6, నవంబర్ 2017, సోమవారం

సమస్య - 2512 (పతులు గల రైదుగురు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"పతులు గల రైదుగురు సాధ్వి భానుమతికి"
(లేదా...)
"పతులు గణింప నైదుగురు భానుమతీసతికిన్ సుయోధనా"
ఈ సమస్యను పంపిన గుఱ్ఱం జనార్దన రావు గారికి ధన్యవాదాలు.

84 కామెంట్‌లు:

  1. పడతి ద్రౌపది కెందరు పతులు గలరు?
    యెపుడు పతిభక్తి గలచాన నేమనండ్రు ?
    యెవరికి పతి సుయోధను డెంచగాను ?
    పతులు గల రైదుగురు ; సాధ్వి; భానుమతికి.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జనార్దన శర్మ గారూ,
      క్రమాలంకారంలో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "పతు లటందు। రెపుడు.... నేమనందు। రెవరికి..." అనండి.

      తొలగించండి


  2. ద్రౌపదికి తొల్లి జేసిన తపసు జేత
    పతులు గల రైదుగురు; సాధ్వి భానుమతికి,
    యన్న వరుసయ్యె యవనారి, యాశ్వినేయు
    డయ్యె ధవుడు,వప్రుడు భానుడగు జిలేబి !

    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు


    1. *కృష్ణుని తండ్రి వసుదేవుని తమ్ముడగు భానుని కూతురు భానుమతి పెనిమిటి సహదేవుడు (ఆశ్వినేయుడు)

      తొలగించండి
    2. జిలేబీ గారూ,
      ఎక్కడ సంపాదిస్తారండీ ఈ పురాణ విశేషాలు? చాలా బాగున్నది మీ పూరణ. అభినందనలు.

      తొలగించండి

    3. ధన్యవాదాలండీ కందివారు !

      అన్నిటికీ అంతరాత్మ ఆంధ్రభారతియే :)

      ఆంధ్ర భారతి ఉవాచ :)


      జిలేబి

      తొలగించండి
  3. వరము వలనను పొందెను కోరి కోరి
    మున్ను తీరని కోరిక వెన్ను తట్టి
    పతులు గల రైదుగురు , సాద్వి భానుమతికి
    భాను డనువాడు తండ్రియె భాగ్య మనగ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అక్కయ్యా,
      విరుపుతో మీ పూరణ బాగున్నది.
      మొదటి పాదంలొ ప్రాసయతి తప్పింది. "వరము వలనను పొందె ద్రౌపదియె కోరి" అందామా?

      తొలగించండి
    2. వరము వలనను పొందె ద్రౌపదియె కోరి
      మున్ను తీరని కోరిక వెన్ను తట్టి
      పతులు గల రైదుగురు , సాద్వ్హి భానుమతికి
      భాను డనువాడు తండైయె భాగ్య మనగ

      తొలగించండి
  4. డా.పిట్టా
    వెతల పాలైరి కూతుళ్ళు వేయి విధుల
    బ్రూణ హత్యలు పుణ్యమై రుటము దప్పె
    సతులు గరువైరి జంటల సంఖ్య లణగె
    పతులు గల రైదుగురు సాధ్వి భానుమతికి!

    రిప్లయితొలగించండి
  5. డా.పిట్టా
    మతిజెడి సంప్రదాయముల మాన్యతయే నట రాజ్యమేలగా
    శ్రుతమతియైన ద్రౌపదిని చూడ్కుల గైకొని యుద్యమంబులన్
    రతిరతులైరి భామలదె రాగ స్వతంత్రము భారతావనిన్
    పతులు గణింప నైదుగురు భానుమతీ1సతికిన్,సుయోధనా!2
    (1,2 వ్యక్తుల పేర్లు,మహాభారత పాత్రల పేర్లుగావు.)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. పిట్టా వారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      'మాన్యతయే యట..' అనండి.

      తొలగించండి

  6. పతియని యైదుమార్లు సిత పల్క తపమ్ము ఫలింప నయ్యిరే
    పతులు గణింప నైదుగురు; భానుమతీసతికిన్ సుయోధనా
    పతికి గణింప లక్ష్మణుడు బాలుడు సూవె! జిలేబి భారత
    మ్ము తిరిగి యొక్క మారు గని ముద్దుగ చంపకమాల బేర్చెనే !

    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'సుయోధనా పతికి' ఇక్కడ అర్థం కాలేదు.

      తొలగించండి
  7. భారతంబును బోధించి కోరె గురుడు
    చదివి రండని, మరునాడు ఛాత్రు నొకని
    ప్రశ్న యడుగంగ నాతండు పలికె నిట్లు
    పతులు గల రైదుగురు సాధ్వి భానుమతికి

    రిప్లయితొలగించండి
  8. డా.పిట్టా
    సతత ప్రయత్నముల్ జెలగ సాధన జేసిన క్రొత్త రాష్ట్రపుం
    సతికి ప్రభుత్వపుం గతికి జక్కటి ప్రశ్నల వేయు వర్గముల్
    మతిజెడజేయు పక్షములు మానిత వైభవమంది పాలనన్4
    పతులు గణింప నైదుగురు1 భానుమతీ సతికిన్2 సుయోధనా!3
    (1.ప్రతిపక్ష పార్టీలు:CPIM,MIM,CONG,TDP&BJP,2సూర్య సదృశ విశాల దృక్కులుగల రాష్ట్ర ప్రభుతకు,T.S.తెలంగాణకు,3.ఒకానొక పౌరుడు,అతనిని సంబోధించడం ,4.ప్రతి పక్షాల హోదాలను అనుభవించుచు కూడా)

    రిప్లయితొలగించండి
  9. డా.పిట్టా
    వెత గదె, మేనబావ1,తన ప్రేమికుడొక్కడు2,పెళ్ళి బ్యూరొనున్
    హితమతులెన్న నొక్కరుడు3,యింజన వీరుడు(software engineer)డమేరికన్ తగన్4
    ధృతినొక బాల్య మిత్రుడును5 దీటుగ వేచిరి నేటి బాటలన్

    పతులు గణింప నైదుగురు భానుమతీ సతికిన్ సుయోధనా!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. పిట్టా వారూ,
      మీ తాజా రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
  10. వలచె ద్రుపదియు నెందరిన్ వరము కోరి?
    మాననీయసుదతిని నే మందు నిలన?
    కురు పతి మనోరమామణి గుణపు రాశి
    పతులైదుగురు సాధ్వి సాధ్వి భానుమతి కి
    వందనములు

    రిప్లయితొలగించండి
  11. సమస్య పాదము పొరపాటున వ్రాసినాను.
    పతులుగల రైదుగురు సాధ్వి భానుమతి కి గా చదువ వలసనిదిగా ప్రార్థన.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. వెంకట నారాయణ రావు గారూ,
      క్రమాలంకారంలో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ఇలన.. కాదు, ఇలను అనండి. మూడవ ప్రశ్న స్పష్టంగా లేదు.

      తొలగించండి
  12. యజ్ఞవేదిక బుట్టిన యాజ్ఞసేని;
    సూర్యకిరణము బోలిన సూక్ష్మబుద్ధి;
    భానుమతి యైన ద్రౌపదీభామ యామె;
    పతులు గల రైదుగురు సాధ్వి భానుమతికి.


    భానుమతికి.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. బాపూజీ గారూ,
      భానుమతి శబ్దానికి ఉన్న అర్థాంతరంతో మీ పూరణ చక్కగా ఉంది. అభినందనలు.

      తొలగించండి
    2. భానుమతి.. చక్కని సమన్వయం... నమోనమః.... మురళీకృష్ణ

      తొలగించండి
  13. కుంతి యాజ్నను పాటించి యింతి నపుడు
    పాండవు లు యాజ్న సేని ని పంచు కొన గ
    పతు లు గల రైదు గురు ;సాధ్వి భానుమతి కి
    పెనిమిటయ్యే సుయో ధను ప్రీతితోడ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రాజేశ్వర రావు గారూ,
      విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'జ్ఞ' టైప్ చేయలేక పోతున్నారా? మీరు ఏ కీబోర్డ్ ఉపయోగిస్తున్నారు?
      చివరి పాదాన్ని "పెనిమిటి సుయోధనుడగు ప్రీతితోడ" అనండి.

      తొలగించండి
    2. మన్నించండి నేను మొబైల్ కీ బోర్డ్ ఉపయోగిస్తుఉన్నను

      తొలగించండి


  14. పతి పతి పాతి పాతి పతి ! పంచ పతుల్వలయున్!తథాస్తనన్
    పతులు గణింప నైదుగురు; భానుమతీసతికిన్ సుయోధనా
    శ్రితసితకున్ గణింపగను క్షేత్రి బలాడ్యుడు ధీరుడాతడౌ
    పతియన యొక్కడౌ!సొబగు బాలుడు లక్ష్మణుడయ్యె సంతతై!

    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబీ గారూ,
      మీ తాజా పూరణ బాగున్నది. అభినందనలు.
      "పతి పతి" అనడం బాగుంది. మరి "పాతి పాతి"? "పతి యన నొక్కడౌ" అనండి.

      తొలగించండి

    2. కంది వారికి

      పాతి యంటే భర్త అని ఆంధ్రభారతి ఉవాచ !


      జిలేబి

      తొలగించండి
  15. వెతలను సైచి పాండవులు వేసట జెందక నిగ్రహించిరే!
    సతినవ మాన పర్చినను సైచిరి;సంధికి బూను లేనిచో
    నతి బలవంతులై తగిన యాతన గూర్తురు వారు ద్రౌపదీ
    పతులు గణింప నైదుగురు,భానుమతీ సతికిన్ సుయోధనా !

    రిప్లయితొలగించండి
  16. అరయ నైదుగురు పతులె యందరకును
    పంచ భూతములనుపేర బరగు చుండు
    పంచ ప్రాణములుగ నెంచ పతిని దాను
    పతులు గలరైదుగురు సాధ్వి భానుమతికి

    రిప్లయితొలగించండి
  17. ఆర్యా! నిన్న పాత పూరణలు చూస్తువుంటే ఇడ్లీ లపై సమస్య కనబడింది. అందరి పూరణలు సరదాగా వున్నవి
    నా పూరణ చిత్తగించ గలరు
    దొడ్లో పూసిన మల్లెలు
    బెడ్లో పరవగ మరదలు వెన్నెల వేళన్
    బొడ్లో విసరను తెల్లని
    ఇడ్లిలే చాలుమనకు యితరము లేలా!
    తెలుపు తెలుపు మాచింగ్!
    రాఘవేంద్ర రావుగారి విన్యాసంతో

    రిప్లయితొలగించండి
  18. యాగఫలముగ బుట్టిన యాజ్ఞసేని
    ద్రుపద మహరాజు పుత్రిక ద్రోవది కిల
    పతులు గల రైదుగురు,సాధ్వి భానుమతికి
    ప్రాణనాథుండగును గద రాజరాజు..!!!

    రిప్లయితొలగించండి
  19. అంధుడొకడు మామ సతము రంధి దలచె
    నలర దుష్టచతుష్టయ మండయుండ
    పతులు గల రైదుగురు సాధ్వి భానుమతికి ---
    పతులు వెతలు దెచ్చెడి వారు సతుల కెపుడు :(

    రిప్లయితొలగించండి
  20. రాజసూయమునకు మీరు రమ్మటంచు
    మోదమున ద్రుపద సుతకుముందు నడచు
    పతులు గల రైదుగురు, సాధ్వి భానుమతికి
    నాదరమ్మున నాహ్వాన మందజేయ

    రిప్లయితొలగించండి
  21. తల్లి తనయుని కిడునాజ్ఞ ద్రౌపది గన ,
    పతులు గల రైదుగురు; సాధ్వి భానుమతికి
    భర్త దుర్యోధ నుండయె పడగ పాట్లు ;
    దుష్టులగు మువ్వురుండ చతుష్ట యమయె

    నిన్నటి సమస్యకు నా పూరణ

    బెంగను సురనరు లుండగ
    నింగిని విడి పెక్కు సార్లు నీచుల దునిమెన్
    చెంగున హరియే గద; నర
    సింగమ్మును గాంచినపుడె చింతలు దొలఁగున్"

    రిప్లయితొలగించండి
  22. ద్రుపద పుత్రిక యైనట్టి ద్రౌపది కిల
    పతులు గల రైదుగురు ,భానుమతికి
    దుష్ట బుధ్దియు గ్రూరుఁడు ధృత రాష్ట్ర
    తనయు డైనట్టి యాసుయో ధనుడు భర్త

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సుబ్బారావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మొదటి పాదంలో యతి తప్పింది. "ద్రోవది కిల" అంటే సరి! రెండవ పాదంలో 'సాధ్వి'ని టైప్ చేయలేదు. మూడవ పాదంలో 'ధృతరాష్ట్ర' అన్నచోట గణ,యతి దోషాలు. సవరించండి.

      తొలగించండి
  23. కోట రాజశేఖర్ గారి పూరణ:

    సందర్భం :: సతీదేవికి భర్తయైన శివుని అష్టమూర్తులలో సూర్యుని చంద్రుని పురుషుని మూర్తులను ఒకవైపు, పంచభూతముల మూర్తులను మరొకవైపు చూపిస్తూ శిల్పి భానుమతిని సుయోధనుని సంబోధిస్తున్న సందర్భం.

    స్తుతమతి నష్టమూర్తులను జూపుచు బల్కెను శిల్పి యిట్లు ‘’ స
    మ్మతి గన సూర్యమూర్తి యిట, మాన్యత నిచ్చట చంద్రమూర్తి బా
    పు తిమిరమున్, మహా పురుష మూర్తిగ నిచ్చట పాపరాశి బా
    పు తలప, పంచభూతముల మూర్తులు నచ్చట, *నెంచ ముగ్గురున్
    పతులు గణింప నైదుగురు, భానుమతీ! సతికిన్ సుయోధనా!*

    ...కోట రాజశేఖర్ నెల్లూరు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రాజశేఖర్ గారూ,
      మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
      'బాపున్+తలప = బాపుఁ దలప' అవుతుంది కదా!

      తొలగించండి
  24. మైలవరపు వారి పూరణలు:

    1):

    హితమునెరుంగుమా ! కురుమహీపతి ! ద్రోవదికెంచి చూడగా
    నతులిత శౌర్యవిక్రమగుణాఢ్యులు కీర్తితధర్మబుద్ధులున్
    పతులు గణింప నైదుగురు ! భానుమతీసతికిన్ సుయోధనా !
    పతివన నీవె ! యొక్కడివె ! భావన జేయుము మంచి సెబ్బరల్ !!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి


    2):

    హితమునెరుంగుమా ! కురుమహీపతి ! ద్రోవదికెంచి చూడగా
    నతులిత శౌర్యవిక్రమగుణాఢ్యులు కీర్తితధర్మబుద్ధులున్
    పతులు గణింప నైదుగురు ! భానుమతీసతికిన్ సుయోధనా !
    పతివన నీవె ! యొక్కడివె ! భావన జేయుము మంచి సెబ్బరల్ !!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ప్రభాకర శాస్త్రి గారూ,
      వారి మొదటి పూరణ పునరుక్తమయింది. రెండవ పూరణ తేటగీతిని ప్రకటించలేదు.
      *****
      మైలవరపు వారూ,
      మీ పూరణ అద్భుతంగా ఉంది. అభినందనలు.

      తొలగించండి
    2. క్షంతవ్యుడను సార్!

      **************

      గాంధారి... భానుమతి తో... ఆవేదనగా...

      వాడు నామాట వినడు , ద్రోవదికి జూడ
      పతులు గల రైదుగురు ! సాధ్వి ! భానుమతి ! కి..
      నుకయు వైరమ్ము వలదని నోటిమాట
      నొక్కమారైన దెల్పు సుయోధనునకు !!

      మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

      తొలగించండి
  25. క్రొవ్విడి వెంకట రాజారావు:

    నిజము! ద్రౌపదీ సతికిల నెఱి గలిగిన
    పతులు గలరైదుగురు; సాధ్వి భానుమతికి
    గలడొకండు నెల్లప్పుడు కక్ష తోడ
    టక్కులొలుకు సుయోధనుండనెడి వాడు

    రిప్లయితొలగించండి
  26. క్రొవ్విడి వెంకట రాజారావు:

    వితమది లేక వాలయము వేరముతోడ కువాళమెంచుచున్
    ప్రతిభను వీడి ద్రౌపది ప్రభావ మెఱుంగక నామె ననాదరించినన్
    వ్రతతిని నీదు గాదిలికి శంసల నిచ్చుచు నుంద్రు ద్రౌపదీ
    పతులు గణింప నైదుగురు భానుమతీ సతికిన్ సుయోధనా!

    రిప్లయితొలగించండి
  27. అతులితమౌ పరాక్రమమునందున నిన్నుజయించు వారలప్
    వెతికినకానమీ జగతి విక్రమమందున పంచపాండవుల్
    సతతమునీకు చాలెదరు చాలిక వేదన నమ్ముమిత్రమా
    పతులు గణింప నైదుగురు భనుమతీ సతికిన్ సుయోధనా

    రిప్లయితొలగించండి
  28. రిప్లయిలు
    1. భాస్కరమ్మ గారూ,
      పద్యం బాగున్నది. కాని సమస్యకు పరిష్కారం చూపినట్టు లేదు.

      తొలగించండి
  29. అతులితమ్మగు తపము తానాచరింప
    వెలది ద్రౌపదికొసగెను వేడ్క శివుడు
    పరగ దుర్యోధనుండు తా పతిగనలరె
    పతులు గలరైదుగురు సాథ్వి భానుమతికి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. భాస్కరమ్మ గారూ,
      క్రమాలంకారంలో మీ పూరణ బాగుంది. అభినందనలు.
      గల రైదుగురు... తరువాత కామా పెడితే బాగుంటుంది.

      తొలగించండి
  30. పతులు గల రైదుగురు సాధ్వి , భానుమతికిఁ
    దోటి కోడలు, కృష్ణకు దోర్బ లాతి
    శయులు కౌంతేయులు పరమ సాత్వికులును
    ధర్మ పరులు ధానుష్కులు ధరణి పతులు


    హతవిధి ధాత్రి నందుఁ గలి దౌకళఁ దాల్చి జనించి తీ విసీ
    యతులిత మైన రీతి యివి యారయ నీ కిల మూర్తివంతముల్
    మతి నతి వంచనల్ దురభి మానము పంతము క్రోధ వైరముల్
    పతులు గణింప నైదుగురు భానుమతీ సతికిన్ సుయోధనా

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కామేశ్వర రావు గారూ,
      మీ రెండు పూరణలు వైవిధ్యంగా, ఉత్తమంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
    2. పూజ్యులుశంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు.

      తొలగించండి
  31. ద్రుపదు ని ప్రియ తనూజయౌ ద్రోవదికిల
    పతులుగలరైదుగురు, సాధ్వి భానుమతికి
    పతిసుయోధనుడు, బలుని కతి ప్రియుండు,
    దురభిమానముతో నీల్గె దురమునందు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్నపరెడ్డి వారూ,
      విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  32. ద్రుపద పుత్రిక ద్రోపది దోషమనక
    పతులు గల రైదుగురు !సాధ్వి భానుమతికి
    రాజ రాజన మిక్కిలి మోజు జూడ
    సతికి పతియన దైవమే సర్వు లకును

    రిప్లయితొలగించండి
  33. సవరించిన పూరణ
    వలచె ద్రుపదియు నెందరిన్ వరము గోరి?
    మానవీయ సూదతిని నే మందు నిలను?
    కురుపతి విజయo నెవ్వరకున్ శు భమగు?
    పతులుగల రైదుగురు ,సాధ్వి భానుమతి కి.
    వందనములు

    రిప్లయితొలగించండి
  34. రిప్లయిలు
    1. పంచరత్నం వారూ,
      బాగుంది. "కురుపతి విజయ మెవ్వరకున్ శుభమగు" అనండి.

      తొలగించండి
  35. నాటక దర్శకుడు సుయోధన పాత్రధారితో చమత్కరిస్తూ...

    చం.
    అతిశయ మౌనె? నాటకము నాగక సాగఁగ నైదునాళ్లుగన్
    ప్రతియొక ముఖ్యపాత్రకును వంతుల వారిగ ముగ్గురేవురో
    చతురుల పాత్రధారులుగ శ్రాంతినొసంగ నమర్చినంతటన్
    పతులు గణింప నైదుగురు భానుమతీసతికిన్ సుయోధనా!

    రిప్లయితొలగించండి
  36. పాండు సుతుల పెండ్లాడ ద్రుపదతనయకు
    పతులు గల రైదుగురు.సాధ్వి భానుమతికి
    ధార్తరాష్ట్రాగ్రజుడగు సుయోధనుడు భర్త
    రాజరాజను పేరిట గ్రాలె నతడు

    రిప్లయితొలగించండి
  37. నిన్నటి సమస్యకు నాపూరణ:
    కృంగి కృశించిన వేళను
    నింగిని గల వేల్పులెల్ల నెనరూననిచో
    శృంగిని గల లక్ష్మీ నర
    సింగమ్మును గాంచు నపుడె చింతలు దొలగెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. తిమ్మాజీ రావు గారూ,
      నిన్నటి సమస్యకు మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  38. డా.బల్లూరి ఉమాదేవి.06/11/17

    యాజ్ఞసేనికి ముదమార నవనియందు

    పతులు గల రైదుగురు, సాధ్వి భానుమతికి

    పతియు నగుచు నాకురు పతియునగు సు

    యోధనుండు సంతును పొందెన య్యువిద  తోడ.


    ద్రోవది కిలలో శాంతులు దోర్బలులగు

    పతులు గల రైదుగురు, సాధ్వి భానుమతికి

    నాంబికేయుని తనయు డు నార్యు డయ్యె

    నిరువురి వలన పెరిగె వంశ మిలను నాడు.


    ద్రౌపదీ దేవికి భువిలో ధర్మపరులు

    పతులు గల రైదుగురు, సాధ్వి భానుమతికి

    స్వాభి మానియునైన యా స్వార్థపరుడు

    కురుపతి యుపతి యయ్యె ను కూర్మి తోడ.

    రిప్లయితొలగించండి
  39. పతిత యటంచు ద్రౌపదిని బన్నము సేతువె దుష్ట బుద్ధివై
    యతులిత శక్తియుక్తులును నాహవమందున కాలరూపులున్
    మతి దలపోసినారె యవమాన మొనర్పగ సాధ్వి యామెకుం
    బతులు గణింప నైదుగురు భానుమతీసతికిన్ సుయోధనా?
    ***
    సాధ్వియైన ద్రౌపదీపతులు యోధులైనప్పటికీ ఎన్నడైనా భానుమతీసతికి అవమానము చేయడానికి తలపోసినారా నీకు వలె అని నా భావం.

    రిప్లయితొలగించండి
  40. రంగని భక్తులు తలచిరి
    మంగళ దాయిక జనాది మనసున గుణధీ
    రంగపు శ్రేణులు నారా
    సింగమ్మును గాంచినపుడే చింతలు తొలగన్
    దయచేసి నిన్నటి పూరణ పరిశీలించండి.
    వందనములు.

    రిప్లయితొలగించండి
  41. పెంపు వహింప భాషకును బ్రీతిగ సేవలు జేయువారి నా
    ణెంపు విమర్శలన్ మిగుల నేర్పుగ పుక్కిట బట్టి గీతముల్
    చంపకమాలలాది పలు ఛందవిరాజిత పద్య సాహితీ
    సంపద కొల్ల గొట్టెద ప్రశస్తముగా జనులెల్ల మెచ్చగన్

    రిప్లయితొలగించండి
  42. అరయ పరిశోధనలు జేసినరులువొగడ
    నద్భుతావిష్కరణమ్ములందుకొనుచు
    శాస్త్రవేత్తగ సైన్సున సాగి సృజన
    సంపదల కొల్లగొట్టెద జనులు మెచ్చ

    రిప్లయితొలగించండి
  43. పితయగు పుట్టు గ్రుడ్డియు గభీరుడు కర్ణుడు నీవు ముగ్గురై
    చతురుడు మామ తోడుగ విచారము జేయగ నిట్లు నల్గురౌ
    పతితుడు నీదు తమ్ముడగు పాపియు కోపియు కూడియుండగా
    పతులు గణింప నైదుగురు భానుమతీసతికిన్ సుయోధనా!!!

    పతి = ప్రభువు

    రిప్లయితొలగించండి
  44. అతులిత వీర శూరులట హాయిగ ద్రౌపది మానమూడ్చిరే
    పతులు గణింప నైదుగురు;..భానుమతీసతికిన్ సుయోధనా
    పతివిర నీవె యొక్కడివి భారత యుద్ధపు కారకుండవౌ...
    మతిగితి లేని కైపదము మాన్యులు నిచ్చిరె నన్ను ముంచగన్ :)

    రిప్లయితొలగించండి