29, నవంబర్ 2017, బుధవారం

సమస్య - 2532 (పగతుర పాదముల...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
"పగతుర పాదములఁ బట్టవలె వీరులకున్"
(లేదా...)
"పగతుర పాదపద్మములఁ బట్టఁగ వీరుల కొప్పు నాజిలోన్"

95 వ్యాఖ్యలు:

 1. అర్జునుడువాచ:

  యుగపురుషుల కనుముత్తర!
  బిగువొందిన ద్రోణ భీష్మ భీకర యోధుల్
  తగవుల కతీతులు హితులు!
  పగతుర పాదములఁ బట్టవలె వీరులకున్

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. పభాకర శాస్త్రి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించు
 2. తెగువ గల వారి గుణమిది
  అగపడి నంతనె గబగబ యాలము నందున్
  వగవక యుతకంగ వలెను
  "పగతుర పాదములఁ బట్టవలె వీరులకున్"

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. జనార్దన రావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించు
 3. వగవక తిరముగ మదనుని
  పగతుర పాదములు బట్టవలె,వీరులకున్
  తగునది తమయింద్రియముల
  దగులక పరమామృతమును ద్రాగగగోరన్

  వీరుడు లేదా జినుడు అనగా ఇంద్రియములను జయించినవాడు
  మహావీర జైనుడు మొదలగువారు!

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. ఈ వ్యాఖ్యను రచయిత తీసివేశారు.

   తొలగించు
  2. ఆర్యా!గీతాజయంతి సందర్భంగా నాదొక చిన్నపద్యం!

   ధర్మక్షేత్రమ్మున నిజ
   కర్మవిముఖుడై బరగిన కౌంతేయునికిన్
   మర్మమయ సుగీత నుడివి
   శర్మము నొసగినగురువుకు శరణముకృష్ణా!

   తొలగించు
  3. సీతాదేవి గారూ,
   మీ పూరణ, పద్యం రెండూ బాగున్నవి. అభినందనలు.

   తొలగించు
  4. ధన్యవాదములు గురుదేవా!

   తొలగించు
 4. తగదు గదా వీరులకు దగ్గుచు ప్రాణము గాచుకొంటకై;
  తెగువను జూపగా వలెను తెంపరులై తము యాలమందునన్
  వగవక క్షాత్ర ధర్మమున వారణ రీతిని చాటి జెప్పుటే
  "పగతుర పాదపద్మములఁ బట్టఁగ ; వీరుల కొప్పు నాజిలోన్"

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. జనార్దన రావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'తము' అనడం సాధువు కాదు. 'తము+ఆలామందు' అన్నపుడు యడాగమం రాదు. అక్కడ "తగ నాలమందునన్" అందామా?

   తొలగించు
 5. నిగమములు తెలిసి యుండిన
  గగనం బంటిన కీర్తి గాంచిన ముదమౌ
  తగవుల తలదాల్చినయెడ
  పగతుర పాదములఁ బట్టవలె వీరులకున్

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. అక్కయ్యా,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   రెండవ పాదంలో గణదోషం. 'గగనం బంటిన సుకీర్తి గాంచిన...' అందామా?

   తొలగించు
 6. (సమరారంభంలో భీష్మాదులకు ప్రణతుడైన ధర్మజుని గురించి రారాజుతో శకుని)
  వగవక ధర్మరాజు మనపక్షము నందలి పెద్దవారికిన్
  మొగమును వంచివంచి యిటుమొక్కగ గారణమేమియందువా?
  మగటిమి చాలదంచు,మిము మార్కొనలేమని మాయచేష్టలన్
  పగతుర పాదపద్మముల బట్టగ వీరులకొప్పు నాజులన్.

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. బాపూజీ గారూ,
   ధర్మజుని వినయాన్ని శకుని దృష్టికోణం నుండి చక్కగా విశ్లేషిస్తూ చక్కని పూరణ చెప్పారు. అభినందనలు.

   తొలగించు
 7. ప్రత్యుత్తరాలు
  1. తగువగు మల్లయుద్ధమునఁ దన్నుట గ్రుద్దుట చేయి త్రిప్పుటల్
   తగిలిన దెబ్బదెబ్బకును ధాటిని పెంచుట వీరయుక్తమౌ
   యెగిరిన వేళ వేగమున నీడ్చగ బాహుబలంబు మీరగన్
   పగతుర పాదపద్మములఁ బట్టఁగ వీరుల కొప్పు నాజిలోన్!!

   తొలగించు
  2. సత్యనారాయణ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   "యుక్తమౌ। నెరిగిన..." అనండి.

   తొలగించు
 8. జగతిని జేయు పాపములు సంచిత మంచును లెక్కజేయగా
  గగనము నంటు కీర్తిగని గాడిద కాళ్ళను బట్టె దేవుడే
  వగవక తప్పు చేయు నెడ వాంఛిత మంచు ముదావ హంబునన్
  పగతుర పాదపద్మములఁ బట్టఁగ వీరుల కొప్పు నాజిలోన్

  ప్రత్యుత్తరంతొలగించు


 9. జగతిన్నేలన్ తప్పక
  దగరములన్ త్రోసివేయ ధరణిన్ జనులా
  ర! "గకారముల" మది నిలిపి,
  పగతుర పాదములఁ బట్టవలె, వీరులకున్!

  జిలేబి

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. జిలేబీ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించు
  2. వ్హాట్సప్ లో వినికిడి:

   "రాల గాంచ జీవితాలు వెలుగు "

   ఇది ఈ వారపు ఆకాశవాణి హైదరాబాద్ వారి సమస్య .

   తొలగించు
  3. "....రేపటి కల్లా పంపాలి....."

   తొలగించు
  4. తాజా సమాచారానికి చాలచాల ధన్యవాదములు!!

   తొలగించు

  5. వచ్చె వచ్చె :)

   పూల మాల వేసి పొలతిని బిలువగ
   కలక లయను రీతి కరుణ జూప
   నిలకడగని వచ్చు నెచ్చెలి, యభిముఖ
   రాల గాంచ జీవితాలు వెలుగు!


   జిలేబి   తొలగించు
 10. జగడమునందున గురువులు
  పగవారలఁజేరి పోరు ప్రారంభించన్
  తగు గౌరవమిడ వారికి
  పగతుర పాదములఁ బట్టవలె వీరులకున్

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. అన్నపరెడ్డి వారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించు


 11. జగతిని నేలనొక్కరికి సాధ్యము గాదు గదయ్య! కాలమే
  పగగనినన్,సుసాధ్యమగు భాగ్యము?మౌర్ఖ్యమదేల మానవా!
  విగతులమై విశాల వినువీధుల బోవుట కన్న, యుక్తిగన్
  పగతుర పాదపద్మములఁ బట్టఁగ వీరుల కొప్పు నాజిలోన్ !

  జిలేబి

  ప్రత్యుత్తరంతొలగించు
 12. రగులుచు నిత్యము మదిలో
  అగుపించక దాగియుండు నరిషడ్వర్గుల్
  పగవారుగ భావించిన
  పగతుర పాదముల బట్టవలె వీరులకున్

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. శ్రీరామ్ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   "దాగియుండు నరిషడ్వర్గాల్" అనండి.

   తొలగించు
 13. తెగవేయగ శీర్షంబుల,
  బగతుర పాదములఁ, బట్టవలె వీరులకున్
  తగురీతి యుత్సహించుచు
  నగణిత శౌర్యాన ఖడ్గ మాహవమందున్.

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. వేంకట సత్యనారాయణ మూర్తి గారూ,
   విరుపుతో మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.

   తొలగించు
 14. మైలవరపు వారి పూరణ

  కీచకదురాగతం విని ఆవేశమందున్న భీమునికి ధర్మరాజు *సమయోచిత హితబోధ*.....

  మగటిమి దాచియుంచి యవమానమునైన భరించి , పంటికిన్
  దిగువనె కోపమున్ నిలిపి , నేర్పు మెలంగుము , వ్యూహబుద్ధితో
  పగతుర పాదపద్మములఁ బట్టఁగ వీరుల కొప్పు ., నాజిలోన్
  భగభగలాడు వహ్ని వలె భస్మము జేయగనౌను వైరులన్ !!

  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. మైలవరపు వారూ,
   మీ పూరణ అద్భుతంగా ఉంది. అభినందనలు.

   తొలగించు
 15. వ గ వ క వీరులు దునుమరె
  పగతు ర ;పాదములు బట్ట వలె వీరుల కు
  న్న గ పడు గురువు ల 'పెద్దల
  తగు విధ ముగ గౌర వి oప ధర్మం బ ను చు న్

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. రాజేశ్వర రావు గారూ,
   విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించు
 16. మిగలదు పటాలము మనకు,
  తెగబారెను భీష్ముడు,వినతి నిడుచు తన యం
  తగమనపు గుట్టు యడుగుము,
  పగతుర పాదములఁ బట్టవలె వీరులకున్

  భీష్ముని చావు రహస్యము కనుగొనమని ధర్మరాజుకు కృష్ణుడు తెలుపు సన్నివేశము

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. పూసపాటి వారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   "తగమనపు(?) గుట్టు నడుగుము" అనండి.

   తొలగించు
 17. డా.పిట్టా
  ప గ తు ర తో నలమైనను
  ప గ పై గురువుండవచ్చు వర కందమునన్
  ప గ నాపక లల ముల నని
  ప గ తు ర పాదముల బట్ట వలె వీరులకున్(కందం వ్రాయు రణము లోని వీరులకు)

  ప్రత్యుత్తరంతొలగించు
 18. డా.పిట్టా
  తగు జీవనమన కుస్తీ
  పగవానిని గెలువ తలను బట్టగ నీరోయ్!
  తెగ బడవేయగ నిరతము
  పగతుర పాదముల బట్ట వలె వీరులకున్

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. డా. పిట్టా వారూ,
   మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

   తొలగించు
 19. తగవులుగా దురాక్రమణ తద్థయు పెద్దగ సల్పు వారలన్,
  పగ రగిలించు వారల నవశ్యముఁజంపుట పాడియేఁగదా
  పగతుర;పాద పద్మములఁబట్టగ వీరుల కొప్పు నాజిలో
  నగణిత భారతాంబ మహిమాన్విత మాతకు పూజ సల్పుచున్

  ప్రత్యుత్తరంతొలగించు
 20. సరస్సు వద్ద యుద్ధమునకు భీముఁడు పిలువఁగా సుయోధనుడు:
  కందము.
  అగచాట్లు బడితి మనుచున్
  ముగియింపును దెలియఁ గోరి మ్రొక్కి రి గెలువన్
  వగరించుచు తాత గురుల
  పగతుర పాదములఁ బట్టవలె వీరులకున్?

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. సహదేవుడు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించు
 21. మగటిమి జూపుచు రణమున
  పగతుర నేవిధమునైన పరిమార్చుటకై
  తగ గిరగిర త్రిప్రుటకై
  పగతుర పాదములబట్టవలె వీరులకున్

  (శ్రీ గుర్రం జనార్ధన రావు, శ్రీ కోట రాజ శేఖరావధాని గార్ల పద్యాల ప్రేరణతో)

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. విజయకుమార్ గారూ,
   మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

   తొలగించు
 22. వగవక నోడగనెన్నిక
  పొగడగ యధికారపార్టి పొందగపదవిన్
  తగును ప్రజాస్వామ్యంబున
  పగతుర పాదములు బట్టవలె వీరులకున్!

  పార్టీ ఫిరాయింపుదార్లు!

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. సీతాదేవి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించు
 23. అగమన కోటి తోడ సుజనాత్ముల తోడను పెద్దవారి తో
  డ గురువు తోడ సంతులును బ్రాహ్మణ వీరుల తోడ యుద్ధమం
  దగణిత భక్తి గల్గి తను దాల్చిన బాణము సాధనంబుగా
  పగతుర పాదపద్మములఁ బట్టఁగ వీరుల కొప్పు నాజిలోన్

  నమస్కార బాణ ప్రయోగము చేయవలెనని నా భావన.

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. ఫణికుమార్ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించు
 24. గురువర్యులకు నమస్సులు. నిన్నటి నా పూరణలను పరిశీలించ ప్రార్థన.
  ధన్యవాదములు.

  తే.గీ. రావణుండంత విఫలుడై రగిలి పోవ
  ధనువు నెక్కు బెట్టుచునె నా ధరణి జాత
  మదిని గెలువంగ రాముడు ముదము తోడ
  వేలుపులు కురిపించిరి విరుల వాన!
  మ.కో. రావణుండు పరాభవమ్మున రౌద్రుడై జనుదెంచగన్
  లేవనెత్తగ విల్లు వేగమె లెమ్మనన్ రఘు రాముపై
  దీవనల్ కురిపించుచున్ గురు దేవుడంతట చూపుతో
  బ్రోవగా ధను వెక్కు బెట్టెను భూమి జాతను పొందగన్!

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. శ్రీధర రావు గారూ,
   మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

   తొలగించు
 25. కోట రాజశేఖర్ గారి పూరణ

  సందర్భం :: బృహద్రథుని ఇద్దరు భార్యలకు రెండు సగభాగాలుగా పుట్టి , జర అనే రాక్షసి చక్కగా పట్టుకోగానే సంపూర్ణ శిశువుగా మారి, పెద్దవాడై మగధదేశమున *కు* రాజై దుష్టుడుగా మారిన జరాసంధునితో యుద్ధంచేస్తూ,
  భీముడు వాని కాళ్లు పట్టుకొని వానిని రెండుగా చీల్చి , చంపివేశాడు. యుద్ధంలో అలా చీల్చి చెండాడడం కోసం శత్రువుల కాళ్లు పట్టుకోవడం వీరులైనవారికి తగిన పనియే గదా అని చెప్పే సందర్భం.

  అగణితుడౌ *బృహద్రథుని* కర్థ శరీరములే జనింప, నా
  సగములు రెండు చేర్చి *జర* చక్కగ బట్టగ నొక్క బిడ్డడై ,
  మగధ *కు* రాజుగాగ, పరిమార్చగ నెంచి *వృకోదరుండు* సం
  యుగమున వాని *పాదముల నుద్ధతి పట్టుచు* జీల్చె ; గావునన్
  *పగతుర పాదపద్మములఁ బట్టగ వీరుల కొప్పు నాజిలోన్.*

  *కోట రాజశేఖర్ నెల్లూరు.*

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. రాజశేఖర్ గారూ,
   మీది అద్భుతమైన పూరణ. అభినందనలు.

   తొలగించు
 26. తగదని పెద్దలందరును తద్దయు ప్రీతిని చెప్పిచూచినన్
  తగవునె కోరె నానృపతి తమ్ములు, కర్ణుడు వెంటనంటగా
  జగడమునందు పొందగ ప్రశాంతిని, సాధనతోడ పెద్దలౌ
  పగతుర పాదపద్మములఁ బట్టఁగ వీరుల కొప్పు నాజిలోన్
  సాధనః నేర్పు

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. అన్నపరెడ్డి వారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించు
 27. అగ మాభ ధృతి పరాక్రమ
  సగర్వ బాహుబల సహిత సాహస నిపుణా
  వగత రణ నీతి సమరా
  పగతుర పాదములఁ బట్టవలె వీరులకున్

  [సమరాపగతురు = యుద్ధములో మరణించినవారు]


  విగత యశో దురాగతులె వీరులు పాఱిన యుద్ధ మందుఁ గాం
  చ గత విభూతి సంపదల శక్తి విహీనమ రాజ్య మత్తరిన్
  నగ నిభ ధైర్య శూరు నభినందితుఁ జేయఁగ నొప్పుఁ జీల్చుచుం
  బగతుర పాదపద్మములఁ బట్టఁగ వీరుల కొప్పు నాజిలోన్

  [కొప్పు = జుట్టు]

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. పూజ్యులు కామేశ్వరరావుగారికి నమస్సులు! మీ వృత్తపూరణలోని విరుపు అద్భుతముగ నున్నది!
   నాదొక సందేహము.పగతుర యన్నప్పుడు పాదపద్మములన దగునా?పూజ్యులైన భీష్మద్రోణుల వంటివారి విషయమందు సరే! దుష్టులైన జరాసంధుని వంటివారి విషయమున?
   కేవల సందేహనివృత్తికే!భాగవతంలో హిరణ్యకశిపుడు "డింభక సర్వస్థలముల నంభోరుహ నేత్రుండ"నినట్లు!

   తొలగించు
  2. కామేశ్వర రావు గారూ,
   మీ రెండు పూరణలు ఉత్తమంగా ఉన్నవి. అభినందనలు.

   తొలగించు
  3. డా. సీతా దేవి గారు మీ యభ్యంతరము సహేతుకమే. నేను మనస్సులో మథన పడ్డాను కూడా పూరించే ముందు.
   1. శత్రువు లందఱు దుష్టులు కానవసరము లేదు. భారత యుద్ధములో భీష్మ ద్రోణ శల్యాదులవలె.
   2. శత్రువులు కర్కశ పాదులు కారు సుకుమారులే సులభ నిర్జితులే యన్న భావముతో యుద్ధము చేస్తున్నారన్న సూచనగా భావించ వచ్చు.
   3. వీరుఁడైన శత్రువును తూలనాడడము వీర లక్షణము కాదు గదా.
   పై కారణముల వలన పాద పద్మము లనడము లో తప్పు లేదను కుంటాను.

   తొలగించు
  4. పూజ్యులుశంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు.

   తొలగించు
  5. జరాసంధుడూ, దుర్యోధనుడూ, కీచకుడూ, వీరందరూ రాజుగారలో, రాజుగారి బావమరదులో కదా...మన "నరేంద్రుని" వలె...

   తొలగించు
  6. ధన్యవాదములు కామేశ్వరరావుగారూ! చక్కటి వివరణ యిచ్చారు!

   తొలగించు
  7. జి.పి.శాస్త్రిగారికి ధన్యవాదములు!

   తొలగించు
 28. .తెగబడి యుద్ధము జేసియు
  రగిలెడికోపాగ్ని మాన?రయమగువారిన్
  పగవారికి నంత్యమ్మున
  పగతురపాదముల బట్టవలె వీరులకున్|
  2.తగదని జెప్పుటొప్పదట ధర్మము-యుద్దమునందు జావగా
  రగిలెడికోపతాపములు రావట|చచ్చిన వారె దేవతల్|
  నగుపడ రింక|”బింకమికయంటనిచిచ్చున కెళ్ళునప్పుడే
  పగతుర పాదపద్మముల బట్టగ వీరుల కొప్పు నాజిలో|

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. ఈశ్వరప్ప గారూ,
   మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

   తొలగించు
 29. జగముల నేలు శ్రీహరియె చాపమునమ్ములు దాల్చి ధాత్రిపై
  దిగె, ననుజుండు శేషుడు, విదేహుని కూతురు లక్ష్మి వారితో
  పగగొన వద్దు మారిచుడు పల్కె పరాత్పరులైన నో ప్రభూ
  పగతుర పాదపద్మములఁ బట్టఁగ వీరుల కొప్పు నాజిలోన్.

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. అద్భుతమైన పూరణ! నమస్సులు!!

   తొలగించు
  2. మిస్సన్న గారూ,
   మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

   తొలగించు
  3. గురువుగారూ ధన్యవాదాలు.

   తొలగించు
  4. అమ్మా సీతాదేవిగారూ ధన్యవాదాలండీ.

   తొలగించు
 30. తగవొక కుస్తీ యగుచో
  మగసిరితో మల్లచఱచి మట్టడగించన్
  సిగపట్టులు చంక్రమణము
  పగతుర పాదములు పట్టవలె వీరులకున్

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. తిమ్మాజీ రావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించు


 31. మగటిమి లేకున్న యెడల
  పగతుర పాదములు బట్టవలె,వీరులకున్
  మగసిరి గలిగిన వైరుల
  తెగనరకంగవలె గాని దీవెన లేలా!

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. డా. ఉమాదేవి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించు
 32. గు రు మూ ర్తి ఆ చా రి
  ,,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,,,

  ( నిన్నటి పూరణ )

  శి వ ధ ను ర్భ౦ గ మే రా మా య ణ ము న కు

  కా ర ణ ము


  ఫెల్లనె విల్లు | గు౦డెలు గుభిల్లనె రాజుల

  ................. కెల్లవారికిన్ |

  జల్లనె క్ష్మాకుమారిక మన | మ్మిక

  ................... బె౦డిలి యాడె యామె యా
  ి
  వల్లభు డైన రాఘవుని | ప౦క్తిముఖు౦ డతి

  ....................... మచ్చర౦బుతో

  నుల్లము తల్లడల్లిగ గుయుక్తి పథ౦బుల

  ................ నెన్నొ రీతుల

  న్నల్లుచు ల౦కకున్ గువలయాత్మజ

  ............. దెచ్చెను | రామగాధకు

  న్నెల్లయు గారణ౦బు గద , యి౦దుధరోన్నత

  ................ ...... చాపభ౦గమే

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. గురుమూర్తి ఆచారి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించు
 33. గురువు గారికి నమస్సులు.
  జగమున రాముడే దైవము
  యుగముల్ గడిచిన నతoడు యువతకు గురువున్.
  వగచుచు రావణు హితులకు
  పగతుర పాదములు బట్టవలె వీరులకున్.

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. వెంకట నారాయణ రావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'రాముడె' అని హ్రస్వాంతంగా ఉండాలి. లేకుంటే గణదోషం.

   తొలగించు

 34. తెగనరకంగవలె సతము
  పగతుర పాదములు, బట్టవలె,వీరులకున్
  సుగుణుల చరణములకెపుడు
  తగురీతిన జూపుచుబల ధైర్యంబు లిలలో.

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. డా. ఉమాదేవి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'ధైర్యంబు లిలన్' అనండి. లేకుంటే గణదోషం.

   తొలగించు
 35. పగదెంచవలె రణమ్మున
  పగతుర, పాదములఁబట్టవలె వీరులకున్
  తగురీతిగ పెద్దలకున్
  అగణితమగు భక్తితోడ నంజలులిడుచున్!!!


  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. శైలజ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'పెద్దలకున్ + అగణితముగ' ఇక్కడ విసంధిగా వ్రాయరాదు. "పెద్దలకే యగణితమగు" అనండి.

   తొలగించు
 36. సరస్సు వద్ద యుద్ధమునకు భీముఁడు పిలువఁగా సుయోధనుడు:
  చం.
  తగవని మాదు చర్యల నధర్మ మధర్మమటంచు వాగుచున్
  ముగిసెడు మార్గమిట్లనుచు పోరున దెల్పిరి ద్రోణ భీష్ము లన్
  పగతుర పాదపద్మములఁ బట్టఁగ! వీరుల కొప్పు నాజిలోన్ 
  స్వగత విశేషమిచ్చెడు నసమ్మతు లాదరముండ వైరులన్!!

  ప్రత్యుత్తరంతొలగించు
 37. నగరె రణాన పారగను నాధుడవో మరి పూబోణివో
  మగటిమి వీడినావకట మంచిది చేకొనుమింక కుంకుమన్
  తగ పసుపున్ కొనంగదగు తద్దయు రమ్మిటు స్నానమాడగన్
  పగతుర పాదపద్మములఁ బట్టఁగ వీరుల కొప్పు నాజిలోన్"

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. చారిత్రాత్మక సన్నివేశాన్ని గుర్తుకుతెస్తున్న మీ పూరణ చాలా బాగుందమ్మా భాస్కరమ్మ గారూ! అభినందనలమ్మా. పూబోణివో అనే పదం ?

   తొలగించు
 38. అగణితమైన పరాక్రమ
  మెగసిన ఫల్గుణుడు వినయమే భూషణమై
  తగ భీష్మునకును మ్రొక్కెను
  పగతుర, పాదములఁబట్టవలె వీరులకున్

  ప్రత్యుత్తరంతొలగించు
 39. అర్జునుడు ఉత్తరునితో:

  యుగపురుషుల్ భయంకరులు యోధులు వీరులు శూరులిచ్చటన్
  తగవుకతీతు లౌదురయ! తాతలు నేతలు ద్రోణ భీష్ములున్
  పగయు నసూయ క్రోధమును పాక్షిక భావము లేని ధీరులౌ
  పగతుర పాదపద్మములఁ బట్టఁగ వీరుల కొప్పు నాజిలోన్

  ప్రత్యుత్తరంతొలగించు