2, జనవరి 2018, మంగళవారం

సమస్య - 2561 (రావణుఁ బెండ్లియాడినది...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
"రావణునిఁ బెండ్లియాడె ధరాతనూజ"
(లేదా...)
"రావణుఁ బెండ్లియాడినది రాజిత సీత సకామయై భళా"
(ప్రపంచ తెలుగు మహాసభల శతావధానంలో పులికొండ సుబ్బాచారి గారు ఇచ్చిన సమస్య)

53 కామెంట్‌లు:

  1. ఘనుడు దశరథ రాముని గాంచి వలచి,
    శివుని విల్లును ద్రుంచిన శ్రీకరుడను
    శూరుడతనిని ; ...నవ్వుచు జూచి దనుజ
    రావణునిఁ:...బెండ్లియాడె ధరాతనూజ

    రిప్లయితొలగించండి
  2. మయుని తనయ మండోదరి మంజురూప
    పరిణయంబాయె శివభక్తు బ్రహ్మవంశ్యు
    రావణుని ; బెండ్లియాడె ధరాతనూజ
    రమ్యగుణధాము రఘువంశ్యు రామచంద్రు.

    రిప్లయితొలగించండి
  3. రాము డెవరిని నిర్జించె రణము నందు?
    పరమ శివుడేమి జేసెను పార్వతి గని ?
    దాశరథి మది దోచిన తరుణి యెవరు?
    రావణునిఁ; బెండ్లియాడె ; ధరాతనూజ

    రిప్లయితొలగించండి
  4. అశోక వనములోని సీత మనసు మార్చుటకై రావణుని కీర్తిస్తున్న రాక్షస స్త్రీల మాటలు:-

    మయుని కూతురు, సుందర మదన శరము,
    వదన చంద్రిక, దనుజేశు వలపు పంట,
    సారసాక్షి, మండోదరి కోరి వచ్చి
    రావణునిఁ బెండ్లియాడె| ధరాతనూజ||

    రిప్లయితొలగించండి


  5. కెవనిబంటు పెడద్రోవకేగ, గావ
    రావణునిఁ, బెండ్లియాడె ధరాతనూజ
    రామదేవుని, ముదిత గారవము గాను
    వెంట నడచె నడవులకు వేగిరమ్ము !

    జిలేబి

    రిప్లయితొలగించండి


  6. గావుము తల్లితల్లివిగ! కాంతుని వీడితిమమ్మరోయనన్
    రావణుఁ, బెండ్లియాడినది రాజిత సీత సకామయై భళా
    స్థావరమౌ వికుంఠమును చట్టని వీడి, జిలేబి, రాఘవున్,
    దావము చేరి భర్త సయి తాను విముక్తిని గూర్చి బ్రోచెనే

    జిలేబి

    రిప్లయితొలగించండి
  7. అపహృతాబల మాయాసురాత్మభూత
    రావణుని పెండ్లియాడె, ధరా తనూజ
    పరిణయంబాడె శివధనుర్భంగ భీము
    రమ్య గుణధాము శ్రీరాము రక్తి తోడ

    రిప్లయితొలగించండి
  8. క్రమాలoకారం లో
    భామ మం డో దరెవరి కి భార్య య య్యే ?
    చేవ చూపు చు రాముడు శివుని చాప
    మెక్కుపెట్ట గ వరి యించి రెవరత ని ని ?
    రావణుని ;పెండ్లి యా డె ధరా తనూ జ

    రిప్లయితొలగించండి
  9. మైలవరపు వారి పూరణ

    ఇల జనించి, వధింపగా నెంచి దుష్ట
    రావణుని , పెండ్లియాడె ధరాతనూజ
    దశరథాత్మజు , తాను వేదవతి నాడు !
    హాని కల్గించు కామ మోహములు నమ్ము !!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. త్రిజట పల్కులను పరిహసిస్తూ మరో రాక్షసాంగన ఇలా👇 అంటోంది...

      కావవి సత్యముల్ కలను గాంచినవన్నియు , నేనుఁ గంటి లం...
      కా వర రాజ్యనాథు దశకంఠుని భీమబలున్ మనోహరున్
      రావణుఁ బెండ్లియాడినది రాజిత సీత సకామయై ! భళా !
      నీవను మాటలున్ కలయె ! నేనును గన్నది స్వప్నమే సఖీ !!

      మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

      తొలగించండి
  10. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  11. గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
    సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య 2561
    *రావణుఁ బెండ్లియాడినది రాజిత సీత సకామయై భళా.*

    సందర్భం :: సీతాదేవిని అపహరించి , లంకలో అశోకవనంలో నిర్బంధించి , ఆమె తన వైభవాన్ని జూచి తనకు వశమౌతుందని , తనను వరిస్తుందని కలలు గనే రావణుడు , శిల్పులను పిలిపించి భవిష్యత్తులో నా గొప్పతనం చిరస్థాయిగా ఉండేట్లుగా *’’ సీత తనంతట తానుగా కోరి రావణుని పెండ్లాడినది.’’* అని రాతిస్తంభములపై నా చరిత్రను వ్రాయండి అని ఆజ్ఞాపించిన సందర్భం.

    రావణు డిట్లనెన్ సరిగ వ్రాసెడి శిల్పుల బిల్చి, సీత తా
    నా వనవాసి రాము మనసారగ జేరగ బోదు, లంకలో
    నా వశమై చరించు, నను నాథునిగా వరియించు నింక స
    ద్భావన , రాతికంబముల వ్రాయుడు నాదు చరిత్ర మీ రిటుల్,
    *’’రావణుఁ బెండ్లి యాడినది రాజిత సీత సకామయై భళా’’*
    *కోట రాజశేఖర్ నెల్లూరు.* (02.01.2018)

    రిప్లయితొలగించండి
  12. అఱయుమదె ప్రియమున యా మయాతనూజ
    రావణునిఁ బెండ్లియాడె; ధరాతనూజ
    సీత పరిణయ మాడెను శ్రీరమణుని
    విధిలిఖితమె గాద యెఱుంగ వేరు కాదు!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. వేదవతి దశకంఠుని పీడ నొదలి
      సాకుగ నయోనిజగ జేరె సంహరింప
      రావణునిఁ, బెండ్లియాడె ధరాతనూజ
      రవికులుడనుఁ సీరధ్వజ రాజ సుతగ

      తొలగించండి
  13. ధర్మ సంస్ధాపనార్థమై ధరణియందు
    మానవాకృతి గైకొనె మాధవుండు
    పరమ పావను,రాముని,పాప గణవి
    ద్రావణునిఁబెండ్లియాడె ధ రాతనూజ

    రిప్లయితొలగించండి
  14. ధర్మ సంస్థాప నార్థము ధరణి లోన
    జన్మ మెత్తియు దనుజుల సంహరింప
    వచ్చి నట్టి మహాత్ముని వలచి,విజిత
    రావణుని బెండ్లియాడె ధరాతనూజ.

    రిప్లయితొలగించండి
  15. తన ఆశ్రమంలో వాల్మీకి ధరణిజకు రావణుని వృత్తాంతం విశద పర్చుచు అన్న మాట:
    ****)()(****
    అతడు మోహాంధుడేకాని యల్పుడౌనె?
    రాజనీతి యందున జాల రాటు దేలె
    వలచి మండోదరీ భామ వచ్చి కోరి
    రావణుని బెండ్లియాడె ! ధరాతనూజ!

    రిప్లయితొలగించండి
  16. తేటగీతి
    రామ, రావణ పాత్రల రమ్యముగను
    నందమూరియె నటియించ నతులొసంగి
    రావణునిఁ బెండ్లియాడె ధరాతనూజ
    యనుచు నభిమాని నాలుక నదుము కొనియె

    ✍️ గుండా వేంకట సుబ్బ సహదేవుడు

    రిప్లయితొలగించండి
  17. ఆదిలక్ష్మియె లక్షించి యవతరించె
    దుష్టసంహార క్రియనందు దోడుగాను
    సకల లోకాభిరాముని,జంప దనుజ
    రావణుని, బెండ్లియాడె ధరాతనూజ!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రెడడవ పాదములో దుష్టసంహారమందున దోడుగాను గా చదువ ప్రార్ధన!

      తొలగించండి
  18. భూవలయమ్మునన్ మిగుల బూత చరిత్రుడుసూర్యవంశపున్
    శ్రీవరుడార్య సన్నుతుడు,చిన్మయరూపుడు,మేరుధీరుడన్
    పావనుడైన ధాశరధి,పంకజనేత్రునిరాము,నిర్జితా
    *’’రావణుఁ బెండ్లి యాడినది రాజిత సీత సకామయై భళా’’*

    రిప్లయితొలగించండి
  19. దాశరధి జన్యమున జంపె దైత్య వీర
    రావణుని;పెండ్లియాడె ధరాతనూజ
    శీలి శ్రీరామ చంద్రుని మాలవేసి
    హర ధనస్సును పైకెత్తి విరిచినంత

    రిప్లయితొలగించండి

  20. రఘుకుల ఘనుడు కడతేర్చె రణమునందు
    రావణుని;పెండ్లియాడె ధరాతనూజ
    ప్రేమ మీఱ కోదండ శ్రీరాముని,కొని
    యాడిరి ముని సుర వరులు వేడుక గని

    రిప్లయితొలగించండి

  21. సమరమున రాముడెవరిని సంహరించె ?
    రామచంద్రు డేమియుజేసె భూమిజ గని?
    ధర్మపాలక జనకుని తనయ యెవరు?
    రావణుని ,పెండ్లియాడె ,ధరాతనూజ !

    రిప్లయితొలగించండి
  22. ఆ మయుని కూర్మినందనయైన లలన
    పరగ మండోదరాఖ్య తా ప్రమద మెసగ
    ప్రీతితోడను రాముని బెండ్లియాడె
    రావణునిఁ బెండ్లియాడె, ధరాతనూజ

    రిప్లయితొలగించండి
  23. తరుణి మండోదరి మయసుత, దశకంఠ
    రావణునిఁ బెండ్లియాడె; ధరాతనూజ
    సీత చేపట్టగా సరసీరుహాక్ష
    రాముని, పుడమి మురిసి పరవశ మోందె.

    రిప్లయితొలగించండి
  24. నీలి మేఘ వర్ణునిఁ బరానీక దమను
    దశరథాత్మజ రాముని ధన్వి వరుని
    విపుల బాహుని, భావికాలపు నిహంత
    రావణునిఁ, బెండ్లియాడె ధరాతనూజ


    సేవిత భూసు రానిమిష శేఖర సేంద్ర విరాజమానునిం
    బావన సూర్య వంశవర పంక్తి రథాత్మజు రామచంద్రునిన్
    భూవల యాధినాథ వరు భూజ మనోరత శూరు శత్రు వి
    ద్రావణుఁ బెండ్లియాడినది రాజిత సీత సకామయై భళా

    రిప్లయితొలగించండి
  25. మయునికొమరితమండోదరాఖ్యభామ
    రావణునిబెండ్లియాడె,ధరాతనూజ
    కోసలేంద్రుడురామునిగూర్మితోడ
    బెండ్లియాడెనుబూమాలవేసి సభను

    రిప్లయితొలగించండి
  26. పావనమైనయాముదితగభాసురలీలనుగాంచనత్తరిన్
    రావణుబెండ్లియాడినది.రాజితసీతనుసకామయైభళా
    యావనమందునన్నునచనాఙ్ఞనునిచ్చెనులక్ష్ణ్మణాఖ్యకున్
    భావనజేయగానదియభావ్యముకాదుగననెట్టివారికిన్

    రిప్లయితొలగించండి
  27. రక్తి మండోదరి వరించె రక్కసీడు
    రావణునిఁ, బెండ్లియాడె ధరాతనూజ
    సోముని విలు విరిచినట్టి రామ చద్రు
    సకల జనులు రాజులుఁ గన సంతతముగ

    రిప్లయితొలగించండి
  28. భూవరుడై జనించె హరి భూభరమున్ హరియించు కాంక్షతో
    పావనమైన ప్రేమమున పంకజ నాభుడు రక్కసీల వి
    ద్రావణుఁ బెండ్లియాడినది, రాజిత సీత సకామయై భళా
    సేవకుఁడై భువిన్ కలిగె శేషుఁడు లక్ష్మణ నామధేయుడై

    రిప్లయితొలగించండి
  29. పావన సచ్చరిత్ర పరిభాసితుఁడర్క సువంశ వాహనుం
    డావన యజ్ఞరక్షకుఁడహల్యకుఁ తన్నిజ రూప దాతనున్
    స్థావర ధైర్య సాహసునిఁ చాపము నెత్తినవానిఁ శత్రు వి
    ద్రావణుఁ బెండ్లియాడినది రాజిత సీత సకామయై భళా

    రిప్లయితొలగించండి
  30. మేడిచెర్ల వారి పూరణ

    రావణుని పెండ్లియాడె ధరాతనూజ
    యనుచు భ్రాంతినొందెను గదా!హనుమ మదిని
    రాణి మండోదరిని జూచి లంక యందు,
    సిగ్గుపడె పతివ్రత కదా సీత యనుచు!

    ...మేడిచర్ల హరినాగభూషణం, గద్వాల.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రామాయణంలోని సంఘటనకు అనుగుణంగా చాలా బాగా రాశారండీ మేడిచర్ల హరినాగభూషణం గారు. వారికి నాయొక్క ఆనందాభినందనలు,ప్రణామాలు.

      తొలగించండి
  31. మయుని తనయమండోదరి మాసటి యగు
    రావణుని బెండ్లియాడె, ధరాతనూజ
    శివుని ధనువును విరచిన చిన్మయుండు
    రామచంద్రుని చేపట్టి రహిని గాంచె!!!

    మాసటి = వీరుడు

    రిప్లయితొలగించండి
  32. గు రు మూ ర్తి ఆ చా రి
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,,,,,,


    { రావణ సభలో అంగదరాయబారము జరుగు చున్న సమయంలో‌
    అంగద రూపంలో రావణుడు పంపిన ఒక రాక్షసుడు రాముని చెంత
    కేగి పలుకుట . }


    " రావణు బెండ్లి యాడినది రాజిత సీత సకామయై భళా

    కావున యుధ్ధ మాపి దశకంఠునితో , మన మెల్ల వెన్కకున్

    బోవుద " మంచు నంగదుని బోలిన రాక్షస మాయ పల్కగా

    పావని దాని గుర్తెరిగి భస్మ మొనర్చెను క్రోధ వీక్షణనన్

    రిప్లయితొలగించండి
  33. నారినెక్కుపెట్టకయున్న నవ్వుచు గని
    "రావణునిఁ, బెండ్లియాడె ధరాతనూజ"
    ధనసుఁ భంగమొనర్చిన ధర్మరూపు
    రాముని ముదమున సభలో రక్తితోడ

    రిప్లయితొలగించండి
  34. నా “శ్రీమదాంధ్ర సుందర కాండ” ఏకోనపఞ్చాశ సర్గమున నేటి పద్యములలో నొకటి.

    విభ్రాజమాన మమరా
    దభ్ర విరాజిత నితాంత తరళ సిత మహా
    శుభ్రేందురత్న జాల వృ
    త భ్రాజిత మకుట దీప్త దశముఖుఁ గాంచెన్
    మూలము:
    భ్రాజమానం మహార్హేణ కాఞ్చనేన విరాజతా.
    ముక్తాజాలావృతేనాథ మకుటేన మహాద్యుతిమ్৷৷5.49.2৷৷

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జాల వృత అని పద్యంలో గణంకోసం వ్రాయటం సబబుగా ఐనిపించటం లేదండి. జాల+ఆవృత=జాలావృత కాగా ఆవృతను వృతగా మార్చుతానంటే ఎలాగు? ఏదైనా విశేషసమర్ధన ఉందంటే దానిని తెలియజేయ ప్రార్థన.

      తొలగించండి
    2. వృతము : శంకరనారాయణ తెలుగు-ఇంగ్లీష్ నిఘంటువు 1953
      a.
      1. covered, surrounded;
      2. chosen, selected.

      తొలగించండి
    3. పరివృత, ఆవృత, నివృత, వివృత సంవృతాదికాలుగా ఆయా ఉపసర్గలతో కూడుకొన్నదిగా కాక కేవలం వృత అన్న పదంగా ప్రయోగించబడటం కేవలం సాంకేతికంగా సరైనదే కావచ్చునేమో కాని ఎన్నడూ ఇంతవరకూ నా అల్పజ్ఞానానికి గమనికలోనికి వచ్చినది కాదు సుమా! వివరించినందుకు ధన్యవాదాలు.

      తొలగించండి
  35. కవిమిత్రులకు నమస్కృతులు.
    ఉదయం బయలుదేరి వరంగల్, మహబూబాబాద్ వెళ్ళి మళ్ళీ ఇప్పుడే హైదరాబాదు చేరుకున్నాను. రోజంతా ప్రయాణం వల్ల అలసిపోయాను. ఈరోజు మీ పూరణలను సమీక్షించలేను. మన్నించండి.
    ఈనాటి సమస్యకు చక్కని పూరణలందించిన మిత్రులందరికీ అభినందనలు, ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  36. దావము నందునన్ దరుగ దారుణ రీతిని ముక్కుయున్ జెవుల్
    మావలె సీత కూడ నవమానము నొందఁగ మత్సహోదరున్
    పావనిఁ దెమ్మనంటి నిట పంతము తోడను, స్వప్నమందునన్
    రావణుఁ బెండ్లియాడినది రాజిత సీత సకామయై భళా!

    రిప్లయితొలగించండి
  37. గు రు మూ ర్తి ఆ చా రి
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,,,,,,


    { రావణ సభలో అంగదరాయబారము జరుగు చున్న సమయంలో‌
    అంగద రూపంలో రావణుడు పంపిన ఒక రాక్షసుడు రాముని చెంత
    కేగి పలుకుట . }


    " రావణు బెండ్లి యాడినది రాజిత సీత సకామయై భళా

    కావున యుధ్ధ మాపి దశకంఠునితో , మన మెల్ల వెన్కకున్

    బోవుద " మంచు నంగదుని బోలిన రాక్షస మాయ పల్కగా

    పావని దాని గుర్తెరిగి భస్మ మొనర్చెను క్రోధ వీక్షణనన్

    రిప్లయితొలగించండి

  38. ***************
    దాశరధి జన్యమున జంపె దైత్య వీర
    రావణుని;పెండ్లియాడె ధరాతనూజ
    శీలి శ్రీరామ చంద్రుని మాలవేసి
    హర ధనస్సును పైకెత్తి విరిచినంత

    తే.గీ.
    ******

    రఘుకుల ఘనుడు కడతేర్చె రణమునందు
    రావణుని;పెండ్లియాడె ధరాతనూజ
    ప్రేమ మీఱ కోదండ శ్రీరాముని,కొని
    యాడిరి ముని సుర వరులు వేడుక గని

    తే.గీ.
    ******

    సమరమున రాముడెవరిని సంహరించె ?
    రామచంద్రు డేమియుజేసె భూమిజ గని?
    ధర్మపాలక జనకుని తనయ యెవరు?
    రావణుని ,పెండ్లియాడె ,ధరాతనూజ !

    -🎇ఆకులశాంతిభూషణ్

    రిప్లయితొలగించండి
  39. రాముడెవరిని తా జంపె రణమునందు
    *"రావణునిఁ, బెండ్లియాడె ధరాతనూజ
    హరుని విల్లును విరిచిన యారఘువరు
    మునులు సురలును మెచ్చంగ ముదము తోడ

    2.మయుని తనయ నెవ్వానిని మదిని వలచి
    మనువు కోరె తాను మమత తోడ
    *"రావణునిఁ,.. బెండ్లియాడె ధరాతనూజ
    ముదమున శ్రీరామ చంద్రుని పుడమి యందు

    రిప్లయితొలగించండి
  40. ఠీవిగ మృత్యుదేవతయె ఢీకొని ముద్దిడి లంకనందునన్
    రావణుఁ బెండ్లియాడినది;...రాజిత సీత సకామయై భళా!
    పూవుల బెట్టి రాఘవుని పూజలు జేయుచు పెండ్లియాడెగా...
    నీవల కాదు పృచ్ఛకుడ నెగ్గగ నన్నిట కైపదమ్ములన్!

    రిప్లయితొలగించండి