25, మార్చి 2011, శుక్రవారం

సమస్యా పూరణం - 266 (భల్లూకము చదువుకొనఁగ)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ........
భల్లూకము చదువుకొనఁగ బడిలోఁ జేరెన్.

19 కామెంట్‌లు:

  1. చల్లా,అల్లం వారలు
    పిల్లల్నే ముద్దుపేర్ల పిలుతురు,వారే
    లల్లీ,పప్పీ,బంటీ,
    భల్లూకము, చదువుకొనగ బడిలో జేరెన్.

    రిప్లయితొలగించండి
  2. చెల్లించిరి పలు బిల్లులు
    పిల్లల తరగతి గదులకు ,పేరుకు ,గనియెన్
    బల్లలు తలుపులు లేవని
    భల్లూకము చదువు కొనగ బడిలో చేరెన్!

    రిప్లయితొలగించండి
  3. అందరికీ వందనములు !
    శాస్త్రిగారూ !
    మీ లల్లీ పప్పీ ---లు బాగున్నారు !
    01)
    ______________________________________

    ఉల్లము రంజిల జనులకు
    ఝల్లన ; నూరూర దిరుగు - సర్కస్ నందే
    మెల్లగ జేర్చిన , నూతన
    భల్లూకము ,చదువు కొనగ - బడిలో చేరెన్ !
    ______________________________________

    చదువు కొను = నేర్చు కొను( సైకిలు తొక్కడం తదితరాలు )

    రిప్లయితొలగించండి
  4. తల్లీ..చదువులు వద్దని
    గల్లీ లోయాట లాడ గణపతి గోరెన్
    మెల్లిగ మాటలు జెప్పగ
    భల్లూకము చదువుకొనఁగ బడిలోఁ జేరెన్.
    (గమనిక: గణపతి నవల అందరూ చదివే ఉంటారు. గణపతి
    బడిలో జేరడానికి వస్తుంటే అందరూ దూరం నుంచి చూసి వచ్చేది
    భల్లూకమని కొందరూ..కొండముచ్చని కొందరూ అనుకుంటారు. అదే
    చమత్కరంగా పూరించాను. అలరిస్తుందని అశిస్తూ...)

    రిప్లయితొలగించండి
  5. తల్లేఁగోపము నడిగెన్
    పిల్లాడిని, "బడికిఁ నిన్నుఁబిల్వఁగ వలెనా?"
    "తల్లీ! నేనిక బోనటు"
    భల్లూకము చదువుకొనఁగ బడిలోఁ జేరెన్.

    రిప్లయితొలగించండి
  6. అన్ని పూరణలూ వైవిధ్యతతొ ఉన్నాయి.
    బడికి పోకుండా ఉండటానికి రోజుకో అబద్ధం చెప్పే పిల్లాడు ఈవేళ ఈ అబద్ధం చెప్పాడని నేను పూరణ చేశాను.

    రిప్లయితొలగించండి
  7. కిశొర్ గారూ ధన్యవాదములు.
    భల్లూకాన్ని మీరు సర్కస్ బడికి పంపారు
    పీతాంబర్ గారు తలుపులు లేని బడికి పంపారు.
    వూకదంపుడుగారు నాటకీయంగా పంపారు.
    మందాకిని గారు అ(ల్లరి)బద్ధంగా పంపారు.

    భల్లూకాన్ని తలో రకంగా
    బడికి పంపించిన మిత్రులందరికీ అభినందనలు.

    రిప్లయితొలగించండి
  8. తల్లీ! కోపముఁబొందకు
    పిల్లాడిని; బడికి నన్నుఁబిలువఁగఁబోకే,
    అల్లాడెద,భీతిలి,యొక
    భల్లూకము చదువుకొనఁగ బడిలోఁ జేరెన్.

    రిప్లయితొలగించండి
  9. ఉల్లూకము లన్ని గలసి
    కల్లోలిత భాష నేర్వ కలవర బడుతున్ !
    చెల్లా చెదరుగ దిరుగుచు
    భల్లూకము చదువు కొనగ బడిలో జేరెన్

    రిప్లయితొలగించండి
  10. చల్లని సాయంకాలము
    భల్లూకమొకటి దిరుగుచు బడిలో దూరెన్ !
    గొల్లుమని పురజనులనిరి
    “భల్లూకము చదువుకొనగ బడిలో జేరెన్ !”

    [ ఓ మారుమూల పల్లెలో ఒక చల్లని సాయంత్రం ఎలుగుబంటు ఒకటి అలా షికారు చేస్తూ బడి ప్రాంగణంలో ప్రవేశించింది. అది చూచి గ్రామస్తులు మొదట గొల్లున అరచి తరువాత తమలో తాము హాస్యంగా ఇలా అనుకొంటున్నారు. " భల్లూకము చదువుకొనగ బడిలో చేరెన్ ! " ]

    రిప్లయితొలగించండి
  11. బుల్లన యెద్దగు, బేరన
    భల్లూకము, చదువుకొనఁగ బడిలోఁ జేరెన్
    పిల్లడొకడు, షేర్లను కొని
    ఘొల్లుమనెను వాటి ధరలు కుప్పగ కూలన్!!

    రిప్లయితొలగించండి
  12. సమస్యలోని "ల్ల" కార ప్రాస చూసేసరికి పోతన గారి శ్రీమదాంధ్ర భాగవతంలోని గజేంద్ర మోక్షం ఘట్టం మొదట్లో గజరాజు నడయాడే అరణ్య వర్ణన చేస్తూ మన తెలుగుల పుణ్య పేటి అందించిన ఒక పద్యం గుర్తుకొచ్చింది.

    భిల్లీ భిల్ల లులాయక
    భల్లుక ఫణి ఖడ్గ గవయ వలిముఖ చమరీ
    ఝిల్లీ హరి శరభక కిటి
    మల్లాద్భుత కాక ఘాకమయ మగునడవిన్.

    సవినయ మనవి: ఇది గుర్తుకు రాగానే ఆ పద విన్యాసం చూశాక గణాలు కిట్టించి పద్య వ్రాయ బుద్ధి కాలేదు.

    రిప్లయితొలగించండి
  13. [Admission రోజు చిన్నపిల్లాడు]

    కల్లలు జెప్పనెరింగిన
    పుల్లసరోజాక్షి "కొనుము బొమ్మని"పిలువన్
    పిల్లాడువెళ్లి-తోడవ
    భల్లూకము, చదువుకొనఁగ బడిలోఁ జేరెన్

    [ఆ బొమ్మ "Teddy BEAR" అని మీరందరూ ఉచితంగా ఊహించుకోవాలి ]
    ------------------------------------------

    లల్లూశ్రీరాజ్యంలో
    పిల్లల బోనాలపేర్న బిల్లులు* చూస్తే -
    పిల్లులు, కుక్కలు, నక్కలు,
    భల్లూకము, చదువుకొనఁగ బడిలోఁ జేరెన్

    [మధ్యాహ్నభోజనం Bills]

    రిప్లయితొలగించండి
  14. ఈ పూరణ కూడా చంద్రశేఖర్ గారు నరసింహమూర్తిగారి ఖాతా లోనే వేస్తారని గట్టి నమ్మకంతో :) :)

    ఫుల్లో ఆఫో, నిద్రన్
    కల్లోల పడనని కొడ్తి గానీ, కల్లో*
    నల్లాడితినొజ్జగనేన్ -
    భల్లూకము చదువుకొనఁగ బడిలోఁ జేరెన్

    [కల్లో = కలలో]

    రిప్లయితొలగించండి
  15. మిత్రు లందరికీ వందనాలు. నిన్న రాక రాక మా అమ్మాయి, మనుమడు ఇంటికి వచ్చారు. సాయంత్రం త్యాగరాయ గాన సభలో రామశర్మ గారి అష్టావధానానికి వెళ్ళాను. అందువల్ల నిన్న మీ పూరణలను చూసే సమయం చిక్కలేదు.

    హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ ముద్దు పేర్ల పూరణ బాగుంది. అభినందనలు.

    పీతాంబర్ గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.

    వసంత్ కిశోర్ గారూ,
    మీ సర్కస్ బడి బాగుంది. అభినందనలు.

    వెంకటప్పయ్య గారూ,
    గణపతిని భల్లూకంగా మార్చిన మీ పూరణ బాగుంది. అభినందనలు.

    మందాకిని గారూ,
    ఉత్తమంగా ఉంది మీ పూరణ. అభినందనలు.

    రాజేశ్వరి గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.

    రవీందర్ గారూ,
    చాలా బాగుంది మీ పూరణ. అభినందనలు.

    సత్యనారాయణ గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.

    ఊకదంపుడు గారూ,
    మీ టెడ్డీబేర్ పూరణ, మధ్యాహ్న భోజన పథకం బిల్లుల పూరణ, భల్లూకానికి మీరే ఒజ్జ అయిన పూరణ బాగున్నాయి. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  16. పిల్లడు ఖగోళ శాస్త్రము
    నొల్లుచు మేషము, వృషభము, నొకపరి కన్యా,
    చెల్లగ మీనము, సింహము,
    భల్లూకము, చదువుకొనఁగ బడిలోఁ జేరెన్

    భల్లూకము = ursa major (big bear...సప్తర్షి మండలము)

    రిప్లయితొలగించండి
  17. నెల్లూరున వరగలిలో
    కల్లును తీయు పరిపాటి కమ్మగ నేర్వన్
    పిల్లల నాటకు పంపుచు
    భల్లూకము చదువుకొనఁగ బడిలోఁ జేరెన్

    రిప్లయితొలగించండి