3, నవంబర్ 2017, శుక్రవారం

సమస్య - 2509 (పలలమ్మును గోరి...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"పలలమ్మును గోరి చిలుక ఫలముల రోసెన్" 
ఈ సమస్యను సూచించిన పూసపాటి కృష్ణ సూర్యకుమార్ గారికి ధన్యవాదాలు.

112 కామెంట్‌లు:

 1. ఇలఁగల వల యీ దేహము;
  ఫలసారంబాత్మ యౌను పరికించి గనన్.
  వలలో చిక్కెను జీవుడు;
  పలలమ్ముల గోరి చిలుక ఫలముల రోసెన్!

  జీవుడు చిలుక, ఆత్మ ఫలము, మాంసము ఈ మాంసాత్మకమైన శరీరము. సచ్చిదానందమైన ఆత్మను వీడి, మాంసమయమైన శరీరము వెంటాడుతున్నాడు అని భావం.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు


  1. చాలా బావుందండి భరద్వాజ్ గారు

   జిలేబి

   తొలగించండి
  2. భరద్వాజ్ గారూ,
   మీ పూరణ అద్భుతంగా ఉంది. అభినందనలు.

   తొలగించండి
  3. సీతా దేవిగారు,
   జిలేబి గారు,
   శంకరయ్య గారు,
   మురళీకృష్ణ గారు,
   ధన్యవాదములు.

   తొలగించండి
 2. పలలము నమ్మెడు వాడొక
  పలువన్నెల రామచిలుక పంచన బెంచ
  న్నలవాటుసేయ నశనము
  పలలమ్మును గోరి చిలుక ఫలముల రోసెన్

  రిప్లయితొలగించండి
 3. అల కాకి వచ్చి వాలెను
  పలుకుల నెలనాగ రీతి పలుకును గాదే !
  పులకరమున నా రసనయె
  "పలలమ్మును గోరి ; చిలుక ; ఫలముల రోసెన్"
  ****}{}{****
  (పులకరము = జ్వరము)

  రిప్లయితొలగించండి
 4. ఇలలో వినుటకు వింతయె
  పలలమ్మును గోరి చిలుక ఫలముల రోసెన్
  కలనైనను విని నంతనె
  కలవర బడిశంస యించి కాదన వలయున్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అక్కయ్యా,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   "సంశయించి" అనండి.

   తొలగించండి
  2. ఇలలో వినుటకు వింతయె
   పలలమ్మును గోరి చిలుక ఫలముల రోసెన్
   కలనైనను విని నంతనె
   కలవర బడిసంశ యించి కాదన వలయున్

   తొలగించండి
 5. బలియుడు రాహులుఁ జేరెన్
  తెలగాణను దెచ్చినట్టి ధీరుండుండన్
  చెలియా! ఇదియెట్లన్నన్
  పలలమ్మును గోరి చిలుక ఫలముల రోసెన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ప్రభాకర శాస్త్రి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   రాహులును చేరిన బలియు డెవరు? రేవత్ రెడ్డియా? అటువంటప్పుడు "..ధీరుం డనుచున్" అంటే అన్వయం బాగుంటుంది.

   తొలగించండి
  2. సార్!

   మొదటి పాదంలోని "బలియుడు" మీరు ఊహించిన ఘనుడే. మరి రెండవ పాదంలోని "ధీరుడు" నాకు ప్రితతముడైన మన ముఖ్యమంత్రి. ఆ ధీరుడు లేకున్న కందానికి అందముండదు కదా!

   పైగా "పలలము”, "ఫలము" రెండూ వేర్వేరు కదా!


   జిలేబీ గారూ:

   క. చ. రా. జిందాబాద్! (దయ చేసి కలిపి చదవకండి... నాకు శ్రీ కృష్ణ జన్మస్థానం!!!)

   తొలగించండి
  3. వర్తమానాంశ ప్రస్తావన బాగుందండీ.. అభివందనములు..... మురళీకృష్ణ

   తొలగించండి
 6. బలిమిన్ బోయడు గూటన్
  మలమల మాడ్చుచు శుకమును మాంసము కడనే
  నిలిపెన్ నిరంతరంబున్;
  బలిలమ్మును గోరి చిలుక ఫలముల రోసెన్.

  రిప్లయితొలగించండి
 7. విలువగు మోక్షమును విడచి
  మలినంబగు కాయికసుఖ మాశించుటయే
  తలచగ కలియుగ ధర్మము
  పలలమ్మును గోరి చిలుక ఫలముల రోసెన్!

  రిప్లయితొలగించండి
 8. సెలవిచ్చె గురువు వ్రాయఁగఁ
  "పలలమ్మును రోసి చిలుక ఫలములఁ గోరెన్"
  జిలిపిగ శిష్యుఁడు వ్రాసెను
  "పలలమ్మును గోరి చిలుక ఫలముల రోసెన్"

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు

  1. ఆదురహో శిష్య పరమాణువు :)


   జిలేబి

   తొలగించండి
  2. ధన్యవాదాలు జిలేబీ గారూ,
   ఆ శిష్యుడు మీ క్లాస్‍మేటే అయి ఉంటాడు! లేక జి.పి. శాస్త్రి గారి వంటి 'బ్లాగ్‍మేట్'!

   తొలగించండి


  3. మొదటే నేను శిష్యుడి/రాలి పేరు జీపీయెస్సా జిలేబి యా అందా మనుకున్నా నండీ :) తర్వాత పరమానందయ్య కథ గుర్తుకొస్తేనూ ..... :)


   జేకే
   జిలేబి

   తొలగించండి
  4. విదూషకుడు, విదూషకి, లేని సదస్సునకు శోభేమున్నది?

   సార్!

   "విదూషకి" అన్న క్రొత్త పదం సృష్టించాను... ఒక వీర తాడు!!!

   "విదూషిక" వేరు...దాని అర్ధం "పొట్టి కాకర కాయ"

   తొలగించండి

  5. అందుకోండి కంద తాడు (తాడనం :) )


   విదూషకి ! క్రొత్త పదావిష్కరణ కు జేజేలు జీపీయెస్ వారికి :)


   ఓయి! విదూషకుడా ! గీ
   గీ ! యెలమిగ మీ "విదూషకి" నిఘంటువులో
   ఖాయమగు గాక క్రొత్తగ
   మై యెఱుగుదురిక స్వభావమై స్త్రీత్వంబై :)

   చీర్స్
   జిలేబి

   తొలగించండి


 9. పలువిధ రెస్టా రెంట్లను
  నలువిధముల చుట్టి మెక్డొనాల్డున మరిగెన్,
  వలలో చిక్కెను వెస్ట్రను
  పలలమ్మును గోరి చిలుక ఫలముల రోసెన్

  నేటి యువత :)
  జిలేబి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. జిలేబీ గారూ,
   అన్యదేశ్యాలను ప్రయోగించినా మీ పూరణ బాగున్నది.

   తొలగించండి
 10. డా.పిట్టా
  అల చక్కని ముక్కిడ హరి!
  పలలమ్మును గోరి చిలుక ఫలముల రోసెన్
  పలు లంచము లే.సి.బి.వల!(అవినీతి నిరోధక వ్యూహము A.C.B ride)
  బలమే2? యవినీతి బాయ వలసె నుపాధిన్!!(మాంసం తింటే బలమంటారు కదా,ఇది నిజమా?)

  రిప్లయితొలగించండి
 11. డా.పిట్టా
  జనవాణి:
  వలనే.సి.బి.బడె లంచపు
  పలలమ్మును గోరి చిలుక ఫలముల రోసెన్
  వెలగల యుపాధి యూడన్
  కలికికి సంతతికి దుఃఖ కారకుడయ్యెన్!

  రిప్లయితొలగించండి
 12. డా.పిట్టా
  బలమైనవి, విటమినులవి
  పలలమునన్ లభ్యమన్న ప్రథ సరి యనునా
  పలుగాకి మాట లసహజ
  పలలమ్మును గోరి చిలుక ఫలముల రోసెన్!

  రిప్లయితొలగించండి
 13. సరదాగా నేటి యువకులు కండలు గలవారిపై మోజు పెంచుకొనుట,వారిని జూచి వీరు నిత్యం మాంసం తిని ఆరోగ్యం పాడుజేసు కొన్న వారిపై

  శిలలను సున్నము జేసిన
  వలలుని తలపునను నిలపి పద పదమనుచున్
  వలలుని వలె దిన సాగెను
  పలలమ్మును గోరి చిలుక, ఫలముల రోసెన్!

  రిప్లయితొలగించండి
 14. డా.పిట్టా
  కలికాలమ్మిది శాస్త్ర శోధనలవే కావే వినీత శ్రుతుల్
  మలి జన్మంబెటులుండునో తినుమనన్ మాబాగుగా మాంస మి
  మ్ముల పుంసత్వ మొసంగు నంచనగనే మోసంబు పాలైరి యా
  పలలమ్మున్ వలచెన్ శుకంబు మరచెన్ ,బండ్లన్న రోసెన్ గదా!?

  రిప్లయితొలగించండి
 15. ఫలమును బోలు సతిని విడి
  వెలయాలి గృహమును జేర వెంగలి యొకఁడా
  ఖలునిఁగని ప్రజ వచించిరి
  “పలలమ్మును గోరి చిలుక ఫలముల రోసెన్”

  రిప్లయితొలగించండి
 16. ప ల ల ము ల నమ్ము చోటికి
  పలు మారు లు వచ్చి చేరి ప ల ల ము రుచి కి న్
  అలవాటై న ట్టీ దగు చు
  ప ల లమ్ములగోరి చిలుక ఫలము ల రో సె న్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. రాజేశ్వర రావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'రుచికి। న్నలవాటై (లేదా) పలలము దినగా। నలవాటై..." అనండి.

   తొలగించండి
 17. పిలిచెను తన సారంగుని
  పులకలతో మదనబాధ పొంగులువారన్
  కులకాంత వెర్రి తలపుల
  ఫలలమ్మునుఁగోరి చిలుక ఫలముల రోసేన్

  రిప్లయితొలగించండి
 18. క్రొవ్విడి వెంకట రాజారావు:

  కలిలమునమ్మెడి వాడట
  చిలుకను పెంచుచు సతతము శిక్షణమిడుచున్
  పొల తినుటజేసి నంతట
  పలలమ్మును గోరి చిలుక ఫలముల రోసెన్

  రిప్లయితొలగించండి
 19. మిత్రులందఱకు నమస్సులు!

  ఇలలో గృధ్ర మొకటి తప
  మలయక సేసియునుఁ బొందె హరియగు వరమున్;
  ఫలమొంది, నైజ ముడుగక,
  పలలమ్మునుఁ గోరి చిలుక ఫలముల రోసెన్!

  రిప్లయితొలగించండి
 20. తెలిసిన తెలుఁగును వలదని
  తెలియని పరభాష నెఱుఁగ తృళ్ళుదురకటా!
  కలియుగ ధర్మము చిత్రము.
  పలలమ్ములఁ గోరి చిలుక ఫలముల రోసెన్.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. చింతా వారూ,
   ఎన్నాళ్ళకెన్నాళ్ళకు నా బ్లాగును పావనం చేశారు! సంతోషం!
   చక్కని పోలికతో ప్రశస్తమైన పూరణ చెప్పారు. అభినందనలు.

   తొలగించండి
 21. కలియొక్క మహిమ జూడరె
  విలువలు వీడుచును ద్విజులు పిశితముఁ దినుచున్
  హలయును త్రాగుట నేర్చిరి
  పలలమ్మును గోరి చిలుక ఫలముల రోసెన్

  రిప్లయితొలగించండి
 22. మైలవరపు వారి పూరణలు:

  1)
  అర్జునుడు శ్రీకృష్ణునితో...

  బలవంతులు యదువీరులు
  గల పక్షము గోరె నిన్నుఁ గాదని , రారా..
  జిల ., కృష్ణ ! మేలు గాదే !
  పలలమ్మును గోరి చిలుక ఫలముల రోసెన్ !!

  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

  ***********
  2)

  లలిత మధురములగు తెలుగు
  పలుకుల గాదనుచు నాంగ్లభాషను నేర్వన్ !
  కలికాలము గాకేమిది ?
  పలలమ్మును గోరి చిలుక పండును రోసెన్ !!

  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అయ్యా! మైలవరపు మహాశయా!

   రిటైరయిన తరువాత ఈ పలలమును గోరు చిలుక (భవదీయుడు) 2700 బ్లాగులనూ, 7 చేపుస్తకములనూ (booklets) ప్రచురించినది....అన్నీ ఆంగ్లములోనే. ఇటీవలే కొరకరాని ఫలములును ఆస్వాదించుచున్నది...కందివారి వాత్సల్యముతో, మీ అభిమానముతో...

   🙏🙏🙏

   తొలగించండి
  2. మైలవరపు వారూ,
   మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.
   *****
   శాస్త్రి గారూ,
   అన్నిటికంటే ముఖ్యం మీ సంకల్పబలం, నిరంతరాభ్యాసం. మేము నిమిత్తమాత్రులం. స్వస్తి!

   తొలగించండి
 23. ఫలములు క్రిమిసంహారక
  విలయమ్మున జిక్కి రుచికివెగటుగ మారన్
  కలత వడి నీచు నయమని
  పలలమ్మును గోరి చిలుకఫలముల రోసెన్

  రిప్లయితొలగించండి
 24. విలువలను ద్రోసిరాజని
  ఖలులను గెలిపించు కొనుట !కలికాలమహో!
  కలనైనను ననుకుంటిమె?
  పలలమ్మును గోరి చిలుక ఫలముల రోసెన్.
  ***)()(***
  అలనాటి విలువ లేవీ?
  విలవల కాలము గతించి వేసట కలిగెన్
  ఖలులే యేలిక లగుటను
  పలలమ్మును గోరి చిలుక ఫలముల రోసెన్.
  *********

  రిప్లయితొలగించండి
 25. అలసి సొలసి వెఱచుచు భూ
  వలయమ్మునఁ దిరిగి తిరిగి పర్వతపున్దా
  పుల నరసి మెఱయ కనుపా
  పలలమ్మును, గోరి చిలుక ఫలముల రోసెన్

  [కనుపాపలు+అలమ్ము = కనుపాపలలమ్ము; అలము = శాక విశేషము, పిందె, పచ్చి కాయ; రోసెన్ = వెదకెను]

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కామేశ్వర రావు గారూ,
   విలక్షణమైన విరుపుతో పలలాన్ని అలముగా మార్చి చేసిన మీ పూరణ అద్భుతమూ, ఔత్సాహిక కవులకు మార్గదర్శకమూ. అభినందనలు.

   తొలగించండి
  2. పూజ్యులుశంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు.

   తొలగించండి
 26. క్రొవ్విడి వెంకట రాజారావు:

  కలియుగము ముదురు చుండెను
  యిలలో ప్రాణులు యిలువడి నెడలుచు వెఱగా
  మెలగుచు నుండుట కనగా
  పలలమ్మును గోరి చిలుక ఫలములు రోసెన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. రాజారావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'ముదురుచుండెను+ఇలలో, ప్రాణులు+ఇలు' అన్నపుడు యడాగమం రాదు. "చుండె। న్నిలలో ప్రాణులు నిలు విడి..." అందామా?

   తొలగించండి
 27. చెలికా డొకడు విదేశపు
  చిలుకలు పలలము తినునని చెప్పగ నంతన్
  బలిమిని కోరుచు నిప్పుడు
  "పలలమ్మును గోరి చిలుక ఫలముల రోసెన్"

  ( కొన్ని రకముల చిలుకలు పురుగుల్ని మరియు చిన్న జంతువుల్ని తింటాయి. గూగుల్ సమాచారం)

  రిప్లయితొలగించండి
 28. కుచేలుని భార్య కృష్ణుని వద్దకు వెళ్ళమని ఆంగ్లములో చెప్పు భావన (సరదాకు మాత్రమే)
  (క) నిషిద్ధము సుమా

  తేటగీతి
  మోరు చిల్ద్రను టూఅజ్జు ,వేరు వుయ్యి
  బేరు, నోమనీ , నో పుడ్డు, ప్లీజు గోటు
  ప్రెండు పాలెస్సు , డోంట్ఫీలు ,ప్లీజు టెల్లు
  అవరు పొజిషను,బ్రింగ్మనీ, హాప్లి అవరు
  ఫ్యామిలీ విల్లు ఎంజాయి, బ్యాడు డేసు
  విల్లు లాస్టు, ఒపినియను టెల్లు ప్లీజు

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. గురుదేవ నిన్నటి మరీ యొక పూరణ సరదాకు మాత్రమె సుమా క నిషిద్ధము

   తొలగించండి
  2. కృష్ణ సూర్యకుమార్ గారూ,
   సరదాగా మీరు వ్రాసిన ఆంగ్ల పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 29. చెలియగు గోర పలలమున్
  పొలుపుగ ప్రతిదినము దినుట పొరుగునె గనుచున్
  జ్వలనము గలుగగ మదిలో
  పలలమ్మున్ గోరి చిలుక ఫలముల రోసెన్!!!

  (పొరుగింటి పుల్లకూర రుచి -భావములో)

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. శైలజ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'చెలియగు' అన్నప్పుడు '..యగు'కు అన్వయం? అక్కడ "చెలియయె" అని ఉండాలనుకుంటాను.

   తొలగించండి
 30. ఇలపైన దొరుకు ఫలములు
  కలుషితమై జబ్బునిడును, గడుబలమునిడున్
  తిల గురుములు మహిలో, యని
  పలలమ్మును గోరి చిలుక ఫలముల రోసెన్

  పురుగు మందులవాడకము వలన పండ్లు మంచివి కాదని ( పలలము = నువ్వులపిండి)
  కోరెను చిలుక యని భావన


  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కృష్ణ సూర్యకుమార్ గారూ,
   అర్థాంతరంతో మీ పూరణ చక్కగా ఉంది. అభినందనలు.

   తొలగించండి
 31. వెల జూడ భ్రమసి నేతల
  వలలో పడినంత 'ఓటు ' పణమున కమ్మన్
  బలి పశువై జనె నోటరు!
  పలలమ్మును గోరి చిలుక ఫలముల రోసెన్!

  రిప్లయితొలగించండి
 32. కం.
  వలపుల పంచును ద్రోవది
  గెలిచిన రాజౌదవంచుఁ గృష్ణుడు పలుకన్
  దలఁచె సుయోధనుఁ గర్ణుడు!
  పలలమ్మును గోరి చిలుక ఫలముల రోసెన్.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సహదేవుడు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   "రాజౌదువంచు'.. టైపాటు!

   తొలగించండి
  2. గురుదేవులకు ధన్యవాదములు. సవరించిన పూరణ

   కం.
   వలపుల పంచును ద్రోవది
   గెలిచిన రాజౌదువంచుఁ గృష్ణుడు పలుకన్
   దలఁచె సుయోధనుఁ గర్ణుడు!
   పలలమ్మును గోరి చిలుక ఫలముల రోసెన్.

   తొలగించండి
 33. పలలపురుచినిన్మరిగిన
  చిలుకయదాఫలమునిరసించుటగనగన్
  బలలపురుచిబాగుండుట
  పలలమ్మునుగోరిచిలుకఫలములరోసెన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సుబ్బారావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   రెండవ పాదంలో గణదోషం. "ఫలముల నిరసించుట..." అనండి.

   తొలగించండి
 34. తెలివిగ శాస్త్రజ్ఞుండొక
  చిలుకను సృష్టించె|వింత జేకూర్చెడిదై
  నిలిచెను సంకర జాతిగ
  పలలమ్మును గోరి చిలుక ఫలముల రోసెన్|

  రిప్లయితొలగించండి
 35. గు రు మూ ర్తి ఆ చా రి
  ,,,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,,

  [ నా భార్యను ముద్దుగా " చిలుక " య౦దురు . ఆమెకు క్షయవ్యాధి సోకి దేహము
  కృశి౦చగా , వైద్యుని సలహానుసారము ,
  ధాన్యపదార్థముల తగ్గ౦చి మా౦స పదార్థములనే ఎక్కువగ కోరుకున్నది ]


  " చిలుక " యని య౦ద్రు నా ము

  ద్దులసతిని|కృశి౦చెను క్షయథువుచే | యొసగన్

  సలహా వైద్యు౦ , డ౦తట

  పలలమ్మునుగోరి " చిలుక " ఫలముల రోసెన్

  ి
  { సలహా = హి౦దీ పదప్రయోగము చేసి న౦దుకు

  క్షమి౦చాలి ; క్షయథువు = క్షయ రోగము

  ఫలము = ధాన్య పదార్థము }

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. గురుమూర్తి ఆచారి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   "క్షయథువుచే నొసగన్" అనండి.
   ఇది కేవలం సమస్యాపూరణ మయితే పరవాలేదు. నిజంగానే మీ సతీమణి క్షయ పీడితురాలైతే మీకు నా సానుభూతి!

   తొలగించండి
 36. గురువు గారికి నమస్సులు
  చిలుకుల కొల్కిన మగనిన్
  చెలిమిప్రవిమల పలుకులట చెప్పగ నిలనన్
  కలికాలమునయువకులే
  పలలమ్మును గోరి చిలుక ఫలమ్ములు రోసెన్

  రిప్లయితొలగించండి

 37. ఇలలో సింగము తిరుగును
  పలలమ్మును గోరి ,చిలుక ఫలముల రోసెన్
  ఫలముల వంటి పలుకులను
  గలగలనాడచు సతతము సంబర పడుచున్.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ఉమాదేవి గారూ,
   విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   వాట్సప్ సమూహంలో మీ పూరణ కనిపించడం లేదు ఎందుకో?

   తొలగించండి

  2. కంది వారు

   వాట్సప్ లో వచ్చే పూరణలన్ని
   వెబ్ లో లేక పోవటం వల్ల కాల గతిలో కలిసి పోతున్నాయేమో ?

   వాటిని కూడా వెబ్ లో ఈ బ్లాగులో గాని వేరైన బ్లాగు లో కాని చేరిస్తే రాబోయే తరానికి ఉపయోగంగా వుంటుందేమో ?


   జిలేబి

   తొలగించండి
  3. ఆ బాధతోనే మైలవరపు అవధాని గారి పూరణలను బ్లాగులో శాయశక్తులా నేను జోడిస్తున్నాను.

   👌👌👌

   తొలగించండి
 38. చిలుకల కొలికిస్టమ్మని
  వలపున ఇచ్చెను మగండు పలలపు విందున్
  ఫలములు జప్పగ తోచగ
  పలలమ్మును గోరి చిలుక ఫలముల రోసెన్
  ఫణీంద్రరావు కొనకళ్ళ

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ఫణీంద్ర రావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'కొలి కిష్టమ్మని'...టైపాటు. "వలపున నిచ్చెను" అనండి. పద్యం మధ్యలో అచ్చులు రాకుండా చూడండి.

   తొలగించండి
 39. *నెలకార్తీకమనుచుప*
  *త్నులుపవసించుచుగృహములనోమగనిష్టన్*
  *ఖలులనసమస్యనిచ్చిరి*
  *పలలమ్మును గోరి ! చిలుక ఫలముల రోసెన్!*

  *శ్రీమతి సందిత బెంగుళూరు*

  రిప్లయితొలగించండి
 40. విలువలు వీడిన జీవన
  ముల బెనగెడి కష్టములిక ముంగిట నిలువన్
  తలపోసినార లిట్టుల
  "పలలమ్మును గోరి చిలుక ఫలముల రోసెన్!"

  రిప్లయితొలగించండి
 41. కొలిచెడి దైవము తల్లిని
  పిలిచెద రటమమ్మీ నిజేసి వెంగము లాడన్
  తలచిన గుండెకు బరువై
  పలలమ్మును గోరి చిలుక ఫలముల రోసెన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అక్కయ్యా,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   రెండవ పాదంలో గణదోషం. "పిలిచెదరట మమ్మి జేసి..." అనండి.

   తొలగించండి
  2. కొలిచెడి దైవము తల్లిని
   పిలిచెద రటమమ్మి జేసి వెంగము లాడన్
   త్తలచిన గుండెకు బరువై
   పలలమ్మును గోరి చిలుక ఫలముల రోసెన్

   తొలగించండి
 42. వాట్సప్ సముదాయ సమస్యా పూరణ లో నన్ను కూడ సభ్యునిగా చేర్చు కోవలెనని ప్రార్థన. నా వాట్స్ ప్ నంబర్
  7981824948.
  నమస్కారాలు

  రిప్లయితొలగించండి
 43. ధన్యవాదాలన్నయ్యగారూ.ప్రయాణంలో వుండడంవల్ల పోస్ట్ చేసినా రాలేదు.దుబాయ్ లో నెట్వర్క్ అందడంవల్ల బ్లాగులో పోస్టయింది.వాట్సప్ లో కాలేదు.సురక్షితంగా బెంగళూరు చేరుకొన్నాను.

  రిప్లయితొలగించండి
 44. చిలుకల కొలికి యొకతె తన
  చెలిమరి పలలము,ఫలముల జేకొనమన;నా
  గుల చవితిన చోద్యముగా
  పలలమ్మును గోరి చిలుక ఫలముల రోసెన్.
  *******()()()******
  చెలిమరి = సఖి ; పలలము = నూవు పిండి.

  రిప్లయితొలగించండి
 45. డా.పిట్టా
  కలికాలమ్మిది శాస్త్ర శోధనలవే కావే వినీత శ్రుతుల్
  మలి జన్మంబెటులుండునో తినుమనన్ మాబాగుగా మాంస మి
  మ్ముల పుంసత్వ మొసంగు నంచనగనే మోసంబు పాలైరి యా
  పలలమ్మున్ వలచెన్ శుకంబు మరచెన్ ,బండ్లన్న రోసెన్ గదా!?

  రిప్లయితొలగించండి