10, నవంబర్ 2017, శుక్రవారం

ఖడ్గబంధములు

రచన - పూసపాటి కృష్ణసూర్య కుమార్

ఖడ్గ బంధ తేటగీతి - 1 (పార్వతీ ప్రార్ధన)

గౌరి, మారి, గిరిజ, భీమ, కాళి, చండ,
శారద, విజయ, మాలిని, సత్య, శంక
రి, యగజ, బహుభుజా, కర్వరి, పురుహుతి, 
కరుణ జూపి సతము మమ్ము  గాచవలయు

ఖడ్గ బంధ తేటగీతి - 2 (పార్వతీ ప్రార్ధన)

రంభ, లంభ, శాంభవి, దుద్దుర, గుహ జనని, 
గట్టు పట్టి, కాత్యాయణి, కౌసిని, శివ,
పార్వతి, పురల, యీశ్వరి, భగవతి, స్తుతి, 
వందనమ్ము మాతా నీకు వందనమ్ము.

ఖడ్గ బంధ తేటగీతి - 3 (లక్ష్మి స్తుతి)

 రామ, రమ, కమలాలయ, రమ్య వదన, 
జలదిజ, కలిమిగుబ్బెత, చంద్ర వదన, 
మరుని తల్లి,  మా, మాత, యమల, యతిచర,
యెల్ల కాలము గాపాడు మిందు వదన.

2 కామెంట్‌లు: