22, నవంబర్ 2017, బుధవారం

సమస్య - 2526 (రమణికిన్ బూలు చేటగు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
"రమణికిన్ బూలు చేటగుఁ బ్రాయమందు"
(లేదా...)
"రమణికిఁ బూలు చేటగును బ్రాయమునం దనుమాన మేటికిన్"
ఈ సమస్యను పంపిన బొగ్గరం ప్రసాద రావు గారికి ధన్యవాదాలు.

88 కామెంట్‌లు:

 1. రిప్లయిలు
  1. సింధు సయినను వోలుచు శ్రీకరముగ
   షర్టు జీన్సు ధరించెడి సరసిజాక్షి
   షటిలు వెంబడి పరుగిడు సమయమునను
   రమణికిన్ బూలు చేటగుఁ బ్రాయమందు

   తొలగించండి
  2. ప్రభాకర శాస్త్రి గారూ,
   చక్కని పూరణతో శుభారంభం చేశారు. అభినందనలు.

   తొలగించండి
 2. బ్రహ్మ గారి కొడుకు వాడు, రతికి పతియు,
  యెవరెవరికో ముడులు వేయు నేర్పుకాడు,
  వాని నాయుధములు పూలు గాన నరయ
  రమణికిన్ బూలు చేటగుఁ బ్రాయమందు!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. భరద్వాజ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   మన్మథుడు విష్ణు కుమారుడు, బ్రహ్మకు సోదరుడు. "బ్రహ్మగారి సోదరుడును రతికి పతియు| నెవరెవరికో... " అనండి.

   తొలగించండి
  2. అయ్యా, మీరన్నది కూడా నిజమే, కానీ కొన్ని కథలలో, బ్రహ్మ కుమారునిగా చెప్పబడి ఉన్నది.. నిజమేదో తేల్చుకోలేక ఇలా ఒక సారి, అలా ఒక సారి వాడుతూ ఉన్నాను.. కానీ మీరు చెప్పారు కనుక, అందున ఆంధ్రనామ సంగ్రహంలో కూడా, 'పచ్చవిల్తుని తండ్రి ' అని విష్ణువునే సంబోధిస్తారు కనుక, మీరు సూచించిన సవరణను చేస్తున్నాను.
   మీ ఓపికకి, తప్పు ఎంచడమే కాక, ప్రత్యామ్నాయాన్ని భావం చెడగొట్ట కుండా సూచిస్తున్న మీ ఉదార మనస్సుకు నా జోహార్లు. :)

   తొలగించండి


 3. అమరును తలపైన జిలేబి యందముగను
  రమణికిన్ బూలు; చేటగుఁ బ్రాయమందు
  కమల నయనికి పనిమాలు కల్ల నడత,
  జల్దు కొని మేలుకొనువమ్మ చంచలాక్షి !

  జిలేబి

  రిప్లయితొలగించండి
 4. (బాలవితంతువు బుచ్చమ్మకి పూలుపెట్టబోతున్న భార్య వెంకమ్మతో అగ్నిహోత్రావధానులు)
  విధవ కెందుకె పూమాల వెఱ్ఱివెంకి!
  ఆకతాయివెధవలేమొ యధికమయిరి;
  పూలు దాల్చిన బుచ్చమ్మ కొంపముంచు;
  రమణికిన్ బూలు చేటగు బ్రాయమందు.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. బాపూజీ గారూ,
   అగ్నిహోత్రావధానుల మాటగా మీ పూరణ అద్భుతంగా ఉంది. అభినందనలు.

   తొలగించండి
 5. ఒక్క మీటరు బట్టను నొక్కి కప్పి
  వొంగి కులికెడి మేనంత తొంగి జూడ
  రమణికిన్ బూలు చేటగుఁ బ్రాయ మందు.
  రక్ష కరువైన వనితకు శిక్ష మిగులు

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అక్కయ్యా,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'వంగి'ని 'ఒంగి' అన్నారు.

   తొలగించండి
  2. ఒక్క మీటరు బట్టను నొక్కి కప్పి
   వంగి కులికెడి మేనంత తొంగి జూడ
   రమణికిన్ బూలు చేటగుఁ బ్రాయ మందు.
   రక్ష కరువైన వనితకు శిక్ష మిగులు

   తొలగించండి


 6. కమలముఖీ,జిలేబి సుమ గంధము జేర్చును ముద్దు గూర్చుచున్
  రమణికిఁ బూలు; చేటగును బ్రాయమునం దనుమాట మేటికిన్
  గమకము గానకన్ మజను గాంచు ప్రవర్తన, వెళ్ళబుచ్చగన్
  సమయము, జీవశక్తియును, సాధన లేమియు లేక నీవికన్ !

  జిలేబి

  రిప్లయితొలగించండి
 7. పూల దండలు మార్చిన యాలుమగలె !
  సాంప్ర దాయము కలదోయి సవరలందు
  నెహ్రు బుద్ధిల కథలోన నిజము కలదు
  రమణికిన్ బూలు చేటగుఁ బ్రాయమందు

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. భళ్ళముడి వారూ,
   క్షమించండి. మీ పూరణ అర్థం కాలేదు.
   'బుద్ధి + ఇల' అన్నప్పుడు సంధి లేదు. యడాగమం వస్తుంది.

   తొలగించండి
  2. క్రింద ఇచ్చిన వివరణ దీనితో పాటు ఇచ్చి ఉంటే విషయం తెలిసిపోయేది.
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 8. జడల యందున ముడిచి న జాజి పూలు
  స్త్రీ ల యందము పెంచు నీ సృష్టి యందు
  రమణి కి న్ బూలు చేట గు బ్రాయ మందు
  అను ట నంగీ క రింతు రేఅతివలిపు డు ?

  రిప్లయితొలగించండి

 9. Labelled and punished as Jawahar Lal Nehru’s wife since 1959, tribal woman now seeks Rahul Gandhi’s help
  The life of a tribal woman in West Bengal became a prolonged punishment after Jawahar Lal Nehru gave her a garland in 1959.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ఈ కథనం నాకు తెలియదు. ఒక క్రొత్త విషయం తెలిసింది. ధన్యవాదాలు.

   తొలగించండి
 10. రిప్లయిలు
  1. సహదేవుడు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'యౌవన సిరులు' దుష్ట సమాసం. అక్కడ "యౌవనశ్రీలు" అనవచ్చు. అలాగే "కట్టును బొట్టు" అనండి.

   తొలగించండి
 11. గురుదేవులకు ధన్యవాదములు 🙏🙏🙏
  సవరించిన పూరణ :

  యౌవనశ్రీలు కలబోయు నందమందు
  కనులకింపు కట్టును బొట్టు గనినయంత
  పతిని మురిపించ బోవఁగ *వాడుఁదగుల*
  రమణికిన్ *బూలు* చేటగుఁ బ్రాయమందు!

  రిప్లయితొలగించండి
 12. శోభ నిచ్చును నిత్యము సుందరి యగు;
  స్వార్థ మధిక మైన తనకె త్వరితముగను;
  బాగు !పరతత్వ చింతన పాదు కొల్ప;
  "రమణికిన్ బూలు; చేటగుఁ; బ్రాయమందు"
  ****
  అతిశయింప జేయును గాదె యందమునిల;
  నధిక మైన వ్యయమెపుడు నందరికిని;
  మంచి బుద్ధులు నెలకొల్ప మధుర మగును
  "రమణికిన్; బూలు; చేటగుఁ బ్రాయమందు"
  (గుఱ్ఱం జనార్దన రావు)


  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. జనార్దన రావు గారూ,
   మీ క్రమాలంకార పూరణలు రెండూ బాగున్నవి. అభినందనలు.

   తొలగించండి
 13. మైలవరపు వారి పూరణలు


  ఏడుకొండలపైన పుష్పించినట్టి
  సుమములన్నియు శ్రీవారి సొంతమనుచు
  స్త్రీలు దాల్చరు ! స్వామి దర్శించునపుడు
  రమణికిన్ పూలు చేటగు బ్రాయమందు!!

  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి


  విమలుడు గాంధి చెప్పినది వింతయె నేటికి నర్ధరాత్రిలో
  సుమసుకుమారి యొంటరిగ చొచ్చుకుబోయిన నాడె స్వేచ్చ యన్
  సుమధురమైనవాక్యము ! వసుంధర నొంటి చరింప రాత్రిలో
  రమణికి బూలు చేటగును బ్రాయమునందనుమాట మేటికిన్ !!

  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మైలవరపు వారూ,
   మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.

   తొలగించండి
 14. వివిధ రీతుల జుట్టును విప్పదీసి
  ఆధు నీకత పేరున నద్భుతముగ
  కురుచ జేయుచు కురులను మురిసి దిరుగు
  రమణికిన్ బూలు చేటగు బ్రాయమందు!!!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. శైలజ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'ఆధునీకత' సాధువు కాదు. "ఆధునికత పేరున గడు నద్భుతముగ" అందామా?

   తొలగించండి
 15. సన్న జాజులు,మల్లెలు,చక్కనైన.
  విరులు సౌభాగ్యమిచ్చును సిరుల పంట
  రమణికిన్ పూలు;చేటగు ప్రాయమందు
  ధవుని నిర్లక్ష్యమొనరింప తన్వి కిలను

  రిప్లయితొలగించండి
 16. మధుర నూహల నేమార్చ మారుడపుడు
  పుష్ప శరమును సంధించ పొలతి పైన
  తమకమును వీడని తనువు తపన ఘడియ
  రమణికిన్ బూలు చేటగు ప్రాయమందు

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. శ్రీరామ్ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'మధుర+ఊహల = మధురోహల' అవుతుంది. నుగాగమం రాదు. "మధురమగు నూహ లేమార్చ.." అనండి.

   తొలగించండి
 17. వృత్తియుద్యోగ పరిధులు విస్తరింప
  వనిత గృహమునువీడుచు బయలువెడల
  విధిని నిర్వహించు నెలవు వింతగొలుప
  రమణికిన్ బూలుచేటగు బ్రాయమందు!

  నర్సులు,ఎయిర్ హొస్టెస్ వంటి పలువృత్తులలో పూలు నిషేధము

  రిప్లయితొలగించండి
 18. మాస్టరుగారూ! బ్రాయమునందనుమా"ట"మేటికిన్....దనుమా"న" మేటికిన్ ఉండాలా... "ట" ...టైపాటా..

  రిప్లయితొలగించండి
 19. శాస్త్రి గారూ,
  అది టైపాటే. సవరిస్తాను. ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి
 20. నుదుట కుంకుమ బెట్టగా ముదము గలుగు
  కనులకు మెరుపునిచ్చును కాటుకెపుడు
  ముక్కు కుబులాకి సతతము మోజు నిడును
  చెలువు బెంచును సతతము శిరము పైన
  రమణికి బూలు, చేటగు బ్రాయ మందు
  బట్ట తల తోడ యున్నట్టి పడతికెపుడు

  రిప్లయితొలగించండి
 21. కవి మిత్రులకు నమస్కారములు. ఈ రోజు నేను రచించిన మహా నాగబంధము చిత్ర మాలిక గురువుగారు బ్లాగులో ఉంచారు. పరిశీలించి మీ అభిప్రాయములు/సూచనలు దెలియ చేయ ప్రార్ధన గురువుగారికి ధన్యవాదములు

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సూర్యకుమార్ గారూ,
   మీ బంధ కవిత్వాన్ని ప్రకటించే సదవకాశాన్ని నాకు కల్పిస్తున్నారు. నేనే మీకు ధన్యవాదాలు చెప్పుకోవాలి.

   తొలగించండి
  2. గురువు గారు ఇది అంతా మీ ప్రోత్సాహము ఆశీస్సులు . అన్నట్లు నాకు చదువుతున్నపుడు మా గురువు గారు మిన్నిగంతి గురునాధ శర్మ గారు సంభోదనలకు సంధి ప్రయోగము వర్తించదని సెలవు ఇచ్చారు, అందువల్ల నా యొక్క దేవతా స్తుతులతో వ్రాసిన బంద కవిత్వములో సంబోదనలకు సంధి నియమము పాటించతములేదు. సందేహ నివృత్తి చేయగలరు.

   తొలగించండి
 22. ఇంటివైద్యుండు వచ్చితా నిటులజెప్పె
  పాల ఉబ్బస మీమెకు పూల వాస
  నసలు బడదుగ జాగ్రత్త నయమగునులె
  రమణికిన్ బూలు చేటగుఁ బ్రాయమందు

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు

  1. గోలీ వారి గోళీలకు యెదురా !
   అదురహో !

   చీర్స్
   జిలేబి

   తొలగించండి
  2. హనుమచ్ఛాస్త్రి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   మా ఆవిడకూ పూలవాసన అంటే ఎలర్జీ...!

   తొలగించండి

 23. ఇంటి పేరయ్యె పువ్వుల ! యీ జిలేబి,
  రమణికిన్ బూలు చేటగుఁ బ్రాయమందు!
  యేమి చేతునో, తన పెండ్లి యెట్ల జేతు
  నయ్య శంకరార్య,సమస్య యయ్యె నయ్య !

  జిలేబి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సమస్య - 1374

   "మగవానికి గర్భమాయె మానినిఁ గూడన్"

   తొలగించండి
  2. చేయుటయె కాని పెండ్లిళ్ళు చేసికొనెడి
   వయ సుడిగినట్టి ముదుసలి వగ్గునమ్మ!
   పలు సమస్యల సృష్టించువాడఁ గాని
   సాధ్యమా జిలేబీ! సమస్యలను దీర్చ.

   తొలగించండి
 24. గు రు మూ ర్తి ఆ చా రి
  ,,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,,

  ఎడదపై జూడ బయిట కొ౦గేమి లేక

  యూరు పర్వాల మీదనే యూగులాడు

  పొట్టి బట్టల దొడిగెడు నట్టి , " టీ . వి .

  యా౦ఖరు " వలె హొయ లొలికి యరుగు చున్న

  రమణికిన్ బూలు చేటగు బ్రాయ మ౦దు ||  వినుడు బాలికలార ! నా విన్నపమ్ము =

  స౦ప్రదాయ పరమగు వస్త్రముల దాల్చి ,

  భరతదేశ సభ్యతను కాపాడవలయు

  { ఎడద = వక్షభాగము ; ఊరు పర్వము =

  మో కా లు }

  రిప్లయితొలగించండి
 25. సుమసుకుమార యౌవనపు శోభల రంజిలు సోయగమ్మునన్
  ప్రమదము గూర్చు వస్త్రముల ఫాలముఁ గుంకుమ బొట్టుఁ దీర్చియున్
  రమణుని జేరువేళల శిరమ్మున దాల్చఁగ వాడియుండగన్
  రమణికిఁ బూలు చేటగును బ్రాయమునం దనుమాన మేటికిన్

  రిప్లయితొలగించండి
 26. కోట రాజశేఖర్ గారి పూరణ

  సందర్భము :: అరవిందము, అశోకము, చూతము, నవమల్లిక, నీలోత్పలము అనే ఐదు పుష్పాలు అనంగుని బాణాలు. అంటే మన్మథుని బాణాలు. భర్త దగ్గర ఉన్నప్పుడు, భార్యకు రక్తిని గూర్చే యీ పుష్పాలే, ఆ భర్త దూరమైనప్పుడు విరక్తిని కలిగిస్తాయనే సందర్భం.

  సుమము లనంగబాణము *లశోకములున్, నవమల్లికాళి, చూ*
  *తము, లరవిందముల్, గుణయుతమ్ములు నీలపుటుత్పలమ్ములున్*
  రమణుడు చెంత నుండ ననురక్తిని బెంచును, భర్తృహీనయౌ
  *రమణికిఁ బూలు చేటగును బ్రాయము నందనుమాట మేటికిన్.*

  *కోట రాజశేఖర్ నెల్లూరు.*

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. రాజశేఖర్ గారూ,
   మీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.

   తొలగించండి
  2. కోట రాజశేఖర్ గారి సవరణ

   సుమము లనంగబాణము *లశోకములున్, నవమల్లికాళి, చూ*
   *తము, లరవిందముల్, గుణయుతమ్ములు నీలపుటుత్పలమ్ములున్*
   రమణుడు చెంత నుండ ననురక్తిని బెంచును, విప్రలబ్ధయౌ
   *రమణికిఁ బూలు చేటగును బ్రాయమునం దనుమాన మేటికిన్.*

   *కోట రాజశేఖర్ నెల్లూరు.*

   తొలగించండి
 27. ప్రమదము తోడ రుక్మిణికి పంకజనాభుడు పారిజాతమున్
  క్రమముననీయగా నలుకగా శయనించిన సత్యభామతో
  సమర కుతూహలమ్మునను సారెకు బల్కెను కృష్ణుడివ్విధిన్
  రమణికి బూలు చేటగును బ్రాయమునందనుమాట మేటికిన్ !

  రిప్లయితొలగించండి
 28. రమణికిన్ బూలు చేటగుఁ బ్రాయమందు
  కొందరటులనేయుందురుకువలయమున
  నెవరియభీష్టమేదియోయెవరికెరుక
  భిన్నరుచులనుగలయట్టిమన్నుగాదె

  రిప్లయితొలగించండి
 29. మగడు పరదేశమేగ నా మర్మమెరిగి
  మాటువేయరె కీచకుల్ మగువ కొరకు
  నొంటరిగనున్న మెలకువనుండవలయు
  రమణికిన్ బూలు చేటగు బ్రాయ మ౦దు ||

  రిప్లయితొలగించండి
 30. కొందఱికిఁ గా గుణితమును గొందఱి కిఁక
  రా పలుకఁ గష్టమౌను గరమ్ము సుమ్మి
  పా పలుక రాదు పాపకుఁ బసితనమున
  రమణికిం బూలు చేటగుఁ బ్రాయమందు


  కమల దళాయతాక్షుఁడు బక ద్విషుఁ డార్త జనౌఘ పాలకుం
  డమర వరైక పూజిత మహాత్మున కిష్టము మేటి పూవులే
  యమర నదీ కుమారుఁడు మహా గుణవంతుఁడు భండ నోగ్ర శూ
  ర మణికిఁ బూలు చేటగును బ్రాయమునం దనుమాన మేటికిన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కామేశ్వర రావు గారూ,
   మీ రెండు పూరణలు సర్వోత్తమంగా ఉన్నాయనడంలో అతిశయోక్తి ఇసుమంతైనా లేదు. అభినందనలు.

   తొలగించండి
  2. పూజ్యులుశంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు.
   డా. సీతా దేవి గారు ధన్యవాదములు, నమస్సులు.

   తొలగించండి
 31. మగడు మేని సోంపును జూసి పొగడు నపుడు
  రమణికిన్ బూలు చేటగుఁ బ్రాయమందు
  వయసుముదిరిన పిదుపను ప్రణయమునకు
  మగువ కవసరమౌ పూలు మగడు మెచ్చ

  రిప్లయితొలగించండి
 32. *రమణికిఁ బూలు చేటగును బ్రాయమునం దనుమాన మేటికిన్?*
  *సుమములగోరెభానుమతిచూడగబారెడగున్ జడన్ గనన్*
  *కమలములేరిపూలజడఁ గట్టగ గోరెసుయోధనాధిపున్*
  *ఘుమఘుమలాడె నామెగది గుప్పుమనంగసుగంధమయ్యెడన్‌*
  *రమణికిఁ బూలు చేటగును బ్రాయమునం దనుమాన మేటికిన్?*

  *శ్రీమతి జి సందిత బెంగుళూరు*

  చేట +అగు =చేట నిండుగా ఆవసరమయ్యా యని భావము

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సంధిలేని చోట స్వరంబున అన్నారు నేను సంధి ఛేశాను చిఱిగిచాటైంది అని తెలుగులో వాడుక పదం వుంది.
   సమస్యొపూరణం అంటే సరస వినోదిని అంటారు పెద్దలు

   మేకకుతోక తొకతోకమెకమేక
   లుపుట్టిన తెలుగు మనది.🙏👏🙏

   తొలగించండి
 33. సుమమునుబోలు కన్నియకు సుందరరూపుడు చిక్కి భర్తగా
  అమెరికకేగ కొల్వుగొని యాకుసుమాస్త్రుడవస్థ పెట్టగా
  నమలపు నూహలందుకడు నారటఁ బొందుచు నున్నముగ్ధయౌ
  రమణికిఁ బూలు చేటగును బ్రాయమునం దనుమాట మేటికిన్
  అమెరికః అమెరికా దేశం

  రిప్లయితొలగించండి
 34. కురల సిరులైనపువ్వులు|మరులుగొల్ప
  అలుగు మగనినిభార్యకు నంటుగట్టు|
  అట్టిపువ్వులు జడయందు పట్టుదప్పి
  కట్టు,బొట్టును,చీరలు గట్టనట్టి
  రమణికిన్ బూలుచేటగు బ్రాయమందు|
  2.శ్రమయగు వాల్ జడల్లుటన “సౌఖ్యమటంచునుజుట్టుబెట్టకన్
  ప్రమిదకు వత్తివేయకనె రాజిలు దీపమువోలెయందమౌ
  నెమరున నర్ద నగ్నతయె నేర్పనియెంచెడి నారిలోకమున్
  రమణికి బూలు చేటగును|బ్రాయమునందనుమానమేటికిన్?

  రిప్లయితొలగించండి
 35. గు రు మూ ర్తి ఆ చా రి
  ,,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,,

  ( తొ ౦ బ ది వ త్స ర ము ల ము స ల మ్మ

  ఈ వి ధ ౦ గా బా ధ ప డు తు న్న ది )


  ప్రమదలు పూల నెప్డు జడలన్ ధరియి౦తురు |

  ..................... లేక కొప్పు ల౦

  దమర నల౦కరి౦తురు కదా ! యిక నే డిది

  ......................... ఫ్యాష న౦చు కే

  శములను గాలిలో వదలి శాకిను లట్లు

  ...................... చరి౦తు | రేమి కా

  లమొ మరి ! దూరదర్శనముల౦ గనుచున్
  ి

  ........................... గడు చిత్ర మైన వే

  షములను దాల్చు నేటి మన చ౦చల లోచన |

  ......................... యౌర ! యట్టి యా

  రమణికి బూలు చే టగును | ప్రాయము

  ..................... న౦ దనుమాన మేటికిన్ ?
  ి

  రిప్లయితొలగించండి
 36. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ఈ నా ధర్మ సందేహము తీర్చఁ గోర్తాను.
  చల, యుమ (చలోమ?); మాలిని, (యా)ఆర్యాణి (మాలిన్యార్యాణి?); భవాని (ని – గురువు?), శ్యామల; దాక్షి, (క్షి-గురువు?)శ్యామ: వీటిలో వ్యాకరణ సంశయము.
  చల , మాలిని లు తత్సమములు కాబట్టి సంస్కృత సంధి వర్తించ నవసరము లేదా?
  భవాని తత్సమము కాబట్టి భవాని శ్యామల లో ని లఘువవుతుందా?

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కామేశ్వర రావు గారూ,
   అవన్నీ సంబోధనలు కనుక సంధి జరుగదని నా అభిప్రాయం.
   అన్నట్టు నాకూ ఓ ధర్మసందేహం వచ్చి మీ మెయిల్‍కు వ్రాశాను. దయచేసి చూసి సమాధానం ఇవ్వమని మనవి.

   తొలగించండి
 37. దేశ సంస్కృతిలోమార్పు తీవ్రమాయె
  చీర కట్టు. నుదుటి బొట్టు భార మాయె
  ముడులు, జడలాయె మిక్కలి మోటు, నేటి
  రమణికిన్ బూలు చేటగుఁ బ్రాయమందు.

  రిప్లయితొలగించండి
 38. డా.పిట్టా
  రమణినిన్ బూవు బోడను రచనలందె
  పూలు సిగదూర నలకల పొడవు లేవి?
  వెండి తెరమీది వనితలే వీడ, నేటి
  రమణికిన్ బూలు చేటగు బ్రాయమందు!(కొత్తిమిర కట్టంత...గరికిపాటి వారు ఒక ఉపన్యాసంలో పేర్కొన్నట్లు)

  రిప్లయితొలగించండి
 39. డా.పిట్టా
  రమణుని రాకకై కనులు రాళ్ళుగ మారినవేళ ప్రేమయే
  కమలిన వేళ నా విరహ క్రౌర్యము నాపుకొనంగ జూచి,యీ
  తమకము మానుటే సుఖము తక్కిన చేష్టలు వెర్రివన్న నా
  రమణికి బూలు చేటగును బ్రాయము నందనుమాన మేటికిన్?!

  రిప్లయితొలగించండి
 40. గురువు గారికి నమస్సులు
  కాంతుడు నేవరికి సుఖము కలుగ చేయు?
  విధవ స్త్రీలకు నెట్టివి చేటు నిచ్చు?
  ఉరక లే సెడి ఉత్సాహ వులుకు లెపుడు?
  రమణికిన్ బూలు చేటగు బ్రాయ మందును.

  రిప్లయితొలగించండి
 41. నెవరికి గ చదువ ప్రార్థన.
  రమణికిన్,బూలు చేటగు, బ్రాయమందు.

  రిప్లయితొలగించండి 42. పూలు సొబగును పెంచును పుణ్యవతుల

  కిలను,ముత్తైదు చిహ్నము లివియటంచు

  పెద్దలు పలుకు చుండగ విశ్వమందు

  రమణికిన్ బూలు చేటగుఁ బ్రాయమందు

  యనుట లెస్సయు గాదందు రార్యు లెల్ల.

  రిప్లయితొలగించండి
 43. రమణుని జింకదెమ్మనుచు రాక్షస మాయల జిక్కి లంకలో
  కుములుచు క్రుంగి రేబవలు కుందుచునుండెడి మానసమ్ముతో
  కమలిన కండ్లతో వగచి కందినమోమున కాలవాలమౌ
  రమణికిఁ బూలు చేటగును బ్రాయమునం దనుమాన మేటికిన్

  రిప్లయితొలగించండి
 44. సమయమునందు హిందువును చక్కగ దోచుచు పెండ్లియాడినన్
  కుములుచు విప్రలంభమున కూర్చగ భారత రాజకీయమున్
  కొమరుడు జంద్యమూనినను కోడలి కోసము తెమ్మనంగ నా
  రమణికిఁ బూలు చేటగును బ్రాయమునం దనుమాన మేటికిన్

  రిప్లయితొలగించండి