21, నవంబర్ 2017, మంగళవారం

సమస్య - 2525 (పండు ముసలిని వరియించె...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
"పండు ముసలిని వరియించెఁ బంకజాక్షి"
(లేదా...)
"పండు ముసలినిన్ వరించెఁ బంకజాక్షి ప్రీతితో"
(శ్రీ నరాల రామారెడ్డి గారికి ధన్యవాదాలతో...)

109 కామెంట్‌లు:

  1. తాను చేసిన యొక చిన్న తప్పు వలన
    యంధుడైనట్టి చ్యవన మహర్షి నిలను
    యా సుకన్య కోరి వివాహమాడె నహహ
    పండు ముసలిని వరియించెఁబంకజాక్షి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. విజయ కుమార్ గారూ,
      సుకన్యా ప్రస్తావనతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "వలన | నంధుడైనట్టి.... మహర్షి ననఘు| నా సుకన్య...." అనండి. (ఇలను + ఆ... అన్నప్పుడు యడాగమం రాదు).

      తొలగించండి
    2. ధన్యవాదాలు శంకరయ్య గారూ! తరువాత గమనించాను. శ్రీ మురళీకృష్ణ గారూ! ధన్యోఽస్మి. నమో నమః.

      తొలగించండి
  2. తల్లి దండ్రుల గోల్పోయి ధనము లేక ,
    చిన్న తమ్ముల చెల్లెళ్ళ జేర దీసి;
    దండిగా నగదున్నచో, వండి పెట్టి,
    పండు ముసలిని వరియించెఁ బంకజాక్షి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ప్రభాకర శాస్త్రి గారూ,
      పేదరికం వలన వృద్ధులను పెండ్లి చేసుకున్న కన్యలెందరో ఉన్నారు. చక్కనైన పూరణ. అభినందనలు.

      తొలగించండి
  3. పండొకటె మిగిలెను చూతపాదపమున
    ఎందరో కోరి యెగిరిన నంద లేదు
    వృద్దుడొకడట కూర్చున్న వ్రీలి పడెను!
    పండు, ముసలిని వరియించెఁ! బంకజాక్షి!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సత్యనారాయణ గారూ,
      ముసలిని వరించింది పండు.. పంకజాక్షి కాదు. బాగుంది మీ పూరణ. అభినందనలు.
      "పాదపమున| నెందరో" అనండి.

      తొలగించండి
  4. వెండికొండ వెలది, వట్టి వెర్రి చెలువ!
    జగతి పుట్టక మునుపు పుట్టి గజ చర్మ
    ధారియై తిరుగాడెడు తామ్ర జటి,
    పండు ముసలిని, వరియించెఁ బంకజాక్షి!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చాలా చాలా బాగున్నది సార్!
      మూడవ పాదాంతములో ఒక మాత్ర...

      తొలగించండి
    2. అవునండీ, చూసుకోలేదు.. ధన్యవాదాలు.. :)

      వెండికొండ వెలది, వట్టి వెర్రి చెలువ!
      జగతి పుట్టక మునుపు పుట్టి గజ చర్మ
      ధారియై తిరుగాడెడు తామ్ర జడల
      పండు ముసలిని, వరియించెఁ బంకజాక్షి!

      తొలగించండి
    3. భరద్వాజ గారూ,
      ఆది వృద్ధుడు శివుని పార్వతి పెండ్లాడిందని చక్కని పూరణ చెప్పారు. అభినందనలు.

      తొలగించండి
  5. మసన మందున దిరుగుకసాయి వాని
    పునుక పేరులు ధరియించు పురహ రుండు
    పండు ముసలిని వరియించెఁ బంకజాక్షి
    మారు వేషము నందున హరుడు బలికె

    రిప్లయితొలగించండి
  6. అనఘు; డాజానుబాహుండు; నమితయశుడు;
    నటనయం దారితేరిన నమ్రమూర్తి;
    రాజకీయాల రాణించు రాజరాజు;
    పండు ముసలిని వరియించె పంకజాక్షి.

    రిప్లయితొలగించండి
  7. దండుగ తపములు జేయుచు
    మెండగు నాకొండ పైన మేలగు నంచు
    న్నుండక జడదారి నీశుని
    పండు ముసలినిన్ వరించెఁ బంకజాక్షి ప్రీతితో

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అక్కయ్యా!
      సమస్య పాదం కందం కాదు... ఉత్సాహం.

      తొలగించండి
    2. దండు గంటి తపము జేయ ధాత్రి పైన నేర్పుతో
      మెండు గాదె హిమపు కొండ మేన కమ్మ ప్రేమలో
      నుండ లేక బిచ్చ మెత్తు నూగు మీస రూప మౌ
      పండు ముసలి నిన్ వరించెఁ బంకజాక్షి ప్రీతితో
      --------------------------------------
      హమ్మయ్య కిట్టించాను. ఇక గురువుల దయ.

      తొలగించండి
    3. అక్క గారు ! మీ ఉత్సాహ వృత్తాన్ని చదువుతుంటే నిజంగా ఉత్సాహ భరితంగా నున్నది. అభినందనలు !

      తొలగించండి
    4. అక్కయ్యా,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'వంటి'ని 'అంటి' అన్నారు. అక్కడ "దండుగ యగు" అనండి. 'నూగు మీస రూప' మన్న సమాసం సాధువు కాదు.

      తొలగించండి
  8. రేవతీసతి ప్రేమార్ద్రభావ మలర
    శత్రువులనెల్ల దునుమాడి సన్మతియయి
    ధర్మమార్గానుసారియై తన్మయమున
    బండు 'ముసలిని' వరియించెఁ బంకజాక్షి.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సత్యనారాయణ మూర్తి గారూ,
      బలరాముణ్ణి 'ముసలి'గా గుర్తించి చేసిన మీ పూరణ వైవిధ్యంగా బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  9. దేవ దాసు కథ తెలియదే! వలచిన
    చెలియ దక్కక మద్యమున్ చితికె నతడు
    పండు ముసలిని వరియించెఁ బంకజాక్షి
    ఎవరి ఖర్మము నేమియో నెవరి కెరుక ?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. భళ్ళముడి వారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "ఖర్మ మదేమియో యెవరి కెరుక" అంటే బాగుంటుందేమో?

      తొలగించండి

  10. గుండు పడతి పెండ్లి గాన గూడ నంపిరెవ్వరిన్,
    బండి వెనుక బండి కట్టి? పట్టు బట్టి తానటన్,
    మొండి పిల్ల యయ్య గారి మోము జూడ యేమయెన్ ?
    పండు ముసలినిన్; వరించెఁ బంకజాక్షి ప్రీతితో!

    శుభోదయం
    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబీ గారూ,
      మీ క్రమాలంకారపు టుత్సాహ పూరణ బాగున్నది. అభినందనలు.
      'గుండు పడతి'...?

      తొలగించండి


  11. వేడుచున్ వెండి కొండ మన్నీటిని, మది
    నిండు గాంచుచు తపమున, నీలగళుని,
    పండు ముసలిని, వరియించెఁ బంకజాక్షి
    మెండు కొలుపుపెనిమిటిని మేటి గాను !


    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. వహ్వా! పారూ!!!
      మొదటి పాదం యతి అర్ధం కాలేదండి... మన్నీడు అంటే రాజు అనింది ఆంధ్రభారతమ్మ

      తొలగించండి

    2. జీపీయెస్ వారు,

      యతికేల యతి :)


      జిలేబి

      తొలగించండి
    3. జిలేబీ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మీరు యతి కేల యతి అంటే నా మతి ఊరుకుంటుందా? "కొండవ విభుని" అంటే ఎలా ఉంటుంది?

      తొలగించండి
  12. కంట తడి బుట్టు గురజాడ కథను విన్న
    పూల నాజూకు పుత్తడి బొమ్మ పూర్ణ
    లేమి తండ్రికి బుట్టెను లేమ గాను
    పండు ముసలిని వరియించెఁ బంకజాక్షి



    రిప్లయితొలగించండి
  13. మైలవరపు వారి పూరణ


    ఎనబదేళ్లకు మనుమలు మునిమనుమలు
    కూతులళ్లుళ్లు కోడళ్లు కొడుకులెల్ల
    రందముగ జేయ మరల కళ్యాణమందు
    పండు ముసలిని వరియించె పంకజాక్షి !!

    బామ్మ పంకజాక్షి..ఎలా..? ( పంకజం =నత్త.. వలె నెమ్మదిగా మూసి విప్పే కళ్లు గలది 😃అనుకోవచ్చు కూడా.. )

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి


  14. వెండి కొండ విభుడినట వేడ్క తోడ
    నిండు మది తపమొనరిచి, నీలగళుని,
    పండు ముసలిని, వరియించెఁ బంకజాక్షి
    మెండు కొలుపు పెనిమిటిని మేటి గాను!

    జిలేబి

    రిప్లయితొలగించండి
  15. డా.పిట్టా
    పంటి కోతల నరహింస బడగలేక
    పాపకగు బోసి నోటిని బార నెంచి
    మెత్తమెత్తని దవడల మేళనమని
    పండు, ముసలిని వరియించె,పంకజాక్షి!

    రిప్లయితొలగించండి
  16. తెలివి తేటలుపరికించ దేశమందు
    రాజు పోటీలు పెట్టగ రమ్యరీతి
    పండు ముసలిని వరియించె, పంకజాక్షి
    రాణి యందించు బహుమతి రాశి యపుడు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శ్రీరామ్ గారూ,
      విరుపుతో మీ పూరణ అద్భుతంగా ఉంది. అభినందనలు.

      తొలగించండి
  17. పెళ్లి కానిప్ర సాదులు పెక్కు జనులు
    క్రుళ్ళిన కుల మతపు భావ కుమతు లచట
    సేవ చేయుటకు తగిన సేతువనిన
    పండు ముసలిని వరియించె పంకజాక్షి.

    రిప్లయితొలగించండి
  18. డా.పిట్టా
    దండుకొనిన దేమి లేదు దండి రాజ్యమందహో
    అండ నిలిచె నాథు సేవ లంద జేసె కల్మిడిన్
    కొండొక రమ పార్వతీశు గూడుకొన్న చందమై
    పండు ముసలినిన్ వరించె బంకజాక్షి ప్రీతి తో!(లక్ష్మీపార్వతి &ఎన్. టీ.యార్ ల ఉదంతం)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. పిట్టా వారూ,
      సమకాలీన వృత్తాంతాన్ని ప్రస్తావించిన మీ ఉత్సాహ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.

      తొలగించండి
  19. ముసలి వేషము వేసియు మురియు నట్లు
    నాటకం బు న చెలి కాడు నటన జేయ
    మనసు పడి నట్టి సుందరి మరులు తోడ
    పండు ముసలిని వరి యించె పంకజా క్షి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రాజేశ్వర రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'మరులతోడ' అనండి.

      తొలగించండి
  20. అప్పు తీర్చగ లేడాయె నామె తండ్రి
    యప్పు బదులుగా ఋణదాత యామె చేయి
    కోర:తండ్రి ఋణ విముక్తి కొరకు తుదకు
    పండు ముసలిని వరియించె పంకజాక్షి.

    రిప్లయితొలగించండి
  21. కండకావరంబుతోడ కళ్ళు పొడువ మౌనికిన్
    దండజేసె శాపమిచ్చి తాను రాజ్యమంతకున్
    మండలంపు బాగు కోరి మండలేశు పుత్రి దా
    పండు ముసలినిన్ వరించెఁ బంకజాక్షి ప్రీతితో

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఫణికుమార్ గారూ,
      సుకన్యా ప్రస్తావనతో మీ పూరణ చక్కగా ఉంది. అభినందనలు.

      తొలగించండి
  22. చెలులు గేలి చేసె పెండ్లి చేసు కొనము భర్తగా
    పండు ముసలినిన్;-వరించె పంకజాక్షి ప్రీతితో
    సత్యభామ,దేవదేవు,చక్రి,కృష్ణు,శౌరి
    నా
    నందనందనున్,మహాత్ము,నళిననేత్రు నవ్యయున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ప్రసాద రావు గారూ,
      మీ ఉత్సాహ పూరణ (ముఖ్యంగా చివరి రెండు పాదాలతో) మనోహరంగా ఉంది. అభినందనలు.
      చెలులు బహువచనం. చేసె ఏకవచనం... అక్కడ "చెలులు గేలిసేయ..." అనండి.

      తొలగించండి
  23. నంది చాటింపు జేసిన నష్టమెంచి
    మూడుపూటల జనులకు ముద్దయమర
    ముచ్చటగ సాగుజేయగ మూడుపుట్లు
    పండు,ముసలిని వరించె పంకజాక్షి

    ముసలికి రూఢ్యర్ధం బలరాముడైనా హలాయుధుడు రైతుగా యిచట
    నుపయోగించడం జరిగింది!!












    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సీతాదేవి గారూ,
      వైవిధ్యంగా పూరించాలన్న మీ ఉత్సాహం ప్రశంసనీయం. కాని ముసలం అంటే రోకలి. నాగలి కాదు!

      తొలగించండి
    2. వందనములు గురుదేవా! ముసలం అంటే రోకలియని తెలుసు.కాని బలరామునికి హలాయుధం కదా!ముసలియని పేరు ఎందుకు వచ్చింది? దయచేసి వివరించగలరు

      తొలగించండి
    3. బలరామునికి ముసలం (రోకలి) కూడా ఒక ఆయుధం. అందుకే అతనిని 'ముసలి' అంటారు.

      తొలగించండి
    4. ధన్యవాదములు గురుదేవులకు, శాస్త్రిగారికి!రోకలి కూడ ధాన్యం దంచడానికి ఉపయోగపడే వ్యవసాయ పనిముట్టు కదా!

      తొలగించండి
  24. కవిమిత్రులారా! నమస్కృతులు. ఇంకా ప్రయాణంలోనే ఉన్నాను. మన్నించండి.

    రిప్లయితొలగించండి
  25. అయిన వారె చూపక సుంత యాదరణను
    మణిని బోలెడు తన యభిమాన నటుడు
    భార్య గోల్పోయి దీనుడై వగచు చుండ
    "పండు ముసలిని వరియించెఁ బంకజాక్షి"

    రిప్లయితొలగించండి
  26. బిడ్డ సంపాదనన్ గోరి పెళ్లి మఱువ
    వలచి వచ్చిన చెలికాని వలదటన్న
    రొక్కము తలిదండ్రి కొసఁగు రూపు మార్చ
    పండు ముసలిని వరియించెఁ బంకజాక్షి!
    (సినిమా ఫక్కీలో)

    రిప్లయితొలగించండి
  27. ఆపె నిరుపేద తలిదండ్రులు లాకటికిని
    జిక్కి విలపింప చెల్లెండ్రు చింతిలంగ
    కడుపు నింపంగనేదారి కానరాక
    పండు ముసలినివరియించె బంకజాక్షి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. భాస్కరమ్మ గారూ,
      కరుణ రస పూర్ణమైన మీ పూరణ చక్కగా ఉంది. అభినందనలు.
      "తలిదండ్రు లాకటికిని" అనండి. (టైప్ దోషం కదా!)

      తొలగించండి
  28. కోట రాజశేఖర్ గారి పూరణ

    సందర్భము :: రేవతి తండ్రి రైవతుడు తన కుమార్తెకు భర్త యెవడు? అని అడిగినప్పుడు బ్రహ్మదేవుడు ‘’ *తగిన వరుడు (ముసలమును అనగా రోకలిని ఆయుధముగా గలిగియుండు ముసలి) బలరాముడే* ‘’ అని చెప్పిన సందర్భం.

    పతి యెవడు? రేవతికి నన బ్రహ్మ పలికె,
    ‘’ *ముసల మాయుధముగ గల పుణ్యమూర్తి*
    *పతిగ బలరాముడె తగు, రేవతికి నోము*
    *పండు* ‘’. ముసలిని వరియించె పంకజాక్షి.

    *కోట రాజశేఖర్ నెల్లూరు.*

    రిప్లయితొలగించండి
  29. పేద యింటి పిల్ల పెరిగి పెద్దదాయె
    తల్లిదండ్రుల సుఖబెట్ట దలచి కోరి
    పండు ముసలిని వరియించెఁ బంకజాక్షి
    శుల్కము గొని జీవించెను సుఖముగాను ౹౹

    రిప్లయితొలగించండి
  30. మెండుగను సినీమతీయ మేలుగాగ నొక్కచో
    దండిగను నటీమణిన్ సుతారమొప్ప వృద్ధునిన్
    పెండిలికిని సిద్ధపర్చ పెంపుగా నటింపుచున్
    పండు ముసలినిన్ వరించె పంకజాక్షి ప్రీతితో

    రిప్లయితొలగించండి
  31. పేదరిక మంత దుఃఖమ్ము మేది నందు
    నరయ మృగ్యమ్ము ధనవంతుఁ డంచు నెట్టు
    లేని వరియించు మన బీదవాని, రోసి
    పండు ముసలిని, వరియించెఁ బంకజాక్షి

    ఉత్సాహము:
    అండఁ గోరి రేవతి విమలాంగి యంత నాది శే
    షుండు రోహిణీ సుతుండు శూర వరుఁడు వాసు దే
    వుండు నంబుజ దళ నయను బూజ్యు ముసల ముండ గం
    బండు ముసలినిన్ వరించెఁ బంకజాక్షి ప్రీతితో

    [పండు = శయనించు; ముసలి = బలరాముఁడు]

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కామేశ్వర రావు గారూ,
      మీ రెండు పూరణలు వైవిధ్యంగా ఉత్తమంగా ఉన్నవి. అభినందనలు.
      'మేదిని+అందు' అన్నపుడు సంధి లేదు కదా!

      తొలగించండి
    2. పూజ్యులుశంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు. అవునండి పొరపాటయింది.సవరణను తిలకించఁ గోర్తాను.

      పేదరిక మంత దుఃఖమ్ము మేదిని మన
      మరయ మృగ్యమ్ము ధనవంతుఁ డంచు నెట్టు
      లేని వరియించు మన బీదవాని, రోసి
      పండు ముసలిని, వరియించెఁ బంకజాక్షి

      తొలగించండి
  32. తండ్రికోరికమేరకుతప్పనిదయి
    పండుముసలినివరియించెబంకజాక్షి
    యెవరెవరుబంధమోదైవమెరుక,తోలు
    బొమ్మలముమాత్రమేమన మిమ్మహినిసు

    రిప్లయితొలగించండి
  33. గురువర్యులకు నమస్సులు. నిన్నటి నా పూరణను పరిశీలించ ప్రార్థన.
    ధన్యవాదములు.

    అన్నమయ్య పలుకు లమృతపు ధారల
    న్నటుల తిరుమలేశు నందుకొనియె!
    మధుర గాన లహరి మైమరపించెన
    య్య జగమేలు స్వామి భజన తోడ!

    రిప్లయితొలగించండి
  34. తండ్రిమాటతీర్చుటకునుదలిరుబోడిదానుగా
    పండుముసలినిన్ వరించెబంకజాక్షిప్రీతితో
    యండలేనిచోటసామి!యండదొరకెనంచునా
    పండుముసలినిన్ వరించుమార్గమొక్కటేగదా

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సుబ్బారావు గారూ,
      మీ ఉత్సాహ పూరణ బాగున్నది. అభినందనలు.
      "ప్రీతితో నండలేని..." అనండి.

      తొలగించండి
  35. *కాటికిన్ కాలుజాపిన కంబగిరియు*
    *లాటరీటిక్కెటున్ గొనెఁ కోటి గెల్చె*
    *నిష్టపడెను జూడుమిలనదృష్టలక్ష్మి*
    *పండుముసలినివరియిoచె! పంకజాక్షి!*

    *శ్రీమతి జి సందిత బెంగుళూరు*

    మీనాక్షి పంకజాక్షి తో అన్నది .

    రిప్లయితొలగించండి
  36. శాపమందు యయాతియుసహజ మైన
    యవ్వనంబును గోల్పోయి నలరు చున్న
    వేషభాషలు నచ్చిన వెలదియొకతె
    పండు ముసలినిపెండ్లాడె పంకజాక్షి
    నాటకంబున ప్రేమతో నటనమెచ్చి|

    రిప్లయితొలగించండి
  37. .మధ్యాక్కర
    నిండు మనసుగల”మమత”నిత్యనాటకమందుజూచి
    అండ దండగ యాలుమగలు నాటలాడినచనువందు
    నిండ|ముదసలి వేషమున నేర్పు జూచియు కూర్మి యందు
    పండు ముసలి నిన్ వరించె|బంకజాక్షి ప్రీతి తోడ|

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఈశ్వరప్ప గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      "...గోల్పోయి యలరుచున్న" అనండి.

      తొలగించండి
  38. గు రు మూ ర్తి ఆ చా రి
    ,,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,,


    బాల్య మ౦దు మాతాపితల్ ప్రమయ మ౦ద

    ధైర్యవతియౌచు మనుచు యుక్తపు వయసున

    దార గతియి౦ప గు౦దెడు ధనికు నొకని -

    ప౦డుముసలిని - వరియి౦చె " ప౦కజాక్షి " |

    తనకు గలిగిన సోదరీ త్రయము నామె

    యున్నతముగ పఠి౦పి౦చు చుధ్దరి౦చె |

    బాలికలు నేడు నివ్విధి స్వార్థ ముడిగి ,

    బ్రతికిన న్ మన స౦ఘము బాగు పడును !

    { ప్రమయమ = మరణము }

    రిప్లయితొలగించండి
  39. క్రొవ్విడి వెంకట రాజారావు:

    వాక్కులందు నాపై నెగ్గు వాని నేను
    పెండ్లి యాడెద నన్నట్టి పిల్ల తోడ
    పంతగించి గెలిచిన శుభాంగుడైన
    పండుముసలిని వరియించె బంకజాక్షి


    రిప్లయితొలగించండి
  40. తల్లి మరణించ తనచిన్న తనమునందె
    ప్రీతి సాకిన పితరుని వేదనగని
    తనకుటుంబపు బాధ్యత తలచిమదిని
    పండు ముసలిని వరియించె పంకజాక్షి

    రిప్లయితొలగించండి
  41. కోండ కోన లందు తిరుగు కోయజాతి చిన్నదీ
    తిండిలేకసంతతమ్ము తిప్పలఁ బడు చుండి తా
    దండిగాను ధనము కలిగి తన్ను కోరు చున్న నా
    పండు ముసలినిన్ వరించెఁ బంకజాక్షి ప్రీతితో

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్నపరెడ్డి వారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      'చిన్నదీ' అని దీర్ఘాంతం ?

      తొలగించండి
  42. దండిగ పైకము గలదని
    పండు ముసలినిన్ వరించెఁ బంకజాక్షి ప్రీతితో
    మెండగు నాశయు మనమున
    నిండగ మారాడకుండ నెమ్మిని తానున్.

    వయసు మీరె నని దలచి బాధ పడక
    పండు ముసలిని వరియించెఁ బంకజాక్షి
    తమియు నిండగ మదిలోన తనకితండె
    దైవ మనుచును కొలుచుచు ధరణి యందు.

    తాను తెలియక చేసిన తప్పిదంబె
    బంధు జనులకు నెల్లను బాధ కూర్చ
    పండు ముసలిని వరియించెఁ బంకజాక్షి
    మారు మాటాడకలనాడు మహి సుకన్య.

    తే.గీ.:సవతి తల్లి యెంచె వయసు సడలి నట్టి
    వాని కిచ్చి పెండ్లి జరుప వాసి గాను
    పండు ముసలిని,వరియించె పంకజాక్షి
    ముసలి వానిని కాదని మురిపె మలర
    నంగ వికలుడైనట్టి యా యవిటి వాని.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఉమాదేవి గారూ,
      మొదటి పూరణ కందంలో చేశారు. సమస్య ఉత్సాహంలో ఉంది.
      మిగిలిన పూరణలన్నీ బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
    2. గురుదేవులకు వినమ్రవందనములు. సరదగా సమస్యాపూరణ.
      ===≠===============/===
      తిరుమలేశుని స్మరించి తీసు కొనగ
      పండు ముసలిని వరియించె పంకజాక్షి
      లాటరీ నేడు నది శంకరాభరణము
      నందున సమస్య యైయ్యను విందు జేయ !

      తొలగించండి
  43. ఉత్సాహము
    అండదండ లేరటంచు నమ్మనాన్న భీతితో
    నుండి కూతు పెండ్లి జేయ నొప్ప కుండ్రి ప్రేమికున్
    దండి డబ్బు లిత్తునంచు దాల్చ మారు రూపమున్
    పండు ముసలినిన్ వరించెఁ బంకజాక్షి ప్రీతితో!

    రిప్లయితొలగించండి
  44. పరువుకై తల యొగ్గిన పార్వతి యట
    దేవదాసు కాదనుచు నాస్తి పరుడైన
    పండు ముసలిని వరియించె! బంకజాక్షి
    పెద్ద వారల మన్నించె ప్రేమ విడచి!

    రిప్లయితొలగించండి
  45. పండువంటి సుబ్బిఁగోరు పాడుబడ్డ లుబ్ధునిన్
    గండగోలు జేయబూని కరటకుండి శిష్యుడై
    గుండుమీద గుడ్డగప్పి గుప్పుచుప్పు గానహా
    పండు ముసలినిన్ వరించెఁ బంకజాక్షి ప్రీతితో!

    రిప్లయితొలగించండి