8, నవంబర్ 2017, బుధవారం

సమస్య - 2514 (భీముఁడు చెలరేగి...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"భీముఁడు చెలరేగి చంపె భీష్ము రణమునన్"
(లేదా...)
"భీముఁడు యుద్ధరంగమున భీష్మునిఁ జంపెఁ బరాక్రమోద్ధతిన్"
ఈ సమస్యను పంపిన ప్రసన్న కుమారాచారి గారికి ధన్యవాదాలు.

72 కామెంట్‌లు:

  1. దామోదరు ప్రోద్బలమున
    నీమము నెంచక విజయుడు నిర్వీర్యుండై,
    ధీమంతుడు, రణమందున
    భీముఁడు, చెలరేగి చంపె భీష్ము రణమునన్

    భీముడు = భయంకరుడు

    రిప్లయితొలగించండి
  2. కోమలి హిడింబ మగడే ;
    రాముడు దశకంఠు నేమి రణమున జేసెన్? ;
    దామోదరు డెవని గినిసె? ;
    భీముడు ; చెలరేగి చంపె ; భీష్ము రణమునన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జనార్దన రావు గారూ,
      క్రమాలంకారంలో మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  3. (కురుక్షేత్రయుద్ధం మూడవరోజున దుస్స్వప్నబాధితుడైన ధృతరాష్ట్రుడు దుర్యోధనుడితో)
    ఏమది పుత్రకా!మిగుల నేమరుపాటున నుంటివిట్టులన్?
    నామది ఛిద్రమై యిపుడు నర్మిలి కోల్పడి కుందుచున్నదే!
    వామపుకంటిలో మిగుల వడ్కులుపుట్టెను;స్వప్నమందునన్
    భీముడు యుద్ధరంగమున భీష్ముని జంపె బరాక్రమోద్ధతిన్.






    లు



    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. బాపూజీ గారూ,
      మీ ధృతరాష్ట్ర స్వప్నవృత్తాంత పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి


  4. ఆముకొను సేన ననఘా
    భీముఁడు చెలరేగి చంపె; భీష్ము రణమునన్,
    తా ముంచెత్తెను శరముల
    తో మఘవ తనయుడయా యితోధికముగనౌ !


    జిలేబి

    రిప్లయితొలగించండి


  5. ఆముకొనంగ సేననఘ,యా‌ రణరంగములోన చంపెనా
    భీముడు; యుద్ధరంగమున భీష్ముని జంపె బరాక్రమోద్ధతిన్
    తామునుపున్ శిఖండి నిడి, తాకుచు బాణపు శయ్య బేర్చుచున్
    తామరచూలి రాత యన తాతను కూల్చె కిరీటియేయటన్!

    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబీ గారూ,
      విరుపుతో మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
  6. ధీమతిని జేయ కొమరుని
    ప్రేమముతో బంప నొకడు వేరొక దేశం
    బామందుం డట బల్కెను
    భీముఁడు, చెలరేగి చంపె భీష్ము రణమునన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ధీమతిని జేయ కొమరుని
      ప్రేమముతో బంప నొకడు వేరొక దేశం
      బామందుం డట బల్కెను
      భీముఁడు చెలరేగి చంపె భీష్ము రణమునన్.

      తొలగించండి
  7. స్వామీ భీష్ముడు స్వేచ్ఛను
    ధీమతియై విడిచె గాదె తెలియగ నసువుల్
    తామిట్లన దగునే? యే
    భీముఁడు చెలరేగి చంపె భీష్ము రణమునన్?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. వేంకట సత్యనారాయణ మూర్తి గారూ,
      మీ రెండు పూరణలు వైవిధ్యంగా, చక్కగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
  8. డా.పిట్టా
    భీముడు బెద్ద, మోది తగ భీకర జైట్లియె యర్జునుండు యా
    నీమమె నోట్లరద్దు,గన నీ జీయెసుటీలను కీడుగా గొనన్
    సామము(పోలిక)నందు భీష్ముడన జాటిన మోహను రీతి వాదనన్
    తా, మును ఖండనమ్మున సుతారముగా వధియించె నా సభన్
    భీముడు యుద్ధరంగమున భీష్ముని జంపె బరాక్రమోద్ధతిన్!(అర్జును,(జైట్లీకి)నకు అవకాశమివ్వలేదతడు విత్తమంత్రిగా జవాబుదారీ యైనప్పటికిని)

    రిప్లయితొలగించండి
  9. డా.పిట్టా
    భీముడె యర్జునుడును సరి
    భీముడె భీష్ముడును శత్రు భీకరుడవనిన్
    నీమమె బలముల ఘర్షణ
    భీముడు చెరేగి చంపె భీష్ము రణమునన్
    (భీముడు=భయంకరుడు)

    రిప్లయితొలగించండి
  10. క్రొవ్విడి వెంకట రాజారావు:

    భీమరమున రారాజును
    భీముడు చెలరేగి జంపె; భీష్ము రణమునన్
    నామమడచె బీభత్సుడు
    సోమించి శిఖండి నడ్డు జూపుచు నపుడున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. భీమా పరాక్రముడెవరు?
      రాముడు రావణుని నెటుల రణమున్ కూల్చేన్?
      శ్రీమంతుడెవరిని గవిసె?
      భీముడు చెలరేగి జంపె భీష్ము రణమునన్
      భీమా అనగా భయాంకరుడా అని శ్రీ సి వి సుబ్బన్న గారు ఒక చోట అవధానములో ప్రయోగించారు.
      అందరికి వందనములు.

      తొలగించండి
    2. రాజారావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ******
      వెంకట నారాయణ రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  11. లేమహి డం బి పతి యెవరు ?
    భీముడు శత్రువుల నెట్లు పీచ మడ oచేన్
    దామోదరు ను తి యించె ను

    భీముడు ';చెలరేగి చం పె ;భీష్ము రణ ము న న్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రాజేశ్వర రావు గారూ,
      మీ క్రమాలంకార పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  12. కామునిఁ దండ్రి రుక్మిణికి కాంతుఁడు సాధుల బ్రోచువాఁడు గో
    త్రామర తాపసోత్తముల రక్షణ భారము బూనెడిం బరం
    ధాముఁడు రాక్షసాధముల దస్యుడు ధాత్రిని దుర్జనాళికిం
    భీముఁడు యుద్ధరంగమున భీష్మునిఁ జంపెఁ బరాక్రమోద్ధతిన్

    గీతలో చెప్పాడు కదా.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఫణికుమార్ గారూ,
      'చంపేది, చంపించేది నేనే. నువ్వు నిమిత్తమాత్రుడవు' అనడమా? బాగుంది మీ పూరణ. అభినందనలు.

      తొలగించండి
    2. గురువుగారూ నమస్సులు.

      అవును గురువుగారూ దానిని గురించే. నేను అర్జునుడు కానీ శిఖండిని కానీ తీసుకుంటే విరుపు లేకుండా ఆఖరి పాదంగా ఉంచి పూరించడానికి పరాక్రమోద్ధతిన్ అడ్డు వచ్చింది. అందువలన కృష్ణుడు అయితేనే సమంజసంగా ఉంటుంది అనిపించి అలా వ్రాసి యున్నాను. ధన్యవాదములు.

      తొలగించండి
    3. ఫణికుమార్ గారు సమస్యా పాదములోని ప్రతి పదమును పరిశీలించి పరిష్కారమునకు మీ ప్రయత్నము నా కానందము కలుగ జేసినది. అభినందనలు.

      తొలగించండి
  13. ప్రేమను రమ్మని కీచకు
    భీముడు చెలరేగి చంపె ,భీష్ము రణమున
    న్నేమియు జేయను జాలక
    తాముగ బ్రాధేయ పడిరి ధర్మజు ననుజుల్


    రిప్లయితొలగించండి
  14. గు రు మూ ర్తి ఆ చా రి
    ,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,,

    ఆ మఘవ సుతుని రథమున

    దామోదరు డు౦డి తెలుప తగు మార్గమ్ము

    న్నామోది౦చుచు , భ౦డన

    బీముడు చెలరేగి చ౦పె భీష్ము రణమునన్

    రిప్లయితొలగించండి
  15. నీమమున ధర్మరక్షణ
    దామోదరు పక్షముఁ గలదని మర్మమ్మున్
    దామిడ భీభత్సుఁడు రణ
    భీముఁడు చెలరేగి చంపె భీష్ము రణమునన్

    రిప్లయితొలగించండి
  16. కోట రాజశేఖర్ గారి పూరణ:


    సందర్భం :: శివునికి భీముడు అనే పేరు ఉన్నది. యుద్ధరంగంలో శివుని వలె పరాక్రమం చూపే అర్జునుడు ( ఫల్గుణుడు, పార్థుడు, కిరీటి, శ్వేతవాహనుడు, భీభత్సుడు {వికృతుడు}, విజయుడు, కృష్ణుడు, సవ్యసాచి, ధనంజయుడు అనే పేర్లతో కూడా పిలువబడే వాడు ) భీష్ముని చంపినాడు అని చెప్పే సందర్భం.

    ధీమహితుండు, *ఫల్గుణుడు,* ధీరుడు, *పార్థుడు,* *శ్వేతవాహనుం,*
    డీ మహి *కృష్ణుడున్,* *విజయు,* డెన్న *కిరీటి* యు, *సవ్యసాచి,* సు
    శ్రీ మహితుండు, *నర్జునుడు,* శ్రీ *వికృతుండు* *ధనంజయుండు,* నా
    *భీముడు యుద్ధరంగమున, భీష్ముని జంపె పరాక్రమోద్ధతిన్.*


    *కోట రాజశేఖర్ నెల్లూరు.*

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రాజశేఖర్ గారూ,
      అర్జునుని నామాల పట్టికను పేర్చి చేసిన మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.

      తొలగించండి
  17. మైలవరపు వారి పూరణ:

    రాముండు సమరభీముడు ,
    కాముక నిజవృత్తి భీష్ము , గర్వితు లంకా..
    భూమిపతిఁ జంపెననగా,
    భీముఁడు చెలరేగి చంపె భీష్ము రణమునన్

    భీష్ముడు... భయంకరుడు

    ...మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మైలవరపు వారూ,
      భారత సమస్యకు రామాయణ పూరణం. అద్భుతంగా ఉంది. అభినందనలు.

      తొలగించండి
  18. భామినియంబ భీష్మునెడ పన్నుగ కోపమునొంది బల్కె తా
    నా మహనీయు జంపుటకు నర్జునుసాయమునొంది యుద్ధపున్
    భూమి శిఖండిగా నిలువ పొల్పుగ పార్థుడు సంగరాన తా
    భీముడు యుద్ధమందునను భీష్ముని జంపె బరాక్రమోద్ధతిన్

    రిప్లయితొలగించండి
  19. ఆ మహితుడౌ సమీరుడు
    భామకు వరమిచ్చినంత బరగెను సుతుడై
    జామున ఫల్గుణుడయ్యెడ
    భీముడు,చెలరేగి జంపె భీష్ము రణమునన్

    రిప్లయితొలగించండి
  20. సంజయుడు ధృతరాష్ట్రునితో..

    ఓ మహరాజ! పాండవుల యోగము మిక్కుట మాయెఁ జూడగన్
    సోముని యస్త్రమున్ గొనిన శూరుని ముందట షండుడుండగన్
    దా మిడ నస్త్రశస్త్రముల, ధాటిగ పార్థుఁడు ,సవ్యసాచి యా
    భీముఁడు యుద్ధరంగమున భీష్మునిఁ జంపెఁ బరాక్రమోద్ధతిన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సహదేవుడు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'మహరాజ' అనడం సాధువు కాదు. "ఓ మనుజేంద్ర" అనండి.

      తొలగించండి
    2. గురుదేవులకు ధన్యవాదములు. సవరించిన పూరణ :

      ఓ మనుజేంద్ర! పాండవుల యోగము మిక్కుట మాయెఁ జూడగన్
      సోముని యస్త్రమున్ గొనిన శూరుని ముందట షండుడుండగన్
      దా మిడ నస్త్రశస్త్రముల, ధాటిగ పార్థుఁడు ,సవ్యసాచి యా
      భీముఁడు యుద్ధరంగమున భీష్మునిఁ జంపెఁ బరాక్రమోద్ధతిన్

      తొలగించండి
  21. కాముఁడు దుష్టుఁడు కీచకు
    భీముఁడు చెలరేగి చంపె, భీష్ము రణమునన్
    లేమ కతమ్ము శిఖండియ
    నీమము గలవానిఁ జేసె నేలం గూలన్

    వామపు టేక చక్ర పుర వాసుల క్షేమము నెంచి కుంతియే
    భీమునిఁ బంప బండి పయి విస్తృత భోజన రాశి తోడుగన్
    భీమపు టాకృతిం బరమ భీకరుఁ డా బక దైత్యు కోసమే
    భీముఁడు యుద్ధరంగమున భీష్మునిఁ జంపెఁ బరాక్రమోద్ధతిన్

    [భీష్ముఁడు = భయంకరుఁడు]

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కామేశ్వర రావు గారూ,
      మీ రెండు పూరణలు ఉత్తమంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
    2. పూజ్యులుశంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు.

      తొలగించండి
    3. పూజ్యులు కామేశ్వరరావు గారికి వందనములు. భీష్ముడు అంటే భయంకరుడు అని తెలుసుకున్నాను. ధన్యవాదములు.

      తొలగించండి
  22. సోమపతి పుత్రు రథమున,
    కోమల మెయితో శిఖండి కోరి నిలువగన్
    తామిన్నకుండ, ననిలో
    భీముఁడు, చెలరేగి చంపె భీష్ము రణమునన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్నపరెడ్డి వారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'కోమల మెయి' దుష్ట సమాసం. "కోమల తనువై" అనండి.

      తొలగించండి
  23. దేవ నదీ తనయుఁడు భీష్ముని నెవ్వరు నని జంపలేదు. అంపశయ్యన నుండి స్వచ్ఛందముగా మరణించెను.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కామేశ్వర రావు గారూ,
      స్వేచ్ఛామరణం వరంగా కలిగిన భీష్ముని చంపకున్నా అతని పతనానికి కారకుడు శిఖండిని అడ్డు పెట్టుకున్న అర్జునుడే కదా! అందుకని ఈనాటికి ఇలా కానివ్వండి...

      తొలగించండి
    2. "మ యై వైతే నిహతాః పూర్వ మేవ
      నిమిత్తమాత్రం భవ సవ్యసాచిన్
      ద్రోణం చ భీష్మం చ జయద్రథం చ
      కర్ణం తథాన్యా నపి యోధవీరాన్"

      తొలగించండి
  24. నీమము దెల్పి ధర్మజుడు నీవిక కూల్చుము తాత నాన్న తా
    నేమని చెప్పువాడ బలహీనుడు పేడి శిఖండి నంత సు
    త్రాముని సూను డర్జునుడు దాపుగ జేగొని చూచుచుండగా
    భీముఁడు యుద్ధరంగమున భీష్మునిఁ జంపెఁ బరాక్రమోద్ధతిన్.

    రిప్లయితొలగించండి
  25. భూమి రధమెక్కి యసురుని
    భీముడు చెలరేగి చంపె, భీష్ము రణమునన్
    నీమము దప్పక షండుని
    మోమును గాంచగ దన శరములు వర్జించెన్

    భీముడు = శివుడు త్రిపుర సంహారము

    రిప్లయితొలగించండి
  26. భీముడుయుధ్ధరంగమునభీష్మునిజంపెబరాక్రమోధ్ధతిన్
    భీముడుచంపనేరడుగభీష్మునినెన్నటికిన్రణంబునన్
    భీముడుతాతగాబిలుచుభీష్మునిబ్రేమనునెల్లవేళల
    న్నామహనీయుడేయరయనాతనిజంపుటకోర్వనేర్చునే?

    రిప్లయితొలగించండి
  27. క్రమాలంకారము
    కాముకుండగు కీచకునే?
    ఆ మరణమునకు శిఖండి,నర్జును డూహల్
    సామూహికమవ్వగనే?
    1.భీముడు చలరేగి చంపె|2.భీష్మ రణమునన్.
    2.”కోమలి ద్రోపదిన్ గనియు గోర్కెలు కీచకుడుంచ?జంపెగా
    భీముడు”|”యుద్దరంగమున భీష్ముని జంపె బరాక్ర మోద్దతిన్
    నీమము వీడి నర్జనుడు నేర్పు శిఖండిని ముందు నుంచగా
    ఓ మునిలాగభీష్ముడట నోర్పునువీడ?బాణ మేయగా”|

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఈశ్వరప్ప గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      మొదటి పూరణ మొదటి పాదంలో గణదోషం. "కాముకుడగు.." అనండి.
      రెండవ పూరణలో "వీడి యర్జునుడు" అనండి. 'ఒక'ను 'ఓ' అనరాదు. 'లాగ' అనడం వ్యావహారికం.

      తొలగించండి
  28. భీమరమున రారాజున్
    భీముడు చెలరేగి జంపె, భీష్ము రణమునన్
    భామ శిఖండిని బెట్టుకు
    నీమము విడి ఫల్గునుండు నేలను గూల్చెన్!!!


    సామీరి యెవరు జెపుమా?
    భీముడు కౌరవులనెటుల పేరడగించెన్?
    హేమాంగుడెవరిని కసరె?
    భీముడు, చెలరేగి చంపె, భీష్ము రణమునన్!!!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శైలజ గారూ,
      మీ రెండు పూరణలు వైవిధ్యంగా చక్కగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
  29. ''భీముం''డర్జునుడై సం
    గ్రామము లో భీష్మ పాత్ర ''కవి భీష్ము''ని దై
    గ్రామము లో నాటక మయె ;
    భీముఁడు చెలరేగి చంపె భీష్ము రణమునన్"

    నీమముగల వ్యాకరణము
    నేమాత్రము సడలనీక నిడగ సమస్య
    ల్నో ముదుసలి మతి చెడియనె
    భీముఁడు చెలరేగి చంపె భీష్ము రణమునన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కృష్ణారావు గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      "సమస్య ల్నో..' అనడం సాధువు కాదు.

      తొలగించండి
  30. యామునివలె దుశ్శాసను
    భీముడు చెలరేగిచంపె, భీష్ము రణమునన్
    కామిత పరలోకగముని
    సామము తోడబడవైచె చక్రధరుండే!
    (ఇచ్చా మరణము గలవానిని )

    రిప్లయితొలగించండి
  31. ప్రొద్దున నుండి కంప్యూటర్ మొరాయించి ఆలస్యం అయింది !
    ఎట్టకేలకు అమ్మయ్య పంపగలిగాను !

    రిప్లయితొలగించండి
  32. కోమలి యంబ యత్యధిక కోపముతోడఁ బ్రతిజ్ఞఁజేసె సు
    త్రాముని సూను నండగొని తా మడియించెద భీష్మునంచు నా
    రామ ముఖమ్ముకన్గొనుచు మ్రాన్పడ, పార్థుడు దోర్బలమ్మునన్
    భీముడు యుద్ధరంగమున, భీష్ముని జంపె బరాక్రమోద్ధతిన్

    రిప్లయితొలగించండి
  33. మైలవరపువారి ప్రత్యేక పూరణ


    *ప్రత్యేక సమస్యాపూరణం*

    *భీముఁడు యుద్ధరంగమున భీష్మునిఁ జంపెఁ బరాక్రమోద్ధతిన్*!
    రామ ! యిదేమి ! ప్రొద్దుటనె వ్రాయుట యెట్టులొ ! భావమెట్టులో !
    యేమని పూర్తిజేయగలమిట్టి సమస్యను ? భీష్ముడేడనో ?
    భీముడదేడనో ? యనుచు వింతగ జూచుచునున్నయంతలో ,
    తాము *ప్రభాకరుల్* తొలుత ధైర్యము జేయగ , *రాజశేఖరుల్*
    ప్రేమ రచించిరంతనె, *విరించి జనార్దనులున్* రచింప , నే..
    నే మరి *వెన్కనైతినని* యెట్టులొ పూరణజేయ మెచ్చు మీ
    ప్రేమకు *వందనమ్ములు* , కవీశ్వరులార ! భవత్ప్రశంసతో
    నా మది పొంగిపొర్లెను ! వినమ్రత మ్రొక్కెద *కంది వారికిన్* !
    శ్రీమధుపూర్ణ వారిజవిశేష చలద్భ్రమరోపమాన భా..
    వామృత పద్యశోభలు వెలార్చిన వారికి *పేరుపేరునన్* !!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
  34. కాముకుడౌ సింహ బలుని
    భీముడు చెలరేగి చంపె! భీష్ము రణమున
    న్నేమార్చ శిఖండినిగొని
    సామీప్యముగా నిలిపిరి చతురిమ తోడన్!

    రిప్లయితొలగించండి
  35. గురువర్యులకు నమస్సులు.
    నిన్నటి సమస్యకు నా పూరణను పరిశీలించ ప్రార్థన.
    ధన్యవాదములు.

    తలచె నాతడిటుల చిన్న తనము నందె,
    " చక్కగా నెదుగుచు నంత చదువులోని
    మర్మముల కాచి వడబోసి మహిని ఙ్ఞాన
    సంపదలు కొల్ల గొట్టెద జనులు మెచ్చ!"

    రిప్లయితొలగించండి
  36. కరణమొకండు వచ్చి యధికారము చక్కగ జేయుచుండె సం
    స్కరణములెన్నొ జేసె నవి కాదని యా నరసింహుపట్ల ధి
    క్కరణము జూపి యన్యులకు గౌరవ మీయ నతండు క్రుద్ధుడౌ
    కరణము నమ్ము వారలకు గల్గు సుఖమ్ములు ఖచ్చితమ్ముగన్
    (ఇక్కడ నేను కరణాన్ని నమ్మేవారు అనే అర్థం లో కాక కరణం ఎవరిని నమ్ముతాడో వారికి సుఖంకలుగుతుందనే అర్థం తో పూరించాను . ఇక్కడ కరణం అంటే పి వి నరసింహా రావు గారు . ఆయన పట్ల అసమ్మతి చూపటం క్షేమం కాదని భావించినట్లు )

    రిప్లయితొలగించండి
  37. ఆమెవి చీరలన్నొలువ యత్నము చేసిన శూరుజంపెగా
    భీముఁడు యుద్ధరంగమున;...భీష్మునిఁ జంపెఁ బరాక్రమోద్ధతిన్
    గోముగ పేడినిన్ నిలిపి గొల్లున నేడ్చుచు సవ్యసాచియే...
    చీమలు చంపవే ఫణిని చెన్నుగ గూడుచు వేనవేలుగా!

    రిప్లయితొలగించండి