17, నవంబర్ 2017, శుక్రవారం

సమస్య - 2522 (పరమపదము లభ్యము...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది.... 
"పరమపదము లభ్యమగును పాపాత్ములకే"
(లేదా...)
"పరమపదమ్ము లభ్యమగుఁ బాపులకే సులభమ్ముగా భువిన్"

90 కామెంట్‌లు:

  1. సురుచిర దైవచింతన విశుద్ధ మనస్కత సొంపులీనగన్
    గురుచరణారవిందములుఁ గొల్చుచు భక్తిని లీనమైనచో.
    పరమపదమ్ము లభ్యమగు;బాపులకే సులభమ్ముగా భువిన్
    గురుతర కష్టనష్టములు కూడవె ధర్మపథంబుఁజూపుచున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ప్రసాద రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'మనస్కత' అన్న పదం లేనట్టుంది. (ఆంధ్రభారతిలో వెదకితే దొరకలేదు). అక్కడ "విశుద్ధ మనమ్మును" అనవచ్చు కదా!

      తొలగించండి
  2. నిరతము ధ్యానించెడి యా
    హరి భక్తి గలిగిన వారి కనివార్యముగా;
    నరకము తుది ప్రాప్తించును
    "పరమపదము లభ్యమగును ; పాపాత్ములకే"

    రిప్లయితొలగించండి
  3. వరమీయగ భగ వంతుడు
    పరమపదము లభ్య మగును , పాపాత్ములకే
    శరణని వేడిన చాలదు
    వెరవక జేసిన ఫలితము వేధించు నిలన్

    రిప్లయితొలగించండి
  4. అరిషడ్వర్గము గెల్వగ
    సరిపోదే నామజపము, సత్వరఫలదం!
    హరినామస్మరణముచే
    పరమపదము లభ్యమగును పాపాత్ములకే!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. భరద్వాజ్ గారూ,
      విరిపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'ఫలదం' అనడం వ్యావహారికం. అక్కడ "సత్ఫలదంబౌ" అందామా?

      తొలగించండి


  5. అరయగ నెల్లరకు భువిని
    పరమపదము లభ్యమగును ; పాపాత్ములకే
    త్వరితము గావలయు జిలే
    బి,రరాటలిఖితములెల్ల బిరబిర తీరన్ !

    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబీ గారూ,
      విరుపుతో మీ పూరణ బాగున్నది. కాని పద్యం ఉత్తరార్ధం కొంత గందరగోళంగా ఉంది.

      తొలగించండి
  6. వరములు పొంద గోరుచును పండిత పామరులైన నేడిలన్
    సరస జనాభుడో యనగ సామిని మించినసామి వైఖరిన్
    తరువుల నీడ తీరుగను తాపసివోలె జపమ్ము జేయగన్
    పరమ పదమ్ము లభ్యమగుఁ బాపులకే సులభమ్ముగా భువిన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అక్కయ్యా,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "పామరులైన వారిలన్। సరసిజ..." అనండి.

      తొలగించండి
    2. వరములు పొంద గోరుచును పండిత పామరులైన వారిలన్
      సరసి జనాభుడో యనగ సామిని మించినసామి వైఖరిన్
      తరువుల నీడ తీరుగను తాపసివోలె జపమ్ము జేయగన్
      పరమ పదమ్ము లభ్యమగుఁ బాపులకే సులభమ్ముగా భువిన్

      తొలగించండి


  7. కరివెద పూర్తిజేసి తొల కారుకు వేచు యదేష్టి రీతిగన్
    పొరతెరవెల్ల పూర్తిగన పుణ్యములౌమిడివోవ దోషమే
    జరఠము గాన,మాలిని, సజావు‌ గనంగను మేల్మి గానగన్
    పరమపదమ్ము లభ్యమగుఁ బాపులకే సులభమ్ముగా భువిన్


    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబిగారూ నమోనమః! మీ పద్యాలు అన్నమయ్య కీర్తనలను తలపిస్తున్నవి!భాష,భావము రెండింటిలోనూ!

      తొలగించండి


    2. సీతాదేవి గారు !

      నమో నమః !

      అంత సీన్ లేదండి :)

      కరివెద అన్న పదం ఆంధ్రభారతి లో కనబడితే అక్కడి పదముల బండిని లాక్కొచ్చిన వైనం అంతే :)

      నెనరుల్ ప్రోత్సా హమునకు
      కనగన్ కరివెద పదమును "కట్టుబడి" గ జే
      యనవచ్చిన వృత్తము ! పద
      వనరుల్ తక్కువ జిలేబి వరుసల్ కెరలున్ :)



      జిలేబి

      తొలగించండి
    3. జిలేబీ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  8. మరణము బిదపేమి దొరుకు
    హరిభక్తులకున్,దెలుపుము యంతము తదనం
    తరము నరకమెవ్వరికో ,
    "పరమపదము లభ్యమగును, పాపాత్ములకే"

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పూసపాటి వారూ,
      క్రమాలంకారంతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'తెలుపుము+అంతము' అన్నపుడు సంధి నిత్యం, యడాగమం రాదు. అక్కడ "..దెలుపవె యంతము..." అనండి.

      తొలగించండి
  9. కరమున స్వర్గము జూపుచు
    వరములు వోట్లకు నొసగెడి బలశాలులకు
    న్నరయగ భారత రాజ్యపు
    పరమపదము లభ్యమగును పాపాత్ములకే

    రిప్లయితొలగించండి
  10. కరకుగ బాధించిన ప్రజ,
    నరులను దిద్దిన దయార్ద్రనరుడగు జీసస్
    చరమదశను క్షమియించెను;
    పరమపదము లభ్యమగును పాపాత్ములకే.

    రిప్లయితొలగించండి
  11. హరిహర సంసేవనమున
    ధరనమరును స్వర్గ సుఖము తథ్యము వారిన్
    స్మరియించిన మాత్రంబున
    పరమపదము లభ్యమగును పాపాత్ములకే

    రిప్లయితొలగించండి
  12. మరణసమయ హరి పూజల
    పరమపదము లభ్యమగును పాపాత్ములకే
    ధరపై ననున దసత్యము
    నరులకు పాపముల ఫలము నరకమ్మొదవున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్నపరెడ్డి వారూ,
      విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      లభ్యమగును... తర్వాత కామా పెడితే సుగమంగా ఉంటుంది.

      తొలగించండి
  13. హరి పదము ల బూజింపగ
    పరమ పదము లభ్యమగును ;పాపాత్ము ల కే
    నిరత ము సజ్జ న గోష్ఠులు
    వరము గ నుప యోగ పడు ను వలసిన రీతి న్

    రిప్లయితొలగించండి
  14. హరికిన్ ప్రియసేవకులయి
    వరియింపగ వైరభక్తి పరిఘోషమునే
    కరుణింపగ పరమాత్ముడు
    పరమపదము లభ్యమగును పాపాత్ములకే!

    రిప్లయితొలగించండి
  15. హరిహారులను పూజించిన
    పరమ పదము లభించు ,పాపాత్ములకే
    కరకు సమాజము తోడగు
    తరగని ధర్మపు మనసులు తరుణికి ధనమే.
    అందరికి వందనములు.

    రిప్లయితొలగించండి
  16. రిప్లయిలు
    1. వెంకట నారాయణ రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      లభించు -> లభ్యమగును.

      తొలగించండి
  17. పొరబడి పాపము జేసియు
    సరిపశ్చాత్తాపమంది సద్వతనులై
    హరినమ్మి వేడుకొనగా
    పరమపదము లభ్యమగును పాపాత్ములకే.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. హనుమచ్ఛాస్త్రి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      సద్వతనులై -> సద్వర్తనులై... టైపాటు.

      తొలగించండి


  18. నిరతముహరిని స్తుతించిన

    పరమపదము లభ్యమగును, పాపాత్ములకే

    నరకము తప్పదటండ్రన

    వరతము దుర్మార్గమైన పనులను చేయన్.


    హరి నామస్మరణ వలన

    పరమపదము లభ్యమగును పాపాత్ములకే

    నరయగ నెప్పుడు దొరకదు

    పరమపదంబండ్రు బుధులు వసుధా స్థలిలో.


    హరి చరణము లను పట్టిన

    పరమపదము లభ్యమగును, పాపాత్ములకే

    నరయగ శిశుపాలాదులు

    ధరపాపులెయై పరమపదమునందిరిగా.

    దురితములనాచరించిన

    దురాత్ములైనను వదలక తోషము తోడన్

    హరిసేవలు చేసినచో

    పరమపదము లభ్యమగును, పాపాత్ములకే

    రిప్లయితొలగించండి
  19. మైలవరపు వారి పూరణలు

    1)

    నరుడా ! గతజన్మమ్మున
    కరుణా రహితుడవు , ముక్తిఁ గనక , దొరలుచున్
    ధరఁ బుట్టితి ! సత్కర్మల
    పరమపదము లభ్యమగును పాపాత్ములకే !

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి


    2)

    హిరణ్యకశిపుని రాజ్యంలో దండోరా....

    కరుణను వీడుడీ ! శిశులఁ గాంతలఁ బట్టి వధింపుడీ ! మహా...
    ధ్వరముల , ధేనుశాలలను ధ్వంసమొనర్చుడి ! విప్రవర్యులన్
    దరుముడి ! యిట్లు సేసిన నుదారముగా నృపభక్తిఁ గొల్వులో
    పరమపదమ్ము లభ్యమగుఁ బాపులకే సులభమ్ముగా భువిన్!!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మైలవరపు వారూ,
      మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
  20. సరి సరి నేడు సొమ్మె సరసమ్ముగ కావలెనెల్లవేళలన్
    విరివిగ డబ్బు మూటలను వేడుకతో వెదజల్లు వారికిన్
    దొరకును దైవదర్శనము దోసిలి యొగ్గరె వారికిన్ జనుల్
    పరమపదమ్ము లభ్యమగుఁ బాపులకే సులభమ్ముగా భువిన్

    రిప్లయితొలగించండి
  21. కోట రాజశేఖర్ గారి పూరణ

    సందర్భం:: చక్రముచేత తల ఖండింపబడగా, శిశుపాలుడు తేజోరూపంతో శ్రీకృష్ణునిలో ఐక్యం కాగా, ఆ విషయాన్ని గమనించిన ధర్మరాజు ఆశ్చర్యపడి, ప్రక్కనే ఉన్న నారదుని ప్రశ్నింపగా, నారదుడు సమాధాన మిచ్చిన సందర్భం.

    మరణము నంది, తేజముగ మాధవు జేరిన చైద్యు జూచుచున్,
    వరదుని దిట్టినట్టి శిశుపాలుడు శ్రీహరి జేరు టెట్లనన్,
    నరులకు జ్ఞానదాత యగు నారదు డిట్లనె, ధర్మరాజుతో
    ‘’హరి గిరి యంచు దిట్టి యిపు డారయ నీ శిశుపాలు డీ సభన్,
    కెరలిన భక్తితో *భ్రమరకీటక ధర్మముతో* పవిత్రుడై
    ధరణిని వైరబంధమున *తన్మయతన్* హరి నైక్య మయ్యెగా,
    యురుతర భక్తిమార్గమున నుండెడి భక్తులకంటె ముందుగా,
    *పరమపదమ్ము లభ్యమగు పాపులకే , సులభమ్ముగా భువిన్.’’*

    *కోట రాజశేఖర్ నెల్లూరు.*

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రాజశేఖర్ గారూ,
      మీ పూరణ అద్భుతంగా ఉంది. అభినందనలు.

      తొలగించండి
    2. శ్రీ కంది శంకరయ్య గురువరేణ్యులకు హృదయపూర్వక ప్రణామాలు. కోట రాజశేఖర్ నెల్లూరు.

      తొలగించండి
  22. అరయగ బాపము జేసియు
    గురివిందము రీతి గుడులు గోపురములలో
    పరికింప దీపముంచిన
    పరమపదము లభ్యమగును పాపాత్ములకే !

    రిప్లయితొలగించండి

  23. పిన్నక నాగేశ్వరరావు.

    హరిహర నామస్మరణకె

    పరమపదము లభ్యమగును; పాపా
    త్ములకే
    నరకము ప్రాప్తించును గద

    దురితమ్ముల ఫలితమిలను దోషులు
    కాగన్.

    రిప్లయితొలగించండి
  24. అరయఁ బుడమి నొనరించిన
    చరాళి కర్మముల కెల్ల స్వర్గ నరకముల్
    పరఁగు నల వాని యందు న
    పరమ పదము లభ్యమగును పాపాత్ములకే

    [అపరము = ఉత్తరము, తరువాతది]


    కరయుగ లాఘవమ్మును నఖండ వివేకము సచ్చరిత్రమున్
    విరివిగ నున్న విద్యలును విత్త విహీనున కేది దిక్కిలం
    గరయుగ లాఘవంపు టవకాశ నిరీక్షణుఁ డుండ మేటి ప్రా
    పరమ, పదమ్ము లభ్యమగుఁ బాపులకే సులభమ్ముగా భువిన్

    [ప్రాపు+అరమ = ప్రాపరమ; అరము = త్వరితము; పదము = ఉన్నత పదవి]

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కామేశ్వరరావు గారూ,
      మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
    2. పూజ్యులుశంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు.

      తొలగించండి
  25. అరయగ 'నారాయణ'యని
    మరణమున నజామిళుడు కుమారుని బిలువన్
    పరమును పొందె ననంగను
    పరమపదము లభ్యమగును పాపాత్ములకే !











    రిప్లయితొలగించండి
  26. నిరతముశివునిన్గొలిచిన
    పరమపదములభ్యమగును,పాపాత్ములకే
    నరకపుమార్గముగనబడు
    హరియించునుబాతకములహరునిన్దలపన్

    రిప్లయితొలగించండి
  27. హరిహరుల గొల్చు నరులకు
    పరమపదము లభ్యమగును; పాపాత్ములకే
    నరకము ప్రాప్తంబగునన
    సురలసురుల కధలు దెల్పు చున్నవి జదువన్

    నిన్నటి దత్తపది కి నా పూరణ

    అప్పు దొరక డబ్బు లానంద మైనను
    వడ్డి కట్టు నాడు నడ్డి విరుగు ;
    అప్పు డబ్బురమ్మె యనగంగ దొరయు ; నీ
    వడ్డి నిలువ గలవె పరుగులిడక ?

    రిప్లయితొలగించండి
  28. ధరణిని శౌరి భక్తులకు దబ్బున భూమిఁ బ్రయాణ మంతమై
    పరమపదమ్ము లభ్యమగుఁ, బాపులకే సులభమ్ముగా భువిన్
    నిరతము కల్గుసౌఖ్యములునీతిని వీడి చరించ, పిమ్మటన్
    దొరకును దండ హస్తుకడ దుర్గతి పాపపు చేష్టితమ్ములన్

    రిప్లయితొలగించండి
  29. అరయగ పశ్చాత్తాపము
    సరిజేయును దుష్టకర్మ చయము నెపుడు, శ్రీ
    హరినే ధ్యానించినచో
    పరమపదము లభ్యమగును పాపాత్ములకే.
    (సమస్యా పాదంలో 'పాపాత్ములకు మాత్రమే' అన్న భావం స్ఫురిస్తుంది. నాపూరణలో 'పాపాత్ములకైనన్' అన్న భావన స్ఫురింప జేసినా ననుకుంటున్నాను.విజ్ఞల అభిప్రాయం కొరకెదురు చూస్తున్నాను.)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జనార్దన రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      పాపాత్ములకైనను... అన్న అర్థం రాదండీ.

      తొలగించండి
    2. ఆర్యా!
      చక్కన సమస్యనిచ్చినారు.సమస్యలో అసంగత్వమున్నట్టు అనిపిస్తున్నది కదా! దానిని పరిహరించటానికి 'భక్తులకే కాదు, పశ్చాత్తాపం పొందిన పాపులకైనను పరమపదము లభ్యమగుట తథ్యము కదా!' అన్న భావం స్ఫురింప జేయునట్లు పూరించాను అని నా భావన. వివరణ సృష్టంగా ఉన్నది కదా !లేనిచో మరింత సృష్టత కొరకు ప్రయత్నిస్తాను.

      తొలగించండి
  30. పరమాత్మనునమ్మిగొలువ?
    పరమపదము లభ్యమగును|”పాపాత్ములకే
    కరుణయు గనికర మన్నది
    మరచినచో నరకమబ్బు మరిసహజమ్మే”|
    2.కురియక వానలున్ మొలకకొప్పునయాకులునుంచ శక్యమే?
    మరువక మానవత్వమున మాధవసేవనుజేయువారికే
    పరమ పదమ్ము లభ్యమగు|”బాపులకే సులభమ్ముగా భువిన్
    తరుగని యాశదోషముల తత్వముతో నరకమ్ము లభ్యమౌ”|



    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఈశ్వరప్ప గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      "కొప్పున నాకుల నుంచ" అని ఉండాలనుకుంటాను.

      తొలగించండి
  31. పరులకు సాయమొనర్చిన
    పరమపదము లభ్యమగును. పాపాత్ములకే
    పరపీడన పాపముచే
    సరియగు ఫలితము సమకొను సత్యము భువిలో.

    రిప్లయితొలగించండి
  32. హరిఁ గొల్చెడు ప్రహ్లాదుఁడు
    భరియించెను బాధలెన్నొ! వైరము తోడన్
    తరియించె హిరణ్యుడటన్
    పరమపదము లభ్యమగును పాపాత్ములకే!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సహదేవుడు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      హిరణ్యకశిపుని హిరణ్యు డనవచ్చునా? సందేహం!

      తొలగించండి
    2. "తరియించె రాక్షసేశుడు" అనవచ్చు కదా!

      తొలగించండి
    3. గురుదేవులకు ధన్యవాదములు. సవరించిన పూరణ :
      హరిఁ గొల్చెడు ప్రహ్లాదుఁడు
      భరియించెను బాధలెన్నొ! వైరము తోడన్
      తరియించె కనక కశిపుఁడు
      పరమపదము లభ్యమగును పాపాత్ములకే!

      తొలగించండి
  33. పరపతి నివ్వవు పదవులు
    పరమాత్మను వెదకు జీవి పరపతి పొందున్
    నిరతము ననఘులు జేతు రు
    పరమ, పదము లభ్యమగును పాపాత్ములకే ౹౹

    రిప్లయితొలగించండి
  34. క్రొవ్విడి వెంకట రాజారావు:

    దురితము లెంచని వారికి
    పరమపదము లభ్యమగును; పాపాత్ములకే
    మురి గూడిన వారలకే
    పరమపదమలభ్యమగును వాగరు లారా!

    రిప్లయితొలగించండి
  35. నిరతము బాలభక్తుడట నీమముఁ దప్పక దైవనామమున్
    స్మరణము జేయుచుండియు విషాదము నెంతయొ చూచెగాదె? మ
    చ్చరికముతో హిరణ్యుడట సత్వరమే హరిఁబొందె చూడగన్!
    పరమపదమ్ము లభ్యమగుఁ బాపులకే సులభమ్ముగా భువిన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సహదేవుడు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'హిరణ్యుడు'...?

      తొలగించండి
    2. "మచ్చరికముతోడ రాక్షసుడు..." అందామా?

      తొలగించండి
    3. ధన్యవాదములు గురుదేవా
      సవరించిన పూరణ:


      నిరతము బాలభక్తుడట నీమముఁ దప్పక దైవనామమున్
      స్మరణము జేయుచుండియు విషాదము నెంతయొ చూచెగాదె? మ
      చ్చరికముతోడ రక్కసుడు సత్వరమే హరిఁబొందె చూడగన్!
      పరమపదమ్ము లభ్యమగుఁ బాపులకే సులభమ్ముగా భువిన్

      తొలగించండి
  36. గు రు మూ ర్తి ఆ చా రి
    ,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,

    ( ఒక దొ౦గ గురువు యొక్క శిష్యుడు

    అమాయిక భక్తులతో అ౦టున్న మాటలు )


    అరయగ గుళ్లు గోపురము లన్ని భ్రమి౦చి

    . . శ్రమి౦చ నేల ? యా

    హరిహరులన్ స్తుతి౦చు టిక వ్యర్థము |

    . . భక్త దలిర్ప మీరు మా

    గురువు పదాబ్జముల్ దవిలి కొల్చిన చాలు

    . . హరి౦చు పాపముల్ |

    పరమపదమ్ము లభ్యమగు పాపులకున్

    . . సులభమ్ముగా భువిన్

    రిప్లయితొలగించండి
  37. *పరులనుదోచు విద్యయును పాశవికమ్ముగ హత్యజేయుటల్*
    *నెఱపుట తధ్యమంటధర! నేతగ మారుటకీయుగంబునన్*
    *తిరముగ జెప్పినారు గురుదేవులు నాయము! రాజకీయమున్*
    *పరమపదమ్ము లభ్యమగుఁ బాపులకే సులభమ్ముగా భువిన్*

    *తిరుక్కోవళ్ళూరు శ్రీహర్ష*

    రిప్లయితొలగించండి
  38. కరమున జూపి స్వర్గమును కంతు కుబేరు మహేశు నింద్రులన్
    వరముల గోరుకొమ్మనుచు వందలు వోటుకు గ్రుమ్మరించుచు
    న్నరయగ భారతావనిని హాయిగ నేలెడు రాజభోగమౌ
    పరమపదమ్ము లభ్యమగుఁ బాపులకే సులభమ్ముగా భువిన్

    రిప్లయితొలగించండి
  39. వరముల నిచ్చి వోటరుకు పంచగ నోటుల వేనవేలుగా
    పరమపదమ్ము లభ్యమగుఁ;..బాపులకే సులభమ్ముగా భువిన్
    తరుగులు లేక లభ్యమగు త్రాగగ వైనులు జైలునందునన్
    పరమ పవిత్ర విత్తమును పండుగ జేయుచు విస్తరింపగా

    రిప్లయితొలగించండి