5, నవంబర్ 2017, ఆదివారం

సమస్య - 2511 (సింగమ్మును గాంచి...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"సింగమ్మును గాంచినపుడె చింతలు దొలఁగున్"
(లేదా...)
"సింగముఁ జెంగటం గనినఁ జింతలు దీరుట తథ్యమే కదా"
ఈ సమస్యను పంపిన ప్రసన్న కుమారాచారి గారికి ధన్యవాదాలు.

71 కామెంట్‌లు:

  1. నింగిని నేలను కలిపిన
    హంగుల సింహాచలమున హరిహరి యనుచున్
    సంగము కిరమును నరుడౌ
    సింగమ్మును గాంచినపుడె చింతలు దొలఁగున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ప్రభాకర శాస్త్రి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'సంగము కిరమును'...?

      తొలగించండి
    2. సంగము = కూడిక
      కిరము = పంది
      నరుడు = మనుష్యుడు
      సింగము = సింహము

      కలియగ “వరాహ నరసింహ స్వామి” (సింహాచలమందు)

      తొలగించండి
  2. క్రుంగుచు భీతిలు నెప్పుడు
    చెంగున దూకుచు దిరిగెడి జింకలె యటవిన్?
    గంగాధరుడే ప్రోచిన;
    సింగమ్మును గాంచినపుడె;చింతలు దొలగున్.

    రిప్లయితొలగించండి


  3. బెంగను విడుము జిలేబీ
    చెంగట హృదికందరమున చేవిడువని యా
    మంగళ కరమౌ మానిసి
    సింగమ్మును గాంచినపుడె చింతలు దొలఁగున్!

    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబి గారూ:

      మనలో మాట: నిన్నటి మీ "డ్ర" ప్రాస పూరణ అండ్ర పిండ్ర బ్రహ్మాండ్రము!!!

      తొలగించండి

    2. జీపీయెస్ వారు

      నమోనమః

      ఏదో కొండ్రకైదువు అలా దున్నేసె పదాల్ని‌ అంతే :)

      నెనరులు

      జిలేబి

      తొలగించండి
    3. జిలేబీ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
    4. మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
    5. మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  4. నింగిని కోరిక లంటిన
    భంగము వాటిల్లి నంత భాధలు పడగన్
    ఖంగున దైవము దయగన
    సింగమ్మును గాంచినపుడె చింతలు దొలఁగున్

    రిప్లయితొలగించండి
  5. గుఱ్ఱం సీతాదేవి గారి పూరణ:

    మంగమ్మ మగని తోడుగ
    సింగారించుకు జనియెను సింగపురమ్మున్
    బెంగను తనదగు విక్రమ
    సింగమ్మును గాంచినపుడె చింతలు దొలగున్

    సింగపురము= సింగపూర్
    విక్రమ సింగమ్ము =నెల్లూరు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సీతాదేవి గారూ,
      'అపి స్వర్ణమయీ లంకా...' అన్నట్టు విక్రమసింహపురాన్నే ఇష్టపడ్డారు. బాగుంది మీ పూరణ. కాని 'విక్రమ సింగ' మనడం దుష్టసమాసం కదా!

      తొలగించండి
    2. గురుదేవులకు నమస్సులు ! ఏమిటో స్వంత ఊరు మమకారం అలా అనిపించింది !

      తొలగించండి
  6. చెంగున మీసము దువ్వుచు
    నంగలు వైచుచు తురగము నధిరోహించెన్
    బొంగుచు బ్రతాప రాణా;
    సింగమ్మును గాంచినపుడె చింతలు దొలగున్.

    రిప్లయితొలగించండి
  7. అంగీకరించి భక్తుని
    సంగతమగు ప్రార్థనంబు స్తంభమునందా
    భంగి జనించిన నరుడగు
    సింగమ్మును గాంచినపుడె చింతలు దొలఁగున్.

    రిప్లయితొలగించండి


  8. అంగక మిచ్చి నాడు యనిలంబును నింపుచు యూపిరై సదా
    రంగడు మానసమ్ము నట రంగుల రాట్నముగా చరించెనౌ
    బెంగను వీడు మమ్మ తిరు వేంకటనాధుని, మేల్మియైన హృ
    త్సింగముఁ జెంగటం గనినఁ జింతలు దీరుట తథ్యమే కదా

    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబీ గారూ,
      చక్కని పూరణ. అభినందనలు.
      'హృత్సింగము' దుష్టసమాసం. 'వేంకటనాథుని మానసంబె యా\ సింఘము..." అందామా?

      తొలగించండి
  9. బెంగపడ పెండ్లి కొరకు
    రంగములోదిగిన బుధులు లాలనచేయన్
    రంగుల కలగనుచో బా
    సింగమ్మును గాంచినపుడె చింతలు దొలఁగున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్నపరెడ్ది వారూ,
      బాసింగముతో మీ పూరణ వైవిధ్యంగా బాగున్నది. అభినందనలు.
      మొదటి పాదంలో గణదోషం. "కొరకై" అనండి.

      తొలగించండి
  10. పొంగనట వైరభక్తియె
    కంగున దాకఁగ హిరణ్యు గద కంబమ్మున్
    క్రుంగు నరి జన్మయని నర
    సింగమ్మును గాంచినపుడె చింతలు దొలఁగున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సహదేవుడు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'నరసింగము' దుష్టసమాసం కాని విస్తృతంగా జనవ్యవహారంలో ఉంది.

      తొలగించండి
    2. మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  11. డా.పిట్టా
    చొంగనె తేనె ధారయన జూచిరి గద్య కవీంద్రు లంధులై
    రంగమునెల్లమార్చ తమ వ్రాతలె వేదములన్న ;సాహితీ
    శృంగపు సంప్రదాయ యుత శీతల సత్ఝరి నూన్చు కే.సి.యార్
    సింగము జెంగటన్ గనిన జింతలు దీరుట తథ్యమే కదా!

    రిప్లయితొలగించండి
  12. డా.పిట్టా
    అంగ బలమ్మున నడవులు
    భంగముగాన్ బ్రకృతి వికల కారణ యయ్యెన్
    ఖంగును దింటిమి రక్షక
    సింగమ్మును గాంచినపుడె చింతలు దొలగున్!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. పిట్టా వారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      'రక్షక సింగము' దుష్టసమాసం కదా!

      తొలగించండి
    2. డా.పిట్టానుండి
      ఆర్యా,
      గాచెడు సింగము...గా సవరించితిని

      తొలగించండి
  13. క్రొవ్విడి వెంకట రాజారావు:

    ఇంగము లేనట్టి దనుజుని
    పొంగెడు పొవరు నెడలించి పొందుగ సిసువున్
    హంగుగ బ్రోచిన నరుడౌ
    సింగమ్మును గాంచినపుడె చింతలు దొలగున్

    రిప్లయితొలగించండి
  14. గురువు గారికి నమస్సులు
    రంగని భక్తులు తలచిరి
    మంగళ దాయిక జనాది మనసున గుణధీ
    రంగపు శ్రేణులు నారా
    సింగమ్మును గాంచినపుడే చింతలు తొలగున్
    వందనములు.

    రిప్లయితొలగించండి
  15. సంగర మందు నిల్చి కురు సాయుధ వీరులఁ జూచినంత సా
    రంగము వీడె నుత్తరుడు, రాజిత వీరుడు సవ్యసాచి వీ
    రంగము జేయ, స్యందనము డాబున దోలెనసంశయాత్ముడై
    సింగముఁ జెంగటం గనినఁ జింతలు దీరుట తథ్యమే కదా

    రిప్లయితొలగించండి
  16. జంగమ దేవర వారిని
    సింగముతో బోల్చనగును చెడు దొలగింపన్
    పొంగును మది,భక్తిగ నా
    సింగమ్మును గాంచినపుడె చింతలు దొలగున్.

    రిప్లయితొలగించండి
  17. పొంగి న భక్తి ని వేడ గ
    చెంగట కం బాన వెడలి చీల్చేను దైత్యు న్
    ముంగిట నిల్చి యు నరుడౌ
    సింగమ్మును గాంచి నపుడె చింత లు తొలగు న్

    రిప్లయితొలగించండి
  18. రంగని జూపుము ననుచున్
    పొంగుగ సుతునడుగు నసురు పొరిమార్చ భువిన్
    హంగుగ వచ్చిన మానిసి
    సింగమ్మును గాంచునపుడె చింతలు దొలగున్!!!

    మానిసిసింగము = నృసింహస్వామి

    రిప్లయితొలగించండి
  19. సింగన యను మహిపాలుడు
    సంగరమున గ్రీడి సముడు శౌర్యము నందున్
    బెంగయె కలుగగ జనులా
    సింగమ్మును జూచినపుడె చింతలు దొలగున్.

    రిప్లయితొలగించండి
  20. క్రొవ్విడి వెంకట రాజారావు:

    ఇంగము జూపకున్ సతము నేవములౌ పనులెంచి నెచ్చుగా
    పొంగిన కంటుతో హరిని భూషణ జేయు కుమారు నేచుచున్
    భంగము జేయు రాక్షసుని వంచినయట్టి చిదాత్మ రూపియౌ
    సింగము జెంగటం గనిన జింతలు దీరుట తథ్యమే గదా!

    రిప్లయితొలగించండి
  21. కొంగ జపంబును మానగ,
    మ్రింగగ కూడును,సుఖింప మిద్దెల యిల్లున్,
    ముంగిట చేరన్నొక నర
    సింగమ్మునుఁగాంచినపుడె చింతలుఁదొలగున్

    నరసింగము=మల్లవిద్యా విశేషము
    తె-తె నిఘంటువు రవ్వాశ్రీహరి
    ఒక మల్లయుద్ధ విశారదుని సహకారంతో ఇవన్నీ పొందవచ్చునని
    నా భావం

    రిప్లయితొలగించండి
  22. మైలవరపు వారి పూరణ:

    క్రుంగకు దుఃఖాబ్ధిని మును..
    గంగ , కమఠమును దలచిన గాచును హరియే !
    బెంగటిలకు కష్టాటవి(న్)
    సింగమ్మును గాంచినపుడె చింతలు తొలగున్ !!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
  23. కోట రాజశేఖర్ గారి పూరణ:

    సందర్భం :: మన సైనికుడు భారత జాతీయ చిహ్నము లో కమలమును, అశోక చక్రమును, *సత్యమేవ జయతే* అను సూక్తిని, గుర్రమును, వృషభమును, గజమును, సింగమును దేశభక్తితో చూస్తే చింతలు తీరిపోతాయి అని చెప్పే సందర్భం.


    బంగరు బిడ్డ సైనికుడు, భారత దేశపు చిహ్న మందు, తా
    పొంగుచు, భక్తితో కమలమున్ గని, మేటి యశోక చక్ర మూ
    ర్తింగని, *సత్యమేవజయతే* యను సంస్కృత సూక్తి జూచుచున్,
    ముంగిట గుర్రమున్, వృషభమున్, గజమున్, ఘన శౌర్య చిహ్నమౌ
    *సింగముఁ జెంగటన్ గనిన చింతలు దీరుట తథ్యమే గదా. *

    రచన: కోట రాజశేఖర్ నెల్లూరు.

    రిప్లయితొలగించండి
  24. అంగడి వస్తువ యిది వీ
    రంగము సేయు మును ముందు రాకుండఁగ నే
    భంగమ్మును వారసు మన
    సింగమ్మును గాంచినపుడె చింతలు దొలఁగున్

    [మనసు+ఇంగమ్ము = మనసింగమ్ము; ఇంగము = అభిప్రాయము]


    చెంగునఁ దీర్చు నీ పురుష సింహుఁడు దానను కొన్న కార్య మె
    భ్భంగిని నైన ధీ వరుఁడు పార్థివ సూనుఁడు రామ చంద్రుఁ డు
    త్తుంగ కరద్వయుండు ఘన దోర్బల ధన్వి మహాత్ముఁ డిద్ధరన్
    సింగముఁ జెంగటం గనినఁ జింతలు దీరుట తథ్యమే కదా

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మనసు, ఇంగము: ఇష్టము, నభిప్రాయ మను నర్థమున “మనసింగమ్మును” సాధువని యెంచి పూరణ.
      కర్మధారయ సమాసముగా వాడలేదు కాబట్టి “మనసు టింగము” , షష్ఠీతత్పురుష సమాసముగా వాడలేదు కాబట్టి “మనసు నింగము” అన నవసరము లేదని నా యభిప్రాయము.
      సందేహము తీర్చ గోర్తాను

      తొలగించండి
  25. మంగళగిరి ,సింహాద్రి ,తె
    లంగాణపు గిరులలో, వెలసి భక్తులకున్
    మంగళ మిచ్చెడి యా నర
    సింగమ్మును గాంచినపుడె చింతలు దొలఁగున్

    రిప్లయితొలగించండి


  26. భంగము చేయగ వేగమె
    రంగమునేర్పాటు జేసి రక్కసు చంపన్
    చెంగట జేరిన యానర
    సింగమ్మును గాంచినపుడె చింతలు దొలఁగున్

    రిప్లయితొలగించండి
  27. ముంగిట నిల్చు భక్తులకు మోక్షముగల్గగజేసి పార్వతిన్
    అంగమునర్థభాగముననక్కజమొందగదాల్చి మౌళిపై
    గంగచెలంగ లోకముల గాచెడి వేల్పును దక్షమామకున్
    సింగము జెంగటం గనిన జింతలు దీరుట తధ్యమే కదా

    రిప్లయితొలగించండి
  28. సంగరమునందు రిపులను
    చెంగున తెగటార్చి విజయశ్రీలను తనదౌ
    ముంగిటను నిల్పు రాజను
    సింగమ్మును గాంచినపుడె చింతలు తొలగున్

    రిప్లయితొలగించండి
  29. క్రుంగగ బనియేమున్నది ?
    చెంగట శంకరుని రాణి చేగొను హనువున్
    మంగళ కరమగు రధమౌ
    సింగమ్మును గాంచి నపుడే చింతలు దొలగున్

    ఆర్యా ! నా ఫోన్ లో సమస్య ఉన్నది . పి .సి .నుండి పంపుతున్నాను . కొన్ని టైపు సమస్యలు గ్రహించ గలరు .ధన్యవాదములు !

    రిప్లయితొలగించండి
  30. మిత్రులందఱకు నమస్సులు!

    "సంగరమందుఁ గౌరవుల సత్త్వము నార్పెద" నంచుఁ బ్రజ్ఞలన్
    బంగును లేక యుత్తరుఁడు వల్కియు, సారథిగానుఁ బేడి నాఁ
    డంగినిఁ గొంచుఁబోవ, నతఁ డర్జునుఁ డౌఁటనుఁ జింత దీరె! నా

    సింగముఁ జెంగటం గనినఁ జింతలు దీరుట తథ్యమే కదా!!

    రిప్లయితొలగించండి
  31. సింగమువంటి రోషమున చెంతకు జేరని పంతమందునన్
    లొంగని భార్యతో మగడు లోపము గన్గొని జేరదీయుచున్
    అంగన యాశలున్ తగు ప్రయాసన దీర్చగ ?సంతసంబునన్
    సింగము జెంగటంగనిన జింతలు దీరుట తథ్యమేగదా|

    రిప్లయితొలగించండి
  32. ఆండ్రోక్లీస్ సింగానికి అడవిన ముల్లుదీసి రక్షించగ?శిక్షకుపాత్రుడైన సింగమురక్షించుట
    సింగపు ముల్లును దీసిన
    రంగమ్మట గుర్తురాగ?రక్షితు డయ్యెన్|
    ముంగిట మృత్యువునాపిన
    సింగమ్మును గాంచినపుడె చింతలు దొలగెన్|


    రిప్లయితొలగించండి
  33. రంగని వేడగ భక్తుడు
    సింగము వలె వచ్చి లోక చింతలు దీర్చెన్ !
    ముంగిట కాలుడు నిలచిన
    సింగమ్మును గాంచినపుడె చింతలు దొలగెన్|

    రిప్లయితొలగించండి
  34. మైలవరపు వారి పూరణ:

    ముంగిట జచ్చియున్నది ప్రభూ ! గజరాజును మీరు తిన్న , మీ..
    యెంగిలి నా ప్రసాదమని యెంతొ నటించెను జంబుకమ్ము , చే..
    రంగనె సింగమున్ గని , వరమ్మిడ సింగము , నక్క యిట్లనున్
    సింగముఁ జెంగటం గనినఁ జింతలు దీరుట తథ్యమే కదా!!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
  35. నింగిని తాకిన ప్రేమకు
    చొంగ లొడిసె వెండితెరన సూర్యను జూడన్
    తొంగుట తినుట మరచినను
    సింగమ్మును గాంచినపుడె చింతలు దొలఁగున్
    (సింగం చిత్ర ప్రస్తావన)

    రిప్లయితొలగించండి
  36. గంగను శిరమున దాల్చగ
    గంగా ధరు డనుచు బిలువ కంటుగ దోచన్
    ఖంగున పార్వతి రౌద్రము
    సింగమ్మును గాంచినపుడె చింతలు దొలఁగున్

    రిప్లయితొలగించండి
  37. కవిమిత్రులారా,
    నమస్కృతులు.
    ఈరోజు 'ప్రజ - పద్యం' సమూహం వారి పుస్తకావిష్కరణ సభకు వెళ్ళి ఇప్పుడే నెలవు చేరాను. అలసట కారణంగా ఈనాటి మీ పూరణలను సమీక్షించలేను. మన్నించండి.

    రిప్లయితొలగించండి
  38. రంగడుగజగజవణకును
    సింగమ్మును గాంచినపుడె, చింతలు దొలఁగున్"
    రంగని నేసేవించిన
    రంగనికృపకలుగుగతనరయమునమనకున్

    రిప్లయితొలగించండి
  39. సింగముఁ జెంగటం గనినఁ జింతలు దీరుట తథ్యమే కదా
    సింగముఁ జెంగటం గనినఁ జింతలు దీరుట తథ్యమెట్లగున్
    సింగముజూడగామదినిజెప్పగరానిభయంబుగల్గుచు
    న్నంగములన్నియున్ వణుకయచ్చటనుండకపారిపోదుమా

    రిప్లయితొలగించండి
  40. రంగములో దిగెన్ శశము ప్రాణము నిల్పుకొనంగ బుద్ధితో
    వంగగ జేసి సింగమును బావిని నీడ మరొక్క సింగమన్
    భంగిని దెల్పఁ గోపమున వానిని గూల్చఁగ దూక సిద్ధమౌ
    సింగముఁ జెంగటం గనినఁ జింతలు దీరుట తథ్యమే కదా!

    రిప్లయితొలగించండి
  41. డా.బల్లూరి ఉమాదేవి.5/11/17

    శింగన మలలో శ్రీనర

    సింగని మందిరము జూడ శ్రీమతి తోడన్

    చెంగట చేరుచు నానర

    సింగమ్మును గాంచినపుడె చింతలు దొలఁగున్.

    రిప్లయితొలగించండి
  42. బంగరు భూమియైన మన భారత ఖండపు దక్షిణమ్మునన్
    బంగళ తోయధిన్ దరిని పర్వత శ్రేణికి శృంగమందునన్
    హంగులు మీరగన్ వెలయు నాఖువ మానవ మేళవమ్మదౌ
    సింగముఁ జెంగటం గనినఁ జింతలు దీరుట తథ్యమే కదా!

    ఆఖువు = వరాహము

    రిప్లయితొలగించండి


  43. వింగడమై శుభమ్ముగను వేంకట నాథుని సన్నిధిన్నటన్
    మంగళ నాదమెల్లెడల మంగళ సూత్రము కంఠమందునన్
    ముంగిట ముద్దులొల్కు సతి మోము, లలాటముపై భళారె బా
    సింగముఁ జెంగటం గనినఁ జింతలు దీరుట తథ్యమే కదా!

    జిలేబి

    రిప్లయితొలగించండి
  44. చెంగున చౌకళించుచును చేరగ వచ్చిన తెల్గుదేశపున్
    దొంగలు పారిపోయిరహ దూకుచు గాండ్రిలు కల్వకుంటడౌ
    సింగముఁ జెంగటం గనినఁ;.. జింతలు దీరుట తథ్యమే కదా
    పొంగగ కల్లు ముంతలిట ప్రొద్దున రాతిరి భాగ్యనగ్రినిన్

    రిప్లయితొలగించండి