26, నవంబర్ 2017, ఆదివారం

సమస్య - 2530 (శంకరుఁ డెత్తె హిమగిరిని...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
"శంకరుఁ డెత్తె హిమగిరిని సతి వెఱఁ గందన్"
(లేదా...)
"శంకరుఁ డెత్తె వెండిమల శైలతనూభవ సంభ్రమింపఁగన్"
(ఆకాశవాణి వారి సమస్య)

78 కామెంట్‌లు:

  1. బింకము లేకయె జాలపు
    హుంకారము నోర్చి మెండు హుందా తోడన్
    సుంకము వసూలు చేయక
    శంకరుఁ డెత్తె హిమగిరిని సతి వెఱఁ గందన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ప్రభాకర శాస్త్రి గారూ,
      ఈ పూరణలో ప్రస్తావించిన శంకరుడు నేనే కదా!
      పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
    2. గురుదేవులకు,శాస్త్రీగారికి నమోనమః!

      తొలగించండి
  2. హుంకారుడు;బహుధిషణా
    హంకారుడు;విపులతనుమహాద్భుతతేజో
    లంకారుడు;దిక్పాలవ
    శంకరు దేత్తె హిమగిరిని సతి వెరగందన్.

    త్తె

    రిప్లయితొలగించండి
  3. లంకాధిపు వినుతుడెగా;
    లంకకు గొని పోవ హనుమ లక్ష్మణు కొఱకున్;
    జింక కొఱకేగె రఘుపతి
    శంకరు, డెత్తె హిమగిరిని ; సతి వెరగందన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జనార్దన రావు గారూ,
      మీ క్రమాలంకార పూరణ చక్కగా ఉంది. అభినందనలు.

      తొలగించండి
  4. శంకించిన రాము నిగని
    బింకము లేకుండ సీత వ్రేలిమి దూకన్
    లంకేశు డూపగ శైలము
    శంకరుఁ డెత్తె హిమగిరిని సతి వెఱఁ గందన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అక్కయ్యా,
      పద్యం పూర్వ, పరార్ధాలకు అన్వయం? మూడవ పాదంలో గణదోషం. "లంకేశు డూప శైలము" అనండి.

      తొలగించండి
    2. కింకరు వలెరావ ణుడట
      పొంకము తోరామ సతిని పొందగ కోరెన్
      లంకేశు డూప శైలము
      శంకరుఁ డెత్తె హిమగిరిని సతి వెఱఁ గందన్

      తొలగించండి


  5. అంకతి చంచల బుద్ధియు
    పంకిల మదిపోవగాను పంకజ జన్ముం
    డంకిత మై నంది యవగ,
    శంకరుఁ డెత్తె హిమగిరిని సతి వెఱఁ గందన్!

    *శంకరుడెత్తె- శంకరుడు స్మరించె

    పంకజనాభుని కోరిక
    పంకజ జన్ముని చంచలత్వం
    తరువాయి విష్ణువు ప్రార్థింప, బ్రహ్మ శరణు వేడి నందియై మారగ... ఆపై శంకరుడు వెడలె హిమగిరికి సతి సమేతంగా (శివ పురాణం)


    శుభోదయం
    జిలేబి

    రిప్లయితొలగించండి
  6. మైలవరపు వారి పూరణలు


    అంకితభక్తిఁ తల్లిఁ గని యమ్మరొ ! తెచ్చెదనాత్మలింగమున్
    శంకరుఁ గొల్చి యంచు ., బలశాలి కఠోర తపంబు జేసి , మీ...
    నాంకుని వైరిఁ గాంచక , మహాగ్రహమందుచు నెట్టి , త్రుళ్లగా
    శంకరుఁ డెత్తె వెండిమల శైలతనూభవ సంభ్రమింపఁగన్ !!

    ( శంకరుడు త్రుళ్లగా..శైలతనూభవ సంభ్రమింపఁగా... రావణుడు గిరినెత్తెను )

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి



    కింకరభక్తిఁ దపించుచు
    లంకేశుడు శివునికై , విలంబము గాగన్
    బింకపు బలమున , త్రుళ్లగ
    శంకరుడెత్తె హిమగిరిని సతి వెరగందన్ !!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మైలవరపు వారూ,
      చక్కని అన్వయంతో మనోహరమైన పూరణలు చెప్పారు. అభినందనలు.

      తొలగించండి
  7. డా.పిట్టా
    అంకము వీడని భర్త, ని
    రంకుశుడునుగాదు, తిరిగి రాడిట నెటనో
    పొంకపు కవి గానంబున
    శంకరుడెత్తె హిమగిరి సతి వెరగందన్!(కంది శంకరుడై)

    రిప్లయితొలగించండి
  8. డా.పిట్టా
    భక్త వశంకర శంకర ప్రభ:
    పంకములేని స్వచ్ఛతయు పారెడు జీవ నదంబు మింటికిన్
    అంకము, సర్వ సౌఖ్యనిధికండ,నిటన్ బహు శాంతి!భక్తులే
    చంకన బెట్టిరో తనదు సాధ్విని, తాండవ మెట్లు బాసెనో
    శంకరుడెత్తె వెండి మల శైల తనూభవ సంభ్రమింపగన్!

    రిప్లయితొలగించండి
  9. శృంఖలము చేసి నాడుల
    ఓంకారమును పలికించ నున్మత్తతతో
    లంకేశుడు,మైమరపున
    శంకరుడెత్తె హిమగిరిని సతివెఱగందన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శ్రీరామ్ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మైమరువగ శంకరు, డెత్తె... అంటే బాగుంటుందేమో?

      తొలగించండి
  10. లంకా నాథుని మొర విని
    శంకరుడు వరము నొసoగ సంకోచింపన్
    లంకే శుడు గ్రత న ప ర
    శంకరుడె త్తేహిమ గిరి ని సతివెర గం ద న్

    రిప్లయితొలగించండి
  11. మైలవరపు వారి మరో పూరణ

    శ్రీ శ్రీనివాస కళ్యాణం చూచుటకు వెళ్లే సందర్భంలో పార్వతి సింగారించుకొనే సందర్భం....

    వేంకటనాథుడున్ సిరిని పెండిలి యాడుచునుండె , బోవగా
    కుంకుమ దిద్దుకొందునని కోర్కెను దెల్పగ , *దర్పణమ్ముగా*
    *శంకరుడెత్తె వెండిమల* శైలతనూభవ సంభ్రమింపఁగన్ !
    బింకము లేక పూని పతి విజ్ఞతతో సతి కోర్కె దీర్పడే? !!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మైలవరపు వారూ,
      మనోహరమైన భావంతో అద్భుతమైన పూరణ చెప్పారు. అభినందనలు.

      తొలగించండి
    2. వేమన కొండను అద్దంలో చూపిస్తే మన మైలవరపు వారు కొండనే అద్దంగా మార్చారు. అనితర సాధ్యమైన కల్పనా చాతుర్యం వారిది.

      ...కంది శంకరయ్య

      తొలగించండి
    3. సార్!

      వేమన పద్యంలో:

      "కొండ యద్దమందు కొంచెమై ఉండదా?"

      అని ఉన్నది. చాలా రోజులు నేనీ విషయమును అర్ధం చేసుకొనుటకు బహు కష్ట పడ్డాను. ఎందుకంటే, బెడ్ రూము అద్దంలో వనితల కాయం గుజ్జుగా మారదు కదా.

      తర్వాత అర్ధమైనది: బెడ్ రూము అద్దం సమతల దర్పణం (plane mirror). వేమన గారి అద్దం భూతాకార దర్పణం (driver's convex mirror). దీనిలో కొండ నిజంగానే చిన్నదౌను. ఇటీవల వనితల మేకప్ అద్దాలు, పురుషుల షేవింగ్ అద్దాలూ మొటిమలనూ, మీసములనూ మిక్కిలి పెద్దవిగా చేస్తవి. అవి పుటాకార దర్పణాలు (concave mirrors).

      కొంచెం ఫిజిక్సు కు శంకరాభరణంలో తావిచ్చినందులకు ధన్యవాదాలు!!!

      వేమన గారిది బెంజ్ కార్ అయిఉంటుంది :)

      తొలగించండి
  12. కోట రాజశేఖర్ గారి పూరణ

    సందర్భం :: సాధులోక నాశంకరుడైన రావణుడు పుష్పకవిమానంలో కైలాసం వెళ్లి, నంది అడ్డగింపగా, నీవెంత? నీశంకరుడెంత? అంటూ మనసా వచసా కర్మణా బింకము (గర్వము) నంది, వెండికొండను పైకెత్తే సందర్భం.

    మంకుతనాన, *పుష్పక విమానము* లోజని, *నంది* జూచి నీ
    *శంకరు* డెంత యంచు, *మనసా వచసా వర కర్మణా* యనన్
    బింకము నంది, *రావణుడు*, వీరవరేణ్యుడు, సాధులోక నా
    *శంకరుఁ డెత్తె వెండిమల, శైలతనూభవ సంభ్రమింపగన్.*

    *కోట రాజశేఖర్ నెల్లూరు.*

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రాజశేఖర్ గారూ,
      సాధులోక నాశంకరుడైన రావణుని ప్రస్తావించిన మీ పూరణ అత్యద్భుతంగా ఉంది. అభినందనలు.

      తొలగించండి
  13. బ్లాగు నిర్వాహకులు శ్రీ కంది శంకరయ్య గారిని ప్రస్తుతిస్తూ ప్రభాకరశాస్త్రి గారు చేసిన పూరణ సమంజసంగా సందర్భోచితంగానున్నది.రావణుడైనా, ఆంజనేయుడైనా ఒకమారు కొండనెత్తి దించి వేసి ఉంటారు.శంరార్యులు మాత్రం కొండను నెత్తికెత్తుకుని దాదాపు దశాబద కాలంగా కొండంత భారాన్ని మోస్తూ మరిన్ని బాధ్యత లను (భారములను)చేర్చుకుంటున్నారు,పేర్చుకుంటున్నారు.ఇరువురికీ అభినందన కుసుమాలు !💐💐💐💐💐💐💐💐💐💐💐💐

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జనార్దన రావు గారూ,
      ధన్యవాదాలు! మీ అందరి ప్రోత్సాహం, భాగస్వామ్యంతోనే ఇది సాధ్యమయింది. ఇంకా కొనసాగుతుంది.

      తొలగించండి
    2. ఒకానొక సమస్యకు సూపర్ పూరణ

      సమస్య:

      "అశ్వముఖుఁ డాంజనేయుఁ డబ్జాసనుండు"


      కంది శంకరయ్యఏప్రిల్ 22, 2014 6:19 PM

      ఏమి చెప్పుదు నా పతి యెట్టివాఁడొ?
      చెప్పవలె నందమునఁ, గోతి చేష్టలందుఁ,
      చొక్కి విఫలుఁడై నలుదెసల్ చూడగ మగఁ
      డశ్వముఖుఁ, డాంజనేయుఁ, డబ్జాసనుండు.

      తొలగించండి
    3. Pandita Nemaniఏప్రిల్ 22, 2014 6:53 PM

      అయ్యా! శ్రీ కంది శంకరయ్య గారూ! శుభాశీస్సులు.
      ఆందమైన పద్యమే చెప్పేరు గాని, ఆ చెప్పిన పతివ్రతా శిరోమణి ఎవరో ఆమె గుణ గణాలు అంచనా వేయలేము కదా. స్వస్తి.

      తొలగించండి
    4. ప్రభాకర శాస్త్రి గారూ,
      ఎప్పటి పూరణనో ప్రస్తావిస్తూ పనిలో పనిగా గురుదేవులు నేమాని వారిని కూడా గుర్తుకు తెచ్చారు. ధన్యవాదాలు.
      ఇప్పుడు నేనలాంటి పూరణలు చెయ్యగలనా? సందేహమే!

      తొలగించండి
  14. పంకిలమౌ పాపుల నక
    ళంకితులంగొనగ గంగ లంఘింపభువిన్
    శృంఖలజేయగ జటలను
    శంకరుడెత్తె, హిమగిరిని సతివెరగొందన్

    రిప్లయితొలగించండి
  15. లంకేశుఁడు రావణు డే
    శంకయు లేక తన రాము సతిఁ గొని నంతన్
    కింకరుపై శివమెత్తుచు
    శంకరుడెత్తె హిమగిరిని సతి వెఱఁ గందన్!

    రిప్లయితొలగించండి
  16. వంకరటింకరమాటలు
    వెంకడుదాబలుకుచుండివెటకారముగాన్
    లంకారాముడ!వినుమా
    శంకరుడెత్తెహిమగిరినిసతివెరగందన్

    రిప్లయితొలగించండి
  17. రిప్లయిలు
    1. పంకజ భవ వర కలిత భ
      యంకర దానవ నిచయ గణాధీశుఁడు కూ
      లంకష సహిత సుర గణ వ
      శంకరుఁ డెత్తె హిమగిరిని సతి వెఱఁ గందన్


      బింకము తోడ నా త్రిపుర భీషణ దైత్య గణమ్ము క్రుద్ధతన్
      శంక యొకింత వొందక సశక్ర సురాలిని నొవ్వఁ జేయ చం
      ద్రాంకుఁడు మన్మథారి త్రిపురాంతకుఁ డుగ్రుఁడు మేరు చాపమున్
      శంకరుఁ డెత్తె, వెండిమల శైలతనూభవ సంభ్రమింపఁగన్

      తొలగించండి
    2. కామేశ్వర రావు గారూ,
      మీ రెండు పూరణలు వైవిధ్యంగా మనోహరంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
    3. పూజ్యులుశంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు.

      తొలగించండి
  18. శంకర భక్తకోటికి వశంకరు డందురె నిన్ను! చూడు నా
    వంక దశాస్యుడన్ పరమభక్తుడ నీ కని సన్నుతించియున్,
    జంకక రావణుం డరిది చయ్యన, నవ్వుచునుండ లీలగా
    శంకరుఁ, డెత్తె వెండిమల శైలతనూభవ సంభ్రమింపఁగన్.

    రిప్లయితొలగించండి
  19. డా.ఎన్.వి.ఎన్.చారి 9866610429
    బింకముతో జేర హరుని
    జంకును విడి దీర్ఘ బాహు శక్తిని జూపన్
    లంకేశుండు నవ గ్రహ వ
    శంకరుడెత్తె హిమగిరిని సతి వెఱగందన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చారి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
    2. డా.బల్లూరి ఉమాదేవి. 26/11/17.

      ఓంకారమూర్తి యనగా

      హుంకారము చేసి తాను యోడకమదిలో

      జంకుచు సతతము పార్వతి

      శంకరుఁ డెత్తె హిమగిరిని సతి వెఱఁ గందన్"*

      తొలగించండి
  20. శాంకరి సంగతి నుండగ
    శంకరుఁ ,డెత్తె హిమగిరిని సతి వెఱఁ గందన్
    బింకముతో దశకంఠుడు
    శంకపడక శంకరుడిడె స్వయ లింగమ్మున్

    రిప్లయితొలగించండి
  21. లంకేశుని యందుడిగిన
    శంకరు డేత్తె|హిమగిరిని సతి వెఱగందన్|
    శంకేల విశ్వమంతట
    యింకెనుసర్వేశుడుగిరి నెత్తుట తప్పా?
    2”.మంకుగ రావణాసురుడు మాయను నమ్మినగర్వమందునన్
    శంకయు లేని కావరము,సర్వము నేననుయూహలందునన్
    బింకమునందురావణుడు” “విశ్వమునంతట నిల్చి యున్న?యా
    శంకరు డెత్తెవెండి మలశైలతనూభవ సంభ్రమింపగన్|”

    రిప్లయితొలగించండి
  22. శాంకరి హైమలంబున విశాల వనంబున దూకుచుండెడి
    న్న్యంకువు జూచి మోదమున నాథునిఁ దెమ్మని కోరినంత నా
    జింకను చిద్విలాసమున చెంతకు రమ్మని వచ్చినంత దా
    శంకరుఁ డెత్తె వెండిమల శైలతనూభవ సంభ్రమింపఁగన్

    సరదాగా చేసిన ఊహ

    రిప్లయితొలగించండి
  23. లంకకు పాలకుండయిన రావణ బ్రహ్మయె కింకరుండునై
    శంకయు లేక భిక్షువుగ సాధ్విని సీతను బంధిజేయుచున్
    సంకటమొంద జేసె తన స్వామిని రాము నటంచుఁ గ్రుద్ధుడై
    శంకరుఁ డెత్తె వెండిమల శైలతనూభవ సంభ్రమింపఁగన్!

    రిప్లయితొలగించండి
  24. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  25. గురుదేవులకు వినమ్రవందనములు
    మీ మనస్సును గాయము జేసిన మన్నింప ప్రార్ధన..

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. వరప్రసాద్ గారూ,
      మీరు పెట్టిన పద్యం నాకు సంతోషాన్ని కలిగించేదే. అందులో మనస్సు గాయపడే అంశమేదీ లేదు.

      తొలగించండి
    2. ధన్యడను గురుదేవా, మిత్రులు బాగా లేదని అన్నారు.. ఆ తప్పు మరల చేయకూడదని తీసివేసానండి.. ఈ మధ్య నా చిన్న నాటి తీపిగుర్తులను వ్రాస్తున్నాను..

      తొలగించండి
  26. లంకాపతి,దివిజులనా
    శంకరు డెత్తె హిమగిరిని,సతివెరగందన్
    శంకరుడు కొండ నొత్తగ
    లంకాపతి మొత్తుకొనుచు ప్రార్ధన జేసెన్


    శంకరుడు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. తిమ్మాజీ రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "సురగణ నాశంకరుడు..' అంటే ఇంకా బాగుంటుందేమో?

      తొలగించండి
  27. శంకరుడెత్తెవెండిమలశైలతనూభవసంభ్రమింపగన్ శంకరువాసమేయదిగశంకరుకొండనునెత్తుటెట్లగున్ బొంకములేనిమాటలనుబూరగవీలగునేదయాకరా!
    శంకరుడెత్తగాగిరినిశైలతనూభవసంతసించునే?

    రిప్లయితొలగించండి
  28. గు రు మూ ర్తి ఆ చా రి
    ,,,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,,

    ( రా వ ణా సు రు డు హి మ శై ల ము నెత్త

    లే క బా ధ ప డు చు ౦ డ గ , శి వు డు

    దా ని ని ఆ య నే ఎ త్తి , ఆ త ని

    భు జ ము పై చే రు వి ధ ము గా చే సె ను .

    శ ౦ క రు డు భ క్తు ని బా ధ పె ట్టు నా ? )


    హూ౦కృతి జేయుచున్ బటు మదోధ్ధురుడై ,

    ................ దశక౦ఠు డ౦త యే

    వ౦క c గదల్చ లే డయె ఖభాష్ప గిరిన్ | వెత

    .................. జె౦దు చు౦డగన్

    శ౦కరు డెత్తి వె౦డి మల - శైలతనూభవ

    ............. స౦భ్రమి౦చగా ,

    పొ౦కము మీరు నట్లతని మూపున జేరు

    ................... విధాన జేసె నా

    శ౦కరు డెప్డు ఖేదపరుచ౦ గలడే నిజ

    ..................... భక్తశేఖరున్

    { ఖ భా ష్ప గి రి = మ ౦ చు కొ ౦ డ }

    రిప్లయితొలగించండి
  29. బింకము నందుచు నటుడగు
    శంకరుడెత్తె హిమగిరిని! సతి వెఱగందన్
    జంకు విడుడనిరి " తల్లీ
    శంకింపగ నేల? డొల్ల శైలమెటులగున్?"
    (శంకరుడను నటుడు నటనలో భాగంగా బెండు (డొల్ల) తో చేసిన హిమగిరి నెత్తగా పతికి బరువగునేమోనని గని భయపడిన సతితో యచటి వారనిన మాటలు)

    రిప్లయితొలగించండి
  30. డా.పిట్టా
    భక్త వశంకర శంకర ప్రభ:
    పంకములేని స్వచ్ఛతయు పారెడు జీవ నదంబు మింటికిన్
    అంకము, సర్వ సౌఖ్యనిధికండ,నిటన్ బహు శాంతి!భక్తులే
    చంకన బెట్టిరో తనదు సాధ్విని, తాండవ మెట్లు బాసెనో
    శంకరుడెత్తె వెండి మల శైల తనూభవ సంభ్రమింపగన్!

    రిప్లయితొలగించండి


  31. ఓంకారమూర్తి యనగా

    హుంకారము చేసి తాను యోడకమదిలో

    జంకుచు సతతము పార్వతి

    శంకరుఁ డెత్తె హిమగిరిని సతి వెఱఁ గందన్

    రిప్లయితొలగించండి
  32. చంకన శంకరాభరణ శంకరి నూనుచు సంతసమ్ముతో
    వంకలు వాగులన్నుఱికి పంకజనాభుని గారవమ్ముతో
    సుంకము మాపుచున్ సులభ సుందర ప్రాభవ లాఘవమ్ముతో
    శంకరుఁ డెత్తె వెండిమల శైలతనూభవ సంభ్రమింపఁగన్

    రిప్లయితొలగించండి

  33. పంకజ నాభ సోదరికి భర్తను జూడగ కొంత సందియం
    బింకను! శక్తి వంతుడగు భీషణు డీతడ కో? సదాశివున్
    శంకగ గాంచ శక్తి యట శక్తికి శక్తిని నిచ్చు వాడు, ఆ
    శంకరుఁ డెత్తె వెండిమల శైలతనూభవ సంభ్రమింపఁగన్!

    రిప్లయితొలగించండి
  34. వంకలు బెట్టి నీ పితయె వంకర మాటల తిట్టెనంచుచున్
    కుంకగ నత్తయే తనకు కూడును పెట్టక తోలెనంచుచున్
    బింకము తోడ నూపిరిని భీకర రూపున బందిజేయుచున్
    శంకరుఁ డెత్తె వెండిమల శైలతనూభవ సంభ్రమింపఁగన్

    రిప్లయితొలగించండి