కవిమిత్రులారా,
అంశము - కుచేలుని వృత్తాంతము
నిషిద్ధాక్షరములు - కకారము (క - దాని గుణితాలు, అది సంయుక్తంగా ఉన్న అక్షరాలు)
ఛందస్సు - మీ ఇష్టము.
అంశము - కుచేలుని వృత్తాంతము
నిషిద్ధాక్షరములు - కకారము (క - దాని గుణితాలు, అది సంయుక్తంగా ఉన్న అక్షరాలు)
ఛందస్సు - మీ ఇష్టము.
రిప్లయితొలగించండిపయిపంచెన చిపిటములన్
సయించు హృది , బాల్యమిత్ర సాయము యవనా
రి యెలమి యాదరువులనన్
ప్రియతము డతడే భళిభళి విభుడున్నతడే !
జిలేబి
మీ పూరణ బాగున్నది.
తొలగించండిగొప్ప వారిలోన గొప్ప గోవిందుడే
రిప్లయితొలగించండిచిన్న నాటి సఖుడు చేర రాగ
వాని నాదరించి వరముల గురిపించి
సాదరముగ నతని సాగనంపె !
చక్కని పూరణ.
తొలగించండిధన్యవాదాలు
తొలగించండిసఖుడు దారిద్ర్యపీడిత ముఖుడు రాగ
రిప్లయితొలగించండిశ్రీధరుడు ప్రేమ మీరగ సేవఁజేసి
యరసి చారెడు ధాన్యము నారగించి
యివ్వడే భాగ్యము తొలుత యిష్టమెగయ!!
మీ పూరణ బాగున్నది.
తొలగించండి
రిప్లయితొలగించండిచెలిమిని తలచగ వెడలెను
మలినము లేనట్టి మైత్రి మాధవు డన్నన్
ఫలితము భేషుగ నుండును
వెలితిగ యోచించ నేల వేయి విధమ్ముల్
మీ పూరణ బాగున్నది.
తొలగించండిబహుళసంతానవంతుండు;భవ్యమూర్తి;
రిప్లయితొలగించండిపేదవాడైన స్నేహాన పెద్దవాడు;
మౌని సాందీపనీఛాత్రమహితయశుడు;
శౌరిసఖుడు;సుదాముండు సద్గుణుండు.
చక్కని పూరణ.
తొలగించండిచిన్ననాటి చెలిమి వెన్నదొంగ మదిని
రిప్లయితొలగించండితట్టి లేపగాను తనివితీర
నాదరించి సఖుని యైశ్వర్య మొసగెను
శ్రీనివాసుడిచ్చు శ్రేయములను!
మీ పూరణ బాగున్నది.
తొలగించండి
రిప్లయితొలగించండిసంతానము పెద్దదయా !
చింతల దీర్చ చిననాటి చెలిమరి నెరవు
న్నింతి యొలయుమని వేడె
న్నింత చిపిటములను మూట నిడి భర్త నటన్ !
జిలేబి
మీ రెండవ పూరణ బాగున్నది.
తొలగించండిచిన్న నాటి స్నేహి చిరుగు వల్వలు దాల్చు
రిప్లయితొలగించండివేద వేత్త తాను బీదవాడు
చిపిటములను దెచ్చె జెలిమితో గ్రహియించి
విభవమొసగె తిరిగి విశ్వ విభుడు
ప్రశస్తమైన పూరణ మీది!
తొలగించండి
రిప్లయితొలగించండిపిరియపు చిపిటములను చెలి
మరి తెచ్చెననుచు ముచిటిని మరిమరి యొలయన్
సిరి, యవనారిని విడువన్
సరిహద్దు నిడెనట చాలు "చపలత" యనుచున్ !
జిలేబి
మీ పూరణ బాగున్నది.
తొలగించండి'ముచిటిని'...?
తొలగించండిముచుటి అని వుండవలె :) పిడికిలి ఆంధ్రభారతి ఉవాచ :)
జిలేబి
డా.పిట్టా
రిప్లయితొలగించండిహరియు సుదాముల చెలమిని
చరియింపన్ దలప నెవరు జాలుదు రిలలో
నెరి నహము జెరుప దరమే
తర,తమముల నెన్ను నరులుదారులె వింటే!?
డా.పిట్టా
రిప్లయితొలగించండిహరి గాదని దినె శనగలు
సరియని స్వార్థమున నాడు శౌరియె మరచెన్
బరిదెగి యడుగని పేదకు
వరముల గురిపించు మిత్ర వరులిల గలరే!
డా. పిట్టా వారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి.
అటుకులు అనవలసిన చోట శనగలు అన్నారు.
ఒడా.పిట్టా
తొలగించండిఆర్యా,గురుభార్య, అడవికేగు కృష్ణ సుదాములకు కొన్ని శనగలు చిరు మూటగట్టి అడవిలో తినేందుకు పంపింది .కుచేలుని ఒడిలో చలిగాలికి కృష్ణుడు పడుకున్నాడు.సుదాముడు కట కట నములుతున్నాడు.అదేం చప్పుడని కృష్ణుడడుగగా, సుదాముడు అది చలికి భరించని తన దంతముల కిటకిట అని ఆ ఉపాహారాన్ని గుట్టుగా సుదాముడు కాజేశాడు.అది మరచిన కృష్ణుడెంత ఉదారంగా భాగ్యములను ఇచ్చాడో కృష్ణుడు!
విద్య లెన్ని యున్న బీదతనమ్ముతో
రిప్లయితొలగించండివిధిని మార్చ లేని విష్ణు సచియె
భార్య బోధ జేయ బట్టెడు వడ్లను
బెట్ట వెన్ను నోట బుట్టె సిరులు!!!
పురుషోత్తమునే హితునిగ
వరముగ మరి బొందినావె బ్రాహ్మన శ్రేష్ఠా
ధరలో నింతటి భాగ్యము
నొరులెవ్వరు బొందగలరె యో గుణశీలీ!!!
మీ రెండు పూరణలు బాగున్నవి.
తొలగించండి'సచియె'...?
బాల్య మిత్రుని గాంచి యు పర వ శించి
రిప్లయితొలగించండిపాద పూజల జే సె ను వాంఛ తోడ
సర్వ సంపద లొస గు చు సాయ పడు చు
నాదరించె సుదాము ని మో ద మల ర
మీ పూరణ బాగున్నది.
తొలగించండి
రిప్లయితొలగించండిచినపంచెన చిపిటమ్ముల
వినయమ్మున తాను దెచ్చె పేర్మిని పంచన్
ధన హీనుండు సుధాముడు,
జనవంద్యుడె దయను జూప సంపద జేరెన్
మీ పూరణ బాగున్నది.
తొలగించండిమైలవరపు వారి పూరణ:
రిప్లయితొలగించండిధనహీనుఁ గుచేలునిఁ గని
తనె దిగి, యెదురేగి స్వాగతమునిడి , యాలిం..
గనమునిడి , తెచ్చినవి తిని ,
ధనమిడెఁ గృష్ణుండు ! వాని దయ యెంతటిదో !!
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
కకార చ్యుతితో కుచేల, కృష్ణులతో మైలవరపు వారి పూరణ ప్రశస్తంగా ఉన్నది.
తొలగించండినా పూరణ:
రిప్లయితొలగించండిచింపిరి బట్టల పిల్లల
గంపెడు పుట్టించితీవు గబగబ ప్రియుడా
దంపిన బియ్యము తోడను
పంపెద నిన్నుపుడు హితుడు పరవశ మొందన్
పొన్నాడ మూర్తి కార్టూను డైలాగు:
తొలగించండిలేడీ టీచరు: "కుచేలుడు గురించి నీకేం తెలుసో చెప్పు"
కుఱ్ఱడు: "భార్య మాట విని బాగుపడ్డ ఒకే ఒక్క మగాడు టీచర్!! "
మీ పూరణ, దాని ననుసరించిన ఛలోక్తి బాగున్నవి.
తొలగించండి'నిన్నిపుడు'... టైపాటు!
తనదు నెచ్చెలిఁజూడ సుదాముడరిగె
రిప్లయితొలగించండినెయ్యమున తియ్యదనము వన్నెలనుఁజూపె
బాల్యమిత్రుని చేష్టలు పరిమళించె
రాజు,పేదల బంధము రమ్యమయ్యె
మీ పూరణ బాగున్నది.
తొలగించండిఘోర దారిద్య్ర పీడన ఘోష వినుచు
రిప్లయితొలగించండిచిపిటముల నారగించుయు చేవజూపి
చేర వచ్చిన మిత్రుని చింతదీర్చి
స్నేహ హస్తము నందించ చిద్విలాస
మీ పూరణ బాగున్నది.
తొలగించండి'...నందించు చిద్విలాస!' అనండి.
క్రొవ్విడి వెంకట రాజారావు:
రిప్లయితొలగించండిచిన్ననాటి హితుడు దరిసించ వచ్చి
ముచ్చటగ దెచ్చిన చిపిటమ్ములను నమలి
నిధనుడైన వాని యభూతి నెల్ల మాపి
మురభిదుండా సుధాముని ముఱియ జేసె
మీ పూరణ బాగున్నది.
తొలగించండిసంతోషంబున నిత్యమ
రిప్లయితొలగించండిశాంతియు లేనట్టి వాడు సన్నిధి జేరిన్
సుంతయు మిత్రుని సాయము
సాంతము నడుగని ద్విజుడును సంపదలందెన్
మీ పూరణ బాగున్నది.
తొలగించండి'జేరిన్'...? జేరన్..కు టైపాటా?
శనగల్ దిన చెలిమి మరచి
రిప్లయితొలగించండియొనరెన్ దైన్యము సుధాము, నువిద బనుపునన్
గొనిపోయి చిపిటములనిడ
మునినుతుఁడిడ మిత్రలాభము ముదము నొసఁగెన్
మీ పూరణ బాగున్నది.
తొలగించండిఅటుకులకు బదులు శనగలు అన్నారు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండి
రిప్లయితొలగించండిపన్నారి వారి తురగవల్గన రగడ పూరణ
సాదరమున దార సాదమునట వేదన జేయుమని
యాదరముగ సాగనంపె ముడుపు నిడుచు సుదామునిన్
ఉదారుడౌ వాసుదేవుడు సంతుష్టుడవన్ యెలమి
గ దయ గొన ప్రసాదము మిహిగ చెలుమరి ప్రసాదన సుమి
ప్రయత్నం ప్రశంసింప దగినదే. కాని తురగవల్గన రగడ లక్షణాలకు తగినట్టు లేదు. పాదానికి 8 త్రిమాత్రా గణాలుండాలి. లగము(IU)ను ప్రయోగించరాదు. 5వ గణం మొదటి అక్షరం యతి స్థానం. ఆద్యంత్య ప్రాసలుండాలి.
తొలగించండిధరణిం గుచేలుఁడు గరిమ మానధనుఁడు విప్ర వరుఁడు బ్రహ్మ వేత్త ధర్మ
రిప్లయితొలగించండివత్సలుండు పరమ భాగవతుఁడు రాగ విరహితస్వాంతుఁడు విదిత శాంత
గుణ భాసితుఁడు వర గుణవతీ దార సహితుఁడు దరిద్రుండు సుత వితత వి
లసితుండు నద్రి ధర సఖుండు సనియె మురారి సందర్శ నార్థమ్ము భార్య
పంపునఁ జిపిటములు గొన్ని వడసి యంతఁ
గాంచ వసుదేవ నందను నంచితముగ
సఖుఁ గనుచుఁ గుశల మడిగి శాంత పఱచి
చిపిటములు దిని వెన్నుండు సిరుల నిచ్చె
కుచేల చరిత్ర నంతా ఒక్క సీసపద్యంలో ఇమిడ్చారు. అద్భుతంగా ఉంది.
తొలగించండిపూజ్యులుశంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు.
తొలగించండిసాధారణముగా నిషిద్ధాక్షరికి సీసము (పెద్ద పద్యము), దత్తపదికి కందము (చిన్న పద్యము)
నెన్ను కుంటాను.
చిన్ననాటినెయ్యమెన్నదరమెసామి!
రిప్లయితొలగించండిమురుగుగుడ్డలగనిమోముచాటు
వేయకనెదురేగివీవనలవిసిరి
చిపిటములనుదినుచుసిరులొసంగె
మీ పూరణ బాగున్నది.
తొలగించండి'వేయక' అన్నచోట 'క'...?
బాల్యమిత్ర సుదాముడ మూల్యమైన
రిప్లయితొలగించండిచిరుగు గుడ్డనగట్టిన చిన్నమూట
విప్పి గోపాలుడి మమతజెప్పకివ్వ?
సంతసించెను చింత రవ్వంత మాన్ప|
మీ పూరణ బాగున్నది.
తొలగించండిభార్యపనుపున తాను రేపల్లె లోన
రిప్లయితొలగించండినల్లనయ్య గృహమ్మును నడిచిచేరి
తెలియజేయ తనవగపు దీనముగను
చిపిటములఁదిని తృప్తిగా సిరులనొసగె
మీ పూరణ బాగున్నది.
తొలగించండిసవము పురుహము, నిఘస మొసగుట గగన
రిప్లయితొలగించండిము,వెత జెరుపు సహచరుడు మురరిపువు, వి
నుము సతి వచనములు, చిపిటములు చెరగు
న దొడుగుము, జనుము మధుర నగరము, ఉడు
గరగ చిపిటములు నిడుము, శరణమనుచు
పదముల యుపరిన బడుము, బడప దెలిపి,
బలుపు నిడగ మురబిధుని పసపడుమని
పతిని పొదువె సుధాముని సతి సుశీల
మీ సర్వ లఘు తేటగీతిక బాగున్నది.
తొలగించండిచివరి 'సుశీల' సర్వలఘుత్వానికి బాధాకరం.
బాల్యస్నేహితుండు బాధలనొందంగ
రిప్లయితొలగించండినరసి సిరుల నీయ సిరి విభుండు
తృణము గొని యొసంగె మణులు మాన్యమ్ములు
విష్ణు లీల వొగడ విధి తరమ్మె
మీ పూరణ బాగున్నది.
తొలగించండిభామిని గోరగాను తన బాల్య సఖుంగన బోవ నచ్చటన్
రిప్లయితొలగించండితామర నేత్రుడాదరము దానును దారయు గూడిగొల్వగన్
లేమిని వామనుండగుచు
లేమ యొసంగిన సూడిదివ్వగన్
ప్రేమతొ నారగించి నిడె పెన్నిధి నెంచుచు సఖ్యభక్తినే!
వృత్తంలో పూరణ బాగున్నది.
తొలగించండిప్రేమతొ అని తో ప్రత్యయాన్ని హ్రస్వంగా ప్రయోగించారు. "ప్రేమను నారగించి యిడె" అనండి.
ధన్యవాదములు! తప్పక సవరిస్తాను!
తొలగించండి"భక్తి"?
తొలగించండిఅవును తప్పే!
తొలగించండి“శుద్ధమైత్రినే” యనిన సరిపోవునేమో!
భామిని గోరగాను తన బాల్య సఖుంగన బోవ నచ్చటన్
తొలగించండితామర నేత్రుడాదరము దానును దారయు గూడిగొల్వగన్
లేమిని వామనుండగుచు
లేమ యొసంగిన సూడిదివ్వగన్
ప్రేమను నారగించి యిడె పెన్నిధి నెంచుచు శుద్ధమైత్రినే!
సవరించిన మీ పూరణ బాగున్నది.
తొలగించండిపరమ దరిద్రమబ్బ తన భార్య వచింప నయిష్టమైననున్
రిప్లయితొలగించండిచిరిగిన వస్త్రముల్ తొడిగి చేరె సుధాముడు బాల్య మిత్రుడౌ
హరిని - ముదమ్మునొంది హరి యాదరణమ్ముగ సేవజేసి తా
వరముగ సర్వసంపదలు భవ్యముగానిడె ప్రీతినెంతయున్
మీ పూరణ బాగున్నది.
తొలగించండి'వచింప ననిష్టమైన..' అనండి.
వేదములన్ పఠించె నిఱు పేద సుధాముడు స్వాభిమాని సం
రిప్లయితొలగించండిపాదన లేని వాడు తన బాల్య వయస్యుని గీము జేర స
మ్మోదము హెచ్చగన్ చిపటముల్ గ్రహియించి దయా సముద్రుడా
శ్రీదుడు నంద నందనుడు జేరి యొసంగెను భోగ భాగ్యముల్
చక్కని పూరణ.
తొలగించండిసూచివెన్నెలవౌ హృదిలో
రిప్లయితొలగించండిసచలిత సంతసము తోడి సలలిత స్నేహా
సుచరిత్రు మురారి గొలువ
గుచేలుడు సిరి నిధి బల గుణగణ మణి గాన్.
పూరణ బాగున్నది.
తొలగించండిమొదటి, నాల్గవ పాదాలలో గణదోషం. 'స్నేహా సుచరిత్రు..' ప్రయోగం దోషమే.
ఆప్త మిత్రుని చిపిటము లారగింప
రిప్లయితొలగించండినవియె రుచ్యములనుచునె యచ్యుతుండు ,
చాలునని సిరి చెలునింట చాలనింపె ;
వింత భవనము గనెనూర విప్రుడేగ
నిన్నటి సమస్యకు నా పూరణ
నవయువత కోరు గద్యము
జవసత్వము లుడుగు వార్కి చక్కని పద్యం
బవగతమగు గాన తెలుగు
కవి కిద్దఱు భార్యలున్నఁ గను సుఖ కీర్తుల్"
మీ రెండు పూరణలు బాగున్నవి.
తొలగించండిఘోర దారిద్య్ర పీడన ఘోష వినుచు
రిప్లయితొలగించండిచిపిటముల నారగించుయు చేవజూపి
చేర వచ్చిన మిత్రుని చింతదీర్చి
స్నేహ హస్తము నందించ చిద్విలాస
బాగుంది మీ పూరణ.
తొలగించండిసవము పురుహము, నిఘస మొసగుట గగన
రిప్లయితొలగించండిము,వెత జెరుపు సహచరుడు మురరిపువు, వి
నుము సతి వచనములు, చిపిటములు చెరగు
న దొడుగుము, జనుము మధుర నగరము, ఉడు
గరగ చిపిటములు నిడుము, శరణమనుచు
పదముల యుపరిన బడుము, బడప దెలిపి,
బలుపు నిడగ మురబిధుని పసపడుమని
పతిని పొదువెను ముఖజుని సతి,సతి హిత
వచనములు విని వెడలెను వరద యనుచు,
మధుర నగరపు పతముని మనసున నుతి
పొనరుచు ఘన యరియ నివసనము దరిని
బెరయ నగధరుడు ముదమున రయముగ యె
దుట గతిపడి భుజములను తొడిమ నిడి ద
న జదురునిడి చెలిమరి ఘన పదములను
జలమున తుడువగ యయువు మెలపు గనెను
మీ తాజా సర్వలఘు తేటగీతిక బాగున్నది.
తొలగించండిశుచివెన్నెల వౌ హృదిలో
రిప్లయితొలగించండిసచలిత సంతసము తోడి సలలిత సఖుడౌ
సుచరిత మురారి గొలువ
గుచేలు సిరినిధి మరాళ గుణ గణ మణిగాన్
సవరించిన పూరణ
వేదవిద్యలెల్ల వివరంబు నేర్చియు
రిప్లయితొలగించండిబీదవాడు గాను బెనగు చుండె
బాల్యమిత్రుడనుచు బలరాము తమ్ముని
చేరగానె దొలగె చింతలెల్ల!
సుచరితు గా చదు వ ప్రార్థన
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండికుచేలుని భార్య కృష్ణుని వద్దకు వెళ్ళమని ఆంగ్లములో చెప్పు భావన (సరదాకు మాత్రమే)
రిప్లయితొలగించండి(క) నిషిద్ధము సుమా
తేటగీతి
మోరు చిల్ద్రను టూఅజ్జు ,వేరు వుయ్యి
బేరు, నోమనీ , నో పుడ్డు, ప్లీజు గోటు
ప్రెండు పాలెస్సు , డోంట్ఫీలు ,ప్లీజు టెల్లు
అవరు పొజిషను,బ్రింగ్మనీ, హాప్లి అవరు
ఫ్యామిలీ విల్లు ఎంజాయి, బ్యాడు డేసు
విల్లు లాస్టు, ఒపినియను టెల్లు ప్లీజు
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండిదెన్ను వెంటు సుధాముడు దేరు నెక్స్టు
తొలగించండిబ్లాకు మ్యాను వెల్ కమ్ముడు ఫ్లాటు ఫ్రంటు
బుట్టు హీడిడ్డు నాటాస్కు బాడు ఫెల్టు
హోస్టు షవరుడు హిస్ఫ్రెండు మోస్టు వెల్తు.
***)()(***
('క ' నిషేద నియమం పాటించలేదు.)