14, మార్చి 2011, సోమవారం

సమస్యా పూరణం - 255 (అర్జునునకు మిత్రుఁ)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ......
అర్జునునకు మిత్రుఁ డంగరాజు.
ఇప్పుడే వేములవాడ నుండి హైదరాబాదు చేరుకున్నాను. వచ్చీ రావడం తోనే ముందుగా సమస్యను పోస్ట్ చేస్తున్నాను. ఇక తీరిగ్గా నిన్నటి మొన్నటి పూరణలూ, వ్యాఖ్యలూ, స్పందనలూ చూస్తాను.

30 కామెంట్‌లు:

  1. గోలి హనుమచ్ఛాస్త్రి.

    "కదన మందు నేను కాలుని గానౌదు
    అర్జునునకు;" మిత్రు డంగ రాజు
    మాట తప్ప ననుచు మాట యిచ్చె
    రాజరాజు కపుడు రాజ సభను.

    రిప్లయితొలగించండి
  2. గోలి హనుమచ్ఛాస్త్రి.

    "కదన మందు నేను కాలుని గానౌదు
    అర్జునునకు;" మిత్రు డంగ రాజు
    మాట తప్ప ననుచు మాటను ఇచ్చెను
    రాజరాజు కపుడు రాజ సభను.

    రిప్లయితొలగించండి
  3. గోలి హనుమచ్ఛాస్త్రి.

    మూడవ పాదం

    బాస చేతు ననుచు మాటను ఇచ్చెను
    అంటే..మాట.. పునరుక్తి ఉండదేమో.

    రిప్లయితొలగించండి
  4. అర్జునునకు, మిత్రుఁ డంగరాజునకును
    సమర రంగమందు సరిజోడు కుదిరె
    రాజరాజు మదిని రాధేయుఁ దలచి,
    చింత దీరి ఇంక చాల సంతసించె!

    రిప్లయితొలగించండి
  5. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    అయితే "బాస చేయడం, మాట ఇవ్వడం" ఒకటే కదా. అర్థ పునరుక్తి అవుతున్నట్లు నాకు అనుమానం. "బాస చేతు ననుచు బాహాటముగ జెప్పె" అంటే ఎలా ఉంటుందంటారు?

    రిప్లయితొలగించండి
  6. మందాకిని గారు,
    చాలా సంతోషం. దారిలో పడుతున్నారు. బాగుంది. అభినందనలు.
    చివరి రెండు పదాల్లో గణదోషాలు (మరీ చిన్నవి) ఉన్నాయి. నా సవరణ....

    రాజరాజు మదిని రాధేయు(ని) దలచి,
    చింత దీరి చాల సంతసించె!

    రిప్లయితొలగించండి
  7. ఈ సమస్య చూడగానే "దుషట చతుషటయము", మాయాబజార్ గుర్తుకొచ్చాయి. కొంచెం మార్చి...

    రారాజు దుర్యోధనుడు వికటాట్టహాసంతో:
    అటునిటు యగుగాక ఆగర్భశత్రుల
    మర్జునునకు, మిత్రుఁడ౦గ రాజు,
    శకుని మామ హితుడునిక, దుస్సహుం జేర్చి
    దుషట చతుష టయము మేము గామె!

    రిప్లయితొలగించండి
  8. అయితే నాల్గో పాదం యతి కోసం:
    రారాజు దుర్యోధనుడు వికటాట్టహాసంతో:
    అటునిటు యగుగాక ఆగర్భశత్రుల
    మర్జునునకు, మిత్రుఁడ౦గ రాజు,
    శకుని మామ హితుడునిక, దుస్సహుం జేర్చి
    దుషట చతుష టమను దూరు లమ్ము!

    రిప్లయితొలగించండి
  9. ధూర్తుడు - దూరుడు పకృతి,వికృతులను కొని దూరులమ్ము వాడాను. కాని పక్షంలో "దూర్తులమ్ము" అనుకోవచ్చు యతి గణ దోషాలు కలగకుండా. కావున:
    రారాజు దుర్యోధనుడు వికటాట్టహాసంతో:
    అటునిటు యగుగాక ఆగర్భశత్రుల
    మర్జునునకు, మిత్రుఁడ౦గ రాజు,
    శకుని మామ హితుడునిక, దుస్సహుం జేర్చి
    దుషట చతుష టమను ధూర్తులమ్ము!

    రిప్లయితొలగించండి
  10. సవ్య సాచి పేరు సార్థకంబెవనికి?
    తరణి యనగ నెవరు? ధరణి పైన
    అడుగనంగనేమి? అమృతాశువెవ్వండు?
    అర్జునునకు, మిత్రుఁ, డంగ, రాజు!!

    రిప్లయితొలగించండి
  11. కృష్ణరాయబార ఘట్టం లో దుర్యోధనుడు కృష్ణుడితో :

    భీష్ముఁ రాక దెలిసి భీతిలిపారరే?
    ద్రోణుఁ జూచి వారు తూలిబడరె?
    పిలువుమనికిఁ కృష్ణ! పెదతండ్రి నేజూపు
    నర్జునునకు మిత్రుఁ డంగరాజు. :)

    రిప్లయితొలగించండి
  12. మందాకిని గారి పూరణరెండోపాదం కూడ చూడాలండీ ( సరిజోడు బదులు స్పర్ధ ?)
    -

    రిప్లయితొలగించండి
  13. దుర్యోధనుడు (స్వగతము)

    యుధ్ధ మందుఁ గూలె యోధుఁడు మన మొన
    నర్జునునకు మిత్రుఁ డంగ రాజు
    విజయ లక్ష్మి గూడ విజయుని నీనాడు
    కౌరవులకు నేమి గారవమ్ము !

    రిప్లయితొలగించండి
  14. "అపజయమ్ము తథ్య మా పాండవులకును
    అర్జునునకు ; మిత్రుడంగరాజు
    చెలరేగి పోవ, నాలములో" అని
    పల్కె, కురుపతి సభ వైపు జూచి.

    రిప్లయితొలగించండి
  15. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ
    అలరించు చున్నవి !


    తొడలు విరిగిన దుర్యోధనుడు మనస్సులో :

    01)
    _________________________________________

    విధి వశము చేత - విజయమ్ము వరియించె
    నర్జు నునకు ! మిత్రు - డంగ రాజు
    నన్ను వీడి పోయె - నాక మునకు
    నేను వచ్చు దనుక - నిలువ లేక !
    __________________________________________

    రిప్లయితొలగించండి
  16. చంద్రశేఖర్ గారూ,
    మంచి పూరణ. అభినందనలు.
    దుశ్శాసనుడు, దుస్ససేనుడు శబ్దాలు ఉన్నాయి కాని దుస్సహుడు ప్రయోగం లేదు.
    "దుస్సహుం జేర్చి" ను "దుస్ససేనుతో" అందాం. చివరి పాదంలో చతుషటయములో "య" పోయింది.

    రిప్లయితొలగించండి
  17. యుద్ధానికి ముందు దుర్యోధనుడు మనస్సులో :

    02)
    __________________________________________

    అనియె తప్ప దనుట - ననివార్య మైనచో
    యుద్ధ మునకు నెపుడు - సిద్ద మేను !
    నాదు భాగ్య వశము - నాకమ్మునే జూపు
    నర్జును నకు; మిత్రు డంగరాజు !
    ___________________________________________

    రిప్లయితొలగించండి
  18. జిగురు సత్యనారాయణ గారూ,
    అత్యుత్తమమైన పూరణ మీది. అభినందనలు.

    ఊకదంపుడు గారూ,
    ప్రశస్తమైన పూరణ. అభినందనలు.
    మందాకిని గారి పూరణలో మీ సూచనకు ధన్యవాదాలు.

    గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
    మంచి పూరణ. అభినందనలు.

    నాగరాజు రవీందర్ గారూ,
    చక్కని ఊహతో బాగా పూరించారు. అభినందనలు.
    మూడవ పాదంలో గణం, యతి తప్పాయి.
    చెలగి యుద్ధ మతడు చేయగల డనుచు" అంటే సరిపోయింది.

    రిప్లయితొలగించండి
  19. వసంత్ కిశోర్ గారూ,
    మీ రెండు పూరణలూ ప్రశస్తంగా ఉన్నాయి. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  20. శంకరార్యా!ధన్యవాదములు.సొగసైన సవరణ చేసారు.కృతజ్ఞతలు.

    గోలి హనుమచ్ఛాస్త్రి.

    రిప్లయితొలగించండి
  21. బాల క్రిష్ణ,కృష్ణ పరమాత్మ పాత్ర ,నా
    గార్జునునకు మిత్రుడంగరాజు
    పాత్ర ,భీమసేను పాత్ర శ్రీహరికి ,రా
    రాజు పాత్ర చిన్న రామ రావు!

    {పౌరాణిక సినిమా తీయాలనే కోరికతో ఒక నిర్మాత ఔత్సాహిక దర్శకునితో చర్చిస్తూమిగితా పాత్రల ఎంపికలో శ్రీ వసంత కోశోరుల వారిని సంప్రదించాలని నిర్ణయించు కొన్నట్లు సమాచారం)
    మిత్రులు వసంత కిశోరులకు క్షమాపణలతో

    రిప్లయితొలగించండి
  22. vookadampudu గారికి, గురువుగారికి నెనరులు.
    ఊకదంపుడు గారు, మీరు ఒకరేనాండీ!

    రిప్లయితొలగించండి
  23. పీతాంబరధరా !
    ఈ చిన్న రామ రావులూ
    బాలక్రిష్ణలూ
    నాగార్జునులూ
    ----------------
    అబ్బే !నా వల్ల కాదు !
    మనకి అన్నగారైతేనే ఆవేశం వస్తుంది !

    అదేదో మీరే తీస్కోండి !
    ఆ !మర్చి పోయాను !
    శాస్త్రి గారు ప్రస్తుతం ఆ పనిలోనే ఉన్నారు !
    అప్పుడే ఒక పాట పూర్తి జేసారు కూడా !
    (ద్రౌపదికీ కర్ణుడికీ యుగళ గీతమట )
    ఆయన్ని సంప్రదించండి !

    రిప్లయితొలగించండి
  24. పీతాంబర్ గారూ!పాత్రోచిత పురాణ పూరణ ప్రశస్తముగానున్నది.నటులను త్వరగా బుక్ చేసుకోండి.కిశోర్ జీ!మా సినిమా విడుదలకు సిద్ధముగానున్నది.ఇక ఎవరికీ అవకాశము లేదని మనవి.

    గోలి హనుమచ్ఛాస్త్రి.

    రిప్లయితొలగించండి
  25. మందాకిని గారు, ఔనండీ
    google లో login అయ్యి రాస్తే ఆంగ్లం లో కనిపిస్తుందండి అప్పుడప్పుడు పేరు/URL వాడుకొని అని రాస్తాను బద్దకం తో కానీ చాలామటుకు ఆయ్యే రాస్తున్నాను

    రిప్లయితొలగించండి
  26. ఆ : వాహ నంబును వడివడిగా నమర్చి నే
    లోహ పక్షి పెట్టె లోన పెట్ట
    ధన్యవాదములను దెలుపుతూ వెడలెను
    అర్జునునకు మిత్రుఁ డంగరాజు. !

    రిప్లయితొలగించండి
  27. వరప్రసాదు గారూ !
    మీ భావ మేమిటో
    అవగత మవకున్నది !
    వివరించ గలరా !

    రిప్లయితొలగించండి
  28. చాల సంతోషం గురువు గారు
    అర్జునునకు = అర్జున సింగ్ మిత్రుఁ డంగరాజు = యునియన్ కార్బైడ్ అధినేత (భోపాల్ దుర్ఘటన సమయంలో జరిగినది ) .
    ఆ రోజు సిస్టం సరిగా పని చేయలేదు .

    రిప్లయితొలగించండి