20, నవంబర్ 2017, సోమవారం

ఆందోళికా బంధ తేటగీతి (దేవీ ప్రార్ధన)



మాత, మంగళ, శ్రీగౌరి, మారి, గిరిజ,
బాల, కాల, లలన, సీత, భవ్య, లంభ,
రంభ, శాంభవి, యుమ, రమ, రామ, భీమ, 
యగజ, దుర్గ, శ్రీమాతృక, యంబిక, జయ,
మలయ వాసిని శారద, మాలిని, కళ
భార్గవి, శివ, సరస్వతి, భంజ, శాక్రి, 
సౌమ్య, దశభుజ, సావిత్రి, శక్తి, శాంతి,
నీల లోహిత, రక్షి, సని, సురస, భయ 
నాశిని, యమున, మలయమ్మ, నంద, సతము 
కరుణతో  జూచుచును మమ్ము గాచ వలయు
రచన :- పూసపాటి కృష్ణ సూర్య కుమార్  

7 కామెంట్‌లు:

  1. కృష్ణ సూర్య కుమార్ గారు మీ బంధ తేటగీతికా ప్రార్థన మద్భుతముగా నున్నది.

    రిప్లయితొలగించండి
  2. కామేశ్వర రావు గారిపాద పద్మములకు నమస్కారములు. ధన్యవాదములు. నేను మీ వద్ద నుంచి కోరునది ఇదియే. మీ యొక్క అమూల్యమైన అభిప్రాయములు నాకు ఎంతో చేదోడు వాదోడు గా ఉంటాయి. సర్వదా మీ ఆశీస్సులు కోరుతూ పూసపాటి కృష్ణ సూర్య కుమార్

    రిప్లయితొలగించండి
  3. ఆందోళికరూపంబున
    నందముగావ్రాసినట్టియార్యుడ!సూర్యా!
    బందమునన్గలపార్వతి
    వందనముల్స్వీ కరించిభవ్యతనిచ్చున్



    రిప్లయితొలగించండి
  4. బంధ తేటగీతికలకు బంధు సాగ
    రుడగ అయ్య లమ్మనకు వచో రుచిర వాక్వి
    భవమధుర మందారసoపదల నివ్వ
    కవన చిత్రా o గ పద్యాల కవివల్లభ!
    నమస్సులతో సమర్పించిన ది

    రిప్లయితొలగించండి