10, నవంబర్ 2017, శుక్రవారం

సమస్య - 2516 (శివభక్తవరేణ్యుఁడు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"శివభక్తవరేణ్యుఁ డనఁగ శ్రీశ్రీయె కదా"
(లేదా...)
"శివభక్తాగ్రణి యెవ్వరో యెఱుఁగవా శ్రీశ్రీయె సత్యం బిదే"

52 కామెంట్‌లు:

 1. (శ్రీపురం శ్రీధర్ శివాలయ పూజారి. అందరూ "శ్రీశ్రీ" అని పిలుస్తారు)

  పవలును రేయిని వీడఁడు
  శివాలయము శ్రీపురంపు శ్రీధర నాముం
  డవిరళ పూజానిష్ఠుఁడు
  శివభక్తవరేణ్యుఁ డనఁగ శ్రీశ్రీయె కదా!

  రిప్లయితొలగించండి
 2. శివభక్తుడు నా పుత్రుడు
  చవిగొని "శ్రీనాథు" డతని చక్కని పేరై
  కవి! "శ్రీనివాసు" కూడగ
  శివభక్తవరేణ్యుఁ డనఁగ శ్రీశ్రీయె కదా!


  నా ఏకైక సుతుని పేరు (సత్య
  ప్రమాణంగా!):

  "శ్రీనివాస్ శ్రీనాథ్" (శ్రీశ్రీ)

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ప్రభాకర శాస్త్రి గారూ,
   ఆహా! ఎంత చక్కగా కుదిరింది! మంచి పూరణ. అభినందనలు.
   ఎలాగైతేనేం? మీ అబ్బాయికీ సమస్యాపూరణంలో చోటు దక్కింది. సంతోషం!

   తొలగించండి
  2. 🙏🙏🙏

   సార్! సంతోషం!
   మీరు ముంబై నుంచి క్షేమంగా లాభంగా తిరిగి వచ్చాక మేమిరువరమూ మిమ్మల్ని కలుస్తాము మరలా!

   Happy Journey!!!

   తొలగించండి
 3. (మహాప్రస్థానకావ్యంలో మొదటి కవితలోనే హరస్మరణతో కదలమన్నారు శ్రీశ్రీ)
  శివుని"హరోం హర హర హర
  భవ యని తలచుచు నరచుచు పదుడు పదు"డనెన్
  నవయువకుల దనకవితను;
  శివభక్తవరేణుడనగ డనగ శ్రీశ్రీయె కదా!

  రిప్లయితొలగించండి


 4. కవియౌ శ్రీనాధుడుగద
  శివభక్తవరేణ్యుఁ డనఁగ; శ్రీశ్రీయె కదా
  చవచవ మరోప్రపంచము
  జవరాలా పిలిచెననుచు చవి జూపెనిటన్ !

  జిలేబి

  రిప్లయితొలగించండి


 5. కవనమ్మెంత పటుత్వమున్ గలిగెనో కర్తవ్యమున్నంతయే
  చవగాంచన్ వెలయించి జాగృతి గనన్ సాధించెనౌ విప్లవ
  మ్ము వరమ్మై తెలుగింట మోగగ "హరోం"! ముమ్మాటికిన్ తొయ్యలీ
  శివభక్తాగ్రణి యెవ్వరో యెఱుఁగవా శ్రీశ్రీయె సత్యం బిదే!


  జిలేబి

  రిప్లయితొలగించండి
 6. భవు నర్చించెద మంచును
  శివభక్తవరేణ్యుఁ డనఁగ, శ్రీశ్రీయె కదా
  జవదాటక ధవు వాక్యము
  జవమున సంభారములను సమకూర్చి యిడెన్.

  రిప్లయితొలగించండి
 7. భువిలో మార్కండేయుడె
  శివ భక్త వరేణ్యుడనగ; శ్రీ శ్రీ యె కదా
  నవ సమ సమాజ సిద్ధికి
  కవి యగు రవి యగు బవి యగు గమ్యూనిష్టౌ

  రిప్లయితొలగించండి
 8. కవనమున సామ్యవాదము
  నవలంబించియు "హరోం హరా హర యనడే !"
  శివునిన్ క్రాంతికి జేర్చిన
  శివభక్తవరేణ్యుడనగ శ్రీ శ్రీ యె కదా !
  (శ్రీ శ్రీ మహాప్రస్థానం లో "హరోం హరోం హర హర హర హర హరోం హరా యని కదలండి అని వ్రాశారు)

  రిప్లయితొలగించండి
 9. కవనమ్మందున సామ్యవాదపు మహాక్రాంతిన్ సమర్ధించియున్
  శివునిన్ దల్చెడు శ్రోత్రియత్వము విడన్ చిత్తమ్ము క్షోభించియో
  భవునిన్ దల్చి హరోం హరా యని మహాప్రస్థాన మున్ వ్రాయు నా
  శివభక్తుండన నెవ్వరో యెఱుఁగవా శ్రీశ్రీయె సత్యం బిదే"

  రిప్లయితొలగించండి
 10. డా.పిట్టా
  శివ శివ యంచున గురువుగ1
  భవ, శంకరు భరణ2 శక్తి బాపె స్వ గృహమున్
  కవనపు హిమాలయము3 గనె
  శివ భక్త వరేణ్యుడన్న *శ్రీ శ్రీ యె కదా!
  (శ్రీ కందిశంకరయ్య *శంకర* గురువై=శంకరాచార్యుడై, తన గృహమును విడనాడి,3ప్రశాంత నివాసము, ప్రస్తుత విడిదిన అటు హిమాలయములనూ సందర్శించినారు.కవనమునకంకిత మైనారు. వీరిని అపర శ్రీశ్రీగా అభివర్ణించుట)

  రిప్లయితొలగించండి
 11. డా.పిట్టా
  1వ పాదమున *యంచన*..గా చదు గలరు.టైపాటది.

  రిప్లయితొలగించండి
 12. మైలవరపు వారి పూరణ

  నవ కవితా దృక్పథమున
  నవనిని ఘనదేశభక్తి నద్భుతమనగా
  చవి జూపిన వాడౌటను
  శివ ! భక్తాగ్రణ్యుడనగ శ్రీశ్రీ యె గదా !!

  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

  రిప్లయితొలగించండి
 13. కోట రాజశేఖర్ గారి పూరణ

  సందర్భం :: మహాప్రస్థానం అనే మహాకావ్యం వ్రాసిన మహాకవి
  శ్రీరంగం శ్రీనివాసరావు గారు
  అంటే మన శ్రీశ్రీ గారు
  సినిమాలకు పాటలు వ్రాస్తూ
  *తెలుగు వీర! లేవరా* అని *పాడవోయి భారతీయుడా* అని ప్రజలలో దేశభక్తిని పెంపొందించిన దేశభక్తుడు. ఇదే సత్యం. అని
  శ్రీశ్రీ అభిమాని శివుని దగ్గర విన్నవించుకొంటున్న సందర్భం.

  భవ ! శ్రీరంగమె యింటిపేరు, కనలేవా ? శ్రీనివాసున్, కవి
  ప్రవరున్, పాటలు వ్రాసెగా *తెలుగు వీరా! లేవరా* యంచు, భ
  క్తి వెసన్ *పాడుము భారతీయుడ!* యనెన్ దేశమ్ముపై భక్తి సం
  భవమౌ రీతుల, దేశభక్తుడు *మహాప్రస్థానమున్ వ్రాసె* నో
  శివ ! భక్తాగ్రణి యెవ్వరో యెరుగవా *శ్రీశ్రీ యె* సత్యం బిదే.

  *కోట రాజశేఖర్ నెల్లూరు.*

  రిప్లయితొలగించండి
 14. డా.పిట్టా
  భవునకు *శరభ,శరభ*యను
  స్తవమెన్నగ రాళ్ళ గొరుకు దరువున శబ్దం
  బవతరణమ్మవ గలమున(న్+కము=గలము)
  శివ భక్త వరేణ్యుడన్న శ్రీశ్రీ యెకదా!
  (శివ ఖడ్గాలనే సంప్రదాయ గీతాలతో యిద్దరు పోటీ పడి విందులలో ఆహ్లాదాన్ని కలిగించేవారు.శివ స్తవమును కొనసాగించలేని అతను ఓడి పోయినట్లు,1950నాటి నా జ్ఞాపకం. పోటీ పడినవారు:మా నాన్న మరియు మా మేనమామ. ఇరువురు కాలుదువ్వుకుంటూ శివ ‌స్తవము జేసేవారు.)

  రిప్లయితొలగించండి
 15. కవిమిత్రులారా,
  ఈరోజు బొంబాయికి వెళ్తున్నాను. రేపు అక్కడ గురజాడ ఫౌండేషన్ (అమెరికా) వారి విశిష్ట పురస్కారం అందుకొని ఎల్లుండి తిరుగు ప్రయాణం. కనుక మూడు రోజులు నేను బ్లాగుకు అందుబాటులో ఉండక పోవచ్చు.
  దయచేసి పరస్పర గుణ దోష విచారణ చేసికొన వలసిందిగా మనవి.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు


  1. కంది వారు

   ముంబై లో సన్మాన సభ యేవేదిక లో ?


   జిలేబి

   తొలగించండి
  2. అభినందనలు మరియు శుభాకాంక్షలు గురుదేవా!!

   తొలగించండి
  3. పురస్కారం అందుకునే గురుదేవులకు అభివందనములు. ప్రయాణము సుఖప్రదం కావాలని ప్రార్థన.

   తొలగించండి
  4. పురస్కార మందుకొని గురజాడ సంస్థకు గౌరవ మాపాదించు గురు వరులకు నమఃపూర్వకాభినందనలు.

   తొలగించండి
 16. క్రొవ్విడి వెంకట రాజారావు:

  శివయోగి రిషభుడె గదా
  శివభక్తవరేణ్యు డనగ; శ్రీశ్రీయె కదా
  శివభక్తుడు కాకున్నను
  కవి యోగ్యునిగ కవులందు ఘనుడయ్యెనుగా!

  రిప్లయితొలగించండి
 17. డా.పిట్టా
  అవనిన్ హస్తిని కాళమున్నెదురగా నందందు ఫూత్కారపున్
  రవమున్ సాలెగ గూడునల్లి యువతన్ రండంచు లోగొన్న యా
  జవ సౌందర్యము ,సత్యమున్, శివముగాన్ సాగించె*ప్రస్తానమున్*
  శివ భక్తాగ్రణి యెవ్వరో యెరుగవా శ్రీ శ్రీ యె సత్యంబిదే!

  రిప్లయితొలగించండి
 18. గురజాడ పురస్కారం అందుకొంటున్న మీకు ముందుగా అభినందనలు.

  రిప్లయితొలగించండి
 19. రవళించెడి ఢమరుకసడి
  శివమెత్తగ కవితలందు శివుడే నిలువన్
  కవనపు నభిషేకమ్మున
  శివభక్తవరేణ్యుడనగ శ్రీశ్రీయె కదా

  రిప్లయితొలగించండి
 20. రవళించెడి ఢమరుకసడి
  శివమెత్తగ కవితలందు శివుడే నిలువన్
  కవనపు నభిషేకమ్మున
  శివభక్తవరేణ్యుడనగ శ్రీశ్రీయె కదా

  రిప్లయితొలగించండి
 21. శివ మన మంగళ కర మౌ
  అవని శుభ oబుల ను గోరు అభ్యుదయు oడై
  క వ న ములు సృష్టి చేసి న
  శివ భక్త వ రేన్యుడన గ శ్రీశ్రీ యె కదా !

  రిప్లయితొలగించండి
 22. భవుడు బ్రహ్మయు విష్ణువే!
  కవితలకారాధ్యులుగద కవిత్రయంబున్
  పవిశరముల పలుకులగాన్
  శివభక్తి వరేణ్యుడనగా శ్రీ శ్రీ యే కదా!
  అందరి కవులకు వందనములు.

  రిప్లయితొలగించండి
 23. శివసాయుజ్యము నొందిన
  శివభక్తవరేన్యుడనగ శ్రీ; శ్రీయెగదా
  శివపూజను శ్రేష్టమగుచు
  శివసంకల్పములతోడ శ్రీలనుగూర్చన్

  శ్రీ =సాలెపురుగు
  శ్రీ = మారేడుదళము
  శ్రీ = సంపద,కీర్తి,మోక్షము ఇత్యాది

  రిప్లయితొలగించండి
 24. భువిలోనన్నేటి వరకు
  నవలోకింపగను రావణాసురుడేగా ;
  నవ కవితకు నాంది పలికె
  శివ భక్తాగ్రణ్యు డనగ ; శ్రీ శ్రీ యె కదా!

  రిప్లయితొలగించండి
 25. నవ కవనము రవలించెను
  కవితావేశము సమాజ గమనమ్మందన్
  శివమను మంగళమును నా
  శివభక్తవరేణ్యుఁ డనఁగ శ్రీశ్రీయె కదా?

  రిప్లయితొలగించండి
 26. ప్రవిమల భక్తిని తిన్నడు
  శివభక్తవరేణ్యుఁ డనఁగ, శ్రీశ్రీయె కదా
  కవనమ్ములల్లి నిత్యము
  భువి ప్రజ కొరకుద్యమించి పొందెను కీర్తిన్

  రిప్లయితొలగించండి
 27. శ్రవణానందము గాగ సీసములతో శార్దూలమత్తేభముల్
  రవళంపన్ ఫణిరాజభూషణు వెసన్ రక్షింపగా గోరుచున్
  కవనమ్ముల్ లిఖియించు మేటికవి తా శ్రీపాద శ్రీకృష్ణుడే
  శివభక్తాగ్రణి యెవ్వరో యెఱుగవే శ్రీశ్రీయె సత్యంబిదే

  రిప్లయితొలగించండి
 28. అవలీలగ చిత్రమ్ముల
  ధవళాద్రినివాసు కీర్తి తద్దయు పొగడన్
  కవి శ్రీశ్రీకే చెల్లును
  శివభక్త వరేణ్యుడనగ శ్రీశ్రీయె కదా

  రిప్లయితొలగించండి
 29. కవితలకుఁ గ్రొత్త సొగసులు
  భువిని నొసఁగి గీత సుమ సమూహమ్ములఁ దా
  నవనీ జనగణ సుమన
  శ్శివ భక్త వరేణ్యుఁ డనఁగ శ్రీశ్రీయె కదా

  [శివము = వేదము; శ్రీశ్రీ : మహాకవి శ్రీరంగము శ్రీనివాస రావు]


  అవనీ జాతగ సీత దారయయి త్రేతాఖ్యంపుఁ గాలమ్మునన్
  భువనఖ్యాతయ రుక్మిణీ సతియ తాఁ బో ద్వాపరం బందునన్
  రవి చంద్రాక్షుఁడు విష్ణు దేవునకు భార్యారత్న మయ్యెన్ ధరన్
  శివ భక్తాగ్రణి! యెవ్వరో యెఱుఁగవా శ్రీశ్రీయె సత్యం బిదే

  [శ్రీ శ్రీ = శ్రీలక్ష్మీ దేవి]

  రిప్లయితొలగించండి
 30. భవునిన్భక్తులశ్రేష్ఠుడు
  శివభక్తివరేణ్యుడనగ,శ్రీశ్రీయెగదా
  నవరసమిళితపుపాటల
  నవలీలగవ్రాయునట్టియార్యుడుజగతిన్

  రిప్లయితొలగించండి
 31. శివకేశవు లొకరే యన
  కవనమునన్ గద్యపద్య ఘనపద సరళిన్
  భువి పేరొందెను శ్రీ శ్రీ
  శివభక్తవరేణ్యుఁ డనఁగ శ్రీశ్రీయె కదా

  రిప్లయితొలగించండి
 32. శివ మన్నన్ శుభమంగళం బగునుగా శ్రీశ్రీ సదా కోరడే
  శివముల్ మానవకోటి యున్నతికినై చింతించుచున్ కైతలన్
  శివభక్తిన్ ప్రకటించుచున్ పరితపించెన్ గాద యింకేల నా
  శివభక్తాగ్రణి యెవ్వరో యెఱుఁగవా శ్రీశ్రీయె సత్యం బిదే.

  రిప్లయితొలగించండి
 33. గురజాడపురస్కారము
  నిరవుగగైకొనుటకొరకునేగెడుసామీ!
  కరములనెత్తుచునిడుదును
  నరుసముతోస్వీకరించు మార్యా!నతులన్

  రిప్లయితొలగించండి
 34. అవిరళ కృషితో జక్కణ
  కవనంబునగాక శిల్పకల్పన చేతన్
  వివరణె హరిహర రూపము|
  శివ భక్తవరేణ్యుడనగ?శ్రీశ్రీయెకదా?
  2.కవియగు తిక్కన దెలిపెను
  భవుడు,హరినొకడని పలికె భారత మందున్
  వివరణ జేయగ మదిలో
  శివభక్తవ రేణ్యుడనగ?శ్రీశ్రీయె కదా|
  3.శివనామంబన?ద్వర్తి కావ్యమగు విశ్లేషించి నూహించగా
  అవతారంబులు వేరు వేరయిన కార్యంబందు వారొక్కటే
  శివ భక్తాగ్రణి యెవ్వరో యెఱుగవా?శ్రీశ్రీయె సత్యంబిదే
  శ్రవణా నందమునింపు కీర్తనలువిశ్వాసానకీర్తించగా| {శ్రీ=హరి,హరుడు}


  రిప్లయితొలగించండి
 35. మైలవరపు వారి పూరణ


  కవితావేశమహోష్ణధారలెలయన్
  గావించి కావ్యంపు సృ...
  ష్టి విశేషమ్ముగ కీర్తినందెనిల శ్రీశ్రీ విప్లవాస్వాదియై !
  శివభక్తాగ్రణి యెవ్వరో యెఱుఁగవా శ్రీశ్రీ యె? సత్యం బిదే
  శివభక్తుండు మృకండుపట్టి, కవులన్ శ్రీనాథుడే యెంచగన్ !!

  ( శివభక్తాగ్రణి యెవ్వరో యెరుగవు ! ఆ శ్రీశ్రీ యె ? సత్యంబిదే )

  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

  రిప్లయితొలగించండి
 36. శివునికి గుడి కట్టెను తం
  తువుతోశ్రీ,భక్తి మెరయ తుట్టె పురుగు శ్రీ
  హవనిళ్ళగ నర్చించెను
  శివ భక్తవరేణ్యుడనగ,శ్రీ,శ్రీ,యెకదా.

  రిప్లయితొలగించండి
 37. భవహరు గొలిచిన ధూర్జటి
  శివ భక్త వరేణ్యుడనగ! శ్రీశ్రీయె గదా
  శివకవి ధూర్జటి శతకము
  నవిరళముగ చదువుచుండె నార్ద్రత తోడన్!
  (అష్టదిగ్గజ కవి ధూర్జటి వ్రాసిన శ్రీకాళహస్తీశ్వర శతకం అంటే మహాకవి శ్రీశ్రీ గారికి చాలా ఇష్టమని, ఆ పుస్తకాన్నీ ఎప్పుడూ తన వద్ద వుంచుకునేవాడని, తనవద్దకు ఎవరైనా వస్తే ఆ పుస్తకం లోని కవిత్వ ప్రాభవాన్ని గురించి చెబుతూండే వారనీ మిత్రుల ద్వారా విన్నాను)

  రిప్లయితొలగించండి


 38. శివరాత్రి గుడికి నేగును

  శివభక్తి వరేణ్యుడనగ,శ్రీశ్రీ యె కదా

  నవకవులకు కవితా ఓ

  కవితా యను కవిత వ్రాసి ఘనతను గాంచెన్

  రిప్లయితొలగించండి
 39. శ్రవణోపేయము జేయు వారిదగు భాషాదీప్తి శోభిల్లగన్
  కవితా వేశము జాలువారెఁ దగ నా కష్టించు వర్గాలకై
  నవరాగమ్ముల గోరుచున్ శివము నన్యాయమ్ముఁ దానొప్పడై
  శివభక్తాగ్రణి యెవ్వరో యెఱుఁగవా శ్రీశ్రీయె సత్యంబిదే!

  రిప్లయితొలగించండి
 40. శివభక్తుండనఘుండు నాసుతుడు శ్రీ శ్రీనాథుడాతండెగా
  శివజాగారము జేయుచుండతడయా శ్రీ శ్రీనివాసుండుగా
  సవరించంగ కుదించగానతడిదౌ చాంతాడుపేరున్నహా:
  శివభక్తాగ్రణి యెవ్వరో యెఱుఁగవా "శ్రీ. శ్రీ."యెసత్యం బిదే!

  ...నా ఏకైక పుత్రుని పూర్తి పేరు:
  "శ్రీనివాస్ శ్రీనాథ్" (శ్రీశ్రీ)

  రిప్లయితొలగించండి
 41. కవిరో! తిన్నడె దీటుగా వెలసె శ్రీకంఠుండి కన్నప్పగా
  శివభక్తాగ్రణి:... యెవ్వరో యెఱుఁగవా శ్రీశ్రీయె సత్యం బిదే
  నవ సాహిత్యపు నేతగా వెలసెరో! నర్తించి హృద్యమ్ముగా...
  చెవిలో పూవులు పెట్టదల్చితివిరో! చెండాడెదన్ ప్రీతినిన్!

  రిప్లయితొలగించండి