26, మార్చి 2011, శనివారం

సమస్యా పూరణం - 267 (ఆంజనేయున కొప్పెను)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ........
ఆంజనేయున కొప్పెను హస్తిముఖము

25 కామెంట్‌లు:

  1. పంచ ముఖముల హనుమంతు పటము వేయ;
    హయము,పందియు,నరసిమ్హ, హస్తి ముఖము
    గరుడ ముఖముకు బదులుగ గణప తొచ్చె.
    ఆంజనేయున కొప్పెను హస్తిముఖము
    (ఆంజనేయ స్వామి, తూర్పునకు అభిముఖుడై, బాధలు కష్టాలనుండి రక్షించేవాడు
    గరుడు, పడమటి దిక్కు వైపు ఆసీనుడై, ఆయుర్దాయ కాలాన్ని పెంపొందించేవాడు
    వరాహ, ఉత్తరాభిముఖుడు, మంచి జీవితాన్ని ప్రసాదించువాడు
    నరసింహ, దక్షిణాభిముఖుడు, దుష్ప్రభావాల నుండి రక్షిస్తాడు.
    హయగ్రీవుడు, నాలుగు ముఖాలకు పైన ఆసీనుడై ఉంటాడు. భక్తి, ఙ్ఞాన వృద్ధికి కారకుడు - చిత్రకారుడు తొందరపాటుగా గరుడుని బదులుగా హస్తి ముఖము వేసినా ఎంతో బాగా ఉంది అని అర్ధము)

    రిప్లయితొలగించండి
  2. సిద్ధి నాథుని ప్రతిమలు చేయువారు
    క్రొత్త క్ర్తొత్తగ చేసిరి కోరి కోరి
    సాయి,రాముడు,కృష్ణుడు,శంకర, మరి
    ఆంజనేయున కొప్పెను హస్తి ముఖము.

    రిప్లయితొలగించండి
  3. వీధి నాటకం బాడను వెదికి తెచ్చె
    గజ తురగ సింహ గరుడ ముఖంబు లెన్నొ
    విఘ్నపతి వేషధారియౌ వీగెడి నటు
    డా౦జనేయున కొప్పెను హస్తిముఖము!

    వీగెడి=ఉత్సాహపడెడి అనే అర్థంలో

    రిప్లయితొలగించండి
  4. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ
    అలరించు చున్నవి !

    01)
    ___________________________________

    పాత్ర పోషణ జేసెడి - "పవన సుతుడు" (కుమార్)
    చవితి యుత్సవ మందున - జనుల ముందు
    పుష్టి కాంతుడై నర్తించె - పొలుపు మీర !
    ఆంజనేయుని కొప్పెను - హస్తి ముఖము !
    ___________________________________

    రిప్లయితొలగించండి
  5. అంజనసుతుఁడు మరి యంబికసుతుఁచిత్త
    రువులఁ గీయద లచిరొ కరు ఆంగ్ల
    చిత్రకారుల కట! మరి చి రిగామోసు!
    ఆంజనేయున కొప్పెను హస్తిముఖము

    రిప్లయితొలగించండి
  6. శాస్త్రిగారూ !
    మీ భావం వివరించ గలరా !
    కొంచెం అసందిగ్దంగా ఉన్నట్టుంది !

    రిప్లయితొలగించండి
  7. పాండు గన్పడె శ్రీ కంఠు పాత్రయందు,
    గిరిజ వేషమ్ము నందున మెరిసె వనజ,
    పొట్ట గుట్టగా బెంచిన,పొట్టిగుండు
    ఆంజనేయున కొప్పెను హస్తి ముఖము !

    ( స్కూల్ డే సందర్భంగా విద్యార్థులు పలు పౌరాణిక పాత్రలు ధరించగా వారిలో కొందరు పై విధంగా కన్పించారని ఊహ!)

    రిప్లయితొలగించండి
  8. కవి మిత్రుల అందరి పూరణలూ బాగున్నవి.అభినందనలు.
    కీశోర్ గారూ!
    వినాయక చవితికి పట్టణాలలో పెద్ద పెద్ద ప్రతిమలు చేసేవారు రకరకాలుగా చేస్తుంటారు.వేషము మొత్తము మార్చి వేసి ముఖము మాత్రం వినాయకునిది పెడతారు.సాయి,నటరాజు,కోదండధర రాముడు,కాళీయ మర్దనం చేస్తున్న కృష్ణుడు,రామ లక్ష్మణులను భుజాన దాల్చిన హనుమంతుడు, బాటింగ్ చేస్తున్న క్రికెట్ గణపతి ఇలా ఎన్నో...అదీ నాఫూరణకు ప్రేరణ.

    రిప్లయితొలగించండి
  9. అసందిగ్దత వీడినది !
    శాస్త్రిగారూ !
    ఓపికగా వివరించినందులకు
    ధన్యవాదములు !

    రిప్లయితొలగించండి
  10. వెంకటప్పయ్య గారూ,
    చిత్రకారుని పొరపాటుగా మీ పూరణ బాగుంది. అభినందనలు.

    హనుమచ్ఛాస్త్రి గారూ,
    ఇప్పుడో వినాయక నవరాతుల్లో నేను చుసాను .... రామలక్ష్మణులను భుజాలపై ఎక్కించుకున్న గణేశుని విగ్రహాన్ని. మీ పూరణ సమర్థనీయమే. అభినందనలు.

    చంద్రశేఖర్ గారూ,
    మీరు వీథినాటకాన్ని ఆశ్రయించారు. బాగుంది. అభినందనలు.

    వసంత్ కిశోర్ గారూ,
    మీ పవన్ కుమార్ పూరణ బాగుంది. అభినందనలు.

    మందాకిని గారూ,
    భావం మంచిదే. కాని ఈరోజు ఏమిటి? గణాలూ, యతులూ గడబిడ చేస్తున్నాయి. నా సవరణ ....
    అంజనీకుమారుఁడు మఱి యాంబికేయు
    చిత్రములఁ వ్రాసె నాంగ్లేయ చిత్రకారుఁ
    డొకఁడు రూపములందున తికమక పడె
    ఆంజనేయున కొప్పెను హస్తిముఖము

    పీతాంబర్ గారు,
    విద్యార్థుల వేషధారణతో మీ పూరణ బాగుంది. అభినందనలు.

    వసంత్ కిశోర్ గారూ,
    తీరాల్సించి సందిగ్ధతా? అసందిగ్ధతా?

    రిప్లయితొలగించండి
  11. కోర్కె తీర్చు ఘనులు కాగ, కోతి ముఖమె
    ఆంజనేయున కొప్పెను, హస్తిముఖము
    శివుని తనయునకొప్పెను, సింహ ముఖము
    స్వర్ణ కశ్యప హంతకు సరిగ నమరె!!

    రిప్లయితొలగించండి
  12. అంజనసుతుఁడు మరి యంబికసుతుఁచిత్త
    రువుల గీయద లచిరొక రంగ్ల దేశ
    చిత్ర కారుల కట!వింత చిత్ర మేను!
    ఆంజనేయున కొప్పెను హస్తిముఖము

    గురువుగారు,
    పొరఁబాటు జరిగింది. ఇప్పుడు సరిపోయిందా?

    రిప్లయితొలగించండి
  13. వేడుకన్ బొమ్మలకొలువుఁవెట్టనెంచి
    ప్రతిమలన్ గడుగుచునుండఁబగిలెఁ గొన్ని;
    బాధవడుచు లక్కనతికె బాల, యంత
    ఆంజనేయున కొప్పెను హస్తి ముఖము

    రిప్లయితొలగించండి
  14. మందాకిని గారూ,
    రెండో పద్యం లో రెండో పాదం లో యతి చెల్లలేదనుకుంటానండీ.
    చిత్రాన్ని గీసే కన్నా వ్రాస్తేనో రచన చేస్తేనో బావుంటుంది, ఐతే 4వ పాదం అభాస కాబట్టి మీ ఆంగ్ల చిత్రకారుడు గీసేయటం కూడ సబబే అనుకుంటాను.

    రిప్లయితొలగించండి
  15. సృష్టి చేసెడి బ్రహ్మకు దృష్టి లేక
    వింత వింతైన ప్రాణుల వెలుగు జూపి
    కూడి నొకదాని కింకొటి ముడిని వేసి
    ఆంజ నేయుని కొప్పెను హస్తి ముఖము .

    రిప్లయితొలగించండి
  16. అందరి పూరణలూ
    అలరించు చున్నవి !

    శాస్త్రిగారూ !
    సందిగ్దతే తొలగినది !

    శంకరార్యా !
    ధన్యవాదములు !
    ముందు సందిగ్దత అనే వ్రాసి
    ప్రకటించే ముందు "అ" తగిలించాను
    అనాలోచితంగా !
    అన్య మనస్కుడనై గందరగోళ పడ్డాను !

    రిప్లయితొలగించండి
  17. వూకదంపుడు గారు, ధన్యవాదాలండి.
    రెండో పాదం ఇలా ఉండవచ్చా, చూడండి.

    రువురచింపదలచిరట రోము దేశ

    రిప్లయితొలగించండి
  18. మిత్రుల పూరణలు చాలా బాగున్నాయి.


    చవితి నాడును పూజలు శ్రద్ధ నిడగ
    బొజ్జ గణపతి రూపము బొమ్మ లేమి
    తొండ మొక్కటి, చేర్చగ ,తుందిలమ్ము
    ఆంజనేయున కొప్పెను హస్తి ముఖము

    రిప్లయితొలగించండి
  19. అందమైనట్టి కపి ముఖ మమరె నదియె
    ఆంజనేయున, కొప్పెను హస్తి ముఖము
    గణపతికిని సుందరముగ, కనగ నొక్క-
    రాదిజుడు భావి, మరియొక్క రాది వేల్పు!

    రిప్లయితొలగించండి
  20. సత్యనారాయణ గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.

    మందాకిని గారూ,
    రెండవ పాదం సవరించినా మొదటి పాదంలో యతి తప్పింది.

    ఊకదంపుడు గారూ,
    ప్రశస్తంగా ఉంది మీ పూరణ. అభినందనలు.

    రాజేశ్వరి గారూ,
    మంచి పూరణ. అభినందనలు.
    "దృష్టి లేక" అంటే గ్రుడ్డివాడనే అపార్థం వస్తున్నది. "దృష్టి చెదరి" అంటే సరి. మూడవ పాదంలో యతి తప్పింది. ప్రాసయతి వేసినప్పుడు ప్రాసాక్షరానికి ముందు గురులఘువులలో ఏది ఉంటే మిగిలిన చోట్లా అదే ఉండాలి కదా.

    నరసింహ మూర్తి గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.
    ఇంతకీ "తుందిలము" ఏ అర్థంలో ప్రయోగించారు. దానికి "గొప్పది, అధికము" అనే అర్థా లున్నాయి.

    మిస్సన్న గారూ,
    పూరణ బాగుంది. అభినందనలు.
    ఆదిజుడు, ఆదివేల్పు .... ?

    రిప్లయితొలగించండి
  21. గురువుగారూ
    సందేహం తోనే ఆదివేల్పు అంటే తొలి పూజ
    లందుకొనే వేల్పు అని వాడేను.
    సరియో కాదో మీరే చెప్పాలి

    రిప్లయితొలగించండి
  22. గురువుగారూ,
    ధన్యవాదాలండి.
    [మీకు 23వ తేదిన ఒక వేగు రాసాను. మీ కొచ్చే అనేకానేక లేఖలలో జారిపోయిందేమో అన్న అనుమానంతో ఇక్కడ చెబుతున్నానండి]

    రిప్లయితొలగించండి