13, నవంబర్ 2017, సోమవారం

సమస్య - 2519 (పొడి యొనర్చువాని...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"పొడి యొనర్చువానిఁ బొగడ వశమె"
ఈ సమస్య సూచించిన గుఱ్ఱం జనార్దన రావు గారికి ధన్యవాదాలు.

60 కామెంట్‌లు:

  1. భుగభుగమని నాడు పొంగి నేల పడిన
    సుధయె గదర మనకు సుఖము నిచ్చు;
    ఎండబెట్టి భళిగ గుండగొట్టుచు ముక్కు
    పొడి యొనర్చువానిఁ బొగడ వశమె!

    రిప్లయితొలగించండి
  2. మొక్క సృష్టి జేసి పూవుల బూయించి
    పసిడి రేకులెల్ల వరుస గూర్చి
    సృష్టి జేయు పూల వృద్ధి కోరుచును పు
    ప్పొడి యొనర్చువానిఁ బొగడ వశమె

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఫణి కుమార్ గారు! నమస్సులు!

      పద్యం అద్భుతం! మూడవ పాదంలోని యతిమైత్రి నాకొఱకై వివరించ మనవి.

      తొలగించండి
    2. శాస్త్రి గారూ నమస్సులు. ధన్యవాదములు.

      హల్లులకి యతి మైత్రి లేకపోయినా, అవి రెండూ ఋ అచ్చుతో కలిస్తే వాటి మధ్య యతి చెల్లుతుంది. ఉదాహరణకు, "స"కు "వ" యతిమైత్రి లేకపోయినా, "సృ"కు "వృ"కు యతి కుదురుతుంది.

      తొలగించండి
  3. రాత్రిపగలు లేక రాకాసిమబ్బులుౌై
    కుండపోత వాన కురియగాను
    చెమ్మగిలిన ధరణి చీకట్లుదొలగించి
    పొడియొనర్చు వాని బొగడవశమె!



    గా

    రిప్లయితొలగించండి


  4. మడిమడి యని జరుగుమనుచు వెడలువారి
    కన్న తనకు వీలు గల కరణము
    చే సహాయము గని , సేదయు దీరన
    పొడి యొనర్చువానిఁ బొగడ, వశమె !

    జిలేబి

    రిప్లయితొలగించండి
  5. ఘుమఘుమల పొగాకు గుంటూరులోఁబట్టి
    పిడుగురాళ్ల సుధను ప్రేమఁ జేర్చి
    ఘాటు నాటుకొనగ ఘనముగ నస్యపు
    పొడి యొనర్చువానిఁ బొగడ వశమె||

    రిప్లయితొలగించండి
  6. ఎరుపు రంగు వచ్చి యెఱ్ఱగా వేగిన
    మంచి కంది పప్పు కొంచ మైన
    యెండు మిర్చి యుప్పు దండిగా జతజేసి
    పొడి యొనర్చు వానిఁ బొగడ వశమె

    రిప్లయితొలగించండి
  7. రౌద్రరూపధరుడు;ద్రౌపదీనాథుండు;
    సిగ్గు ఎగ్గు లేని సింహబలుని
    మల్లయుద్ధమందు మట్టుబెట్టుచు పొడి
    పొడియొనర్చువాని బొగడవశమె!

    రిప్లయితొలగించండి
  8. డా.పిట్టా
    పద్య పద్యమునకు బాహువులను జాచి
    పూరణలకు స్ఫూర్తి బొనర జేసి
    గణ గుణ సమవర్తి,గను దోషముల పొడి
    పొడి యొనర్చు వాని బొగడ వశమె!

    రిప్లయితొలగించండి
  9. డా.పిట్టా
    కాసు కాసును కడకాన్చి పన్నులకగు
    వ్యాపకాలనెంచు వరుసలోనె
    మోసగాళ్ల బెంచు మోది యూహను పొడి
    పొడి యొనర్చెడు వాని బొగడ వశమె

    రిప్లయితొలగించండి
  10. డా.పిట్టా
    ఉన్నదాని కేదొ యూపిరి బోయక
    క్రొత్త పుంత యనుచు గూళ్లు దెరువ
    మరపు బెర్గును తిక మకలె, వీటిని పొడి
    పొడి యొనర్చువాని బొగడ వశమె?

    రిప్లయితొలగించండి
  11. మైలవరపు వారి పూరణ

    విశ్వ సృష్టి విధాత.. 🙏

    మొగ్గ పాప నవ్వ , మోము విప్పారగా
    నోట చొంగ తేనెనూరఁ జేసి
    అందమనెడి రంగునలది , రాగంపు పు..
    ప్పొడి యొనర్చు వానిఁ బొగడఁ దరమె !!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మైలవరపు సరస్వతీ! నమస్తుభ్యం!

      ... ప్రభాకర శాస్త్రి

      తొలగించండి

    2. అదురహో ;

      ఏకంసత్ విప్రాః బహుధా ...

      అద్భుతః పైన ఫణి గారికి మురళీకృష్ణ గారికి ఆ విభుని లీలగ ఒకే తలంపు !


      మురళీ కృష్ణుండొకరౌ !
      హరిపుత్రుని పేరుగల యొకరు! యిరువురికిన్
      వెఱుగొందు కైపుగ విభుని
      పరిణామపు గతి తలంపు పద్యంబయ్యెన్ !

      జిలేబి

      తొలగించండి
    3. జిలేబి గారూ వందనములు. ధన్యవాదములు.

      మురళీకృష్ణ గారూ మీ పద్యం అద్భుతంగా ఉంది. అభివాదములు.

      తొలగించండి
  12. డా.పిట్టా
    *మోది యూహ*=సంతోషపడువాని యూహ

    రిప్లయితొలగించండి
  13. జీవకోటి మనెడి సృష్టి రహస్యము
    బ్రహ్మ మలచి యుంచె బహు విధము గె
    ఱుగ, సుమములకు పునరుత్పత్తి జరుగ పుప్
    పొడి యొనర్చు వాని బొగడ వశమె!
    -రేగళ్ళ శ్రీనివాస ప్రకాశ్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మనెడి=జీవించి యుండెడి
      విధముగ+ఎఱుగ=విధముగెఱుగ
      పుప్+పొడి=పుప్పొడి.
      లేదా ఆఖరు రెండు పాదాలు:
      "ఱుగ, సుమములకు పునరుత్పత్తి జరుగ పు
      ప్పొడి యొనర్చు వాని బొగడ వశమె!"

      అని రాసినా సరిపోతుంది.

      తొలగించండి
    2. జీవకోటి మనెడి సృష్టి రహస్యము
      బ్రహ్మ మలచి యుంచె బహు విధము గె
      ఱుగ, సుమములకు పునరుత్పత్తి జరుగ పు
      ప్పొడి యొనర్చు వాని బొగడ వశమె!
      -రేగళ్ళ శ్రీనివాస ప్రకాశ్-
      పూ+పొడి=పుప్పొడి, ప్రాతాది సంధి.

      తొలగించండి
  14. కాన నజేరె కైకేయి వరము చే
    దుష్ట శిక్ష నంబు శిష్ట రక్ష
    కొరకు రాము ద ను జ కూట పు గర్వము
    పొడి యో న ర్చు వాని పొగ డ వశమె !

    రిప్లయితొలగించండి
  15. గు రు మూ ర్తి ఆ చా రి
    ,,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,,


    కుడుము లెన్ని నిడిన గుక్షి ని౦డుగ మెక్కి

    యెలమి మీర చిన్ని యెలుక నెక్కి

    విశ్వములను గాచు | విఘ్నశైల౦బుల

    పొడి యొనర్చు వాని బొగడ వశమె ? ?

    రిప్లయితొలగించండి
  16. శత్రు సేనపై ప్రఛండుడై రేగుచు
    తుత్తునియలు జేసె దురము లోన
    యమిత బలుల జీల్చి యరివీరసేనల
    బొడియొనర్చువాని బొగడ తరమె.

    రిప్లయితొలగించండి
  17. శత్రు సేనపై ప్రఛండుడై రేగుచు
    తుత్తునియలు జేసె దురము లోన
    యమిత బలుల జీల్చి యరివీరసేనల
    బొడియొనర్చువాని బొగడ తరమె.

    రిప్లయితొలగించండి
  18. కోట రాజశేఖర్ గారి పూరణ

    సందర్భం :: త్రిపురాసుర సంహారం.
    భూమి రథముగా, వేదాలు గుర్రాలుగా, సూర్యచంద్రులు రథచక్రాలుగా, బ్రహ్మ సారథిగా, మేరుపర్వతం ధనుస్సుగా, నారాయణుడే బాణంగా సిద్ధంకాగా, మృత్యుంజయుడు త్ర్యంబకుడు అగు శివుడు లోకకంటకులైన త్రిపురాసురులను దహించి భస్మంచేసి పొడిపొడిగా చేసి త్రిపురాంతకుడు అని ప్రసిద్ధిచెందిన సందర్భం.

    *ధరణి* రథమ్ముగా దనర, *వేదమ్ములు*
    గుర్రములుగ మారి కొలువు దీర,
    *సూర్యుడు* *చంద్రుడు* శుభదృష్టి జూచుచు
    రథచక్రములు నౌచు రాణ జేర,
    *బ్రహ్మ* సారథి యయ్యె, వర ధనువుగ *మేరు
    పర్వత* మమరెను భద్రమమర,
    *నారాయణుండు* బాణమ్ముగా మారగా,
    *శివతేజము* పురాల జేర్చి యలర,
    *ఇనుము* *వెండి* *స్వర్ణ* మను లోహపురముల
    యంతు జూచుచు *త్రిపురాంతకుండు*,
    *త్ర్యంబకుండు* వాటి దహనమ్ము జేయుచు,
    *పొడి యొనర్చు ; వానిఁ బొగడ దరమె?*

    *కోట రాజశేఖర్ నెల్లూరు.*

    రిప్లయితొలగించండి
  19. సుద్ద కొండ జేరి సుత్తి తో డనసుద్ద
    పొడి యొనర్చు వాని బొగడ వశమె
    చాల కష్ట మటుల సరిజేయ కొండను
    సహన ముండ వలయు సామి !పనికి

    రిప్లయితొలగించండి
  20. ఆలమందునిలచి యనవరతము దేశ
    భక్తి శత్రుసేన భంగపరచి
    క్రూరులైన వైరి వీరుల యముకల
    పొడి యొనర్చువానిఁ బొగడ వశమె

    రిప్లయితొలగించండి
  21. మడిమడి నుడువ వడివడి నెడనెడ తడ
    బడి వెడవెడ మగుడ యడఁగి మడఁగి
    నుడుపులు మడుఁగునను దడిపి తడిపి తడి
    పొడి యొనర్చువానిఁ బొగడ వశమె

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శ్రీ కామేశ్వర రావు గారికి నమస్కృతులు !మీ రనుమతిస్తే అద్భుతమైన మీ పూరణను వాట్సాప్ లోని "శంకరాభరణం" గ్రూప్ లో ప్రచురిస్తాను.

      తొలగించండి
    2. జిలేబి గారు, సత్యనారాయణ గారు జనార్దన రావు గారు ధన్యవాదములు, నమస్సులు.
      జనార్దన రావు గారు మీ యభీష్టము.

      తొలగించండి
  22. నిదుర లేవగానె పదిలమ్ముగా మన
    జిహ్వకంది రుచులు చిలుకరించి
    పలుకరించు మేటి పానీయమైన టీ
    పొడి యొనర్చువానిఁ బొగడ వశమె

    రిప్లయితొలగించండి
  23. మల్లయుద్ధమందు మరి మరి నైపుణ్య
    మొంది చూపరులకు విందు జేసి
    వైరి లొసుగులెరిగి వైకల్యమొందించి
    పొడి యొనర్చువానిఁ బొగడ వశమె

    రిప్లయితొలగించండి
  24. అవనియందున గల యరువది నాల్గువేల్
    కోట్ల జీవరాసి కొసగి బ్రతుకు ,
    పుష్పమందు తేనె పుట్టించు నట్టి పు
    ప్పొడి యొనర్చువానిఁ బొగడ వశమె

    నిన్నటి సమస్యకు నా పూరణ

    ఆటపాటలన్ని 'యాప్ ' లోన గాంచగ
    గ్రూపులందు చేరి కొందరిపుడు
    దూరి గదుల లోన తూగుచు ననెదరు
    పుస్తకముఁ బఠింత్రు మూర్ఖజనులు

    రిప్లయితొలగించండి


  25. తపము చేయు వేళ తనకడ్డు గానున్న

    కంతు కాల్చి జంపె కంటి చూపు

    తోడ శివుడు నాడు తొట్రుపడక నట్లు

    పొడి యొనర్చువానిఁ బొగడ వశమె.


    హితము కలుగ చేయు నిడ్డెనలకనుచు

    నుప్పు కారము మరి యొప్పుగాను

    పప్పు లన్ని వేసి వరుసగా వేయించి

    పొడి యొనర్చువానిఁ బొగడ వశమె.


    తిండి కలిగినంత కండకలుగునంచు

    మంచివంట వండ మదిని తలచి

    కూరచేయ నెంచి కూర్మితోడ మసాల

    పొడి యొనర్చువానిఁ బొగడ వశమె.


    తనదు బలము చూప ధైర్యముతో తాను

    అడుగు ముందుకేసినలుపు లేక

    యుద్ధరంగమందు నోడించి శత్రులన్

    పొడి యొనర్చువానిఁ బొగడ వశమె.

    రిప్లయితొలగించండి
  26. p

    పండు మిరప గోసి యెండిచి మిద్దె పై
    తొడిమ లన్నిదీసి తొట్ర బడక
    దంచి రోటీ యందు దమ్మున్న కూలిగా
    పొడి య యోనర్చు వాని బొగడ వసమె

    రిప్లయితొలగించండి
  27. p

    పండు మిరప గోసి యెండిచి మిద్దె పై
    తొడిమ లన్నిదీసి తొట్ర బడక
    దంచి రోటీ యందు దమ్మున్న కూలిగా
    పొడి య యోనర్చు వాని బొగడ వసమె

    రిప్లయితొలగించండి
  28. సకలలోక జనకు సమ్మోహితుని జేసి
    మాతయుమను గూర్చమారుడేగ
    బేసికన్ను దెరచి వేయివూవులరేని
    పొడియొనర్చు వాని బొగడవశమె!






    రిప్లయితొలగించండి
  29. లోకములను గాచ స్వీకరించి విషము
    దనుజు నుదర మందు దాగు వాని
    మనువు జేయ బోవ మన్మథు దహియించి
    పొడి యొనర్చువానిఁ బొగడ వశమె?

    రిప్లయితొలగించండి
  30. బ్రతుకు దెరువు కొరకు బండలు నిత్యము
    పొడియొనర్చువానిఁ బొగడ వశమె
    కష్ట జీవి చెమట గాంచిన కన్నీరు
    నిండు కంటిలోన నిజము సుమ్మి.

    రిప్లయితొలగించండి
  31. నా “శ్రీమదాంధ్ర సుందర కాండ” యేకోనచత్వారింశ సర్గమున నేటి పద్యములలో నొకటి.


    భూత సంచయముల భూ వలయమ్మున
    సాగరమ్ము దాట శక్తి యున్న
    వారి మువ్వురఁ గనువారము వైనతే
    యుండు నీవును ననిలుండుఁ గాదె

    మూలము:
    త్రయాణామేవ భూతానాం సాగరస్యాస్య లఙ్ఘనే.
    శక్తిస్స్యాద్వైనతేయస్య తవ వా మారుతస్యవా ..৷৷5.39.26৷৷


    రిప్లయితొలగించండి
  32. 'హర!హర!పరమేశ!'యని తపమ్మొనరింప
    దరిశనమ్ము నొసగి వరలు వాడు
    ఘోర పాతకముల కొండల నన్నిటి
    పొడి యొనర్చు వాని బొగడ వశమె

    రిప్లయితొలగించండి
  33. ధూమ్ర పత్ర ములను దోరగా వేయించి
    కొంచె సున్నమికను కొసరి నేయి
    ఆహ! పాళ్ళు మూస నందు దంచుచు ముక్కు
    పొడి యొనర్చువానిఁ బొగడ వశమె!

    రిప్లయితొలగించండి
  34. పండు మిరుప గోసి యెండించి మిద్దెపై
    తొడిమలన్నిదీసి తొట్రు బడక
    దంచి రోటియందు దమ్మున్న కూలిగా
    పొడి యొనర్చువాని బొగడ వశమె?
    2.ఱంపకాడి బ్రతుకు రక్షణలేనట్టి
    చెట్ల కోతలాగ చిట్లు చున్న|
    కూలి కొరకు జేయు కోర్కెల మనసును
    పొడి యొనర్చు వానిబొగడ వశమె? {ఱంపకాడి=ఱంపముగోయువాడు}

    రిప్లయితొలగించండి
  35. అందఁ బచ్చడులుగ నల్లముఁ బుట్నాలు
    వేడి యిడ్డెనముల విస్తరినిడి
    తిరగమాత తోడ తీరైన వెల్లుల్లి
    పొడి యొనర్చువానిఁ బొగడ వశమె!

    రిప్లయితొలగించండి
  36. శిరముపైన తాను కరము నుంచగ వారు
    మరణమొందు నట్టు వరము పడసి
    చూతమంచు చేయి శూలిపై నిడ వాని
    పొడి యొనర్చువానిఁ బొగడ వశమె.

    కీడుచేయ నెంచు కీచకు నణచంగ
    నర్తనమ్ముచేయు నాట్యశాల
    యందు నాలియెదుటె నవలీల గావాని
    పొడి యొనర్చువానిఁ బొగడ వశమె.

    రిప్లయితొలగించండి
  37. మాయమాటలాడి మంత్రిపదవిఁ బొంది
    బొంకునట్టివాఁడె పూజ్యుఁ డగును
    నిజముపల్కువాని ప్రజలు నమ్మకయున్న
    మంచిరోజులింక కాంచుటెపుడొ?

    రిప్లయితొలగించండి