సందర్భం :: *శుక్రాచార్యుని అసత్యోపదేశం* ఓ బలిచక్రవర్తీ! ఉన్న ధనాన్ని ఐదు భాగాలుగా చేసి ధర్మంకోసం, కీర్తికోసం, ధనవృద్ధికోసం, తన సుఖంకోసం, తనవారిని రక్షించేందుకోసం ఉపయోగించాలి. పూర్తిగా దానం చేస్తే నీవే మిగలవు. నీ ప్రాణరక్షణకోసం దానం ఇవ్వలేనని అబద్ధం చెప్పు అని రాక్షసగురువు శుక్రాచార్యుడు పలికే సందర్భం.
*బలి చక్రవర్తి!* యా భగవాను డీతడే విష్ణు వవ్యయుడు *త్రివిక్రముండు,* అదితి కశ్యపులకు నవతరించినవాడు *వామనమూర్తి* యై వచ్చినాడు, ఒక పాదమున భూమి, నొక పాదమున స్వర్గ మాక్రమించు, నిక నిన్నణచివేయు, ధర్మము, కీర్తియు, ధనవృద్ధి, తన సుఖ మును, స్వజనావన మనగ నైదు కలవు ధనమునకును గన ప్రయోజనములు కనుక నివ్వజాల ననుము, వినుము, ప్రాణ రక్షణమ్మె పరమ ధర్మం బని, *బొంకునట్టి వాఁడె పూజ్యుఁడగును.*
కవిమిత్రులారా! నమస్కృతులు. బొంబాయి నుండి నేరుగా వరంగల్... అక్కడి నుండి మానుకోట... మానుకోట నుండి నేరుగా హైదరాబాదులోని హోమ్ కు ఇప్పుడే చేరుకున్నాను. ఐదు రోజుల నిరంతర ప్రయాణం వల్ల స్వల్పంగా అలసట... రేపు ఉదయం నుండి గతంలో కంటె శ్రద్ధగా బ్లాగు నిర్వహణను కొనసాగిస్తాను. ఇన్ని రోజులు పూరణలు చేస్తూ, మిత్రుల పూరణలపై స్పందిస్తూ బ్లాగును ముందుకు నడిపించిన అందరికీ అభినందనలు, ధన్యవాదాలు.
భార్య తోడ, మరియు బాసుతోడ నెపుడు,
రిప్లయితొలగించండిశిస్తు గట్టునపుడు, శివుని తోడ,
శుక్రనీతి నెంచి వక్రబుద్ధి కలిగి
బొంకునట్టివాఁడె పూజ్యుఁ డగును
ధర్మ రక్షణముకు ధర్మజుండే బొంకె
రిప్లయితొలగించండిమహిత ధర్మ శాస్త్ర మర్మమెఱిగి
మాన వతుల ప్రాణ మానముల్ కాపాడ
బొంకునట్టివాడె పూజ్యుడగును
సత్య మనృతములవి సాపేక్షములె కాని
రిప్లయితొలగించండియెంచి చూడగ నిరపేక్ష మౌనె ?
ప్రాణ,మాన, ధర్మ పరిరక్షణ కొఱకు
"బొంకునట్టివాఁడె పూజ్యుఁ డగును"
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండికలియు గంబు జూడ కపటంపు నిలయమ్ము
రిప్లయితొలగించండిసత్య మనగ వెదుక సాధ్య పడదు
నిజము పలికి నంత నిష్టూర ములెగాన
బొంకు నట్టి వాఁడె పూజ్యు డగును
మీరు నేను చూచు మిథ్యాజగతి కర్త;
రిప్లయితొలగించండిసకల జనుల మదిన సణుగు వాడు;
లేనిది కల దంచు, లీలలు నావంచు
బొంకునట్టివాఁడె పూజ్యుఁడగును
(గిరీశం వెంకటేశంతో)
రిప్లయితొలగించండివెంకటేశ!వచ్చి వినవోయి నామాట;
విధవయువతి నెపుడు విడువబోకు;
కనులు మూసి కాల్చు గట్టిగా పొగచుట్ట;
బొంకునట్టివాడె పూజ్యుడగును.
రిప్లయితొలగించండిరంగుల బతుకాయె రావడి జేయుచు
వింగడముల జనుల విడువక, సయి,
బింకము విడువక గుబిరికను పన్నుచు
బొంకునట్టివాడె పూజ్యుడగును :)
శుభోదయం
జిలేబి
ధర్మ దూరులౌచు ధరణిని బాలించు
రిప్లయితొలగించండివార లుండునట్టి ప్రాంత మందు
చౌర్య కళకు సతము సన్మాన మందును
బొంకునట్టివాఁడె పూజ్యుఁ డగును.
మైలవరపు వారి పూరణ
రిప్లయితొలగించండిఅమ్మ ! మన్ను దినగ నాకొంటినో ? వెర్రి
నో? శిశువునొ ? నేను ! నోరు జూడు !
మమ్మ ! నమ్మకమ్మ ! యన్న మాటలటంచు
బొంకునట్టి వాడె పూజ్యుడగును !!
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
పిల్లల పండుగ ప్రత్యేకం! చాలకోమలంగా యున్నది!నమస్సులు!!
తొలగించండిడా.పిట్టా
రిప్లయితొలగించండిశాస్త్ర శోధకులెల్ల సత్యాలు బలుకంగ
వాని ఫలితమౌ నవనిని మెలగు
యంత్ర రాశి సౌఖ్య మంతయు దోచగ
బొంకు నట్టి వాడె పూజ్యు డగును
ఆంధ్ర తెలుగు నేల లట్లె పోరున నున్న
పెకల లేదు వాణి భేషు భేషు!
కల్ల బొల్లి గీత కలికల మొనగాడు
బొంకునట్టివాడె పూజ్యుడగును!
డా.పిట్టా
రిప్లయితొలగించండిబైరి గడ్డమేడ, పిల్లి గడ్డమె మిన్న
పిల్లి గడ్డమతని ప్రీతి కొరకు
ఒల్లు జాగ్రతకని యొక్కొక్క సమయాన
బొంకునట్టివాడె పూజ్యుడగును!
సత్యమనుచు జెప్పె సదరు కంచైలయ్య
కేది పరువు యతని కేది రక్ష?
ప్రాణ రక్షణముకు ప్రజల మధ్యన నుండ
బొంకునట్టివాడె పూజ్యుడగును.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండినిజము నిప్పు వలెను నిత్యమై భా సింప
రిప్లయితొలగించండికల్లకల యె యగుట కాంచనగు ను
శాశ్వత oబుకాదు సర్వ వేళ ల దె ట్లు
బొంకు నట్టి వాడె పూజ్యుడ గును
నాలుగో పాదము చివర ప్రశ్నార్థకం ఉండాలి
తొలగించండి_14/Nov/2017, హైదరాబాద్_
రిప్లయితొలగించండిఆ.వె.||
భువిన ధర్మమున్ కొరవడ, మనిషి పల్కి
'బొంకునట్టి వాడె పూజ్యుడగును'
అన్నమాట నిక్కమైనను, కలికాల
మహిమ తప్పునెట్లు, మంథనీశ!
_రేగళ్ళ శ్రీనివాస ప్రకాశ్_
వట్టిపోయియుండి నట్టి యావును జంపు
రిప్లయితొలగించండివానినుంచి గోవు పారిపోవ
గోవు రక్షజేయ గోప్యత పాటించి
బొంకునట్టివాఁడె పూజ్యుఁ డగును
సత్యయుగము నందు సత్యమేదైవము
రిప్లయితొలగించండిత్రేతయుగము పిదప తీరుమారె
కలియుగమ్ము నందు కపటమే గెల్చురా
బొంకునట్టీ వాడె పూజ్యుడగును!
గౌరవించబోను కన్నవారి, బుధుల
రిప్లయితొలగించండిధర్మ మింత నేను ధరణిసేయ
నాదిదేవు మదిని యసలు గొల్వననుచు
బొంకునట్టివాఁడె పూజ్యుఁ డగును.
కోట రాజశేఖర్ గారి పూరణ
రిప్లయితొలగించండిసందర్భం :: *శుక్రాచార్యుని అసత్యోపదేశం*
ఓ బలిచక్రవర్తీ! ఉన్న ధనాన్ని ఐదు భాగాలుగా చేసి ధర్మంకోసం, కీర్తికోసం, ధనవృద్ధికోసం, తన సుఖంకోసం, తనవారిని రక్షించేందుకోసం ఉపయోగించాలి. పూర్తిగా దానం చేస్తే నీవే మిగలవు. నీ ప్రాణరక్షణకోసం దానం ఇవ్వలేనని అబద్ధం చెప్పు అని రాక్షసగురువు శుక్రాచార్యుడు పలికే సందర్భం.
*బలి చక్రవర్తి!* యా భగవాను డీతడే
విష్ణు వవ్యయుడు *త్రివిక్రముండు,*
అదితి కశ్యపులకు నవతరించినవాడు
*వామనమూర్తి* యై వచ్చినాడు,
ఒక పాదమున భూమి, నొక పాదమున స్వర్గ
మాక్రమించు, నిక నిన్నణచివేయు,
ధర్మము, కీర్తియు, ధనవృద్ధి, తన సుఖ
మును, స్వజనావన మనగ నైదు
కలవు ధనమునకును గన ప్రయోజనములు
కనుక నివ్వజాల ననుము, వినుము,
ప్రాణ రక్షణమ్మె పరమ ధర్మం బని,
*బొంకునట్టి వాఁడె పూజ్యుఁడగును.*
*కోట రాజశేఖర్ నెల్లూరు.*
ప్రాణ హాని నెంచి పారిపోవుచు వచ్చి
రిప్లయితొలగించండియింట దూరు వాని కంటఁ జూచి
వెంబడించువాడు వివరమ్ములడిగినన్
బొంకునట్టివాఁడె పూజ్యుఁ డగును
మాయదారి కాలమరుదెంచెనక్కటా
రిప్లయితొలగించండిభాష రాని వాడె పాటగాడు
నక్షరములు రానియతడు ఘనాపాటి
బొంకునట్టివాఁడె పూజ్యుఁ డగును
రిప్లయితొలగించండికల్లమాటలెల్ల కమ్మగా నాడుచు
కొలువు కూర్తు నంచు కువలయాన
దేశ దిమ్మరట్లు తిరుగుచు సతతము
బొంకునట్టివాఁడె పూజ్యుఁ డగును"
వెలది విషయమందు విప్రవరుల యందు
మనువు సమయమందు మాన భంగ
మందు ననృత మాడ నఘము రాదత్తరి
బొంకునట్టివాఁడె పూజ్యుఁ డగును"
శుక్రనీతి యిదియు సక్రమముగ విను
౹మత్యవసర సమయ మందు గాని
సుదతులందు గాని సురభుల విషయమై
బొంకునట్టివాఁడె పూజ్యుఁ డగును".
అవసరార్థ మాడె నలనాడు ధర్మజు
డాజి యందు తాను ననృతమునట
ప్రాణరక్షణకని పలికెడు సమయాన
బొంకునట్టివాఁడె పూజ్యుఁ డగును.
ఊసులెన్నొనాడి యుర్విజనుల మెప్పు
బడసి నేతలింట పగలు రేయి
మాయమాటలాడి మంచి పదవులందు
బొంకునట్టివాఁడె పూజ్యుఁ డగును.
కల్లలాడు వారు ఘనులుగా మెరయుచు
గడుపుచుందు రెల్ల కాలమిలను
గడుసు దనము తోడ కాసుల నార్జించి
బొంకునట్టివాఁడె పూజ్యుఁ డగును.
మాయమాటలాడి మంత్రిపదవిఁ బొంది
రిప్లయితొలగించండిబొంకునట్టివాఁడె పూజ్యుఁ డగును
నిజముపల్కువాని ప్రజలు నమ్మకయున్న
మంచిరోజులింక కాంచుటెపుడొ?
ఇల నజాత శత్రువే రాజ రత్నము
రిప్లయితొలగించండికురు కుల శశి పాండు వర సుతుండు
ధర్మ తత్పరుండు ధర్మజుం డెఱుఁగఁ డే
బొంకునట్టివాఁడె పూజ్యుఁ డగును
పేరు సృష్టికర్త, పెనునగ్నిలింగము
రిప్లయితొలగించండిజాడ తెలియలేక జంకుతోను
మొగలిపువ్వు చేత ముసియాడ జేసెరా
బొంకునట్టి వాడె పూజ్యుడగును!
జింక బొంకుచేత జీవించె రాముడు|
రిప్లయితొలగించండిరావణాసురుండు రయముగాగ|
పూతనకడ కృష్ణ|పూరి చే హతమాయె|
బొంకునట్టి వాడె పూజ్యుడగును| {పూరి=చనుబాలు}
సుంకులేని పంట,మంకుమానెడిబిడ్డ
రిప్లయితొలగించండికంటబడగ వచ్చు|”కలియుగాన
రంకు,మంకు,జంకు,గొంకు గల్గధికారి
బొంకునట్టి వాడె పూజ్యుడగును”|{లేనివాడు లేనివాడే}
బొంకునట్టివాడెపూజ్యుడగునుసామి
రిప్లయితొలగించండియక్షరాల నిజమయతడెసుమ్ము
నోరుబెద్దచేసినోటినిండపొగరు
మాటలెన్నొపలుకుమంచిలేమి
ఒప్పిదమగు బొంకు నొరుల బ్రాణము గాయ!
రిప్లయితొలగించండిశాంతి కోరి యనిని సల్పు దారి
తప్పు కాని యటులె ధర్మరాజు వరుస
బొంకునట్టి వాడు పూజ్యు డగును
కవిమిత్రులారా!
రిప్లయితొలగించండినమస్కృతులు.
బొంబాయి నుండి నేరుగా వరంగల్... అక్కడి నుండి మానుకోట... మానుకోట నుండి నేరుగా హైదరాబాదులోని హోమ్ కు ఇప్పుడే చేరుకున్నాను. ఐదు రోజుల నిరంతర ప్రయాణం వల్ల స్వల్పంగా అలసట... రేపు ఉదయం నుండి గతంలో కంటె శ్రద్ధగా బ్లాగు నిర్వహణను కొనసాగిస్తాను.
ఇన్ని రోజులు పూరణలు చేస్తూ, మిత్రుల పూరణలపై స్పందిస్తూ బ్లాగును ముందుకు నడిపించిన అందరికీ అభినందనలు, ధన్యవాదాలు.
కాని పోని మూఢ కథలను జెప్పుచు
రిప్లయితొలగించండికడుపు నింపు కొనెడి కపట గురువు
సాదు జనుల నెల్ల సంప్రీతితోనమ్మ
బొంకునట్టివాఁడె పూజ్యుఁ డగును