2, జనవరి 2018, మంగళవారం

విషాద వార్త!


శ్రీ కెంబాయి తిమ్మాజీ రావు గారి అస్తమయం!

అబ్బరాజు వెంకట రమణ గారు మెసెంజరులో పంపిన సందేశం.....
"శంకరాభరణం గ్రూపు సభ్యులు శ్రీ కెంబాయి తిమ్మాజీరావుగారు నిన్న 31 12 2017 న ఢిల్లీలో స్వర్గస్తులైనారాని చింతించుతూ తెలియచేస్తున్నాను. భార్యావియోగమై వారిని చూడటానికి వెళ్ళి వారి సాహిత్యాభిలాష చూసి వారిని ఇటుపై మళ్ళించటం వారు తమ సమయాన్ని మీతో మీ బ్లాగుతో ఆనందంగా గడపటం జరిగింది."
కవిమిత్రులారా!
శ్రీ కెంబాయి తిమ్మాజీ రావు గారు మన బ్లాగు మిత్రుల్లో వయస్సులో చాలా పెద్దవారు. తొంభై యేళ్ళకు పైబడినవారు. వారు నన్ను "గురువు గారూ!" అని సంబోధించినప్పుడల్లా ఏదో అపరాధభావం నాలో పొడసూపేది.
తమ అద్భుతమైన పూరణలతో మనలను ఇంతకాలం అలరింపజేసి తిరిగిరాని లోకాలకు వెళ్ళారు. వివాదాలకు దూరంగా ఉండే సౌజన్యమూర్తి వారు.
శంకరాభరణం బ్లాగు ఒక ఆత్మీయుణ్ణి కోల్పోయింది.
వారి ఆత్మకు భగవంతుడు శాంతిని చేకూర్చుగాక!

37 కామెంట్‌లు:

  1. తిమ్మాజీరావు గారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాను...

    రిప్లయితొలగించండి
  2. వారి కుటంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి !

    రిప్లయితొలగించండి
  3. చిరకాల శంకరాభరణ మిత్రులు నిగర్వి, నిరాడంబరులు అయిన శ్రీ కెంబయి తిమ్మాజీరావు గారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాను... వారి కుటంబ సభ్యులకు నాయొక్క ప్రగాఢ సానుభూతి

    రిప్లయితొలగించండి
  4. గు రు మూ ర్తి ఆ చారి
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,,,,,,


    శ్రీ తిమ్మోజి రావు గారు స్వర్గస్తు లైనందుకు నే నెంతో‌ చింతిస్తున్నాను .

    నన్ను బ్లాగుకు పరిచయం చేసిన వ్యక్తి , శంకరాభరణం కు పద్యాలు

    వ్రాయమని నన్ను ప్రోత్సహించిన మహానుభావుడు ఆయనే !

    వయస్సు లో నేను ఆయన కంటే ఇరువది ఏండ్లు చిన్నవాన్ని .

    అయినా మే మిద్దరము మంచి సాహిత్య స్నేహితులము . ఎప్పుడు

    సెల్ఫోన్లలో కులాసగా మాట్లాడు కోనేవాళ్ళము .

    ఇటీవల హైదరాబాదులో‌‌‌ జరిగిన వారి మనుమరాలి పెండ్లి కి

    నేను వెళ్ళి ఆయనను చివరిసారిగా చూశాను .



    ఆయన స్వర్గస్తు డైనాడన్న వార్త విని నేను చాలా‌ బాధ

    చెందాను . ‌ ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుని

    ప్రార్థిస్తున్నాను . వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి

    తెలియ జేస్తున్నాను .



    రిప్లయితొలగించండి
  5. శ్రీ తిమ్మాజీరావు గారి వార్త చాలా విచారమైనది శంకరా భరణ బ్లాగు ప్రోత్సాహం చేసిన పెద్దలు చాలా సంవత్స రాల మరువ లేని సాహితీ మిత్రులు ప్రగాడ సంతా పము కలిగించి వెళ్ళడము చాలా భాధా కర ము

    రిప్లయితొలగించండి
  6. వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను.

    రిప్లయితొలగించండి

  7. శ్రీ కెంబాయి వారి ఆత్మకు శాంతి కలుగు గాక !


    జిలేబి

    రిప్లయితొలగించండి
  8. ఆయనకు ఉత్తమ గతులు ప్రాప్తించాలని ఆ భగవంతునికి నా ప్రార్థన.

    రిప్లయితొలగించండి
  9. రాలినదోయి తెల్గు జవరాలు ధరించిన పూలచెండులో మేలు గులాబి.....
    అన్న జాషువా గారి పద్యం గుర్తుకు వచ్చింది.శ్రీ తిమ్మాజీరావుగారి మృతికి అశ్రు నివాళి

    రిప్లయితొలగించండి
  10. శ్రీ తిమ్మాజీ రావు గారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్ధిస్తున్నాను.

    రిప్లయితొలగించండి
  11. చాలా విచారకర వార్త ...శ్రీ కెంబాయి తిమ్మాజీరావు గారి ఆత్మకు శాంతి చేకూరుగాక.

    రిప్లయితొలగించండి
  12. తిమ్మాజిరావు ఆత్మకు శాంతి కలుగు గాక

    రిప్లయితొలగించండి
  13. తిమ్మాజీ రావు గారి ఆత్మ కు శాంతి కలిగించాలని దేవదేవుణ్ణి ప్రార్థిస్తున్నాను

    రిప్లయితొలగించండి
  14. తిమ్మాజిరావు గారి ఆత్మకు శాంతి కలుగు గాక.

    రిప్లయితొలగించండి
  15. తొంభై యేండ్ల వయసులో కూడ ఉత్సాహంగా పద్యరచన కొనసాగించిన శ్రీ కెంబాయి తిమ్మరాజుగారికి జోహార్లు! వారికి పరమపదము లభించాలని ప్రార్ధిస్తూ! సీతాదేవి.

    రిప్లయితొలగించండి
  16. కవి మిత్రులు, పెద్దలు తిమ్మాజీ రావు గారు స్వర్గస్తు లవడం విషాదకరం. వారికి పరమాత్ముడు సద్గతుల నివ్వగలడని నమ్ముతున్నాను.

    రిప్లయితొలగించండి
  17. బ్లాగు మిత్రులు శ్రీతిమ్మాజిరావుగారి అస్తమయం విచారకరం ..వారిఆత్మకుభగవంతుడుశాంతి చేకూర్చుగాక..

    రిప్లయితొలగించండి
  18. రిప్లయిలు
    1. పూజ్యులు తిమ్మాజీ రావు గారు స్వర్గస్థులైనారన్న వార్త నన్ను కలచి వేసినది. వారి పూరణలను సమీక్షించి నపుడు చి. కామేశ్వర రావని యాప్యాయముగా సంబోధన చేసేవారు. అనివార్యమని తెలిసినా యేదో నిర్వేదము. పరిపూర్ణమైన జీవన యానము చేసిన మహా వ్యక్తి. ఆయన మహదాత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుని వేడుకొను చున్నాను. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. శంకరాభరణము శోకాభరణమైనది.

      తొలగించండి
  19. లేవులేవార్య!తిమ్మాజి!లేవుమాకు
    వీడిపోవుటమమ్ములబాడియగునె?
    నీదురచనలుమాకింకవేదవాక్కు
    పొందుగావుత!శాంతిమీ యాత్మకికను

    రిప్లయితొలగించండి
  20. విషాదకర వార్త.
    వారి ఆత్మకు భగవంతుడు శాంతి చేకూర్చు గాక.

    రిప్లయితొలగించండి
  21. అకట తిమ్మాజి దివికెగినన్న వార్త
    యశని పాతమ్ము మాకు తా విశదముగను
    నెన్ని పద్యాలపూరణలెన్న జేసె
    లేవు మాకింకనాతని లేఖనములు

    రిప్లయితొలగించండి
  22. బ్లాగు మిత్రులు శ్రీతిమ్మాజిరావుగారి అస్తమయం విచారకరం ..వారిఆత్మకుభగవంతుడుశాంతి చేకూర్చుగాక..

    రిప్లయితొలగించండి
  23. శ్రీ తిమ్మాజీ గారి మృతికి ప్రగాఢ సంతాపం తెలుపుచున్నాను.. వారి ఆత్మకు శాంతి కలుగింపవలెనని భగవంతుని కోరుతూ.... మురళీకృష్ణ

    రిప్లయితొలగించండి
  24. చాలా కాలం నుండి మన బ్లాగులో పద్య కవిగా కొనసాగుతున్న మంచి కవి మిత్రులు స్వర్గీయ శ్రీ కెంబాయి తిమ్మాజీ రావు గారు. వారు స్వర్గస్థులు కావడం విచారకరం. వారి అస్తమయం మన బ్లాగుకు తీరని లోటు.
    ఆ భగవంతుడు వారి ఆత్మకు శాంతిని చేకూర్చుగాక.

    రిప్లయితొలగించండి
  25. ఎంతో కాలంనుండి వారి పద్యాలను చూస్తు..ఈ రోజు ఇది వినగానే చాలా బాధకలిగింది, వారి ఆత్మకు శాంతికలగాలని భగవంతుని ప్రార్ధిస్తున్నాను..

    రిప్లయితొలగించండి
  26. పెద్దలు తిమ్మాజీ రావుగారికి పునరాగమన రహిత ముక్తి లభించు గాక !

    రిప్లయితొలగించండి
  27. వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను

    రిప్లయితొలగించండి
  28. Unknown గారి వ్యాఖ్య.....
    Aathma eppudu santhilonee untundi.Aatmaku santhi anedhi Christianitylonidi.Aathmanu Agni dahimpajaaladu,Neeru thadupajaaladu,Vayuvu aarpiveyajaaladhu.Aathma naasanamkaanidhi.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. unknown గారూ,
      నిజమే! నేనెప్పుడూ ఇంత లోతుగా ఆలోచించలేదు. మీరు చెప్పినది నూటికి నూరుపాళ్ళు వాస్తవం.
      మీ అభిప్రాయంతో ఏకీభవిస్తున్నాను. ఇటువంటి సందర్భాలలో ఇకముందెప్పుడూ 'ఆత్మకు శాంతి కలగాలి' అన్న మాటను ఉపయోగించను. ధన్యవాదాలు.

      తొలగించండి
  29. Guru tulyalaki namaskaaraam.Idi 'Bahagawad Gita' lo Srikrishnudu cheppinadi gurthu chesanu anthe.Mee blog daily chusthu untanu.Maa schoollo teachers,pillalandariki me blogloni padyalu daily vinipistho untanu.Naa peru GOTETI Sivaramakrishna,SA[English],ZPHS,Dandagarra,Tadepalligudem Mandal,W.G.Dt,AP.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ధన్యవాదాలు.
      మీ వాట్సప్ నెం. తెలియజేస్తే మిమ్మల్ని 'శంకరాభరణం' సమూహంలో చేరుస్తాను.

      తొలగించండి