9, నవంబర్ 2017, గురువారం

సమస్య - 2515 (కరణమ్మును నమ్ముకొనిన...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"కరణమ్మును నమ్ముకొనినఁ గలుగు సుఖమ్ముల్"
(లేదా...)
"కరణము నమ్మువారలకుఁ గల్గు సుఖమ్ములు కచ్చితమ్ముగా"
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారికి ధన్యవాదాలతో...

123 కామెంట్‌లు:

 1. హరిహర నాథా!భువిలో
  నరయగ వృత్తియె ప్రవృత్తి యగు భాగ్యమ్మే
  దొరకిన నేమి కొరత?వ్యా
  కరణమ్మును నమ్ముకొనిన గలగు సుఖమ్ముల్.

  రిప్లయితొలగించండి
 2. రిప్లయిలు
  1. పరిపరి పన్నులు సర్దుచు
   కిరికిరి లెక్కలు సృజించి క్రిందను మీదన్
   సరులను ప్రోచెడి ఛార్టరు
   కరణమ్మును నమ్ముకొనినఁ గలుగు సుఖమ్ముల్

   తొలగించండి
  2. ప్రభాకర శాస్త్రి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 3. సరియగు నక్షత్రంబును
  సరియగు వారమును తిథిని సరసపు రీతిన్
  మరిమరి శుభయోగమ్మును
  కరణమ్మును నమ్ముకొనినఁ గలుగు సుఖమ్ముల్

  రిప్లయితొలగించండి
 4. ధరణిని లెక్కలు వ్రాసెడి
  గురువే యని తలచి భక్తి కొలిచెడి వారల్
  వెరగున టక్కరి వాడగు
  కరణమ్మును నమ్ముకొనినఁ గలుగు సుఖమ్ముల్

  రిప్లయితొలగించండి
 5. నర లోకములో నరయగ
  దరచుగ నిడుమల వరదలు దాటిగ వచ్చు
  న్నెరుగుము మరి భయపడి పో
  క! రణమ్మును నమ్ము కొనిన గలుగు సుఖమ్ముల్.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. జనార్దన రావు గారూ,
   విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   "...నిడుముల... ధాటిగ..." అనండి.

   తొలగించండి
 6. చొరబాటు యత్నముల్, నలు
  గురిలో నగుబాటు జేయు కుంచిత భంగుల్
  మరి దాయాదివి| దయ లే
  క, రణమ్మును నమ్ముకొనినఁ గలుగు సుఖమ్ముల్||

  రిప్లయితొలగించండి


 7. మరణంబదియె మనుజులక
  కరణము! యంతఃకరణము గాన్పడనియలం
  కరణము! యధిపురుషుని యధి
  కరణమ్మును నమ్ముకొనినఁ గలుగు సుఖమ్ముల్ !


  ஜிலேபி

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు

  1. మరణమ్మది మనుజులకు య
   కరణము -
   అకరణము - సహజము

   తొలగించండి
  2. జిలేబీ గారూ,
   బాగుంది మీ పూరణ. కాని రెండు సంధి దోషాలున్నవి. "...మనుజుల క।కరణ మ్మంతకరణము... యలం।కరణ మ్మధిపురుషుని..." అనండి.

   తొలగించండి


 8. మరిమరి రాయన్ ,మేలౌ
  సరిజూడన్ ప్రాస, యతుల, ఛందం సాఫ్ట్వేర్,
  కరవాణిని,యాధునికీ
  కరణమ్మును నమ్ముకొనినఁ గలుగు సుఖమ్ముల్ !

  ಜಿಲೇಬಿ

  రిప్లయితొలగించండి


 9. కొరియా తీరుల జూడన్
  సరిసరి వచ్చెనట ట్రంపు! చైనీయులకున్
  సరిజెప్పె జిలేబీ, యధి
  కరణమ్మును నమ్ముకొనినఁ గలుగు సుఖమ్ముల్ !

  जिलेबी

  రిప్లయితొలగించండి


 10. మరణము సాజమయ్యదయ!మానవుడా విను జీవితమ్మునన్
  శరణము రాజమార్గమయ! సన్నిధి గాంచి శతఘ్నుడా విభున్
  మరిమరి గొల్చుచున్,మదిని మంచితలంపుల నింపుచున్ సదా
  కరణము నమ్మువారలకుఁ గల్గు సుఖమ్ములు కచ్చితమ్ముగా!

  జిలేబి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. జిలేబీ గారూ,
   మీ నాల్గవ పూరణ బాగున్నది. అభినందనలు.
   'శతఘ్నుడు'...? "వంద తప్పులను మరచి మన్నించినవాడా?"

   తొలగించండి

  2. శతఘ్నుడు - శంకరుడు


   ఆంధ్రభారతి ఉవాచ :)

   జిలేబి

   తొలగించండి
 11. సురుచిరమగు ప్రేమంబున
  దరతమభేదములు లేక ధరపైన ప్రజల్
  జరియించుచు భావైకీ
  కరణమ్మును నమ్ముకొనినఁ గలుగు సుఖమ్ముల్.

  రిప్లయితొలగించండి
 12. శరణము బొందగావలెను సర్వవిధమ్ముల సత్యనిష్ఠతో
  తరణము\ దెల్పు బోధకుని;తత్వవిదుండగు దేశికోత్తమున్;
  మరిమరి బుజ్జగింపగల మంజులమూర్తిని;వాక్సుధ శుభం
  కరణము నమ్మువారలకు;గల్గు సుఖమ్ములు కచ్చితమ్ముగా.

  రిప్లయితొలగించండి
 13. మైలవరపు వారి పూరణలు:.


  హరిహరులకభేదమరసి
  వరసాధనఁజేయ మోక్షపథ లక్ష్యముగా,
  నరవర! గరిమము భక్త్యుప..
  కరణమ్మును నమ్ముకొనినఁ గలుగు సుఖమ్ముల్!!

  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి


  హరి యన నక్షరద్వయమె యార్తిని ద్రుంచును , దల్లిదండ్రులున్
  గురువును దైవమున్ హరియె ! కూరిమి భక్తినిఁ బొంది చిత్తసం..
  స్కరణము , నమ్మువారలకుఁ గల్గు సుఖమ్ములు కచ్చితమ్ముగా !
  వరకరుణాంతరంగుడు శుభంకరుడాతడె జీవకోటికిన్ !

  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మైలవరపు వారూ,
   మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

   తొలగించండి
 14. సురుచిర వేద మంత్రము
  హరునకి మోదoబగునటు ,హాలా హలంబు
  వరమగు నిలనన్ వైదీ
  కరణమ్మును నమ్ముకొనిన గలుగు సుఖమ్ముల్ .
  అందరికి వందనములు.

  రిప్లయితొలగించండి
 15. సరస కవిత్వతత్వ పటు సంపదఁగల్గుట భాగ్యమేఁగదా!
  పరిణితి జూపువారలకు భవ్య రసామృతమందకుండునే!
  కరుణను భారతీసతి వికాసము పర్వగ సత్య నిత్య వా
  క్య,రణము నమ్ము వారలకుఁగల్గు సుఖమ్ములు కచ్చితంబుగా!!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ప్రసాద రావు గారూ,
   పద్యం మనోహరంగా ఉంది. కాని 'కరణము'ను 'వాక్య రణము' చేయడం నియమ విరుద్ధం. అక్కడ "సత్య నిత్య వా।క్కరణము..." అనవచ్చు కదా!

   తొలగించండి
 16. డా.పిట్టా
  భరణముగన పని మరచియు
  అరమర లేకుండ
  వ్రాయ నాచరణంబుల్
  ధరదప్పె;ధీరులెప్పుడు
  కరణమ్మును నమ్ముకొనిన కలుగు సుఖమ్ముల్
  (Those who can, do;but those who cannot, write.)

  రిప్లయితొలగించండి
 17. చరణమ్ములు కడిగి కనక
  భరిణౌ చెలి జీవనమున భార్యగ జేరన్
  పరిణయమందున నల్లున
  కరణమ్మును నమ్ముకొనినఁ గలుగు సుఖమ్ముల్
  (అల్లునకు + అరణమ్ము = అల్లునకరణమ్ము)

  రిప్లయితొలగించండి
 18. డా.పిట్టా
  సరి వేదాంతము యిచ్చునె
  పరిగడుపుల బెంచు నదియ బలకారకమే?
  కరివరదు *గీత*నెంచియు
  కరణమ్మును నమ్ముకొనిన కలుగు సుఖమ్ముల్
  *కర్మ నణేవహి సంసిద్ధి*

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. డా. పిట్టా వారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'వేదాంతము+ఇచ్చునె' అన్నపుడు సంధి నిత్యం. యడాగమం రాదు. అక్కడ "వేదాంత మ్మిచ్చునె" అనవచ్చు కదా! 'పరగడుపు' సాధువు అనుకుంటాను.

   తొలగించండి
 19. నేరస్థుడైన ఖైదీ ఉవాచ:.....డా.పిట్టా నుండి
  చెరబడి పశ్చాత్తాపము
  నరయంగా లాభమేమి హా!విధి,చెడును
  న్నిరతము వలదను యంతః
  కరణమ్మును నమ్ముకొనిన కలుగు సుఖమ్ముల్

  రిప్లయితొలగించండి
 20. కోట రాజశేఖర్ గారి పూరణ:

  సందర్భం :: ‘’నాయనా ఎక్కువగా చదువుకొనలేక పోయినా, వేదమునకు ముఖము గా ఉన్న వ్యాకరణమును తప్పకుండా చదువు. వ్యాకరణం చదువుకొంటే సుశబ్దములు అపశబ్దములుగా మారకుండా ఉంటాయి. స్వజనుడు (తనవాడు) శ్వజనుడు (చండాలుడు) గా; సకలము (అంతా/సమస్తం) శకలము (ముక్క) గా; సకృత్ (ఒకసారి) శకృత్ (అశుద్ధం) గా, పలుకబడకుండా ఉంటాయి’’ అని గురువు శిష్యునికి బోధించే సందర్భం.

  సరిగను పెద్దగా జదువ జాలకయున్న, *పఠించుమయ్య వ్యా
  కరణము* చక్కగా, *స్వజన* కాదుగదా *శ్వజనమ్ము* గా, శుభం
  కరమును పూర్ణమౌ *సకల* కాదుగదా *శకలమ్ము* గా, *సకృత్*
  తరచు *శకృత్తు* గాదు, *ముఖ తత్వము వేదము* నేర్వ, గాన వ్యా
  *కరణము నమ్మువారలకు గల్గు సుఖమ్ములు కచ్చితమ్ముగా.*

  *కోట రాజశేఖర్ నెల్లూరు.*

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. యద్యపి బహునాధీషే
   తథాపి పఠపుత్ర వ్యాకరణం
   స్వజనః శ్వజనః మాభూత్
   సకలం శకలం సకృత్ శకృత్

   ఈ శ్లోకాన్ని చాలా చక్కగా పద్యం లోకి ఇమిడ్చి వ్యాకరణ ప్రాశస్త్యాన్ని తెలియజేసి నందుకు ధన్యవాదాలు శ్రీ రాజ శేఖర్ అవధాని గారూ!

   ...చిటితోటి విజయకుమార్

   తొలగించండి
  2. రాజశేఖర్ గారూ,
   అద్భుతమైన పూరణ మీది. అభినందనలు.

   తొలగించండి
 21. డా.పిట్టా
  ఒరవడి మాటలన్ మనిపి యోపిక లేకయె సన్యసించినన్
  కరువది హెచ్చు కాయమున కంటవు సత్కృతి, స్వాస్థ్య సంపదల్
  కరములు యారిపోవు శ్రమ కాటకమున్ గనజాల దుర్వినిన్
  కరణము నమ్మువారలకు గల్గు సుఖమ్ములు కచ్చితమ్ముగా

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. డా. పిట్టా వారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'కరములు+ఆరిపోవు' అన్నపుడు యడాగమం రాదు. "కరణమె యారిపోవు" అనవచ్చు. "దుర్వినిన్"..?

   తొలగించండి
 22. క్రొవ్విడి వెంకట రాజారావు:

  నిరతము నితరుల పట్టక
  పురువడి గూడుచు స్వయముగ బుద్థినరయుచున్
  యురవగు స్వశక్తితో నీ
  కరణమ్మును నమ్ముకొనిన గలుగు సుఖమ్ముల్
  (కరణము= శరీరము; దేహము)

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. రాజారావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'పురువడి'...? 'అరయుచున్+ఉరవగు' అన్నపుడు యడాగమం రాదు.

   తొలగించండి
 23. కరముల విరిసిన వరముగ
  సుర తరువుగ శాస్త్రజ్ఞాన శోధన యందున్
  మెరిసెడు నూతన యావి
  ష్కరణమ్మును నమ్ముకొనిన గలుగు సుఖమ్ముల్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. శ్రీరామ్ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'శాస్త్రజ్ఞాన' మన్నపుడు 'స్త్ర' గురువై గణదోషం. "శాస్త్రబోధ శోధన..." అనండి. (బోధ = జ్ఞానము).

   తొలగించండి
 24. పరులొ స గేడుసూచన స
  త్వర ము గ నమ లు పరచoగ వల ద దేపుడు న్
  స్థిర మగు యోచన నంత ః
  కరణ మ్మును నమ్ము కోనిన కలుగుసుఖమ్ముల్

  రిప్లయితొలగించండి
 25. ఒరులకు నొగ్గులుసేయక
  సరియగు మార్గమున జనుచు సరసిజనాభున్
  మరువని పరిశుద్ధఅంతః
  కరనమ్మును నమ్ముకున్న కలుగుసుఖమ్ముల్
  ఆర్యా ! నా కీబోర్డ్ లో కొన్ని లోపాల వల్ల parisudhanthah karanammunu సరిగా టైపు చేయలేక పోయాను !
  క్షమించగలరు

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు

  1. కీబోర్డు గొల్పు బాధలు
   గాబర యింతింతగాదు కవివర గానన్ :)   జిలేబి

   తొలగించండి
  2. సీతాదేవి గారూ,
   'పరిశుద్ధాంతఃకరణము'తో మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 26. మరగుచు యాంత్రిక వసతుల
  వరియింపగ వ్యాధులనతి వ్యామోహమునన్
  వరమగు శారీరక యుప
  కరణమ్మును నమ్ముకున్న కలుగు సుఖమ్ముల్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సీతాదేవి గారూ,
   మీ రెండవ పూరణ బాగున్నది. అభినందనలు.
   'శారీరక+ఉపకరణము = శారీరకోపకరణము' అవుతుంది.

   తొలగించండి
 27. వర హరి నిత్య శుభంకర
  చరణ యుగమ్మును మదీయ శరణంబనుచున్
  నిరతము భక్తి రతాంతః
  కరణమ్మును నమ్ము కొనిన గలుగు సుఖమ్ముల్

  రిప్లయితొలగించండి
 28. సరసపు మాటలింకమరి సాగవు పాకధికారపీఠమే
  గిరులను దాటి నాభరత గేహమునాక్రమణంబు జేయగా
  మరుగుచునుండెరక్తమదిమాకికనెయ్యములేల!శాంతిగా
  *క!రణము నమ్మువారలకుఁ గల్గు సుఖమ్ములు కచ్చితమ్ముగా*


  పాక్+అధికార

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. హర్షశ్రీ గారూ,
   విలక్షణమైన విరుపుతో చక్కని పూరణ చెప్పారు. అభినందనలు.

   తొలగించండి
 29. హరువగు పద్యము లల్లుచు
  తరియించగ జన్మమెల్ల ధరణీ తలమున్
  వరముగ శోభిల్లెడు వ్యా
  కరణమ్మును నమ్ముకొనిన గలుగు సుఖమ్ముల్!!!

  రిప్లయితొలగించండి
 30. పురమున పల్లెల లోనన్
  కరణము కాసులను పొంద ఘనుడే యైనన్
  వరముగ నాస్తుల గావడె ?
  కరణమ్మును నమ్ముకొనినఁ గలుగు సుఖమ్ముల్

  కరమీ పద్యరచన వ్యా
  కరణము నకుగాక మధుర ఘనపదఝరినే
  నెరపగ జూపెడిదౌ సం
  స్మరణమ్మును నమ్ముకొనినఁ గలుగు సుఖమ్ముల్

  ( ఈ పద్యం నా మనోభావాన్ని తెలుపుతూ రచించినది మాత్రమే .
  నేడు పద్య రచనలు సలుపు కవుల వయసును పరిగణిస్తే యువత లో
  పద్యరచనాసక్తిశూన్యమేనని తోచుచున్నది . పద్యం చదువుతున్నాడా?
  పరుగు తీద్దాం , కవిత్వం చెబుతున్నాడా ? కాలిబలం చూపుదామన్న స్థితిలో వున్నది నేటి యువత . కత్తి వేటుకు బదులుగా కలం కదలడానికి చోటు కలిగిస్తే అది పద్యరచనకు పట్టు తివాచీ కావచ్చు నన్నది నా భావన )

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కృష్ణారావు గారూ,
   మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
   పద్యానికి మళ్ళీ మంచి రోజులు వస్తున్నవి. ఇప్పుడు యువతరం పద్యరచనలో ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. వివిధ వాట్సప్ గ్రూపుల్లో పద్యాలు వ్రాస్తున్నవాళ్ళలో ఎక్కువమంది యువకులే.

   తొలగించండి
 31. జరిగెడి మంచికి చెడులకు
  పరమేశుని చిత్తమనుట భావ్యంబగునా?
  నరుడున్నతుడై సరియగు
  కరణమ్మును నమ్ముకొనినఁ గలుగు సుఖమ్ముల్"
  రిప్లయితొలగించండి
 32. వ్యాకరణమును పాటించని కవితలు ఆమోదయోగ్యములు
  కావు . కాని పద్యము మధ్యలో అచ్చులను వాడకూడదనుట ,
  అరసున్నలు వాడక తప్పదనుట, యడాగమము పాటించుట
  లో సడలింపులు అభిలషణీయము .

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మంచి మాట చెప్పారు సార్! అరసున్నల బాధ భరించలేక తెలుగంటేనే విసుగు పుట్టినది నాకు SSLC లో. అవసరమైనప్పుడు
   బస్సు, బ్లాగు, బిరియాని, జీన్సు వంటి అన్యదేశ్యాలను కూడా తిరస్కరించకుండా ఉంటే నాబోంట్లకు పద్యాలు వ్రాయాలని సరదా ఉంటుంది. మడి కట్టుకొని కూచొని సెన్సరులా ప్రవర్తించి ఉంటే శంకరాభరణం ఎప్పుడో మూసుకొని పోయి ఉండేది. కంది వారి ఔదార్యము, ఆదరణా అత్యద్భుతము 🙏🙏🙏

   తొలగించండి
  2. నాకు అరసున్నల విషయంలో విషయంలో పట్టింపు లేదు. నేను వ్రాసే పద్యాల్లో అరసున్నలను ప్రయోగిస్తాను. కాని అందరూ కచ్చితంగా పాటించాలని చెప్పను.
   కాని పద్యం మధ్యలో అచ్చుల విషయంలో కొంత పట్టింపు ఉంది. ఉదాహరణకు 'నీవు+అన్నావు = నీవన్నావు' అని సంధి నిత్యం. అక్కడ 'నీవు అన్నావు' అని విసంధిగానో, 'నీవు యన్నావు' అని యడాగమంతోనో వ్రాస్తే దోషమే. అలా కాక 'నీవె+అన్నావు = నీవె యన్నావు' అని యడాగమం వస్తుంది. అటువంటి చోట 'నీవె అన్నావు' అని విసంధిగా వ్రాసినప్పుడు నేను పట్టించుకోను.

   తొలగించండి
 33. పరికేదమ్ములు పడితిరి
  కురు భూపతి వలన మీరు, గుంతి కుమారా
  బిరికి దనమేల నీకిం
  క,రణమ్మును నమ్ముకొనినఁ గలుగు సుఖమ్ముల్

  యుద్ధ రంగములో అర్జునుని గాంచి కృష్ణుడు పలికిన పలుకులు

  రిప్లయితొలగించండి
 34. సరియగు సాధన తోడుత
  పురివిప్పిన భావములను పోడిమి గలుగన్
  వరమగుత సదా మంగళ
  కరణమ్మును నమ్ముకొనిన గలుగు సుఖమ్ముల్!

  కరణము=పని

  రిప్లయితొలగించండి
 35. సరళంబగుపదజాలము
  విరివిగదావాడగోరువిద్వాంసులకు
  న్నిరవుగనుపయుక్తమ,వ్యా
  కరణమ్మునమ్ముకొనినగలుగుసుఖమ్ముల్

  రిప్లయితొలగించండి
 36. కరణమొకండు వచ్చి యధికారము చక్కగ జేయుచుండె సం
  స్కరణములెన్నొ జేసె నవి కాదని యా నరసింహుపట్ల ధి
  క్కరణము జూపి యన్యులకు గౌరవ మీయ నతండు క్రుద్ధుడౌ
  కరణము నమ్ము వారలకు గల్గు సుఖమ్ములు ఖచ్చితమ్ముగన్
  (ఇక్కడ నేను కరణాన్ని నమ్మేవారు అనే అర్థం లో కాక కరణం ఎవరిని నమ్ముతాడో వారికి సుఖంకలుగుతుందనే అర్థం తో పూరించాను . ఇక్కడ కరణం అంటే పి వి నరసింహా రావు గారు . ఆయన పట్ల అసమ్మతి చూపటం క్షేమం కాదని భావించినట్లు )

  రిప్లయితొలగించండి
 37. అరి షడ్వర్గమ్ములు మదిఁ
  బరిత్యజించి వినయ నయ భాసిత వృత్తిన్
  సుర వర శరణవ్రత స
  త్కరణమ్మును నమ్ముకొనినఁ గలుగు సుఖమ్ముల్

  [కరణము = కార్యము]


  పరువది ముఖ్య మెల్లరకుఁ బన్నుగ నున్న ధనమ్ము తోడనే
  సరియగు మార్గ మెంచి చన సంతస మింపుగఁ గల్గు నిద్ధరం
  బరులకుఁ జుల్క నౌదువె యవశ్యము కోరకు మయ్య యప్పపా
  కరణము నమ్మువారలకుఁ గల్గు సుఖమ్ములు కచ్చితమ్ముగా

  [అప్పు+అపాకరణము = అప్పపాకరణము; అపాకరణము = తిరస్కారము]

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కామేశ్వర రావు గారూ,
   మీ రెండు పూరణలు ఉత్తమంగా ఉన్నవి. అభినందనలు.

   తొలగించండి
 38. కరణమును వీడి ఆఫీ
  సరు మాటల వెంట బడిన చావులు వచ్చున్
  కరణము చిర పరిచితుడౌ
  కరణమ్మును నమ్ముకొనిన కలుగును సుఖముల్
  (తెలియని ఆఫీసర్ మాటలు నమ్మటం కంటే తెలిసిన కరణాన్నే నమ్మటం నయమని)

  రిప్లయితొలగించండి
 39. పరగు వసుధైక తత్త్వము
  తరుగును దేశములకు మధ్య తగవులు సిరులౌ
  ధరణిని నిజము ప్రపంచీ
  కరణమ్మును నమ్ముకొనినఁ గలుగు సుఖమ్ముల్.

  ***

  నరులకు వైద్యము నందున
  ధర నష్టాంగములు కలవు తరచుగ వైద్యుల్
  కరపెడు సులువగు వాజీ
  కరణమ్మును నమ్ముకొనినఁ గలుగు సుఖమ్ముల్.

  ***

  వరగుణశీలా కెందా
  మరకరమున తమ్ములమ్ము మానుగ నిమ్మా
  సరసమున మనము వాజీ
  కరణమ్మును నమ్ముకొనినఁ గలుగు సుఖమ్ముల్.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మిస్సన్న గారూ,
   మీ మూడు పూరణలు వైవిద్యంగా చక్కగా ఉన్నవి. అభినందనలు.
   మొదటి పూరణ రెండవ పాదంలో గణదోషం. "దేశముల మధ్య" అనండి.

   తొలగించండి
 40. ధరణినిపొంద ప్రశాంతిని
  నరులెల్లరు సాహిత్యపు నందనమందున్
  చరియించి మోదముగ వ్యా
  కరణమ్మును నమ్ముకొన్న గలుగు సుఖమ్ముల్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. భాస్కరమ్మ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'హిత్యపు' అని భగణం వచ్చింది. అక్కడ జగణ, నలము లుండాలి.

   తొలగించండి
 41. సుర,యసురుల సుధ వక్రీ
  కరణమ్మును నమ్ముకొనిన గలుగుసుఖమ్ముల్
  మరువరు దేవత లెప్పుడు
  జరిపిన మోహిని నడవడి సాహస విధికిన్|
  2.వరమగు మానవ జాతికి
  పరువమ్మును బంచ గలుగు బాధ్యత చేతన్
  మరువక జరిపెడిదౌ సం
  స్కరణమ్ము నమ్ము కొనిన గలుగు సుఖమ్ముల్|
  3మరువక మానవత్వమున మంచిని బెంచెడి సంస్కృతుల్ సదా
  పరువము నిల్పు గాన| తగు బాధ్యత లందున నీతి నిష్టయే
  వరమని సర్వమానవులు వంతుగ జేసెడి భావయుక్త సం
  స్కరణము నమ్ము వారలకు గల్గు సుఖమ్ములు కచ్చితమ్ముగా  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ఈశ్వరప్ప గారూ,
   మీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు.
   మొదటి పూరణలో 'సుర+అసురుల = సురాసురుల' అవుతుంది కదా! అక్కడ "సుర లసురుల" అనండి.
   మూడవ పూరణలో 'నీతినిష్ఠయే' అనండి.

   తొలగించండి


 42. సరసముగా పద్యములను

  కరమందముగా రచింప కరములతోడన్

  వరముగ దొరికిన మన వ్యా

  కరణమ్మును నమ్ముకొనినఁ గలుగు సుఖమ్ముల్.  కరణము చేయుచు నుండెను

  సరళముగా గ్రామ మందు జనులకు పనులన్

  కరమనురాగము చూపెడు

  కరణమ్మును నమ్ముకొనినఁ గలుగు సుఖమ్ముల్.


  ధరలో నితరుల పైనను

  బరువును మోపుచు తిరుగక వసుమతి లోనన్

  నరమరిక లేని యంతః

  కరణమ్మును నమ్ముకొనినఁ గలుగు సుఖమ్ముల్.


  నిరుతము కొల్చుచు పెద్దల

  పరగతి సాధన కొరకని వసుధా స్థలిలో

  తిరుగుచు పొందు జ్ఞానపు సే

  కరణమ్మును నమ్ముకొనినఁ గలుగు సుఖమ్ముల్.


  పరులకు మేలును గూర్చుచు

  గురువుల వెంటను సతతము కువలయమందున్

  తిరుగుచు చేకొను జ్ఞాన సే

  కరణమ్మును నమ్ముకొనినఁ గలుగు సుఖమ్ముల్.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. డా. ఉమాదేవి గారూ,
   మీ ఐదు పూరణలు బాగున్నవి. అభినందనలు.
   నాల్గవ పూరణ మూడవ పాదంలో, ఐదవ పూరణ మూడవ పాదంలో గణదోషం. సవరించండి.
   (అన్నట్టు రేపు బొంబాయి వస్తున్నారా?)

   తొలగించండి
 43. సరియగు కాల మెంచి జన సమ్మతమౌ పను లన్ని చేసి చూ
  పరులకు మేటి యుత్తముని భాతి చరించిన భావి యెన్నికల్
  వర మగు నీకు దప్పకను వాస్తవ మెన్ను మదే ప్రజా వశీ
  కరణము నమ్మువారలకుఁ గల్గు సుఖమ్ములు కచ్చితమ్ముగా.

  రిప్లయితొలగించండి
 44. తిరముగభూమి తాపముల తీరులమార్పుఘటిల్లు చుండగా
  నిరతముమారుచుండెనవనీతలమందున నీమముల్ గృహా
  వరణమునందు సంతతము ప్రాకృత దోషము తీర్చ నాధునీ
  కరణము నమ్మువారలకు కల్గుసుఖమ్ములు కచ్చితమ్ముగా

  రిప్లయితొలగించండి
 45. కరమగు ప్రేమము తోడను
  తరుణిని చేబట్టబోవు తరుణమునందున్
  పర కులమని యడ్డఁ దిర
  స్కరణమ్మును నమ్ముకొనినఁ గలుగు సుఖమ్ముల్

  రిప్లయితొలగించండి
 46. నిరతము చింతలన్ బ్రతికి నీమము దప్పుచు సంచరించగన్
  దొరకునె సంతసమ్ము? నవె దూరము జేయును స్వాస్థ్యతన్నదే
  స్మరణము నేర్చుచున్ భ్రుకుటి మానసమందున నుంచు ధ్యానమన్
  కరణము నమ్మువారలకుఁ గల్గు సుఖమ్ములు కచ్చితమ్ముగా

  రిప్లయితొలగించండి
 47. నిరతము ప్రయాణ మందున
  చరియించెడు విధులు నెఱప సందేశముల
  న్నరయ చరవాణి యను నుప
  కరణమ్మును నమ్ముకొనినఁ గలుగు సుఖమ్ముల్.

  రిప్లయితొలగించండి
 48. కరణము తెచ్చు బేరములు, ఖచ్చితమౌ ధర నిర్ణయించు , నా
  ధర యెడ దృప్తి లేక , పలు దారుల బేరము లాడ నేల జె
  చ్చెర నిక స్వీకరించుటయె సేమము పెద్దగ గౌరవించి యా
  కరణము నమ్ము వారలకు కల్గు సుఖమ్ములు ఖచ్చితమ్ముగన్
  (గౌరవించి యా కరణమున్+అమ్ము వారలకు )

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ధనికొండ వారూ,
   మీ తాజా పూరణ వైవిధ్యంగా చక్కగా ఉంది. అభినందనలు.

   తొలగించండి
 49. అఱచేతిని నాయుధమై
  సరళముగనె నెన్నొ పనుల చక్కం బరుపన్
  చరవాణి యనెడి నొక యుప
  కరణమ్మును నమ్ముకొనిన కలుగు సుఖమ్ముల్!

  రిప్లయితొలగించండి
 50. మైలవరపు వారి పూరణ:

  హరియని బల్కెదీవెచటరా హరి ? డాగెనె కంబమందనన్ , కరములు మోడ్చియున్ కనకకశ్యపు బుత్రుడు బల్కె తండ్రి ! శ్రీ...
  హరి కలడిందునందు , ముదమారగ భక్తినిఁ బొంది చిత్తసం...
  స్కరణము , నమ్మువారలకుఁ గల్గు సుఖమ్ములు కచ్చితమ్ముగా !


  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

  రిప్లయితొలగించండి
 51. పరమునకిహమునకును స
  ద్గురు పదముల సేవ,భక్తితో శ్రధ్ధగ తత్
  కరుణను బొందగ జేసెడి
  కరణమ్మును నమ్ముకొనిన కలుగు సుఖమ్ముల్.
  2.గురువే తల్లియు, తండ్రియు,
  గురువే సర్వస్వ మనుచు కూరిమి భక్తిన్
  నిరతము సేవ లొనర్చెడి
  కరణమ్మును నమ్ముకొనిన కలుగు సుఖమ్ముల్.
  3.పరమగురుడు,తత్వజ్ఞుని,
  చరణమ్ముల నాశ్రయించి శరణాగతుడై
  నిరతము సేవల నర్చన
  కరణమ్మును నమ్ముకొనిన కలుగు సుఖమ్ముల్

  రిప్లయితొలగించండి
 52. గురువర్యులకు నమస్సులు.
  నిన్నటి, మొన్నటి నా పూరణల ను పరిశీలించ ప్రార్థన.
  ధన్యవాదములు.
  తలచె నాతడిటుల చిన్న తనము నందె,
  " చక్కగా నెదుగుచు నంత చదువులోని
  మర్మముల కాచి వడబోసి మహిని ఙ్ఞాన
  సంపదలు కొల్ల గొట్టెద జనులు మెచ్చ!"

  కాముకుడౌ సింహ బలుని
  భీముడు చెలరేగి చంపె! భీష్ము రణమున
  న్నేమార్చ శిఖండినిగొని
  సామీప్యముగా నిలిపిరి చతురిమ తోడన్!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. శ్రీధర రావు గారూ,
   మీ రెండు పూరణలు (నిన్నటి, మొన్నటివి) బాగున్నవి. అభినందనలు.

   తొలగించండి
 53. బిరబిర పాలవి పొంగిన
  నురుకుచు చేతులనుబట్టి నువు దింపకుమా
  తరుణీ!పట్కారను నుప
  కరణమ్మును నమ్ముకొనినఁ గలుగు సుఖమ్ముల్

  రిప్లయితొలగించండి
 54. కరణముల గూడు నంతః
  కరణమ్ము మరల్చి యాత్మ గన శాంతమ్మౌ
  పరమును విడి ఏ డుగ్ కృణ్
  కరణమ్మును నమ్మినంత గలుగు సుఖమ్ముల్ ?
  (అని శంకరాచార్యుల వారు భజగోవిందశ్లోకాలలో సెలవిచ్చారు)

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ధనికొండ వారూ,
   ఈ పూరణ శ్రేష్టంగా ఉంది. అభినందనలు.
   అది 'డుకృఞ్'. అప్పుడు గణదోషం. "పరమును విడి యెట్టి డుకృఞ్। కరణమ్మును..." అంటే ఎలా ఉంటుంది?

   తొలగించండి
 55. పరిపరి యాస్తి దాచుచును పన్నుల చెన్నుగ ద్రోసిపుచ్చుచున్
  కిరికిరి జేసి లాభమును క్రిందను మీదను గప్పివేయుచున్
  బిరబిర పద్దు దిద్దెడి గభీరపు ఛార్టరకౌంటు శాస్త్రుడౌ
  కరణము నమ్మువారలకుఁ గల్గు సుఖమ్ములు కచ్చితమ్ముగా

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు

  1. Chartered Accountant

   అధికృత గణకుడు :)   బిరబిర పద్దు దిద్దెడి గభీర యధీకృత గణ్య శాస్త్రుడౌ :)


   జిలేబి

   తొలగించండి
 56. కిరికిరి చేసి పద్దులను క్రిందను మీదను జేయువాడయో
  మరణము నొందు వారలను మారణ హోమము జేయువాడయో
  చరణము పట్టు వారలకు శాశ్వత సంపద నిచ్చువాడయో...
  కరణము నమ్మువారలకుఁ గల్గు సుఖమ్ములు కచ్చితమ్ముగా!

  రిప్లయితొలగించండి