15, నవంబర్ 2017, బుధవారం

సమస్య - 2521 (పట్టపగలు వెన్నెల...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది.... 
"పట్టపగలు వెన్నెల విరిసెన్" (ఛందోగోపనము)
ఈ సమస్యను పంపిన గుఱ్ఱం జనార్దన రావు గారికి ధన్యవాదాలు.
(ఛందోగోపనము - పృచ్ఛకుడు సమస్యను పూర్తి పాదంగా కాకుండా కొంత భాగాన్ని, లేదా మూడవ పాదంలో కొంత భాగం నుండి మొదలు పెట్టి ఇస్తాడు. అవధాని అది ఏ ఛందస్సులో ఇముడుతుందో గ్రహించి పూరించాలి.
ఉదాహరణకు... "శివుఁడు గరుఁడు నెక్కి వడివడిఁ బారెన్" అని సమస్య ఇచ్చారనుకోండి. కందపాదం ప్రారంభంలో కొంత వదలిపెట్టారు. కవి అక్కడ మూడు లఘువులను చేర్చి కాని (పరమశివుఁడు...), ఒక గురువు ఒక లఘువు వేసికొని కాని (మూడుకనులు నయముగ గల। వాఁడు శివుఁడు...) పూరించవచ్చు.
అలాగే... "అర్జునుఁ డూరువులన్ భంగపఱచె నుగ్రుం డగుచున్" అని సమస్య ఇచ్చారనుకోండి. ఇక్కడ కందంలో మూడవ పాదం చివర నుండి సమస్య ఇవ్వబడింది. "అర్జునుఁ। డూరువులన్ భంగపఱచె నుగ్రుం డగుచున్" అని భావించాలి).

95 కామెంట్‌లు:

 1. ముచ్చట గొలిపెడి నగవులు
  విచ్చిన కమలమ్ము వంటి వెలుగు మొగముతో
  నెచ్చెలియే నా యెదుటకు
  విచ్చేయగ పట్ట పగలు వెన్నెల విరిసెన్.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. జనార్దన రావు గారూ,
   చక్కని పూరణతో శుభారంభం చేశారు. బాగుంది. అభినందనలు.

   తొలగించండి
 2. చెంతకు రమ్మని ప్రేమగ
  కాంతయె పిలిచెను ప్రియుడను కనుసైగలతో
  సంతోషించిన వాడికి
  వింతయె యది పట్ట పగలు వెన్నెల విరిసెన్.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. విరించి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   ప్రియుణ్ణి అనే అర్థంలో 'ప్రియుడను' కుదరదు. అక్కడ "ప్రియతముఁ గనుసైగలతో" అనండి.

   తొలగించండి
 3. అనువుగ తెలగాణ ప్రజలు
  మనమున కోరికలుదీరి మన్నన మీరన్,
  వినగనె చంద్రుని విజయము
  వెనువెంటనె పట్టపగలు వెన్నెల విరిసెన్!

  చంద్రుడు = KCR

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ప్రభాకర శాస్త్రి గారూ,
   మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.

   తొలగించండి
 4. కనుమా ఖగోళ వింత
  న్నినునకు సంపూర్ణ గ్రహణ మేర్పడి నంతన్
  దనరగ తారలు గనపడ
  వినువీధిని పట్టపగలు వెన్నెల విరిసెన్!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అయ్యా! సహదేవుడు గారు:

   సంపూర్ణ సూర్యగ్రహణములో తారలు కనపడవచ్చు కానీ చంద్రుడు, వెన్నెల, కనపడవు. అమావాస్య నాడు కదా సూర్యగ్రహణము. కవుల దృష్టి వేరనుకోండి...

   తొలగించండి
  2. సహదేవుడు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   ******
   శాస్త్రి గారూ,
   ఆ రోజు వెన్నెల కాదు కాని, వెన్నెల అనే భ్రాంతి కలుగుతుంది కదా!

   తొలగించండి
  3. సారూ:

   కవిహృదయం నాకెలా తెలుస్తుంది? ఇప్పటికి నేను చేసిన 700 పూరణలలో "ప్రియురాలు" అన్న పదం ఒకదానిలో కూడా లేదు.

   😂

   తొలగించండి
 5. తెల్లని మబ్బుల పయనము
  చల్లని మలయా నిలముల సౌరులు విరియ
  న్నుల్లము రంజిలు రీతిగ
  వెల్లువ గాపట్ట పగలు వెన్నెల విరిసెన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అక్కయ్యా,
   మీ పూరణ 'పగలే వెన్నెల... జగమే ఊయల' పాటను గుర్తుకు తెచ్చింది. బాగుంది. అభినందనలు.

   తొలగించండి
  2. పురస్కార గ్రహీతకు అభినందనలు + ధన్య వాదములు

   తొలగించండి


 6. శంకట పరిస్థితుల, సిరి
  చెంగట గల దేవదేవ చేమొగుపులనన్,
  వేంకటపతిని గనన్ తిరు
  వేంకటమున పట్టపగలు వెన్నెల విరిసెన్!

  జిలేబి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. జిలేబీ గారూ,
   మనోహరమైన పూరణ. అభినందనలు.
   'సంకట'...టైపాటు.

   తొలగించండి
  2. 'దేవదేవ చేమొగుపులు' అంటే దుష్టసమాసం అవుతుంది. అక్కడ "దేవదేవు" అనండి.

   తొలగించండి

 7. బొంబాయి నగరపు పురస్కారము నందు కున్న శంకరయ్య‌గారికి


  నిజమైన మిత్రుడివలెన్
  కజాతుని వలె పదములను కైపదముల జే
  సి జనాళికి ముదము గొలుప
  విజయేశా!పట్ట పగలు వెన్నెల విరిసెన్!

  జిలేబి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. జిలేబీ గారూ,
   ప్రశంసాత్మకమైన మీ పూరణ బాగున్నది. అభినందనలు, ధన్యవాదాలు!
   ప్రొద్దున్నే 'ఆంధ్రభారతి' దర్శనం చేయించారు. :-)

   తొలగించండి
 8. సెగలను జిమ్మెడి యెండల
  జగమెరిగినకవి సినారె చల్లనిపాటల్
  వగ బాపుచు మనమున బెం
  పెగయన్ బురి పట్టపగలు వెన్నెల విరిసెన్.

  రిప్లయితొలగించండి


 9. మిట్టూరోడి కథల, పడి
  కట్టు కథ, జనపద కథల కథనడచు గతుల్
  పట్టుగ చూడ జిలేబీ
  పిట్టకతల పట్టపగలు వెన్నెల విరిసెన్ !

  జిలేబి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. జిలేబీ గారూ,
   మీ తాజా పూరణ వైవిధ్యంగా, చక్కగా ఉంది. అభినందనలు.

   తొలగించండి
 10. మైలవరపు వారి పూరణ

  హాయిఁ బొంగెను హృదయాబ్ధులన్ని , *పట్ట*
  *పగలు వెన్నెల విరిసెన్* వివాహవేళ
  రామ *చంద్రుడు* సీతను ప్రేమ గొనగ
  నమ్మహీజ *ముఖేందుబింబమ్ము* మెరయ !!

  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మైలవరపు వారూ,
   రెండు చంద్రులు ఒకచోట చేరితే పట్టపగలే వెన్నెల. సమస్యను తేటగీతిలో ఇమిడ్చిన మీ నైపుణ్యం ప్రశంసనీయం. అద్భుతంగా ఉంది. అభినందనలు.
   *****
   మైలవరపు మురళీకృష్ణ, కోట రాజశేఖర్ గారల పూరణలను బ్లాగు మిత్రులకు క్రమం తప్పకుండా పరిచయం చేస్తున్న ప్రభాకర శాస్త్రి గారికి ధన్యవాదాలు.

   తొలగించండి
  2. ధన్యవాదాలండీ శ్రీ శంకరయ్య గారూ.. నమోనమః..
   శ్రీ శాస్త్రి వారు ఆ బాధ్యతను ఆనందంగా భావింతునని తెలిపియున్నారు.. మా పద్యాలను మరో నలుగురితో చదివించి.. వారి వారి స్పందనలను మరల వాట్సప్ లో ప్రచురిస్తున్నారు.. వారికి మరిన్ని ధన్యవాదాలు...... మురళీకృష్ణ

   తొలగించండి
  3. గురువరేణ్యులు శ్రీ కంది శంకరయ్య గారికి భక్తిపూర్వక ప్రణామాలు. మా పద్యాలను పదిమంది చదివేందుకు అనువుగా సహృదయులు శ్రీ ప్రభాకర శాస్త్రి గారు ఎంతో కృషి చేస్తున్నారు. ఉభయులకూ సర్వదా హృదయపూర్వక కృతజ్ఞుడను. భవదీయుడు కోట రాజశేఖర్ నెల్లూరు.

   తొలగించండి
 11. వలచె గురజాడ కన్యక
  నెలవంక ధరుని , యవార్డు నీయన్ ముంబై
  బులకించగా ,యపుడు సుక
  విలోకమున బట్టపగలు వెన్నెల విరిసెన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కృష్ణ సూర్యకుమార్ గారూ,
   మీ ప్రశంసారూపమైన పూరణ చాలా బాగున్నది. అభినందనలు, ధన్యవాదాలు.

   తొలగించండి
 12. ఘనతర తారా శాలను
  మును గాంచగ నేగి నాడ మోదము తోడన్
  మనమలరిన దట జేరగ
  వినుడా స్థలి బట్టపగలు వెన్నెల విరిసెన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సత్యనారాయణ మూర్తి గారూ,
   నక్షత్రశాలలో వెన్నెలను కురిపించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 13. నయగారముగా వచ్చిన
  ప్రియసఖిఁ గని పట్టపగలు వెన్నెల విరిసెన్
  రయమునఁ జేరితిఁ జెంతకు
  నయనములను సంతసమ్ము నాట్యముఁ జేయన్

  రిప్లయితొలగించండి
 14. కలగనె నొకరు డు వింతగ
  వలచిన చెలి కనుల ముందు వయ్యారము ల
  న్నోలికి oచుచుకనబడి న న్
  వెలుగు ల రుచి పట్ట పగలు వెన్నెల విరిసె న్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. రాజేశ్వర రావు గారూ,
   ప్రణయ చంద్రికలను కురిపించిన మీ పూరణ చక్కగా ఉంది. అభినందనలు.

   తొలగించండి
 15. చెలిమికి పట్టముఁగట్టుచు
  చెలకాడు సుదామ కిడె నపూర్వపు కలిమిన్
  జిలిబిలి వన్నెల కృష్షుడు--
  వెలుగులతో పట్టపగలు వెన్నెల కుఱిసెన్

  రిప్లయితొలగించండి
 16. రెండవ పాదంలోో నపూర్వపు బదులు నశేషపు కలిమన్ అని ఉండాలి.పొరపాటుకు క్షమించండి

  రిప్లయితొలగించండి
 17. కోట రాజశేఖర్ గారి పూరణ

  సందర్భం :: గోదాదేవి ధనుర్మాసంలో, తోటి బాలికలకు శ్రీ రంగనాథ స్వామి వారి నేత్ర మహిమను విశదీకరించే సందర్భం.

  శ్రీవిల్లిపుత్తూరు శ్రీవిష్ణుచిత్తుల
  పుత్రికారత్నము పుణ్యచరిత,
  ఆండాళ్లు పేరున నలరె, గోదాదేవి
  నామధేయమున, శ్రీనాథుడైన
  శ్రీ రంగనాథు ని శ్రీవారు గా గోరి,
  స్వామినే వరియించె; పండుగ నెల
  బాలికలకు *తిరుప్పావై* ని బోధించి,
  *నేత్ర తత్వమ్ము* ల నిట్లు బలికె,
  సూర్య చంద్ర నేత్ర శోభితుడౌ స్వామి
  ఘనుడు, చంద్రనేత్రము నిటు మూయ
  వేడ్క పట్టపగలు, వెన్నెల కురిసెన్ మ
  హితుడు సూర్యనేత్ర మిట్లు మూయ.

  *కోట రాజశేఖర్ నెల్లూరు.*

  రిప్లయితొలగించండి
 18. ఇనుడు ప్రచండుడయె గద భు
  విని వేసవి బట్ట పగలు; వెన్నెల విరిసెన్
  విను వీధిని యా రాతిరి
  జనములు పున్నమిన సంతసంబును పొందన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. చిటితోటి వారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   "వీథిని నా రాతిరి" అనండి.

   తొలగించండి
 19. గురజాడపురస్కారము
  నరుదుగభువినిత్తురార్య!యపురూపముగాన్
  వరమదిమీకులభించుట
  పరమాచార్యుడవునిజము పండితవర్యా!

  రిప్లయితొలగించండి
 20. లలితా జ్యువెలర్స్ కు తన కూతురు,పెనిమిటి తోవెళ్ళి ..తనకు నచ్చిన హారం కూతురికి కొనివ్వాల్సిందే నని పట్టుబట్టిన ఇల్లాలు..

  *మన పుత్రిక వంకగనుము*
  తన కంఠమునందు గొలుసు *తళతళ* మెరిసెన్
  వినుమిది *లలితా*వారిది
  పెనిమిటి !కొను! *పట్టపగలు వెన్నెల విరిసెన్*

  రిప్లయితొలగించండి
 21. కలువల కన్నుల బాలుం
  డలగోకులమున యశోద కల్లరిబిడ్డై
  వెలసిన వెన్నల చోరుని
  వెలినవ్వుల పట్టపగలు వెన్నెలవిరిసెన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సీతాదేవి గారూ,
   వెన్నలదొంగ వెన్నెల కురిపించాడన్న మీ పూరణ మనోహరంగా ఉంది. అభినందనలు.

   తొలగించండి
 22. సవరణ
  విరజల్లగ వనమందున
  మరుమల్లెలు పరిమళమ్ము మధురమ్మొలికే
  చిరునగవులు చెలిపెదవుల
   విరబూయగ "పట్టపగలు వెన్నెల విరిసెన్"

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సూర్యనారాయణ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'ఒలికే' అన్నది వ్యావహారికం. "మధుర మొలుకు నా। చిరునగవులు..." అనండి.

   తొలగించండి
 23. వచ్చును ప్రధాని పురికన
  ముచ్చెమటలు పోయ నూడ్చి మురికిని జనముల్
  కచ్చితముగ 'స్వచ్ఛ' నిలుప
  విచ్చేసెను ;పట్టపగలు వెన్నెల విరిసెన్

  నిన్నటి సమస్యకు నా పూరణ

  నిజము బలుకు వాడు నిముషమైనను భువి
  గడప తరము గాని కాలమొచ్చె;
  బ్రతుక దలఁచు వాడు ప్రాప్త కాలజ్ఞు డై
  బొంకునట్టివాఁడె పూజ్యుఁ డగును

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కృష్ణారావు గారూ,
   మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
   'వచ్చె'ను 'ఒచ్చె' అనరాదు. అక్కడ "కాల మిద్ది/ మిదియె" అనండి.

   తొలగించండి
 24. కనిపించఁగ సంపూర్ణపు
  టినగ్రహణ మపర దివమ యిల నొక్క పరిన్
  ఘన విద్యుద్దీపమ్ముల
  విను వీధిని పట్టపగలు వెన్నెల విరిసెన్

  రిప్లయితొలగించండి
 25. గురజాడవారిబహుమతి
  గురువులుమాశంకరయ్యగొనుటకుదృప్తి
  న్నిరవుగజాజులుమల్లెలు
  విరబూయుట పట్టపగలువెన్నెలకురిసెన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సుబ్బారావు గారూ,
   మీ ప్రశంసాపూర్వకమైన పూరణ బాగున్నది. అభినందనలు, ధన్యవాదాలు!

   తొలగించండి

 26. పిన్నక నాగేశ్వరరావు.

  వచ్చెద ననె గద ప్రేయసి

  యిచ్చోటికి, యనుకొని ప్రియు డెదురుగ
  జూడ
  న్నచ్చెరు వొందుచు ప్రేయసి

  విచ్చేయగ పట్టపగలు వెన్నెల విరిసెన్.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. నాగేశ్వర రావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   '...యిచ్చోటికి ననుకొని' అనండి.

   తొలగించండి 27. ఉద్యోగ మనే భ్రాంతి లో సంతసించే వారిని

  నందనోద్యోగాభ్రాంతులు

  అని చెప్పొచ్చాండి ?

  నన్దన - సంతోషించువాడు
  ఉద్యోగము
  భ్రాంతి - భ్రమ

  ?

  జిలేబి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు

  1. ధన్యవాదాలండి శంకరయ్యగారు !


   వేగమ్మే తమ జీవితమ్ముగ భళీ వేర్వేరు పారీంద్రముల్
   రాగంబెల్లగనన్, మనోహరముగా రంజిల్లగన్, నందనో
   ద్యోగభ్రాంతులు సేదదీరి మదిలో దోబూచులాడంగగన్
   మేఘానందపు రెక్కలార్చు విధమై మేధన్ విభూతిన్గనెన్!

   జిలేబి

   తొలగించండి
 28. మాష్టారూ మీసూచనననుసరించి సవరించాను
  విరజల్లగ వనమందున
  మరుమల్లెలు పరిమళమ్ము మధురమొలుకునా
  చిరునగవులు చెలిపెదవుల
  విరబూయగ "పట్టపగలు వెన్నెల విరిసెన్"

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సూర్యనారాయణ గారూ,
   సవరించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 29. విచ్చిన మల్లెల మాలలు
  ముచ్చటగా జడను తురిమి ముత్యపు నవ్వుల్
  స్వచ్ఛముగ నొల్కుచును.చెలి
  విచ్చేయగ పట్టపగలు వెన్నెల విరిసెన్

  రిప్లయితొలగించండి
 30. అకళంక కురుల గంధము
  ప్రకటించకెప్రక్కజేరి భర్తనుగలువన్
  ముకురం బందునయందము
  వికటితమే పట్టపగలు వెన్నెల విరిసెన్|
  2.ఆ.వె.వింత|పట్టపగలె వెన్నెల కురిసెన్ గ|
  బిర్ల మందిరాన విజ్ఞతగ ఖ
  గోళ దృశ్య కావ్య కూర్పు లందునమన
  జంట నగరమందు కంటబడును|  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ఈశ్వరప్ప గారూ,
   మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
   '...బందున నందము' అనండి.
   కదా అనే అర్థంలో 'గ' ప్రయోగించడం సాధువు కాదు.

   తొలగించండి
 31. విరబూయగ అని చదువప్రార్ధితుడను

  రిప్లయితొలగించండి
 32. మదిలో మెదలిన తలపులు
  ముదమును గూర్చగ ప్రియసఖి మోమును గాంచన్
  మృదు మధురముగ శశివదన
  పెదవుల విడి పట్ట పగలు వెన్నెల విరిసెన్!

  రిప్లయితొలగించండి
 33. గురువర్యులకు నమస్సులు. నిన్నటి నా పూరణను పరిశీలించ ప్రార్థన.
  ధన్యవాదములు.

  ఒప్పిదమగు బొంకు నొరుల బ్రాణము గాయ!
  శాంతి కోరి యనిని సల్పు దారి
  తప్పు కాని యటులె ధర్మరాజు వరుస
  బొంకునట్టి వాడు పూజ్యు డగును

  రిప్లయితొలగించండి
 34. సోముని విల్లును బట్టుకు
  గోముగ దునిమిన యినకుల సోముండౌ శ్రీ
  రాముని గన, సీత మదిన్
  ప్రేమముతో పట్టపగలు వెన్నెల విరిసెన్!!!

  రిప్లయితొలగించండి
 35. కనుచూపే కరువైనను
  ఘనమగు బృందావనమును గానము తోడన్
  కనబడ కౌముది యందున్
  వినిపించగ పట్టపగలు వెన్నెల విరిసెన్

  (సిరివెన్నల చిత్రంలోని 'చందమామ రావే జాబిల్లి రావే' పాట నేపథ్యం)

  రిప్లయితొలగించండి
 36. గురువుగారికి అభినందనలు పద్య రూపములో తెలియ చేస్తున్నా
  పద్య విద్యలకారాధ్య భానుడీవు
  గద్య విద్యల తెలుగున గద్య తిక్క
  నార్య శంకరయా నీదు నర్తనాలు
  నo ది వర్ధన సుందర నవక ములట
  ఈ నాటి సమస్యకు పూరణ
  ప్రల్ల ద పు మాట ,జూదము
  క్రుళ్ళిన కులగౌరములున్ కుమతులు నిచ్చున్.
  బ్రళ్ళున సుందర కళలే
  వెల్లువగు నిలన పగలు వెన్నెల విరిసెన్.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. వెంకట నారాయణ రావు గారూ,
   ధన్యవాదాలు!
   సమస్యాపూరణ రెండవ పాదంలో గణదోషం. "కులగౌరవములు కుమతులు..." అనండి. అలాగే 'వెల్లువగు నిలను.." అనండి.

   తొలగించండి
 37. వనమున హాయిగ తిరిగెడు
  వనితారత్నమును గాంచి వలపుప్పొంగన్
  వినయముతో మను వాడెద
  వినుమనగనె పట్టపగలె వెన్నెల విరిసెన్.

  కరుణించుచు ప్రియసఖి తా
  పరిణయమాడెద ననుచును బాసను చేయన్
  హరుషము తోమది మురియన్
  విరహమణగ పట్టపగలె వెన్నెల విరిసెన్.


  వినిపించగ వేణురవము
  వనితల కెల్లన్ మనమున వలపే హెచ్చన్
  చనగా యమునా తటమున
  విరహంబున పట్టపగలె వెన్నెల విరిసెన్.

  ప్రేమను చూపుచు వచ్చిన
  రాముని వదనమున నగవు రహి కూర్చంగన్
  భామామణి కౌసల్యకు
  విమలంబుగ పట్టపగలె వెన్నెల కురిసెన్.

  రిప్లయితొలగించండి
 38. అరి జంపియు సీతను గొని
  చరితార్థుడు విభుడు రామ చంద్రుడు రాగా
  పురజను లందరి మనముల
  విరివిగ భళి! పట్ట పగలు వెన్నెల విరిసెన్.

  రిప్లయితొలగించండి
 39. ఇనునిన్ చక్రము క్రమ్మగ
  వినువీధిన పట్టపగలు వెన్నెల విరిసెన్
  కను మూసి తెరచు లోపల
  ఘనమగు నమవసియె మ్రింగె గా సైంధవునిన్.

  రిప్లయితొలగించండి
 40. గురుదేవులకు వినమ్రవందనములు
  మన బంధువులగు వారు వ
  దన పుస్తకమున మరిమరి తమ వ్యాఖ్యలతో
  కనిపించుచు శుభ సూక్తులు
  వినిపించగ పట్ట పగలు వెన్నెల విరిసెన్..

  రిప్లయితొలగించండి
 41. కం: లలనా పట్టపగలు వె
  న్నెల విరిసెన్ నిన్ను చూడ నెమ్మనమున వా
  నలు వేసవి లో కురియగ
  నిల చలదనమ్ము నొందు నీ తీరుగనే .

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. రవిప్రసాద్ గారూ,
   మీ రెండవ పూరణ బాగున్నది. అభినందనలు.
   'చల్లదనమ్ము' టైపాటు...

   తొలగించండి