18, నవంబర్ 2017, శనివారం

సమస్య - 2523 (భరతుఁ దునిమె...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది.... 
"భరతుఁ దునిమె రాఘవుండు భామిని కొఱకై"
(లేదా...)
"భరతు వధించె రాఘవుఁడు భామినికై సదసద్వివేకియై"
(కంద పాద సమస్య పంచసహస్రావధాని జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు పూరించినది - 
'అవధాన విద్యాసర్వస్వము' నుండి)

89 కామెంట్‌లు:

  1. తరుణి శకుంతల కన్నదె
    వరిని? తెలుపు రావణుండ వధియించిన దె
    వ్వరత డెవరి కొరకనగన్
    భరతు దునిమె రాఘవుడు భామిని కొరకై.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. విరించి గారూ,
      క్రమాలంకారంలో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      చివరి పాదంలో సమాధానాల కనుగుణంగా కామాలు పెడితే సుగమంగా ఉంటుంది.
      'రావణుండ' అన్నది అన్వయించడం లేదు. "రావణాఖ్యు/ రావణ ఖలు" అనండి.

      తొలగించండి
  2. పరసతికాశఁజెంది తన వారినలక్ష్యముఁజేసి దుష్టుడై.
    వరలెను రావణాసురుడు-భ్రష్టత జెందెను వానినాజిలో.
    సురవర పూజితుండు కడు క్షోభ వహించి పరాక్రమించి లో.
    భ,రతు వధించె రాఘవుడు భామిని కై సదసద్వివేకియై

    రిప్లయితొలగించండి
  3. అరయగ శకుంతల కనెను;
    తరలింపగ యమ పురికిని తారా విభునే;
    మరణము గొనె రావణుడే;
    "భరతుఁ ; దునిమె రాఘవుండు ; భామిని కొఱకై"

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జనార్దన రావు గారూ,
      క్రమాలంకారంలో మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.

      తొలగించండి
  4. ధరణిన ధర్మము దేవత!
    సరియగు దానిని నిలుపుట; స్వధర్మంబౌ!
    అరరె! తన నిర్ణయముతో
    భరతుఁదునిమె రాఘవుండు భామిని కొఱకై!

    వచ్చి మమ్ము మా రాజ్యాన్ని యేలుకో అన్నా, అని పిలిస్తే, ఇదే ధర్మం, అని తన తమ్ముని ఆశను ఖండించెను. అది, ధర్మము అనే ఆడుదాని కోసమే కదా!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. భరద్వాజ్ గారూ,
      బాగుంది మీ పూరణ. అభినందనలు.
      'సద్ధర్మంబౌ' అనండి. లేకుంటే గణదోషం.

      తొలగించండి
  5. అరయగ సంస్కృతమందున
    విరివిగ జ్ఞానమ్ము లేని విబుధుండనియెన్:
    "కిరికిరి జేసెడి యసురస
    భరతుఁ దునిమె రాఘవుండు భామిని కొఱకై"

    ఈ పండితపుత్రుని సమాసము:
    అసుర సభ రతుడు = రాక్షస సభ ప్రియుడు (రావణుడు) 😂

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ప్రభాకర శాస్త్రి గారూ,
      మనోహరమైన పూరణ. అభినందనలు.
      'సభ రతుడు' సాధువే అని మైలవరపు వారన్నారు.

      తొలగించండి
  6. పరుసపు పలుకుల ములుకులు
    సరసము గాగ్రుచ్చి గ్రుచ్చి సంతస మొందన్
    పరసతి నికోరె యసురుడు
    భరతుఁ దునిమె రాఘవుండు భామిని కొఱకై

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అక్కయ్యా,
      మీ ప్రయత్నం ప్రశంసనీయం.
      అసురుడు భరతు డెలా అయ్యాడు? 'కోరె నసురుడు' అనవలె. అక్కడ యడాగమం రాదు.

      తొలగించండి
  7. అవని జాతను సీతమ్మ నపహరించి
    లంకలోనుంచి లౌల్య సల్లాపములను
    పలుకు రావణు మోహ లో’భ రతు దునిమె
    రాఘవుండు భామిని కొఱకై’ ఘనుండు

    పరి పూతను భూజాతను
    హరియించిన రావణు దురహంకారు కుమా
    ర్గ రతాత్ము మోహ మద లో
    భ రతు దునిమె రాఘవుడు భామిని కొఱకై

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. విజయకుమార్ గారూ,
      మీ రెండు పూరణలు ఛందోవైవిధ్యంతో ఉత్తమంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
  8. సుర సేవించినవాడొక
    డురుతరముగ దూలుచుండి యున్మాదముతో
    తిరుగుచు బలుకుచు నుండెను
    భరతుఁ దునిమె రాఘవుండు భామిని కొఱకై.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సత్యనారాయణ మూర్తి గారూ,
      సురాపాన మత్తుని మాటగా మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  9. పంచసహస్రావధాని జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి గారి పూరణ....

    హరిసుతునిం బరిమార్చెను
    సిరిగురు నొప్పించె శమము చెడి రావణునిన్
    హర పాద సేవనారం
    భ రతుఁ దునిమె రాఘవుండు భామిని కొఱకై.

    రిప్లయితొలగించండి
  10. మైలవరపు వారి పూరణలు

    1)

    పరవనితారతు, లంకా
    పురపాలకు , శంకరపద పూజా విధిలో
    నిరత *శ్రీ కాళ గజ* ని..
    భ రతుని రాఘవుడు చంపె భామిని కొరకై !

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి


    2)

    ధరణిని తండ్రి మాటకయి తా నటవీస్థలి జేరి సీతతో ,
    నిరవుగ స్వీయ పాదుకలనిచ్చి యయోధ్యకు బంపి తమ్మునిన్
    భరతుని , జంపె రాఘవుడు భామినికై సదసద్వివేకియై
    దురితుని , కామమోహితుని దుష్టు దశాస్యుని నాజి నుగ్రుడై !!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మైలవరపు వారూ,
      మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
  11. కందం
    త్వరితముగ వైరభక్తిన్
    దరియించఁగఁ దాను గోరి దానవ జన్మన్
    వరమొసఁగిన సరసిజ నా
    భ రతుఁ దునిమె రాఘవుండు భామిని కొఱకై

    రిప్లయితొలగించండి
  12. మిత్రులందఱకు నమస్సులు!


    ధరణిజ హర్తనున్, సుర వితాన నియంతను, దైత్య భూపునిన్,
    వరబల గర్వితున్, గిరిశ భక్తుని, నష్ట దిశేశ శత్రునిన్,
    వర ముని బాధకున్, దనుజ వంశ వినాశకు, రావణాఖ్యు, దం
    భ రతు వధించె రాఘవుఁడు భామినికై సదసద్వివేకియై!

    రిప్లయితొలగించండి
  13. తరు ణిని గావగ వెడలి యు
    దురము న రావణు ని గది య తోరపు ధీరుo
    డ రి భీకర సమ రారo
    భ ర తు దునిమె రాఘవు oడు భామిని కొరకై

    రిప్లయితొలగించండి

  14. మరుకము పై పిరియము జడ
    భరతుఁ దునిమె; రాఘవుండు భామిని కొఱకై,
    శరణాగతి గనని యసురు
    ని రణమున దునిమె ; జిలేబిని దునిమె కందమ్ !

    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబీ గారూ,
      పూరణలో ప్రథమార్ధం అర్థం కాలేదు. 'కందమ్' అని హలంతంగా ప్రయోగించరాదు.

      తొలగించండి

    2. కంది వారు నమో నమః

      జె వర తుని వృత్తాంతం ! మరుకము జింక పై ప్రేమ (జడ భరతుని ప్రేమ జన్మ రా హి త్ యాన్ ని కోరుకున్నవాడిని దునిమె )


      జీవుడు చనిపోయే సమయంలో దేని గురించి ఆలోచిస్తే, ఆత్మ తిరిగి ఆ రూపం తీసుకుంటుందంటారు. జన్మరాహిత్యం కోరిన భరతుడు చివరి దశలో ఆ లేడిపిల్లను చేరదీసి, దాని ధ్యాసలో పడి మరణించడం వల్ల మరుజన్మలో ఆయన లేడిగా పుట్టవలసి వచ్చింది. కథ కొనసాగుతోంది యిలా మన అందరిదీ , జిలేబి ని ప్రస్తుతానికి కందం :)


      జిలేబి

      తొలగించండి
  15. దురమున రామలక్ష్మణులు దోర్బల వీరులు విక్రమించి దు
    శ్చరితుని సైన్యమెల్లరను జంపుచు నుండగ రావణానుజుం
    డరి జన భంజకుండు గని రావణు బంపున నేగుదెంచ జం
    భ రతు వధించె రాఘవుఁడు భామినికై సదసద్వివేకియై

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఫణికుమార్ గారూ,
      తిండిపోతును 'జంభరతు'డన్న మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
    2. గురువుగారూ నమస్సులు. ధన్యవాదములు.

      తొలగించండి
  16. వరముల బొంది కైక తన భర్తను గోరెను స్వార్థ బుద్ధితో
    తరుణము నంది పుచ్చుకుని దారుణ రీతిని ఱేని జేయగన్
    "భరతు ; వధించె రాఘవుఁడు భామినికై సదసద్వివేకియై"
    దురితుని,రావణాసురుని, దుష్టుని,క్రూరుని లాఘవమ్ముగన్.

    రిప్లయితొలగించండి
  17. కోట రాజశేఖర్ గారి పూరణ

    సందర్భం :: వర బల గర్వితుడై , కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యములనే అరిషడ్వర్గములకు లోనై , సీతాదేవిని అపహరించిన *రావణుని , శ్రీరాముడు వధించిన సందర్భం.*

    ధరణిని వానరుల్ నరులు దప్ప, మరొక్కరు చంపకుండ , దా
    వరముల గాంచినాడు , *చెరపట్టెను సీతను రావణుం* డదే
    మరణము గాగ, క్రోధ మద మత్సర శీలుని, కామ మోహ లో
    *భ రతు , వధించె రాఘవుడు , భామినికై సదసద్వివేకియై.*

    *కోట రాజశేఖర్ నెల్లూరు.*

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రాజశేఖర్ గారూ,
      మీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
    2. శ్రీ కంది శంకరయ్య గురువరేణ్యులకు హృదయపూర్వక ప్రణామాలు. కోట రాజశేఖర్ , నెల్లూరు.

      తొలగించండి
  18. (మహర్షి శాపోపహతులైన జయవిజయులలో రావణుడైన జయుని శ్రీరాముడు సంహరించటం)
    నిరతము హరిశుభచరణము
    మరువని రావణుడగు జయు,మహితోద్దామున్,
    మరణాసక్తున్,మోక్షా
    భరతు దునిమె రాఘవుండు భామిని కొరకై.

    రిప్లయితొలగించండి
  19. అరవిందాసన వల్లభ
    వర కుల సంజాత యశుఁడు వజ్రధర వరా
    మర ముని నికాయ సంక్షో
    భ రతుఁ దునిమె రాఘవుండు భామిని కొఱకై


    పరమ పతివ్రతా సతినిఁ బార్థివ వీర కుమార పత్నినిన్
    వర రవి వంశ రామ సతిఁ బావని మాయ హరించఁ క్రుద్ధుఁడై
    వర బల గర్వితుండును క్షపాచరుఁ డా దశకంఠు ఘోర దం
    భ రతు వధించె రాఘవుఁడు భామినికై సదసద్వివేకియై

    [దంభ రతుఁడు = కపటము నందు నాసక్తి కలవాఁడు]

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కామేశ్వర రావు గారూ,
      మీ రెండు పూరణలు ఉత్తమంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
    2. పూజ్యులుశంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు.

      తొలగించండి

  20. మరుకపు రూపమందు సయి మాయల జేయ నతండు, సీత తా
    మరకనులున్ చమక్కుమన, మత్తును గొల్పి, మరింత భీతిగా
    పరుగిడె తాటకేయుడట ! బాణము చువ్వన, విప్రలంభ, డం
    భ రతు వధించె, రాఘవుఁడు భామినికై సదసద్వివేకియై!

    జిలేబి

    రిప్లయితొలగించండి
  21. గు రు మూ ర్తి ఆ చా రి
    ,,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,,


    ధరణిజ c దస్కరి౦చిన కతమ్మున ,

    . . గ్రోధితు డైన రాము డ

    ప్పరమ పరాక్రమ స్థిరుడు - భాస్కర వ౦శ

    . . పయోధి చ౦ద్రుడే

    తురమున బ౦క్తి క౦ధరుని ద్రు౦చె | నిర౦తర

    . . కామినీ ప్రలో

    భ రతు వధి౦చె రాఘవుడు భామినికై -

    . . సద సద్వవేకియై

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గురుమూర్తి ఆచారి గారూ,
      మీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
  22. ధరిణిజ జానకిన్ గొని ముదమ్మున లంకకునేగినట్టి యా
    దురిత చరిత్రు రావణుని దోర్బలభూషితు శంభు భక్తునిన్
    పరుష వివాద భాషితుని పద్మదళేక్షుని యందు ద్వేషసం
    భ రతు వధించె, రాఘవుఁడు భామినికై సదసద్వివేకియై!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. భాస్కరమ్మ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'సంభరితుడు' ఉంది కాని 'సంభరతుడు'?

      తొలగించండి
  23. అరయగ మునిరూపమ్మున
    నరుదెంచి విదేహపుత్రినక్కట గొని తా
    నరిగిన దనుజుని యఘ సం
    భ రతుఁ దునిమె రాఘవుండు భామిని కొఱకై

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. భాస్కరమ్మ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ఇక్కడ కూడా 'సంభరతుడు'...?

      తొలగించండి
  24. దురితమనస్కుడై కలిమి తొయ్యలి సీతను దొంగిలించగా,
    కరమగు నాగ్రహమ్ము మదికల్గగ, రావణు మానినీ ప్రలో
    భ రతు, వధించె రాఘవుఁడు భామినికై సదసద్వివేకియై
    సురవర మౌని వర్యతతి సొక్కుచు చల్ల సుమమ్ములుర్విపై

    రిప్లయితొలగించండి
  25. తరుణులలోనొకభామిని
    విరివిగసేవించికల్లువివశతకలదై
    యరకొరమాటలనిట్లనె
    భరతుదునిమెరాఘవుండుభామినికొరకై

    రిప్లయితొలగించండి
  26. గురువు గారికి నమస్సులు.
    పరసతి దశకంఠునికిన్
    వరమని తలచిన నసరుడు వ్యాఘ్రం బయ్యెన్
    శరణు వేడని మోహాం
    భరతుని దునిమె రాఘవుండు భామిని కొఱకై.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మొహాం బదులుగా నారంభ చదువ మనవి.
      మోహంభరథుని అనే పదం నిఘంటువు లో కానీ పెద్ద కవులు ప్రయోగంచ లేదని అవధాన మిత్రుడొకరు తెలిపినారు.

      తొలగించండి
    2. వెంకట నారాయణ రావు గారూ,
      పూరణలో మీ భావం అర్థం కాలేదు. అసరుడు.. టైపాటు అనుకుంటాను. "శరణము వేడని" అనండి. లేకుంటే గణదోషం.

      తొలగించండి
  27. ధరణికి రాజుగ జేసెను
    భరతుఁ, దునిమె రాఘవుండు భామిని కొరకై
    వరగర్వముచే చెలగుచు
    ధరణిజ నంకించునట్టి దశకంఠునిలన్!!!

    రిప్లయితొలగించండి
  28. స్థిరమని నమ్మక కోర్కెలు
    భరతు దునిమె”|”రాఘవుండు భామిని కొరకై
    వరగర్వుండగురావణు
    పరిమార్చగ లంక జేరిపంతమునిలిపెన్”|
    2.వరమని రామపాదుకలు పట్టముగట్టియు|”నాశదోషముల్
    భరతు వధించె|”రాఘవుడు భామినికై సదసద్వివేకియై
    తరుగని రాక్ష సత్వమున ధర్మముజిట్లగ|రక్ష ణార్థమై
    మరణము బంచె రావణునిమత్సరమంతయురూపుమాపగా”|



    రిప్లయితొలగించండి


  29. కరమభినందించెనుతా

    భరతుఁ, దునిమె రాఘవుండు భామిని కొఱకై"*

    వరమందిన యసురవరుని

    మరలెనయోధ్యా నగరుకు మహిజా యుతుడై.


    ధరపాదుకలెవరికొసగె?

    వరగర్వితుడైన యసురవరునా విభుడే

    మరకటములసాయముచే

    భరతుఁ దునిమె రాఘవుండు భామిని కొఱకై.

    రిప్లయితొలగించండి

  30. ఏమండోయ్ జీపీయెస్ వారు

    ఆకాశవాణి సమస్య లేదా ఇవ్వాళ?

    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పాలకు తైలమట్లు నిలువన్ వెలుగొందు ప్రజాళి గుండియల్

      తొలగించండి
    2. జిలేబీ గారు:

      నేను రేడియో టీవీలను "వినను కనను మూర్కొనను"... శ్రీహర్ష గారు వ్హాట్సప్ లోనుంచిన విషయములను తస్కరించి ఇట ప్రచురించుచుంటిని.

      🙏🙏🙏

      తొలగించండి

    3. శ్రీహర్ష గారికి జీపీయెస్ గారికి నెనరులతో

      బాలకుమార! చక్కగను భారము దీరగ మేలు గానగన్,
      వేలకు వేలు వచ్చు మన వెల్లువ గాంచు తలంపు లన్నిటిన్
      మూలములోన ద్రుంచగను ముమ్మడి యోగము లెల్ల జేయగన్,
      పాలకు తైలమట్లు నిలువన్, వెలుగొందు ప్రజాళి గుండియల్


      జిలేబి

      తొలగించండి
    4. రాజేశ్వరి గారు:

      మీ పద్యం, మీ పేరు, ఈ రోజు శ్రీహర్ష గారు పెట్టిన ఆడియో క్లిప్ లో వినిన గుర్తు. నాకు చెముడు కదా!!!

      తొలగించండి


    5. ఆడియో లింకెక్కడండి జీపీయెస్ వారు ?

      తొలగించండి
    6. ఆహా! శ్రీహర్ష గారు విని రికార్డు చేసి శంకరాభరణం వ్హాట్సప్ సమూహములో నుంచితిరి. బ్లాగులో ఆడియోలు, విడియోలూ, ఫోటోలూ రావనుకుంటాను. మరొక్క సారి శ్రద్ధగా విని ఐదు నిముషాలలో చెబుతాను..

      తొలగించండి
    7. అబ్భ! నా చెవిటి చెవ్వుతో వినిన, నాకు తెలిసిన పేర్లు:

      చంద్రమౌళి సూర్యనారాయణ గారు, గుండా వేంకట సుబ్బసహదేవుడు గారు, సీతా దేవి గారు, మాచవోలు శ్రీధర్ గారు, నేదునూరి రాజేశ్వరి గారు, (చాలా ఇంటి పేర్లతో) ప్రసాద రావు గారు, శ్రీహర్ష గారు... నిశ్చితముగా... చాలా పేర్లు మిస్ అయి ఉండవచ్చు. క్షమాపణలు!

      తొలగించండి
    8. పోచిరాజు సుబ్బా రావు గారు కూడా!

      తొలగించండి
  31. వరముగ గోరె నయోధ్యకె
    వరినా కైకయె విభునిగ? బలిగొనె లంకే
    శ్వరుని రఘురాముడెందుకు?
    *భరతుఁ! దునిమె రాఘవుండు భామిని కొఱకై*

    తిరుక్కోవళ్ళూరు శ్రీహర్ష

    రిప్లయితొలగించండి
  32. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  33. దురితులు ద్వారపాలకులు దోషముఁ జేసిరటంచు మౌనియే
    కొరకొర జూచి శాపమిడ క్రుంగుచు మాధవు నార్తివేడుచున్
    ద్వరితము వైరభక్తి హరి పంచన జేరఁగ గోరు పద్మనా
    భ రతు వధించె రాఘవుఁడు భామినికై సదసద్వివేకియై

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సహదేవుడు గారూ,
      మనోహరమైన పూరణ. అభినందనలు.

      తొలగించండి
    2. ధన్యోస్మి గురుదేవా. కొద్దిపాటి సవరణతో

      దురితులు ద్వారపాలకులు దోషముఁ జేయఁగ మౌనిపుంగవుల్
      కొరకొర జూచి శాపమిడ క్రుంగుచు మాధవు నార్తివేడుచున్
      ద్వరితము వైరభక్తి హరి పంచన జేరఁగ గోరు పద్మనా
      భ రతు వధించె రాఘవుఁడు భామినికై సదసద్వివేకియై

      తొలగించండి
  34. డా.పిట్టా
    నిరతిని బాటింపక రతి
    కరమర లేనట్టి వదిన కాముకు,తమ్మున్
    కరకర గోసె హుటాహుటి(వార్త,రామాయణ పాత్రలు కావు)
    భరతు దునిమె రాఘవుండు భామిని కొరకై!(విపరీత పరిస్థితిని సాధారణీకరణ జేస్తూ సామ్యము జూపే యత్నము,ముక్కు పై వ్రేలు వేసికొని)

    రిప్లయితొలగించండి
  35. డా}.పిట్టా
    వరములు బెక్కు గూర్చుకొని వైష్ణవ దూషకుడౌట రావణుం
    డరమర లేక సీత గొన నాయువు నిండెను పూజలేమయెన్?
    శరము వరమ్ములొక్కటియ చంపును వాటము దప్ప, నాడు లో
    భరతు వధించె రాఘవుడు భామినికై సదసద్వివేకియై!

    రిప్లయితొలగించండి
  36. చరణపు పావకోళ్ళనిడి చక్కగ నింటికి తాను పంపుచున్
    భరతు;...వధించె రాఘవుఁడు భామినికై సదసద్వివేకియై
    పరచుచు సేతు లంకకును వానరు లొల్లగ రావణాసురున్
    మరచుచు తాను విష్ణువని మైమరపించు పురాణమందునన్

    రిప్లయితొలగించండి