డా.పిట్టానుండి ఆర్యా,తిరుపతికి వెళ్ళమన్న నిమంత్రణ నందుకొని అచ్చట జరిగిన పుస్తకావిష్కరణ సన్మాన గ్రహీతనైనాను.శ్రీమాన్ (డా*)సముద్రాల లక్ష్మణయ్య గారి తెలుగు జీవిత చరిత్ర*సద్గురు మళయాళస్వామి*కి ఆంగ్లానువాదం చేసి యుంటిని.తి.తి.దే వారి ప్రచురణ వెలువరింపజేసినారు. తేది.16/11/17 నాటి తిరుపతి ఆంధ్రజ్యోతి లో వార్త నిచ్చినారు.T.S పత్రికలు అనుసరించినవి.కృతజ్ఞతలు
కవి మిత్రులకు నమస్కారములు ఈ రోజు తోటి కార్తీక మాసాపు హడావిడి తగ్గినది మరల బ్లాగులోకి అడుగిడుతున్నాను. గురువు గారు నేను వ్రాసిన అందోళికా బంధము ఈ రోజు పెట్ట్టారు. మిత్రులకు విన్నపము బంధ కవిత్వమును పరిశీలించి మీ అమూల్యమైన అభిప్రాయములు తెలుపగలరని ఆశిస్తున్నాను.
సందర్భం :: చిన్న బిడ్డలు అన్నం తినేందుకు మనం పాడే *చందమామ రావే* పాటను అన్నమయ్యే వ్రాశారు. పసిపిల్లలు ఉయ్యాలలో నిద్రపోయేందుకు పాడే *జో అచ్యుతానంద* జోలపాటను కూడా అన్నమయ్యే వ్రాశారు. శ్రీ వేంకటనాథునిపై 32 వేల కీర్తనలను వ్రాశారు. అటువంటి అన్నమయ్యకు భక్తితో మ్రొక్కే సందర్భం.
🙏🙏🙏
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఅలతి యలతి పదము లందున గనర ! య
రిప్లయితొలగించండిన్నన్న ! యన్నమయ్య యతిశయించి
మధుర కవిత లల్లె మనవైన మనసులు
య్యలలె యూగ ; భక్తి యంత కూర్చి !
డా.పిట్టా
రిప్లయితొలగించండి*అన్నియు నన్ని మంత్రములు నందునె యున్న వటన్న* గీతిని
న్నన్నను బాడినన్ సరియ నత్తరి నిత్తరి నిప్డె మేలుకో
మన్నన *వేంకటేశు*డను మౌలిక మంత్రము నిచ్చె నన్నమ
య్యన్నను నమ్మవే మనస!యాడుచు బాడుచు మోక్షగామివై!
అసుర సంధ్య వేళ యందాల పాటల
రిప్లయితొలగించండిన్నయవి వినగ మదికి హాయి గలుగు
మధువు ద్రాగి నంత మత్తుగ తూగుటు
య్యల పైన నూగు నతిశ యించు
డా.పిట్టానుండి
రిప్లయితొలగించండిఆర్యా,తిరుపతికి వెళ్ళమన్న నిమంత్రణ నందుకొని అచ్చట జరిగిన పుస్తకావిష్కరణ సన్మాన గ్రహీతనైనాను.శ్రీమాన్ (డా*)సముద్రాల లక్ష్మణయ్య గారి తెలుగు జీవిత చరిత్ర*సద్గురు మళయాళస్వామి*కి ఆంగ్లానువాదం చేసి యుంటిని.తి.తి.దే వారి ప్రచురణ వెలువరింపజేసినారు. తేది.16/11/17 నాటి తిరుపతి ఆంధ్రజ్యోతి లో వార్త నిచ్చినారు.T.S పత్రికలు అనుసరించినవి.కృతజ్ఞతలు
శుభాభినందనలండీ పిట్టావారూ!
తొలగించండిఅల చందమామ సొగసు,
రిప్లయితొలగించండిన్నలినదళేక్షణు మనోజ్ఞనయనపు కాంతుల్,
మలయజపరిమళములు,న
య్య!లయించెను నీపదముల నాదర్శకవీ!
రిప్లయితొలగించండి"అరచేతిమాణి కం"బె
న్న,"రుక్మిణికి రంగు మోవి" నలమేనిదొరన్
"మరులుగొలిపె" పదములన
య్య "రంగు మీరు పెనురవ"మయా! యన్నమయా !
జిలేబి
భలే పద్యం!!!
తొలగించండి👌👌👌
తొలగించండికొట్టు కొచ్చెను పదముల కొంగు బట్టి
పట్టు మామి జిలేబి యప్పా జిలేబి :)
గట్టి గా భలే పద్యము కంద మాయె
యెట్టులో తెలియకపోయె యెంకటేశ :)
జిలేబి
జిలేబీ గారు:
తొలగించండిసారు లీవులో ఉన్నారు గదా! బోరుకొట్టుచున్నది. ఇదిగో మీకీ సమస్య #1370:
"నట్టింటఁ దళుక్కు మనెను నక్షత్రములే"
గుట్టుగ పెండ్లాడి ముసలి
సెట్టిని వజ్రాలు కోరి చెంగల్ పట్టున్
పుట్టింటిని మెట్టగనే
నట్టింటఁ దళుక్కు మనెను నక్షత్రములే
తొలగించండికొట్టగ తలపై గట్టిగ
చెట్టాపట్టాల్ వలదని చెలికత్తెలటన్
పట్టమ్మ జిలేబికహో
నట్టింటఁ దళుక్కు మనెను నక్షత్రములే :)
జిలేబి
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండిభళిభళి జిలేబి వడివడి
తొలగించండివళావళి పదముల సరస పద్యములల్లన్
తళతళ లాడును తారలు
కళవళపడ జదువువారి కన్నులముందున్
మైలవరపు వారి పూరణ
రిప్లయితొలగించండిఅతుల వేదసారమంతయు నోటను..
న్నదొ యనంగ వ్రాసె నవ్య గతుల
మధురసుధలు నింపి మహనీయుడన్నమ...
య్య పద కవితలెన్నొ హరిని గూర్చి !!
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
మైలవరపు వారి రెండవ పూరణ
రిప్లయితొలగించండి*అదివో అల్లదివో* యటంచు గిరి మాహాత్మ్యమ్ము వర్ణించి , యె
న్న దదేకమ్ముగ *తందనాన భళి* నానందమ్ముగా పాడుచున్
మది *సంకీర్తనఁ* జేసి వేంకటపతిన్ , మంగేశుఁ దా నన్నమ
య్య *దరించెన్ పదవైభవామృతతరంగాంభోధి నిర్మగ్నుడై* !!
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
తొలగించండిఅద్భుతమండీ మైలవరపు వారు !
మైలవరపు మురళీకృ
ష్ణా ! లాహిరి లోన దేల్చినారిట జనులన్ !
బాలాజీ కృప లోనన్
దేలుమయా వెంకటగిరి దేవుని చెంతన్ !
జిలేబి
అరయ వేంకటేశు నారాధ నమున క
రిప్లయితొలగించండిన్నమహినిగన వేరు నాస్తి యనుచు
మధుర కీర్తనలను మహిమతో అన్నమ
య్య జగతికిడె వాక్కు యాజి యనగ
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండిఅరయ వేంకటేశు నారాధ నమున క
రిప్లయితొలగించండిన్నమహినిగన వేరు నాస్తి యనుచు
మధుర కీర్తనలను మహిమతో అన్నమ
య్య జగతికిడె వాక్కు యాజి యనగ
అదిగదిగో యనంచు హరి వాసము జూపుచు పాడెగాదె, యె
రిప్లయితొలగించండిన్న!దినము లెన్ని మారినను నాణ్యత మారని కౌశలమ్ముతో
మది మది లోన నూగగను మల్లెల మాలలు మించలేదె, య
య్యదియె సుసాధ్యమౌనె మరి యన్నమ యార్యుని సాటి నిల్వగన్.
అలరించు నలతి పదముల
రిప్లయితొలగించండిన్నలవోకగ నల్లినట్టి యా గీతములే
మదిమురి పించు నవియె యి
య్యవని నరులు మెచ్చునట్టి యద్భుత కృతులై
అలరించు నలతి పదముల
రిప్లయితొలగించండిన్నలవోకగ నల్లినట్టి యా గీతములే
మదిమురి పించు నవియె యి
య్యవని నరులు మెచ్చునట్టి యద్భుత కృతులై
అన్నమయ్య పద ము లానం ద బంధు రా
రిప్లయితొలగించండిన్న తి శ యించు భక్తి నల రు చుండ
మధు ర భావ జాల మరు ల ను బంచు న
య్య!మహి లోన జనుల క ధి క ము గను
రిప్లయితొలగించండిఅన్నార్తుల్,యువకుల్,యతుల్,నెలతుకల్లాశీస్సులన్ గోరెర
న్నన్నన్నా తిరువేంకటేశ! జనులన్ నర్తింప జేసాడు శ్రీ
మన్నారాయణ! తావియబ్బి పదముల్ మట్టాడ, జీరాడి స
య్యన్నారయ్య జనాళియెల్లరు భళా యజ్ఞమ్మిదే యెన్నగన్
జిలేబి
కవిమిత్రులారా! నమస్కృతులు. ప్రయాణంలో ఉన్నాను.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఅభిషేక వరాసుని యర్మిలి పొందగ వె
రిప్లయితొలగించండిన్నయధశ్చరు డాదరణంబునిడన్ రఘురా
మ పదంపు పరాగము మస్తముపై బడ న
య్య శరణ్యము నివ్వ మహా కవిబుట్టె మహిన్
అతి శక్వరిచ్చందములో నలిని వృత్తము
కవి మిత్రులకు నమస్కారములు ఈ రోజు తోటి కార్తీక మాసాపు హడావిడి తగ్గినది మరల బ్లాగులోకి అడుగిడుతున్నాను. గురువు గారు నేను వ్రాసిన అందోళికా బంధము ఈ రోజు పెట్ట్టారు. మిత్రులకు విన్నపము బంధ కవిత్వమును పరిశీలించి మీ అమూల్యమైన అభిప్రాయములు తెలుపగలరని ఆశిస్తున్నాను.
రిప్లయితొలగించండికోట రాజశేఖర్ గారి పూరణ
రిప్లయితొలగించండిసందర్భం :: చిన్న బిడ్డలు అన్నం తినేందుకు మనం పాడే *చందమామ రావే* పాటను అన్నమయ్యే వ్రాశారు. పసిపిల్లలు ఉయ్యాలలో నిద్రపోయేందుకు పాడే *జో అచ్యుతానంద* జోలపాటను కూడా అన్నమయ్యే వ్రాశారు. శ్రీ వేంకటనాథునిపై 32 వేల కీర్తనలను వ్రాశారు. అటువంటి అన్నమయ్యకు భక్తితో మ్రొక్కే సందర్భం.
ఛందస్సు :: *మత్తకోకిల*
*అ* న్నమున్ దిన చిన్నబిడ్డల కల్లె *జాబిలిపాట* , నె
*న్న* న్నుతిం గనె, *జోలపాట* ననంగ నిద్దుర వచ్చు, నే
*మ* న్న *వేంకటనాథు కీర్తన లల్లి బాడిన* యన్నమ
*య్య* న్నచో *పదవైభవమ్మున కాద్యు డౌ నని మ్రొక్కెదన్.*
*కోట రాజశేఖర్ నెల్లూరు.*
శ్రీ ప్రభాకర శాస్త్రి గారికి హృదయపూర్వక ప్రణామములు
తొలగించండి*అ*మితమైన భక్తి నార్తి పెల్లుబుక,మ
రిప్లయితొలగించండి*న్న*నలనందె మీరు నయము మీర
*మ*ధుర భావ గాన మార్దవాంబుధిలో,న
*య్య*!సులభముగను తేలియాడినారు!
చివరి పాదంలో ను లేదు.
తొలగించండియ్య సులభముగ తేలియాడినారు అని ఉండాలి
అన్నమయ్యగీతమాలకించినను మి న్న ముదము కలుగును మ నసున కెపుడు మహిని జన్మనొందె మన్యుడౌ అన్నమ య్య హరిని భజియించ ననవరతము
రిప్లయితొలగించండిఅలతియలతిపదములలవోకగానుమి
రిప్లయితొలగించండిన్నయగురీతితోడనరచియించ
మనములుల్లసిలుచుమాధుర్యపురసమొ
య్యనమేనచిలికిహత్తుకొనియె
అన్నగ సప్తక విభు న
రిప్లయితొలగించండిన్నన్న దయామృతము గ్రోలి యానందముగన్
మన్నన లను గ్రన్నన న
య్యన్న కనియె నన్నమయ్య యాశ్చర్యముగన్
*అలివేలుమంగ వెంక*
రిప్లయితొలగించండి*న్నలకేళీలీలఁకీర్తనలఁనర హృచ్ఛీ*
*మల నించె నన్నమయ యు*
*య్యలలూగగభక్తితన్మయముతిరుమలలోన్*
*శ్రీమతి జి సందిత బెంగుళూరు*
అమ్మ జోల వోలె నమృతము కురియు,పు
రిప్లయితొలగించండిన్నమి నెలవెలుగువలె నందమిడుచు
మనసు తిరుమలేశు మాళిగౌ ,నన్నమ
య్య పదకవితల నిల నాలకింప !!!
అలకోనేటి విభుమది
రిప్లయితొలగించండిన్నలరింప న్నలతిపదము లద్దికవితలన్
మలచగ నాద్యుండతడ
య్య!లేరతని సాటి తెనుగు నైతిహ్యమునన్!
మొదటి పాదము
తొలగించండి"అలమేల్మంగ విభుమది" గా చదువ ప్రార్ధన!
అరయగ శ్రీనివాసు కథ నద్భుతరీతిని యెల్లవారు ము
రిప్లయితొలగించండిన్నరయనియట్లు వ్రాసి చరణమ్ముల కానుక జేసి గేయ తా
మరలను వెంకటేశునకు మాటికి నర్పణనిచ్చినట్టి న
య్యరుదగు నన్నమయ్య ప్రభకంజలులన్ ఘటియింతు భక్తితో
గురువు గారికి నమస్సులు.
రిప్లయితొలగించండిఅమితపు భక్తి రచనల
న్నమయను స్తుతిన్ సలిపెద నవిరళ ముదమున్.
మమతే పదంబు సరస
య్య మధుర కవితలు తిరమగు యవనీ తలమున్.
అన్న మయ్య యనుచు యడుగక భక్తి యు
రిప్లయితొలగించండిన్నతిగ కీర్తనల నoబి వో లె
మలచి వెంకటేశ!మది యందు మీరె న
య్య!భగవంత!యనెను అన్నమయ్య
*అ*మరుని జేయఁగ వెంక
రిప్లయితొలగించండి*న్న* మురిసి గళమెత్తి కీర్తనల బాడుచు సే
*మ* మొసఁగుదమన నలసిత
*య్య* ముక్తి నీయమని వేడ నక్కున జేర్చెన్
(అన్నమయ్య చిత్రములోని ముగింపు పతాక సన్నివేశం)
అన్నమయ్యకు సాటివచ్చెడి యన్యులెవ్వరు భూమి,న
రిప్లయితొలగించండిన్నన్న! యాతని భక్తి పాటలె యబ్బురమ్ముగ సాగుగా !
మన్ననల్గొనె పుష్కలమ్ముగ మాన్యులందరి నుండి,య
య్యన్నమయ్యయె ధన్యుడయ్యెగ యద్భుతమ్ముగ జూడగన్.
(గుర్రం జనార్దన రావు-మత్తకోకిల)
రిప్లయితొలగించండిఆ.వె:అలసినమనములకు హాయిని గూర్చు న
న్నమయ పాట ,వేదనలను మరచి
మహిని ముదము గూర్చు మంచిపాట వినవ
య్యసతము కరుణించు హరియు తాను.
అమృతోపమైన హరికీర్తనముల
న్నమయ తార చించె ననువు గనవి
మదికి హత్తు కొనగ మానుగా పాడన
య్యవి ముదమును కూర్చు ననవరతము.్
అదియె హరి నివాస మనుచు తా కూర్చె ము
న్నవని యందుముదముననల నాడు
మధుర ములగునటుల మానుగా నన్నమ
య్యజనులకవి యయ్యె నమృతములుగ.
అందమైన పాట లవనివ్రాయుచును మ
న్ననను పడసి ఖ్యాతి నందె గాదె
మరువక ప్రజ పాడ మదిమెచ్చ యన్నమ
య్యపదములిటు లెల్ల వ్యాప్త మయ్యె
అలతిపదములతోడ
న్నలనాడుపదముల నల్లె నపురూపముగా
మలగని దీపాలై య
య్యలమేలుపతి కనయమ్ము హర్షము గూర్చున్.
అడవి నేగి పాడి యద్భుత పద ఝరి
రిప్లయితొలగించండిన్ననవరతము రమణు నార్తి గొలిచి
మధుర కీర్తనలను మరువని రీతి ని
య్యవని కొసగె నెవ్వడననతండె
నిన్నటి సమస్యకు నా పూరణ
ఆక్రుతిలో నెటులున్నను
సక్రియ కర్మల జరుపని జారుండనుచున్
చక్రిని గని రుక్మిబలికె
శ్రీకృష్ణుని కంటె ఘనుఁడు శిశుపాలుండే
విరించివారు!
రిప్లయితొలగించండి3,4 పాదాలలో ప్రాస సవరించగలరు
20.11.17.అన్న-మయ్య యనుచునడుగక భక్తి-యు
రిప్లయితొలగించండిన్నతిగ కీర్తనలను నంబి వోలె
మలచి వేంకటేశ|మహిమాన్వితుండ వ
య్య|భగ వంతయనెను అన్నమయ్య|
అచ్చ తెనుఁగు పదము లాణిముత్యములుగ
రిప్లయితొలగించండిన్నన్నమయ్య కీర్తనలలరించ
మఱచె తన్ను తానె మహిలోన తిరుమల
య్య! కయి నందకమ్ము నందు దాక!!
అనయము వేంకట నాథు
రిప్లయితొలగించండిన్ననన్య భక్తిన్నుతించె నన్నమయ విభున్
మనుకువ సంకీర్తన తి
య్యని తేట తెలుగు పదముల నందరు మెచ్చన్
*అందవు కోసియిమ్ము విరులంచు* రహస్యపు కేళి తత్వ ము
రిప్లయితొలగించండి*న్నంద*గజేసెనన్నమయ యాతిరువేంకట నాథునిన్ మనో
*మంది*రమందు నిల్పి పదమాధురులందగ జేసె వేల న
*య్యంద*ము దెల్పగా తరమె యా హరికైనను పద్యమందునన్
తిరుక్కోవళ్ళూరు శ్రీహర్ష
రిప్లయితొలగించండిఅలరెన్నీ పద వైభవమ్ము బహుధా! ఆంధ్రావనిన్ తావు కొ
న్న లతాడోలల దేలు వేంకటరమానాధున్ సదాగొల్చు కో
మల మైనట్టి పదాల పాటలను, సామాన్యుల్లటన్నన్నమ
య్య లసక్తిన్ విరిసెన్ గదా యనుచు వయ్యాళించిరయ్యా భళా!
జిలేబి
అన్నమయ్యగీతమాలకించినను మి
రిప్లయితొలగించండిన్న ముదము కలుగును మ నసున కెపుడు
మహిని జన్మనొందె మన్యుడౌ అన్నమ
య్య హరిని భజియించ ననవరతము
మిత్రులందఱకు నమస్సులు!
రిప్లయితొలగించండి"అదివో యల్లదివో" యటంచు హరివాసాభ్యగ్రముం జేరి, క
న్న దయావార్నిధి సంతసింపఁ, బదముల్ నాణ్యంపు రాగమ్ముచే
మదికిన్ హాయియు సౌఖ్య మీయఁగను సంభావించి, కీర్తించి, య
య్యదియే జన్మ నివృత్తి కారకముగా నందించె నా యయ్యయే!!
అన్నము వలదనుచు హఠము చేయ వినుమ
రిప్లయితొలగించండిన్నహఠమేల యనుచు నాదరాన
మధుర గళము తోడ మాత తా నన్నమ
య్య పదమును పాడ హఠము వీడె.