సందర్భం :: కవి పండితులు, విశ్రాంత తెలుగు పండితులు, *శంకరాభరణం* అనే బ్లాగును సంస్థాపించి, ఒక దశాబ్దంగా నిర్వహిస్తూ, పద్యకవులను వేలకొలదిగా తయారుచేస్తున్నవారు అగు శ్రీ కంది శంకరయ్య గురువర్యులకు, అమెరికా వారు, బొంబాయిలో *గురజాడ వారి సాహిత్య పురస్కారం* బహూకరిస్తున్న సందర్భం.
అక్కయ్య గారూ ! మీ పద్యం అద్భుతం !అభినందనలు ! నేనూ అదే కోరుతున్నాను.రేడియో పూరణలు విన్న వారెవరైనా కవిమిత్రుల పేర్లు బ్లాగులో ఉంచితే సంతోషం! చాలా మందికిపుడు రేడియోలు లేవు !
నాకూ రేడియో టీవీలకూ వైరం. విననూ చూడనూ. వ్హాట్సప్ లోని సందేశాలు:
***************
శ్రీహర్ష గారు అంజయ్య గారికి:
విన్నాను సార్ మీది,నాది,సందిత గారిది ప్రసారం అయ్యాయి మిగతా కవిమిత్రులు మన వారు ఉన్నారేమో గుర్తించ లేదు మీ పూరణ, సందిత గారి పూరణ బావున్నాయి🙏
*******
సత్యనారాయణ రెడ్డి గారు జనార్దన రావు గారికి:
పదిమందికి పైగా శంకరాభరణం కవులే ఉన్నారు. సమయాభావం వలన మాపేర్లను మాత్రమే చదివారు. రాజేశ్వరి గారు, అంజయ్య గౌడు గారు శిష్లాశర్మ గారు, సందిత గారి పద్యములు చదువబడినాయి.
జవురుకొనుచు ధనమంతయు
రిప్లయితొలగించండిభవుభవ్వను గోల జేయు పాటల తోడన్
చవటలు మెచ్చెడి సినిమా
కవులఁ బురస్కృతులఁ జేయఁగా వల దెపుడున్ :)
కవనమున కర్థమెరుగక
రిప్లయితొలగించండియవగాహనయే యొకింత యలవడక సదా
కవితల నల్లగ బూను కు
కవుల బురస్కృతుల జేయగా వలదెపుడున్.
చెవులకు చవులన్ గొలుపుచు
రిప్లయితొలగించండిఛవులన్ నింపెడి నిపుణపు సరసపు గవిమా
ధవులన్ మరచి వికృతకా
కవుల బురస్కృతుల జేయగా వలదెపుడున్.
కవనముతో మన జాతికి
రిప్లయితొలగించండిజవసత్త్వము నివ్వలేని చవటల కిల గౌ
రవమందుటె వ్యర్థమ్మా
కవులఁ బురస్కృతులఁ జేయగా వలదెపుడున్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిచవి పెరుగును కావ్యమునకు
రిప్లయితొలగించండికవుల బురస్క్రుతుల జేయగా;వలదెపుడు
న్నవహేళన గావించుట
కవివర్యుల,జ్ఞానధనుల,కారణజన్ముల్!
కవులం బిల్వఁగ, రాదు దండుగ, పురస్కారమ్ము లందిచ్చుటల్
రిప్లయితొలగించండినవ కావ్యామృత సృష్టికర్తలకు మాన్యంబౌను శ్రేయంబికన్|
కవనంబే సవనంబు| జాతికిని శ్రీకారంబు|నాదంబుగా
శివ చైతన్యము రాగ యక్షరముతో శిల్పంబు చిత్రింపరే|
అవివే కపు కవులందరు
రిప్లయితొలగించండిచవిలేని కవనము లల్లి చాతుర్య మున
న్నవిరళమగు ప్రతిభ యనెడి
కవులఁ బురస్కృతులఁ జేయఁగా వలదెపుడున్
రిప్లయితొలగించండిచవులూరని కవనము, స
త్తువలేని పదయొదుగుబడి తొంగలి గొనలే
ని వడియు లేని, జిలేబుల,
కవులఁ బురస్కృతులఁ జేయఁగా వల దెపుడున్ !
జిలేబి
రిప్లయితొలగించండిచవులూరంగని కావ్య మెల్లను సదా సారించి పాకమ్ము జే
సి వచో లాఘవ మెల్ల జొప్పిచి భళా చిత్రమ్మిదేయంచు స
త్తువయే యివ్వని పద్యమెల్లనకటా దూకించు "సావేజితా"
కవులం బిల్వఁగరాదు దండుగ పురస్కారమ్ము లందిచ్చుటల్
సావేజిత :)
జిలేబి
మైలవరపు వారి పూరణలు
రిప్లయితొలగించండి(1)
ఎవరంటిరి ? యెవరంటిరి ?
కవులఁ బురస్కృతులఁ జేయఁగా వల దెపుడున్
భువి యని , వారల బిల్వుడి
కవులఁ *బురస్కృతులఁ* జేయఁగా వలె *నిపుడే* !!
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
(2)
శ్రీ కృష్ణదేవరాయలు వారితో...
కవితాంభోనిధి పూర్ణచంద్రులు , మహాకావ్యాభ్రనిత్యోల్లస....
ద్రవులున్ సత్కవులష్టదిగ్గజ కవీంద్రఖ్యాతితో వెల్గగా !
నవనీశా ! చిరుదివ్వెతో వెదుకనేలా ! ధాత్రిలోనన్యులౌ..
కవులం బిల్వఁగరాదు దండుగ పురస్కారమ్ము లందిచ్చుటల్ !!
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
కోట రాజశేఖర్ గారి పూరణ
రిప్లయితొలగించండిసందర్భం :: కవి పండితులు, విశ్రాంత తెలుగు పండితులు, *శంకరాభరణం* అనే బ్లాగును సంస్థాపించి, ఒక దశాబ్దంగా నిర్వహిస్తూ, పద్యకవులను వేలకొలదిగా తయారుచేస్తున్నవారు అగు శ్రీ కంది శంకరయ్య గురువర్యులకు, అమెరికా వారు, బొంబాయిలో *గురజాడ వారి సాహిత్య పురస్కారం* బహూకరిస్తున్న సందర్భం.
కవివర్యుండగు, కంది శంకరుని సత్కారంబు పాత్రమ్మగున్,
సవనమ్మో యన *శంకరాభరణము* న్, స్థాపించె పద్యాలకై,
భువిలో నీతని జాడ, వేల కవులే పుట్టన్ దశాబ్దమ్ముగా,
స్తవనీయుల్ గురజాడ వారల పురస్కారమ్ము, నందింపగా,
కవిలోకమ్మును తెల్గుతల్లియు మహత్కార్యమ్ముగా నెంచెగా,
నవలోకింపగ, నిట్టివారలకె చేయంబోలు సన్మానముల్,
కవి నంచున్ పరభావ చౌర్యమున సత్కారమ్ములన్ గోర, నా
*కవులన్ బిల్వగరాదు, దండుగ, పురస్కారమ్ము లందిచ్చుటల్.*
*కోట రాజశేఖర్ నెల్లూరు.*
శ్రీ కోటరాజశేఖర్ గారు! మీపద్యము కడు ప్రశంసనీయము,సందర్భోచితము!అందుకొనండి జోహార్లు!
తొలగించండిడా.పిట్టా
రిప్లయితొలగించండిఎవరో పెండేరములిడ
కవనము శోభిల్ల దాత్మ గను సంతసమే
ప్రవిమలపీఠము1గాగన్
కవుల బురస్కృతుల జేయగా వలదెపుడున్
(1జ్ఞాన పీఠ అవార్డును దృష్టిలో పెట్టుకొని ఉటంకించితిని)
డా.పిట్టా
రిప్లయితొలగించండినవలల నెవ్వరు జదివిరి
కవి కూటమెగాక నొసగ ఘన బహుమతులన్
ఛవి మాని పైరవీల్ గను
కవుల బురస్కృతుల జేయగా వలదెపుడున్
సుకవులు సత్కృతికర్తలు
రిప్లయితొలగించండిసుకవులు వర్ధిల్ల మేలు చూడగ వచ్చున్
కుకవులు నింద్యులగుటను కు
కవులఁబురస్కృతులఁజేయగా వలదెపుడున్
డా.పిట్టా
రిప్లయితొలగించండికవి బహుమానపు కసిపై
అవిరళ దూషణలు బెరిగి య(అ)ట్టుడికెడు, నా
భవ మెందుకు వెలగల స
త్కవుల బురస్కృతుల జేయగా వలదెపుడున్
(సినారె పై యిటీవలి విమర్శల నేపథ్యంలో)
డా.పిట్టా
రిప్లయితొలగించండిచెవులన్ ఝుమ్మను వార్తలున్ తమకునౌ శ్రేష్ఠంపు శ్లాఘాదులున్
భువినిన్ మోసము జేయ నాయకులదో బుట్టించిరీ పీఠముల్
ఎవరో సత్కవులడ్డురా వలదనే యెత్తేకదా మూలమీ
కవులం బిల్వగ రాదు!దండుగ!పురస్కారమ్ము లందిచ్చుటల్
(పురస్కారము పొందని వారిలో పెక్కురు సత్కవులున్నారు,కాని వారు కొమ్ము కాసే శాల్తీలు కారు.)
గు రు మూ ర్తి ఆ చా రి
రిప్లయితొలగించండి,,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,,
అవనీ సుతగొని , జనకా
ఙ్ఞ వహి౦చి వని c జని , రావణ దనుజు
. . . . మడయి౦
చు విభుని ని౦ది౦చెడు కా
కవుల బురస్కృతుల జేయగా వలదెపుడున్
{ కవి = పక్షి ; కా కవి = కాకి ;
ఘూ కవి = గుడ్ల గూబ }
( ఙ్ఞ = జ , న , ణ )
్
జ వ సత్వ ము లేని కవిత
రిప్లయితొలగించండిచ వు లూ రింప గ పొ సగక చప్పగనుండన్
నవ తేకనలే నట్టీ కు
కవుల పురస్క్రతు ల చే య గా వల దె పుడు న్
కవనమ్ముల వ్రాయుచు తా
రిప్లయితొలగించండిభువి భూరిగ ద్రవ్యములను పొందుటకొరకై
యవినీతిపరుల మెచ్చు కు
కవులఁ బురస్కృతులఁ జేయఁగా వల దెపుడున్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండికవనముజేయుటనొల్లక
రిప్లయితొలగించండికవులనుదూషించునతడుకపితుల్యుండే
కవిగాగొప్పలునుడువుకు
కవులబురస్క్రుతులజేయగావలదెపుడున్
అవురా యొక్కబురమ్మునన్ గలిగెనో యజ్ఞాని తానెన్నడున్
రిప్లయితొలగించండికవనమ్మున్ వినబోడుపండితులపై కన్నెర్ర జేయున్ కృతుల్
చవులూరంగను నాలకింపడు దురాచారుండు తానిట్లనెన్
కవులన్ బిల్వగరాదు దండుగ పురస్కారమ్ము లందిచ్చుటల్
కవులే శాసన కర్తలౌదురటగా ! ఘాతాల్వెలారించుటన్
రిప్లయితొలగించండిభువిలో వెల్గులు నింపగా కవులహో ! భూమీశులేనంటగా !
చవులూరించెడి వారికే తగును సత్కార సంభావనల్
చెవిలో కెక్కని కైత సెప్పు ఘనులన్ జేకొట్ట రాదెందు,"దు
ష్కవులం బిల్వఁగరాదు దండుగ పురస్కారమ్ము లందిచ్చుటల్"
సవరించిన మూడవ పాదం:
తొలగించండిచవులూరించెడి వారికే తగునుగా సత్కార సంభావనల్
కవనపు ప్రావీణ్యము తా
రిప్లయితొలగించండిలవలేశమ్మైన లేక లఘు గురువులకున్
చవి తెలియనట్టి కుహనా
కవుల బురస్కృతులజేయగా వలదెపుడున్
రిప్లయితొలగించండి*కవికిన్మేకరవీంద్రడేర్పడపురస్కారంబులందింపగా*
*కవివాటిన్బిరుదంబుపేర్కొనసభన్ ఖ్యాతిన్ యథార్థంబుగా*
*నవిమాకున్గలవంచుహేళనగమాట్లాడన్కవుల్క్రుద్ధులై*
*"కవులం బిల్వఁగరాదు దండుగ పురస్కారమ్ము లందిచ్చుటల్"*
*శ్రీమతి జి సందిత బెంగుళూరు*
కవి సార్వభౌము శ్రీనా
రిప్లయితొలగించండిధ విబుధుని నిగళ యుతునిగఁ దఱలించి రిసీ
భువిఁ జెలఁగు మహా కవులను
గవులఁ బురస్కృతులఁ జేయఁగా వల దెపుడున్
[కవి = కళ్లెము]
భువి లే రిప్పుడు రాజ పోషకులు సంపూర్ణమ్ముగన్ మృగ్య మ
య్యె వరాంధ్రమ్మిక పాఠశాలల నిసీ యీ యాంధ్ర దేశమ్ములం
గవియన్ నీచపు భావ జాల మిటులం గావ్యంబు లెట్లుండునో
కవులం బిల్వఁగరాదు దండుగ పురస్కారమ్ము లందిచ్చుటల్
కవికిగల ప్రత్యేక అర్ధముతో మీపూరణ అత్యద్భుతంగా ఉన్నది!నమస్సులు,అభినందనలు!!
తొలగించండిడా. సీతా దేవి గారు ధన్యవాదములు, నమస్సులు.
తొలగించండి
రిప్లయితొలగించండిజీపీయెస్ వారు
మీకో కంద సమస్యా పూరణ
సమస్యా పూరణ
*మబ్బులలో తెలుగు బాస మ్రగ్గుచు నుండెన్ !
ఈ వారం ఆకాశవాణి సమస్య మీ కోసం:
తొలగించండి"మణి తెలుగున బల్కె ప్రజల మనములు పొంగన్"
నా సరదా సరదా పూరణ:
సణుగుడులిక మాని కవులు
మణిప్రవాళముల నొప్పి మన్నన తోడన్
గుణగణముల నెంచు చలా
మణి తెలుగున బల్కె ప్రజల మనములు పొంగన్
...సారు లీవులో ఉన్నారని తోకాట
తొలగించండిపణతుక జిలేబి యంబర
మణి చిహ్నపు పార్టి జేరి మాటాడంగన్
కణిమొழி ని బిల్వ యా " పె
న్మణి" తెలుగున బల్కె ప్రజల మనములు పొంగన్ :)
ஜிலேபி :)
క్లబ్బులలో పబ్బులలో
తొలగించండితబ్బిబ్బుగ కులుకుచుండి తడబడి యువతల్
గబ్బరు డైలాగు లొలుకు
మబ్బులలో తెలుగు బాస మ్రగ్గుచు నుండెన్ !
ఇబ్బడి ముబ్బడి రచనలు
తొలగించండినుబ్బుచు పైకెగసి మెండు నూరే గంగన్
జబ్బది ప్రాకెను దశదిశ
నిబ్బరమే లేక తెలుగు నేలకు వొరిగెన్
___/\___
తొలగించండిGPS .వారూ ! సమస్యా పూరణలు విన్నారుకదా ! కాస్త చదివిన వారి పేర్లు కూడా బ్లాగులో ఉంచితే ముదావహం
తొలగించండిఅక్కయ్య గారూ ! మీ పద్యం అద్భుతం !అభినందనలు !
తొలగించండినేనూ అదే కోరుతున్నాను.రేడియో పూరణలు విన్న వారెవరైనా కవిమిత్రుల పేర్లు బ్లాగులో ఉంచితే సంతోషం! చాలా మందికిపుడు రేడియోలు లేవు !
రాజేశ్వరి గారూ:
తొలగించండినాకూ రేడియో టీవీలకూ వైరం. విననూ చూడనూ. వ్హాట్సప్ లోని సందేశాలు:
***************
శ్రీహర్ష గారు అంజయ్య గారికి:
విన్నాను సార్ మీది,నాది,సందిత గారిది ప్రసారం అయ్యాయి మిగతా కవిమిత్రులు మన వారు ఉన్నారేమో గుర్తించ లేదు
మీ పూరణ, సందిత గారి పూరణ బావున్నాయి🙏
*******
సత్యనారాయణ రెడ్డి గారు జనార్దన రావు గారికి:
పదిమందికి పైగా శంకరాభరణం కవులే ఉన్నారు. సమయాభావం వలన మాపేర్లను మాత్రమే చదివారు. రాజేశ్వరి గారు, అంజయ్య గౌడు గారు శిష్లాశర్మ గారు, సందిత గారి పద్యములు చదువబడినాయి.
శాస్త్రి గారికి ధన్యవాదాలు!అక్కయ్య గారికి అభినందనలు!
తొలగించండిఅందరికీ + జి.పి. యస్ .గారికీ ధన్య వాదములు.
తొలగించండిగుర్రం సీతాదేవి గారి పద్యం, హర్ష గారి పద్యం కూడా చదవబడ్డాయి.
తొలగించండిధన్యవాదములు రెడ్డిగారూ !
తొలగించండినవనీత హృదయులౌచును
రిప్లయితొలగించండికవనసుధలు పంచ సృజన గావించుచు కే
శవులే యనంగ నెందుకు
కవులఁ బురస్కృతులఁ జేయఁగా వల దెపుడున్?
కవితా గోష్టులలో తమ
రిప్లయితొలగించండికవిత లమోఘములనుచునె కరము బలుకుచు
న్నవతార మెత్తి బలుకు కు
కవులఁ బురస్కృతులఁ జేయఁగా వల దెపుడున్
చెవులకు ధరించి కుండల
మావధానిని నేనటంచు నార్భటి తోడ
న్నవగతము గాని పదమిడు
కవులఁ బురస్కృతులఁ జేయఁగా వల దెపుడున్
చవులూరించని కవితల
నవిరళముగబల్కి నిరత మద్భుత కాన్కల్
భువి నాశించుచు దిరిగెడి
కవులఁ బురస్కృతులఁ జేయఁగా వల దెపుడున్
కవనమ్మున నరసున్నలు
నవసరమగు చోట నా యడాగమముల నీ
భువి నుంచక ,నచ్చు లునుచు
కవులఁ బురస్కృతులఁ జేయఁగా వల దెపుడున్
.శ్రవణానందము లేకను
రిప్లయితొలగించండిభవితవ్యపు మార్గదర్శ పదములు లేకన్
కవితలు జెప్పెడి వారిని
కవుల పురస్కృతుల జేయగావలదెపుడున్.
2.నవనీతంబగు భావబంధమున విన్యాసాల విజ్ఞానమున్
శ్రవణానందము నింపలేని కవితా రాద్దాంత మెంతున్నయీ
భవితవ్యంబును బాదబెట్టగల సంబందాల సంభోదనా
కవులంబిల్వగరాదు దండుగ పురస్కారమ్ము లందిచ్చుటల్
అవార్డులు ఇచ్చేవారి (రాజకీయ నాయకుల) భావన :
రిప్లయితొలగించండిఅవుననగ న్నవుననుచును
సవినయముగ వెంటదిరుగు సహవాసులకే
యవిరళ సన్మానము, స
త్కవుల బురస్క్రుతుల జేయగా వలదెపుడున్ !
కవితామృత ధారలతో
రిప్లయితొలగించండిచవులూరించెడు కవులకు సత్కృతి వలయున్
కవి తత్త్వంబెఱుగని కు
కవుల బురస్కృతుల జేయగా వలదెపుడున్
ఎవరుకవులు? సన్మానము
రిప్లయితొలగించండిలవలీలగపొందగోరు నట్టిసరకులే
ని వికటకవులా వట్టి కు
కవులఁ బురస్కృతులఁ జేయఁగా వల దెపుడున్
కవనమును తస్కరించుచు
రిప్లయితొలగించండికవిగా వెలుగొంద నెంచు ఘనులకు నిలలో
నవమానమె సరియౌను కు
కవుల బురస్కృతుల జేయగా వలదెపుడున్!
ఏవో కవితలు వ్రాయుచు
రిప్లయితొలగించండికవులము మేమే యటంచు గంతుల నిడుచున్
కువలయమందున తిరుగు కు
కవులఁ బురస్కృతులఁ జేయఁగా వల దెపుడున్
వైరి పక్షములలో యుండి హాజరైన సభలో కవు లు వీరని వారని యెంచక వారందరి చేతలను దూషించగా ఓ రాజకీయనాయకుని ఆవేదన:
రిప్లయితొలగించండిమత్తేభవిక్రీడితము.
మత్తేభవిక్రీడితము
ఎవరో యీసభ వైరి పక్షములఁ గావించంగ నాసీనులన్
కవితావేశము జాలువార కవులున్ గర్జించి మమ్మందరన్
చెవులన్ మేము వినంగజాలనటు దూషించంగ మా చేతలన్
కవులం బిల్వఁగరాదు దండుగ పురస్కారమ్ము లందిచ్చుటల్
స్వవనీయంబగు ప్రాజ్ఞులన్ దృఢముగా సన్మానితుల్ చేయుచున్
రిప్లయితొలగించండిభువిలో పేరును పొందినట్టి సదముల్ మూర్ఖంబుగా నిత్యమున్
కవితల్ సొమ్ములకై లిఖించుచును సంఘద్రోహులన్ మెచ్చు దు
ష్కవులం బిల్వఁగరాదు, దండుగ పురస్కారమ్ము లందిచ్చుటల్
భవుభవ్వంచును గోల జేసెడివి గల్భాపాటలన్ వ్రాయుచున్
రిప్లయితొలగించండిజవురున్ కొంచును ధాన్యమంతయును సూచ్యాస్యమ్ము లాహాయనన్
చవటల్ మెచ్చెడి మాటలన్ వలికి బాజార్నన్ విరాజిల్లెడిన్
కవులం బిల్వఁగరాదు దండుగ పురస్కారమ్ము లందిచ్చుటల్
సూచ్యాస్యము = మూషికము
రిప్లయితొలగించండిజవరాలా! పయిసాకు తేరరు సుమీ చందంబు గిందంబనన్
కవితా వాహిని లోన తేలుచు సదా కాల్మీదు కాల్వేసుకొం
చు వినాభావము సింగినాదములతో చోద్యమ్ములన్ జేసిరే!
కవులం బిల్వఁగరాదు దండుగ పురస్కారమ్ము లందిచ్చుటల్
జిలేబి
కవనం బందున కంద పద్యమొకటిన్ కష్టించి ధట్టించకే
రిప్లయితొలగించండికవి రాజంచును వృత్త పద్యమనగా కంపించి పర్వెత్తుచున్
చవి లేకుండను చంద్రశేఖరునివౌ చంకల్ను నాకేటి నవ్
కవులం బిల్వఁగరాదు దండుగ పురస్కారమ్ము లందిచ్చుటల్