నేను కార్తీక మాసములో నెయ్యి తో మంచుగడ్డలసాయం తో గణేశసహిత పార్వతీ పరమేశ్వరుల విగ్రహాలను ఏర్పాటు చేయగా పలు ఈశ్వరక్షేత్రములలో మా తండ్రితో పాటు వెళ్ళిచూశాను.
ప్రతిమలో ఉన్నచంద్రుడెప్పుడూ నెలవంకయే పున్నమి కదా అని పూర్ణ చంద్రుడు అచట కనిపించకపోవటం వింతయే కదా ప్రకృతి ధర్మం మారటం శివుని జటాఝూటంలోనే🙏🌹🌹🕉
పూర్తిగ చీకటి గుడిలో
రిప్లయితొలగించండిమూర్తిగ దీపమున వెలుగు ముక్కంటిఁ గన
న్నార్తుల నన్నిటిని మరచి
కార్తిక పూర్ణిమను గంటిఁ గద నెలవంకన్
ప్రభాకర శాస్త్రి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
కీర్తియను సఖిని తోడ్కొని
రిప్లయితొలగించండియార్తిగ దేవాలయమున కరిగియు,కరుణా
మూర్తి శివుని శిరమున నే
"కార్తిక పూర్ణిమను గంటిఁ గద నెలవంకన్"
జనార్దన రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ధన్యవాదాలు శంకరయ్య గారూ !
తొలగించండి
రిప్లయితొలగించండివర్తము శివసన్నిధికిన్
కార్తిక పూర్ణిమను గంటిఁ గద ! నెలవంకన్,
భర్తగ గంగను, తలనిడి
నర్తన మాడెడు నభవుని, నందను గనెదన్ !
శుభాకాంక్షలతో
జిలేబి
మహా విరుపు!!!
తొలగించండి🙏🙏🙏
జిలేబీ గారూ,
తొలగించండివిరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
వార్తను వినినంత ముదముగ
రిప్లయితొలగించండికార్తిక పూర్ణిమను గంటిఁ గద నెలవంకన్
పూర్తిగ చంద్రుని సొగసుల
యార్తిగ నేగాంచి యుంటి యానం దమిడన్
అక్కయ్యా,
తొలగించండిపద్యం బాగుంది. కాని సమస్య పరిష్కరింపబడినట్లు లేదు.
మొదటి పాదంలో గణదోషం. "వినగా ముదమున" అనండి. అలాగే "సొగసుల నార్తిగ" అనండి.
వార్తను వినగా ముదమున
తొలగించండికార్తిక పూర్ణిమను గంటిఁ గద నెలవంకన్
పూర్తిగ చంద్రుని సొగసుల
నార్తిగ నేగాంచి యుంటి యానం దమిడన్
(ఆదర్శదర్శకుడు జంధ్యాల గారి మానవతాచిత్రం "నెలవంక"గురించి)
రిప్లయితొలగించండిస్ఫూర్తిని గొలిపెడి దర్శక
మూర్తియె జంధ్యాల;వారు మురియగ ప్రజలే
యార్తిగ దీసిన చిత్రము
గార్తికపూర్ణిమను గంటిగద "నెలవంకన్."
బాపూజీ గారూ,
తొలగించండిమీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
డా.పిట్టా
రిప్లయితొలగించండివార్తలలో నగు బూర్ణత
ఆర్తిని బెంచంగ రాష్ట్ర మరకొర ప్రగతిన్
ధూర్తుల యవినీతిని యీ
కార్తిక పూర్ణిమన గంటి గద నెలవంకన్
డా.పిట్టా
రిప్లయితొలగించండిపూర్తిగ ప్రతిపద మొదలుగ
నార్తిని దీపాల వెలుగులానందములై
మూర్తిని బెంచడె చంద్రుడు!?
కార్తిక పూర్ణిమన గంటిగద నెలవంకన్!
డా.పిట్టా
రిప్లయితొలగించండి*మూర్తిని బెరుగ మరచెనె?*
3వ పాద పాఠాంచరము
డా. పిట్టా వారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
మీ సవరణ పాఠంలో గణదోషం. 'బెరుగగ మరచెనె' అంటే సరి!
పూర్తి కుముదునీ నాయకు
రిప్లయితొలగించండికార్తిక పూర్ణిమను గంటి గద, నెలవంకన్
మార్తాండు నిభపు తేజో
మూర్తి శివుని శిరమునందు ముద్దులొలకుచున్
అన్నపరెడ్డి వారూ,
తొలగించండివిరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'కుముదినీ' అనండి. బహుశా టైపాటు కావచ్చు.
కర్తయు,భవహర్తయు శుభ
రిప్లయితొలగించండిమూర్తియు నగు పార్వతిపతి మూర్దము పైనన్
ఆర్తిని బాపగ వెలిగెడు
కార్తిక పూర్ణిమను, గంటిగద నెలవంకన్
చేపూరి శ్రీరామ్ గారూ,
తొలగించండిచక్కని పూరణ. అభినందనలు.
నెలవంక...అంటే నఖక్షతము అన్న అర్ధం కూడా ఉంది. జిలేబి లాంటి వారు దీనిని ఉపయోగించి ఒక ప్రియురాలికి కలిగిన చక్కని అనుభూతిని వివరించగలరని భావిస్తున్నాను.
రిప్లయితొలగించండి
తొలగించండిజర్తి,తలకోన యురుకుల
కార్తిక పూర్ణిమను గంటిఁ గద, నెలవంకన్
వర్తులముగ గోముగనన్
వర్తనమొనరిచి రమణుని పయిదలి గనవే !
జిలేబి
పరార్ :)
జిలేబీ గారూ,
తొలగించండివిరుపుతో బాగుంది మీ పూరణ. అభినందనలు.
"తలకోన నురుకుల" అనండి.
గు రు మూ ర్తి ఆ చా రి
రిప్లయితొలగించండి,,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,,
భర్తను గిరిజా భర్తను
కార్తికపూర్ణిమను గ౦టిగద , నెలవ౦కన్ ( ..తో )
మూర్తీకరి౦చు = త్రిభువన
కర్తను శ౦కరు వినీలక౦ధరు >>> గుడిలో
గురుమూర్తి ఆచారి గారూ,
తొలగించండివిరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
రిప్లయితొలగించండివర్తి సుధాకుండలికన్,
కార్తిక పూర్ణిమను గంటిఁ గద, నెలవంకన్
వర్తన మొనర్చి దానిన్
భర్తకు నిడెదను రమణుని పయిదలి నేనే !
జిలేబీ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'సుధాకుండలి'...?
tసుధాకుండలి = జిలేబి (సంస్కృతము)
తొలగించండిhttps://en.m.wikipedia.org/wiki/Jalebi
తొలగించండి*సుధాకుణ్డలిక :)
పూర్తి గ ను డు పతి కనబడు
రిప్లయితొలగించండికార్తిక పౌర్ణమను ;;గంటి గద నెలవంక న్
మూర్తి గ వెలుగొందు శివుని
కీర్తి కిరీటం బ నంగ కె ర ల గ తల పై
రాజేశ్వర రావు గారూ,
తొలగించండివిరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
పూర్తిగ పస్తున చంద్రుని
రిప్లయితొలగించండికార్తిక పూర్ణిమను; గంటి గద; నెలవంకన్,
వర్తిలగ శుక్ల పక్షా
వర్తితమగు విదియనాటి ప్రదోషమందున్!
శిష్ట్లా శర్మ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
"ప్రదోష" మన్నచోట గణభంగం. అక్కడ జగణం రాకూడదు.
సవరణతో....
తొలగించండిపూర్తిగ పస్తున చంద్రుని
కార్తిక పూర్ణిమను; గంటి గద; నెలవంకన్,
వర్తిలగ శుక్ల పక్షా
వర్తితమయి విదియసంధ్య భాసించంగన్!
(విదియ సంధ్య....అనవచ్చునా! విదియ సాంధ్య...అనాలా!)
పూర్తి జలధిజుని జూసితి
రిప్లయితొలగించండికార్తిక పూర్ణిమను, గంటి గద నెలవంకన్
మూర్తిగ వెలుగుచు సతతము
నార్తిని తొలగించు శివుని యాభరణముగన్!!!
శైలజ గారూ,
తొలగించండివిరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
గుఱ్ఱం సీతా దేవి గారి పూరణ:
రిప్లయితొలగించండికర్తను భగీరధ మిషను
కార్తిక పూర్ణిమను గంటిగద, నెలవంకన్
స్ఫూర్తిగ పేరును దాల్చిన
మూర్తిగ సాధించగ జలమును దక్షతతో!
సీతాదేవి గారూ,
తొలగించండిమీ పూరణ వైవిధ్యంగా చక్కగా ఉన్నది. అభినందనలు.
ఆర్తుల వేదన బాపు త్రి
రిప్లయితొలగించండిమూర్తులలో నొకడు శివుడు మోదముతో సం
పూర్తిగ జూడగ సిగలో
కార్తిక పూర్ణిమ నాడుగంటి గద నెలవంకన్
భాస్కరమ్మ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
కార్తీకపౌర్ణమి శుభవేళ కృత్తికా చంద్రుల సంభాషణ....
రిప్లయితొలగించండికం.
వర్తులముగ శశినుండఁగ
కర్తగ భక్తుండు కృత్తికా! భువిఁ దీర్చన్
మూర్తినట వ్యోమకేశుగ
కార్తిక పూర్ణిమను గంటిఁ గద నెలవంకన్!
సహదేవుడు గారూ,
తొలగించండిచక్కని పూరణ. అభినందనలు.
"శశి యుండగ" అనండి.
గురుదేవులకు ధన్యవాదములు. శశిని నేనుండఁగ అను అర్థము కోసము అలా వ్రాశాను. పరిశీలించ ప్రార్థన.
తొలగించండినిజమే... నాకా ఆలోచన రాలేదు.
తొలగించండిగురుదేవులకు ధన్యవాదములు
తొలగించండినర్తన కర యుగ సంచల
రిప్లయితొలగించండినార్త సువిన్యాస గతుల నతి చిత్రముగన్
నర్తకి శశి నిభ ముఖమునఁ
గార్తిక పూర్ణిమను గంటిఁ గద నెలవంకన్
[నెలవంక = నఖక్షతము]
ఇంతటి కవిత్వము మీకే సాధ్యం. నమోనమ:
తొలగించండిసహదేవుడు గారు నమస్సులు. ధన్యవాదములు.
తొలగించండికామేశ్వర రావు గారూ,
తొలగించండిమనోహరమూ అద్భుతమూ అయిన పూరణ మీది. అభినందనలు.
"సంచల దార్త.." అంటె ఎలా ఉంటుంది?
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండిపూజ్యులుశంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు.
తొలగించండిమీ సూచన సుందరము. కదలికల విన్యాసపు గతులను (వలన కలిగిన నఖక్షతము) భావమున వాడితిని
నర్తన కర యుగ సంచల
తొలగించండిదార్త సువిన్యాస గతుల నతి చిత్రముగన్
నర్తకి శశి నిభ ముఖమునఁ
గార్తిక పూర్ణిమను గంటిఁ గద నెలవంకన్
పూర్తిగ మబ్బులు గ్రమ్మగ
రిప్లయితొలగించండినార్తిగ నే వేచియుండ నంగన తోడన్
వర్తిలు జంద్రుడు కదలగ
కార్తిక పూర్ణిమను గంటిఁ గద నెలవంకన్
ఫణికుమార్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
కార్తీక మాస చవితిన
రిప్లయితొలగించండికార్తిక ,పూర్ణిమను గంటి గద!నెలవంకన్
మూ ర్తియు దల పై గనబడె
కార్తీకము నందు దీప కళికల మ ధ్యన్ .
ఈశ్వరప్ప గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
కార్తీకము అనడం సాధువు కాదనుకుంటాను. మాస చవితి.. దుష్టసమాసం అవుతుంది. 'చవితిని' అనవలసి ఉంటుంది. "కార్తిక మాసపు చవితిని... కార్తిక మాసమున దీప..." అంటే ఎలా ఉంటుంది?
క్రొవ్విడి వెంకట రాజారావు:
రిప్లయితొలగించండికార్తిక మందున లింగని
మూర్తికుపాస్తిని చలుపుచు మృడుడుని తలపై
స్ఫూర్తించు శశిని సతితో
కార్తిక పూర్ణిమను గంటి గద నెలవంకన్
రాజారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
*మూర్తిన్ హిమఘృత ములఁ వన*
రిప్లయితొలగించండి*పర్తిశివాలయమునందు భక్తిన్ నిల్పన్*
*మూర్తికి శిరమున వింతగ*
*కార్తిక పూర్ణిమను గంటి గద నెలవంకన్*
*శ్రీమతి జి సందిత బెంగుళూరు*
నేను కార్తీక మాసములో నెయ్యి తో మంచుగడ్డలసాయం తో గణేశసహిత పార్వతీ పరమేశ్వరుల విగ్రహాలను ఏర్పాటు చేయగా పలు ఈశ్వరక్షేత్రములలో మా తండ్రితో పాటు వెళ్ళిచూశాను.
ప్రతిమలో ఉన్నచంద్రుడెప్పుడూ నెలవంకయే పున్నమి కదా అని పూర్ణ చంద్రుడు అచట కనిపించకపోవటం వింతయే కదా
ప్రకృతి ధర్మం మారటం శివుని జటాఝూటంలోనే🙏🌹🌹🕉
సందిత గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'ఘృతముల' తరువాత అర్ధానుస్వారం అవసరం లేదు.
కీర్తి గడించిన విప్రుడు
రిప్లయితొలగించండికార్తీకమునందు '' శుక్ల ''గణనమునకు ము
మ్మూర్తుల ''కృష్ణ ''యనుచుననె
కార్తిక పూర్ణిమను గంటిఁ గద నెలవంకన్
పూర్తిగ చీకటి నిశి న
న్నార్తులు తిను తిండి లోన నంద గుడుంబా
కీర్తనల పాడి యనిరట
కార్తిక పూర్ణిమను గంటిఁ గద నెలవంకన్
నిన్నటి సమస్యకు నా పూరణ
కలనైనను దలపోయని
కులనైజము వీడి విప్రకోవిదుడే మే
కల నశనమునకునిచె
పలలమ్మును గోరి చిలుక ఫలముల రోసెన్
కృష్ణారావు గారూ,
తొలగించండిమీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు.
మూర్తీవింటివెయీయది
రిప్లయితొలగించండికార్తికబూర్ణిమనుగంటిగదనెలవంక
న్నార్తిని నేగుడికేగగ
గార్తికదామోదరుండుగనబడెనటులన్
సుబ్బారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
గూర్తి దినమందురు ప్రజ
రిప్లయితొలగించండికార్తిక పూర్ణిమను, గంటిఁ గద నెలవంకన్
మూర్తి తలపైన కలలో.
ఆర్తి నొసంగిన తదుపరి నాహ్లాదముతోన్
కృష్ణ సూర్యకుమార్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
మొదటి పాదంలో గణదోషం. "దినమందురు ప్రజలు" అనండి. ప్రజ వల్ల రు గురువు కాదు, లఘువే.
రు తర్వాత ప్ర అన్నది కావున రు గురువు అనుకున్నాను గురువు గారు క్షమించండి
తొలగించండిగుర్తించి ప్రియుని రాకను
రిప్లయితొలగించండివర్తులమౌ మోము వెలిగి పడతి పెదవులన్
నర్తించగ ధరహాసము
కార్తిక పూర్ణిమను గంటిఁ గద నెలవంకన్
సూర్యనారాయణ గారూ,
తొలగించండిఎలాంటి సమస్యకైనా ప్రణయ భావాన్ని జోడించి పూరణ చెప్పడం మీకే చెల్లు! చక్కని పూరణ. అభినందనలు.
వార్తాకపు శాకంబును
రిప్లయితొలగించండికీర్తించెడి రీతి జేయ గేలను దినుసుల్
పూర్తిగ బట్టిన దానిని
కార్తిక! పూర్ణిమను గంటిఁ గద నెలవంకన్.
సత్యనారాయణ మూర్తి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
కార్తిక మాసము నందున
రిప్లయితొలగించండినార్తులను బాపు మనుచు నభవుని వేడన్
పూర్తిగ చంద్రోదయమవ
కార్తిక పూర్ణిమను గంటిఁ గద నెలవంకన్ఁ.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండినర్తనమాడెను సాంబుడు
రిప్లయితొలగించండికార్తిక పూర్ణిమను, గంటి గద నెలవంకన్
వర్తి వలె శివుని జడలను
వర్తి.ల్లుచు కదలాడెను బంధుర రీతిన్ .
స్ఫూర్తిని నిత్యము పొందురు
రిప్లయితొలగించండిమార్తాoడుడి పగటి వెలుగు భాస్వత్ కళయే
నార్తిగ ప్రపూత విలసత్
కార్తీక పౌర్ణిమ ను గంటిని గద నెలవంకన్.
మృ కు మ ప్రాస సరియగునా?దయచేసి నా సందేహము
రిప్లయితొలగించండితీర్చుడు.
వందనములు
సరిపోతుంది.
తొలగించండిగురువు గారు పూరణ గురించి తమరి అభిప్రాయము తెలుపుడు.
రిప్లయితొలగించండి