ఈవారం సమస్య....
"అమృతము విషమయ్యెఁ జూడ నాశ్చర్యముగన్"
11-11-2017 (శనివారం) ఉదయం 7-30 గం.లకు ప్రసారమౌతుంది.
పూరణలను పంపవలసిన చిరునామాలు....
email :
padyamairhyd@gmail.com
Postal Address :
సమస్యాపూరణం,
c/o స్టేషన్ డైరెక్టర్,
ఆకాశవాణి,
సైఫాబాద్,
హైదరాబాద్ - 500 004.
ఈరోజు ప్రసారమైన కార్యక్రమంలో పూరణలు చేసిన వారిలో మన 'శంకరాభరణం' బ్లాగు, వాట్సప్ సమూహాలకు చెందిన కవిమిత్రులే ఎక్కువమంది ఉన్నారు. ఇది ఎంతో ఆనందాన్ని కలిగించింది.
రిప్లయితొలగించండిపూరణలు చేసిన కవిమిత్రులు......
మంద పీతాంబర్ గారు,
బండకాడి అంజయ్య గౌడ్ గారు,
శిష్ట్లా శర్మ గారు,
సందిత గారు,
బల్లూరి ఉమాదేవి గారు,
బి.వి.వి.హెచ్.బి. ప్రసాద రావు గారు,
గండూరి లక్ష్మినారాయణ గారు,
మాచవోలు శ్రీధర రావు గారు,
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారు,
నాగరాజు గారు,
జె.జె.కె. బాపూజీ గారు,
హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారు,
బుసిరాజు లక్ష్మీదేవి దేశాయి గారు,
నేదునూరి రాజేశ్వరి గారు,
ఎన్.వి.ఎన్. చారి గారు,
చేపూరి శ్రీరామారావు గారు
....................అందరికీ అభినందనలు.
👏👏👏👏👏
తొలగించండిdhanya vaadamulu
తొలగించండి
రిప్లయితొలగించండిజిలేబి వారి కలగూరగంప వైద్యము :)
అమృణాలము మేలనుచు
న్నమృతకము గలిపి జిలేబి నమ్మబలికెన
య్య!మృషమని తెలియ వచ్చె
న్నమృతము విషమయ్యెఁ జూడ నాశ్చర్యముగన్!
జిలేబి
అమృతము గళము జేరగ ?
రిప్లయితొలగించండిఅమృతము విష మయ్యె !జూడ నాశ్చర్య మగున్ !
అమృత కరుడు సైగల తో
అమృతతుడున్ జoపె రాహు యాదృచ్చికతన్ !
క్రమముగ పనుల ను జేయుచు
రిప్లయితొలగించండిసమయము లో ప ల ముగింప చక్కగ నుండు న్
సమయ విల oబము కాగా
అమృత ము విష మౌను జూడ నా శ్చ ర్యము గ న్
👌👌👌
తొలగించండిప్రాస బాగున్నది.
ధన్యవాదములు అన్నయ్యగారూ
రిప్లయితొలగించండిఅమృతసరుపట్టణంబున
రిప్లయితొలగించండినమృతమునుంబోలుపాలనార్యుండొకడు
న్నమృణాలంబునుముంచగ
నమృతమువిషమయ్యెజూడనాశ్చర్యముగన్
అమృతము దివిజుల కీయగ
రిప్లయితొలగించండినమృష్యులు దనుజులు పగను నాశము జేయ
న్నమృతము గరళము జేర్చిన
యమృతము విషమయ్యెఁ జూడ నాశ్చ ర్యముగన్
కవిమిత్రులకు మనవి...
రిప్లయితొలగించండిఆకాశవాణి సమస్యలకు పూరణలను ఇక్కడ ప్రకటించకుండా నేరుగా వారికే పంపించండి. అంతగా బ్లాగులో ఉండాలనుకుంటే ఆ కార్యక్రమం ప్రాసారమైన రోజున ఇక్కడ ప్రకటించండి.
ప్రాస మృ కు మ సరిపోవునా? నా సందేహము తీర్చుడు.
రిప్లయితొలగించండివందనములు
సరిపోతుంది.
తొలగించండిఅమరెను మధుమేహమిపుడు
రిప్లయితొలగించండికమకమ్మని రుచుల నొదిలి- కాలము గడుపన్ !!
శమియించని శాపమటుల
అమృతము విషమయ్యెఁ జూడ నాశ్చర్యముగన్!