ఆర్యా!ధన్యవాదాలు!కొద్దపాటి అన్వయ క్లిష్టత ,దూరాన్యము తొలగించుటకు శ్రీ మరళీకృష్ణ గారు పాదాల క్రమాన్ని మార్చమని సూచించారు. వారి వ్యాఖ్య యథాతథంగా; నమస్కారమండీ.. మీ పద్యం మధురం.. పాదాల వరుస ఇలా మారిస్తే అన్వయం సులభమేమో..
మైలవరపు వారూ, ఆహా! మనోహరమైన పూరణ. 'కౌసల్యాసుప్రజా రామ...' శ్లోకభావాన్ని ప్రస్తావించి చేతులు జోడించిన రాముని దివ్య మంగళ రూపాన్ని కళ్ళముందుంచారు. ధన్యోఽస్మి!
డా. పిట్టా సత్యనారాయణ గారూ, మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు. రెండవ పూరణలో 'విద్మహ క్షీర' అన్నచోట 'హ' గురువై గణదోషం. అలాగే 'ముభావము' అన్నపదం సాధువు కాదు. బ్రౌణ్యం, శ్రీహరి నిఘంటువులు పేర్కొన్నా వారు వ్యావహారికాలను కూడా గ్రహించారని గమనించండి.
(పద్మములు సూర్యుని జూచి వికసిస్తాయి. అలాకాకుండా పద్మములు సూర్యుని జూచి ముకుళిస్తాయని చెప్పడం, ఈ సమస్యలోని విరుద్ధార్థం)
సందర్భం :: *ఇందుమతీ స్వయంవరం* మహాకవి కాళిదాసు రచించిన రఘువంశ మహాకావ్యంలో, రాకుమారి ఇందుమతి, సూర్య వంశ సంభవుడు, రఘుమహారాజుయొక్క కుమారుడు రాకుమారుడు అగు అజుని, తన తండ్రి ఏర్పాటుజేసిన స్వయంవర సభలో వరిస్తుంది. ఆ సభలోనే ఉన్న ఇతర రాజకుమారులు, ఇందుమతి తమను వరించలేదని క్రుంగిపోగా, వారి హృదయములు అనే పద్మములు, సూర్యుని (సూర్య వంశ సంభవుడైన అజుని) జూచి, ముకుళించుకొన్నాయని చెప్పే సందర్భం.
డా. ఉమాదేవి గారూ, మీ నాలుగు పూరణలు బాగున్నవి. అభినందనలు. మొదటి పూరణ మొదటిపాదంలో గణదోషం. "గగనమణియె" అనండి. అలాగే "జగతియందు" అనండి. రెండవ పూరణలో 'భక్తి' తరువాత అర్ధానుస్వారం అవసరం లేదు. లేదా "భక్తిని కర పద్మములు..." అనండి.
తూర్పు తెల్ల వారెను రాత్రి తొలగి పోగ
రిప్లయితొలగించండికదలి పోవ కలువ ఱేడు కలువలెల్ల;
కమల బాంధవుని గని కాంతులీన
పద్మములు ; ముకుళించెను భాను జూచి.
జనార్దన రావు గారూ,
తొలగించండివిరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
ధన్యవాదాలార్యా!
తొలగించండికుంజరములు గుములుకూడి కొట్టుకొనుచు
రిప్లయితొలగించండినీటజొచ్చి తొండములతో నాట లాడ,
కొలనునుండి విసరబడి కుములు చున్న
పద్మములు ముకుళించెను భానుఁ జూచి
ప్రభాకర శాస్త్రి గారూ,
తొలగించండి'కమలములు నీట బాసిన...' పద్యాన్ని గుర్తుకు తెస్తున్న మీ పూరణ అద్భుతంగా ఉంది. అభినందనలు.
🙏🙏🙏
తొలగించండి(రాకుమారి కుంతి సూర్యోదయదర్శనం)
రిప్లయితొలగించండిమౌని దుర్వాసు డిచ్చిన మంత్రరాజ
మును మనమున నిలుపుకున్న ముగ్ధ కుంతి
యపుడె సూర్యోదయము జూచె;నామె నేత్ర
పద్మములు ముకుళించెను భాను జూచి.
బాపూజీ గారూ,
తొలగించండినేత్రపద్మాలను ప్రస్తావించిన మీ పూరణ అద్భుతంగా ఉంది. అభినందనలు.
కలల జగతిని వీడిన కలత నిదుర
రిప్లయితొలగించండికొంప మునిగిన దేముంది సాపాటు లేక
కలువ రాయడు కసరెను కనులు నులిమి
పద్మములు ముకుళించెను భానుఁ జూచి
అక్కయ్యా,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
"కన్నులనెడి పద్మములు..." అనండి. అన్వయం కుదురుతుంది.
కలల జగతిని వీడిన కలత నిదుర
తొలగించండికొంప మునిగిన దేముంది పాప మనక
కలువ రాయడు కసరెను కన్ను లనెడి
పద్మములు ముకుళించెను భానుఁ జూచి
సద్మము జేరగన్ జనెను జంద్రుడు, శీఘ్రమె యుత్పలమ్ములే ;
రిప్లయితొలగించండిపద్మము లన్నియున్ బ్రియుడు భానుని రాకకు జూచుచుండగన్
సద్మము వీడి భాస్కరుడు చయ్యన రాగనె త్రుళ్ళు చుండగన్
"పద్మము లెల్ల భానుఁ గని వైళముగన్ ; ముకుళించెఁ జూడుమా"
జనార్దన రావు గారూ,
తొలగించండిమొదటి పాదం చివర ఉన్న ఉత్పలాలకు చివరిపాదం చివర ఉన్న ముకుళించె నన్నదానితో అన్వయం. బాగుంది. చక్కని పూరణ. అభినందనలు.
ఆర్యా!ధన్యవాదాలు!కొద్దపాటి అన్వయ క్లిష్టత ,దూరాన్యము తొలగించుటకు శ్రీ మరళీకృష్ణ గారు పాదాల క్రమాన్ని మార్చమని సూచించారు.
తొలగించండివారి వ్యాఖ్య యథాతథంగా;
నమస్కారమండీ.. మీ పద్యం మధురం.. పాదాల వరుస ఇలా మారిస్తే అన్వయం సులభమేమో..
పద్మము లన్నియున్ బ్రియుడు భానుని రాకకు జూచుచుండగన్
సద్మము వీడి భాస్కరుడు చయ్యన రాగనె త్రుళ్ళు చుండగన్
"పద్మము లెల్ల భానుఁ గని వైళముగన్ ; ముకుళించెఁ జూడుమా"
సద్మము జేరగన్ జనెను జంద్రుడు శీఘ్రమె యుత్పలమ్ములున్ !
సవరణ: "దూరాన్వయము "
తొలగించండిసద్మము నందునన్ గనిన సంతస మొందుచు ప్రేమమీ రగన్
రిప్లయితొలగించండిపద్మిని తోడ విష్ణువట భాగ్య మటంచును రాసక్రీడలన్
పద్మవి భుండు తిట్టెనట పౌరుష మొప్పగ నాదిదే వునిన్
పద్మము లెల్ల భానుఁ గని వైళముగన్ ముకుళించెఁ జూడుమా
అక్కయ్యా,
తొలగించండిపద్యం బాగుంది. కాని సమస్యకు పరిష్కారం? కొంత అన్వయలోపం ఉంది.
నెలవు దప్పిన మైత్రియు తొలగి పోవు
రిప్లయితొలగించండిమిత్రుడైనట్టి రవియైన శత్రువగును
గట్టుపై వేయబడి తటాకమ్ము నుండి
పద్మములు ముకిళంచెను భాను జూచి
విజయకుమార్ గారూ,
తొలగించండిమీరు కూడా ప్రభాకర శాస్త్రి గారి వలె 'కమలములు నీట బాసిన...' పద్య స్ఫూర్తిని పొందారు. చక్కని పూరణ. అభినందనలు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిమైలవరపు వారి పూరణ
తొలగించండిరామ ! తెలవారె ! దైవకార్యమును నెఱప
లెమ్మిక ! నరశార్దూల ! చాలించి నిదుర
ననగ ముని., బాల రాముండునంత హస్త...
పద్మములు ముకుళించెను భానుఁ జూచి !!
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
మైలవరపు వారూ,
తొలగించండిఆహా! మనోహరమైన పూరణ. 'కౌసల్యాసుప్రజా రామ...' శ్లోకభావాన్ని ప్రస్తావించి చేతులు జోడించిన రాముని దివ్య మంగళ రూపాన్ని కళ్ళముందుంచారు. ధన్యోఽస్మి!
ధన్యోऽస్మి.. శ్రీ శంకరయ్య గారూ... నమోనమః......... మురళీకృష్ణ
తొలగించండితెల్లవారెను దిక్కులు మెల్లమెల్ల
రిప్లయితొలగించండివెలుగు నింపుకొనగలుగు వేళలందు
మెయిలు సూర్యుని గ్రమ్మగ మిన్నుమీద
పద్మములు ముకుళించె,భానుజూచి
శ్రీరామ్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'మొయిలు'ను 'మెయిలు' అన్నారు. అక్కడ "మొయిలు సూర్యుని గ్రమ్మగ నయము వీడి" అనండి.
డా.పిట్టా
రిప్లయితొలగించండిప్రగతి విజ్ఞాన శాస్త్రపు బాట లోన
నెగడులందించె"నోఝోను" నింగి వీడ(ozone)
ఆత్మ బంధువె కిరణ విహ్వలత1 బూనె (1.భయాదులచేత అవయవ స్వాధీనత తప్పి పోవడం)
పద్మములు ముకుళించెను భాను జూచి!(
డా.పిట్టా
రిప్లయితొలగించండిసద్మపు సంస్కృతీ చయము చప్పబడన్ విపరీత బంధముల్
పద్మ భవుండు దుస్సహ ముభావము జూపె, మరాళ భర్త స
ద్విద్మహ క్షీర నీర ఘన వీక్షణ బాసె, యుగాంత వేళయా?
పద్మములెల్ల భానుగని వైళముగన్ ముకుళించె జూడుమా!
డా. పిట్టా సత్యనారాయణ గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
రెండవ పూరణలో 'విద్మహ క్షీర' అన్నచోట 'హ' గురువై గణదోషం. అలాగే 'ముభావము' అన్నపదం సాధువు కాదు. బ్రౌణ్యం, శ్రీహరి నిఘంటువులు పేర్కొన్నా వారు వ్యావహారికాలను కూడా గ్రహించారని గమనించండి.
వారలదె యసూర్యం పశ్య లౌర సత్య
రిప్లయితొలగించండిమతిథి కెదురేగ బయటకు నడుగు పెట్ట
గోర వేసంగి యౌట నవ్వారి వదన
పద్మములు ముకుళించెను భానుఁ జూచి.
హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ,
తొలగించండిఅసూర్యం పశ్యల వదన పద్మాలు ముకుళించాయన్న మనోహర భావంతో అద్భుతమైన పూరణ చెప్పారు. అభినందనలు.
శార్వ రి న్ జ్యోత్స్న కాంతు ల సౌరు నిం డ
రిప్లయితొలగించండిపద్మ ము లు ముకుళిoచేను ;భాను జూచి
వి చ్చుకొ ని యె సరోజ ము ల్ విరివిగా ను
ప్రకృతి పులకించి యందమై పర వ శించె
రాజేశ్వర రావు గారూ,
తొలగించండివిరుపుతో మనోహరమైన పూరణ చెప్పారు. అభినందనలు.
పతుల నెడ బాయగ వడలు సతుల వోలె
రిప్లయితొలగించండిశోక మతులౌచు రాతిరి చూడ లేక
పద్మములు ముకుళించెను! భాను జూచి
నంత వెలుగ వచ్చు ననెడి యాశ తోడ!
శ్రీధర రావు గారూ,
తొలగించండివిరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
పద్మ లిద్దరు కవలలు బడికి వెళ్ళ ?
రిప్లయితొలగించండిభాను మిత్రత్వ మంతయు భంగ పడగ !
పద్మములు ముకులించెను భాను జుచి
స్నేహ మన్నది విడనాడ ఛీద రిoపె
ఈశ్వరప్ప గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
రిప్లయితొలగించండిమంత్ర మహిమను దెలియ్గ మానవతియె
రవిని బిలువగ, సరగున భువిని జేరి
కేలు బట్టగ సిగ్గున కుంతి నేత్ర
పద్మములు ముకుళించెను భానుఁ జూచి.
హనుమచ్ఛాస్త్రి గారూ,
తొలగించండిఅద్భుతమైన పూరణ. అభినందనలు.
'దెలియగ'... టైపాటు.
ఆదిదేవుడయిన తమయాప్తబంధు
రిప్లయితొలగించండివమవసదినము రాహువు కసనమవగ
మరుగుపడ ప్రభలెల్లను మధనపడుచు
పద్మములు ముకుళించెను భానుజాచి!
అశనమవగగా గ్రహింపగలరు!
తొలగించండిసీతాదేవి గారూ,
తొలగించండిమీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
ధన్యవాదములు గురుదేవా!
తొలగించండి*కదనమున కంప తిలకమ్ము నుదుట దిద్ది*
రిప్లయితొలగించండి*తిరిగి రాడని దెలియ నుత్తరకు నయన*
*పద్మములు ముకుళించెను భానుఁ జూచి*
*సుప్రభాతమ్ము కాదను శోకమెగయ*
సహదేవుడు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
పద్మపు మొగ్గరంబు గని భాస్కర తేజుఁడు విక్రమించి దా
రిప్లయితొలగించండిఛద్మము జేత జిక్కి బలజంబున బాలుఁడు నేలఁ గూలినన్
పద్మము నాభియందు గల వాని కిరీటియు దూఱెఁ మాధవా!
పద్మము లెల్ల భానుఁ గని వైళముగన్ ముకుళించెఁ జూడుమా
ఫణికుమార్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
గురువుగారూ నమస్సులు. ధన్యవాదములు.
తొలగించండిమైలవరపు వారి పూరణ
రిప్లయితొలగించండిపారిజాత జాత ప్రణయకలహం...
పద్మనిభాస్య ! చూచితివొ ? వక్త్రములొప్పగ విప్పి నవ్వెనీ
పద్మములెల్ల భానుఁ గని వైళముగన్ ., ముకుళించెఁ జూడుమా
సద్మగతోత్పలమ్ములు నిశాపతి గ్రుంకగ ., నన్ను నమ్ముమా !
ఛద్మవిహీనుడన్ కినుక జాలును ! సత్య ! యనుగ్రహింపవే !!
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
మైలవరపు వారూ,
తొలగించండిమీ రెండవ పూరణ అద్భుతంగా ఉంది. అభినందనలు.
కోట రాజశేఖర్ గారి పూరణ
రిప్లయితొలగించండి(పద్మములు సూర్యుని జూచి వికసిస్తాయి. అలాకాకుండా పద్మములు సూర్యుని జూచి ముకుళిస్తాయని చెప్పడం, ఈ సమస్యలోని విరుద్ధార్థం)
సందర్భం :: *ఇందుమతీ స్వయంవరం*
మహాకవి కాళిదాసు రచించిన రఘువంశ మహాకావ్యంలో, రాకుమారి ఇందుమతి, సూర్య వంశ సంభవుడు, రఘుమహారాజుయొక్క కుమారుడు రాకుమారుడు అగు అజుని, తన తండ్రి ఏర్పాటుజేసిన స్వయంవర సభలో వరిస్తుంది. ఆ సభలోనే ఉన్న ఇతర రాజకుమారులు, ఇందుమతి తమను వరించలేదని క్రుంగిపోగా, వారి హృదయములు అనే పద్మములు, సూర్యుని (సూర్య వంశ సంభవుడైన అజుని) జూచి, ముకుళించుకొన్నాయని చెప్పే సందర్భం.
ఛద్మవిహీను *భానుకుల సంభవుఁ* జూచి *స్వయంవరమ్ము* లో
*పద్మ* గ నున్న *యిందుమతి* పాత్రు *నజున్* వరియింప, బాధితుల్
సద్మ నివాసులౌ *యితర రాజులు* క్రుంగగ, వారియొక్క హృ
*త్పద్మము లెల్ల భానుఁగని వైళముగన్ ముకుళించెఁ జూడుమా.*
(ఛద్మవిహీను=కపటము లేనివానిని) (పద్మగ నున్న = లక్ష్మి వలె ఉన్న)
*కోట రాజశేఖర్ నెల్లూరు.*
రాజశేఖర్ గారూ,
తొలగించండిఅద్భుతమైన పూరణ మీది. అభినందనలు.
సద్మము వీడి కానలఁ బ్రసన్నత నుండగ రాము సన్నిధిన్
రిప్లయితొలగించండిఛద్మము తోడ భిక్షువుగ సాధ్వి నశోకవనమ్ము జేర్చగన్
దద్మనుజాశనుండు! గని తాళితె వంశపు మూలదైవమై
పద్మములెల్ల భానుఁ గని వైళముగన్ ముకుళించెఁ జూడుమా!
సహదేవుడు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
గురుదేవులకు ధన్యవాదములు. వాట్సప్ లో గురుదేవుల సూచనతో సవరించిన పూరణ. పరిశీలించ ప్రార్థన :
తొలగించండిసద్మము వీడి కానలఁ బ్రసన్నత నుండగ రాము సన్నిధిన్
ఛద్మము తోడ రావణుడు సంవననమ్మున లంక జేర్చగన్
బద్మజఁ బోలు సీతఁ! గని వాని భరించఁగ వంశ దైవమై
పద్మములెల్ల భానుఁ గని వైళముగన్ ముకుళించెఁ జూడుమా!
రిప్లయితొలగించండిగగనసీమలో మునుగంగ గగనమణి
పద్మములు ముకుళించెను ,భానుఁ జూచి
గలువలు ముడుచు కొనియెను కాంతు లీను
చందురుని మోము గానక జగతు యందు.
శబ్దశాస్త్రముల్ నేర్వంగ చక్కగాను
నభ్యసింపగ నెంచుచు నయముగాను
పవన తనయుడచంచల భక్తిఁహస్త
పద్మములు ముకుళించెను ,భానుఁ జూచి
మంత్రమహిమను చూడగ మదిని కోరి
కుంతిజపియించె మంత్రమున్ కూర్మితోడ
నగపడగ దినమణి యట నతివ హస్త
పద్మములు ముకుళించెను ,భానుఁ జూచి.
పూజ కొరకటంచును కోసి పుడమిలోన
గట్టు పైనుంచ నవియును కమిలి పోయి
పద్మములు ముకుళించెను ,భానుఁ జూచి
తావు దప్పగ నంతియె ధరను జూడ.
డా. ఉమాదేవి గారూ,
తొలగించండిమీ నాలుగు పూరణలు బాగున్నవి. అభినందనలు.
మొదటి పూరణ మొదటిపాదంలో గణదోషం. "గగనమణియె" అనండి. అలాగే "జగతియందు" అనండి.
రెండవ పూరణలో 'భక్తి' తరువాత అర్ధానుస్వారం అవసరం లేదు. లేదా "భక్తిని కర పద్మములు..." అనండి.
రాస క్రీడల వేళ సరస్సు నున్న
రిప్లయితొలగించండికలువ లన్నియు వికసింప , కనలి
పద్మములు ముకుళించెను భానుఁ జూచి
యుదయ సంధ్యనె నీ తోడ నుందుమనుచు
నిన్నటి సమస్యకు నా పూరణ
శంక వహింపక సతి తన
వంకను జూడంగమనుచు భవుని గొలువఁగన్
బింకము తో నెగసి పడుచు
శంకరుఁ డెత్తె హిమగిరిని సతి వెఱఁ గందన్
కృష్ణారావు గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
మొదటి పూరణ రెండవ పాదంలో గణదోషం. సవరించండి.
పద్మతలోదరీ విభుడు భానుడు నింగిని నిప్పులొల్క సం
రిప్లయితొలగించండిపద్మహితాత్మలై చనెడు భామినులాసుకుమార మానినుల్
పద్మ మనోహరుండు తమపైన ప్రతాపము జూప మోములన్
పద్మములెల్ల భానుఁ గని వైళముగన్ ., ముకుళించెఁ జూడుమా
భాస్కరమ్మ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'పద్మతలోదరి, సంపద్మహితాత్ములు' అంటే?
నాడు సూర్యుని గ్రహణమ్ము నాణెముగను
రిప్లయితొలగించండిరాత్రి యేతెంచెననుచును రయముగాను
పడతి కుంతియు ముదమందె నెడదలోన
పద్మములు ముకుళించెను ,భానుఁ జూచి
భాస్కరమ్మ గారూ,
తొలగించండిమీ రెండవ పూరణ బాగున్నది. అభినందనలు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఅన్నపరెడ్డి వారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'కపటవేషమ్మునన్ వచ్చి...' అనండి.
గు రు మూ ర్తి ఆ చా రి
రిప్లయితొలగించండి,,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,,
సరసి ను౦డ వికర్త నా౦శముల సోకి
కమలములు వికసిత మయి గ్రాలును గద |
కాని , కాసారమును వీడగానె , యవుర
పద్మములు ముకుళి౦చెను భాను జూచి |
య౦దు వలన మీ స్థానము ల౦దె యు౦డ
వలయు | లేనిచో యెవరు కాపాడ లేరు |
ి
ె{ వికర్త నా౦శములు = సూర్య కిరణములు ;
కాసారము = సరసు ; }
గురుమూర్తి ఆచారి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
శీత కాలమం దుదయమ్ము వీతిహోత్రుఁ
రిప్లయితొలగించండిగాంచ సంతసం బైనను గర్కశంపు
మండు టెండ యందునఁ జన మండుచు ముఖ
పద్మములు ముకుళించెను భానుఁ జూచి
సద్మము నందు మెండుగ ప్రశస్త మణివ్రజ నీలముల్ మహా
పద్మము లుండ నా గృహము భాసిలు పద్మిని చందమై యిలం
బద్మిని యందు వింతగ నపార విలాస సరోజముల్ వినా
పద్మము లెల్ల భానుఁ గని వైళముగన్ ముకుళించెఁ జూడుమా
[బానుని జూచి సరస్సులోని పద్మేతరములు వాడినా గృహపద్మిని లోని మహాపద్మముల తో పాటు మిగిలిన రత్నసరోజములు ననిశము వికసించుచునే యుండును.]
కామేశ్వర రావు గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు ఉత్తమంగా ఉన్నవి. అభినందనలు.
పూజ్యులుశంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు.
తొలగించండినోట్ల రద్దు ధనికుల పై వేటు బడగ
రిప్లయితొలగించండిమోడి కీర్తి వెలిగె నెల జోడు వోలె
భారతావని నల్లకు బేరుల యొక్క
పద్మములు ముకుళించెను భానుఁ జూచి
కుబేరుని నవనిధులు : కచ్ఛపము, కుందము, ఖర్వము, నీలము, పద్మము, మకరము, మహాపద్మము, ముకుందము, శంఖము.
(నల్ల కుబేరుల యొక్క నవ నిధులు స్వర్ణము, కార్లు ,భూమి, ప్లాట్లు , ధనము ,రజతము, బాండ్లు,డొల్ల కంపెనీలు ప్రాంసరీనోట్లు)
పూసపాటి వారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
మూడవపాదం చివర గణదోషం. సవరించండి. "నల్ల కుబేరుల వగు" అంటే ఎలా ఉంటుంది?
గురువు గారికి నమస్కారములు. అవును స్వామీ పొరపాటు పడ్డాను. సవరిస్తాను
తొలగించండితమతమ నెలవులందున దాపరిల్ల
రిప్లయితొలగించండిస్థానమహిమచే కాంతులు తళ్కులెత్తు
నీట వికసించు పద్మముల్ బైట పడగ
పద్మములు ముకుళించెను ,భానుఁ జూచి
తిమ్మాజీ రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
పద్మముల్, పద్మములు అని పునరుక్త మయ్యాయి. "నీట నివసించునట్టివై బైట పడగ" అందామా?
గురుదేవుల సూచన మేరకు సవరించిన పద్యము
తొలగించండితమతమ నెలవులందున దాపరిల్ల
స్థానమహిమచే కాంతులు తళ్కులెత్తు
నీట నివసించు నట్టివై బైట పడగ
పద్మములు ముకుళించెను ,భానుఁ జూచి
కపటవేషముతోవచ్చి కర్ణునడుగ నతని కవచకుండలములనర్థితోడ
రిప్లయితొలగించండికౌశికుని మాయనెరిగించ కర్ణుడు కర పద్మములముకుళించెను భాను జూసి
అన్నపరెడ్డి వారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
క్రొవ్విడి వెంకట రాజారావు:
రిప్లయితొలగించండితన వినతిని కరుణదోడ తలను దాల్చి
జిష్ణుడక్షయపాత్రను చేత బట్టి
యివ్వరాగ ధర్మేంద్రుడా నృగవుని కర
పద్మములు ముకుళించెను భాను జూచి
రాజారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఛద్మము చేసి బాలకుని జంపిరి యోధులు కూడి నిర్దయన్
రిప్లయితొలగించండిపద్మము నందు, సైంధవుని బాణమునన్ తల ద్రుంచె పార్థుడున్
సద్మము జల్లి కౌరవుల సంతసమందున వారి మోములన్
పద్మములెల్ల భానుఁ గని వైళముగన్ముకుళించెఁ జూడుమా.
మిస్సన్న గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
గద్మను బట్టి వేడితిని కన్నయ నక్కట ముద్దుముద్దుగా
రిప్లయితొలగించండిసద్మము లోని గ్రంథములు చాలగ జూచితి కాననెక్కడన్
ఛద్మము జేసెపృచ్ఛకుడు! సత్యము గాదిటువంటి వాక్యమే
*"పద్మములెల్ల భానుఁ గని వైళముగన్ ముకుళించెఁ జూడుమా"*
తిరుక్కోవళ్ళూరు శ్రీహర్ష
డా.పిట్టా
రిప్లయితొలగించండివిల్లును యెత్తలేడు, ఘన వేగముతో ధరణీజనెత్తె యీ
ప్రల్లదగాథ రామకథ;బాయదులే విధి వంచు నందరిన్
పుల్లను లేపనీదు గదె పూనని భాగ్యము,లోక కంటకా
లల్లగ రావణుండు బలి యౌటయె యుక్తము రాము చేతులన్!
చిద్మిన దీపమోయనెడు చింపిరి జుత్తుల మోహనాంగియౌ
రిప్లయితొలగించండిపద్మజ నాయుడమ్మయొక పండుగ ప్రొద్దున నిద్రతీయగా
నద్ముచు భర్తలేపగను హాయిని వీడిన కంటి రెప్పలౌ
పద్మము లెల్ల భానుఁ గని వైళముగన్ ముకుళించెఁ జూడుమా