22, జనవరి 2018, సోమవారం

సమస్య - 2576 (సంహారంబును జేసెదన్...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
"సంహరింతును జగమున శాంతి నిలుప"
(లేదా...)
"సంహారంబును జేసెదన్ జగమునన్ శాంతిం బ్రతిష్ఠింపఁగన్"
ప్రపంచ తెలుగు మహాసభల శతావధానంలో అమరవాది రాజశేఖర శర్మ (అరాశ) గారు ఇచ్చిన సమస్య

114 కామెంట్‌లు:

  1. "యదా యదాహి ధర్మస్య... "

    "ఎప్పుడెపుడు ధర్మమునకు ముప్పు వచ్చు
    నప్పుడపుడు నేనిటవచ్చి యొప్పు చేతు
    శిష్టజనులను రక్షించి దుష్టజనుల
    సంహరింతును జగమున శాంతి నిలుప"

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. "యదా యదాహి ధర్మస్య... "

      "ఎప్పుడెపుడు ధర్మమునకు ముప్పు వచ్చు
      నప్పుడపుడు నేనిటవచ్చి యొప్పు చేతు
      శిష్టజనులను రక్షించి దుష్టజనుల
      సంహరింతును జగమున శాంతి నిలుప"

      యొప్పు జేయు... అంటే మరింత సొగసు గా ఉంటుంది.

      చేతును... ❌
      చేయుదును ✅

      ...మైలవరపు మురళీకృష్ణ

      తొలగించండి
    2. “తెలుగు రాని వాడనని దిగులు జెందును"

      😂😂😂

      తొలగించండి
    3. “తెలుగు రాని వాడనని దిగులు జెందను
      వయసు ముదిమి యైన నేమి నేను తెలుగు నేర్తును !
      తెలుగు నేర్చి యొప్పు నేను తెలుసుకొందును!
      తేట తెలుగు తీపి రుచిని జూచి మురిసిపోదును !
      😂😂😂

      ...మైలవరపు మురళీకృష్ణ

      తొలగించండి
    4. ప్రభాకర శాస్త్రి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "...యొప్పొనర్తు" అనండి.

      తొలగించండి


    5. వయోజనుడ!విద్య గరచి వ్రాసెదన్నిటన్
      ప్రయోజనముగా నిలిపెద పద్యరావముల్
      సయాటలివియే గురువుల సన్నిధిన్ జన
      ప్రియమ్ము గనుగూర్చ మదిని పిండెదన్నికన్ :)


      జిలేబి

      తొలగించండి
  2. కృష్ణ ఉవాచ
    ధర్మ మడుగoటి పె రుగన ధర్మ మిలను
    అవతరింతును నే నప్పుడవని యందు
    శిష్ట జనుల ను రక్షింప దుష్ట త తి ని
    సంహరింతు ను జగము న శాంతి నిలువ

    రిప్లయితొలగించండి
  3. మైలవరపు వారి పూరణ

    అంహః కార్యరతుల్ ధరాతలమునందన్యాయమున్ జేయుచున్
    బృంహద్గర్వగుణాంధులై కడు విజృంభింపంగ దుష్టాత్ములన్
    సింహోదగ్రపరాక్రమోద్ధతిని శిక్షింపంగ చక్రాహతిన్
    సంహారంబును జేసెదన్ జగమునన్ శాంతిం బ్రతిష్ఠింపఁగన్ !!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మైలవరపు మురళీకృష్ణ గారి పూరణ అద్భుతంగా ఉన్నది. వారికి అభినందనలు. ఈ పూరణను ఇక్కడ పోస్ట్ చేసిన ప్రభాకర శాస్త్రి గారికి ధన్యవాదాలు.

      తొలగించండి
  4. సత్ప్రవర్తన,సహనంబు సతము లేక
    శిష్ఠజనుల ననిశము హింసించి,కడు
    వికృత చేష్టలతో విఱ్ఱవీగు జనుల
    సంహరింతును జగమున శాంతి నిలుప"

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శాంతి భూషణ్ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      రెండవ పాదం చివర గణదోషం. "హింసించి పెక్కు..." అనండి.

      తొలగించండి
  5. ధరను తాండవ మాడగ పరమ భీతి
    కరుణ లేనట్టి మారణ కాండ లనగ
    రక్ష లేదిక రాక్షస శిక్ష తప్ప
    సంహ రింతును జగమున శాంతి నిలుప

    రిప్లయితొలగించండి
  6. యూపం కృత్వా పశూన్ హత్వా
    కృత్వా రుధిర కర్దమం.....

    మూఢ నమ్మకములఁద్రుంచి గాఢమైన.
    దైవ భక్తిని నెలకొల్పి ధరణియందు
    దుర్మతుల నాశమొందించి దుష్కృతులను.
    సంహరింతును జగమున శాంతి నిలుప

    రిప్లయితొలగించండి
  7. దమన శక్తులు చెలరేగి తాండవింప
    పృథ్వి సమరస భావముల్ మృగ్యమాయె
    మాన వత్వపు విలువలు మంట గలిసె
    స్వార్థపర తత్వ మీనాడు సర్వమాయె
    జనులకును జూడగ బ్రదుకు శాపమాయె
    యే మహాత్ముని కొరకైన నెదురు చూడ
    రయము కారణ భూతులౌ రక్కసులను
    "సంహరింతును జగమున శాంతి నిలుప"

    రిప్లయితొలగించండి
  8. బంహిష్టంబుగ కానికార్యములకే ప్రాధాన్యతన్నిచ్చుచున్
    రంహస్సున్ ధనమేప్రధానమను సంరంభమ్ముగా నాయకుల్
    సింహద్వారముగాగ రాజ పదవిన్ జేపట్టు దౌర్భాగ్యమున్
    సంహారంబును జేసెదన్ జగమునన్ శాంతిన్ ప్రతిష్టించెదన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చేపూరి వారూ,
      మీ వృత్త పూరణ బాగున్నది. అభినందనలు.
      'బంహిష్టంబుగ'...?

      తొలగించండి


  9. తనువు ధనము మనస్సు వితరణ జేసి
    విభుని కైసేవగన్ మది వివరమరయ,
    సింహమై నిలచి జనుల చింత లన్ని
    సంహరింతును జగమున శాంతి నిలుప!

    జిలేబి

    రిప్లయితొలగించండి
  10. దైవ వాక్కు
    *******
    తపముచేత వరములొంది దైత్యగణము,
    దర్పము తలకెక్కి ప్రజని తాపపఱచ
    సంహరింతును,జగము నశాంతి నిలుప
    జాల,నీతి నిలుచు సర్వ కాలమందు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శాంతి భూషణ్ గారూ,
      మీ పూరణ విరుపుతో వైవిధ్యంగా బాగున్నది. అభినందనలు.
      "వరము లంది...ప్రజను" అనండి.

      తొలగించండి
  11. పంటచేలను తరచుగ పాడుచేసి
    ప్లేగు వ్యాధిని ప్రజలకు పీడగూర్చి
    ముప్పు గలిగించ ముప్పేట మూషికముల
    సంహరింతును జగమున శాంతి నిలుప

    సకల వ్యాధుల వ్యాపింప సాధనముగ
    చికెనుగున్యను డెంగ్యును చిటికెలోన
    మట్టుబెట్టగ మనుషుల మశకములను
    సంహరింతును జగమున శాంతినిలుప

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సరస్వతీ పుత్రికా పుత్రులందరికీ వసంత పంచమి శుభాకాంక్షలు!! ఆ తల్లి కరుణాకటాక్షములు మనందరిపై యెల్లప్పుడూ ఉండాలని ఆశిస్తూ నమస్సులు!!

      తొలగించండి
    2. సీతాదేవి గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
  12. ఒక్కరొక్కరై మారగ నొంటిగానె
    లోక మంతయు మారద లోకులార
    నా యశాంతుల మూలమైనవియె తెలిసి
    "సంహరింతును జగమున శాంతి నిలుప"

    రిప్లయితొలగించండి
  13. నిన్న రాసింది మీ అందరితో పంచుకోవాలనే కుతూహలం కొద్దీ..☺️

    ఏది ఏదని చూచినంతనె ఏమి మారదు మానవా
    ఆది నీవని అందుకొన్నచొ సాధ్యమయ్యెను చూడవా
    సోది కాదిది నిత్యసత్యము సోమరై నువు మారకోయ్
    నీది నీదెగ నూతనత్వము నీకు సాటి మరెవ్వరోయ్

    నీటి బిందువు లొక్కటవ్వగ నేరుగా నదులాయెగా
    సాటి లేనటువంటి తీరుగ సాగరమ్ముగ మారెగా
    తోటి వారిని తోడు తీసుకు దూరమెంచక సాగిపో
    మేటి రూపున మింటినంటగ మేలు మార్పుగ మారిపో

    వింత చూడగ లోకులందరు వేనవేలుగ చేరగా
    అంతు లేనటువంటి శక్తిని అంది పుచ్చుకు ధీటుగా
    పంత మన్నది వీడకుండగ వంతు వంతున అందుకో
    కొంత కొంతగ యింత అంతగ కోరుకున్నది పొందు పో!
    😁

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పద్యాలు బాగున్నవి.
      'అందుకొన్నచొ' అని చో ప్రత్యయాన్ని హ్రస్వంగా ప్రయోగించరాదు. 'నువు' సాధువు కాదు.

      తొలగించండి
  14. ఆంహానంబున బిల్వ సాధుపురుషుల్లాపత్తు నందుండినన్
    రంహస్సున్ దరి జేరి వారి వెతలన్ మ్రందించు కాలంబునన్
    సింహోదగ్రత జేవురించు ఖలులన్ శిక్షించ నుగ్రాకృతిన్
    సంహారంబును జేసెదన్ జగమునన్ శాంతిం బ్రతిష్ఠింపఁగన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఫణికుమార్ గారూ,
      'ంహ' ప్రాసతో వృత్తం వ్రాసినందుకు ప్రశసలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'పురుషుల్+ఆపత్తు = పురుషు లాపత్తు' అవుతుంది. లకారద్విత్వం రాదు.

      తొలగించండి
    2. ఆంహానంబున బిల్వ సాధుజనులున్నాపన్నులై యుండినన్
      రంహస్సున్ దరి జేరి వారి వెతలన్ మ్రందించు కాలంబునన్
      సింహోదగ్రత జేవురించు ఖలులన్ శిక్షించ నుగ్రాకృతిన్
      సంహారంబును జేసెదన్ జగమునన్ శాంతిం బ్రతిష్ఠింపఁగన్

      గురువుగారూ నమస్సులు. ధన్యవాదములు. సవరించాను.

      తొలగించండి


  15. పంహస్సున్మది జేర్చి మేలు గలుగన్ ప్రార్థించి దుష్టావళిన్
    సంహారంబును జేసెదన్ జగమునన్ శాంతిం బ్రతిష్ఠింపఁగన్
    హంహో!మీకిది! మాన్యమై వెలుగ సంహారమ్ము గా రండయా
    బంహిష్ఠమ్ముగనేడు గావలయు కాపాడంగ లోకంబునే!



    సావేజిత
    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు

    1. బంహిష్ఠము - మిక్కిలి బహువు
      బహువు - అధికము; పెక్కు

      పంహస్సు - వేగము
      హంహో ఆహ్వానము

      సంహారము - సమూహము

      ఆంధ్రభారతి ఉవాచ :)


      జిలేబి

      తొలగించండి
    2. జిలేబీ గారూ,
      'ంహ' ప్రాసతో వృత్తం వ్రాసిన మీకు ప్రశసలు! బాగున్నది.

      తొలగించండి
    3. హంహో! మీకు నిటన్ జిలేబి పలుకాహారమ్ముగా నాంధ్రమౌ

      తొలగించండి


  16. ధర్మమునకుచ్యుతికలుగ ధరణియందు
    శిష్టజనులను బ్రోచుచు దుష్ట జనుల
    "సంహరింతును జగమున శాంతి నిలుప
    ననియె కృష్ణుడు పార్థుతో నాహవమున.

    మంచివారిని కావంగ మరుకేను
    అక్కర తోడననవరతంబు నవతరింతు
    కువలయమున ప్రతి యుగాన కుజనులనిట
    సంహరింతును జగమున శాంతి నిలుప

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఉమాదేవి గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      రెండవ పూరణ మొదటి రెండు పాదాలలో గణదోషం. సవరించండి.

      తొలగించండి
  17. తేటగీతి
    ధర్మ సంస్థాపనార్థము ధరణి పైన
    సాధుజన రక్షణమునెంచు సరళి యుగ యు
    గమున నవతారమెత్తి యఘమ గణముల
    సంహరింతును జగమున శాంతి నిలుప

    రిప్లయితొలగించండి
  18. వినుము బీభత్స!రథమును వేగనడపి
    చెల్లి కింతటి పాటుల జేసినట్టి
    దుర్మదాంధుల చేష్టల దూలనడచి
    సంహరింతును జగమున శాంతి నిలుప.

    రిప్లయితొలగించండి
  19. సంహారంబును జేయగాదగు ననిన్
    శస్త్రావళిన్ శాత్రవున్
    సంహారంబును జేయగా వలయునే
    స్వార్ధంబు హెచ్చవ్వగా
    సంహారంబును జేయుటే సబబగున్
    సచ్ఛీలతన్ గూల్చగా
    సంహారంబది జేయనౌను మదిలో
    శాత్రావళీ వర్గమున్
    సంహారంబును జేసెదన్ జగమునన్ శాంతిం ప్రతిష్టింపగన్!

    రిప్లయితొలగించండి
  20. దుష్కర ప్రాస గనుక దుష్టభాష వాడితిని:

    రాహుల్ గాంధీ మోడీతో:

    హంహం హమ్మనుచున్ హమార యనుచున్ హైరాణ గావింతువా?
    సింహంబుల్ వలె గర్జనల్లిడగనే జింకల్ వలే పారుమా?
    తుంహారే జనులన్ హటావు మనుచున్ తుంటల్లు తుంటల్లుగా
    సంహారంబును జేసెదన్ జగమునన్ శాంతిం బ్రతిష్ఠింపఁగన్!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పద్యం హృద్యం...👌🙏

      శ్లేష పండింది... *దుష్టభాష* లో....
      అది..
      ఏ సమాసమండీ ?

      షష్ఠీతత్పురుషమైతే... దుష్టునియొక్క (రాహుల్) భాష...

      కర్మధారయమైతే.... దుష్టమైన భాష !

      *నమో* నమః.... 🙏😃

      ...మైలవరపు మురళీకృష్ణ

      తొలగించండి
    2. దుష్టుని కొఱకు భాష... చతుర్థి కూడా కావచ్చు. (కాంగ్రెస్ వాళ్ళ దృష్టిలో...) 😃

      ...కంది శంకరయ్య

      తొలగించండి
    3. ప్రభాకర శాస్త్రి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  21. సృష్టి స్థితి లయ కారుడ నీపుడమిని
    యాకతాయిల దుశ్చర్య లదికమైన
    సంహరింతును జగమున శాంతి నిలుప
    పేద వారల బ్రతుకుల మోదమిడగ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్నపరెడ్డి వారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మొదటి పాదంలో నా సవరణను వాట్సప్‍లో చూడండి.

      తొలగించండి
  22. అంహో దూషిత మానసైక ఘన దుర్వ్యాపార మగ్నోగ్రులన్
    సింహక్ష్వేడ యొనర్చి యీ దనుజులన్ శ్రీకంఠుడే మెచ్చగా
    రంహో దివ్య గదా త్రిశూల ఖర చక్రాద్యాయుధ శ్రేణిచే
    సంహారంబును జేసెదన్ జగమునన్ శాంతిం బ్రతిష్ఠింపఁగన్

    రిప్లయితొలగించండి
  23. (గీతోపదేశం సందర్భంలో శ్రీకృష్ణుడు అర్జునినితో అన్న మాటలు)

    సాదు జనులను కాపాడ ముందు నిలుతు
    కొమ్ము గాతును నమ్మిక వమ్ము గాదు
    దొరలినంత దుష్కర్మలు, దుష్ట జనుల
    సంహరింతును జగమున శాంతి నిలుప.

    రిప్లయితొలగించండి
  24. నేడు కలికాల మందునఁ దోడు రాగ
    హరియె శిష్టుల నరయంగ ననిన నొప్పు
    దుష్ట మానవు లందలి దుష్ట గుణము
    సంహరింతును జగమున శాంతి నిలుప


    సింహస్వప్నము వైష్ణ వావలికి నిశ్శేషమ్ము గాంక్షించి హ్రీం
    హ్రీంహుంకార నినాద మంత్రముల దైతేయుండు పేట్రేగగన్
    సింహాకార వరాంగ సంహితము సుశ్రేష్ఠ ద్విపాదుండనై
    సంహారంబును జేసెదన్ జగమునన్ శాంతిం బ్రతిష్ఠింపఁగన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కామేశ్వర రావు గారూ,
      మీ మొదటి పూరణ ప్రశస్తంగా, రెండవ పూరణ అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
    2. పూజ్యులు కామేశ్వరరావుగారికి నమస్సులు! మీ నరసింహావతార పూరణ అద్భుతంగా ఉన్నది! మొదటి పాదము అర్ధము సరిగా బోధపడలేదు! దయచేసి వివరించగలరు!

      తొలగించండి
    3. ఆర్యా! మరల చదువగా అర్ధమైనది! మూడవ పాదముతో అన్వయించవలెనని! ధన్యవాదములు! నమస్సులు!🙏🙏🙏

      తొలగించండి
    4. పూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు.
      డా. సీతా దేవి గారు ధన్యవాదములు. వైష్ణవులకు సింహ స్వప్నమైన దైతేయుఁ డనగ దితి కుమారుఁ డయిన హిరణ్య కశిపుడు వారి (వైష్ణవుల) వినాశము కోరుకుంటూ మంత్రముల మహిమతో (తపశ్శక్తి తో) విజృంభణము సేయగ ...

      తొలగించండి
  25. ప్రతినబూనవలయు ప్రతివాడునిటుల
    "మనమునందున సుంతైన మత్సరమ్ము,
    ద్వేషభావమ్ము ,స్వార్థమ్ము పెరుగకుండ
    సంహరింతును జగమున శాంతి నిలుప"

    రిప్లయితొలగించండి

  26. బ్రహ్మ గూర్చితపము చేసి వరమునంది
    దైత్యు డౌరావణాసురు డవనియందు
    బాధలిడుచునుండ వినుచు పలికె హరియు
    సంహరింతును జగమున శాంతి నిలుప.
    పరుల సౌభాగ్యమును దోచి వసుధయందు
    తాను సుఖపడవలెనని దలచు కూళుఁ
    సంహరింతును జగమున శాంతి నిలుప
    నవతరించును హరితా ననవరతము

    రిప్లయితొలగించండి
  27. సింహారూఢి యైన దుర్గాదేవి సురగణములతో పలుకుతున్నట్లుగా ........

    బ్రాంహీ మండల దేవతాధికులకున్ భద్రంబు గావింతు, నా
    సింహారూఢత ధైర్య సాహసములున్ చేకొన్న దివ్యాస్త్రముల్
    సింహస్వప్నములయ్యె రాక్షసులకున్ లీలావినోదంబుగా
    సంహారంబును జేసెదన్ జగమునన్ శాంతిం బ్రతిష్ఠింపఁగన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
      అద్భుతంగా ఉన్నది మీ పూరణ. అభినందనలు.
      మొదటి మూడవ పాదంలో యతిదోషమని పొరబడ్డాను. ఇంతలో ద్వితీయపాదాంత లకారం 'నేనున్నా' నన్నది.

      తొలగించండి
    2. సంపత్ కుమార్ శాస్త్రి గారు “బ్రాహ్మీ” పదమును “బ్రాంహీ” గా ప్రయోగించుట యందు కించి దనుమానము కల్గు చున్నది. నివర్తింప గోర్తాను.

      తొలగించండి
    3. గురుతుల్యులు శ్రీ కామేశ్వరరావు గారికి నమస్సులు.
      శబ్దపూర్వకముగా ప్రాస సరిపోయినదని భ్రమపడ్డాను. తప్పును చూపినందులకు ధన్యవాదములు.
      క్రింది సవరణ పరిశీలించగోరుతాను.

      అంహస్సంతయు మట్టగించెదను దైత్యాళిన్ విభేదింతు నా
      సింహారూఢత ధైర్య సాహసములున్ చేకొన్న దివ్యాస్త్రముల్
      సింహస్వప్నములయ్యె రాక్షసులకున్ లీలావినోదక్రియన్
      సంహారంబును జేసెదన్ జగమునన్ శాంతిం బ్రతిష్ఠింపఁగన్

      తొలగించండి
    4. సంపత్ కుమార్ శాస్త్రి గారు చక్కటి సవరణ సునాయాసముగా చేసారు. అభినందనలు.

      తొలగించండి
  28. శిష్ట రక్షణ కొరకునై దుష్టుల నిల
    సంహ రింతును జగమున శాంతి నిలుప
    ననుచు బలికెను హరిదా నర్జునునకు
    గీత యందున జదువుమా సీత నీవు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సుబ్బారావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మూడవ పాదంలో గణదోషం. "..బలికినాడు హరి దా..." అనండి.

      తొలగించండి
  29. హంహ్రీంఅంచు మదిన్ తలంచి యిల మాయల్ చేసి పుణ్యాత్ములం
    సంహారమ్ముసతమ్ముజేయు కడు హింసావాదులన్ చెచ్చెరన్,
    సింహమ్మా కలితోడ దూకి పశులం చెండాడు వైనమ్మునన్
    సంహారం బును జేసెదన్ జగమునన్ శాంతిం బ్రతిష్ఠింపఁగన్

    రిప్లయితొలగించండి
  30. రిప్లయిలు
    1. అన్నపరెడ్డి వారూ,
      మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
    2. రెడ్డి గారూ అద్భుతమైన పూరణ. అభినందనలు.

      తొలగించండి
    3. పెద్దలు మిస్సన్న గారికి నమస్సులు. ధన్యవాదములు.

      తొలగించండి
  31. గురువర్యులకు నమస్సులు. ధన్యవాదములు. అసనారె

    రిప్లయితొలగించండి
  32. సింహం బాకటితో గుహాంతరమునన్ జింతించుచున్ గూర్చొనన్
    సంహారంబులు జేయ కోగిరముకై చచ్చుం గదా కాన నే
    నంహస్సంచు దలంప గౌరవులపై హార్దమ్ము జూపింప నీ
    సంహారంబును జేసెదన్ జగమునన్ శాంతిం బ్రతిష్ఠింపఁగన్.

    ( గీత విన్న పార్థుని వాక్కులుగా న్యూస్ )

    రిప్లయితొలగించండి
  33. .మురికి గుంటలు బూడ్చగా మోదమనుచు
    ఇల్లు శుబ్రముజేయుట యిష్టమనగ?
    స్వచ్చభారతమేమమ్ము సాకగలదు|
    దోమ లీగలు రోగాలు దొరలనీక
    సంహ రింతును| జగమునశాంతి నిలుప|
    చంపబోకనె కీటకాల్చచ్చుగాన| {మనశుబ్రతేవాటిచావుకు మూలము}

    రిప్లయితొలగించండి
  34. సింహమ్మొక్కటి చాలుబల్లిదుని వేజీల్చంగ మున్నావిధిన్
    సింహమ్మై తగ దానవాధము వెసన్ ఛేధింపడే వెన్నుడా
    సింహత్పీఠముకౌరవాధములకున్ చేజారి పోవంగనే
    సంహారంబును జేసెదన్ జగమునన్ శాంతిం బ్రతిష్ఠింపఁగన్.

    రిప్లయితొలగించండి
  35. రిప్లయిలు
    1. భాస్కరమ్మ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'సింహత్పీఠము'...? అది సింహపీఠమే.

      తొలగించండి
  36. క్రొవ్విడి వెంకట రాజారావు:

    దుర్మతిని గూడి నిరతము దుస్సహమగు
    కృత్యముల నశాంతి నిడుచు కిక్కురించు
    కుటిల నుగ్రమూకల నెల్ల గుఱుతెఱింగి
    సంహరింతును జగమున శాంతి నిలుప

    రిప్లయితొలగించండి
  37. ఆచార్య రాణి సదాశివ మూర్తి గారి పూరణ


    సంహర్తల్ మధుమాధవేశసఖులీ సంవత్సరాలీ విభుల్
    సంహార్యంబది జీవజాలభవమౌ సంతోషదుఃఖావనీ।
    సంహృత్యాప్తుడ కాళిదాస కవినై సత్కావ్యలీలావిధిన్
    (సంహారేశుల సంస్తుతింప కవినై సంలాప లీలావిధిన్)
    సంహారంబును జేసెదన్ జగమునన్ శాంతిం బ్రతిష్ఠింపఁగన్

    సంహర్తల్ - ఏకం చేసే వారు
    అంతం చేసేవారు
    మధు - చైత్రం, మాధవ- వైశాఖం ఈశ- వసంతుడు
    సఖులు- ఇతర ఋతునాథులు

    సంహార్యంబు - ఒక్కటిగా కలపబడవలసినది
    మెట్టు పెట్టబడవలసినది
    భవం - సంసారం

    సంహృతి - కలపటం అనే కృత్యం

    సంహారం - స్తుతి పూర్వకముగా ఏకీకరణం (ఋతుసంహారం లా)

    ఆచార్య రాణి సదాశివ మూర్తి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పూజ్య గురుపుత్త్రులకు వమస్సులు! మీ పూరణ అత్యద్భుతముగనున్నది! 🙏🙏🙏🙏🙏

      తొలగించండి
    2. చాలా చాలా ధన్యవాదాలమ్మా
      🙏

      ...ఆచార్య రాణి సదాశివ మూర్తి

      తొలగించండి
  38. అంహస్సంటునుగాక నాకు విను నే
    నాశస్త్రమున్ చేగొనన్
    రంహస్సున్ గలదౌ సుదర్శనముతో
    రాజిల్లగా నాజిలో
    సింహమ్మా కటినే విధమ్ము కరి
    పై చిందాడు భీష్మున్నట్లే
    సంహారంబును జేసెదన్ జగమునన్ శాంతిం బ్రతిష్టించగన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సీతాదేవి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'భీష్మున్నట్లే' అన్నచోట గణదోషం.

      తొలగించండి
    2. ధన్యవాదములు గురుదేవా! భీష్మున్నటుల్
      యనిన సరిపోవునను కొందును! 🙏🙏🙏

      తొలగించండి
  39. సంహర్షమ్మును బోల బాపములిలన్ సందోహమాయెన్ గదా!
    సంహర్తల్ కరువైరి కారె దునుమన్ సంధింప బాణమ్ములన్
    సింహధ్వానము సేయుచున్ దరలెదన్ చెండాడ బాపాత్ములన్
    "సంహారంబును జేసెదన్ జగమునన్ శాంతిం బ్రతిష్ఠింపఁగన్

    రిప్లయితొలగించండి
  40. శార్దూలవిక్రీడితము
    అంహస్సెంచిరి యుగ్రవాదులకటా! యజ్ఞాన గర్వోధృతిన్
    రంహస్సంచరులై యమాయకులవౌ ప్రాణంబులన్ దీయగన్
    సింహస్వప్నమనంగ వారికి సియాచిన్ సర్జికల్ స్ట్రైక్సు తో
    సంహారంబును జేసెదన్ జగమునన్ శాంతిం బ్రతిష్ఠింపఁగన్

    రిప్లయితొలగించండి
  41. శార్దూలవిక్రీడితము
    అంహస్సెంచిరి యుగ్రవాదులకటా! యజ్ఞాన గర్వోధృతిన్
    రంహస్సంచరులై యమాయకులవౌ ప్రాణంబులన్ దీయగన్
    సింహస్వప్నమనంగ వారికి సియాచిన్ సర్జికల్ స్ట్రైక్సు తో
    సంహారంబును జేసెదన్ జగమునన్ శాంతిం బ్రతిష్ఠింపఁగన్

    రిప్లయితొలగించండి
  42. తే.గీ.

    తెలివి భారతపౌరుల తీర్చిదిద్ద

    తెలుగుపాండిత్యపదునుకత్తినిలబట్టి

    అహము గర్వము లోభము నాత్మలోన

    సంహరింతును జగమున శాంతి నిలుప .

    రిప్లయితొలగించండి

  43. ............సమస్య
    సంహారంబును జేసెదన్ జగమునన్
    శాంతిన్ ప్రతిష్ఠింపగన్
    ~~~~~~~~~
    సందర్భం:
    మహాశైలం సముత్పాట్య
    ధావంతం రావణం ప్రతి
    లాక్షారసారుణౌ రౌద్రం
    కాలాంతక యమోపమం
    జ్వలదగ్ని సమం జైత్రం
    సూర్యకోటిసమ ప్రభం
    రామ రావణ యుద్ధంలో ఆంజనేయుని కొకసారి విపరీతమైన కోపం వచ్చింది. ప్రళయ కాల రుద్రుడే అయిపోయాడు. ఒక పర్వతాన్ని పెకలించి రావణుని పై కురికాడు. రాముని కింత కష్టం కలిగించిన వాణ్ణి ఇవాళ అంతం చేసి తీరుతా నన్నాడు. రామ లక్ష్మణులను హాయిగా విశ్రాంతి తీసుకొనం డన్నాడు. సాక్షాత్ రుద్ర స్వరూపుడైన అతణ్ణి పట్టడాని కెవరికి సాధ్యం? ఆ రోజు రావణ సంహారం నిశ్చయం.. యుద్ధం ముగిసిం దనుకున్నారు.
    అతి కష్టంమీద స్వామిని ఆ ప్రయత్నంనుండి విరమింప జేయవలసివచ్చింది.

    "అంహః కార్య ఫలంబు రావణుని కి
    ప్డందింతు నే" నంచు తా
    "హుం హు"మ్మంచు మ హాద్రి హస్తతలమం
    దొప్పార లంఘించుచున్
    రంహో యుక్తుడు మారుతాత్మజుడు తా
    రౌద్రాక్షుడై యి ట్లనెన్
    "సంహారంబును జేసెదన్ జగమునన్
    శాంతిన్ ప్రతిష్ఠింపగన్"

    ~వెలుదండ సత్యనారాయణ

    అంహః కార్యము=పాప కార్యము.
    రంహో యుక్తుడు= వడి గలవాడు.

    రిప్లయితొలగించండి
  44. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  45. గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
    సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2576
    సమస్య :: *సంహారమ్మును జేసెదన్ జగమునన్ శాంతిన్ బ్రతిష్ఠింపగన్.*
    శాంతిని నిలబెట్టేందుకోసం సంహారం చేస్తాను అనేది ఈ సమస్యలోని విరుద్ధమైన అర్థం.
    సందర్భం :: దశావతారాలలో చివర , భగవంతుడు కల్కి అవతారాన్ని
    ధరిస్తానని , గుఱ్ఱంపై ఎక్కి , ఖడ్గాన్ని చేతబట్టి , సాధువులను రక్షిస్తానని ; సింహంలాగా చీల్చి చెండాడుతూ దుష్టులను సంహరిస్తానని , భూలోకంలో శాంతిని స్థాపిస్తానని విశదీకరించే సందర్భం.

    అంహస్సున్ దొలగింతు ఖడ్గ మది నా హస్తమ్ము నం దుండగా,
    రంహోయుక్తుడ ,కల్కి నశ్వ గతులన్ , రక్షించెదన్ సాధులన్ ;
    సింహమ్మో యన చీల్చివేసెదనుగా చెండాడుచున్, దుష్టులన్
    *సంహారమ్మును జేసెదన్ ; జగమునన్ శాంతిన్ ప్రతిష్ఠింపగన్.*
    (అంహస్సు=పాపము) (రంహస్సు= వడి , వడిగలది)
    *కోట రాజశేఖర్ నెల్లూరు.* (22.01.2018)

    రిప్లయితొలగించండి
  46. సింహంబంచును మోడి! నీవిటను కాశీ సీటు జేకొంటివే
    హంహమ్మంచును సూటు బూటు భళి నాహ్లాదంబుగా దాల్చితే
    తుంహారీ పరిపాల నింకికను నే తున్కల్లుగా త్రుంచెదన్
    సంహారంబును జేసెదన్ జగమునన్ శాంతిం బ్రతిష్ఠింపఁగన్!

    రిప్లయితొలగించండి