12, మార్చి 2011, శనివారం

సమస్యా పూరణం - 253 (నాకు మోదమ్ముఁ గూర్చె)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ......
నాకు మోదమ్ముఁ గూర్చె సునామి యిపుడు.
నిజానికి నేను ముందు అనుకున్న సమస్య
"
నామ రూపమ్ము లడఁచె సునామి యకట!".
కాని మిత్రులు ఇందులో "సమస్య" లేదంటారని పైవిధంగా మార్చాను.

విశ్వ మానవ సౌభ్రాతృత్వాన్ని బోధించే భారతీయ సంస్కృతికి వారసులం మనం. జపాన్ దేశ సోదరులకు మన సానుభూతిని తెలియజేద్దాం.
"లోకా స్సమస్తా స్సుఖినో భవంతు."

10 కామెంట్‌లు:

  1. సప్తజిహ్వుఁకడనునేర్చెసాగరమన
    అలల నాల్కలన్నియుజాపి విలయమును
    దెచ్చె;పల్కియుండు తుదకు తృప్తి గొనియె:
    "నాకు మోదమ్ముఁ గూర్చె సునామి యిపుడు."

    రిప్లయితొలగించండి
  2. కలి పురుషుడను నేను లోకములు కీడు
    నొంద సంతసించెద, నాకు విందగునది,
    జలము ముంచ జపానును జనము చావ
    నాకు మోదమ్ముఁ గూర్చె సునామి యిపుడు.

    రిప్లయితొలగించండి
  3. గోలి హనుమచ్ఛాస్త్రి.

    సునామీ బాధిత జపాను ప్రజలకు సానుభూతిని ప్రకటిస్తూ...

    ప్రళయ మొచ్చును మునుగు ప్రపంచమంత
    అనుచు చెప్పగ కలతలు మనసు నిండె
    ప్రాంత మింతయె నేడు జపాను మునిగె
    నాకు మోదమ్ముగూర్చె సునామి యిపుడు.

    రిప్లయితొలగించండి
  4. మంద పీతాంబర్ గారూ,
    మీ పూరణను ఎందుకు తొలగించారు? బాగానే ఉంది కదా!

    ఊకదంపుడు గారూ,
    జిగురు సత్యనారాయణ గారూ,
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పూరణలు బాగున్నాయి. ప్రయాణపు హడావుడిలో విడివిడిగా వ్యాఖ్యానించడం లేదు. మన్నించండి.

    రిప్లయితొలగించండి
  5. కవి మిత్రులకు మనవి.
    రేపు కరీంనగర్‌లో బంధువుల పెళ్ళికోసం ఇప్పుడే బయలుదేరి వెళ్తున్నాను. అటునిండి అటే వేములవాడ క్షేత్రానికి వెళ్ళి ఎల్లుండి రాత్రికి తిరిగి వస్తాను. ఈ రెండు రోజులూ ఎలాగో వీలు చూసుకొని సమస్యలను పోస్ట్ చేస్తాను. కాని వెంటవెంటనే వ్యాఖ్యనించడం సాధ్యం కాదు. మంగళవారం నాడు మీ పూరణలపై స్పందిస్తాను. నేను లేకున్నా మిత్రులు పరస్పర గుణదోషాల చర్చ కొనసాగించ వలసిందని మనవి. అసౌకర్యానికి క్షంతవ్యుణ్ణి.

    రిప్లయితొలగించండి
  6. సమస్యను మొదట కంద పద్యంలో ఉంచి పూరించాను .
    కాని గణ దోషం దొర్లడం గమనించి తొలగించాను.

    నాకు మోదమ్ము గూర్చు సునామి యిపుడు
    వచ్చి ముంచగా నవినీతి వారసులను
    నిర్ణయమ్ముల జేయని నిర్దయులను
    ప్రజల నిత్యము వంచించు పాలకులను
    నోరు దెరవని నాయక భీరువులను
    మాట దప్పిన మతిహీన మంత్రి వరుల
    కొంగు చాటున జేరిన కుటిల మతుల
    రైతు భూముల బలిగొన్న రాక్షసులను!!!!!

    రిప్లయితొలగించండి
  7. అలలు విలయ తాండవముతో నాటలాడి
    ఎన్ని ప్రాణాలు తీసె జపాను లోన !?
    మానవాళికి శాపమై ; కాన యెటుల
    నాకు మోదమ్ము గూర్చె సునామి యిపుడు !?

    రిప్లయితొలగించండి
  8. 01)
    _________________________________________

    జాతి ,మత ,కుల ,భేదము - జనులు మరచి
    కలసి యుండిరి ఐక్యత !- కలల లోన
    నాకు మోదమ్ము గూర్చె! సు- నామి యిపుడు
    ప్రళయ భీకర లీల, జ - పాను లోన !
    సకల జనులను ముంచెత్తి - సాతి జేయ
    వికల మయ్యెను మనసెంతొ - వేద నొంది !
    శాంతి జేకూర్చ వేడెదు - శంభు నెంతొ !
    _________________________________________

    సాతి = నాశనము
    _________________________________________

    రిప్లయితొలగించండి
  9. మంద పీతాంబర్ గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.

    నాగరాజు రవీందర్ గారూ,
    "శంకరాభరణం" మీకు స్వాగతం పలుకుతోంది.
    మీ పూరణ నిర్దోషంగా, ప్రశంసనీయంగా ఉంది. అభినందనలు.
    మీ నుండి క్రమం తప్పకుండా పూరణలు రావాలని కోరుతున్నాను.

    వసంత్ కిశోర్ గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    చివరి రెండు పాదాలలో రెండు సార్లు "తొ" హ్రస్వ ప్రయోగం చేసారు. అలాగే "వేదనొంది" ని "వేదన పది" అంటే బాగుంటుంది. నా సవరణలు ....
    వికల మయ్యె (మనసు కడు) వేద(న పడి) !
    శాంతి జేకూర్చ వేడెద శంభు నిపుడు !

    రిప్లయితొలగించండి