25, నవంబర్ 2017, శనివారం

సమస్య - 2529 (అవధానముఁ జేయువాఁడె...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
"అవధానముఁ జేయువాఁడె యతిమూర్ఖుఁ డగున్"
(లేదా...)
"అవధానమ్మునుఁ జేయునట్టి కవి మూర్ఖాగ్రేసరుండౌ జుమీ"

49 కామెంట్‌లు:

  1. చవిగొను కౌగిలి యందున్
    కవి సమ్మేళనమునందు కలహమునందున్
    నవయుగ రణగొణ చరవా
    ణ్యవధానముఁ జేయువాఁడె యతిమూర్ఖుఁ డగున్

    రిప్లయితొలగించండి
  2. వ్యవధానము విపరీతము;
    నవనవమేధారహితము;నాజూకుదనం
    బవదీర్ణ;మధోదృక్కుల
    నవధానము జేయువాడె యతిమూర్ఖు డగున్.

    రిప్లయితొలగించండి
  3. కవిపండితు లలరించు
    న్నవధానము జేయువాడె,యతిమూర్ఖుడగున్
    చవిగొననేరని విముఖుడు
    కవితాంగన సౌకుమార్య కౌగిలిసుఖమున్

    రిప్లయితొలగించండి
  4. చెవులకు విందగు కావ్యము
    నవనీతపు సౌరు లందు నాణ్యత దెలుప
    న్నవనిని వేరెవ రనుచును
    అవధానముఁ జేయువాఁడె యతి మూర్ఖుఁ డగున్

    రిప్లయితొలగించండి
  5. కవితామార్గముఁ బట్టి కానుకలకై కవ్వించు భోగమ్ముకై,
    శివలీలాగత పాండితీప్రభను భస్మీభూత పన్నీరుగా
    నవనీనాథుల కీర్తి గానమునకై నాశిల్లి, భాసిల్లు నే
    యవధానమ్మునుఁ జేయునట్టి కవి మూర్ఖాగ్రేసరుండౌ జుమీ!

    రిప్లయితొలగించండి
  6. అవగుణముల వ్యసనంబుల
    నవినీతిని బెంచునట్టి యాచారములం
    దవిరళమగు యత్నంబున
    నవధానముఁ జేయువాఁడె యతిమూర్ఖుఁ డగున్.

    రిప్లయితొలగించండి
  7. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి


  8. హ!వలసిన వసతులను చే
    య వలసిన పనులను విడిచి యన్యుల కొరకై
    కవనము లన్గట్టుచు సయి
    యవధానముఁ జేయువాఁడె యతిమూర్ఖుఁ డగున్!

    జిలేబి

    రిప్లయితొలగించండి
  9. మైలవరపు వారి పూరణ


    వివిధాంశమ్ముల నిష్ప్రయోజనముగా విశ్లేషణన్ జేసి , హైం...
    దవ ధర్మమ్మున మాటిమాటికిని నిందారోపణన్ జేసి , మా..
    నవతావాదినటంచు స్వీయ వచనానందమ్మునన్ దేలువా..
    డవధానమ్మునుఁ జేయునట్టి కవి మూర్ఖాగ్రేసరుండౌ జుమీ !!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
  10. డా.పిట్టా
    కవనము జనహితమవవలె
    బవరముగా మారి బుధుల బారిన బడగన్
    చివరకు మిగులునె కావ్యము?
    అవధానము జేయువాడె యతి,మూర్ఖుడగున్

    రిప్లయితొలగించండి



  11. కవనమ్మే మన వారసత్వముగదా, గంగాప్రవాహమ్ముగన్
    పవనాశ్వమ్ముల పైన నెల్లరి నటన్ ప్రాంగమ్ము లో పారవ
    శ్య విహారమ్ముల దేల్చి, కాలము యదృశ్యమ్మై జగత్సాక్షిగన్
    యవధానమ్మునుఁ జేయునట్టి కవి మూర్ఖాగ్రేసరుండౌ జుమీ?



    జిలేబి

    రిప్లయితొలగించండి
  12. డా.పిట్టా
    వ్యవధానమ్ములు నాటు పోటు లుదధిన్ యాహాహ!యోహో!!యనన్
    కవనమ్మో సరి మార్పు సంఘమున రా గాంక్షించు శ్రేయంబుకై
    బవరమ్మందున దేల్చివేయు జయమున్ బ్రశ్నల్ సమాధానముల్
    వివరించన్నొక యాటగా వెలయనుర్విన్నొచ్చి మెప్పించుటౌ
    అవధానమ్మును జేయునట్టి కవి మూర్ఖాగ్రేసరుండౌ జుమీ!

    రిప్లయితొలగించండి
  13. కవి చాతుర్యము మె చ్చక
    నవి వేకపు వాని వోలె నటుని టు గనుచు న్
    కవిత ల చవి చూడ క న
    న్యవ ధా నము చేయు వాడె న తి మూర్ఖుడ గు న్

    రిప్లయితొలగించండి
  14. కవితా మర్మంబెఱుగక
    స్తవనీయపు ధార లేక ధారణ లేకన్
    సవరణలు పెక్కు చేయుచు
    నవధానము జేయువాడె యతి మూర్ఖుడగున్

    రిప్లయితొలగించండి
  15. ఎవియో పద్యములను తనె
    యవక తవకలుగ నొకింత యల్ల గలిగిన
    న్నవగాహన లేకయె మరి
    "యవధానముఁ జేయువాఁడె యతిమూర్ఖుఁ డగున్"

    రిప్లయితొలగించండి
  16. గురువు గారికి నమస్సులు.
    కవన కదనమందున నవ
    నవోవిమలచరిత శాంతి నాట్యం బయ్యెన్.
    సవివరముగా తెలుపు యే
    యవధానము జేయువాడె యతి మూర్ఖుడగున్.

    రిప్లయితొలగించండి



  17. చోరుడు పరికించునటన్
    మారుఁజనక కవివరేణ్య! మాన్య శ్రేష్ఠా!
    మీరుండనర్థముఁ గొనగ
    చోరుని సముడు కవి యనుట చోద్యమ్మౌనే
    నిన్నటి సమస్య కు నా పూరణ .

    రిప్లయితొలగించండి
  18. డా.పిట్టా
    నుర్విన్నొచ్చి...ఉండాలి వృత్తంలో..ఆర్యా

    రిప్లయితొలగించండి
  19. భువిలో బుట్టిన పారిజాత సుమ సమ్మోదంబునన్ వెల్గెడిన్
    కవితాలోకపు సౌరభంబు నిల నాఘ్రాణింపలేనట్టియు
    న్నవబాసంబును లేనివాడు పలుకున్నత్యంత గర్వోన్నతి
    న్నవధానమ్మునుఁ జేయునట్టి కవి మూర్ఖాగ్రేసరుండౌ జుమీ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. క్రిందటి వారం ఆకాశవాణి వారి సమస్యకు నా పూరణ.

      పాలన జేయు రాజు తన బాధ్యత వీడక నన్నివేళలన్
      మేలగు ధర్మకార్యముల మేదిని యందొనరించి భాతిగ
      న్నేలుచు పౌరులందరిని నిత్యము బిడ్డల వోలె కేశ జుం
      పాలకు తైలమట్లు నిలువన్ వెలుగొందు ప్రజాళి గుండియల్

      తొలగించండి


    2. వచ్చే వారం సమస్య యేమిటండీ ?


      జిలేబి

      తొలగించండి
    3. మన శాస్త్రి గారు సమస్య చెబితే నేను పూర్తి చేసి పంపిస్తున్నానండీ. నా పూరణ చదువుతున్నారో లేదో కూడా నాకు తెలియదు. అందువలన శాస్త్రి గారే మనకు దిక్కు. శాస్త్రి గారూ వచ్చే వారం సమస్య దయచేసి తెలుపగలరు.

      తొలగించండి

    4. గ్రేప్వైన్ కతాకమామీషు

      నాలుగు వారాల్లో ఆకాశవాణి సమస్యా పూరణకు పెట్టా బేడా కట్టేసేరట

      ఎంతదాకా నిజమో తెలియదు

      ఆంధ్రుల్లారంభశూరులమ్మ జిలేబీ

      అని నేనే ఓ సమస్య తయారు చేసేసు కున్నా :)


      జిలేబి

      తొలగించండి
    5. జిలేబి గారూ, ఫణికుమార్ గారూ,
      నమస్సులు.

      నేనీ ఆకాశవాణి కార్యక్రమంలో పాల్గొనను. నా వద్ద రేడియో లేదు. వ్హాట్సప్ లో మిత్రులు ఉంచిన ఆడియో క్లిప్ లు వింటూంటాను నా చెవిటి చెవ్వుతో. అంతే.

      ఈ రోజు వినిన కవివర్యుల పేర్లలో 75 శాతం "మన" శంకరాభరణం వారే. పూరణలు పంపిన అందరి పేర్లూ, కొందరి పద్యాలూ ఉన్నాయి. ముఖ్యంగా జిలేబి గారి, రాజేశ్వరి గారి పేర్లు విన్నాను.

      వచ్చే వారం సమస్యను ప్రకటించకుండా కేవలం ధన్యవాదాలు చెప్పి ముగించారు. కొందరి అభిప్రాయం ఈ కార్యక్రమం తాత్కాలికంగా ఆపివేయబడినది.

      అన్ని వివరాలనూ బ్లాగులో ప్రచురించమని సహదేవుడు గారిని అడుగుతాను వ్యక్తిగతంగా. వారి పూరణకు జేజేలు కొట్టబడినవి వ్హాట్సప్ లో...

      👏👏👏

      తొలగించండి


    6. నాలుగు వారమ్ములలో
      బేలా! ఆకాశవాణి పెట్టా బేడా
      యేలన్ కట్టేసే తా
      మేలౌ ప్రక్రియ గదా సుమేధా జీవీ !

      జిలేబి

      తొలగించండి
    7. అయ్యో. ఇది తాత్కాలికమే అని ఆశిద్దాము.

      తొలగించండి
  20. కోట రాజశేఖర్ గారి పూరణ

    సందర్భము:: అవధాన సభలో నిషిద్ధాక్షరి, సమస్య, దత్తపది, న్యస్తాక్షరి, వర్ణన, వ్యస్తాక్షరి, ఆశువు, అప్రస్తుత ప్రసంగము, మొదలైన అంశములను చక్కగా నిర్వహించాలంటే, అవధానికి క్రమంగా పాండిత్యము, సద్యస్ఫూర్తి, నేర్పు, ఆలోచన, కవితాదృష్టి, వేగము, ఆశుధార, చమత్కారము, గొప్ప ధారణ మొదలైనవి తప్పక ఉండితీరాలి. ధార, ధారణ మొదలైనవి లేకుండా అవధానం చేయాలనుకొనే కవి మూర్ఖుడే గదా అని చెప్పే సందర్భం.

    అవనిన్ గావలె, ‘’పాండితీ గరిమ‘’ జేయంగా *నిషిద్ధాక్షరి* న్,
    స్తవ మొప్పంగ *సమస్య* దీర్చుటకు ‘’సద్యస్ఫూర్తి’’ యున్ గావలెన్,
    కవితన్ గావలె ‘’నేర్పు’’ *దత్తపది* నే గావింపగా, నక్షరా
    లు వరస్థానములందు నిల్పవలె ‘’నాలోచించి’’ *న్యస్తాక్షరి* న్,
    ‘’కవితాదృష్టి’’యు వస్తు *వర్ణన* ములన్ గావింపగా గావలెన్,
    ‘’జవ’’ మందన్ వలె నక్షరాల నుడువన్ జాలంగ *వ్యస్తాక్షరి* న్,
    కవితన్ నిత్యము *నాశువు* న్ బలుక ‘’గంగారీతి’’యున్ గావలెన్,
    నవలీలన్ ‘’తగురీతి బల్కదగు’’ తా *నప్రస్తుత* మ్మందు, ని
    ట్లవకాశమ్ము నెరింగి చేయదగు ‘’నష్టాంశమ్ములన్’’ యుక్తితోన్
    చివరన్ ‘’ధారణ’’ నప్పజెప్పవలె వాసిన్ నాటి పద్యాల, తా
    నవధానమ్మున *పృచ్ఛకాళి మదిలో హర్షమ్ము వర్ధిల్ల* ; *స*
    *త్కవితాధార, విశేషధారణ, చమత్కారాదులున్ లేనిచో*
    *నవధానమ్మునుఁ జేయునట్టి కవి మూర్ఖాగ్రేసరుండౌ జుమీ !*

    *కోట రాజశేఖర్ నెల్లూరు*

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు


    1. కోట రాజశేఖర్ గారు

      అదురహో !

      అవధాన ప్రక్రియా మత్తేభాన్ని నిలిపారు !

      జిలేబి


      జిలేబి

      తొలగించండి
    2. వెలుదండ సత్యనారాయణ గారి పూరణ

      భువిలో నెన్మిది యంశముల్ గలుగు సంపూర్ణావధానాన కో
      ట వరే ణ్యాన్వయ రాజశేఖరులు ప్రౌఢ ప్రజ్ఞతో విప్పి చె
      ప్పు వరిష్ఠం బగునట్టి యెన్మిది గుణాల్పొందంగ లేకున్నచో
      నవధానమ్మును జేయునట్టి కవి మూర్ఖాగ్రేసరుండౌ జుమీ!..

      ✒~ డా. వెలుదండ
      సత్యనారాయణ


      ఈరోజు శ్రీ కోట రాజశేఖర్ గారు సమస్యా పూరణంకోసం విరచించిన అద్భుతమైన వృత్తమాలికయొక్క స్ఫూర్తితో ఆనందంతో...

      తొలగించండి
  21. గు రు మూ ర్తి ఆ చా రి
    ,,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,


    కవితా శక్తియు , భావనా స్రవము ,

    ..................... సద్గ్ర౦ధావలోకమ్ము ధా

    ర , విశుధ్ధ౦బగు ధారణమ్మును

    ................. పద ప్రావీణ్యమున్ లేనిచో

    నవధానమ్మును జేయు నట్టి కవి

    ................... మూర్ఖాగ్రేసరు౦ డౌ జుమీ !

    యవధాన౦బొనరి౦ప న౦దరికి సాధ్య౦బౌ నొకో

    ..................................... పూర్వ జ

    న్మ విశేష౦బు - సరస్వతీ కరుణ

    ................. యేమాత్ర౦బు లేకు౦డినన్

    రిప్లయితొలగించండి
  22. *కవులవధానమటంచున*
    *టవీప్రదేశంబునెంచుటన్ తపసుచెడన్*
    *చెవులయతిమూసుకొనగని*
    *"అవధానముఁ జేయువాఁడె యతిమూర్ఖుఁ డగున్"*

    *🌷శ్రీమతి జి సందిత బెంగుళూరు🌷*

    రిప్లయితొలగించండి
  23. అవధానమ్మదియొకకళ
    యవధానముజేయునతడుహరితుల్యుండే
    యవివేకపుపలుకులెయివి
    యవధానముజేయువాడెయతిమూర్ఖుడగున్

    రిప్లయితొలగించండి
  24. రిప్లయిలు
    1. సవినయ విధేయతలఁ బలు
      కవలెను సతతము తన కపకారము జరుగన్
      భువి నేలు మహా రాజుల
      నవధానముఁ జేయువాఁడె యతిమూర్ఖుఁ డగున్

      [అవధానము = ఎచ్చరిక]


      కవి విద్వాంస సుశాస్త్ర పారగులఁ బెక్కండ్రన్ విలోకించి తా
      కవనంబందున మెప్పుఁ బొందగను శక్యంబౌనె దుస్సాధ్యమే
      యవనీ భార సమాన మంచును మనంబందెంచి భీతాత్ముఁడై
      యవధానమ్మునుఁ జేయునట్టి కవి మూర్ఖాగ్రేసరుండౌ జుమీ

      తొలగించండి
  25. కవి పుంగవు నని బలుకుచు
    కవనము రసమయము గాక ఘన పదములకై
    శవ జాగారమటు నెమకి
    యవధానముఁ జేయువాఁడె యతిమూర్ఖుఁ డగున్

    నిన్నటి సమస్యకు నా పూరణ

    ఆరయ వాల్మీకి కవిత
    భారత రచనా ధురీణుఁ వ్యాసుని కవిత
    న్నేరుగ తన శైలి యనగ
    చోరుని సముఁడు కవి యనుట చోద్యమ్మౌనే?

    రిప్లయితొలగించండి
  26. అవధాన ఘనత తెలియక
    యవహేళన జేయునట్టి యజ్ఞుల యెదుటన్
    కవితామృత రాగముతో
    నవధానము జేయువాడె యతి మూర్ఖుడగున్

    రిప్లయితొలగించండి
  27. నవలోకమ్మున దేల్తు మిమ్మనుచు నజ్ఞానాంబుధిన్ మున్గుచు
    న్నెవరే యంశముఁ గోరిరో వినక కావించంగ విన్యాసముల్
    యవివేకమ్మున భాగమైతిమని యాయా పృచ్ఛకుల్ దల్చఁగ
    న్నవధానమ్మును జేయునట్టి కవి మూర్ఖాగ్రేసరుండౌ జుమీ!

    రిప్లయితొలగించండి
  28. వ్యవధాన మేమి లేకనె
    నవభావన లందుకొని మనస్సు లలరగన్
    కవనంబు జెప్పగ న్నెటు
    లవధానము జేయువాడె యతి
    మూర్ఖుడగున్?

    రిప్లయితొలగించండి
  29. అవధానమ్మున కేగుదెంచి యొక మూర్ఖాగ్రేసరుండిట్లనెన్
    వ్యవధాన మ్మిడు టేమి పృచ్ఛకు లెదో వాగించుటే మూరక
    న్నవియు న్నివ్వియు వాగుటేమి నస బావా చాలు నీ వెర్రి యీ
    అవధానమ్మునుఁ జేయునట్టి కవి మూర్ఖాగ్రేసరుండౌ జుమీ.

    రిప్లయితొలగించండి
  30. స్తవనీయుండగు నిజముగ
    అవధానము జేయువాడె,యతిమూర్ఖుఁడగున్
    అవధానమ్మేనెరుగక
    కువిమర్శలు చేయువాడె కువలయమందున్!!!

    రిప్లయితొలగించండి
  31. కవితాధారణ మరచియు
    శ్రవణానందమ్ములేక శాంతము దరుగన్
    అవమానమ్మునజరిగెడి
    అవధానము జేయువాడె యతి మూర్ఖుడగున్|
    2.కవితాశక్తియు పద్యమల్లగల లక్ష్యంబున్న రాణించునా?
    ప్రవరుండట్లు వరూధినిన్ గలువ?శాపంబందుజీవించుటౌ| {మాయాప్రవరుడు}
    అవధానంబున ధారణా ప్రతిభ లౌఖ్యం బేమి గాన్పించకే
    అవధానంబును జేయునట్టి కవిమూర్ఖాగ్రేసరుండౌజుమీ|

    రిప్లయితొలగించండి
  32. భువనంబందున వేల పండితులలో పుట్టేనొకండే కవీ
    కవి వర్గంబున బుట్టునాశుకవి నిక్కం బొక్కడే వేలలో
    భవ మందే నవధానియందు నొకఁడే భావ్యంబు గాదిట్లనన్
    నవధానమ్మునుఁ జేయునట్టి కవి మూర్ఖాగ్రేసరుండౌ జుమీ !

    తిరుక్కోవళ్ళూరు శ్రీహర్ష

    రిప్లయితొలగించండి
  33. మైలవరపు వారి పూరణ

    బవరమునకేగు సైనికు...
    డవిరతముగ నిత్య సాధనైక రతుండై
    భువినుండు రీతి మెలగక
    అవధానముఁ జేయువాఁడె యతిమూర్ఖుఁ డగున్ !!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి


  34. కవితాపటిమను చూపును

    నవధానము చేయువాడె,యతిమూర్ఖుడగున్

    భువనము నందున సతతమ

    వివేకతనుబూని కవుల వెంగలు లనుచున్.


    రవికాంచనివి కనిెడు కవి

    నవధానము చేయువాడె,యతిమూర్ఖుడగున్

    కవనము లల్లని వాడిల

    కవులను నిందించుచుండు కాపురుషుండై.

    రిప్లయితొలగించండి
  35. ఉవిదల్ కౌగిలిలందునన్ గుడుల శాస్త్రోక్తమ్ము మంత్రాలలో
    కవిసమ్మేళన మందునన్ తినుచు శాకమ్ముల్ ఫలమ్ముల్ వడల్...
    చెవులన్నోరును మూయుచున్ వడిగ తాసెల్ఫోను జాలమ్ముతో
    నవధానమ్మునుఁ జేయునట్టి కవి మూర్ఖాగ్రేసరుండౌ జుమీ!

    అవధానము = ఏకాగ్రత

    రిప్లయితొలగించండి
  36. భువిలో రాజులు రాణులందరికి రూపొందింపకే స్తోత్రముల్
    కవితల్ పాడక మోహనాంగులకు తా కవ్వించి కామింపకే
    కవిరాజంచును చల్నచిత్రములకున్ గానాలు సంధించకే...
    అవధానమ్మునుఁ జేయునట్టి కవి మూర్ఖాగ్రేసరుండౌ జుమీ

    రిప్లయితొలగించండి