6, సెప్టెంబర్ 2016, మంగళవారం

దత్తపది - 97 (సుర-నర-వానర-దానవ)

కవిమిత్రులారా, 
సుర - నర - వానర - దానవ
పై పదాలను అన్యార్థంలో ప్రయోగిస్తూ 
రామాయణార్థంలో
మీకు నచ్చిన ఛందస్సులో పద్యాన్ని వ్రాయండి. 

89 కామెంట్‌లు:

  1. భాసుర లీల బాడగ సెబాసను గాథను మూడు మాటలన్
    కాసుకొనంగ రమ్ము యవి కట్టెను కొట్టెను తెచ్చెనం చనన్
    ఓసి యిదేమి వింత వినవానర లోకపు పుణ్యగాథయౌ
    వాసిగ గట్టె వారధిని వచ్చెను దోషిని గొట్టి సీతనున్
    దాసిన రక్కసున్ దునిమి దా నవ రీతిని బంచె నీతికిన్
    పూసిన పూవుగానరయ పూజ్యము రాముని గాథయే సుమీ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పిట్టా సత్యనారాయణ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'కోసుకొని, దాసిన' గ్రామ్యాలు. 'రమ్ము+అవి' అన్నప్పుడు సంధి నిత్యం, యడాగమం రాదు.

      తొలగించండి
  2. భా'సుర'త ద'నర' మారుతి
    యాసుగ్రీ'వానఁ ర'యముఁ నౌదల దాల్ప
    న్నాసంద్రంబెగిసెననా
    యాసంబుగ'దాఁ నవా'రితావేశముతోన్

    రిప్లయితొలగించండి
  3. భాసురత దనర మారుతి
    యాసుగ్రీవాన రయము నౌదల దాల్చ
    న్నాసంద్రం బెగిసెననా
    యాసంబుగ, దాఁ నవారితావేశము తోన్

    రిప్లయితొలగించండి
  4. భాసురత దనర మారుతి
    యాసుగ్రీవానఁ రయము నౌదలదాల్ప
    న్నాసంద్రంబెగిసె ననా
    యాసంబుగఁ దానవారితావేశముతోన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అశ్వత్థ నారాయణ మూర్తి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'సుగ్రీవ+ఆన' దుష్ట సమాసం. సంధి కూడ 'సుగ్రీవు నాన' అవుతుంది.

      తొలగించండి
    2. భాసురత దనర మారుతి
      వాసిగఁ ప్రభువా నఁ రయము నౌదలదాల్ప
      న్నాసంద్రంబెగిసె ననా
      యాసంబుగఁ దానవారితావేశముతోన్
      గురువుగారు ఈవిధంగా మార్చాను.చిత్తగించ ప్రార్థన

      తొలగించండి
    3. సవరించిన పూరణ బాగున్నది. అభినందనలు.
      ప్రభువాన.. తరువాత అరసున్నా అవసరం లేదు.

      తొలగించండి
  5. దానవ పతి రావణుకే
    మానర!యని హనుమయె తగ మంచిని జెప్పన్
    పో!నాకే తెలుసురయని
    వానర! యని పరిహసించి వాలము గాల్చెన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శాస్త్రి గారు దానవ,వానర పదములు వేరే యర్థములలో ప్రయోగించండి.

      తొలగించండి
    2. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      కామేశ్వరరావు గారి సూచన పాటించండి.

      తొలగించండి
    3. ధన్యవాదములండీ...నిబంధనను సరిగా చూడలేదు.
      మార్చినాను.

      దాన వనితనే పట్టుట
      మానర!యని రావణునకు మారుతి చెప్పన్
      పో!నాకే తెలుసుర,కల
      వా!నరమున శక్తులనుచు పడిపడి తిట్టెన్.

      తొలగించండి
    4. గోలి వారూ,
      సవరించినందుకు సంతోషం! కాని 'దాన'...?

      తొలగించండి
  6. రామ చరితము గనగా సురమ్యమైన
    లలిత గమనాన రవళించు కలిత గాథ
    నవ్య భావాన రసమయ కావ్య మగుచు
    వెలుగు లందించదా! నవ లీల లెగసి!

    రిప్లయితొలగించండి
  7. 'అన్యార్థంలో ప్రయోగిస్తూ' అంటే ఏమిటి?

    రిప్లయితొలగించండి
  8. ఇచ్చిన పదాలకున్న అర్థం కాకుండా వేరర్థంలో పూరించాలి....పై పద్యములను పరిశీలించండి..తెలుస్తుంది

    రిప్లయితొలగించండి

  9. "సుర"స నోడించె హనుమంతు శోభలలర;
    వాన రణమున కురిసిన వంటి రీతి
    "నర" న రమ్ముల శూలాలు నాట కపులు
    "దాన వ"డలిన రాక్షస దండు జచ్చె!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. టేకుమళ్ళ వెంకటప్పయ్య గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      డు ప్రత్యయం లేకుండా హనుమంతు అన్నారు. అక్కడ మారుతి అనండి. రాక్షస దండు... దుష్ట సమాసం. రక్కసి దండు.. అనండి.

      తొలగించండి
  10. ప్రమదానవరత ఘన రత
    రమణి చెలువపు పరువాన రగులుచు నంతన్
    సుమనోహర భాసుర ఘన
    విమలాంచిత రూపు రాము వేడెను బతిగా

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శూర్పణఖ ఘననీల శ్యాముని రాముని చూచిన సందర్భము:

      తొలగించండి
    2. పోచిరాజు కామేశ్వరరావు గారూ,
      అమోఘమైన పూరణ. దత్త పదాలు అద్భుతంగా ఒదగిపోయాయి. అభినందనలు.

      తొలగించండి
    3. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు.

      తొలగించండి

  11. వాసుర,తండ్రి యాన రఘువర్యుడు,దా,నవకోమలాంగియౌ
    భూసుత సీత,లక్ష్మణుడు పొత్తుగ దావము కేగి రావణున్
    వాసిగ జంప పుష్పముల వాన రయమ్మున రాల్చె వేలుపుల్,
    దాసుడు మారుతాత్మజుడు తన్మయమందుచు భక్తి పాడగన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. తిమ్మాజీ రావు గారు నమస్సులు. "వాసుర" ధరణి యన్న యర్థములో వాడినట్లయితే " వాసురఁ దండ్రియాన" అంటే యన్వయము బాగుంటుందనుకుంటాను.

      తొలగించండి
    2. శ్రీయుతులు కామేస్వర రావు గారికి,
      ధన్యవాదములు మీ సూచనమేరకు సవరించిన పద్యము
      "అరసున్న"గుర్తు లేని కారణమున అరసున్న చూపలేదు

      వాసుర,దండ్రి యాన రఘువర్యుడు,దా,నవకోమలాంగియౌ
      భూసుత సీత,లక్ష్మణుడు పొత్తుగ దావము కేగి రావణున్
      వాసిగ జంప పుష్పముల వాన రయమ్మున రాల్చె వేలుపుల్,
      దాసుడు మారుతాత్మజుడు తన్మయమందుచు భక్తి పాడగన్

      తొలగించండి
    3. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
    4. ధన్యవాదములండి. అలాగే "భక్తిఁ బాడగన్" అనండి.

      తొలగించండి
  12. గు రు మూ ర్తి ఆ చా రి
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

    { శూ ర్ప న ఖ రా ము ని తో }
    ……………………………………………


    త్రాసము మాను | కామ సుఖదా !

    ………… నవయి౦చకు నన్ను | కౌగిలిన్

    వాసము జేసి , తేలు మల స్వర్గము లోన |

    ………… రవ౦త జా గ దే

    లా ? సురత క్రియన్ దనియ రా |

    …………… మధు వానర | రామ ! వీడుమా

    భూసుత ని౦క | శూర్పనఖ పొ౦గులు స్వాగత

    ………………… మిచ్చు చు౦డెరా !

    { త్రాసము = భయము వలన తాత్సారము ;
    నవయి౦చకు = బాధి౦చకుము ;
    సురతక్రియ = కామ క్రీడ ; }

    రిప్లయితొలగించండి
  13. మనసు రమియింపజేసెడు మహిత యశుడ!
    నరములుప్పొంగు తేజంపు ధరణిప్రియుడ!
    జానకి కి సదా నవరాగ చంద్రమూర్తి!
    వరములీయగ కనరావా!నరసఖుండ!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పొన్నెకంటి సూర్య నారాయణ రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      చివరి పాదంలో 'కనరావా' అన్నచోట గణదోషం. వరము లీయగ గానవా... అనండి.

      తొలగించండి


  14. మనసు రమణుని గన రమణి
    తనువా నరసింహమును జతగన తపించెన్
    కనుదో యి సదా నవ మో
    హన రాముని నిలుప మోము హాయిని పొందెన్

    జిలేబి

    రిప్లయితొలగించండి
  15. రక్కసుల నరకము జేర్చి రాముడంత
    భాసురమగు యశము తోడ భార్యను గొన
    కురిసె విరుల వాన రహిని గొలుప! పౌరు
    లదె కదా నవ శకమున కాది యనిరి!

    రిప్లయితొలగించండి
  16. ముసురగ రాక్షసుల్|”హనుమ మూకను తోకనుజుట్టికొట్టగా
    అసురులబాధలే నరకయాతన|లంకకుచేటువచ్చె|మా
    మిసుగును దీర్చవా ?నరకమేగద చూడగ రమ్మురావణా
    మసనము గాద పట్టణము మార్చు సదా నవరాత్రు లందునే {మిసుగు=భయము;మసనము=వల్లకాడు}

    రిప్లయితొలగించండి
  17. తనరెడునసురలదండించగపియు
    దానవంచియుతోకదగ్ధమొనర్చి

    వానరప్రముఖుడువాయువేగమున
    లంకయంతనుగూడలంకించెనపుడు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పోచిరాజు సుబ్బారావు గారూ,
      మీ ద్విపద పూరణ బాగున్నది.
      అసురుల అనడం సాధువు. అసురల... అనరాదు. అన్యార్థంలో వానరలో నర ఉంది. మరి వానర శబ్దం?

      తొలగించండి
  18. కడలి దానవలీలగా దాటగల వాడు
    . ఘనరఘు రాముని కాంతవెదక
    పయనించె గగనాన పక్షిరాజును బోలి
    . వాయువేగమ్మున పవన సుతుడు
    గిరిరాజు గలిసెను సురసనోడించెను
    . సింహికను వధించి చేరెలంక
    కడుపాటవాన రక్కసి లంఖిని గూల్చె
    . గాంచె జానకినశోక వని లోన

    శోకమూర్తి గాంచె నాకపి యచ్చోట
    రాముగూర్చిదెలిపె రమణి కప్పు
    డంగుళీయకమ్మునంగన కిచ్చెను
    వనము జెరిచి చేసె భండనమ్ము

    నిన్నటి పూరణము

    శివసుతుగాంచి నవ్విన శశిన్ గనినంతనె మానవాళికి
    న్నవనిన నిందతప్పదని యాగ్రహమందున శాపమిచ్చెనా
    భవసతి యంచు మానిరిల భాద్రపదమ్మున శుక్లపక్షపుం
    జవితిని జంద్రదర్శనము, సర్యశుభమ్ము లొసంగు మానవా
    భవసిగ పువ్వు నాశ్వయుజ పౌర్ణమి రేయిన గాంచినన్నిలన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. విరించి గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      మొదటి పూరణలో దానవ శబ్దం కనిపించలేదు.
      రెండవ పూరణలో భవసిగ అనడం దుష్ట సమాసం. భవు సిగ.. అనండి. అలాగే అవనిని అనాలి.

      తొలగించండి
    2. గురువు గారికి ధన్యవాదములు

      కడలి దానవలీల గా అని మొదటి పాదమందే గలదండి

      తొలగించండి
    3. నిజమే... నేను గమనించలేదు. మన్నించండి.

      తొలగించండి
  19. రిప్లయిలు
    1. అశ్వత్థ నారాయణ మూర్తి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మొదటి పాదంలో గణదోషం. మనసు రంజిల్లగ... అనండి.

      తొలగించండి
  20. దాసు రయమున సీతమ్మతల్లి జాడ
    దక్షిణమ్ము నరసి తెలుప దండు కదలి
    శస్త్రముల వాన రణమున జాలు వార్చ
    జయముఁ దా నవలామణిన్ స్వామి పొందె

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  21. భూరి వేడ్కతో గణపతి పూజ సేసి
    కథను వినిన జాలు శమంత కమణి గాథ
    భక్తితో, భాద్రపద శుక్లపక్షమందు
    చవితి చంద్రుఁడు శుభముల సర్వ మొసఁగు

    న్నటి తేటగీతి సమస్యకు నా పూరణము

    రిప్లయితొలగించండి
  22. యసుర వాహిని నెదురించు యవసరమున
    నరులు సమకూర్చితిరి కదా నవపుసేన
    దానవా నరవానర సేనపైన
    తగున రణము చేసి పురము తగులబెట్ట

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మొదటి పాదాన్ని యడాగమంతో ప్రారంభించారు. ఆ పాదానికి నా సవరణ "అసుర వాహిని నెదిరించు నవసరమున".

      తొలగించండి
    2. క్రిందిపాదాన్ని పైకి మార్చటం వలన అలాజరిగింది.గురువర్యుల సవరణకు ధన్యవాదములు.

      తొలగించండి
  23. .సీ.
    మన'సురం'జిల్లగ మ'నర'ఘు రాముని
    కళ్యాణమట పేర్మి కనగ రండు
    రత్నమణుల'వాన ర'మణీయ రీతుల
    వర్షింతు రట చూపు పడగ రండు
    'దాన వా'యనములు దండిగా నిత్తురు
    కోరి పోదము దెచ్చు కొనగ రండు
    సురలందు మునులందు చూడామణుల వంటి
    వారల జూడంగ వలెను రండు
    ఆ.వె
    యెంత గనిన నరుల కంత పుణ్యము వచ్చు
    జన్మ ధన్య మగును జనిన యంత
    జనకసుతకు రామ చంద్రునకు జరుగు
    పరిణయంబు పరమ పావనంబు

    గణదోషం పరిహరించాను.చిత్తగించప్రార్థన

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పద్యము కడు రమ్యముగా నున్నది. అయితే మొదటి పాదంలో "సుర" పదం వాడవలసి యుండగా "సురం" అని వాడినట్లయి నియమ భంగమైన దనుకొంటున్నాను. విజ్ఞులేమంటారో ?

      తొలగించండి
    2. నిజానికి దోషమే! కాని మరీ అంత కచ్చితంగా ఉంటే ఔత్సాహికులు ఇబ్బంది పడతారు. అందుకని చూసి చూడనట్టు ఉండడమే!
      అంతే కాదు... మిత్రుల పూరణలను సమగ్రంగా పరిశీలించి దోషాలనన్నిటినీ పేర్కొంటే కొందరు నిరుత్సాహపడి పద్యరచనకు దూరం అయ్యే అవకాశాలున్నవి. అందుకని కొన్నిటిని నేను పట్టించుకోను. కొన్ని దోషాలు నా పరధ్యానం, ఏకాగ్రతా లోపం, నా అజ్ఞానం వల్ల గుర్తింపబడక పోవచ్చు.

      తొలగించండి
  24. నరుని రూపాన రాముడు ధరణి పైన

    అసుర జాతిని హతమార్చె నక్కజముగ

    వానరుల సాయమందగ వార్ధి దాటి

    దానవాటవి దహియించె దర్ప మణచి.

    విద్వాన్, డాక్టర్ మూలె.రామమునిరెడ్డి.విశ్రాంత తెలుగు పండితులు. ప్రొద్దుటూరు కడప జిల్లా.7396564549.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. మూలె రామముని రెడ్డి గారూ,
      పద్యం బాగున్నది. కాని దత్త పదాలను అన్యార్థంలో ప్రయోగించాలన్నది మీరు గమనించినట్టు లేదు.

      తొలగించండి
  25. భాసుర మతితోడ పవమాన తనయుండు
    వానరపతి మాట పైన సాగి
    వానరముల గూడి వారిధి దాటుచూ
    దా,నవఫలములను తమిని గాంచె.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. బల్లూరి ఉమాదేవి గారూ,
      ఎందుకో మీ పూరణ నిన్న నా దృష్టిపథంలోనికి రాలేదు. మన్నించండి.
      మీ పూరణ బాగుంది. అభినందనలు.
      'దాటుచున్' అనండి. 'వానర' శబ్దాన్ని స్వార్థంలోనే ప్రయోగించారు.

      తొలగించండి
  26. అసురు డైన రావ ణాసురు డక్కసు

    చేత నరుని పత్ని( జెరను బట్టె;

    వానర బలమంత వారధి లంఘించి

    దానవులను వేగ దర్ప మణచె.

    విద్వాన్,డాక్టర్ మూలె.రామముని రెడ్డి,విశ్రాంత తెలుగు పండితులు,ప్రొద్దుటూరు,కడప జిల్లా 7396564549.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మూలె రామముని రెడ్డి గారూ,
      ఈ పూరణలోను దత్తపదాలను స్వార్థంలో వినియోగించారు. అన్యార్థంలో ప్రయోగించాలని కదా నియమం.

      తొలగించండి
  27. ధన్యవాదములండీ...నిబంధనను సరిగా చూడలేదు.
    మార్చినాను.

    దాన వనితనే పట్టుట
    మానర!యని రావణునకు మారుతి చెప్పన్
    పో!నాకే తెలుసుర,కల
    వా!నరమున శక్తులనుచు పడిపడి తిట్టెన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మాస్టరుగారూ! ధన్యవాదములు. ఆంధ్రభారతి నిఘంటువులో Thereby, hereby. దాన.ఆవిధముగా... అని ఉన్నది.

      తొలగించండి
    2. దాన (కనుక, కాబట్టి, దాని వలన, దానిచేత) ఎప్పుడు ప్రయుక్తమౌతుంది? అంతకు ముందొక విషయం చెప్పి ... దానిని సమర్థించడానికి కదా!

      తొలగించండి
    3. మాస్టరుగారూ! నమస్తే..హనుమంతుడు హితబోధ చేస్తూ...మధ్యలో ..మీసూచనతో చిన్న సవరణ చేస్తున్నను.చెప్పినట్లుభావించాను.

      రావణుని అహంకారము.

      మానవతిదా నవనిజను
      మానర!చెఱబట్టుటనుచు మారుతి చెప్పన్
      పో!నాకే తెలుసుర,కల
      వా!నరమున శక్తులనుచు పడిపడి తిట్టెన్.

      తొలగించండి
  28. భాసుర సూర్యవంశ మున పావన నాముడు రాముడే కదా
    దాసుల గావగా నరయ దాశరధీ తనయుండుగా నిలన్
    వాసులు వానరా దిపులు వాసిగ వారధి కట్టగా నదే
    రాసులుగా నుదాటిరిగ రావణుగూల్చగచేరెలంకనే

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. వడ్డూరి రామకృష్ణ గారూ,
      బాగుంది మీ పూరణ. అభినందనలు.
      'దానవ' పదం కనిపించలేదు. 'వానరాదిపులు'...? వావర శబ్దాన్ని అన్యార్థంలో ప్రయోగించాలి కదా!

      తొలగించండి
  29. తే.గీ.మనసు రవళించు పులకించు వినిన యంత
    మాన రహితులె ఆలింప బూను కొనరు
    పూల వాన రహి ముదము గ్రోల గలము
    రామ కథ విన దా నవ రసమయమగు
    రహి = విధము (శబ్ద రత్నాకరము)

    రిప్లయితొలగించండి
  30. సాధారణంగా అవధానాల్లో దత్తపది అంశం నిర్వహణలో ఇచ్చిన పదములను అదే క్రమంలో ఉపయోగీస్తారు అవధానులు.అనగా మొదటి పదం మొదటి పాదంలో, రెండవ పదం రెండవ పాదంలో .... అలా ! మనమూ అదే పద్ధతి పాటిస్తే బాగుంటుంది.

    రిప్లయితొలగించండి
  31. జనార్దన రావు గారూ,
    సాధారణంగా దత్తపదాలను ఇవ్వగానే అవధాని పృచ్ఛకుని అడుగుతాడు "ఆ పదాలను అదే వరుసలో ప్రయోగించాలా?" అని. పృచ్ఛకుడు ఒక్కొక్కసారి అదే వరుస అంటాడు. లేదా మీ యిష్టం అంటాడు. అతడిచ్చే సమాధానాన్ని బట్టి అవధాని ముందుకు పొతాడు.
    మన బ్లాగులో అడిగి కొనసాగే సంప్రదాయం లేదు కనుక పూరణ చేసేవారికి స్వేచ్ఛ ఉంది.

    రిప్లయితొలగించండి
  32. శా. గుట్కా సేవన మెంత హాని కరమో గుర్తించి మానన్వలెన్
    మట్కా జూదము మోసపూరితమెగా మానన్వలెన్ శీఘ్రమున్
    చిట్కా వైద్యము మేలు చేయుగదరా చింతించి తర్కించినన్
    జట్కా యానము హాయి గొల్పుచు సదా చాల ప్రియమ్మౌనుగా !
    పై పద్యంలోని నాలుగు పాదాల్లోని నాలుగంశాలూ దేనికదే.ఒకదానితో మరొక దానికి సంబంధం లేదు. అయితే ఒక్కొక్కటీ ఒక్కొక్క సమస్యగా ఇవ్వ వచ్చని నా భావన. పెద్దలేమంటారో?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఏపాదానికి ఆ పాదం బాగానే ఉన్నాయి. కాని సమస్య ఏమున్నది. అసంగతమో, అసత్యమో అయిన విషయం సమస్యగా ఇవ్వాలి కదా!
      ఇలా చెప్పవచ్చు...
      గుట్కా సేవన మెంత మే లొసగునో గుర్తించుమా మానకే
      మట్కా జూదము లార్షవిద్య లనగా మన్నించె వేదమ్ములే
      చిట్కా వైద్యము మేలుసేయు నెటులన్ జింతించి తర్కించినన్
      జట్కా యానము చేసి చేరవలెరా జాపాను దేశమ్మునున్.

      తొలగించండి
    2. డా.సీ.వీ.సుబ్బన్న శతావధాని రచించిన "అవధాన విద్య" అనే గ్రంథము లో సమస్య అనే విభాగంలో సమస్యా పూరణకు చెందిన భిన్న చమత్కృతులు చర్చింప బడినవి.
      అవి. 1)పద సమాస వాక్య చమత్కృతి 2)నూతన కల్పనా చమత్కృతి 3)క్రమాలంకార చమత్కృతి 4)శ్లేష చమత్కృతి 5)ప్రాస చమత్కృతి6)సాంకేతిక చమత్కృతి7)అపహాస్య చమత్కృతి8)అర్థాంతరాన్యాస చమత్కృతి9)కాకుస్వర చమత్కృతి10)శబ్దగతార్థ చమత్కృతి11)లోకోక్తి చమత్కృతి 12)లోకజ్ఞతా చమత్కృతి 13)చారిత్రక చమత్కృతి 14)పౌనరుక్త్య చమత్కృతి 15)ఛందో నిగూఢ చమత్కృతి.
      మరికొన్ని కూడా ఉండ వచ్చును.ఏ సమస్య ఏ చమత్కారానికి ఒదిగి వస్తుందో ఆచమత్కృతి నెంచుకుని అవధాని పూరిస్తాడు.పృచ్చకుడుద్దేశించిన చమత్కృతిలోనే పూరించాలనేమీ లేదు.ఉదాహరణకు పృచ్చకుడు పద సమాస వాక్య చమత్కృతిలో సమస్య నిస్తే అవధానికి సరియైన పూరణ స్ఫురించక క్రమాలంకార చమత్కృతిని ఆశ్రయించ వచ్చు.
      నా పద్యములోని ఒక్కొక్క పాదమును ప్రాస చమత్కృతిగా తీసుకొన వచ్చు. కొన్ని ప్రాస పదాలు కవికి దొరికినా వాటికి సరియైన అన్వయం కల్పించుట లోనే అతని ప్రతిభ బయట పడుతుంది కదా ! సమస్య లోని అంశముతప్పని సరిగా అసంగతమో, అసత్యమో అయిఉండాలనే నియమమేదీ లేదు. పై చమత్కృతులలో ఏదో ఒక దానికి సంబంధించినదై ఉండవచ్చు. లేదా ఒక నూతన చమత్కృతిని పృచ్చకుడు ఆవిష్కరించ వచ్చు.

      తొలగించండి
  33. అన్నయ్యగారూ నాపద్యం చూసినట్లు లేదనుకొంటానండీ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నిన్న ఎందుకో తప్పిపోయింది. ఇప్పుడు స్పందించాను. పైన చూడండి...

      తొలగించండి
  34. ప్రాస చమత్కృతికి సంబంధించిన సమస్యలకు ఉదాహరణలు.దీనికి మరొక భిన్న చమత్కృతిని కూడా పృచ్చకుడు జోడిస్తే కవి (అవధాని) పని మరింత కష్టతర మౌతుంది.
    1)బంగ్లా మీదికి దారి జూపగలవా భామా శిరోరత్నమా !
    2)పండ్రంగిచ్చటి కెంత దవ్వు చెపుమా పంకేజ పత్రేక్షణా !
    3)యోషాక్లీబులు గూడ బుట్టె జగమెల్ల్లన్ దాన్.
    4)జగద్వ్యాప్తము లయ్యెనిరులు ఖరకరు దుండన్.
    5) మూర్ఖుండొక్కడు రాజుగా నయినచో ముల్లోకముల్ వేగవే ?
    6)తుంక్త్వా ప్రత్యయముల్ రసజ్ఞమతి కెందుం దుష్టి జేకూర్చునే
    పై వాటిలో మూడవ, నాల్గవ సమస్యలకు ఛందో నిగూఢ చమత్కృతి కూడా జోడింప బడటం గమనింప వచ్చు.
    ఒకటవ ,రెండవ, ఐదవ సమస్యల్లోని అంశాలు సర్వ సాధారణమైన విషయాలే కానీ వాటిలో ఎటువంటి అసంగత్వం,అసత్యం, అనౌచిత్యం లేకపోవటం గమనింప వచ్చు.ఇటువంటి ఉదాహరణలు కొల్లలుగా లభ్యమౌతున్నాయి.స్పందన కొరకు ఎదురు చూస్తున్నాను.(మీ సూచనలు,సలహాలు పాల్గొను వారికి ఎంతో ఉపయుక్తంగా ఉంటున్నాయి. అభినందనలు స్వీకరించండి.)

    రిప్లయితొలగించండి
  35. ప్రాస చమత్కృతికి సంబంధించిన సమస్యలకు ఉదాహరణలు.దీనికి మరొక భిన్న చమత్కృతిని కూడా పృచ్చకుడు జోడిస్తే కవి (అవధాని) పని మరింత కష్టతర మౌతుంది.
    1)బంగ్లా మీదికి దారి జూపగలవా భామా శిరోరత్నమా !
    2)పండ్రంగిచ్చటి కెంత దవ్వు చెపుమా పంకేజ పత్రేక్షణా !
    3)యోషాక్లీబులు గూడ బుట్టె జగమెల్ల్లన్ దాన్.
    4)జగద్వ్యాప్తము లయ్యెనిరులు ఖరకరు దుండన్.
    5) మూర్ఖుండొక్కడు రాజుగా నయినచో ముల్లోకముల్ వేగవే ?
    6)తుంక్త్వా ప్రత్యయముల్ రసజ్ఞమతి కెందుం దుష్టి జేకూర్చునే
    పై వాటిలో మూడవ, నాల్గవ సమస్యలకు ఛందో నిగూఢ చమత్కృతి కూడా జోడింప బడటం గమనింప వచ్చు.
    ఒకటవ ,రెండవ, ఐదవ సమస్యల్లోని అంశాలు సర్వ సాధారణమైన విషయాలే కానీ వాటిలో ఎటువంటి అసంగత్వం,అసత్యం, అనౌచిత్యం లేకపోవటం గమనింప వచ్చు.
    మరివీటిలోని సమస్యేమిటయ్యా అంటే ప్రాస నిర్వహణమే అసలు సమస్య.ఇటువంటి ఉదాహరణలు కొల్లలుగా లభ్యమౌతున్నాయి.స్పందన కొరకు ఎదురు చూస్తున్నాను.(మీ సూచనలు,సలహాలు పాల్గొను వారికి ఎంతో ఉపయుక్తంగా ఉంటున్నాయి. అభినందనలు స్వీకరించండి.)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జనార్దన రావు గారూ,
      ధన్యవాదాలు.
      పైన పేర్కొన్న సమస్యలన్నీ నేను సేకరించి వ్రాసి పెట్టుకున్న వాటిలో ఉన్నాయి. మన బ్లాగులో పద్యాలు వ్రాసేవారిలో ఎక్కువమంది ఔత్సాహికులే. అందువల్ల దుష్కర ప్రాసతో కూడిన సమస్యలను ప్రస్తుతం ఇవ్వడం లేదు. కొంతకాలం తర్వాత అప్పుడప్పుడు ఇటువంటి సమస్యలను ఇస్తాను.

      తొలగించండి