2, మార్చి 2011, బుధవారం

సమస్యా పూరణం - 242 (శిష్టుఁ డెట్లు పల్కు)

కవి మిత్రులారా,
అందరికీ మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు.
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ......
శిష్టుఁ డెట్లు పల్కు శివ శివ యని?
శివరాత్రి సందర్భంగా ఈ సమస్యను సూచించిన మిస్సన్న గారికి ధన్యవాదాలు.

30 కామెంట్‌లు:

  1. దుష్టు లైన వారి దునుమంగ శంభుండు
    పాశు పదము నీయ, పరమ శివుని
    శిష్టు డెట్లు పల్కు శివ శివ యని గాక
    వేరొకండ నేల వినుతి చేయు?

    రిప్లయితొలగించండి
  2. గోలి హనుమచ్ఛాస్త్రి.

    హరికి భక్తు డయిన ఆ వశిష్టాచారి
    హరుని నామ మొల్ల డసలు అతడు
    శివుని రాత్రి నాడు చెప్పిచూడగ ఆవ
    శిష్టు డెట్లు పల్కు శివ శివ యని?

    రిప్లయితొలగించండి
  3. కాలవహ్నిసహితఫాలనేత్రదహిత
    నిజవపుఁడెలమి మనసిజుఁడు దవిలి
    నొడలుఁ గోలుపోవ, నోరార - నామావ
    శిష్టుఁ డెట్లు పల్కు శివ శివ యని?

    రిప్లయితొలగించండి
  4. రామచంద్ర యనుచు రక్తిఁ బొందు మదిని,
    దశరధాత్మజుఁడని దరిని జేరు,
    చిత్త మందు మెలఁగ సీతాపతి, గురు వ
    శిష్టుఁ డెట్లు పల్కు శివ శివ యని !

    రిప్లయితొలగించండి
  5. శైవ వైష్ణవములు దీవరించిన వేళ
    రంగ రంగ యనునె జంగమయ్య ?
    స్వప్నమందునైన , వైష్ణవ భక్త వి
    శిష్టుఁ డెట్లు పల్కు శివ శివ యని?

    రిప్లయితొలగించండి
  6. మంద పీతాంబర్ గారూ,
    "శిష్టు డెట్లు పల్కు శివ శివ యని గాక" అంటూ చక్కని పూరణ నిచ్చారు. అభినందనలు.
    కాని పాశుపతము పొరపాటున పాశుపదము అని టైపయింది.

    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    "వశిష్టుడు" అని పూరించడం బాగుంది. మంచి పూరణ. అభినందనలు.
    "హరుని నామ మొల్ల డసలు అతడు" అన్నదానిని "హరుని నామ మొల్ల డనవరతము" అంటే ఎలా ఉంటుంది?

    రవి గారూ,
    "నామావశిష్టుడు" అని పూరించడం చాలా బాగుంది. ఉత్తమమైన పూరణ. అభినందనలు.

    గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
    మీ పూరణ చాలా బాగుంది. మీరూ గోలి వారి బాట పట్టారు. బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  7. శిష్టుఁ డెట్లు పల్కు శివ శివ యనినచో:
    "భక్తి తోడను, యనురక్తి తోడ,
    శక్తి తోడ, నీహ సక్తిని విడనాడి,
    ముక్తి మోహమందు మునిగి" యందు.

    రిప్లయితొలగించండి
  8. శిష్టు లైన పెద్దలు, మిత్రులు శ్రేష్ఠమైన పూరణలతో శివ స్మరణ జేశారు.
    అందరికీ వందనాలు.

    రిప్లయితొలగించండి
  9. శంకరార్యా! మంచి సవరణ సూచించారు.ధన్యవాదములు.శివరాత్రి నాడు శివ నామస్మరణ తో పద్యాలు వ్రాయించిన మీకు,వ్రాయింపజేసిన మిస్సన్న గారికి నమస్సులు.

    గోలి హనుమచ్ఛాస్త్రి.

    రిప్లయితొలగించండి
  10. అప్పుడప్పుడు మేము పడే అవస్థ కూడా చెప్పాలి గదండీ ! స్థాన బలము అని వేమన గారు నుడివారు !


    అన్య దేశమందు నధికారులను దోడ
    చర్చి నందు నుండ చర్చ లందు
    చిత్త మందు తలచు శివనామమును తక్క
    శిష్టుఁ డెట్లు పల్కు శివ శివ యని !

    రిప్లయితొలగించండి
  11. డా. విష్ణు నందన్ గారూ,
    ధన్యోస్మి! ఎంత మంచి పూరణ నిచ్చారు? ధన్యవాదాలు.

    మిస్సన్న గారూ,
    బాగుంది మీ పూరణ అభినందనలు.
    అది "ఇహాసక్తి" అనుకుంటాను ....?!

    గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
    నిజమే కదా! చర్చిలో "హర హర మహాదేవ శంభో శంకరా!" అని గొతెత్తి అనలేము కదా! బాగుంది మీ పూరణ. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  12. గురువు గారూ ఈహము నందు సక్తి (ఆసక్తి) అని వాడేను.
    మరి యెంత వరకూ సమంజసమో మీరే చెప్పాలి.

    కాని పక్షంలో :
    శిష్టుఁ డెట్లు పల్కు శివ శివ యనినచో:
    "భక్తి తోడను, యనురక్తి తోడ,
    నార్తి తోడ, నైహి కాసక్తి విడనాడి
    ముక్తి మోహమందు మునిగి" యందు.

    రిప్లయితొలగించండి
  13. మిస్సన్న గారూ,
    మీరు ఆ రూట్లో వచ్చారా? నేను తప్పుగా భావించాను. మన్నించండి.

    రిప్లయితొలగించండి
  14. మిస్సన్న గారు , సవరించిన పాఠానికే నా వోటు !!!

    రిప్లయితొలగించండి
  15. గురువు గారూ మీరు పెద్దలు. అలా పెద్ద మాటలు అనవద్దు.
    విష్ణు నందనుగారు సవరించిన పద్యమే మేలన్నారు గదా.
    ఆర్యా విష్ణు నందను గారూ! కృతజ్ఞతలు.

    రిప్లయితొలగించండి
  16. రామచంద్రుడు కడు త్రాగుబోతనుచును
    శిష్టుఁ డెట్లు పల్కు? శివ శివ యని
    చెవులు మూసు కొనును చెవిసోకినంతట,
    పలుకు వానికేమి విలువ కలదు?

    రిప్లయితొలగించండి
  17. గురువులు ,సోదరులు అందరికి మహా శివరాత్రి శుభా కాంక్షలు

    రిప్లయితొలగించండి
  18. శంకరాద్వైత సంపన్న చయను డగుబొ
    నిత్య మాచమనము చేయు నియమ వేళ
    కేశవాది నామము లందు చేర్చి సత్య
    శిష్టుఁ డెట్లు పల్కు శివ శివ యని?

    రిప్లయితొలగించండి
  19. అందరికీ
    మహాశివుని కరుణా కటాక్ష వీక్షణములు
    లభించుగాక !
    _______________________________________

    అందరికీ వందనములు.
    అందరి పూరణలూ
    అలరించు చున్నవి.
    _______________________________________

    చిన్న వయసు నందే ఎవరైనా మరణిస్తే
    ఆ వార్త విన్నప్పుడు గాని
    ఆ శవాన్ని చూచి నప్పుడు గాని
    ఎవరి నోటి నుండైనా వెలువడే దదే గదా !
    "శివ శివ ఎంత ఘోరం జరిగింది"
    అని !

    01)
    _______________________________________

    "శిష్టు డెట్లు పల్కు శివ శివ యని "జూడ
    రంగ మయ్య యైన - జంగ మయ్య
    గాని శవము గాంచ - గనె "శివ శివ" యంద్రు
    చిన్న వయసునందె - శివుని జేర !
    _______________________________________

    రంగమయ్య = విష్ణు భక్తుడు
    జంగమయ్య = శివ భక్తుడు
    _______________________________________

    రిప్లయితొలగించండి
  20. కవిమిత్రులారా, చిన్న సవరణతో (తే.గీ ని ఆ.వె. గా మార్చాను).
    శంకరాద్వైత సంపన్న చయను డగుబొ
    నిత్య మాచ మించు నియమ వేళ
    కేశవాది నామము లందు చేర్చి సత్య
    శిష్టుఁ డెట్లు పల్కు శివ శివ యని?

    రిప్లయితొలగించండి
  21. జిగురు సత్యనారాయణ గారూ,
    ప్రశస్తంగా ఉంది మీ పూరణ. అభినందనలు.

    చంద్రశేఖర్ గారూ,
    సమస్యను కొత్త కోణంలో పూరించారు. అభినందనలు.
    సవరించిన తర్వాత కూడ కొన్ని లోపాలున్నాయి. నా సవరణ ....
    అతఁడు చూడ శంక రాద్వైతమును నమ్ము;
    నిత్య మాచ మించు నియమ మందు
    కేశవాది నామ కీర్తన మొనరించు
    శిష్టుఁ డెట్లు పల్కు శివ శివ యని?

    రిప్లయితొలగించండి
  22. మాస్టారూ, మెరుగులు దిద్దినందుకు ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  23. వసంత్ కిశోర్ గారూ,
    మన్నించాలి. ఆలస్యంగా చూసాను.
    మంచి భావంతో సమస్యను పూరించారు. అభినందనలు.
    కాని రంగమయ్య "హరి హరి!" అనో "రామ రామ" అనో అంటాడు కాని "శివ శివ!" అంటాడా?
    అప్రస్తుతం కావచ్చు కాని ... ఒక ముచ్చట ...
    నా పేరు శంకరయ్య అయినా నేను విష్ణుభక్తుణ్ణి. నేను విద్యార్థిగా ఉన్నప్పుడు వ్రాసిన "శ్రీశ శతకం", "వరద శతకం" రెండూ విష్ణువును సంబోధించినవే.

    రిప్లయితొలగించండి
  24. "శివాయ విష్ణురూపాయ శివ రూపాయ విష్ణవే
    శివస్య హృదయం విష్ణుః విష్ణుశ్చ హృదయం శివహ
    యధ్శివమయో విష్ణురేవం విష్ణుమయ శివః" - కృష్ణ యజుర్వేదియ స్కంధోపనిషత్

    శివకేశవుల మధ్య అంతరాలను చూసేవారికి రౌరవాది నరకాలు సంప్రాప్తం అవుతాయంటారు

    రిప్లయితొలగించండి
  25. ఆ దుర్వార్త విన్నప్పుడు
    అసంకల్పితంగా ఎవరైనా శివ శివ
    అంటారనే నా భావన

    ఎలాగంటే
    అష్ట భాషా ప్రవీణుడి మాతృభాష
    తెలుకోవాలంటే - వాడికి బాధ కలిగిస్తే అప్రయత్నంగా
    మాతృ భాషే పలికినట్లు !

    మీ శతక రచనకు అభినందనలు !
    మరి శంకరుణ్ణి పాపం ఇప్పటికీ అలా ఒదిలేసారా !
    శతకం వ్రాయకుండా ?

    రిప్లయితొలగించండి
  26. అజ్ఞాత గారూ,
    నేను విష్ణుభక్తుణ్ణి అనే అన్నాను కాని శివద్వేషిని అనలేదు కదా. "ఏకం సత్ - బహుధా వదంతి విప్రాః" సూక్తిని నమ్మేవాణ్ణి. మా ఇలవేల్పు వేములవాడ రాజరాజేశ్వర స్వామి.

    వసంత్ కిశోర్ గారూ,
    నిజమే. ఇంత వరకు శివ పరమైన రచన ఏదీ చేయ లేదు. వరంగల్ జిల్లా ధర్మసాగర్ మండలంలో ఉన్న గట్టు మల్లికార్జున స్వామిపై శతకం వ్రాయాలనే ఆలోచన ఎంతో కాలంగా ఉంది. ఇక మొదలు పెట్టాలి.

    రిప్లయితొలగించండి
  27. గురువుగారూ మీ శ్రీశ, వరద శతకాలను బ్లాగులో ఉంచవచ్చును కదా.

    రిప్లయితొలగించండి