7, నవంబర్ 2017, మంగళవారం

సమస్య - 2513 (సంపదలు కొల్లగొట్టెద...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"సంపదలు కొల్లగొట్టెద జనులు మెచ్చ"
(లేదా...)
"సంపదఁ గొల్లగొట్టెదఁ బ్రశస్తముగా జనులెల్ల మెచ్చఁగన్"
ఈ సమస్యను పంపిన ప్రసన్న కుమారాచారి గారికి ధన్యవాదాలు.

84 కామెంట్‌లు:

 1. మోడి ఉవాచ:

  వేన వేల లక్షల నోట్ల వెంటబడుచు
  రద్దుజేసి శాశ్వతముగ ముద్దుగాను
  చల్లగ వెనుకవేసిన నల్లనైన
  సంపదలు కొల్లగొట్టెద జనులు మెచ్చ

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ప్రభాకర శాస్త్రి గారూ,
   మోడీ గారి మాటగా మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి


 2. కంపనమొనర్చ జనవాళి, కంద పద్య
  సొంపులనునేర్చి, కవివర సొబగు గాను
  యింపగు జిలేబులందించి యిచ్చట గల
  సంపదలు కొల్లగొట్టెద జనులు మెచ్చ!

  జిలేబి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. జిలేబీ గారూ,
   అభినందనల సంపదలనా కొల్లగొట్టింది? బాగుంది మీ పూరణ. అభినందనలు.
   'జనవాళి'...?

   తొలగించండి
  2. కంపన మొనర్చగ జనాళి... అని ఉండాలనుకుంటాను.

   తొలగించండి
 3. కవులు పండితులును గొప్ప కవిత లల్లి
  వాటికి మనల జేసిరి వారసులను
  విరివి కవనముల జదివి విలువ గలుగు
  సంపదలు కొల్లగొట్టెద జనులు మెచ్చ.

  రిప్లయితొలగించండి
 4. సంపదలు కొల్లగొట్టెద జనులు మెచ్చ
  ఏమి మిగిలెను దోచగ భూమి పైన
  తొల్లి దేవా లయమ్ములు దోచు కొనిరి
  గ్రంధ రాజము లన్నిటి కాల బెట్టె
  విలువ గలవజ్ర ముల్గొనె వేయి విధుల
  రోసి జనులంత సొలయించి మోస పోయె

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అక్కయ్యా,
   బాగుంది మీ పూరణ. అభినందనలు.
   "జనులు మెచ్చ। రేమి మిగిలెను...కాలబెట్టి... మోసపోగ" అంటే బాగుంటుందేమో?

   తొలగించండి
  2. సంపదలు కొల్లగొట్టెద జనులు మెచ్చ
   రేమి మిగిలెను దోచగ భూమి పైన
   తొల్లి దేవా లయమ్ములు దోచు కొనిరి
   గ్రంధ రాజము లన్నిటి కాల బెట్టి
   విలువ గలవజ్ర ముల్గొనె వేయి విధుల
   రోసి జనులంత సొలయించి మోస పోగ

   తొలగించండి
 5. (అల్లూరి సీతారామరాజు మల్లుదొర గంటందొరలతో)
  పరమదుర్మార్గగాములై భరతదేశ
  భూముల గబళించెడి యాంగ్లభూతములను
  పారదరిమెద;వారల మందుగుండు
  సంపదలు కొల్లగొట్టెద జనులు మెచ్చ.

  రిప్లయితొలగించండి
 6. నక్సలైటు యొకడు రాత్రి నడచి పోతు
  పక్కనున్నట్టి మిత్రుతో పలికె నిటుల
  "శ్రామికులఁదోచి పీడించు షావుకార్ల
  సంపదలు కొల్లగొట్టెద జనులు మెచ్చ"

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. భరద్వాజ్ గారూ,
   నక్సలైటు మాటగా మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'నక్సలైటు+ఒకడు' అన్నపుడు సంధి నిత్యం. యడాగమం రాదు.

   తొలగించండి


 7. ఇంపగు పల్కు లెల్ల గని యిచ్చటి పద్యపు కైపు పోడిమల్
  సొంపుల నేర్చి పాదముల సోగుల గాంచుచు వారి పద్ధతిన్
  మంపుగొనంగ జూచి మజ మత్తిలి ముంగటి కైపదావళీ
  సంపదఁ గొల్లగొట్టెదఁ బ్రశస్తముగా జనులెల్ల మెచ్చఁగన్

  జిలేబి

  రిప్లయితొలగించండి
 8. డా.పిట్టా
  సంపదలు కొల్లగొట్టెద జనులు మెచ్చ
  నందరికి బంచి పెట్టెద ననిన మోది
  నోట్ల రద్దు కష్టాల ననూహ్యగతిని
  బంచె పోయెను గొంగళి పరగ దొంగ
  దొరుకనే లేదు శిక్షలు దొర్లలేదు
  శిక్ష బడునేమొ నతని కెలక్షనులను?

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. డా. పిట్టా వారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'శిక్ష బడునేమొ యతని...' అనండి.

   తొలగించండి
 9. నాటి యాంగ్లేయ మనముల న్నాటుకొన్న
  భావ మొక్కటియే గదా భారతమున
  నౌర! సర్వత్ర లభియించు నతులితమగు
  సంపదలు, కొల్లగొట్టెద జనులు మెచ్చ

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. వేంకట సత్యనారాయణ మూర్తి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 10. డా.పిట్టా
  కొంపలు గూల్చి యా ధనిక కూటమినే తగ మట్టువెట్టి వే
  రంపపు కోతలన్ మనిపి, *రష్య*యె సజ్జన మార్గగామి గాన్
  దంపుడు యూకయే మిగిలె దవ్వుల దేశములట్టి సంద్రపున్
  ముంపుల గ్రాలరే యొకని*మోచెయి నీటిని త్రాగ* క్షేమమే?
  లంపటు ద్రోహమే సరి విలక్షణ లక్ష్యము గాగ ,యిట్లనన్
  *సంపద గొల్లగొట్టెద బ్రశస్తముగా జనులెల్ల మెచ్చగన్*

  రిప్లయితొలగించండి
 11. మైలవరపు వారి పూరణలు:

  శ్రీ వేంకటేశ్వరాయ నమః

  లచ్చి! నీ యండఁగొని జనుల్ స్వార్థబుద్ధిఁ
  గల్గి పెడదారిఁ జనకుండఁ గాపుఁగాయ
  నిలువుదోపిడీ పేరిట నేనె యడిగి
  సంపదలు కొల్లగొట్టెద జనులు మెచ్చ !!

  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

  ఇంపుగ నింటిలోన లభియింపవె పాలును వెన్న ? కన్న ! యీ...
  తెంపరి కార్యమేల ? యన దెల్పె యశోదకు నల్లనయ్య ! పా...
  లింపగ , వారు బ్రీతియని యెంచెడు వల్వలు , పాలు , వెన్నలన్
  సంపదఁ గొల్లగొట్టెదఁ బ్రశస్తముగా జనులెల్ల మెచ్చఁగన్ !

  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మైలవరపు వారూ,
   మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.

   తొలగించండి
 12. కోట రాజశేఖర్ గారి పూరణ:

  సందర్భం :: మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి విజయఘోష
  *మన్ కీ బాత్*


  ఇంపుగ *మోది* యిట్లనె:
  ‘’వచించిన రీతుల స్వచ్ఛ భావమున్
  నింపగ బూని, స్వచ్ఛతను నిల్పితి భారత దేశమందు. ధ్యా
  నింపగ బూని, విశ్వమున నిల్పితి ధ్యానము. భారతాంబ రా
  ణింపగ బూని, దూరముగ నెట్టితి నల్లధనమ్ము. నంతటన్
  సొంపుగ నేకరీతిగను చూపితి పన్నుల మార్గమున్. *యశ
  స్సంపద కొల్లగొట్టెద, బ్రశస్తముగా జనులెల్ల మెచ్చగన్.*


  కోట రాజశేఖర్ నెల్లూరు.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. రాజశేఖర్ గారూ,
   కీర్తి సంపదను కొల్లగొడతానన్న ప్రధాని మాటతో మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.

   తొలగించండి
 13. పెంపొనరింప హైందవము వీర శివాజి పరాక్రమంబునన్
  జంపి మహమ్మదీయ పుర సైన్యము నెల్ల మనోభిలాషతన్
  సొంపుగ బల్కె సాయుధులు జూచుచు నుండగ వైరరాజ్యపుం
  సంపదఁ గొల్లగొట్టెదఁ బ్రశస్తముగా జనులెల్ల మెచ్చఁగన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ఫణికుమార్ గారూ,
   శివాజీ ప్రస్తావనతో మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.

   తొలగించండి
  2. వైర రాజ్యపు సంపద లో ను గాగమమునకు తావులేదని నా భావన. సమాసమునఁ బరుష సరళములు పరమగు నపుడే పుం పు లకు ను గాగమ మగును.

   తొలగించండి
  3. గురువుగారూ నమస్సులు. ధన్యవాదములు.
   పూజ్యులు కామేశ్వరరావు గారికి వందనములు. వైరరాజ్య భూ సంపదఁ అంటే బాగుంటుందేమో పరిశీలించ మనవి. ధన్యవాదములు.

   తొలగించండి
  4. పూజ్యులు కామేశ్వరరావు గారికి నమస్సులు. ధన్యవాదములు.

   తొలగించండి
 14. తల్లిదండ్రికి నాప్యాయతలను పంచి
  అన్నదమ్ముల ననురాగ యాస్తి గోరి
  బంధు వర్గపు ప్రేమల భవ్య నిధుల
  సంపదలు కొల్లగొట్టెద జనులు మెచ్చ

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. శ్రీరామ్ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'అనురాగ యాస్తి' దుష్టసమాసం. "అనురాగ మాత్మ గోరి" అనండి.

   తొలగించండి
 15. ఘోర కృత్యము సేసిన గొప్ప వారల
  మనియు డంబము పలికిన పరమ హంస
  ను దలప కపట సన్యాసి తుచ్ఛ నీచ
  సంపదలు కొల్లగొట్టెద జనులు మెచ్చ.
  వందనములు

  రిప్లయితొలగించండి
 16. రిప్లయిలు
  1. వెంకట నారాయణ రావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   "గొప్పవార। మనియు..." అనండి. మూడవ పాదంలో యతి తప్పింది. "పరమహంసఁ। దలప కపట సన్యాసుల దంభ నీచ..." అనవచ్చు.

   తొలగించండి
 17. ప్రజల ధనము ల దో చె డు వంచకు లను
  పట్టుకొని యును శిక్షింప ప్రతిన జేసి
  సంపద లు కొల్ల గొట్టే ద జనులు మెచ్చ
  న నె డు అధికారి నెల్ల రు నాద రింత్రు

  రిప్లయితొలగించండి
 18. ఒక వీర జవాను పలుకులు :

  ఉగ్రవాదము పేరిట నుద్యమించి
  జనుల హననముజేయుట జన్నమనుచు
  జెలగు ముష్కరమూకల చేతి శస్త్ర
  సంపదలు కొల్లగొట్టెద జనులుమెచ్చ

  రిప్లయితొలగించండి
 19. శల్యుని ఆలోచన :

  దుష్టసహవాసము వలన ధూర్తుడయ్యె
  భాను పుత్రుడయ్యు ధరణి భారమయ్యె
  కరకు మాటలచేతను కర్ణుసత్వ
  సంపదలు కొల్లగొట్టెద జనులుమెచ్చ

  రిప్లయితొలగించండి


 20. సంపదఁ గొల్లగొట్టెదఁ బ్రశస్తముగా జనులెల్ల మెచ్చఁగన్
  నింపెద నూత్న రీతిగన నీ యమరావతి! మాన్యతన్ గనన్
  పంపెద మిమ్ము సింహపురి పట్నము మీరహహోయనన్ భళీ
  యింపగు నాప్రణాలికలు యిమ్ముగ యాంధ్రులకౌ జిలేబులై!


  జిలేబి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. జిలేబీ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   '...యిమ్ముగ నాంధ్రులకౌ' అనండి.

   తొలగించండి
 21. గుర్తు తెలియని యొక దుండగుం డట తిరు
  గాడె నాత్రముగను రాత్రి వాఁడు సూడ
  సంపదలు కొల్ల, గొట్టెద జనులు మెచ్చ
  వానిఁ బట్టి కక్కించెద నేను వేగ


  చంపిరి దేశ పౌరులను శౌర్య విహీనులు క్రూరులై విదే
  శంపు టయోగ్య సైనికులు శాత్రవ సింహము హిందు దేశపుం
  బంపున నేగి సత్వరము పన్నుగ గర్వము నెల్లఁ, గాచుచున్
  సంపదఁ, గొల్లగొట్టెదఁ బ్రశస్తముగా జనులెల్ల మెచ్చఁగన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కామేశ్వర రావు గారూ,
   మీ రెండు పూరణలు ఉత్తమంగా ఉన్నవి. అభినందనలు.

   తొలగించండి
  2. పూజ్యులుశంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు.

   తొలగించండి
 22. పెంపు వహింప భాషకును బ్రీతిగ సేవలు జేయువారి నా
  ణెంపు విమర్శలన్ మిగుల నేర్పుగ పుక్కిట బట్టి గీతముల్
  చంపకమాలలాది పలు ఛందవిరాజిత పద్య సాహితీ
  సంపద కొల్ల గొట్టెద ప్రశస్తముగా జనులెల్ల మెచ్చగన్

  ప్రత్యుత్తరంతొలగించు

  వీటూరి భాస్కరమ్మనవంబర్ 07, 2017 11:40 AM
  అరయ పరిశోధనలు జేసినరులువొగడ
  నద్భుతావిష్కరణమ్ములందుకొనుచు
  శాస్త్రవేత్తగ సైన్సున సాగి సృజన
  సంపదల కొల్లగొట్టెద జనులు మె

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. భాస్కరమ్మ గారూ,
   మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
   రెండవ పూరణ రెండవ పాదంలో గణదోషం. "..నద్భుతావిష్కరణముల నందుకొనుచు" అనండి.

   తొలగించండి
 23. వచ్చే ఎన్నికలలో నన్ను గెలిపించిన నే అవినీతిని పార ద్రోలుదునని
  కొందరు ప్రతిపక్ల్ష నేతల మనో భావన


  దేశమందు తరిగెనీతి దేవుని గుడి
  దోచు దొంగలు కొందరు దుర్గతులను
  దోచు చుండునింకొందరు దుష్ట యసుర
  సంపదలు కొల్లగొట్టెద జనులు మెచ్చ"

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కృష్ణ సూర్యకుమార్ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'దుష్ట+అసుర = దుష్టాసుర' అవుతుంది. అక్కడ "దుష్ట దనుజ.." అనండి.

   తొలగించండి
 24. ప్రజలపొలములు కాజేసి వంచనమున
  నీతి బాహ్యపు పనులతో నేతలిపుడు
  కూడబెట్టిరి కోటానుకోట్లు, వారి
  సంపదలు కొల్లగొట్టెద జనులు మెచ్చ

  రిప్లయితొలగించండి
 25. సంపదగొల్లగొట్టెదజనులుమెచ్చ
  కొల్లగొట్టుట సరికాదు కొల్లగొట్ట
  జనులుమెచ్చుట యనునదిసరియకాదు
  రక్షజేయుటమనకుశ్రీరామరక్ష

  రిప్లయితొలగించండి
 26. ఉః సంపదగూర్చి రైతులకు, చక్కని శీతల మందిరమ్ములన్
  సొంపొనరింతునంచు కడు సోదిని జెప్పి పొలమ్ముగుంజి నే
  డంపిరి కూలివారిగను, హర్తలు దొంగిలి నట్టిదౌ ప్రజా
  సంపదఁ గొల్లగొట్టెదఁ బ్రశస్తముగా జనులెల్ల మెచ్చఁగన్
  కంపునొసంగునీప్రభుత కాంచుపరాజయమున్ దృఢమ్ముగా

  రిప్లయితొలగించండి
 27. స్థానిక కలెక్టరనియె విశాఖ పురిని
  యక్రమముగా ప్రభుత్వపు యవనిని గొని
  తమదిగా విక్రయించుచు దాచినట్టు
  సంపదలు కొల్లగొట్టెద జనులు మెచ్చ

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కృష్ణారావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు
   "పురిని। నక్రమముగా ప్రభుత్వపు టవనిని.. దాచినట్టి" అనండి.

   తొలగించండి
 28. తరుగని నిధియౌగద|శమంతక మణులగు
  రాజ కీయంబు|నాయకుల్ వ్రాతలన్ని
  సంపదలుకొల్లగొట్టెద జనులుమెచ్చ
  మాటమూటలె “జనులకు కోటినిధులు”
  2.ఎంపిక లైన నాయకు లొకింతయుబంచిన సొమ్మువిత్తగా?
  నింపును నిత్య సౌఖ్యములు| నిందలు వందలువచ్చి జేరినా?
  సంపద లూరుచుండు గద|సర్వులు బంచెడి లంచ వంచనాల్
  సంపద కొల్లగొట్టెద బ్రశస్తముగా జనులెల్ల మెచ్చగన్|


  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ఈశ్వరప్ప గారూ,
   మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
   'లంచ వంచనాల్' అనడం దోషమే.

   తొలగించండి
 29. క్రొవ్విడి వెంకట రాజారావు:

  తీరు తెన్నులు లేకుండ తిరము కాని
  పవిది గమనమెంచుచు నుండి వచరుడౌచు
  నేగు శిష్యునాతని మార్చి నీచ భావ
  సంపదలు కొల్లగొట్టెద జనులు మెచ్చ

  రిప్లయితొలగించండి
 30. సంపదగొల్లగొట్టెబ్రశస్తముగాజనులెల్లమెచ్చగ
  న్నింపుగలేదుగావినగనీయదిచెప్పుమ!నీవయిప్పుడున్
  సంపదగొల్లగొట్టునెడసంతులుమెచ్చరునిక్కమేసుమా
  పెంపునుగానకేజనులుమెచ్చుటవారలబుధ్ధిహీనతే

  రిప్లయితొలగించండి
 31. "స్వార్ధపరులెల్లరు విదేశ బ్యాంకు ల౦దు
  పన్ను లెగ వైచి దాచిన వక్ర ధనము,
  సంపదల గొల్ల గొట్టెద జనులు మెచ్చ"
  యనుచుఘోషించు భాషణమ్మున ప్రధాని

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. తిమ్మాజీ రావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు
   'మెచ్చ। ననుచు...' అనండి.

   తొలగించండి 32. ఉత్తమగురువు చెంగట నుత్సుకతను

  బూని నేర్చుచు విద్యను పుడమి యందు

  ననవరతము నేనట నుండి యాచదువను

  సంపదలు కొల్లగొట్టెద జనులు మెచ్చ.

  రిప్లయితొలగించండి
 33. ఇంపుగ నిన్ను నన్ను నిటు లేకము చేసిరి పెద్దలందరున్
  సొంపగు పెండ్లి వేదికను సుందరి! నా కర మంది రాగదే
  కెంపుల మోవి పైన చిలికించుచు వెన్నెల నీదు హార్దమౌ
  సంపదఁ గొల్లగొట్టెదఁ బ్రశస్తముగా జనులెల్ల మెచ్చఁగన్.

  రిప్లయితొలగించండి
 34. సొంపగురీతిగన్ జనుల సొమ్మును గోరక వత్సరమ్ము గ
  న్నింపుగ నేర్పి నేడు కొను మిప్పుడు మా చరవాణి పైకము
  న్నంపుదు మూడువత్సరము లావల సేవలు నంద బల్కుచున్
  సంపదఁ గొల్లగొట్టెదఁ బ్రశస్తముగా జనులెల్ల మెచ్చఁగన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సహదేవుడు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   (ఆ జియో ఫోన్ నేనూ తీసుకున్నాను. అందులో రేడియో వినడం తప్ప ఇప్పటిదాకా మరేవిధంగా వినియోగించుకొలేదు!)

   తొలగించండి
 35. నా “శ్రీమదాంధ్ర సుందర కాండ” అష్టత్రింశ సర్గమున నేటి పద్యములలో నొకటి.

  కంటి నిను భాగ్య వశమునఁ
  గంటఁ దడి నిడ సమయమ్ము కా దిది సుమ్మీ
  తొంటి వెతల కంతము తెలి
  గంటి కనియెద వచిరమ్ము కమనీయముగన్


  మూలము:
  కథఞ్చిద్భవతీ దృష్టా న కాలః పరిదేవితుమ్.
  ఇమం ముహూర్తం దుఃఖానాం ద్రక్ష్యస్యన్తమనిన్దితే ৷৷5.38.51৷৷

  రిప్లయితొలగించండి
 36. జనులు చరవాణి చెరలోన తనరు నటుల 
  వత్సరమ్ము నుచితముగ పంచి నేడు
  సిరిని తిరిగిత్తు ననిజెప్పి సెల్లులమ్మి
  సంపదలు కొల్లగొట్టెద జనులు మెచ్చ 

  రిప్లయితొలగించండి
 37. "చింపెద పాత నోటులను చిందర వందర జేయబూనితిన్
  గంపలతోడ నీ పగడి కాసుల రాసి వసూలు జేసి నిన్
  పంపెద జైలుకున్ వడిగ, పన్నుగ నల్లని రంగుదైన నీ
  సంపదఁ గొల్లగొట్టెదఁ బ్రశస్తముగా జనులెల్ల మెచ్చఁగన్"

  ...నరేంద్ర మోడి

  రిప్లయితొలగించండి
 38. పంపితి నిన్ను నింటికిని పన్నుగ గెల్వగ మూడు రాష్ట్రముల్
  నింపితి వీవు సంచులను నీరవ మోడివి రాళ్ళతోడ నీ
  సంపదఁ గొల్లగొట్టెదఁ బ్రశస్తముగా జనులెల్ల మెచ్చఁగన్...
  డింపుల బుగ్గలోడినిర టెంపరు మీరెను పెక్కు "భంగు"లన్!

  రిప్లయితొలగించండి