12, నవంబర్ 2017, ఆదివారం

సమస్య - 2518 (పుస్తకముఁ బఠింత్రు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"పుస్తకముఁ బఠింత్రు మూర్ఖజనులు"
(లేదా...)
"పుస్తకముల్ బఠించెదరు మూర్ఖజనాళి వివేకశూన్యులై"

56 కామెంట్‌లు:

  1. భారతమ్ము తోడ భాగవతము గూడ
    చదువ లేని నరులు, వదలి వేసి,
    చెత్త చెత్త కథల క్రొత్త కొఱకు ముఖ
    పుస్తకముఁ బఠింత్రు మూర్ఖజనులు

    రిప్లయితొలగించండి
  2. శస్తము గల్గ లోకమున శాస్త్రము జెప్పిరి విజ్ఞులెందరో
    మస్తక మేల వాడరొకొ? మాన్యులు చూపిన త్రోవనేగగన్
    హస్త విభూషణమ్ముగనె వాడుచు నూరక తత్వమెంచకే
    "పుస్తకముల్ బఠించెదరు మూర్ఖజనాళి వివేకశూన్యులై"

    రిప్లయితొలగించండి
  3. పెద్ద చదువు లెన్నొ పేరున కేగాని
    తత్వ మెఱుగ కుండ తగునె చదువ?
    మర్మ మెరుగ కుండ మహిలోన దఱచుగ
    "పుస్తకముఁ బఠింత్రు మూర్ఖజనులు"

    రిప్లయితొలగించండి
  4. పాఠ్య గ్రంధ మసలు పఠియించ వలెనన్న
    పరమ బోరు గాదె వలదు నిలను
    సెల్లు ఫోను మించి యుల్లము రంజిల్ల
    పుస్తకముఁ బఠింత్రు మూర్ఖ జనులు

    రిప్లయితొలగించండి
  5. రిప్లయిలు
    1. నవరసము లొలికెడు కవనములు విడచి
      ముక్తినొసగు భక్తిపొత్త మొదలి
      వడ్డిమీదవడ్డి వడ్డించు పద్దుల
      పుస్తకము పఠీoత్రు మూర్ఖజనులు

      తొలగించండి
    2. ధన్యవాదములు జిలేబి గారు! వృత్తి చేతకాక ప్రవృత్తిచేత పఠీoచే వారని నాఉద్దేశ్యం!

      తొలగించండి
  6. వాస్తవ లోకమందు గల వారలు కొందరు బుద్ధిహీనులై
    వస్తువులే ప్రపంచమని భావన జేయుచు విర్రవీగుచున్
    మస్తము వాడకుండ తగు మాత్రము నిత్యము వ్యర్థమౌనటుల్
    పుస్తకముల్ బఠించెదరు మూర్ఖ జనాళి వివేక శూన్యులై.

    రిప్లయితొలగించండి
  7. మైలవరపు వారి పూరణ

    ఇహ పర సుఖములను నిచ్చు రామాయణ
    కల్పవృక్ష పుస్తకమ్ము రోసి ,
    విబుధ దూషితమ్ము విషవృక్షమనియెడు
    పుస్తకము బఠింత్రు మూర్ఖజనులు !!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
  8. [11/12, 6:01 AM] sreeramaraochepuri: వాస్తవ జ్ఞానశూన్యతన వాదముజేయుచు గొప్పవారిగన్
    వస్తువు దృక్పధమ్ము నకు భాష్యము చెప్పుచు తప్పుభావనల్
    మస్తకమందునింపిపరమార్దమిదేనను తత్త్వచింతనా
    పుస్తకముల్ పఠించెదరు మూర్ఖజనాళి వివేక శూన్యులై
    [11/12, 6:03 AM] sreeramaraochepuri: వస్తువు దృక్పదము=materialistic thought

    రిప్లయితొలగించండి



  9. నమ్ముమోయ్ హస్తసాముద్రికము, జ్యోతిష్యము అవే తెలుపును నీ డెస్టినీ :)


    హస్తములోని గీఱ గతి, అత్కుడు,సూర్యుడు, నింగితారలున్
    ప్రస్తుతమందు జీవితపు బాటను దేల్తురహో, జిలేబియా !
    మస్తక మందు మాదమును మత్తున తూగుచు వృద్ధిగాంచగన్
    పుస్తకముల్ బఠించెదరు మూర్ఖజనాళి వివేకశూన్యులై !


    జిలేబి

    రిప్లయితొలగించండి


  10. హస్త మందు గీఱ లవిగదా దేల్చును
    ప్రస్తు తము జిలేబి బతుకు బాట !
    మస్తకమును నింప మాన్యులు పుష్టిగ
    పుస్తకముఁ బఠింత్రు, మూర్ఖజనులు!

    జిలేబి

    రిప్లయితొలగించండి
  11. డా.పిట్టా
    *పన్నుగ తనకంటె పాపి చెనటి లేడు*1
    అనడె నాడ్కబీరు యతియు నకట!
    ఆత్మబోధ భక్తు లాధారముగ లేని
    పుస్తకము బఠింత్రు మూర్ఖ జనులు
    (1.మో సో మూరఖ్ నాహి...కబీరు తనకంటే మూర్ఖుడు లేడని ,యనుట)

    రిప్లయితొలగించండి
  12. డా.పిట్టా
    చదువ వచ్చినంత సంస్కారమే లేని
    మనసు దోచు లింగ మాన్యతలను
    చలము బట్టి చలపు చంచల కథలదౌ
    పుస్తకము బటింత్రు మూర్ఖ జనులు

    రిప్లయితొలగించండి
  13. డా.పిట్టా
    మస్తకమందు వ్యాకరణ మాన్యతనే తొలగించి ఛందపున్
    శాస్తి(శిక్ష)కి పాల్పడన్ గనుట శైశవ మన్నటులే స్వ రాష్ట్రమే
    హస్తమునందు నుంచుకొని హాయిగ పోతన వారసత్వమున్
    బ్రస్తుతి జేయలేని పరిపంథి ప్రథన్ మొలిపించునట్టి వే
    పుస్తకముల్ బఠించెదరు మూర్ఖ జనాళి వివేక శూన్యులై

    రిప్లయితొలగించండి


  14. హృదయ మనెడు పొత్త మందు గలదు సక
    లమ్ము ! జ్ఞాత విభుడు! లక్షణముగ
    తనను చదువ వలెను తన్వంగి ! విజ్ఞాన
    పుస్తకముఁ బఠింత్రు, మూర్ఖజనులు!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అంటే scince books చదివిన నాబోంట్లు మూర్ఖ జనులని బాగా చెప్పారు!

      :(

      తొలగించండి
  15. చక్కనైన నైన నీతి సంప్రదాయ ములను
    తెలి య జేయు నట్టి దివ్య పొత్త
    ములను చదువ మాని మురియు చిలను చెత్త
    పుస్తకము పఠింత్రు మూర్ఖ జనులు

    రిప్లయితొలగించండి
  16. భూరి పదవు లిచ్చు భోగ భాగ్యములకు
    పుస్తకముఁ బఠింత్రు మూర్ఖజనులు
    మదిని శాంతి కొరకు మంచివాడగుటకు
    జీవితము పఠింపు మవిరతముగ ౹౹

    రిప్లయితొలగించండి
  17. గు రు మూ ర్తి ఆ చా రి
    ,,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,,

    ప్రస్తుత మ౦దు - భారతము , భాగవతమ్ము

    . . బఠి౦పకే యిటుల్

    ధ్వస్తము లయ్యె జీవనపు బ్రక్రియ

    . . లెల్లను | నే డసభ్యమౌ

    వస్తువు లున్న దుష్కథల (న్) వ్యస్తము

    . . గా నయె స౦ఘ మెల్ల | నా

    పుస్తకముల్ బఠి౦చెదరు మూర్ఖజనాళి

    . . వివేక శూన్యులై ! !

    { ధ్వస్తము = దిగజారినది ; వస్తువు =

    కథా వస్తువు ; వ్యస్తము =

    వ్యాకులత జె౦దు , నాశ మగు }

    రిప్లయితొలగించండి
  18. తెలుగు పద్య గద్య ములకు వారసులయ్యు
    నన్య దేశ భాష నరువు దెచ్చి
    జబ్బ చరుచు కొనుచు జబ్బు పడుచు నాంగ్ల
    *పుస్తకము బఠింత్రు మూర్ఖజనులు*

    రిప్లయితొలగించండి
  19. రిప్లయిలు
    1. చాలా బాగుంది సార్
      భావము,పద్యమూ రెండూ

      తొలగించండి
    2. చాలా బాగుంది సార్
      భావము,పద్యమూ రెండూ

      తొలగించండి
    3. కోట రాజశేఖర్ గారి పూరణ

      అవధాని శ్రీ మైలవరపు మురళీకృష్ణ గారి సూచన మేరకు
      సవరణ చేసి పంపుచున్నాను. దయతో గమనింప ప్రార్థన:


      సందర్భం :: సెప్టెంబర్ 15 ను మనం ఇంజనీర్స్ డే అని జరుపుకొంటాం. అది ప్రముఖ ఇంజనీరు భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి పుట్టినరోజు. వారు ఒకరోజు ఒక కుగ్రామంలో రాత్రివేళ వాస్తవమైన నివేదికను తయారుచేసి ఒక క్రొవ్వువత్తి ని ఆర్పి వేరొక క్రొవ్వువత్తిని వెలిగించి వాడుకొన్నారు. వారు అలా చేయడం చూచి అలా ఎందుకు చేశారు? అని అడిగిన వ్యక్తి సంశయాన్ని తొలగిస్తూ మోక్షగుండం వారు సమాధానం ఇచ్చే సందర్భం. ఇదే నిజాయతీ అంటే.

      ‘’వాస్తవ మేమి? సంశయము బాపుము, మైనపువత్తి నార్పుచున్
      ప్రస్తుత మీవు వేరొకటి వాడిన కారణ మే’’ మనంగ, నా
      శస్తుడు *మోక్షగుండ* మట సంశయమున్ తొలగింప బల్కెగా
      ‘’నేస్తమ ! రాత్రివేళ గమనింప, ప్రభుత్వపు క్రొవ్వువత్తినే
      ప్రస్తుత మీ నివేదికకు వాడితి; నా పని యంచు, యిప్పుడీ
      పుస్తకమున్ పఠింప తలపోసితి, నాదగు క్రొవ్వువత్తితో,
      వస్తువులన్ ప్రభుత్వ మిడ, వాటిని యిప్పుడు గూడ వాడుచున్
      పుస్తకముల్ పఠించెదరు, మూర్ఖజనాళి వివేకశూన్యులై.’’


      *కోట రాజశేఖర్ నెల్లూరు.*

      తొలగించండి
    4. శ్రీ చేపూరి శ్రీ రామారావు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు.

      కోట రాజశేఖర్

      తొలగించండి

    5. వామ్మో !

      ఎక్కడి కథకు ఎక్కడ లింకు పెట్టారండీ బాబోయ్ !

      అదురహో !

      గట్టి కోట గట్టిన రాజశేఖర గారు !


      జిలేబి

      తొలగించండి
    6. భలే భలే జిలేబి.
      వట్టి ప్రశంస కాకుండా
      గట్టి ప్రశంస
      నెట్టులో నెట్టులో పెట్టినట్టి
      మీకు దండం పెట్టి
      సెలవు అని సందేశం పెట్టి
      ఉంటాను మరి. ధన్యవాదాలతో

      మీ
      కోట రాజశేఖర్.

      తొలగించండి
    7. జిలేబి గారుకూడా ఆకాశవాణి హైదరాబాదు కేంద్రానికి పూరణ పంపారు. సమయంలేక చదవలేదు.

      తొలగించండి
  20. ఆతురత గతజల సేతుబంధన మనఁ
    గాల కర యుగళము గోల నాకు
    లలము నట్ల నిసినిఁ బలవరించుచు నింక
    బుస్తకముఁ బఠింత్రు మూర్ఖజనులు


    దుస్తరమైన కామ మద దూషిత మానస చోది తార్తయై
    విస్తరమై చెలంగెడు వివేక వినాశక భూత జాలముల్
    మస్తక తాప కారకపు మాన హరమ్ములు దుష్ట సాహితుల్
    పుస్తకముల్ బఠించునట మూర్ఖజనాళి వివేకశూన్యమై


    రిప్లయితొలగించండి
  21. మస్తకమందునున్నత ప్రమాణములన్నెలకొల్పు నట్టివౌ
    పుస్తకముల్ పఠించుటలు బోరని వల్కుచు స్మార్టుఫోనునన్
    వస్తువులెల్ల గాంచుచును వాట్సపు ట్విట్టరు మున్గి ఫోనులో
    "పుస్తకముల్ బఠించెదరు మూర్ఖజనాళి వివేకశూన్యులై

    రిప్లయితొలగించండి
  22. పుస్తకము పఠింత్రు మూర్ఖ జనులు గూడ
    మూర్ఖు లైన గాని పుస్త కముల
    పఠన మనిన నిష్ట పడువారు గావున
    చదువు చుండు రేమొ సామి ! వారు

    రిప్లయితొలగించండి
  23. కలవు ధరణిలోన కడుహితమ్మొన గూర్చు
    భాగవతము వంటి పావనములు
    వాని చదువబోక కానీకి కొరగాని
    పుస్తకము పఠింత్రు మూర్ఖ జనులు

    రిప్లయితొలగించండి
  24. మైలవరపు వారి పూరణ


    మస్తకమందు నిల్పరణుమాత్రము జ్ఞానము , కేల్కులేటరన్
    వస్తువు చిన్న లెక్కలకె వాడుదురెంతటి బద్ధకస్థులో !
    ధ్వస్తమతుల్ పరీక్షలకు బాలురు గూగులు లోన జూచి యీ...( e books )
    పుస్తకముల్ బఠించెదరు మూర్ఖజనాళి వివేకశూన్యులై !

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
  25. హస్తము నందు భూషణమ యూ నటు కాకను పండితోత్తముల్
    పుస్త కముల్ బఠించెదరు ,మూర్ఖ జనాళి వివేక శూన్యులై
    పుస్తకముల్ వృధాయనుచు మూర్ఖపు బుధ్ధిని జించి వేతురే
    పుస్తక మూల్యమున్ గనక పోకిరి వోలెను నేమి జేతుమా

    రిప్లయితొలగించండి
  26. నేనె దైవమనుచు గానమ్ములన్ గూర్చి
    సేవకాది పూజ స్వీకరించి
    వాస్తవమ్ము రోసి పాండిత్యమని వ్రాయు
    పుస్తకముఁ బఠింత్రు మూర్ఖజనులు!

    రిప్లయితొలగించండి
  27. *విస్తునుపొంద పెద్దలటు వేదికలుండగభక్తిముక్తి కై*
    *స్వస్తినిబల్కిదూరెదరసభ్యపు గ్రూపులసెల్లులన్ రుజా*
    *గ్రస్తములయ్యెమస్తకములారయనస్తమానమీ*
    *పుస్తకముల్ బఠించెదరు! మూర్ఖజనాళి వివేకశూన్యులై*

    *శ్రీమతి జి సందిత బెంగుళూరు*

    రిప్లయితొలగించండి
  28. *విస్తునుపొంద పెద్దలటు వేదికలుండగభక్తిముక్తి కై*
    *స్వస్తినిబల్కిదూరెదరసభ్యపు గ్రూపులసెల్లులన్ రుజా*
    *గ్రస్తములయ్యెమస్తకములారయమానకనస్తమానమీ*
    *పుస్తకముల్ బఠించెదరు! మూర్ఖజనాళి వివేకశూన్యులై*

    *శ్రీమతి జి సందిత బెంగుళూరు*

    రిప్లయితొలగించండి
  29. *విస్తునుపొంద పెద్దలటు వేదికలుండగభక్తిముక్తి కై*
    *స్వస్తినిబల్కిదూరెదరసభ్యపు గ్రూపులసెల్లులన్ రుజా*
    *గ్రస్తములయ్యెమస్తకములారయమానక యస్తమానమీ*
    *పుస్తకముల్ బఠించెదరు! మూర్ఖజనాళి వివేకశూన్యులై*

    *శ్రీమతి జి సందిత బెంగుళూరు*

    రిప్లయితొలగించండి
  30. ప్రస్తుతిఁ జేయఁగన్ ధనముఁ బంచిన నేర్పడు వందిమాగధుల్
    సుస్థిరమైన భక్తులుగ చుట్టును జేరఁగ నేనె దైవమన్
    దుస్తర భావవీచికల దోషమయమ్ముగ దీర్చి వ్రాయగన్
    పుస్తకముల్ బఠించెదరు మూర్ఖజనాళి వివేకశూన్యులై!

    రిప్లయితొలగించండి
  31. చదువు నేర్చి నట్టి సం స్కా రవంతులు
    పుస్తకము బఠిoత్రు !మూర్ఖజనులు
    మూఢ తత్వ మందు ముందుచూపు లేక
    పరుల మాట వినరు కరుణదరికి

    రిప్లయితొలగించండి
  32. వరము వంటి చదువు పఠన చే నేర్వగ
    పుస్తకములు బఠిoత్రు iమూర్ఖ జనలు
    అనువు గాని చోట యధికులమనుచును
    సంత సింత్రు యెపుడు వింతగాను

    రిప్లయితొలగించండి
  33. హస్తము నందు భూషణము హద్దులు దాటని పుస్తకంబు గ్రం
    థస్తము గూడనట్టివగు దప్పుల తోడను నిండినట్టి య
    ప్రస్తుత మైన పంకిలపు బాధ్యత వీడిన శంకుతుల్యమౌ
    పుస్తకముల్ బఠించెదరు మూర్ఖజనాళి వివేకశూన్యులై

    రిప్లయితొలగించండి
  34. చదివినది యొకింత మెదడుకు నెక్కదు
    ధ్యాస యుండు వేరు తావులందు
    వల్లె వేయు చుంద్రు నెల్లి పరీక్షకై
    పుస్తకము బఠిoత్రు !మూర్ఖజనులు

    రిప్లయితొలగించండి
  35. అక్షరముల గుర్తు ఆవంత యుండదు
    చలువ కళ్ళజోడు వల ధరించి
    కన్నెపిల్ల యెదుట వన్నెలు జూపగ
    పుస్తకము బఠిoత్రు !మూర్ఖజనులు

    రిప్లయితొలగించండి
  36. (పుస్త్తకాల పురుగులైన విద్యార్థులు )
    తారచంద్రసూర్యధవలిమ లెఱుగరు ;
    విరుల తరుల ఝరుల గిరుల గనరు ;
    నెమలి చిలుక పి కపు నెయ్యము జేయరు
    పుస్తకము బఠింత్రు మూర్ఖ జనులు.

    రిప్లయితొలగించండి
  37. సజ్జనుల చెలిమియు, చక్కని పొత్తము
    బ్రతుకు బాట జూపు బంధువులన
    నిత్య సత్య మరయ నేరనపుడెటుల
    పుస్తకము బఠింత్రు మూర్ఖ జనులు?

    రిప్లయితొలగించండి
  38. తండ్రి యిడిన సొమ్ము తగులబెట్టుచు నిచ్చ
    పుస్తకముల పైన మోజుతరిగి
    మదిని నిలుపలేక చదువునందు సినిమా
    పుస్తకముఁ బఠింత్రు మూర్ఖజనులు

    రిప్లయితొలగించండి
  39. ఉః మస్తకమందు నిత్యమును మారుడు బాణము లేయు చుండగన్
    జాస్తిగ మానసమ్మునను చక్కని కాంతలు కానుపించుచున్
    వాస్తవ చిత్తమున్ చెరుప, పాఠము లన్ విడి నిత్య మన్యమౌ
    పుస్తకముల్ బఠించెదరు మూర్ఖజనాళి వివేకశూన్యులై

    రిప్లయితొలగించండి
  40. ముక్తి నంద గోరి పుడమిన సుజనులు
    పుస్తకముఁ బఠింత్రు .మూర్ఖజనులు.
    మంచి పుస్తకముల నెంచి చదవకుండ
    చెడుపు కొందు రయ్య జీవితములు.

    భక్తి పెంచు నట్టి భాగవతాదులు
    విడిచి పనికి రాని పరమ చెత్త
    యైన ,నీతిబాహ్య మైన కుకవికృత
    పుస్తకముఁ బఠింత్రు .మూర్ఖజనులు.

    తెలుగు లోన గలవు తెలివిని పెంచుచు
    ముక్తి నొసగు నట్టి పుస్తకములు
    వాని నెల్ల వీడి వసుధలో కుకవుల
    పుస్తకముఁ బఠింత్రు .మూర్ఖజనులు.

    రిప్లయితొలగించండి
  41. ఆస్తులు దిట్టముండుటకు హస్తపు రేఖల శాస్త్రముల్ సదా,
    శిస్తులు కట్టకుండుటకు శ్రీకృప సూక్తుల శాస్త్రముల్ భళా,
    పస్తులు పట్టకుండుటకు వాస్తుల దిద్దెడి శాస్త్రముల్నహా!
    పుస్తకముల్ బఠించెదరు మూర్కమూర్ఖజనాళి శూన్యులై...

    రిప్లయితొలగించండి
  42. వాస్తులు జాతకమ్ములను భారిగ నమ్మెడు నేతలుండగా
    మస్తుగ చంద్రశేఖరులు మార్కుల నివ్వగ న్యూమరాల్జినిన్
    చస్తును బ్రత్కుచున్ కొనుచు శాస్త్రము నిచ్చట భౌతికమ్మునౌ
    పుస్తకముల్ బఠించెదరు మూర్ఖజనాళి వివేకశూన్యులై...

    రిప్లయితొలగించండి