16, మార్చి 2011, బుధవారం

సమస్యా పూరణం - 257 (నెలవంకన్ జూచి)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ......
నెలవంకన్ జూచి నవ్వ నేరము సుమ్మీ.

30 కామెంట్‌లు:

  1. గోలి హనుమచ్ఛాస్త్రి.

    విలువగు ప్రేమకు అర్థము
    తెలియకనే ఒళ్ళు బలిసి తెలుపుచు గొప్పల్
    వలపుల పేరున నిటు క
    న్నెల వంకన్ జూచి నవ్వ నేరము సుమ్మీ.

    రిప్లయితొలగించండి
  2. అందరికీ వందనములు !
    మిత్రుల పూరణలు
    ముచ్చటగా నున్నవి !

    01)
    _____________________________________

    విలువైనది సతిపతు లకు
    కలనైనను శీల మన్న - కలిసుండుటకే !
    వల విసురు విలాసిని యగు
    నెల వంకన్ జూసి నవ్వ - నేరము సుమ్మీ !
    _____________________________________

    రిప్లయితొలగించండి
  3. 02)
    ______________________________________

    వలపులు జిమ్ముచు; కృతకపు
    కులుకులు రువ్వుచు; కను - కొలకుల జూపే
    వెలయాలిగ , నట మెలిగే
    నెల వంకన్ జూసి నవ్వ - నేరము సుమ్మీ !
    _______________________________________

    రిప్లయితొలగించండి
  4. 03)
    _______________________________________

    మిలమిల వలపుల జూపుల
    కలవర పరచే నెలతల - కలలో నైనన్
    పలికిన మిగులును విలవిల !
    నెల వంకన్ జూసి నవ్వ - నేరము సుమ్మీ !
    _______________________________________

    రిప్లయితొలగించండి
  5. 04)
    ________________________________________

    విలువైన జీవితము కడు
    విలయములకు నెలవు జేయు - వేశ్యా మణులే !
    వలపుల కలవర పరచే
    నెల వంకన్ జూసి నవ్వ - నేరము సుమ్మీ !
    ________________________________________

    రిప్లయితొలగించండి
  6. 05)
    ________________________________________
    వలువలు విలువలు వదలిన
    వెలదుల కృతకపు పలుకుల - వింటే; తంటే !
    తలపుల నైనను తలచకు !
    నెల వంకన్ జూసి నవ్వ - నేరము సుమ్మీ !
    ________________________________________

    రిప్లయితొలగించండి
  7. తలవంపులు దెచ్చు పనుల,
    కలహంసలు మెచ్చనట్టి కఱకఱి చేష్టల్
    వలదన్నజేసి ,చవితిన
    నెలవంకన్ జూసి నవ్వ ,నేరము సుమ్మీ!

    రిప్లయితొలగించండి
  8. జలకా లాడుచు,బీచిన
    మలయపు తెమ్మెరలు వీచ ,మధురోహలతో
    మొలపోగులేని ,పలు క
    న్నెల వంకన్ జూసి నవ్వ నేరము సుమ్మీ!

    రిప్లయితొలగించండి
  9. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    "ప్రేమ పేరుతో కన్నెల వంక చూడడం నేర" మన్నారు. బాగుంది మీ పూరణ. అభినందనలు.

    వసంత్ కిశోర్ గారూ,
    మీ ఐదు పద్యాలు బాగున్నాయి. అయితే అన్ని చోట్లా మీరు నెలవంకకు ఏ అర్థాన్ని గ్రహించారు?
    మొదటి పూరణలో "కలిసి + ఉండుటకే" అన్నప్పుడు సంధి జరుగక యడాగమం వస్తుంది. "కలిసి మనుటకే" అందాం.
    రెండవ పూరణ రెండవ పాదంలో రెండు మాత్రలు లోపించాయి. "కులుకులు (వడి) రువ్వుచు; కను - కొలకుల జూపే" అంటే సరి.

    మంద పీతాంబర్ గారు,
    మీ రెండు పూరణలు బాగున్నాయి.
    ముఖ్యంగా రెండవది చమత్కారంతో శోభిస్తున్నది. అభినందనలు.
    అన్నట్టు ... మీరెప్పుడైనా గోవా బీచ్ లకు వెళ్ళారా? బ్యాంకర్లు కదా! కాంఫరెన్సుల పేర వెళ్ళే ఉంటారు. అప్పటి మలయపు తెమ్మెరలు తాకిన మధురోహల నుండి ఇంకా బయట పడ్డట్టు లేదు.... :-)

    రిప్లయితొలగించండి
  10. శంకరార్యా !
    ఇక్కడ సరాసరి అర్థం గ్రహించకుండా
    పై మూడు పాదాల్లో ప్రస్తా వించిన

    నెలతల నే నెలవంకలుగా

    భావించడం జరిగింది !

    కూడదందురా ?

    రిప్లయితొలగించండి
  11. వసంత్ కిశోర్ గారూ,
    "నిరంకుశాః కవయః" అన్నారు కదా! మీరేదంటే అదే :-)

    రిప్లయితొలగించండి
  12. గోవా సంగతేమో గానీ, పీతాంబర్ గారు చెప్పింది ఇక్కడ మాత్రం అక్షర సత్యం. వాళ్ళని చూస్తే ఇంకా చూడాలని పిస్తుంది, నవ్వాలని పిస్తుంది కానీ అదే పనిగా చూడకూడదు, అస్సలు నవ్వకూడదు. ఏమిటో ఈ మాయా...పాత పాట గుర్తుకొంచ్చింది.

    రిప్లయితొలగించండి
  13. వలపుల వల విసరుతు
    కిల కిల నవ్వులు రువ్వగ కలవర పడినే !
    సల సల మరిగెడి నామది వ [ క ]
    న్నేల వంకన్ జూచి నవ్వ నేరము సుమ్మీ !

    రిప్లయితొలగించండి
  14. ప్చ్ ! ఏమిటో ? నిన్నటి నుంచీ తమ్ముళ్ళందరు ఏదో మత్తులో చెప్పీ చెప్పక అటు ఇటు బీచిలకీ ఆశ్రమాలకీ వెళ్ళి పోతుంటే మరిక పూరణలు రాయడం సమస్యే ? అసలే రేపు హోలీ ? ? / ? / ?

    రిప్లయితొలగించండి
  15. గురువు గారు ధన్యవాదాలు .అదేమోకాని నేను పాల్గొన్న ఏ కాన్ఫరెన్సు బీచున్న ప్రాంతంలో జరుగలేదు.నెలను కన్నెలుగా జేసిన శాస్త్రి గారి పూరణే ఈ పూరణకు ప్రేరణ.

    రిప్లయితొలగించండి
  16. చంద్రశేఖరా,
    "ఇక్కడ" అంటే నాకు, కవిమిత్రులకు తెలుసు ... మీరు అమెరికాలో ఉంటారని. కాని బ్లాగును చూసే అందరికీ ఎలా తెలుస్తుంది?

    రాజేశ్వరి అక్కయ్యా,
    తమ్ముళ్ళు ఎక్కడెక్కడ తిరిగినా లక్షణంగానే వ్రాస్తున్నారు. మరి మీ రేంటి...? మూడు పాదాల్లోను గణదోషాలు. సరె.. నాకు తప్పుతుందా? నా సవరణలతో మీ పద్యం...
    వలపుల వల (వెస) విసరు(చు)
    కిల కిల నవ్వు(లను రువ్వ క్రీగంట గనన్
    సల సల మరిగెడి మది వ [ క ]
    (న్నె)ల వంకన్ జూచి నవ్వ నేరము సుమ్మీ !

    పీతంబర్ గారూ,
    "నేరం నాది కాదు, శాస్త్రి గారిది" అంటారు. సరే!

    రిప్లయితొలగించండి
  17. ఇల లోన పలు మతములు, ము
    సలమానులకు పవిత్రము చలువల రేడౌ
    వెలయగ రంజాను తిథిన
    నెలవంకన్ జూచి నవ్వ నేరము సుమ్మీ!!


    చలువల రేడు = చంద్రుడు

    రిప్లయితొలగించండి
  18. తెలిపెను పింగళి జాతికి
    వెలుగుల జండా, యెదురుగ వేదిక మీదన్
    విలసిల్లంగన్, మువ్వ
    న్నెల వంకన్ జూచి నవ్వ నేరము సుమ్మీ!!

    రిప్లయితొలగించండి
  19. అవును కదా ! తమ్ముళ్ళ వేటలో పడి అన్ని తప్పులు తడకలు .
    అయినా ! ఓర్పుగా , నేర్పుగా సరి చేయగల సోదరు లుండగా అసలు శ్రమ పడి రైటుగా ఎందుకు రాయడం ?

    రిప్లయితొలగించండి
  20. పలుమాఱు మింటఁ జంద్రుఁడు
    కొలమానము కొలది పెరుగు కొఱతలు బొందున్
    ఇల గూడ లేమి,కలిమియు
    నెల వంకన్ జూచి నవ్వ నేరము సుమ్మీ !

    రిప్లయితొలగించండి
  21. అలనా డతడే కవిగా,
    కలహంసగ కీర్తిబొందె, కలదే యాకీ
    ర్తిలనిప్పుడికన్? "సిరివె
    న్నెల" వంకన్ జూచి నవ్వ నేరము సుమ్మీ!!
    మనవి: ఈ పద్యంలో అన్నీ "స" గణాలే వాడాను, ప్రయోగాత్మకంగా. మరి సిరివెన్నెల గారి కీర్తి తగ్గిందనిపించిది. కొత్త రచయితలూ కొత్త పోకడలు సినిమా పాటలలో చోటు చేసుకొంటున్నాయి కదా.

    రిప్లయితొలగించండి
  22. జిగురు సత్యనారాయణ గారూ,
    మీ రెండు పూరణలు బాగున్నాయి. ముఖ్యంగా రెండవది నాకు బాగా నచ్చింది. అభినందనలు.
    మొదటి పద్యం రెండవ పాదంలో "విత్రము" అని భగణం పడింది. అక్కడ జగణం కాని నలం కాని ఉండాలి కదా!
    "సలమానుల ధ్వజముపైన చలువల రేడౌ" అంటే ఎలా ఉంటుంది?

    గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
    కలిమి లేముల్ని చంద్రకళలతో పోల్చిన మీ పూరణ బాగుంది. అభినందనలు.

    చంద్రశేఖర్ గారూ,
    మంచి విషయాన్ని ఎత్తుకొని పూరణ చేసారు. అభినందనలు.
    అన్నీ సగణా లన్నారు. ద్వితీయ పాదాంతంలో "యాకీ" అని గగం వచ్చింది. "శుభ కీ" అన్నా "సిత ఈ" అన్నా మీ మాటను నెగ్గించుకోవచ్చు. ఏ మంటారు?
    ఇక "కీర్తి + ఇల" సంధి చేసారు కాని అక్కడ యడాగమం వస్తుంది.

    రిప్లయితొలగించండి
  23. నా పూరణ .......

    నెలఁత ముఖ మందు మిక్కుట
    ములుగా దద్దురులు; సానుభూతిని దెలుపన్
    వలెఁ గాని వికృత మగు నా
    నెల వంకన్ జూచి నవ్వ నేరము సుమ్మీ.
    [ఆనెలు = దద్దు(రు)లు]

    రిప్లయితొలగించండి
  24. శంకరార్యా! ధన్యవాదములు.కన్నెల వంక వెళ్ళకుండా ఆనెల వంక వెళ్ళి పూరించారు.విలక్షణముగా ఉన్నది.కవి మిత్రు లందరూ తలో వంకా వెళ్ళీ ఏ వంకా లేకుండా చక్కని పూరణ చేశారు.పీతాంబర్ గారు బీచ్ ని కళ్ళకు కట్టినట్లు చూపించారు.కిశొర్ గారి పంచ వన్నెల పద్యాలు బాగున్నవి.సత్యనారాయణా గారి మువ్వన్నెలు భెష్.మూర్తి గారి వేదాంతం అదుర్స్.చంద్ర శేఖర్ గారి సిరి వెన్నెల స్మరణ వహ్వా.రాజేశ్వరి గారి ప్రయత్నం సంతోష దాయకం.వెరసి అందరికీ అభినందనలు.

    గోలి హనుమచ్ఛాస్త్రి.

    రిప్లయితొలగించండి
  25. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    సహృదయంతో అందరి పూరణలను విశ్లేషించినందుకు ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  26. సవరణకి ధన్యవాదాలు. యడాగమం పట్టు కొంటారని ఊహించాను. మాష్టారు కొంచెం మోడరేషను మార్కులు ఇవ్వండీ!

    రిప్లయితొలగించండి
  27. అలిగిన ప్రేయసి రూపము
    కలలోనైనను నొకపరి కనలేననుచున్
    కలతలలో పున్నమి వె
    న్నెలవంకన్ జూచి నవ్వ నేరము సుమ్మీ

    రిప్లయితొలగించండి
  28. ప్రభాకర శాస్త్రి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  29. అల భాద్రపదపు చవితిని
    సలుపక గణపతికి పూజ సంకటి ముద్దల్
    కిలకిల నవ్వుచు తినుచును
    నెలవంకన్ జూచి నవ్వ నేరము సుమ్మీ!

    రిప్లయితొలగించండి