23, నవంబర్ 2017, గురువారం

సమస్య - 2527 (వాణికి దేహార్ధ మొసఁగె...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
"వాణికి దేహార్ధ మొసఁగె ఫాలాక్షుఁ డొగిన్"
(లేదా...)
"వాణికి నర్ధదేహమును వాసిగ నిచ్చె శివుండు వేడుకన్"
ఈ సమస్యను పంపిన వీటూరి భాస్కరమ్మ గారికి ధన్యవాదాలు.

100 కామెంట్‌లు:

 1. ప్రాణము మానము నీవని
  నాణెమ్మౌ పతిని గెల్చి నాయకి తానై,
  రాణిని మించిన తన గృహ
  వాణికి దేహార్ధ మొసఁగె ఫాలాక్షుఁ డొగిన్

  గృహవాణి = Speaker of the House

  రిప్లయితొలగించండి
 2. రాణికి గంధ వేణికి ధరాధర పుత్రికి విశ్వనాధు పా
  రాణికి కీరవాణికి కరాళ సరాగ సుధా శివానికిన్
  జానికి ధర్మచారిణికి శక్తికి గేహినికిన్ భవాని శ
  ర్వాణికి నర్ధదేహమును వాసిగ నిచ్చె శివుండు వేడుకన్!!

  రిప్లయితొలగించండి
 3. క్షోణిన్ గాచెడి వాడయి
  శ్రేణిన్ ప్రమథులు నటించ చిత్తంబలరన్
  రాణగ తాండవమున శ
  ర్వాణికి దేహార్ధమొసగె ఫాలాక్షుడొగిన్!

  రిప్లయితొలగించండి
 4. "నేనస్సలుకన్పించను
  ప్రాణేశ్వర యేమి కాన?" పార్వతి అలుగన్,
  "ప్రాణేశ్వరి నీ"వంచు శ
  ర్వాణికి దేహార్ధ మొసఁగె ఫాలాక్షుఁడొగిన్!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కానిది లేదు! స్త్రీ గెలుపు కాదన లేరు, త్రిమూర్తులైననున్!
   వాణికి నాల్కనాసనము వైచిన బ్రహ్మను చూడు చిత్రమున్;
   శ్రీనిజ వక్ష వాసమును శ్రీపతి నొప్పనలేదు; చూడ శ
   ర్వాణికి నర్ధదేహమును వాసిగ నిచ్చె శివుండు వేడుకన్

   తొలగించండి
  2. భరద్వాజ గారూ,
   మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
   మొదటి పూరణలో 'అస్సలు' అన్యదేశ్యం. మూడవ పాదంలో గణదోషం. "ప్రాణేశ్వరి నీవని..." అనండి.

   తొలగించండి
  3. అయ్యా! సవరించాను.
   అన్యదేశ్యాలకి ఏమైనా ప్రత్యేక నిబంధనలు ఉన్నాయా? సంధుల విషయాలలో?

   తొలగించండి
  4. భరద్వాజ గారూ,
   సంప్రదాయ పద్య కవిత్వం వ్రాస్తున్నాం కనుక సాధ్యమైనంత వరకు అన్యదేశ్యాలు పరిహరించడం మంచిది. ఒక్కొక్క సారి చమత్కారం కోసం ప్రయోగిస్తే తప్పులేదు. కొన్ని సమస్యలు తప్పని సరిగా అన్యదేశ్యాలను ప్రయోగించ వలసినవి ఉంటాయి.

   తొలగించండి
 5. మానిత శ్రీచక్రనగర
  రాణికి,యణిమాదిసిద్ధుల నొసగుమణికి
  న్నేణాంకవేణి,విమల శ
  ర్వాణికి దేహార్ధమొసగె ఫాలాక్షుడొగిన్!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సీతాదేవి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'రాణికి నణిమాది..' అనండి. మూడవ పాదంలో గణదోషం. "వేణి నుత శ|ర్వాణికి" అనండి.

   తొలగించండి
  2. గురుదేవులకు నమస్సులు! సవరించిన పూరణ
   మానిత శ్రీచక్రనగర
   రాణికి నణిమాదిసిద్ధుల నొసగుమణికి
   న్నేణాంకవేణి నుత శ
   ర్వాణికి దేహార్ధమొసగె ఫాలాక్క్షుడొగిన్

   తొలగించండి
 6. వాణియు లక్ష్మియు చామర
  పాణులగుచు నిరుగడలను బంభరశోభా
  వేణులు కొలువ వెలుగు శ
  ర్వాణికి దేహార్ధ మొసగె ఫాలాక్షు డొగిన్.

  రిప్లయితొలగించండి


 7. వీణా పాణికి మంజుల
  వాణికి కమలాసనుండు భర్త, జిలేబీ,
  పాణిగ్రహణమ్మన శ
  ర్వాణికి దేహార్ధ మొసఁగె ఫాలాక్షుఁ డొగిన్!

  జిలేబి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. చరవాణి అంటే సెల్ ఫోనుని గూర్చి వ్రాస్తూ సమస్యను పూరించగలమా?

   తొలగించండి


  2. రాణీ నాచెలిమరియా !
   మానిని మధురిమ లొలికెడు మధుకంఠమ్మా!
   కాణాచి! జాణవే! చర
   వాణికిదే, "హార్ధ మొసఁగె" ఫాలాక్షుఁ డొగిన్!

   జిలేబి

   తొలగించండి
  3. హార్దము అంటే స్నేహము అన్న అర్ధం లో వాడినట్లు నాకనిపిస్తుంది. మంచి విరుపు.

   తొలగించండి

  4. హమ్మయ్య! నచ్చిందన్నారు అదే పదినయాపైసలు :)

   నెనర్లు
   జిలేబి

   తొలగించండి
  5. మీ ప్రయత్నం ప్రశంసింప వలసిందే.
   కాని... తొంభై నయాపైసల అభ్యంతరం నేను చెప్తున్నాను. 'హార్దము' అంటే స్నేహము. కాని ఇక్కడ ఉన్నది మహాప్రాణంతో ఉన్న 'హార్ధము'. అలాంటి పదం లేదు.

   తొలగించండి

  6. ఓహో ! పప్పులో పోయెన్ :)

   మహా ప్రాణం విలువ తొంభై పైసలు :)

   జిలేబి

   తొలగించండి


 8. జాణుడు, కంజుడు పెనిమిటి
  వాణికి, దేహార్ధ మొసఁగె ఫాలాక్షుఁ డొగిన్
  జాణత,నెరనమ్మిన శ
  ర్వాణికి, లక్ష్మికి మగండు వనమాలి గదా!

  జిలేబి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు

  1. యాదృచ్ఛికంగా కొత్త సమస్య పుట్టుకొచ్చింది :(

   వాణికి లక్ష్మికి మగండు వనమాలి గదా !

   శుభోదయం
   జిలేబి

   తొలగించండి
  2. రాణి జిలేబి,కవనముల
   వేణి,తెలియదా ఘన సుకవీసులకెపుడున్
   శ్రీనాధు సుతుడు బతిగద
   వాణికి, లక్ష్మికి మగండు వనమాలి గదా

   తొలగించండి
  3. జిలేబీ గారూ,
   మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
   *******
   పూసపాటి వారూ,
   జిలేబీ గారి సమస్యకు మీ పూరణ బాగున్నది. "సుకవీశుల.." అనండి.

   తొలగించండి

  4. కంది వారు

   నెనర్లు ! క్రొత్త ప్రక్రియ అవధానులకివ్వచ్చు :)
   రెండు సమస్యలకు ఒకే పూరణ :)

   @ పూసపాటి వారు

   అదురహో :)

   డబల్ ధమాకా సమస్యా పూరణ :)

   జిలేబి

   తొలగించండి
 9. శ్రీనాధుసుతుడు ,బతి గద
  వాణికి, దేహార్ధ మొసఁగె ఫాలాక్షుఁ డొగిన్"
  మానిని,దాక్షాయని,యా
  ర్యాణి,శిఖరవాసిని, శివ, రంభ,బసపడన్


  రిప్లయితొలగించండి
 10. డా.పిట్టా
  గౌణము జీవన సౌఖ్యము
  రాణయె బరిశోధననుచు రాత్రిం బవళుల్
  ప్రాణము సగమిడె *మార్కొని* (రేడియోను రూపొందించిన శాస్త్రజ్ఞుడు)
  *వాణి*కి (ఆకాశవాణికి) దేహార్ధ మొసగె ఫాలాక్షుడొగిన్!

  రిప్లయితొలగించండి
 11. డా.పిట్టా
  రాణియటంచు నంకమున రాజిల జేయడె భర్త, భారమున్
  రాణగ మోయు వాడనగ రక్కసి రోగము రక్త లేమినిన్
  "ప్రాణము నిత్తు నా రుధిర భాగము గొండ"ను నేటి ఋ(రు)గ్న శ
  ర్వాణికి నర్ధదేహమును వాసిగ నిచ్చె శివుండు వేడుకన్!(శర్వణీ శివులిచట మానవులుగా గైకొని)

  రిప్లయితొలగించండి
 12. డా.ఎన్.వి.ఎన్.చారి
  వాణికి జిహ్వయు నారా
  యణికిన్ హృదయంబునిచ్చి రంభోజ హరుల్
  పాణిగ్రహణంబు నన్ శ
  ర్వాణికి దేహార్థ మొసగె ఫాలాక్షుడొగిన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. చారి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
  2. చారి గారూ,
   రెండవ పాదం గురువుతో ప్రారంభం కావాలి. నేను గమనించలేదు. అన్నపరెడ్డి వారు చెప్పినట్టున్నారు.

   తొలగించండి
 13. ప్రాణ సమానకు బార్వతి
  కేణాక్షికి స్వీయరాణి కీశ్వరి కళిస
  ద్వేణికి ననుదిన మంజుల
  వాణికి దేహార్ధ మొసఁగె ఫాలాక్షుఁ డొగిన్.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సత్యనారాయణ మూర్తి గారూ,
   మీ పూరణ మనోహరంగా ఉంది. అభినందనలు.

   తొలగించండి
 14. ప్రా ణేశ్వరి నారాయణి
  మానిత మంగళ శివాని మాహేశ్వ రి కి న్
  రాణి క ప ర్ ణ కు సతి శ
  ర్వాణికి దేహార్దమొ స గే బాలా క్షుడో గి న్

  రిప్లయితొలగించండి
 15. మైలవరపు వారి పూరణలు

  1)
  వీణాపాణికి సతి గీ....
  ర్వాణికి రసనాగ్రమునిడె బ్రహ్మయు , సిరికిన్
  రాణింప నురము హరి ., శ..
  ర్వాణికి దేహార్థమునిడె ఫాలాక్షుడొగిన్ !!

  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి


  2)

  వాణిని గారవింప తన వక్త్రమునందున నిల్పె బ్రహ్మయున్
  ప్రాణసమమ్ముగా దన యురమ్మున నిల్పెను విష్ణుమూర్తి , శ...
  ర్వాణికి నర్ధదేహమును వాసిగ నిచ్చె శివుండు వేడుకన్
  రాణులు కాంతలే తరతరాలుగ భర్తకు దీప్తి భార్యయే !!

  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మైలవరపు వారూ,
   మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.

   తొలగించండి
  2. పద్యం లో చిన్న సవరణ...

   వాణిని గారవింప తన వక్త్రమునందున నిల్పె బ్రహ్మయున్
   ప్రాణసమమ్ముగా సిరినురమ్మున నిల్పెను విష్ణుమూర్తి , శ...
   ర్వాణికి నర్ధదేహమును వాసిగ నిచ్చె శివుండు వేడుకన్
   రాణులు కాంతలే తరతరాలుగ భర్తకు దీప్తి భార్యయే !!

   మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

   తొలగించండి


 16. జాణుడు కంజరుండతడు జాగరణుండతడౌ, మగండయెన్
  వాణికి, నర్ధదేహమును వాసిగ నిచ్చె శివుండు వేడుకన్
  జాణత యెన్నగాను భళి; జహ్నువు ఱేడు, జిలేబి, లక్ష్మికిన్!
  బాణము, కార్ముకమ్మువలె భర్తయు,భార్యయు గాద సర్వదా !

  జిలేబి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. జిలేబిగారూ! చివరిపాదం క్రమాలంకారంలో బహుబాగున్నది! యెప్పుడూ ప్రయోగించేది భార్యయేగదా!హ హ హ!

   తొలగించండి
  2. జిలేబీ గారూ,
   కొంత గందరగోళంగా ఉన్నా మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 17. తానొక శక్తి,పరాత్పరి,
  పూనిక రాక్షసుల జంపి భువిలో శాంతిన్
  పనిగొని నిలిపిన శ్రీ శ
  ర్వాణికి దేహార్ధ మొసగె ఫాలాక్షుడొగిన్

  రిప్లయితొలగించండి
 18. రాణికి,కళ్యాణికి,యీ
  శాణికి,కాత్యాయని, గుహజనని శివానీ
  మైనా కస్వకును శా
  ర్వాణికి,దేహార్దమొసగె ఫాలాక్షుడొగిన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. శ్రీరామ్ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'కళ్యాణికి నీశానికి...' అనండి. 'మైనా కన్యకకును'...టైపాటు.

   తొలగించండి
  2. మైనా కాదు మేనా కన్యకకును... అనండి.

   తొలగించండి
 19. మానాథసుతుఁడ పెనిమిటి
  వాణికి దేహార్దమోసగె ,పాలాక్షుడొగిన్
  రాణిగ మగురమ్మలశ
  ర్వాణికి శక్తిని చతురత వాక్కులు దిశగన్.
  నమస్సులు.బస్సులో ప్రయాణిస్తూ పూరణ చేసినాను.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. వెంకట నారాయణ రావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   ముగురమ్మల... మగరమ్మల అయింది... టైపాటు.

   తొలగించండి


 20. గు రు మూ ర్తి ఆ చా రి
  ,,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,,

  రాణి౦చ హృది ~ రమకు , గీ

  ర్వాణికి , దేహార్ధ మొసగె ఫాలాక్షు డొగిన్

  రాణికి - కాత్యాయిని - కా

  ర్యాణికి - విజయకు - భవాని - క౦బకు -నుమకున్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. గురుమూర్తి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   కార్యాణికి, కంటకున్...?

   తొలగించండి
 21. కోట రాజశేఖర్ గారి పూరణ

  సందర్భము :: కేదారేశ్వర వ్రత ఫలం.

  పార్వతి ప్రక్కన ఉన్నా, భృంగిముని శివునికి మాత్రమే అర్చన చేశాడు. ఆ అర్చన నందుకొన్న శివుని జూచి, కోపగించుకొన్న పార్వతి, భర్తను వదలి గౌతమ ముని ఆశ్రమం చేరి, ఆ ముని చెప్పినట్లుగా కేదారేశ్వర వ్రతం చేసింది. సర్వజ్ఞుడైన శివుడు భార్య మనసు తెలిసికొని, ఆమెకు తన శరీరంలో అర్ధభాగాన్ని యిచ్చిన సందర్భం.

  ప్రాణవిభుండె, *భృంగిమునివర్యుని* పూజల నంద, కిన్కతో,
  *స్థాణువు* తో సమానముగ సత్కృతి నంద, *వ్రతమ్ము జేసె* *రు*
  *ద్రాణి* యె *గౌతమోక్తి*, సతితత్వ మెరుంగుచు, మెచ్చుకొంచు, శ
  *ర్వాణి కి నర్ధదేహమును వాసిగ నిచ్చె, శివుండు వేడుకన్.*

  *కోట రాజశేఖర్ నెల్లూరు.*

  రిప్లయితొలగించండి
 22. వీణాధారిణి కంజుని
  రాణి కృపనొక కృతినొక్క రాతిరిమలచన్
  "వాణిని నారాణి"యనుచు
  వాణికి దేహార్ధమొసగె ఫాలాక్క్షుడొగిన్
  వీరభద్రుడు ఫాలాక్క్షుని అంశయేగదా!
  పిల్లలమర్రి పినవీరభద్రుడు ఒక్కరాత్రిలో జైమినీభారతాన్ని వ్రాశాడని చాటువు!
  sahithinandanam.blogspot.com 2016/12


  రిప్లయితొలగించండి
 23. రాణిగ గైకొని యయ్యలి
  వేణి గిరిజను గలుగంగ వేడుకయె ప్రతి
  ప్రాణికి,నలువకు మరియును
  వాణికి;దేహార్ధమిచ్చె ఫాలాక్షుడొగిన్.

  రిప్లయితొలగించండి
 24. త్రాణ గుణ సంచయములకుఁ
  గాణాచి గిరిజ రజత నగవర విభు బహిః
  ప్రాణము పార్వతి సురుచిర
  వాణికి దేహార్ధ మొసఁగె ఫాలాక్షుఁ డొగిన్


  ప్రాణి నికాయ సుప్రణతి భాసిత పద్మదళాయతాక్షి సు
  శ్రోణి పతివ్రత ప్రణుత సువ్రత శంకర సంగ్ర హేద్ధ స
  త్పాణి ధరాధరాత్మజ కపార కృపారస సిక్త భవ్య భా
  వాణికి నర్ధదేహమును వాసిగ నిచ్చె శివుండు వేడుకన్

  [భావ+ఆణి = భావాణి; ఆణి = ఎల్ల (హద్దు); దయాగుణపూరిత భావములకు హద్దు]

  రిప్లయితొలగించండి
 25. కవిమిత్రులారా,
  మన్నించండి. ప్రయాణంలో ఉన్నాను.

  రిప్లయితొలగించండి
 26. రాణిగ లక్ష్మిని విష్ణువు
  వాణిని గైకొనెను సతిగ పద్మాసనుడే
  పాణిగృహీతిగ నా శ
  ర్వాణికి దేహార్ధమొసఁగె ఫాలాక్షు డొగిన్!!!

  రిప్లయితొలగించండి
 27. వాణికియనిపొరబడితిరి
  వాణికిగాదియ్యసగముబార్వతికిచ్చెన్
  వాణికియనుకొనినిట్లనె
  వాణికిదేహార్ధమొసగెఫాలాక్షుడొగిన్

  రిప్లయితొలగించండి
 28. ప్రాణ సఖిగఁ జేయ మరుని
  ప్రాణమ్ములు దీసి రతిని బాధించకుడన్
  వాణిని వినిపించిన శ
  ర్వాణికి దేహార్ధ మొసఁగె ఫాలాక్షుఁ డొగిన్

  రిప్లయితొలగించండి
 29. *ప్రాణసఖిన్సతిన్ హృదయభాగమునందువసింపజేసె ని*
  *ర్మాణమొనర్పకన్ భవనమామహలక్ష్మిదేవికిన్*
  *కాణియుఖర్చులేదుతనకంచునునాల్కనెయిచ్చె బ్రహ్మయున్*
  *వాణికి !నర్ధదేహమును వాసిగ నిచ్చె శివుండు వేడుకన్*

  *శ్రీమతి జి సందిత బెంగుళూరు*
  విష్ణువు! బ్రహ్మ! మహేశ్వరుడు ముగ్గురు నయాపైస ఖర్చులేకుండా భార్యలకు నివాసాలను సమకూర్చారు

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సందిత గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   వాట్సప్ సమూహంలో సూచించిన అంశాలను గమనించండి.

   తొలగించండి
 30. వాణికి నర్ధదేహమును వాసిగ నిచ్చె శివుండు వేడుకన్"
  వాణికిగాకయిచ్చెనుగపార్వతికీశుడ యర్ధదేహమున్
  మానముతోడనామెచనిమారునిశత్రువునర్చజేయగా
  మానసమందునన్నలరిమర్కునిధారుడునిచ్చెనర్ధమున్

  రిప్లయితొలగించండి
 31. వాణికి విద్యల నొసగగ
  ప్రాణేశ్వరు డిడగ స్వేచ్ఛ , పైకమొసగగన్
  రాణికి వరమిడె హరి ; శ
  ర్వాణికి దేహార్ధ మొసఁగె ఫాలాక్షుఁ డొగిన్

  నిన్నటి సమస్యకు నా పూరణ

  నామ మాత్రపు దుస్తుల నంగడిఁగొని
  నగ్న ప్రతిమల రూపము ననుకరించి
  పూలు వాల్జెడ లన రోతపుట్టు ననెడి
  రమణికిన్ బూలు చేటగుఁ బ్రాయమందు

  రిప్లయితొలగించండి
 32. .క్రమాలంకారము
  జ్ఞానము నిల్పగ మ్రొక్కెద
  దీనుల కాపాడుటకును దివ్యత్వముకై
  మానవ రక్షణ జేయును
  1.వాణికి2.దేహార్థ మొసగె3.పాలాక్షు డొగిన్

  రిప్లయితొలగించండి
 33. వాణికినిచ్చి జిహ్వనట బ్రహ్మ లిఖించెను నాల్గువేదముల్
  ప్రాణము నర్ధమంచు హరి పద్మను నిల్పెను వక్షమందు శ
  *ర్వాణికి నర్ధదేహమును వాసిగ నిచ్చె శివుండు వేడుకన్*
  రాణులకిచ్చె భాగములు రాగము తోడత ముగ్గురయ్యలే

  తిరుక్కోవళ్ళూరు శ్రీహర్ష

  రిప్లయితొలగించండి
 34. గురువర్యులకు నమస్సులు. నిన్నటి, మొన్నటి నా పూరణలను పరిశీలించ ప్రార్థన.
  ధన్యవాదములు.

  ఏపుగా నెదిగిన జడ నిష్ట పడక
  కురుల కురుచ గావించె నా కోమలాంగి!
  నాగరికత రూపము మార నవ యుగమున
  రమణికిన్ బూలు చేటగు బ్రాయ మందు!

  పరువుకై తల యొగ్గిన పార్వతి యట
  దేవదాసు కాదనుచు నాస్తి పరుడైన
  పండు ముసలిని వరియించె! బంకజాక్షి
  పెద్ద వారల మన్నించె ప్రేమ విడచి!

  రిప్లయితొలగించండి
 35. వాణికి విధి రసనాగ్రము
  పైనన్, హరి కలిమిచెలికి వక్షస్థలమున్
  స్థానము నివ్వగ, రహి శ
  ర్వాణికి దేహార్ధ మొసఁగె ఫాలాక్షుఁ డొగిన్

  రిప్లయితొలగించండి
 36. ప్రాణము సృజించ ధర యీ
  శానుడు, ప్రకృతి పురుషుల సంగమ శృతిలో
  మేనులు చెరి సగమని శా
  ర్వానికి దేహార్దమొసగె ఫాలాక్షుడొగిన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. శ్రీరామ్ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   రెండవ పాదంలో గణదోషం. "ప్రకృతియు" అనండి.

   తొలగించండి
 37. డా.బల్లూరి ఉమాదేవి. 23/11/17.

  క్షోణిని పతియయ్యె విధి

  వాణికి దేహార్ధ మొసఁగె ఫాలాక్షుఁ డొగిన్

  జాణగు శంకరికి,కమల

  పాణిని వక్షమున నుంచె వాసిగ హరి తా.  యేణనయన యౌ లక్ష్మికి

  ప్రాణేశుండెవరన విను బలిహరణుండే

  వీణాధరిపతి విధి,శ

  ర్వాణికి దేహార్ధ మొసఁగె ఫాలాక్షుఁ డొగిన్

  రిప్లయితొలగించండి
 38. దానవవైరి లక్ష్మికిడె తానము వక్షమునందు నర్మిలిన్
  వాణికొసంగె బ్రహ్మతన వక్త్రమునందున చోటు శ
  ర్వాణికి నర్ధదేహమును వాసిగ నిచ్చె శివుండు వేడుకన్
  మానవజాతి స్త్రీలకిడ మాన్యత జూపిరి మార్గమివ్విదిన్

  రిప్లయితొలగించండి
 39. వీణా పాణిని యా చతు
  రాననుడే నాలుక చివరన ధరియింపన్
  శ్రీని యెద నిలిపె హరి, శ
  ర్వాణికి దేహార్ధ మొసగె ఫాలాక్షు డొగిన్

  రిప్లయితొలగించండి
 40. ప్రాణసమమ్ముగన్నిలుచు పత్నిగఁ జేయఁగ గూర్చనా నయు
  గ్బాణు దహించియున్ రతికి బాధ మిగుల్చకు డంచుఁ బల్కెడున్
  వాణికి మెచ్చి దంపతుల బంధముఁ దెల్సిన సధ్యుపాస్య శ
  ర్వాణికి నర్ధదేహమును వాసిగ నిచ్చె శివుండు వేడుకన్

  రిప్లయితొలగించండి
 41. ప్రాణము మానమున్ బహు పిపాసయు నాకలి ద్రోసిపుచ్చుచున్
  నాణెపు రీతిగా గెలిచి నందము తోడ వివాహమొందనే
  రాణిని వోలుచున్ మెలగి రాధన మెచ్చుచు బొబ్బరిల్లునా
  వాణికి నర్ధదేహమును వాసిగ నిచ్చె శివుండు వేడుకన్


  రాధనము = ఆహ్లాదము
  బొబ్బరిలు = గాండ్రించు
  వాణి = పలుకుల రాణి

  రిప్లయితొలగించండి
 42. బోణిని జేసి వేకువను పూర్తిగ మున్గుచు ప్రేమలోన నా
  రాణివి నీవెనంచు భళి రమ్యపు రీతిని తాకి నొక్కుచున్
  నాణెపు తీరునన్ నిమిరి నాలుగు మూలల శ్యాముసంగు చ
  ర్వాణికి నర్ధదేహమును వాసిగ నిచ్చె శివుండు వేడుకన్

  రిప్లయితొలగించండి