19, నవంబర్ 2017, ఆదివారం

సమస్య - 2524 (శ్రీకృష్ణుని కంటె...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది.... 
"శ్రీకృష్ణుని కంటె ఘనుఁడు శిశుపాలుండే"
ఈ సమస్యను పంపిన గుఱ్ఱం జనార్దన రావు గారికి ధన్యవాదాలు.

71 కామెంట్‌లు:

 1. ఆకన్నెక రుక్మిణి తో
  చేకొనమని వీరుడైన శిశుపాలుడినే
  యా కఠినుడు రుక్మి పలికె
  "శ్రీ కృష్ణుని కన్న ఘనుడు శిశుపాలుండే "

  రిప్లయితొలగించండి
 2. కోకొల్ల లపహరణలను
  చేకొని చేయించుచుండి చెట్టాపట్టల్
  శ్రీకరముగ గావించెడి
  శ్రీకృష్ణుని కంటె ఘనుఁడు శిశుపాలుండే :)

  చెట్టాపట్టలు = వివాహములు
  అపహరణ = kidnap
  ఉదా = రుక్మిణీ కల్యాణము, శశిరేఖా పరిణయము వగైరా వగైరా

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ప్రభాకర శాస్త్రి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   దీని నేమంటారు? Negetive approch అనుకుంటాను.

   తొలగించండి
  2. వితండ వాదం:

   1. frivolous and fallacious argument without attempting to establigh the opposite side, captious objection, idle carping, hypercriticism, perverse argument;

   ...శంకర నారాయణ తెలుగు-ఇంగ్లీష్ నిఘంటువు 1953

   (ఆంధ్ర భారతి)

   తొలగించండి
 3. చేకొని యనాథ బాలల
  నేకాలము సాకువాని నెంతయు బ్రీతిన్
  లోకంబున నిటులందురు
  శ్రీకృష్ణుని కంటె ఘనుఁడు శిశుపాలుండే.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సత్యనారాయణ మూర్తి గారూ,
   'శిశుపాల' శబ్దానికి క్రొత్త అర్థం చెప్పిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి


 4. ఆ కనులు మూడు! నాల్గై
  యా కరముల పుట్టుకగదయా!యద్భుతమౌ
  యాకృతి సరిజేసిన ఆ
  శ్రీకృష్ణుని కంటె ఘనుఁడు శిశుపాలుండే?

  జిలేబి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. జిలేబీ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'నాల్గె' అంటే గణదోషం. "నాలుగె" అనండి. '...యద్భుతమౌ। నాకృతి...' అనండి.

   తొలగించండి
 5. వాకొనరాని విధమ్మున
  లోకమ్మున దుష్ట కృతులు లోకాహితుడై
  ప్రాకటముగ జేయుటలో
  శ్రీకృష్ణుని కన్న ఘనుడు శిషుపాలుండే

  లోకముల లేడు లేడొకొ
  శ్రీకృష్ణుని కన్న ఘనుడు, శిషుపాలుండే
  లోకులకు కీడు చేయుచు
  శ్రీకృష్ణుని జేత మరణ సిద్ధిని పొందెన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. విజయకుమార్ గారూ,
   మీ రెండు పూరణలు వివిధ్యంగా, అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.

   తొలగించండి
  2. శ్రీ శంకరయ్య గారూ! శ్రీ మురళీ కృష్ణావధాని గారూ! ధన్యవాదములు. నమస్సులు.

   తొలగించండి
 6. లోకములందున కలడే
  శ్రీ కృష్ణుని కన్న ఘనుడు, శిశుపాలుండే
  యాకరివరదుని వైరిగ
  వైకుంఠముచేరనెంచి వదరెను హరిపై

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అన్నపరెడ్డి వారూ,
   విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 7. (కృష్ణునికి అగ్రపూజ వద్దని ధర్మరాజును వారిస్తున్న శిశుపాలుడి సేనాపతి సుమేథుడు)
  ఈకేశవు కిడకర్ఘ్యము;
  నేకాలము భజనపరుల యెక్కుడు పలుకుల్
  నీ కర్ణంబుల నింపకు;
  శ్రీకృష్ణుని కంటె ఘనుడు శిశుపాలుండే.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. బాపూజీ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   సుమేథుని గురించి క్రొత్తగా తెలుసుకున్నాను. ధన్యవాదాలు.

   తొలగించండి
 8. ప్రా కట ముగనెంచ కల డె
  శ్రీకృష్ణుని కంటె ఘనుడు ? శిశు పాలుoడే
  లోకోద్దారు ని సభలో
  దూకు డు దూషణ ము జేసి దురి తుం డ య్యే న్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. రాజేశ్వర రావు గారూ,
   విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 9. మైలవరపు వారి పూరణ

  శ్రీకరుడౌ కృష్ణుండన ,
  సూకర సుందరుడు చైద్య సుకుమారుండౌ !
  కోకిలకు కాకిఁ బోల్తురె ?
  శ్రీకృష్ణుని కంటె ఘనుఁడు శిశుపాలుండే ??

  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మైలవరపు వారూ,
   సమస్య పాదాన్ని ప్రశ్నార్థకంగా మార్చిన మీ పూరణ అద్భుతంగా ఉంది. అభినందనలు.

   తొలగించండి
  2. మైలవరపు వారి పూరణతో నాది కలవడము సంతోషదాయకము! యాదృచ్ఛికము!

   తొలగించండి
 10. కాకోలము కోకిలనే
  షోకలరగ మించగలదె సొంపగు రవళిన్
  శ్రీకరుడగు పరమేశ్వరు
  శ్రీకృష్ణుని కన్న ఘనుడు శిశుపాలుండే??

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సీతాదేవి గారూ,
   సమస్యను ప్రశ్నార్థకంగా మార్చి చెప్పిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 11. శిశుపాలుని స్వగతము:-

  శ్రీకరుడని పాండుతనయు
  లేకృష్ణునిఁ బూజఁసేయనెంచెనిపుడు నే
  నాకృష్ణుని తిట్ట నగును
  శ్రీ కృష్ణుని కంటె ఘనుడు, శిశుపాలుండే

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సూర్యనారాయణ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   కర్తృపదం తనయులు బహువచనం. క్రియాపదం ఎంచె ఏకవచనం. అక్కడ "సేయ నెంచ.." అనండి. చివర "శిశుపాలుం డేన్" అనండి అన్వయం కుదురుతుంది.

   తొలగించండి
 12. గురువుగారూ నిన్నటి పూరణను పరిశీలించం ప్రార్ధన!

  వరబల గర్వితు డసురుడు
  పరనారీ కాముకుండు వరియింపగనే
  నిరసిత రంభా పరిరం
  భ రతుని దునిమె రాఘవుండు భామిని కొరకై!

  రిప్లయితొలగించండి
 13. ననిన్నటి ఆకాశవాణి సమస్యాపూరణలను నమోదుచేసి పంపిన శ్రీహర్ష గారికి కృతఙ్ఞతలు! వందన శతములు!!

  రిప్లయితొలగించండి
 14. తాకగ బోయని బాణము
  గోకుల తిలకుండు వీడె కువలయమేడ్వన్!
  శ్రీకరు చక్రమె కూల్చఁగ
  శ్రీకృష్ణుని కంటె ఘనుఁడు శిశుపాలుండే!!

  రిప్లయితొలగించండి
 15. వికృతిగననె సుయోధను
  డాకృష్ణుడు నీచుడు మనయందు విరోధుం
  డాకృతి దాల్చిన మందుడు
  శ్రీకృష్ణుని కంటె ఘనుఁడు శిశుపాలుండే

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. భాస్కరమ్మ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   మొదటి పాదంలో గణదోషం. "వికృతగ ననెను సుయోధను" అనండి. (వికృతి - భగణం కాదు, 'వి' లఘువే).

   తొలగించండి
 16. కోట రాజశేఖర్ గారి పూరణ

  సందర్భం :: పుట్టినప్పుడు ఇతనికి నాలుగు చేతులు, లలాటంలో మూడవ కన్ను ఉండినవి. *రెండు కన్నులు గల శ్రీకృష్ణుని కంటే మూడు కన్నులు గల శిశుపాలుడే ఘనుడు.* ఇతనినే వివాహమాడు అని *రుక్మిణితో ఆమె అన్న రుక్మి పలికే సందర్భం.*

  లోకమున, *మూడు కనులు,* వి
  లోకింపగ నాల్గు చేతులు, గలిగి పుట్టెన్,
  చేకొనగ *రెండు కన్నుల*
  *శ్రీకృష్ణుని కంటె ఘనుడు శిశుపాలుండే.*

  *కోట రాజశేఖర్ నెల్లూరు.*

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. రాజశేఖర్ గారూ,
   మీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.

   తొలగించండి
  2. శ్రీ కంది శంకరయ్య గురువరేణ్యులకు హృదయపూర్వక ప్రణామాలు. కోట రాజశేఖర్. నెల్లూరు.

   తొలగించండి
 17. తేకువవీరుడులేడిల
  శ్రీకృష్ణునికంటె,ఘనుడుశిశుపాలుండే
  భీకరమౌదూషణలో
  శ్రీకృష్ణుడుచంపెసదరుచేదిప్రభునిన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సుబ్బారావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'సదరు' అన్నది ఉర్దూ పదం. "చంపె నట్టి చేది..." అనండి.

   తొలగించండి
 18. రిప్లయిలు
  1. వీఁకం దిరుగుచు జగతిని
   నా కంటెన్ ఘనుఁడు లేడనంగఁ జెలగినం
   వే కాచఁ బొందెను వరము
   శ్రీకృష్ణుని, కంటె, ఘనుఁడు శిశుపాలుండే

   [కంటె = చూచితివా]

   తొలగించండి
  2. అద్భుతమైన విరుపు!! నమస్సులు!!

   తొలగించండి
  3. కామేశ్వర రావు గారూ,
   సహజంగానే మీ పూరణ వైవిధ్యంగా, ఉత్తమంగా ఉన్నది. అభినందనలు.

   తొలగించండి
  4. పూజ్యులుశంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు.
   డా. సీతా దేవి గారు ధన్యవాదములు, నమస్సులు.

   తొలగించండి
 19. శ్రీకృష్ణుని..నాటకం చుసిన ఇద్దరు ప్రేక్షకులు ఇలా అనుకుంటున్నారు...

  శ్రీకృష్ణుని నాటకమం
  దా కృష్ణుని కంటెను బహుదా శిశుపాలుం
  డే కళ నేర్పుగ జూపె
  శ్రీకృష్ణుని కంటె ఘనుఁడు శిశుపాలుండే

  తిరుక్కోవళ్ళూరు శ్రీహర్ష

  రిప్లయితొలగించండి
 20. *స్వీకృతివిరించిది సమ*
  *స్యాకృతినిగనెన్ జనార్థనార్యుండెట్లో*
  *ఆ కృతిఁ పాదంబిదియే*
  *"శ్రీకృష్ణుని కంటె ఘనుఁడు శిశుపాలుండే"*

  *శ్రీమతి జి సందిత బెంగుళూరు*
  ***********************************
  ఈ సమస్యను పంపిన గుఱ్ఱం జనార్దన రావు గారికిధన్యవాదాలు.
  ************************************

  రిప్లయితొలగించండి
 21. ఆకృతియందున నలుపని
  శుకృతమే తక్కువనుచు సులభుడుజూడన్
  వికృత బుద్ధులు మానిన
  శ్రీకృష్ణని కంటె ఘనుడు శిశుపాలుండే|

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ఈశ్వరప్ప గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'సుకృతమ్మే తక్కువనుచు... వికృతపు బుద్ధులు..." అనండి.

   తొలగించండి
 22. ఛీకొట్టెడుకార్యములన్
  శ్రీకృష్ణుని కంటె ఘనుడు శిశుపాలుండే
  స్వీకృత దుష్కర్మ తరుమ స్వ
  యంకృత నఘభర మనమున నంతము నొందెన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. శ్రీరామ్ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   మూడవ పాదంలో గణదోషం. "స్వీకృత దుష్కృతి తరుమ స్వ" అనండి.

   తొలగించండి
 23. ప్రాకటముగ లేడిలలో
  శ్రీకృష్ణుని కంటె ఘనుడు,శిశుపాలుండే
  నాకంటె వీరుడెవడని
  గోకుల తిలకుని వదరుచు గూలెను భువిలో  రిప్లయితొలగించండి
 24. కోట రాజశేఖర్ గారి మరొక పూరణ

  నా అవధాన విద్యా గురువరేణ్యులగు శ్రీ నరాల రామారెడ్డి గారి సూచన మేరకు నేటి సమస్యకు నేను చేసిన మరొక పూరణ

  సందర్భం :: రుక్మి తన చెల్లెలైన రుక్మిణితో మాట్లాడుతూ
  ‘’అమ్మా కృష్ణుడు మంచివాడు కాడు. నీ కెట్లా నచ్చాడమ్మా? కృష్ణుని కంటే శిశుపాలుడే గొప్పవాడు. ‘’అని ఒప్పించే ప్రయత్నం చేసే సందర్భం.

  గోకులచోరుడు కృష్ణుడు,
  నీ కిడు సవతులను, తగడు నీకున్ బతిగా,
  నీకెట్లు నచ్చెనమ్మా?
  శ్రీకృష్ణుని కంటె ఘనుడు శిశుపాలుండే.

  కోట రాజశేఖర్ నెల్లూరు.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. శ్రీ ప్రభాకరశాస్త్రి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. కోట రాజశేఖర్ నెల్లూరు.

   తొలగించండి
  2. రాజశేఖర్ గారూ,
   మనోజ్ఞమైన పూరణ. అభినందనలు.
   (శంకరాభరణం సమస్యలు శ్రీమాన్ నరాల రామారెడ్డి గారి దృష్టికి వెళ్తున్నాయన్నమాట! చాలా సంతోషం!)

   తొలగించండి
 25. రిప్లయిలు
  1. నా “శ్రీమదాంధ్ర సుందర కాండ చత్వారింశ సర్గమున నేటి పద్యములలో నొకటి.


   క్షోభ పఱచెడు నా తీవ్ర శోక రయము
   చంప నెంచు దైత్యుల బెదరింపు లెల్లఁ
   జేరి రాముని వినిపింపు వీర వేగ
   హ్లాద యానమ్ము నీకగు నాంజనేయ

   మూలము:
   ఇమం చ తీవ్రం మమ శోకవేగం
   రక్షోభిరేభిః పరిభర్త్సనం చ.
   బ్రూయాస్తు రామస్య గతస్సమీపమ్
   శివశ్చ తేధ్వాస్తు హరిప్రవీర৷৷5.40.24৷৷

   తొలగించండి 26. కేకిని దాల్చుచు తిరిగెడు

  శ్రీకృష్ణుని కంటె ఘనుఁడు శిశుపాలుండే?

  యాకొంటి ననుచు వెన్నను

  చేకొన్న  హరియు మురారె శ్రేష్ఠుండిలలో.


  లోకంబున లేడెవ్వడు

  శ్రీకృష్ణుని కంటె ఘనుఁడు, శిశుపాలుండే

  లోకంబున పుట్టెను మూ

  డౌ కన్నుల తోడజచ్చె  నాహరి చేతన్


  భీకర రూపున జూడగ

  శ్రీకృష్ణుని కంటె ఘనుఁడు శిశుపాలుండే

  లోకంబునందు రోతగు

  యాకారంబున జనించిహరిచే జచ్చెన్.


  గోకుల వాసిని మరువుము

  నీకిల తగినట్టి పతిని నెంచితి నెపుడో

  నూకొట్టుము నా మాటకు

  శ్రీకృష్ణుని కంటె ఘనుఁడు శిశుపాలుండే.

  రిప్లయితొలగించండి
 27. లోకమ్మున లేరెవ్వరు
  శ్రీకృష్ణుని కంటె ఘనుఁడు, శిశుపాలుండే
  భీకర కోపోధ్రికుడై
  శ్రీకరు నిందించి చచ్చెశ్రీ చక్రముచే

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. లక్ష్మినారాయణ గారూ,
   విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 28. గోకులమున పెరిగిన యా
  శ్రీకృష్ణుని కంటె ఘనుడు శిశుపాలుండే
  నీకు తగిన వరుడనుచును
  వాకొనె రుక్మిణిని జూచి భ్రాత మృదువుగా

  రిప్లయితొలగించండి
 29. చౌకాయెను కల్లనుచును
  నేకముగా ముంతలు పది యే ద్రావితివా?
  మైకము క్రమ్మెనె? నెవ్విధి
  శ్రీకృష్ణుని కంటె ఘనుడు శిశుపాలుండే ?

  రిప్లయితొలగించండి
 30. డా.పిట్టా
  అరయగ బుణ్యవంతులకు నౌను పరీక్షలు బెక్కు, ధర్మమున్
  సరగున నెన్న వే శ్రమల సల్పగజాలిన మర్మ మెన్నరే
  నిరతము కౄర కర్ముడయి నేర్పున చావుకు ముందు *రామ*నన్(రామ్+అనన్)
  పరమ పదమ్ము లభ్యమగు బాపులకే సులభమ్ముగా భువిన్.....పూర్వ సమస్య.
  పర నారీ ద్రవ్యముకై
  బరితెగి నొక ధనిక వృద్ధ భర్తగ మారన్
  కర,చరణపుటలుపెరుగని
  పరమ పదము1 లభ్యమగును పాపాత్ములకే!(ఉన్నత, సుఖప్రద పదవి),,

  రిప్లయితొలగించండి
 31. డా.పిట్టా
  *నీ కృపయా!శిశు పాలక!
  వే కృతులన్ జేతువీవు వీరిని బెంచన్
  యాకృతులే నకనక లిక
  శ్రీ కృష్ణు(కేవలం వెన్న దొంగిలించి పెట్టువాని)ని కంటె ఘనుడు శిశుపాలుండే!
  (సంపూర్ణ శిశు రక్షణ కేంద్రపు నిర్వహణాధికారిని సంబోధిస్తూ)

  రిప్లయితొలగించండి