28, నవంబర్ 2017, మంగళవారం

నిషిద్ధాక్షరి - 39

కవిమిత్రులారా,
అంశము - శివధనుర్భంగము
నిషిద్ధాక్షరములు - శ-ష-స-హ.
ఛందస్సు - మీ ఇష్టము.

101 కామెంట్‌లు:

  1. పార్వతీపతి ధనువును పట్టువిడక
    నెందరెందరో భూనాథు లెక్కుపెట్ట
    లేక మిన్నక నుండంగ,లేచి రాము
    డెక్కుపెట్టగ పెళపెళ ముక్కలయ్యె.

    రిప్లయితొలగించండి
  2. రిప్లయిలు
    1. జనకుడు ఉవాచ:

      రామా! ఇదిగో రుద్రుని
      భీమంబౌ విల్లు! రమ్ము! వీర్యము తోడన్,
      గోముగ జూచెడి జానకి
      ప్రేమకు పరమై, ధరించు పెళ్ళుమనంగన్!

      తొలగించండి
    2. ప్రభాకర శాస్త్రి గారూ,
      కందంలో అందంగా ఉంది మీ పూరణ. అభినందనలు.
      జనకుడు విల్లు నెక్కుపట్టమని మాత్రమే అడిగాడు. విరువమని కాదు. అక్కడ "ధరించి వి ల్లెక్కిడుమా" అంటే ఎలా ఉంటుంది?

      తొలగించండి
  3. గురునికిని వందనంబిడి పరమప్రీతి
    విల్లు విరిచెను రాముడు-విజయుడయ్యె
    భూమిజకు మేను పులకించె,పొంగిపోయె,
    జనకజాదులు తమ భాగ్యమని తలంప

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ప్రసాద రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      జనకజాదులు అంటే సీత మొదలైనవారు. సీతను పైపాదంలో ప్రస్తావించారు కదా! "జనక భూజాని తన భాగ్యమని తలంప" అందామా?

      తొలగించండి
  4. మునిమాటను మిధిలకుజని
    జనకజ మనమునుజయింప చవిగొని ధనువున్
    చనవున యెక్కిడ ఫెళ్ళున
    ఘనమగు ముక్కంటివిల్లు ఖండితమయ్యెన్!

    నునుసిగ్గుల సీతమ్మకు
    కనుదామర లెర్రనాయె కనరవితిలకున్
    కనుగుట్ట నెర్రబారెను
    ధనువెత్తగ లేనియట్టి తక్కినముఖముల్!

    శ,ష,స,హ అక్క్షరములేగాని వాటిగుణింతములు నిషిద్ధములు కావని భావించి చేసిన పూరణ!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సీతాదేవి గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      గుణింతాలు కూడా నిషిద్ధాలే. రెండవ పూరణలో 'సీతమ్మకు' బదులు "భూజాతకు" అనండి. సరిపోతుంది.

      తొలగించండి
    2. గురుదేవులకు నమస్సులు! సవరించిన పూరణ
      అనురాగమునను మైధిలి
      కనుదామర లెర్రనాయె కనరవితిలకున్
      కనుగుట్ట నల్లనాయెను
      ధనువెత్తగ లేనివారి దైన్యపుముఖముల్

      తొలగించండి
    3. శ్రీమతి సీతాదేవి గారికి నమస్సులు...రెండు పద్యాలు బావున్నాయండీ... మొదటి పద్యం "ముని మాటను" చాలా బాగుంది... ఖండితమయ్యెన్ ప్రయోగం పద్యానికి మరింత సొగసునిచ్చింది......... మురళీకృష్ణ

      తొలగించండి
    4. మురళీకృష్ణగారికి నమస్సులు, ధన్యవాదములు! మీవంటి కవులు,పండితులు,అవధానుల ప్రశంస ఒక్కటియైనా మావంటి ఒైత్సాహికులకు గొప్పప్రోత్సాహజనకమే!మరొక్కమారు ధన్యవాదములు!

      తొలగించండి
  5. ఉత్సాహ:
    కోటి పిడుగులొక్కమారు కువలయమును తాకెనో
    నీటి కుప్పలోన నిబిడ నీరమంతనెగెసెనో
    కూటములదిరిపడి ధరణి క్రుంగిపోయెనోయనన్
    మేటి విల్లు విరిగినంత మిన్నునంటె ధ్వానమున్!!

    ఉత్సాహ:
    చేటుగాళ్లకివియె నాదు చివరి మాటలికయనన్
    కూటబుద్ది దనుజులకును గుండెలదిరెనోయనన్
    చాటుచుండెనేమొ భవుని చాపమనెడి తెఱగునన్
    మేటి విల్లు విరిగినంత మిన్నునంటె ధ్వానమున్!!

    ఉత్సాహ:
    ఏటియలల యలజడివలె యెదను తాకి మురిసినో
    తేటి పాట పల్లవి వలె తేనెలూరె చెవులకన్
    తోటపూల గాలిరవమె తోచె జానకికియనన్
    మేటి విల్లు విరిగెనంత మేను పులకరించగన్!!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సత్యనారాయణ గారూ,
      మీరు ఉత్సాహంగా చేసిన మూడు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.
      'చెవులకన్' అన్న ప్రయోగమే కుదరలేదు. అక్కడ "చెవి కనన్" అంటే ఎలా ఉంటుంది?

      తొలగించండి
  6. పెళ్ళు మనెవిల్లు, గుండెల్ గుభిల్లు మనెను
    మేదినీ పతులకపుడు, మేడ లోన
    ఘంట లన్నియు నొకసారి ఘల్లు మనెను,
    ఝల్లు మనెను జానకి మది, యెల్ల జనులు
    పొందె నచ్చెరువు నపుడు, పొలది రాము
    గళము నందు దొడిగెమాల, కనుల లోన
    మెరుపు గలిగెజనకునకు విరివి గాను



    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పూసపాటి వారూ,
      కరుణశ్రీ జంధ్యాల పాపయ్యశాస్త్రి గారి పద్యాన్ని అనుకరిస్తూ మీరు చేసిన పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
      "జనులు। పొంది రచ్చెరువు నపుడు పొలతి..." అనండి.

      జంధ్యాల వారి పద్యం....

      ఫెల్లుమనె విల్లు, గంటలు ఘల్లుమనె, గు
      భిల్లుమనె గుండె నృపులకు, ఝల్లుమనెను
      జానకీదేహ మొకనిమేషమ్మునందె,
      నయయ, జయమును, భయము, విస్మయము గదుర.

      తొలగించండి
  7. కవి మిత్రులకు నమస్కారము. శ్రీ కంది శంకరయ్య గారు నేను వ్రాసిన వీణా బంధము ఈ రోజు బ్లాగులో పెట్టారు వారికి ధన్యవాదములు. పరిశీలించి మీ అమూల్యమైన అభి ప్రాయములు ఈయ ప్రార్ధన

    రిప్లయితొలగించండి
  8. ఎంద రెందరొ ధనువున్న బదరి కమును
    గుంజు కొనిపోవ రొప్పుచు నజ్జు నజ్జు
    యెక్కు బెట్టెను రాముడు ఒక్క వ్రేటు
    గురువు నానతి తలదాల్చి పరమ ప్రీతి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అక్కయ్యా,
      మీ పూరణ బాగుంది.
      రెండవ పాదంలో యతి తప్పింది. 'నజ్జు+యెక్కు... రాముడు+ఒక్క' అన్నపుడు సంధి నిత్యం. యడాగమం, విసంధిగా వ్రాయడం కూడదు.

      తొలగించండి
    2. ఎంద రెందరొ ధనువున్న బదరి కమును
      గుంజు కొనిపోవ రొప్పుచు నజ్జు నజ్జు
      నెక్కు బెట్టెను రాఘవు డోక్క వ్రేటు
      గురువు నానతి తలదాల్చి పరమ ప్రీతి

      తొలగించండి
  9. గుర్వనుజ్ఞను రాము డయ్యుర్విజాత
    పాణి నందంగ చేనంది భవుని ధనువు
    బాహు బలమున గుణమును పట్టి లాగ
    తునిగె నయ్యది పెళపెళ ధ్వనులతోడ.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ,
      మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.

      తొలగించండి
  10. మైలవరపు వారి పూరణ

    మధుర ఘట్టమదిగొ ! మదనారి చాపమ్ము
    ద్రుంచె రాఘవుండు దోర్బలమున !
    అవనిజాత మురియ నమరులు జేజేలు
    పలుక , నింగి పూలవాన గురియ !!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మైలవరపు వారూ,
      మధురమైన పూరణ. మీకు నా జేజేలు!
      మీ పద్యాలు శంకరాభరణంలో పూలవానలే!

      తొలగించండి
    2. మునుపటి పద్యానికి జోడింపు
      🙏🙏🙏🙏🙏

      మ్రొక్కియు గాధితనూజుని
      పిక్కటిలన్ దిక్కులెల్ల వినయాన్వితుడై
      ముక్కంటి విల్లు జేకొని
      ముక్కలుగా విరుచు రామమూర్తిని గనుడీ !!

      అబ్ధులెల్ల గలగ , నవని కంపింపగా
      నద్రిగణము బగులునట్లు రామ
      భద్రుడదిగొ ద్రుంచి భవకార్ముకమ్మును
      అవనిజాతఁబెండ్లియాడెనపుడు !!

      మధుర ఘట్టమదిగొ ! మదనారి చాపమ్ము
      ద్రుంచె రాఘవుండు దోర్బలమున !
      నవనిజాత మురియ నమరులు జేజేలు
      పలుక , నింగి పూలవాన గురియ !!

      మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

      తొలగించండి
  11. ధీర రాముడు గురు నాజ్జ తే కు వ గను
    ఎక్కు పెట్టగ వి ల్లది ముక్క ల య్యే
    జనకు డా నంద ము న పొంగ జానకి యును
    మురిసి పోయె ను లోలోన మోహ ము గ ను

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రాజేశ్వర రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'తేకువగను+ఎక్కు..' అన్నపుడు సంధి నిత్యం. విసంధిగా వ్రాయరాదు. అక్కడ "తెగువ చూపి। యెక్కుపెట్టగ" అందామా?

      తొలగించండి

  12. ఆటాపాటల్ రాముండేబో!
    మాటాడంగన్ మాన్యుల్లెల్లన్
    మీటెన్విల్లున్ మించారంగన్
    తాటంకమ్ముల్ తారాడెన్బో !

    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబీ గారూ,
      విద్యున్మాలా వృత్తంలో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      నిజానికి ఈ వృత్తానికి లాక్షణికులు యతిస్థానాన్ని నిర్దేశించకున్నా వ్రాసిన అందరూ 5వ అక్షరాన్ని యతిగా ప్రయోగించారు. మీరుకూడా మొదటి పాదం తప్ప మిగిలిన పాదాలలో యతిని పాటించారు.
      'ఆటపాట'లని 'ఆటాపాట' లన్నారు. 'మాన్యులెల్ల' అన్నదాన్ని 'మాన్యుల్లెల్ల' అన్నారు. 'మించారంగన్' అన్న ప్రయోగం సాధువు కాదేమో?

      తొలగించండి
  13. సవరించి న పద్యము
    ధీర రాముడు గురు నా జ్ఞ తెగువ జూపి
    యెక్కుపెట్టగ వి ల్లది ముక్క ల య్యే
    జనకు డా నం ద ము న పొంగ జానకి యును
    మురియు చుండె ను లోలోన కరము మీర

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రాజేశ్వర రావు గారూ,
      సవరించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  14. రామచంద్రుని రూపు రవళించ యెదలోన
    జానకమ్మకు గుండె ఝల్లుమనగ
    నీలవర్ణుని చూపు నెమ్మది మదిజేరి
    తనువును వణికించు తరుణమందు
    కమనీయ గతిలోన కదలుచు రాముడు
    కరములూనగ విల్లుగతిని మార్చ
    చేరిన రాజుల చేవలు తగ్గుచు
    భీతి పెరిగి గుండె బెంగటిల్ల

    వచ్చి కళ్యాణ ఘడియల వరములపుడు
    విల్లు ఫెళ్ళున విరిగెడు వేళలోన
    చేరె నలవోక ధరణిజ చేతిలోని
    కమ్ర విరిమాల రాముని కంఠమందు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శ్రీరామ్ గారూ,
      మనోహరమైన పూరణ. అభినందనలు.
      'రవళించ నెదలోన' అనండి.

      తొలగించండి
  15. శ ష స హ ...ఇవి మాత్రమే నిషిద్ధమా లేక వాటి గుణింతము లన్నీనా గురువుగారూ?

    రిప్లయితొలగించండి


  16. మీటెన్ విల్లున్, నారిన్
    మీటెన్, మీటెన్ హృదయము, మీటెన్ జనులన్!
    మాటే బాణము! రాముని
    బాటన్నడిచెను విడువక భామామణియౌ !

    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబీ గారూ,
      మీ రెండవ పూరణ బాగున్నది. అభినందనలు.
      'భామామణియే' అనండి.

      తొలగించండి
  17. ఇనకుల తిలకుడు లీలగ
    ననితరముగ వెలుగు రీతి నతిబల గరిమన్
    ధనువుకు నారిని దొడగియు
    తనరుచు తను లాగినంత ధనువును దునిగెన్

    రిప్లయితొలగించండి
  18. చక్రవర్తులు యోధుఁజే ఖరుచాపభంగము గాకయున్
    విక్రమంబుగ మౌని పంపగ విల్లునెక్కిడె రాముడున్
    ఈ క్రమంబున పెళ్లుపెళ్లున నేలగూలెను ధన్వమే
    ప్రక్రియై వరమాల వైచి వివాహమాడెను జానకీ ౹౹

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రఘురామ్ గారూ,
      మీ మత్తకోకిలా పూరణ బాగున్నది. అభినందనలు.
      'యోధుఁజే', "ధన్వమే ప్రక్రియై'..?

      తొలగించండి
    2. యోధుల చేత అని నా భావం. ధన్వము అంటే విల్లు, ప్రక్రియ అంటే పద్దతిగా లేదా పద్ధతి ప్రకారం అనే అర్థాలు తీసుకున్నాను. సరిపోకపోతే వేరే పదాలు సూచించగలరు.

      తొలగించండి
  19. జనకుని గొలువున రాముడు
    జనులందరి మెప్ఫు బొంద జానకి మురియన్ ధనువును ద్రుంచిన వైనము
    మన మనముల నిలిచిపోయె మధుర ఘటనమై.

    రిప్లయితొలగించండి
  20. ఎన్ని మార్లు ప్రయత్నించినా పదాల పొందిక అలాగే వస్తున్నదార్యా !

    రిప్లయితొలగించండి
  21. కోట రాజశేఖర్ గారి పూరణ

    రంగుగ *భీమచాపము* ను, *రాముడు* లీలగ నెక్కుపెట్టగా,
    వంగిన విల్లు ముక్కలయి, వచ్చె రవమ్ము భయంకరమ్ముగా,
    పొంగెను *భూజ* యే, యితర భూపతులెల్ల, పరాజయమ్ముతో
    క్రుంగిరి, *రామచంద్రు డనురూపగుణన్ వరియించె జానకిన్.*

    *కోట రాజశేఖర్ నెల్లూరు.*

    రిప్లయితొలగించండి
  22. ఖదిరుని వెనుక నడచుచు, గమము నడుమ,
    యతి యువిద యకరిణికి ముగితిని పుడికి,
    జనక పురికి ముని పిదప జని జనకుని
    కొలువునకు గదలి, యెదుట జలలి యుపరి
    పదిల పరచిన ధనువును ముదముగ గని,
    దులి యనుమతి నిడగ యినకుల తిలకుడు
    యొరిగ నిడుచు నజితునకు, కరము బిదప
    దలచి, గొనయము బెరుకగ, పెళపెళ మని
    రవము నిడుచుచు భరుని దరమము విరుగ,
    పుడమి బతుల విచలనము బడలు వడగ ,
    రమణి బురుజుల యుతకపు రవణుల నిడ,
    పుడమి కొమరితపు గరువు బిడియ పడగ,
    వరటపు నడకలు నడచుచు వర గుణనిక
    భరిమ మెడన నెఱికొలుప, ధరణి బతులు
    మెలపు బడగ, యజరులు బహుళమున ని
    లబడి పొలుపు గనుగ , విరులను జిలికెను.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పూసపాటి వారూ,
      మీ సర్వలఘు తేటగీతికా పూరణ బాగున్నది. అభినందనలు.
      'తిలకుడు+ఒరిగ' అన్నపుడు యడాగమం రాదు. "కుల వరేణ్యు। డొరిగ..." అనండి. 'వరటపు నడకలు' అన్నచోట గణభంగం. 'మెడన' అనరాదు, 'మెడను' అనడం సాధువు. "..బడగ నజరులు" అనండి. 'పొలుపు గనుగ'..? 'జిలికిరి' అనండి.

      తొలగించండి
  23. మత్తకోకిల
    రామచంద్రుఁడు విల్లు ద్రుంచ లలాటలోచను మ్రొక్కుచున్
    భీమ ధాటికి భూధరమ్ములు పిక్కటిల్లుచు చిట్లగన్
    భూమి తూలగ వార్ధులన్నియు పొంగు లెత్తగ చిందులన్
    లేమ జానకి దామమందుచు ప్రేమతోడ వరించెనే

    రిప్లయితొలగించండి
  24. గురువు పనుపుఁ దలఁ దాలిచి
    తిర చిత్తముతోడ త్రెంప త్రినయను విల్లున్
    కరమగు వేడుక కలుగగ
    ధరణిజ వరియించె రాము తద్దయు ప్రీతిన్

    రిప్లయితొలగించండి
  25. మౌని వంకకు జూచి మనమును గ్రహియించి
    .....తమ్ముని భుజమును తట్టి లేచి
    లేచి వింటిని జూచి చాచి కరమ్మును
    .....పిడికిట మధ్యను బిగియ బట్టి
    పట్టి జానకి జూచి గుట్టుగా చిరునవ్వి
    .....నిలబెట్టి చాపము నేల పైన
    పైన చివర జూచి జ్యాను క్రిందకు లాగి
    .....చాగజేయగ నెంచ క్షణము లోన

    లోన గుబులయి నరవరుల్ మ్రాను వడగ
    వడక జనకజ యుత్కంఠ పైకొనగను
    నగవు లూరుచు రాముని మొగము వెలుగ
    ఫెళ్ళు మనె విల్లు లోకముల్ త్రుళ్ళి పడగ.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మిస్సన్న గారూ,
      శబ్దాలంకారాలతో మీ పూరణ మనోహరంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
  26. అవధాని నరాల రామిరెడ్డి గారికి ఆహ్వానము ! వారి సొంతూరేదందురా? *******)()(******* కవుల కాణాచి యాపేట కంచుకోట ! పసిడి వన్నెలు విరజిమ్ము పట్టణమ్ము ! పొంగు కవితలు ప్రతినోట పూలతోట! పుడమి తల్లి కాసుల పేరు ప్రొద్దుటూరు!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జనార్దన రావు గారూ,
      చక్కని పద్యం. ధన్యవాదాలు!
      మన సహదేవుల వారిదీ ఆ ఊరే.

      తొలగించండి
    2. ధన్యవాదాలార్యా! సహదేవుల (ప్రొద్దుటూరు)వారిని చాలా కాలంగా ఫేస్బుక్ లో చూస్తూనే ఉన్నాను.

      తొలగించండి
    3. నేను మొదటి సారిగా శ్రీ నరాల రామారెడ్డి గారి అవధానాన్ని మా K.C.V.S.పాఠశాలలొ 1968లో చూచాను. అప్పటికి నాకేమీ తెలియదనుకోండి.అయినా తెలిసిన మేరకు ఆస్వాదించాము నాటి విద్యార్థులం (నేనప్పుడు 8వ తరగతి)

      తొలగించండి


  27. రాటుల్దేలిన రాజులే విడిచిరే రాద్ధాంతముల్ జేయుచున్
    మాటల్బల్కగ వచ్చునర్ర! నగుమోమాయెన్ గదా, బాలుడ
    ర్రా! టారెత్తుచు పారిపోవునితడున్ ?రవ్వంత కాలంబునన్
    మీటన్విల్లును రాముడే,భళి భళీ మించారె రావమ్మటన్ !

    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబీ గారూ,
      మీ శార్దూలం చక్కగా ఉంది. అభినందనలు.
      'మించారె'...?

      తొలగించండి
  28. రిప్లయిలు
    1. గాధేయుఁడు గను రాఘవ ధను వన రాముఁ డనె మేటి వింటిని నార్య తాకి
      తొడఁగెద నెత్తఁగ వడి నారిఁ దొడుగ నని కొని యనుమతి ముని వరు నుండి
      లీలగఁ జని కదలించి భాండము నుండి విల్లు వేల జనులు నల్లనఁ గన
      నారినిఁ బూరించి ధీరత లాగంగఁ బెల్లున నంత గుభిల్లు మనుచు

      విఱిగె మధ్యమున ధనువు వింత గొలుప
      నా ధ్వని పిడుగు మించఁగ నవని నగము
      లు వణఁకెను మూర్ఛిలిరి జనులు ముని జనక
      రాఘవులు దక్క నజితు ధర్మమ్ము విఱుగ

      తొలగించండి
    2. వాల్మీకీయ రామాయణము:

      విశ్వామిత్రస్తు ధర్మాత్మా శ్రుత్వా జనకభాషితమ్.
      వత్స రామ ధను: పశ్య ఇతి రాఘవమబ్రవీత్৷৷1.67.12৷৷

      బ్రహ్మర్షేర్వచనాద్రామో యత్ర తిష్ఠతి తద్ధను:.
      మఞ్జూషాం తామపావృత్య దృష్ట్వా ధనురథాబ్రవీత్৷৷1.67.13৷৷

      ఇదం ధనుర్వరం బ్రహ్మన్ సంస్పృశామీహ పాణినా.
      యత్నవాంశ్చ భవిష్యామి తోలనే పూరణేపి వా৷৷1.67.14৷৷

      బాఢమిత్యేవ తం రాజా మునిశ్చ సమభాషత.
      లీలయా స ధనుర్మధ్యే జగ్రాహ వచనాన్మునే:৷৷1.67.15.

      పశ్యతాం నృపసహస్రాణాం బహూనాం రఘునన్దన: .
      ఆరోపయత్స ధర్మాత్మా సలీలమివ తద్ధను:৷৷1.67.16৷৷

      ఆరోపయిత్వా ధర్మాత్మా పూరయామాస తద్ధను:.
      తద్బభఞ్జ ధనుర్మధ్యే నరశ్రేష్ఠో మహాయశా:৷৷1.67.17৷৷

      తస్య శబ్దో మహానాసీత్ నిర్ఘాతసమనిస్వన:.
      భూమికమ్పశ్చ సుమహాన్ పర్వతస్యేవ దీర్యత:৷৷1.67.18৷৷

      నిపేతుశ్చ నరా స్సర్వే తేన శబ్దేన మోహితా:.
      వర్జయిత్వా మునివరం రాజానం తౌ చ రాఘవౌ৷৷1.67.19৷৷

      తొలగించండి
    3. కామేశ్వర రావు గారూ,
      అద్భుతమైన సీసపద్యంతో ధనుర్భంగ ఘట్టాన్ని కళ్ళకు కట్టినట్టు వర్ణించారు. అభినందనలు, ధన్యవాదాలు.

      తొలగించండి
    4. పూజ్యులుశంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు.

      తొలగించండి

  29. గరళకంఠు ధనువు కాకుత్సు డెత్తంగ
    చాన జానకి మది ఝల్లుమనగ
    విరుల వాన కురియ విబుధులు మెచ్చంగ
    ధరణిజ గళమందు తాళి గట్టె .

    భవుని విల్లు రామభద్రుడు ద్రుంచంగ
    జానకమ్మ యయ్యె జాయ తాను
    ముదము తోడ జనులు మురియుచు నుండంగ
    రాము కరము పట్టి రమణి నడచె.

    జనకుని గొలు వందు చాపము నెత్తంగ
    పడతి మైథిలియును పరవశించె
    జనకరాజు మురియ జనులచిత్తములెల్ల
    పులకరించి పోయె పుడమి యందు.

    రుద్రునిధను వెత్తె ను రామ భద్రు డచట
    ఇతర రాజుల తలలెల్ల నిలకు జార
    భూమిపుత్రి తో జనకుడు భూరిగాను
    పరిణయమ్మొన రించెను ప్రజలు మెచ్చ.

    మదన వైరి ధనువు మానుగా విరచిన
    రామ భద్రుని గని రమణి మురియ
    మునులు జనులు మెచ్చ ౹ముదమంది జనకుడు
    పెండ్లి యాచరించె ప్రీతి తోడ.


    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఉమాదేవి గారూ,
      మీ ఐదు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      మూడవ పూరణలో 'పరవశించె' అని నిషిద్ధాక్షరాన్ని ప్రయోగించారు.

      తొలగించండి
  30. గిరిజాపతివిల్లునెగద
    యిరవుగనారామభద్రుడెంతయొగరిమ
    న్గరగరరవములుగలుగగ
    గరములతోధనువునెత్తిగడగడవిరిచెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సుబ్బారావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      విల్లు, ధనువు అని పునరుక్తి దోషం ఉన్నది.

      తొలగించండి
  31. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  32. ధనువేల యెత్తెరాముడు?
    ఘనుడగు రావణుని చేత కాదన|”మదిలో
    జనకుని పుత్రిక జానకి
    యనుకొన్నది తీర్చనెంచ”?నంపగ గురువే|

    రిప్లయితొలగించండి
  33. పద్యము: ఘనమగు రుద్రుని చాప
    మ్మును,జనకుని కొలువున పోడిమిగా నె
    త్తెను .రాముడెక్కు పెట్టం
    గను భంగమ్మయె,ధరణిజ కలకువ దీరెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. తిమ్మాజీ రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      రెండవ పాదంలో గణదోషం. "కొలువులోన" అనండి.

      తొలగించండి
    2. గురుదేవుల సూచనతో సవరించిన పద్యము

      ఘనమగు రుద్రుని చాప
      మ్మును,జనకుని కొలువులోన పోడిమిగా నె
      త్తెను .రాముడెక్కు పెట్టం
      గను భంగమ్మయె,ధరణిజ కలకువ దీరెన్

      తొలగించండి
  34. గురువు గారికి నమస్సులు.
    రాముడు గురువాజ్ఞన్ నే
    నీమున్ లేకన్ నడవికి నీతిగ వెళ్ళెన్
    ఏ మాత్రమున్ వెరువక
    రాముడు వింటిని విరువగ రాజిలె జానకి.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. వెంకటనారాయణ రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మూడవ పాదంలో గణదోషం. "ఏమాత్రమ్మున్..." అనండి.

      తొలగించండి
  35. క్రొవ్విడి వెంకట రాజారావు:
    తే.గీ.
    గాధిపట్టి ననుజ్ఞతో కపిరధుండు
    గజరిపువు విల్లు విరుచుట గాంచి భూజ
    యలరి రఘుపతి మెడయందు యత్తరమున
    దండ నునిచె మురిపెముతో తండ్రి మెచ్చ

    రిప్లయితొలగించండి
  36. భూమిజను వరించ భువిగల రాజులు
    ప్రతిభ జూప లేక పరుగు లిడగ
    భవుని విల్లు నెత్తి ప్రఖ్యాతి గాంచెను
    రామచంద్రు డపుడు రమ్య గతిని

    రిప్లయితొలగించండి
  37. రాముడు రఘుకులధాముడు
    ధీ మతి భవు బాణ మెత్తి దివిజులు బొగడన్
    భామామణి గుణవతి నవ
    కోమలి జానకిని పెండ్లి కూర్మిన్నాడెన్

    రిప్లయితొలగించండి
  38. పౌరుల్విజ్ఞుల్పారంజూడన
    న్నౌరా!యంచున్నానందింప
    న్నారింన్లాగెన్నారింగెల్చె
    న్నారాముండే యాహా!యోహో !

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జనార్దన రావు గారూ,
      మీ విద్యున్మాలా వృత్త పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  39. నిషిద్ధాక్షరి..

    శ.. ష.. స.. హ..( నిషిద్ధాక్షరములు )
    అంశము... శివధనుర్భంగము
    స్వేచ్ఛా ఛందస్సులో..

    వర మౌనీంద్రుని యానతిన్ జనకజా వాంఛా ఫలమ్మో యనన్
    పరమానందకరుండు రాముడు ధనుర్భంగమ్ము గావింపగా
    ధర మార్మ్రోగెను రావముల్ గిరి దరీ ద్వారమ్ములన్ జేరి , ది...
    క్కరులున్ గుందెను , వార్ధులున్ గలగెడిన్ , కళ్యాణరాముండు దా
    ధరణీజాతను వేడుకన్ జయజయధ్వానమ్ములేపారగన్
    విరివానన్ గురిపించి దేవతలు దీవింపంగ చేపట్టెడిన్ !!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
  40. ధన్యవాదాలన్నయ్యగారూ.
    సవరించిన పద్యంతో పాటు మరోరెండు పద్యములు.

    జనకుని గొలు వందు చాపము నెత్తంగ
    నాతి జానకమ్మ నంద మొంద
    జనకరాజు మురియ జనులచిత్తములెల్ల
    పులకరించి పోయె పుడమి యందు.

    గిరిజాపతి ధనువును తా
    విరిచెను రఘురా ముడు వెరగందంగా
    మురిపెము తోడను జనకుడు
    పరిణయ మొనరించెగాదె ప్రజలట మెచ్చన్.

    తపము కావంగ ముని వెంట తరణి కులజు
    డరిగి పిదప మిథిలకేగి యభవు విల్లు
    విరువ జానకి మదిలోన ప్రేమ వెల్లు
    వవగ కరమందె రాముడు వలపు తోడ.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఉమాదేవి గారూ,
      మీ తాజా పూరణలు బాగున్నవి. అభినందనలు.
      వాట్సప్ లో మీ పద్య్హాలను సమీక్షించాను. చూడండి.

      తొలగించండి
  41. రావణుండంత విఫలుడై రగిలి పోవ
    ధనువు నెక్కు బెట్టుచునె నా ధరణి జాత
    మదిని గెలువంగ రాముడు ముదము తోడ
    వేలుపులు కురిపించిరి విరుల వాన!

    రిప్లయితొలగించండి
  42. డా.పిట్టా
    విల్లును యెత్తలేడు ఘన వేగముతో ధరణీజనెత్తె యీ
    ప్రల్లద గాథ రామకథ, బాయదులే , విధి వంచు నందరిన్
    పుల్లను లేపనీదు గదె పూనని భాగ్యము; లోక కంటకా
    లల్లగ రావణుండు బలియౌటయె యుక్తము రాము చేతులన్!

    రిప్లయితొలగించండి