16, నవంబర్ 2017, గురువారం

దత్తపది - 126 (దొర-డబ్బు-అప్పు-వడ్డి)

దొర - డబ్బు - అప్పు - వడ్డి
పై పదాలను ఉపయోగిస్తూ
ఋణగ్రస్తుని బాధను వర్ణిస్తూ
నచ్చిన ఛందస్సులో పద్యాన్ని వ్రాయండి.
(పై పదాలను అన్యార్థంలోనే ఉపయోగించాలన్న నియమమేమీ లేదు.
 అన్యార్థంలొ ఉపయోగిస్తే సంతోషం!)

80 కామెంట్‌లు:

 1. అప్పుడు చేసిన యప్పులు
  గొప్పగ డబుడబ్బు కొట్టి; కొంపలు ముంచ
  న్నిప్పుడు వడ్డించునురా!
  తప్పుడు పనులకు దొరకవె ధరలో శిక్షల్?

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ప్రభాకర శాస్త్రి గారూ,
   దత్తపదాలను అన్యార్థంలో ప్రయోగిస్తూ చక్కని పూరణతో శుభారంభం చేశారు. అభినందనలు.

   తొలగించండి
 2. దొరయె దూఱగ కన్నీరు దొరలు చుండె
  డబ్బు దొరకదు శాంతి నేడబ్బుటెటుల?
  అప్పుడప్పుడు చేసిన యప్పు వలన
  వడ్డి మేరు శిఖరి వోలె వడ్డివాఱె

  రిప్లయితొలగించండి
 3. ఎల్లలోకములకు యేలికయౌదొర
  పెండ్లి జేసికొనగ పేర్మితోడ
  చక్రవడ్డి దాను జమచేయు నట్టుల
  నప్పుజేసె డబ్బు నాలికొరకు

  రిప్లయితొలగించండి
 4. "దొర"కినదెచాలు ఋణమవసరమునయని
  ముదమునకును తో"డబ్బు"రమొందిఁగొంటి
  "నప్పు"డాలోచనయెలేక యిప్పుడికను
  "వడ్డి"కాసులవాడె కావవలె నన్ను

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సూర్యనారాయణ గారూ,
   మూడు పదాలను అన్యార్థంలో, వడ్డిని స్వార్థంలో ప్రయోగిస్తూ మీరు చేసిన పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 5. అప్పటికప్పుడబ్బురము! యాశలు మ్రింగెను; నల్పబుద్ధితో
  నప్పుడు చేసెనప్పు; పెను యగ్నిగ మారెను నేటిరోజు; నే
  నప్పుడె చెప్తినంచు సఖులాడెడి మాటలు సూదిపోట్లు; మీ
  రెప్పుడు తీర్తురంచు ధనమిచ్చిన వర్తక వార్త మోయువా
  డుప్పెన గర్జనల్ మనసు నూపును ప్రాణభయమ్ముతోడ; మీ
  కిప్పుడు చూడగన్ దొరకునే సుఖలేశము; వడ్డికాసులే
  పిప్పిరి చేసె మీ స్థితిని ప్రేక్షకు లవ్వగ బంధుమిత్రులున్!

  వర్ణన అన్నారు కనుక పాదముల సంఖ్యను అదుపు చెయ్యలేకపోయాను..

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. భరద్వాజ్ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   సమపాద పద్యాలను ఎన్ని పాదాలైనా వ్రాయవచ్చు.
   'అబ్బురము+ఆశలు, పెను+అగ్నిగ' అన్నపుడు యడాగమం రాదు. 'చెప్తిని' అనడం సాధువు కాదు.

   తొలగించండి
  2. ధన్యవాదములు!
   యడాగమం రానప్పుడు ఏమవుతుంది?
   అచ్చుగా ఐతే వదలలేము కదా?

   తొలగించండి
  3. సంధి కార్యం లేకపోతే యడాగమం వస్తుంది. యడాగమం రాదంటే అక్కడ సంధికార్యం ఉందనే. సంధి జరగాలంటే పదాల స్వరూపం కూడా తదనుగుణంగా ఉండాలి.పదాలమధ్య వ్యాకరణ కార్యం నిషిధ్ధం కాకూడదు కూడా. పెన్ (లేదా పెను) అనేది తెలుగు పదం. అగ్ని సంస్కృతపదం. ఇక్కడ సమాసం చేయటం కుదరదు. చేస్తే దుష్టం అంటారు. సమసించని పదాలమధ్య సంధి ఉండదు కదా! అంటే ఆ విధంగా వాడనే కూడదు.

   తొలగించండి
  4. శ్యామలీయం గారూ, ధన్యవాదాలు.
   ***********
   భరద్వాజ్ గారూ,
   'అబ్బురమె యాశలు.... చేసె నప్పదియె యగ్నిగ...' అనండి.

   తొలగించండి
  5. శ్యామలీయం గారు, శంకరయ్య గారు,
   ధన్యవాదములు!
   మీ వివరణ, పూరణల నుండి కొత్త విషయాలు నేర్పారు, కృతార్థుణ్ణి.

   తొలగించండి
 6. దొరకునా స్వామి!వేదన దొరలు దినము?
  స్వేచ్ఛ యెపుడబ్బునయ్య యో శ్రీనివాస?
  సరసి యప్పుల స్నానము సలిపినాడ;
  నాత్మశాంతిని వడ్డింపుమయ్య!నాకు.
  **************************

  అభినందనచందనము
  ------------
  ఆంద్రసారస్వతజగతి యందు నిలిపె
  నడుగుజాడను గురజాడ అప్పరాయ;
  డట్టి గురుజాడ గౌరవ మందుకొన్న
  శంకరార్యుని కవిధీరు సన్నుతింతు.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. బాపూజీ గారూ,
   దత్తపదాలను అన్యార్థంలో ప్రయోగించిన మీ పూరణ బాగున్నది.
   మీ ప్రశంసకు ధన్యవాదాలు!

   తొలగించండి
 7. తిరుమల గిరి వాసుని మనోవేదన

  ఆమ (దొర)ప్తు సరిజాచి యాపకుండ
  కాయకంటికి చెల్లిపు జేయుచుంటి,
  (వడ్డి)వారు ధనమ్మును వడ్డి తోడ
  లెక్క గట్టి యిచ్చితిగద, జిక్కు దీర
  లేదు, (డబ్బు)ను బలుకక, వాదులాట
  లేమి లేక, జెల్లించినా ఏమి నాదు
  స్తితి, ఎప్పుడు తీరునో , సిరిని బెండ్లి
  యాడి నఫలితమ్మిదిగదా యనుచు (యప్పు)
  బుట్టు నాభుడు వగచెను గట్టు మీద

  ఆమ (దొర)ప్తు = ఆదాయ వ్యయములు
  వడ్డి వారు = అధికముగా
  అప్పుబుట్టు నాభుడు విష్ణుమూర్తి
  డబ్బు అసత్యము


  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పూసపాటి వారూ,
   బాగున్నది మీ పూరణ. అభినందనలు.
   '...చెల్లించిన నేమి... స్థితి యిదెప్పుడు' అనండి.

   తొలగించండి

 8. అబ్బీ ! యప్పిచ్చెదమన
  గబ్బా! దొరకత్తె బోయె గద బిరబిరగా
  యబ్బో డబ్బులు! క్రెడిటో
  రబ్బో! రాద్ధాంతమయ్యె రమణికి వడ్డీ :)

  జిలేబి

  రిప్లయితొలగించండి
 9. (దొర)వద్ద (డబ్బు) (లప్పు)డు
  మరి (వడ్డి)కి దెచ్చి యుంటి మరలం దీర్చన్
  (దొర)కదు నాకే (డబ్బు)ను
  పరు (వడ్డి)న దౌర (యప్పు) పలురకములుగాన్.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సత్యనారాయణ మూర్తి గారూ,
   దత్తపదాలను అన్యార్థ స్వార్థాలలో ప్రయోగించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 10. మైలవరపు వారి పూరణ

  అప్పు వడ్డికి దొరనునే నడిగి డబ్బు
  దొరకకుండగ నెవరికి తిరుగుచుంటి !
  నయ్యొ ! నా *గతి* జూడ నేడబ్బురమగు !
  నప్పుడెట్లుండె ? వడ్డించినట్టి యాకు !!

  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

  రిప్లయితొలగించండి


 11. అప్పా! అప్పిదిగో దొరంకునిట సాయమ్ముల్లనన్, వడ్డి య
  ప్పప్పాలేదనగన్, జిలేబి వెడలెన్ బారుల్, విమానమ్ములన్,
  గప్పాల్కొట్టెను డబ్బుతో విరివిగన్! గాలమ్ము లోచిక్కగన్
  గప్పాటుల్మొదలవ్వగాను తెలిసెన్ గాదే యురిత్రాడదే !

  జిలేబి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. జిలేబీ గారూ,
   బాగుంది మీ శార్దూల పూరణ. అభినందనలు.
   'ఉరిత్రాడు' అన్నపుడు 'రి' లఘువే.

   తొలగించండి
 12. దొరకునని అప్పు జేయు ట దోష మగును
  వృథగ డబ్బు ను వెచ్చింప వెతలు హెచ్చు
  పెరుగు చున్నట్టీ వడ్డీ యే పేర్మి బాధ
  కలుగ జేయుచు లోకాల కష్ట పెట్టు

  రిప్లయితొలగించండి
 13. *దొర*కలేదయ్యె కాసులు దొడ్డ వారి
  కమిత లోకువఁగాదె నే*డబ్బు*రముగ
  నడరె మదిలోన ఋణబాధ*లప్పు*డపుడు.
  లేరు *వడ్డిం*ప గంజియో లేశమైన.

  రిప్లయితొలగించండి
 14. దొరలెడు ధరలకు నిలబడి
  వరలెడు పెనుగాలి వోలె వావిరి ముడుపుల్
  కరువుగ యప్పుడబ్బుడు తినగ
  వరమే యనివడ్డిం చగోరు బ్రమయే యనగన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అక్కయ్యా,
   మీ పూరణ బాగుంది.
   '...అప్పుడబ్బుడు'...?
   చివరిపాదంలో గణదోషం. సవరించండి.

   తొలగించండి
  2. దొరలెడు ధరలకు నిలబడి
   వరలెడు పెనుగాలి వోలె వావిరి ముడుపుల్
   కరువప్పుడబ్బుడు తినగ
   వరమే యనివడ్డ నగోరు బ్రమయే యనగన్

   తొలగించండి
 15. కోట రాజశేఖర్ గారి పూరణ


  సందర్భం :: *ఆయుధమున్ ధరింప నని* *మాట యిచ్చిన* శ్రీకృష్ణుడు *మాట తప్పి* చక్రం ధరించినప్పుడు *అర్జునుని మనసులో మాట* (*మన్ కీ బాత్*)


  *అప్పు* డు బల్కినావు గద, *యాయుధమున్ ధరియింప* నంచు నీ
  ‘’విప్పటి యుద్ధరంగమున, నెన్నగ లే *దొర* భీష్ముధాటికిన్
  తప్ప’’ దటంచు, చక్రమును దాల్చితి, వచ్యుతు *డబ్బు* రమ్ముగా
  నిప్పుడు మాట తప్పెనన, నిల్చితి *వడ్డి* జయింప భీష్ము, *నీ
  వెప్పుడు భక్తరక్షణకు నేమయినన్ ధర జేయ నేర్తువౌ.*
  నెప్పటికైన నీ ఋణము నెంచుచు, దీర్పగలేను దైవమా!


  (అప్పుడు పదములో *అప్పు* డు)
  (లేదు+ఒర=లే *దొర* ) ఒర=సామ్యము. (అచ్యుతుడు+అబ్బురము=అచ్యుతు *డబ్బు* రము) (నిల్చితివి+అడ్డి=నిల్చితి *వడ్డి*)

  *కోట రాజశేఖర్ నెల్లూరు.*

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. రాజశేఖర్ గారూ,
   అంశం కొద్దిగా గాడి తప్పినా మీ పద్యం అమోఘంగా ఉంది. అభినందనలు.

   తొలగించండి
  2. శ్రీ కంది శంకరయ్య గురువరేణ్యులకు హృదయపూర్వక ప్రణామాలు. మీ కోట రాజశేఖర్ నెల్లూరు.

   తొలగించండి
 16. అప్పును గోరగ దయతో
  నప్పుడె దొరగారె యిచ్చినారుగ లక్షన్
  చప్పున డబ్బును, గానీ
  తిప్పలె మరి చక్రవడ్డి దీర్చగ నెటులో.

  రిప్లయితొలగించండి
 17. దొరకి నంత మేర తోచినటులు గానె
  యప్పు డపుడు కాక యెప్పుడైన
  చేయు ఋణము వలన చేటౌను కీడబ్బు
  తొలగ వడ్డి చూడు కలుగు వెతలు.
  ****)()(****
  (కీడు + అబ్బు ; తొలగవు + అడ్డి చూడు)

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. జనార్దన రావు గారూ,
   దత్తపదాలను అన్యార్థంలో ప్రయోగించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 18. దొరకె నాడబ్బుర పడఁగ ధరణిఁ బద్మ
  మనువు కైసిరి నప్పుడు ధనదుఁడొసఁగె
  వడ్డి దీర్చ వడ్డించితి వరములెన్నొ
  దాసుల కడ కాసుల గొని, తరుగు నెపుడొ?

  రిప్లయితొలగించండి


 19. దొరబాబచటన్ వెడలిరి
  పరుగుల అప్పులకొరకట వడ్డీ లేకన్
  పిరియపు జపాను దేశపు
  సిరి,డబ్బుకసాల దీర్చ చీకటి దొలగన్ :)

  జిలేబి

  రిప్లయితొలగించండి
 20. మరి మరి యప్పు జేసి పలు మాయల జిక్కుచు డబ్బు తెచ్చి తా
  మురియుచు పంట వేయగను ముంచెనువాన తుపాను రూపమై
  సరగున వడ్డి కట్టమని సారెకు నా ఋణదాత పోరగన్
  దొరకునె సాంత్వనమ్మకట దోపిడికిన్ గురియైన రైతుకున్

  రిప్లయితొలగించండి
 21. గు రు మూ ర్తి ఆ చా రి
  ,,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,,

  దొర ! దొరకదు నీ కడ తప్ప తోడు నీడ |

  యిదిగొ చూ డబ్బులూ ! డబ్బు నీయవయ్య |

  యప్పు డప్పు డప్పు నిడి కాపాడి తీవె |

  యాదుకొనవయ్య నేడిప్డు c బేదవాని |

  వడ్డి యె౦తైన సరియె | నీ వడ్డిగ గొని ,

  యిమ్ము | బిడ్డను డె౦గ్యు బాధి౦చ సాగె

  దాని బ్రతికి౦చ గలిగిన దైవ మీవ


  { అ డ్డి గ = స్త్రీల క౦ఠాభరణము }

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. గురుమూర్తి ఆచారి గారూ,
   దత్తపదాలను స్వార్థంలోను, అన్యార్థంలోను ప్రయోగిస్తూ మీరు చేసిన పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 22. నేఁ డబ్బురముగ దొరఁకొని
  వాఁ డప్పుర జనుల కెల్ల బాధల నొసగం
  గూడని వడ్డినిఁ గొంచును
  వేఁడెద నీ వడ్డి యతని వేగము మాన్పన్


  భారతార్థమున:
  నేఁ డబ్బురముగ దొరఁకొని
  వాఁ డప్పుర జనుల కెల్ల బాధల నొసగన్
  వేఁడెద నీవడ్డి యతనిఁ
  దాడనములఁ దునుము వేగ తనయా భీమా

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కామేశ్వర రావు గారూ,
   మీ రెండు పూరణలు మనోజ్ఞంగా ఉన్నవి. అభినందనలు.

   తొలగించండి
  2. పూజ్యులుశంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు.

   తొలగించండి
 23. వడ్డి డబ్బులు లేకుండభైరవదొర
  యప్పునీయగబదివేలుహర్షమయ్యె
  వాటీ తోడన యింటిని బాగుజేతు
  జూచుగావుతచల్లగా సోముడతని

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సుబ్బారావు గారూ,
   మీ పూరణ బాగున్నది.
   కాని ఇక్కడ ఋణగ్రస్తుడు బాధ పడలేదు కదా!

   తొలగించండి
 24. క్రొవ్విడి వెంకట రాజారావు:
  తే.గీ.
  డబ్బు గలిగిన దొరయాతడతి గుణియని
  యప్పుకై వినుతించగ నాలకించి
  సొమ్ము నమరించి పిమ్మట సూటిగాని
  వడ్డి జేర్చుచు బాధించె పలుగు డతడు
  (పలుగు= మోసగాడు)

  రిప్లయితొలగించండి
 25. దొరకని యప్పుకైదొరలు దోషము లన్నియు లెక్కజేయకన్
  కరుణయు గల్గి వడ్డి తనుగాంచక|పిల్లల కుంచుదీక్షగా|
  పరువము బంచు డబ్బుతన వంతున జేరక మానవత్వమున్
  తరుగక జేయు తత్వ నిధి ధైర్యమె నప్పును దీర్చు శక్తియై {అప్పు=జలము}{వడ్డి=వృద్ధి}డబ్బు=దర్పము}|

  రిప్లయితొలగించండి
 26. అప్పుతెచ్చినడబ్బునకయ్యెవడ్డి
  మూడురెట్లుగనక్కటమునిగిపోతి
  నెట్లుదీర్చుదు?దొరకునేనేమిచెప్పి
  నవినినమ్మునునోయిమానవుడ!చెపుమ

  రిప్లయితొలగించండి
 27. దొరకవేమొ సొమ్ములనుచు వెఱయు చుండ
  యప్పుడెపుడొ నడుగగ నేడబ్బుర పడు
  నటుల సొమ్ముల వడ్డింతు ననిన బ్యాంకు
  వడ్డి గాంచగ నా రైతు నడ్డి విఱిగె!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. శ్రీధర రావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'వెఱగుపడగ। నప్పు డెపుడొ...' అనండి.

   తొలగించండి
  2. గురువు గారికి నమస్సులు, సవరిస్తానండి. ధన్యవాదములు.

   తొలగించండి
 28. పొలము తాకట్టు బెట్టి డబ్బులను దెచ్చి
  అసలు వడ్డిగ నప్పుకు ఫసలు సగము
  దొరలు కాజేయ నెద్దుల, దుఃఖితుడగు
  రైతు ఋణబాధ దీర్చగ రాదు గదర

  రిప్లయితొలగించండి
 29. అప్పు గొన్న డబ్బు కావిరి యెక్కువ!
  వడ్డీ గలిపి చూడ పాదరసమె !
  డబ్బు దర్ప ముంచ?నుబ్బిన గోడయే
  దొరకరాని సొమ్ము దొరికి నటులె !

  రిప్లయితొలగించండి
 30. కొడుకు పెండిలియప్పుడు కొంత ధనము
  దొరకొని బడసి తెలిసిన బరులవద్ద
  భోజ్యములను వడ్డించితి ముదముతోడ
  నొక్కడబ్బురముగ భాణమెక్కుపెట్టె
  నప్పుఁ దీర్చలేదని వీధిఁ జెప్పుకొనుచు
  నాయసక్తత తెల్పితి నతియొనర్చి
  కోరితి సమయమును తీర్చ నారుణమ్ము

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అన్నపరెడ్డి గారూ,
   దత్తపదాలను అన్యార్థంలో సమర్థంగా ప్రయోగించి చక్కని పూరణ చెప్పారు. అభినందనలు.

   తొలగించండి
 31. బిడ్డ పెండ్లి కుదుర వడ్డీకి దెచ్చితి
  నడిగి దొరను డబ్బు నప్పు డేను
  ఏండ్లు గడిచెగాని నింతైన నాయప్పు
  దీరలేదు ఋణము దిగులు మిగిలె.

  దొరకొని ఖలు చంపవృకో
  దరుడబ్బురమగుతెరగున దలచుచు మదిలో
  కరమున జూపుచు నప్పుడె
  దురుసుగ వడ్డించెనచట దుశ్శాసనుకున్

  అప్పు దొరికె నంచు నాశపడితి గాని
  నడ్డి విరుగు నంత వడ్డి యగున
  టంచు నొరుగనైతి నాడబ్బెటలకూర్తు
  దొరకదేది దారి తోయజాక్ష.

  గొప్పలకు బోయి యప్పులు కువలయాన
  చేసితి దొరకెనని గాని జీవితాన
  కష్టపడినను డబ్బు లు కరము నందు
  మిగుల కుండగ వడ్డీకె మితమయ్యె
  నేమి చేయగ లేకనే నేడ్చుచుంటి.

  రిప్లయితొలగించండి
 32. మిత్రులందఱకు నమస్సులు!

  చేనికిని నీరు దొరకమిం జేసి, రైతు
  చేబదులుఁ గొని, నీటినిం జేదు యంత్ర
  మొండు విలిచి, యప్పులఁ జేని నుంప, వడిని
  వాన యొండబ్బుటయు, నది ప్రబలెఁ; జేని
  వెల్లువడ్డినఁ గుములుచుఁ బెదవి విఱిచె!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మధుసూదన్ గారూ,
   దత్తపదాలను అన్యార్థంలో సమర్థంగా ప్రయోగిస్తూ అద్భుతమైన పూరణ చెప్పారు. అభినందనలు.

   తొలగించండి