25, సెప్టెంబర్ 2016, ఆదివారం

సమస్య - 2154 (వనమున సంచరించుటకు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...

"వనమున సంచరించుటకుఁ బద్ధతు లుండవె యెంచి చూడఁగన్"
(ఆకాశవాణి వారి సమస్య)
లేదా...
"వనమునఁ దిరుగుటకు లేవె పద్ధతులు గనన్"

129 కామెంట్‌లు:

  1. తనకనపత్యతన్ హృదయతాపముగల్గ దిలీపుడంతటన్
    చనుటకునై వసిష్ఠమునిసన్నిధికిన్ గృహిణీసమేతుడై
    ఘనపరివారమున్ వదలె కాచుటకంచుఁ బ్రశాంతతన్ తపో
    వనమున సంచరించుటకుఁ బద్ధతు లుండవె యెంచి చూడఁగన్ ||

    తనయనపత్యతఁ దెల్పగ
    మునిఁ గలువ సుదక్షిణఁ గొని భూపు దిలీపుం
    డనుచరులను వదలె తపో
    వనమునఁ దిరుగుటకు లేవె పద్ధతులు గనన్ ||

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. మాడుగుల అనిల్ కుమార్ గారూ,
      నందినీ సేవకై తపోవన జీవనాన్ని గడిపిన దిలీపుని ప్రస్తావనతో మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
  2. వనమున భీముడుద్ధతిని వంటరిగాజనె సాహసంబునన్
    పెనగుచు కొండపామచట భీమునిఁ జుట్టెను పౌరుషంబునన్
    మనగల మార్గమున్ గనని మర్త్యుడుఁ జింతిలె సంకటంబునన్
    వనమున సంచరించుటకుఁ బద్ధతు లుండవె యెంచి చూడఁగన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఫణికుమార్ తాతా గారూ,
      వనసంచారంలో జాగ్రత్త పాటించాలన్న మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'ఒంటరిగా'అనవలసింది 'వంటరిగా' అన్నారు. ఒంటరిగా అంటే యతి తప్పుతుంది. సవరించండి.

      తొలగించండి
    2. వనమున సంచరించె తన వాడిమిఁ జూపుచు భీముడుద్ధతిన్
      పెనగుచు కొండపామచట భీమునిఁ జుట్టెను పౌరుషంబునన్
      మనగల మార్గమున్ గనని మర్త్యుడుఁ జింతిలె సంకటంబునన్
      వనమున సంచరించుటకుఁ బద్ధతు లుండవె యెంచి చూడఁగన్

      గురువుగారూ మన్నించండి. రాత్రి నిద్ర మత్తులో గమనించలేదు. సవరించాను.

      తొలగించండి
    3. ఫణికుమార్ గారూ,
      సవరంచిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  3. క్రొవ్విడి వెంకట రాజారావు:

    కనలుచు సంసార మొదిలి
    ఘనముగ నడవులను జేరి కైవల్యముకై
    మునిగ దపమెంచు వానికి
    వనమున దిరుగుటకు లేవె పద్ధతులు గనన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. క్రొవ్విడి వెంకట రాజారావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'వదలి'ని 'ఒదిలి' అన్నారు. 'సంసారము విడి' అనండి.

      తొలగించండి


  4. మనసున నీశుని తలచుట
    కును, నొడిలో జోలపాటకును, మది తా న
    ల్లిన కవితలకు, జిలేబీ,
    వనమునఁ దిరుగుటకు, లేవె పద్ధతులు గనన్!

    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబీ గారూ,
      ఎప్పుడెప్పుడు పద్ధతులు పాటించాలో వివరిస్తూ చక్కని పూరణ చెప్పారు. అభినందనలు.

      తొలగించండి
  5. క్రొవ్విడి వెంకట రాజారావు:

    గురువుగారూ! నమస్కారములు. నిన్నటి రోజున నేను ఆస్పత్రిలో ఉండుట వలన సమస్యా పూరణ పద్యాలను సరిగా పంపలేక పోయాను. అక్కడకక్కడ వ్రాసి పంపిన పద్యం బాగుందన్నారు గానీ, సంతృప్తి లేక మరలా పంపుతున్నాను. దయతో పరిశీలించ గలరు.

    వేణి దోడ తలను వేడ్కగా దువ్వెడి
    బాబు నెంచి నట్టి బాలుడపుడు
    ఉల్లసమున పిత ననుకరించి గుండున్న
    జుట్టు లేని వాడు జుట్టు దువ్వె.

    జుట్టు కనేక తైలములు సూటిగ బూయుచు బెంచి దువ్వెనన్
    పట్టి నిరంతరమ్మతడు వాసిగ దువ్వుచు నుండ మెల్లగా
    జుట్టుయె రాలి బట్టతల జొప్పడినన్ యలవాటుదోడ నా
    జుట్టును లేని వాడు దన జుట్టును దువ్వెను మాటిమాటికిన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. క్రొవ్విడి వేంకట రాజారావు గారూ,
      నిన్న మీరు ఏ పద్యాలను పంపారో, నేనేం సమీక్షించానో గుర్తు లేదు. ఇప్పుడు చూడబోతే అవి కనిపించలేదు.
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      మొదటి పూరణ మూడవ పాదంలో యతి తప్పింది. 'అపుడు + ఉల్లసమున' అన్నపుడు సంధి నిత్యం. విసంధిగా వ్రాశారు. "బాలు డప్పు। డనుకరించి తండ్రి నలరుచు గుండున్న..' అనండి.
      రెండవ పూరణలో 'జుట్టు+ఎ' అన్నపుడూ సంధి నిత్యం, యడాగమం రాదు. 'జుట్టును రాలి..' అనవచ్చు. '...జొప్పడినన్+అలవాటు' అన్నచోట యడాగమం రాదు. 'జొప్పడగా నలవాటుతోడ..' అనండి.

      తొలగించండి
  6. మనసున మధురోహలలో
    దనరుచు తన్మయ సుధలను తమిగొను వేళం
    దొనరెడి ప్రేమికుల మనో
    వనమున దిరుగుటకు లేవె పద్ధతులుగనన్!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నా రెండవ పూరణము:

      అనువుగ వేణుగానమును హాయిగనూదుచు నొప్పు కృష్ణునం
      దనయము ప్రేమ చిప్పిల వ
      నాంతర వీధులసాగు గోపికల్
      తనరి మనస్సునందలరి
      దాపున జేరగ గోరునట్టి యా
      వనమున సంచరించుటకు
      బద్ధతులుండవె యెంచి చూడగన్!

      తొలగించండి
    2. శిష్ట్లా శర్మ గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
  7. మనమున వంచనల్గొని సమానతకై బహు రీతులన్ గనన్ P.Satyanarayana
    జన విహితంపు బాటలను జక్కగ సాగుచు, స్వార్థ బుద్ధిమై
    జనకను మేలుగూర్చుటకు సామరసాన సమస్య సాధనా
    వనమున సంచరించుటకు బద్ధతులుండవె యెంచి చూడగన్

    ఘనమగు సంసారక్రియ
    గని మోదమునందినట్టి ఘడియల నెంచన్
    శని జాలని విపరీతపు
    వనమున దిరుగుటకు లేవె పద్ధతులు గనన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పిట్టా సత్యనారాయణ గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      మొదటి పూరణలో 'జనకను'..?

      తొలగించండి
    2. ఆర్యా "చనకను" ...మై ..తో చనకను చరింపకను అనబోయి మై కి న్ ఉండదని ఆలోచించ లేదు.నేను సరళ స్వభావుడను.అపచారమే..P.Satyanarayana

      తొలగించండి
  8. క్రొవ్విడి వెంకట రాజారావు:

    వనమున నుండు చోరులతి పారగులై పురమందు దూఱుచున్
    జనులను దోచుచుండి ననిశమ్ము నదల్చుచు నుండ వారినిన్
    చెనకుటకై వనమ్మునకు జేరిన జోద దళమ్ముకెల్ల నా
    వనమున సంచరించుటకు బద్ధతులుండవె యెంచి జూడఁగన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రాజారావు గారూ,
      అడవి దొంగలను పట్టడానికి వెడలిన భటులకు అడవిలో తిరిగే పద్ధతులు తెలిసి ఉండాలన్న మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'దోచుచుండి యనిశమ్ము' అనండి.

      తొలగించండి
  9. అనిలుడు దలచిన చాలును
    వనమునఁ దిరుగుటకు లేవె పద్ధతులు గనన్
    ఘనమగు సుమసౌర భములు
    మనమంతట పులకరించి మైకము నుంచన్


    రిప్లయితొలగించండి
  10. మనమున ప్రేమ భావనల మైకము నందున తేలియాడుచున్
    ఘనమగు దేవలోకమున గాన రసాంభుధి గ్రోలి నంతనే
    వినుటకు వింతగొల్పినను వీనుల విందుగ హాయినీయదా
    వనమున సంచరించుటకుఁ బద్ధతు లుండవె యెంచి చూడగన్

    రిప్లయితొలగించండి
  11. నా పూరణములు....

    కనఁగ వనంబునందుఁ దిరుగాడెడు సర్వమృగమ్ము లొద్దికన్
    మనఁగలుఁగున్ బరస్పర సమాదృత వృత్తిని; వాని కంటె మే
    లనఁదగు జ్ఞానసంపద నయంబున గల్గిన మర్త్యసంఘ జీ
    వనమున సంచరించుటకుఁ బద్ధతు లుండవె యెంచి చూడఁగన్?

    మన మలరఁ బూలదోఁటల
    జనోపయోగమ్ము కొఱకు స్థాపించిరి, క్రొ
    న్ననలను ద్రెంచకుఁడీ యుప
    వనమునఁ దిరుగుటకు లేవె పద్ధతులు గనన్?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గురువుగారూ నమస్సులు. శుభోదయం. మీ పూరణములు లలితమైన భావాలతో అలరారుతున్నాయి.

      తొలగించండి
    2. శంకరార్యా !
      వనమును , జీ-వనము , ఉపవనము లుగ జేసితిరా !!!
      సొబగు సొబగు !

      తొలగించండి
    3. ప్రణామములు గురువుగారు...మీ పూరణలు చాలా బాగున్నాయి...

      తొలగించండి
    4. గురువుగారూ మీ పూరణలు అత్యద్భుతంగా ఉన్నాయి.

      తొలగించండి
    5. మాస్టరు గారూ! మంచి జీ...వనమునకు జ్ఞ్ఞాన బోధజేసిన మీ పూరణములు సుబోధకములుగానున్నవి.

      తొలగించండి
    6. నా పూరణలు నచ్చి అభినందించిన మిత్రులందరికి ధన్యవాదాలు.

      తొలగించండి
  12. అనయము నల్లరి కృష్ణుని
    ఘనముగ కూడిరట గోపికా రమణులటన్
    కనులకు విందగు బృందా
    వనమున దిరుగుటకు లేవె పద్ధతులు గనన్!
    (రెండవ పాదంలో 'అట ' రెండు పర్యాయములు వాడినా వేర్వేరు అధాల్లో ప్రయోగింప బడింది. ఇది తప్పు కాదనుకుంటాను).

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శ్రీధర రావు గారూ,
      బృందావనంతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మీరు హెచ్చరించకున్నా అక్కడ 'అట' శబ్దానికి వేర్వేరు అర్థాలను గ్రహించగల వాక్యనిర్మాణం ఉంది. ఒకే పదాన్ని వేరువేరు అర్థాలతో రెండుసార్లు వాడడం దోషం కాదు, గుణం! శబ్దాలంకారం.

      తొలగించండి
    2. ఆర్యా దానిని(పునరుక్తిని)యమకమనవచ్చునేమో! అనగా విన్నానని;మరియు అచ్చోట అను అర్థాలు వచ్చినవి.ఛందస్సు దారి జూపిన దేవతయే!P.Satyanarayana

      తొలగించండి
  13. శారీరక మానసిక అనారోగ్యములచే
    చాలా కాలమైనది కవిమిత్రులను కలసి !
    ప్రస్తుతము ఆరోగ్యము కొంత కుదుట బడినది ఆపరేషనుతో !
    *****

    అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !

    ఘోర విపినము నందు సంచరించుట యనిన మాటలా ?
    ఎంతయొ నేర్పు కావలెను, గాన
    వనమున సంచరించుటకుఁ - బద్ధతు లుండును యెంచి చూడఁగన్ !

    01)
    _____________________________________

    పెను బల స్త్రీధ్వజంబు లవె - పెళ్ళున గుంపుగ దాడి సేయుటన్
    కనుగొని వ్యాఘ్ర సింగములె - కంధర మందెడు సంకటంబునన్
    ఘనమగుగూఢపాదములె - కాటుల వేయుట పాద మానినన్
    వనమున సంచరించుటకుఁ - బద్ధతు లుండవె యెంచి చూడఁగన్ !
    _____________________________________
    వనము = అడవి
    స్త్రీధ్వజము = ఏనుగు
    గూఢపాదము = పాము

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నీటిలో సంచరించుటకు నిపుణత కావలె గదా ! గాన
      వనమున సంచరించుటకుఁ - బద్ధతు లుండును యెంచి చూడఁగన్ !

      02)
      _____________________________________

      మొన యగు దంతవక్‌త్రముల - మోసము గల్గును కాలు, సేయికిన్
      ఘనతర తోయరాశి దిగ - గాఢ తరంగము త్రోసివేసినన్
      మునిగిన నూపి రాగు నదె - ముందుగ నీతను నేర్వకున్నచో
      వనమున సంచరించుటకుఁ - బద్ధతు లుండవె యెంచి చూడఁగన్ !
      _____________________________________
      వనము = జలము
      మొన యగు దంతవక్‌త్రము = మొసళ్ళు సొరచేపలు మొదలగునవి

      తొలగించండి
    2. వసంత కిశోర్ గారూ,
      మీ ఆరోగ్యం కుదుట పడినందుకు సంతోషం! ఎక్కడున్నారు?
      ఈమధ్య రాజమండ్రి అష్టావధానానికి వెళ్తూ 'తణుకు' స్టేషనులో మిమ్మల్ని, రాజమండ్రిలో మిస్సన్న గారిని గుర్తు చేసుకున్నాను.
      గతంలోనే అన్నాను మీది అయితే పద్యాల అతివృష్టి, లేకుంటే అనావృష్టి అని...
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'బలస్త్రీ..' అన్నపుడు ల గురువై గణదోషం. 'పెను బలమున్న యేన్గులవె..' అంటే ఎలా ఉంటుంది?

      తొలగించండి
    3. అయ్యా ! అవధానము నందరూ చెయ్యలేరు గదా ! గాన ప్రాశ్నికా
      వనమున సంచరించుటకుఁ - బద్ధతు లుండును యెంచి చూడఁగన్ !

      03)
      _____________________________________

      వినుటకు శ్రోతలన్ గలుగు - వేదిక నెక్కవధాన శాస్‌త్రికి
      న్ననయము ధారణన్ జెఱుప - నక్కడ నొక్కడు నుండు గావునన్
      మనమున ధారణన్ సలుప - మాటల సత్వమె గాచు ; ప్రాశ్నికా
      వనమున సంచరించుటకుఁ - బద్ధతు లుండవె యెంచి చూడఁగన్ !
      _____________________________________
      ప్రాశ్నికావనము = పృచ్ఛక సమూహము

      తొలగించండి
    4. శంకరార్యా ! ధన్యవాదములు !
      నెలరోజుల క్రితము వరకూ హైదరాబాదు !
      ప్రస్తుతం తణుకులోనే !

      తొలగించండి
    5. శంకరార్యులకు ధన్యవాదములతో :

      మీ సవరణ చక్కగా నున్నది
      కాని ఏనుగునకు పర్యాయపదం వాడుదామని చేసిన ప్రయత్నమది !
      మరొక ప్రయత్నము :

      ఘోర విపినము నందు సంచరించుట యనిన మాటలా ?
      ఎంతయొ నేర్పు కావలెను, గాన
      వనమున సంచరించుటకుఁ - బద్ధతు లుండును యెంచి చూడఁగన్ !

      01అ)
      _____________________________________

      పెను బల మత్తకీశములు - పెళ్ళున గుంపుగ దాడి సేయుటన్
      కనుగొని వ్యాఘ్ర సింగములె - కంధర మందెడు సంకటంబునన్
      ఘనమగుగూఢపాదములె - కాటుల వేయుట పాద మానినన్
      వనమున సంచరించుటకుఁ - బద్ధతు లుండవె యెంచి చూడఁగన్ !
      _____________________________________

      తొలగించండి
    6. కరిరాజుకు కూడా కరివరదుని కరుణ కావలసివచ్చె కదా, కావున
      వనమున సంచరించుటకుఁ - బద్ధతు లుండును యెంచి చూడఁగన్ !

      04)
      _____________________________________

      అనువుగ నంబుకంటకపు - నానన మందున గాలు చిక్కగన్
      వినయము లేక వీరు డగు - వేదండ రాజమె చిక్కి శల్యమై
      మననము సల్పి శ్రీహరిని - మానము, ప్రాణపు బిక్ష నొందెనే !
      వనమున సంచరించుటకుఁ - బద్ధతు లుండవె యెంచి చూడఁగన్ !
      _____________________________________
      వనము = జలము

      తొలగించండి
    7. నిత్య కల్యాణం- పచ్చతోరణం లా యిల్లుండాలి, కావున
      వనమున సంచరించుటకుఁ - బద్ధతు లుండును యెంచి చూడఁగన్ !

      05)
      _____________________________________

      మనవలె నౌను మంచిగను - మాటల నేర్పున మంది మెచ్చగన్
      వినవలె గాదె పూజ్యులగు - పెద్దలు జెప్పిన మంచి మాటలన్
      ప్రణయము జూప , భార్య తన - ప్రాణము నిచ్చును భర్త కోసమై
      దినమదె సాగు దివ్యముగ - ధీరత జూపిన దిద్దుబాటులన్
      వనమున సంచరించుటకుఁ - బద్ధతు లుండవె యెంచి చూడఁగన్ !
      _____________________________________
      వనము = ఇల్లు

      తొలగించండి
    8. వసంత కిశోర్ గారూ,
      వివిధాంశాలను ప్రస్తావించిన మీ ఐదు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      నాల్గవ పూరణ రెండవ పాదంలొ 'వేదండ' అన్నచోట గణదోషం.

      తొలగించండి
  14. బండికాడి అంజయ్య గౌడ్ గారి పూరణ.....

    దినదినమును మూర్ఖుల వలె
    మనుచుండిరి మనుజులెల్ల మంచితనమ్మున్
    గొనుటయె ముఖ్యము మానవ
    వనమున దిరుగుటకు లేవె పద్దతులు గనన్

    రిప్లయితొలగించండి
  15. అనితరసాధ్యమౌను భరతావనిఁ గన్యనుఁ గన్నతండ్రియై
    మనువునుజేయనెంచ తరమాయబలాజనరక్షణమ్మునన్
    పనిగొని తత్ప్రయత్నమున ప్రాచ్యులు మేలని గూర్చ కన్య య
    వ్వనమున సంచరించుటకుఁ బద్ధతు లుండవె యెంచి చూడఁగన్ ||

    వనితనుఁ గని దంపతులిల
    మనువును జేయంగ నెంచ మరి రక్షణకై
    యొనగూర్చగ కన్యలు య
    వ్వనమునఁ దిరుగుటకు లేవె పద్ధతులు గనన్ ||

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. మాడుగుల అనిల్ కుమార్ గారూ,
      మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవిక్. అభినందనలు.

      తొలగించండి
  16. వినుమ!కవీశ్వరుండెచట విజ్ఞతతోడుత జ్ఞానసంపదల్
    ఘనతరరీతిగా విమలకావ్య సుశోభనుబంచిపెట్టగ
    న్ననితర సాధ్యమౌ సుపథ నవ్య రసాంచిత పాదబంధ భా
    వనమున సంచరించుటకు బద్ధతులుండవె యెంచిచూడగన్.

    అనవరతంబా మనమున
    వనమాలినిదలచి కైత పచరింపంగన్
    ఘనతరసాహిత్యపు సుమ
    వనమున దిరుగుటకు లేవె పద్ధతులుగనన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పొన్నెకంటి సూర్యనారాయణ రావు గారూ,
      భావనము, సుమవనములతో మీ రెండు పూరణలు మనోహరంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
  17. కనులకు విందును జేయుచు
    మనమును బులకింప జేయు మధురోహలలో
    ననయము తేలించెడు పూ
    వనమున దిరుగుటకు లేవె పద్ధతులు గనన్!!!


    వినుమరి రాధారమణుని
    కనులకు గాన్పింప జేయు కమ్మని సృతులన్
    మనమున నిలిపెడు బృందా
    వనమున దిరుగుటకు లేవె పద్ధతులు గనన్!!!



    తనమన బేధము లేక
    న్ననునిత్యము తేలియాడు నాలోచనలన్
    మనలో కలిగించు మనో
    వనమున దిరుగుటకు లేవె పద్ధతులు గనన్!!!


    రిప్లయితొలగించండి
  18. జనులకు మేలును చేయగ
    మనమున తలపోసి మంచి మాటలు వినుచున్
    అనునిత్యము పావన భా
    వనమున దిరుగుటకు లేవె పద్దతులు గనన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చేకూరి శ్రీరామారావు గారూ,
      పావన భావనముతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  19. కం.అనయము వ్రాయుచు నుందురు
    మనమున భావుకత లేక;మరియాదౌనే ?
    వినయమున నేర్వదగును; క
    వనమున దిరుగుటకు లేవె పద్ధతులు గనన్?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గుఱ్ఱం జనార్దన రావు గారూ,
      కవనంతో మీ పూరణ వైవిధ్యంగా ఉంది. అభినందనలు.

      తొలగించండి
  20. మనమున సద్విమర్శనము మాన్యుల చెంత విశుద్ధ భక్తియున్
    గొనకొని కార్యసాధనము కూరిమి గొల్పెడు వాక్బలంబు, చిం
    తన మరి విష్ణుపాదములఁ, తత్వవిచారము, లిన్ని గల్గు జీ
    వనమున సంచరించుటకుఁ బద్ధతులుండవె యెంచి చూడఁగన్.

    రిప్లయితొలగించండి
  21. మనమున.ప్రేమభావనలు మైమరపించగ ముగ్ద రాధకున్
    ప్రణయ రసార్ద్ర వీచికలు ప్రాయము ప్రాణము తీయుచుండగా
    కనుగొనలేక కృష్ణుని ముఖంబు,సుఖంబుల,తాళలేక య
    వ్వనమున సంచరించుటకు
    పద్దతులుండవె యెంచి చూడగన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చేపూరి శ్రీరామారావు గారూ,
      మీ పూరణ మనోహరంగా ఉంది. అభినందనలు.

      తొలగించండి
  22. మునివరు దర్శనమ్మునకు మోక్షము కల్గు నటంచు నేగిన
    న్ననయము కానలందు తిరుగాడెడు రక్కసి మూక లట్టులే
    పనిగొని యుగ్రవాదు రిల భగ్న మొనర్చగ జూతురె ల్లెడన్ ;
    వనమున సంచరించుటకుఁ బద్ధతు లుండవె యెంచి చూడఁగన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గు రు మూ ర్తి ఆ చా రి
      ి,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

      వనమున స౦చరి౦చుటకు బధ్ధతు లు౦డవు |

      ……………… కాని , స౦ఘ జీ

      వనమున స౦చరి౦చుటకు బధ్ధతు లు౦డవె ,

      ………………… యె౦చి చూడగన్ ?


      1. మనవలె సాటి మానవుని మానస మి౦తయు

      ………………… బాధ వెట్టకన్ |

      2. ధనము గడి౦చు కోరిక నధర్మపుకార్యము

      …………… సేయరాదు సూ |

      3. ఒనరుచు మయ్య తోచిన పరోపకృతిన్

      ……………… సతమున్ కృపా మతిన్ |

      4. చనవల దెన్న డేనియును షడ్రిపు వర్గము

      …………… న౦దు ద్రెళ్లుచున్

      5. అనిశము నా పరాత్పరుని ధ్యానము

      ……………… జేయుము విస్మరి౦పకన్ !

      { గురువు గారు క్షమి౦చాలి ! పాదా౦తమున

      వాక్యము ముగిసి న౦దున రె ౦ డు

      పాదములను అచ్చుతో ప్రార౦భి౦చితిని }

      తొలగించండి
    2. భాగవతుల కృష్ణారావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'ఉగ్రవాదు లిల..' అనండి.

      తొలగించండి
    3. గురుమూర్తి ఆచారి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  23. నారదుడు గయునకుపాయము చెప్పు సందర్భము:

    తనరిన వైభవమ్మున విధాత వరద్యుతి నాక వీధినిం
    జనిచని యుమ్ము వేయగ వ్రజప్రభు దోయిలిఁ గూలి నంతటం
    గనలునఁ బంత మూనినను ఖండన సేయగఁ జక్రధారి నీ
    వనమున సంచరించుటకుఁ బద్ధతు లుండవె యెంచి చూడఁగన్

    [నీవు+అనమున=నీవనమున; అనము = ఊపిరి,శ్వాస]


    అనయము రాజ భటులు శో
    ధన సేసిన నప్రమత్తతన్ భయ మేలన్
    మన మలరంగగఁ బ్రమదా
    వనమునఁ దిరుగుటకు లేవె పద్ధతులు గనన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కామేశ్వరరావు గారూ, వనము నుండి అనమును బయటకు తీసిన మీ ప్రజ్ఞకు శతాధిక వందనములు.

      తొలగించండి
    2. పోచిరాజు కామేశ్వర రావు గారూ,
      మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. ముఖ్యంగా గయుని ప్రస్తావనతో విలక్షణమైన విరుపుతో మొదటి పూరణ ప్రశంసనీయం. అభినందనలు.

      తొలగించండి
    3. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు.
      ఫణి కుమార్ గారు మీ యపూర్వాభిమానమునకు కృతజ్ఞున్ని.

      తొలగించండి
  24. కనగను నుండును బధములు
    వనమున దిరుగుటకు ,లేవె పధ్ధతులు గనన్
    వనధి ని దాటుట కొఱకును
    ననువైనవి కావె మనకు నచ్చటి యో డల్

    రిప్లయితొలగించండి
  25. తనకున్నది పోగొట్టుకు
    చినతమ్ముల, నాలి నొడ్డి శ్రీమతి క్రుంగన్
    వనముల పాలయె! ఆదే
    వనమున దిరుగుటకు లేవె పద్ధతులు గనన్
    (ఆదేవనము = జూదమాడుట)

    రిప్లయితొలగించండి
  26. అనిశము హాయిగ నుండగ
    జంములకై సంఘమందు చట్టములుండన్
    ఘనముగ మృగముల కొరకును
    వనమున దిరుగుటకు లేవె పద్ధతులు గనన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'జంములకై'.. 'జనములకై' టైపాటు.

      తొలగించండి
  27. వనమున సంచరించుటకు బధ్ధతు లుండవె యెంచి చూడగన్
    వినుముర సంచరించుటకు వే నకువేలుగ బధ్ధతు ల్సుమా
    వనమున సంచరించుటకు ,పాయుము సంశయ, మేలకో యిక
    న్గనుమిక దారినిప్పుడు నెకాయెకిగా నటువైపు పోవుమా

    రిప్లయితొలగించండి
  28. ప్రవరుడు హిమాలయాలలో పాదలేపనం కరిగి తిరిగివచ్చే దారితెలియక వరూధినిని దారినడిగితే ఆమె పలికిన పలుకులుగా నూహించి.....

    *చంపకమాల

    ఘనమగు పాదలేపనము గానక, క్రమ్మరు మార్గమేదియో
    కనక విచారమున్ మునిగి కాంతను గాంచిన భూసురుండె యా
    వనితను దారిచూపుమన బ్రాహ్మణు తోడవచించెనామె యే
    వనమున సంచరించుటకుఁ బద్ధతు లుండవె యెంచి చూడఁగన్ .

    వనితను గాంచిన ప్రవరుడు
    తనయూరికి మార్గమడగ తరుణియె పలికెన్
    జనసంచారమ్ముండని
    వనమునఁ దిరుగుటకు లేవె పద్ధతులు గనన్

    రిప్లయితొలగించండి
  29. అనయము తల్లిదండ్రులకు నాదరువై తన భార్య చెంత తా
    ననువుగ మెల్గ మిత్రతగ నంగజ వర్తనకే యుదాహృతై
    యనుగుగ స్నేహ భావనను యంతట నెర్పుచు సజ్జనుండు జీ
    వనమున సంచరించుటకుఁ బద్ధతు లుండవె యెంచి చూడఁగన్ ||

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. తంగిరాల రఘురామ్ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'మిత్రతగ..'...? 'ఉదాహృతి+ఐ' అన్నపుడు సంధి లేదు, యడాగమం వస్తుంది. '..యనుగుగ'.. 'అనువుగ'కు టైపాటా? 'భావనను+అంతట' అన్నపుడు సంధి నిత్యం, యడాగమం రాదు.

      తొలగించండి
    2. గురువుగారు, పద్యాన్ని సవరించాను, కాస్త చూడండి. చాలా వారాలకి నేను ఈ సైట్ లో అడుగు పెట్టాను. మీ సలహాలకి నెనర్లు!

      అనయము తల్లిదండ్రులకు నాదరువై తన భార్య చెంత తా
      ననుగుగ మెల్గి మిత్రుడయి నంగజ వర్తనకే సదానుసా
      రణమయి స్నేహ సౌరభము లంతట నెర్పుచు సజ్జనుండు జీ
      వనమున సంచరించుటకుఁ బద్ధతు లుండవె యెంచి చూడఁగన్ ||

      తొలగించండి
    3. రఘురామ్ గారూ,
      సవరించినందుకు సంతోషం.
      'అనుగుగ'...?

      తొలగించండి
    4. అనుగుగ = ప్రేమతో, ప్రియంగా అన్న అర్ధం లో వాడాను. తప్పంటారా?

      తొలగించండి
  30. కనిపించిన కన్నియగని
    వెనువెంటను తిరుగు చున్న వెధవల్లారా!
    మనసున్నమనిషికిన్ యౌ
    వ్వనమున దిరుగుటకు లేవె పద్ధతులు గనన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'యౌవనము..' అనండి.

      తొలగించండి
  31. .ఈరోజు వనసంరక్షకదినము తగిన సమస్యనిచ్చినందులకుగురువుగారికివందనములు
    . అనవరతంబు మానవుని యాశకులోబడి చెట్లు గొట్టుచున్
    మనుగడ సాగ? జీవులకు మంచిది కాదనిశాస్త్ర మెంచినా?
    “మనకిల గాలి,నీరుతగుమాత్రము నుంచు”వనాలులేక యే
    వనమున సంచరించుటకు బద్దతు లుండవె”|యెంచి చూడగన్|
    2.వనములసంరక్షణతో
    మనుషులుజీవించగలరు|”మనుగడ కరువౌ
    మనమది మరచిన”?జీవన
    వనమున దిరుగుటకులేవె?పద్ధతులుగనన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఈశ్వరప్ప గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      ఈరోజు 'వనసంరక్షణ దిన' మన్న విషయం నాకు తెలియదు సుమా!
      'శాస్త్ర మెంచినన్' అనండి.

      తొలగించండి
  32. తనువులు మరచిన జంటలు
    మనమున వెగటెత్తు నటుల మసలుచు మనిరే!
    జనులకు విహారమిడు నుప
    వనమున దిరుగుటకు లేవె పద్ధతులు గనన్!

    రిప్లయితొలగించండి
  33. మిత్రులందఱకు నమస్సులు!

    (1)
    నవకాంచిత భావమ్ములు
    నవ రీతి చమత్కృతులును నవరసములతో
    నవనవలాడెడు సుకవన

    వనమునఁ దిరుగుటకు లేవె పద్ధతులు గనన్?

    (2)
    వనమాలియు సత్యయు నం
    దన కుజముం గొనఁగఁ గాంచి తత్రతులగు నా
    వనపాలకు లడ్డి యనిరి

    "వనమునఁ దిరుగుటకు లేవె పద్ధతులు గనన్?"

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నిజమే సహదేవుఁడు గారూ! గమనించలేదు. సవరించాల్సివున్నది. సవరిస్తాను.

      తొలగించండి
    2. కవి పుంగవులు మధుసూదన్ గారు నమస్కారములు. మీ మనోహర పద్యమునకు నా ప్రాస సవరణ:
      ఇన సమ రుచి భావమ్ములు
      ననఁ బోలు చమత్కృతులును నవరసములతో
      కనకన లాడెడు సుకవన
      వనమునఁ దిరుగుటకు లేవె పద్ధతులు గనన్?

      తొలగించండి
    3. గుండు మధుసూదన్ గారూ,
      మీ రెండవ పూరణ బాగున్నది.
      సహదేవుడు గారు చెప్పకపోతే ప్రాసదోషం నా దృష్టికి రాకుండా ఉండేదేమో? కామేశ్వర రావు గారి సవరణ బాగున్నది.

      తొలగించండి
    4. సుకవి మిత్రులు పోచిరాజు కామేశ్వర రావు గారూ...నమస్సులు! మీరు సవరించిన నా పద్యము బంగారమునకు తావి యబ్బినటులున్నది. చాల అందముగ నున్నది. ధన్యవాదములు.

      గుండా వారు తెలుపగనే సవరించినాను. కాని, ఇక్కడ విద్యుదంతరాయము వలన వెంటనే పోస్టుచేయలేకపోయాను. ఐనను నా సవరించిన పూరణము పోచిరాజు వారు సవరించిన పూరణమంత బాగా రాలేదేమోనని అనుమానము పొడముచున్నది.

      సవరించిన నా మొదటి పూరణము:

      తనరారెడు భావమ్ములు
      ననఁబోఁడుల చతురిమములు నవరసములతో
      జినుఁగులఁ గులికెడు సుకవన

      వనమునఁ దిరుగుటకు లేవె పద్ధతులు గనన్?

      స్వస్తి

      తొలగించండి
    5. మధుసూదన్ గారూ,
      సవరించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      పోచిరాజు వారి సవరణతో పోల్చి చూడకండి... ఎవరి శైలి వారిదే! స్వస్తి!

      తొలగించండి
    6. కవి పుంగవులు మధుసూదన్ గారు నమస్సులు. మీ పద్యములో ప్రాస సంబంధపదములను మాత్రము మార్చాలనుకున్నాను. "నన" పదైకత్వము నాకు సంతోషము కల్గించినది. మీ పూరణ చక్కగనున్నది. అబినందనలు.

      తొలగించండి
    7. సంతోషమండీ కామేశ్వర రావు గారూ! ధన్యవాదములు!

      తొలగించండి
  34. అనయము మానసమ్మున నహంకృతి మెండుకొనంగ దుష్టుడై
    వినయ విధేయతల్ విడి పవిత్రత మంటలఁద్రోసి, పెండ్లికై
    వనజదళాయు తాక్షులను పట్టుట సాధ్యమె? యెవ్వరైన యౌ
    వ్వనమున సంచరించుటకుఁబద్ధతులుండవె యెంచి చూడగన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్నపరెడ్డి వారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'యౌవనమున' అనండి.

      తొలగించండి
  35. నా మూఁడవ పూరణము:

    వినయము సాధువర్తనము విజ్ఞత పుస్తక పాఠనమ్మునున్
    మనిషి మనీషిగా నెదుగు మంచితనమ్మును మేధయున్ సులో
    చన మగు నట్టి గణ్య ఘనశాలియు శీలియు నైన జ్ఞాన జీ

    వనమున సంచరించుటకుఁ బద్ధతులుండవె యెంచి చూడఁగన్?

    రిప్లయితొలగించండి
  36. అనయము నొజ్జఁజెంత వినయమ్ముగ మెల్గక మోక్షమబ్బునే
    మనమున సత్యమెంచకయు మాధవ భక్తినొకింత లేకయున్
    తనదగు శాస్త్ర జ్ఞానమున దాటగ వచ్చునె కర్మపాశముల్
    వనమున సంచరించుటకుఁ బద్ధతు లుండవె యెంచి చూడఁగన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రవికిరణ్ తాతా గారూ,
      శంకరాభరణం బ్లాగు మీకు స్వాగతం పలుకుతున్నది.
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'కర్మబద్ధ జీ।వనమున..' అంటే బాగుంటుందేమో?

      తొలగించండి
  37. వనమున నడ్డముగ నడచి
    వనలతలను ద్రుంచబోకు వసుధన్ హాయిన్
    యొనగూర్చెడి తావులరయ
    వనమున దిరుగుటకు లేవే పద్ధతులు గనన్.

    2.వనమున క్రూరమృగమ్ములు
    కనపడుచుండును తెలియక కాలిడినంతన్
    కనలుచు హింసించు సుమా
    వనమున దిరుగుటకు లేవే పద్ధతులు గనన్.

    3వనభోజనములకనుచును
    ననయము పనులతొ విసిగిన యతివలు వేడ్కన్
    మనముప్పొంగగ చనిరట
    వనమున దిరుగుటకు లేవే.పద్ధతులు గనన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. బల్లూరి ఉమాదేవి గారూ,
      మీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      'హాయిన్+ఒనగూర్భు' అన్నపుడు యడాగమం రాదు. 'హాయి। న్నొనగూర్చు..' అనండి. 'పనులతొ' అని తో ప్రత్యయాన్ని హ్రస్వంగా ప్రయోగించరాదు. '...ననయమ్ము పనుల విసిగిన..' అనండి.

      తొలగించండి
  38. వినడెంత జెప్పి చూచిన
    తను మారక కారు నడుప త్రాగిన వాడై
    కను బోయె నహో! సుర సే
    వనమునఁ దిరుగుటకు లేవె పద్ధతులు గనన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సహదేవుడు గారూ,
      మద్యం సేవించి తిరగడానకి పద్ధతులున్నాయన్న మీ పూరణ వైవిధ్యంగా ఉంది. అభినందనలు.

      తొలగించండి
  39. ఘనవేదండము కరిణీ
    జనసంహితమై మదమున జలముల నాడన్
    జనియా మకరికి జిక్కెన్
    వనమునదిరుగుటకు లేవె పద్ధతులు దగన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అశ్వత్థ నారాయణ మూర్తి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ఇక్కడ వనమంటే జలమన్న అర్థమూ ఉంది. నీళ్ళలో దిగడానికి పద్ధలున్నాయి కదా! అని మీ భావం. బాగుంది.

      తొలగించండి
  40. మనమున నీతి ధర్మములు మానవు లందున మాయమాయెగా
    వినరది యెంత చెప్పిన వివేకము యున్నను మొండి వాదనల్
    పనిగొని చేయుచుందు రిల వారల తత్వము మారదేమి? జీ
    వనమున సంచరించుటకుఁబద్ధతులుండవె యెంచి చూడగన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గండూరి లక్ష్మినారాయణ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'వివేకము+ఉన్నను' అన్నపుడు సంధి నిత్యం. యడాగమం రాదు. అక్కడ 'వివేకము గల్గియు' అనండి.

      తొలగించండి
  41. వనమున్ మృగముల, జీవుల

    గనగా వనశాఖ వారి కారుల యందున్

    యనుమతితో వెళ్ల వలయు

    వనముల దిరుగుటకు లేవె పద్ధతులు గనన్ ?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పిన్నక నాగేశ్వర రావు గారూ,
      నిజమే! అభయారణ్యాలను సందర్శించాలంటే అందుకు సంబంధించిన అనుమతి కావాలి. వారి పద్ధతులను పాటించాలి. బాగుంది మీ పూరణ. అభినందనలు.
      'జీవుల గనగన్' అనండి. '...యందున్+అనుమతి' అన్నపుడు యడాగమం రాదు. '...యందు। న్ననుమతి..' అనవచ్చు.

      తొలగించండి
    2. గురువులు శంకరయ్య గారికి ధన్యవాదములు.
      మీ సూచన ప్రకారం మరలపంపు చున్నాను.

      వనమున్ మృగముల, జీవుల

      గనగన్ వన శాఖవారి కారుల యందు

      న్ననుమతితో వెళ్ల వలయు

      వనముల దిరుగుటకు లేవె పద్ధతులుగనన్ ?

      తొలగించండి
  42. మునుపట యాజ్ఞసేనికనుమోదము సల్పగ భీమసేనుడా
    వనములజేరి భీకరరవంబులు సేసి వినోద మానసం
    బునజరియింప నుల్కి కపిపుంగవు డెంతయు బుద్ధిసెప్పుచో
    వనమున సంచరించుటకుఁ బద్ధతు లుండవె యెంచి చూడఁగన్"

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అశ్వత్థ నారాయణ మూర్తి గారూ,
      సౌగంధికా వృత్తాంతాన్ని ప్రస్తావించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  43. వనమున్ మృగముల, జీవుల

    గనగా వనశాఖ వారి కారుల యందున్

    యనుమతితో వెళ్ల వలయు

    వనముల దిరుగుటకు లేవె పద్ధతులు గనన్ ?

    రిప్లయితొలగించండి
  44. జనమున సంచరించుటకు జాగ్రత లుండును నెంచి చూడగన్
    మనమున సంచరించుటకు మార్గము లుండును నెంచి చూడగన్
    కనుముర మూఢు డిచ్చటను కాంగ్రెసు నేతకు రాజకీయమౌ
    వనమున సంచరించుటకుఁ బద్ధతు లుండవె యెంచి చూడఁగన్!

    రిప్లయితొలగించండి

  45. చనుచును బస్సులందు మహ చక్కగ దువ్వుచు నూగుమీసముల్
    వెనుకను జేరి వేణులను వెఱ్రిగ లాగుచు నెత్తి తిప్పగా
    కనులను కొట్టి భామలకు కాళ్ళకు మ్రొక్కెడి రీతులందు యౌ
    వనమున సంచరించుటకుఁ బద్ధతు లుండవె యెంచి చూడఁగన్

    రిప్లయితొలగించండి