు
    న్నక్కజముగ చుక్కలదొర
    యక్కను బెండ్లాడె నొక్కడందరు జూడన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అశ్వత్థ నారాయణ మూర్తి గారూ,
      ఉపేంద్రుడు, ఖగవాహనుడు అయిన విష్ణువు చంద్రసహోదరి యైన లక్ష్మిని పెళ్ళాడాడన్న మీ పూరణ ఉత్తమంగా ఉంది. అభినందనలు.

      తొలగించండి
  9. చక్కదనమ్ముల రాశియు
    మిక్కిలిగన్ సౌమ్య గుణము మేలిమి
    మగువయి
    చిక్కిన మరదలునా రా
    మక్కను బెండ్లాడె నొక్క డందరు జూడన్!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శిష్ట్లా శర్మ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మగువై... టైపాటు..

      తొలగించండి
  10. ఎక్కడి నాటక కళలా
    మక్కువతో భృతినినడుపు మనుజుల క్లేషా
    ల్బెక్కులు పాత్రా పోషణ
    నక్కను బెండ్లాడె నొక్క డందరు జూడన్

    రిప్లయితొలగించండి
  11. మక్కువ జూపె నోవరుడు మాయలమాటల బెండ్లి యాడగా
    నక్కజమేమి? యా అబల కక్క యొకర్తుక కంగలోపపుం
    జిక్కున గ్రుంగ జూచెనట జేయగ త్యాగము నామె తోడునౌ
    అక్కను బెండ్లి యాడె నొక డందరు సంభ్రమ మంది చూడగన్
    Sir, This is from Pitta Satyanarayana, who lot his ID in his name.

    రిప్లయితొలగించండి
  12. యొకర్తుక నంగ లోపపున్..2వ పాదంలో ఉండాలి. లోపలికి వెళ్ళి సవరించుకోవడం తెలయక ఆపొరపాటు.సవరించ గలరు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పిట్టా సత్యనారాయణ గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      'పాత్రపోషణ' సాధువు. 'పాత్రాపోషణ' అనరాదు కదా! అక్కడ 'పాత్రల పోషణ' అందామా?

      తొలగించండి
  13. దిక్కెవరు లేని యా సర
    సక్కను బెండ్లాడె నొక్కడందరు చూడన్
    మక్కువ తోడుత నాతడు
    యక్కున జేర్చుకొని నిలచె నాలంబనగా!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శ్రీధర రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ఆతడు+అక్కన.. అన్నపుడు యడాగమం రాదు. '...తోడుత నాతం। డక్కున...' అనండి.

      తొలగించండి
  14. చక్కదనంబు లేదు, పరిచర్యలు చేయగ శక్తి లేదికన్
    ముక్కలుగాగ శల్యములు మేదినిపై చరియించలేక తా
    నొక్కట శయ్యపైన పడియుండిన వృద్ధను భర్తృకాంక్షి న
    చ్చక్కను బెండ్లియాడె నొక డందరు సంభ్రమ మంది చూడగన్.
    హ.వేం.స.నా.మూర్తి.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  15. చుక్కల రేనిబట్టి సిగజుట్టి కసెక్కుచు నిక్కిన నాగులన్
    మక్కువమీర మైనిలుపు మంటలకంటిముఖంబు వాడు నె
    ద్దెక్కుచు నేన్గు తోలు మొలనింపుగ గట్టెడు వాడు కొండకున్
    "అక్కనుఁ బెండ్లియాడె నొక డందరు సంభ్రమ మంది చూడఁగన్"
    కొండకున్ అక్క : మైనాకుని సోదరి, పార్వతి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అశ్వత్థ నారాయణ మూర్తి గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      మొదటి పూరణ మొదటి పాదంలో గణదోషం..'సిగ జుట్టియుఁ దా కసియెక్కు నాగులన్' అందామా?

      తొలగించండి
  16. చక్కని చుక్కై దిరుగుచు
    మక్కువతో బలుకరించు మహితగుణాఢ్యన్
    మిక్కిలి సంతసమున సీ
    తక్కను బెండ్లాడె నొక్క డందరు చూడన్.
    హ.వేం.స.నా.మూర్తి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  17. [9/13, 08:05] Chepuri Sreeramarao: అల్లుకొనెను పొదరిల్లుగ
    మల్లియతీగయొకటిచిరు మామిడి చెట్టున్
    మెల్లగ పైపై ప్రాకగ
    మల్లియతీగియకు గలిగె మామిడికాయల్
    [9/13, 08:10] Chepuri Sreeramarao: వీలుగ పాలను దాగగ
    మెల్లగ మార్జాలమొకటి మింగుచు గుటకల్
    కాలు కదిపి,వెలిగిన దీ
    పాలను జూడగ పిల్లి భయపడి పాఱెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చేపూరి శ్రీరామారావు గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
  18. మా అక్క,సీతక్క,రామక్క అనుచు చక్కని పూరణలు చేసినారు కవి మిత్రులు.అభినందనలు!

    రిప్లయితొలగించండి
  19. అక్కలువమించు సొగసులు
    నక్కనులకు గలవటంచు నలుపేయైనన్
    అక్కజముగ మరదలు సీ
    తక్కను బెండ్లాడె నొక్కడందరు జూడన్.

    రిప్లయితొలగించండి
  20. ముక్కామల క్షేత్రమ్మున
    చక్కని సుందరిని జూచి సమ్మోహితుడై
    మక్కువ మీరగ మా రా
    ధక్కను బెండ్లాడెనొక్క డందరు జూడన్!!!

    రిప్లయితొలగించండి
  21. అక్కాచెల్లెలయందున

    అక్కయె గుణరూపభావమధికతచూపన్
    మక్కువమీరగ టక్కున
    అక్కనెబెండ్లాడెనొక్కడందరుచూడన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చేపూరి శ్రీరామ్ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'అక్కాచెల్లెలు' అనడం వ్యావహారికమే. 'అక్కనుఁ జెల్లినిఁ గాంచెను..' అనండి.

      తొలగించండి
  22. గు రు మూ ర్తి ఆ చా రి
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

    చక్కని రూప స౦పద , ప్రశస్త గుణ౦బును ,

    ………………… మ౦చి విద్య , పె౦

    పెక్కిన భాగ్యమున్ గలిగి , హీనత

    ………… నా వికలా౦గి యైన రా

    మక్కను పె౦డ్లియాడె నొక డ౦దరు స౦భ్రమ

    ………………… మ౦ది చూడగ న్ |

    తక్కవ వాడె ? యు త్ కృ తి నొనర్ప

    …………… దల౦చు మహాత్ము డాతడౌ ! !

    { ఉత్ కృతి = ఉత్ కృష్ట మైన కార్యము }

    రిప్లయితొలగించండి
  23. చక్కని మోమున కుంకుమ
    చిక్కని కురులందు పూలు చిరుహాసముతో
    చక్కెరబొమ్మగు మా సీ
    తక్కను బెండ్లాడె నొక్కడందరు జూడన్!!!

    రిప్లయితొలగించండి
  24. దక్కదని మేనకోడలు
    చిక్కులు మేనరికమైన చింతలటన్నన్
    మక్కవనొప్పించుచు తన
    యక్కను, బెండ్లాడె నొక్కడందరు చూడన్

    రిప్లయితొలగించండి
  25. చక్కనిరూపము గలిగియు
    తక్కువ హరణమ్మటంచు తలచి గ్రహించన్
    మక్కగ నామెపతి హితుని
    యక్కనుఁబెండ్లాడే నొక్కఁడందరు చూడన్
    హరణముః కట్నము, మక్కుః చచ్చు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  26. చక్కని యందము గలమా
    య క్కను బెండ్లాడె నొక్క డం దరు జూడ
    న్నొక్కడె కొమరుడు మామకు
    మక్కువతో నొప్పుకొనెను మాబంధ మునున్

    రిప్లయితొలగించండి
  27. ఒక్కడె! కృష్ణుడొక్కడె!మహోన్నతు డంచును ప్రేమమీరగన్
    మక్కువఁ జూప రుక్మిణియె మానసచోరుడటంచు, మెచ్చి తాఁ
    జక్కున రాక్షసంబునను స్యందనమెక్కగ హత్తి రుక్మికి
    న్నక్కనుఁ బెండ్లియాడె 'నొక' డందరు సంభ్రమ మంది చూడఁగన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సహదేవుడు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      రుక్మికి అక్కా? చెల్లెలా? నాకు సందేహమే!

      తొలగించండి
    2. గురుదేవులకు ధన్యవాదములు. రుక్మిణి తమ్ముడని ఆంధ్రభారతిలోనూ యున్నది.

      తొలగించండి
    3. సహదేవుడు గారు నమస్సులు. రుక్మిణీ దేవి యందరి కంటెను చిన్నది.
      “... కేవురుపుత్త్రులగ్రజుం / డనయుడురుక్మినాబారగునందఱకున్ గడగొట్టుచెల్లిలై / మనుజవరేణ్య!పుట్టెనొకమానినిరుక్మిణినాఁ బ్రసిద్ధయై.” భాగ. 10. 1687.
      నిఘంటువులలో కూడా యఛ్ఛు తప్పులు దొర్ల వచ్చు.
      ఉదాహరణకి శ్రీహరి నిఘంటువు చూడండి.
      ఆగ్నేయము : శ్రీహరి నిఘంటువు తెలుగు-తెలుగు (రవ్వా శ్రీహరి) 2004
      దిశాభేదము, తూర్పు-ఉత్తర దిశల నడిమి దిశ.
      వ్యు. అగ్నిదేవుఁడధిపతిగా గల దిక్కు.
      నేను సవరణ సూచించితిని.

      తొలగించండి
    4. ఆంధ్రభారతిలో దాని క్రింద చూడండి.
      రుక్మి : పురాణనామచంద్రిక (యెనమండ్రం వెంకటరామయ్య) 1879
      విదర్భదేశపు రాజు అగు భీష్మకుని పెద్దకొడుకు. రుక్మిణి అన్న.

      తొలగించండి
    5. పోచిరాజు వారలకు ధన్యవాదములు.తరుణోపాయము సూచించ మనవి.
      లేక పద్యమును తొలగించుటే శరణ్యమా?

      తొలగించండి
    6. సహదేవుడు గారు సమస్యలో “ఒకడు” అని యెవరో తెలియ నట్లుంది కనుక పూరణ లో కూడా యతని నజ్ఞాతము గా నుంచడమే యుచితము కదా.

      చెలికత్తియల మాటలుగా చేసిన సవరణ ను చూడండి.
      ఒక్కడె! వీరు డాతడు!మహోన్నతు డంతఁ బరాక్రమంబునన్
      మక్కువఁ జూపి మానినిని మాయను దాఁ గొని పోయి బాపురే
      చక్కున రాక్షసంబునను స్యందన మందిడి మాదు రుక్మిణి
      న్నక్కనుఁ బెండ్లియాడె 'నొక' డందరు సంభ్రమ మంది చూడఁగన్

      “రుక్మిణీ/ యక్కను ...” అంటే దుష్ట సమాస మవుతుందని “రుక్మిణి/న్నక్కను.. “ అని ప్రయోగించితిని.

      తొలగించండి
    7. మీ సూచనకు ధన్యవాదములు. రుక్మిణీ దేవి చెలికత్తెలు శ్రీకృష్ణపరమాత్మను కనుగొన లేరంటారా?

      తొలగించండి
  28. అక్కజ మైన విధ్య పరమాద్భుత రూపము గల్గి యుండియున్
    మక్కువ తోడ నవ్వనిత మానస మందున ముద్ర వేయగం
    జక్కని చుక్కనే చదువు సంధ్యలు నేర్వని భామ పెద్ద మొ
    ద్దక్కనుఁ బెండ్లియాడె నొక డందరు సంభ్రమ మంది చూడఁగన్


    తక్కువ చేసితి ననవల
    దెక్కువ మక్కువ మనమున నీమే యని పె
    ద్దక్కను గాదని మరి చి
    న్నక్కనుఁ బెండ్లాడె నొక్కఁ డందరు చూడన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పోచిరాజు కామేశ్వర రావు గారూ,
      మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
    2. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు.

      తొలగించండి
  29. చక్కని చుక్కల తళుకులు
    మిక్కిలి బంగారు చాయ మేనును,నాకై
    అక్క గనిన వధువని, సీ
    తక్కను బెండ్లాడె నొక్క డ౦దరు చూడన్

    రిప్లయితొలగించండి
  30. మక్కగ తల్లిదండ్రి తమ మధ్యవయస్సున, నొంటిదై కడున్
    చక్కని రూపమున్ గలిగి చాలిన కట్నము నివ్వలేక తా
    చిక్కగ, జాలితోడుతను చింతను తీర్చగ నెంచి యా సుశీ
    లక్కను పెండ్లి యాడె నొకడందరు సంభ్రమమంది చూడగన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్నపరెడ్డి సత్యనారాయణ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  31. చుక్కలు సిగ్గిలన్వలెను షోడశ కాంతులనీను చంద్రుడే
    చెక్కిలి నొక్కుకో వలెను చిన్నగ వెన్నెల తెల్లబోవలెన్
    మిక్కిలిగాగయంచు కొరమీలకనుంగవ గల్గు నా వినీ
    లక్కను బెండ్లియాడె నొకడందరు సంభ్రమమంది చూడగన్.

    చుక్కలు సిగ్గిలు రూపం
    బక్కజమగు బల్కులెన్న నయ్యజురాణే
    నిక్కమిదియంచు నా సర
    ళక్కనుబెండ్లాడె నొక్కడందరు జూడన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పొన్నెకంటి సూర్యనారాయణ రావు గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      'రాణి+ఔ' అన్నపుడు యడాగమం వస్తుంది. అక్కడ'..నయ్యజు సతియౌ' అనండి.

      తొలగించండి
    2. నమస్కారమండి. శంకరయ్యగారు. నేను వ్రాసినది, నయ్యజు రాణే( రెండు గురువులు, గగము)అని. నా భావన రాణియే యని.రాణి+ఔ=కాదు.కాని మీ సూచన బాగుంది.

      తొలగించండి
    3. 'రాణి+ఏ' అన్నపుడు కూడ యడాగమమే వస్తుంది. సంధి లేదు.

      తొలగించండి
  32. మొదటి పాదంలో సవరణ...కాంతులనీను జంద్రుడే.

    రిప్లయితొలగించండి
  33. ముక్కనులున్నవాడు, తన మూర్ధము నందున గంగ,చంద్రుడున్
    జక్కగ దాల్చువాడు ,కరి చర్మము మేన ధరించు వాడుయున్
    గ్రక్కున హాహలమ్ము తన కంఠము నదున నున్నవాడు హై
    మక్కను బెండ్లియాడె నొక డ౦దరు సంభ్రమ మంది చూడగన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'మేన ధరించువాడునున్..' అనండి. హాలహలమును హాహలము అన్నారు.

      తొలగించండి
  34. చక్కని చుక్కల తళుకులు
    మిక్కిలి బంగారు చాయ మేనును,నాకై
    అక్క గనిన వధువని, సీ
    తక్కను బెండ్లాడె నొక్క డ౦దరు చూడన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చక్కని చుక్కనా పడతి? శ్యామల వర్ణము స్థూలకాయమున్
      కొక్కెర పాదముల్ గనగ గుజ్జగు రూపము చిన్ననేత్రముల్
      చిక్కుకురుల్ వికారమగు చేష్టలు గల్గినట్టి మా
      యక్కను పెండ్లియాడె నొకడందరు సంభ్రమ మంది చూడగన్

      చుక్కలలో చంద్రుడతడు
      చక్కని చుక్కంచు జనులు శ్లాఘించగ తా
      మక్కువను పెంచుకుని మా
      యక్కను బెండ్లాడె నొక్కడందురు చూడన్

      తొలగించండి
    2. చక్కని చుక్కను గాంచుచు
      మక్కువ తోడను మనమున మరులను గొనుచు
      న్నక్కజపడుచున్ నాసీ
      తక్కను పెండ్లాడె నొక్కడందరు చూడన్.

      తొలగించండి
    3. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      *********
      విరించి గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      *****
      డా. బల్లూరి ఉమాదేవి గారూ,
      మీ పూరణ బాగుంది. అభినందనలు.

      తొలగించండి
  35. చక్కని ముఖ వర్చస్సును

    చెక్కిలిపై సొట్టలున్న చెలియను జూడన్

    మిక్కిలి ప్రేమించి హితుని

    యక్కను బెండ్లాడె నొక్కడందరు చూడన్.

    రిప్లయితొలగించండి
  36. అక్కజ మాయె నాకది య యాయత రీతిని నొప్పు కొంటకే
    చిక్కులు వెట్ట మాకపుడు చేష్టలు లేకను మిన్న కుండగా
    చక్కని రూపున్గలిగి సాధువు వోలెను నుండునట్టి మా
    య క్కను బెండ్లి యాడె నొక డం దరు సంభ్రమ మంది చూడగన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సుబ్బారావు గారూ,
      మీ పూరణ బాగుంది. అభినందనలు.
      రూపునున్ గలిగి... అనండి.

      తొలగించండి
  37. చక్కని వధువుకు గల స్వం
    తక్కను బెండ్లాడె నొక్క డందరు చూడన్
    దిక్కెవరు లేరని గని
    ప్రక్కింటను పతిని విడిచి బ్రతికెడు యువతిన్

    రిప్లయితొలగించండి
  38. ముక్కెర నేల చూపులను ముద్దిడు చుండగ |పెళ్లి పందిటన్
    చెక్కిలిచుక్క నిక్కగనె|చెంతన మంగళ వాద్యశోభకున్
    మక్కువచే వధూ వరుల మానస మందున చింత మాన్ప?సో
    మక్కను పెండ్లియాడె నొకడందరు సంభ్రమమంది చూడగన్|
    2.మిక్కిలి మక్కువజిక్కగ
    చక్కని చుక్కైన|సొక్కు చక్కిలి గిలిగా
    దక్కగ?ప్రేమించినభీ
    మక్కనుపెండ్లాడె నొక్క డందరు చూడన్



    రిప్లయితొలగించండి
  39. చెక్కిలిపై వేలుంచిన
    చక్కని చుక్కనటగాంచి సంబర పడుచున్
    ఠక్కున మోహించుచు శుభ
    క్కను పెండ్లాడె నొక్కడందరు చూడన్.

    రిప్లయితొలగించండి
  40. చుక్కలతో పోలికయును
    తక్కువ యనిపించెడి వనితని పెక్కురకున్
    చిక్కని బహు చక్కని మా
    అక్కని పెండ్లాడె నొక్కఁ డందరు చూడన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నితీశ్ చంద్ర గారూ,
      మీ పూరణ బాగుంది. అభినందనలు.
      'వనితను' అనండి.

      తొలగించండి
  41. చక్కని మోమువాఁడు కడు చక్కని చూపుల సుందరాంగుడున్
    మిక్కిలి సచ్చరిత్రుడును మేలిమి పుత్తడి వన్నెవాడటన్
    దక్కెను నాకటంచు ప్రియ తామర నేత్రిని ప్రేమతోడ న
    న్మక్కనుఁ బెండ్లియాడె నొక డందరు సంభ్రమ మంది చూడఁగన్"


    రిప్లయితొలగించండి
  42. చక్కనిదాన యో లలన సద్గుణ శోభిని చారుహాసినీ
    చుక్కల మించు సోయగపు చుక్క మనోహరి మంజు భాషిణీ
    చిక్కని నీదు ప్రేమ సుడి జిక్కితి దక్కితి నంచు కుంటి సు
    బ్బక్కను బెండ్లియాడె నొక డందరు సంభ్రమ మంది చూడఁగన్.

    రిప్లయితొలగించండి
  43. చుక్కల రేనిబట్టి సిగజుట్టియు దాకసియెక్కిన నాగులన్
    మక్కువమీర మైనిలుపు మంటలకంటిముఖంబు వాడు నె
    ద్దెక్కుచు నేన్గు తోలు మొలనింపుగ గట్టెడు వాడు కొండకున్
    "అక్కనుఁ బెండ్లియాడె నొక డందరు సంభ్రమ మంది చూడఁగన్"
    కొండకున్ అక్క : మైనాకుని సోదరి, పార్వతి
    గురువు గారూ సవరించాను.కృతజ్ఞతలు

    రిప్లయితొలగించండి
  44. చక్కని చుక్కగా పెరిగి చప్పున నక్కయ ముండమోయగా...
    చుక్కల రేడుగా వెలసి చుట్టను కాల్చెడి పంతులయ్యగా
    గ్రక్కున చిత్రమందునను గప్పుగ చుప్పుగ ముచ్చటైన బు
    చ్చక్కనుఁ బెండ్లియాడె నొక డందరు సంభ్రమ మంది చూడఁగన్

    రిప్లయితొలగించండి