4, మే 2011, బుధవారం

సమస్యా పూరణం - 328 (గర్భమందు బిడ్డ)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ........
గర్భమందు బిడ్డ గంతు లిడెను.
ఈ సమస్యను సూచించిన కవిమిత్రునికి ధన్యవాదాలు.
నిజానికి మిత్రుడు పంపిన సమస్య క్రింది కందపద్య పాదం.

గర్భంబున నున్న బిడ్డ గంతులు వేసెన్.
కాని "ర్భ" ప్రాస మిత్రులకు దుష్కర మౌతుందని భావించి దానిని ఆటవెలది పాదంగా మార్చి ఇచ్చాను.
ఉత్సాహం ఉన్నవారు పై కందపద్య పాదాన్ని స్వీకరించి పూరించవచ్చు.

47 కామెంట్‌లు:

 1. అందరికీ వందనములు !

  01)
  ________________________________

  పద్మ వ్యూహ మంత - పార్థుండు జెప్పగా
  భద్ర మధ్య లోన - నిద్ర పోయె !
  బాగు గాను విన్న - బాలకు డభిమన్యు
  గర్భమందు బిడ్డ - గంతు లిడెను !
  ________________________________
  భద్ర = సుభద్ర

  రిప్లయితొలగించండి
 2. లీలావతి గర్భంలో ప్రహ్లాదుడు:

  02)
  ________________________________

  నార దుండు జెప్ప - నయముగా వినినాడు
  తల్లి గర్భమందు - పిల్ల వాడు !
  మంత్ర మందు మిగుల - మరులు గొనినవాడు
  గర్భమందు బిడ్డ - గంతు లిడెను !
  ________________________________

  రిప్లయితొలగించండి
 3. కడుపులో బిడ్డ కదులు తున్నాడని
  చెప్పిన భార్యతో భర్త :

  03)
  ________________________________

  అతివ గర్భము గని - అత్యంత ప్రేమగా
  చెప్పె నిట్లు సతికి - చెవిని జేర్చి
  "పాప కాదు వీడు - బాబేను; వింటిని
  గర్భమందు బిడ్డ - గంతు లిడెను "!
  ________________________________

  రిప్లయితొలగించండి
 4. ఒక గర్భిణి స్వగతం :

  04)
  ________________________________
  తొయ్యలి కపు డేమొ - తొలిచూలు కలిగెను
  ఆరు నెలలు నిండ - నతివ మురిసె !
  కదులు చుండె బిడ్డ - కడుపులో నటు నిటు
  గర్భమందు బిడ్డ - గంతు లిడెను !
  ________________________________

  రిప్లయితొలగించండి
 5. కిశోజీ! పద్మవ్యుహం లోకి నాకన్న ముందు జొరబడ్డారు. అందుకే నేనింకొక వ్యుహం వెతుక్కున్నా. అభినందనలు.

  ఆడ పిల్ల నాకు అసలొద్దు తొలగించు
  మనిన తల్లి;యిట్టి మలిన జగతి
  పుట్టి మునుగు కన్న, పుట్టి ముంచు డనుచు
  గర్భ మందు బిడ్డ గంతు లిడెను.

  రిప్లయితొలగించండి
 6. నా పూరణ .....

  నడక నేర్చినాఁడు నా చిన్ని తనయుండు
  పట్టుకొనఁ బోవఁ బట్టువడఁడె
  యాటలాడుచుండి యటునిటు చను గృహ
  గర్భమందు బిడ్డ గంతు లిడెను.

  రిప్లయితొలగించండి
 7. హమ్మయ్య, "ర్భ" ప్రాసతో నేనే ముందుగా పోస్టు చేస్తానో లేదో అనుకొన్నాను. పరీక్షిత్తు శిశువుగా వున్నప్పుడు, ఉత్తర గర్భంలో అశ్వత్థామ బ్రహ్మశిరో నామ బాణ ఘాతములకు ఆవేదన చెంది,

  అర్భకుడుహడలి యుత్తర
  గర్భమునందుండి వేడ కమలాక్షుండా
  విర్భవ ముచెంది కావగ
  గర్భమందు బిడ్డ గంతు లిడెను.

  రిప్లయితొలగించండి
 8. బీర్బలు,అక్బరు కథ సం
  దర్భసహిత వ్యాఖ్యలనిడి; పతిజేరి సతిన్
  గర్భము నిమురుచు జెప్పగ,
  గర్భంబున నున్న బిడ్డ గంతులు వేసెన్!

  రిప్లయితొలగించండి
 9. శాస్త్రీజీ !
  పద్మవ్యూహం లోకి ఎవరైనా
  ప్రవేశించొచ్చు !
  కావలసిందల్లా వాడి గలిగిన
  అస్త్ర శస్త్రాలే !

  మీ కొత్త వ్యూహం బావుంది !

  శంకరార్యా !
  గృహ గర్భమా !
  అబ్బో ! భేషుగ్గా యున్నది !

  వాహ్ !
  చంద్రశేఖరా !
  పరీక్షిత్తు మీద ఎక్కు పెట్టిన మీ పూరణ
  మా బాగా యున్నది !
  నూటికి నూఱు మార్కులూ మీవే !

  రిప్లయితొలగించండి
 10. చంద్ర శేఖర్ గారూ!అభినందనలు. కానీ గంతులు వేసే తొందరలో నాలుగవ పాదం 'కంద '(కా)కుండా ఆట వెలదేశారు.

  శంకరార్యా! మేము (శిశువులం)యెంతప్పటికీ 'గర్భం ' లోనే తిరుగుచున్నాము.మీరు (పెద్దవారు)గృహ గర్భం లోకి వచ్చేశారు.బాగుందండీ.

  రిప్లయితొలగించండి
 11. శాస్త్రి గారూ, పట్టు పట్టారుగా. కట్ అండ్ పేస్ట్ లో దొర్లిన టైపాటు. వసంత మహోదయులు వేసిన వంద మార్కులూ మీవే. ఇప్పుడు చూడండి:
  అర్భకుడుహడలి యుత్తర
  గర్భమునందుండి వేడ కమలాక్షుండా
  విర్భవ ముచెంది కావగ
  గర్భంబున నున్న బిడ్డ గంతులు వేసెన్.

  రిప్లయితొలగించండి
 12. 05)
  __________________________________

  దుర్భుద్ధి తోడహసనము;
  గర్భము పండెనట కుంతి - కని; గాంధారే
  గర్భముపై మోదుకొనగ
  గర్భంబున నున్న బిడ్డ గంతులు వేసెన్ !
  __________________________________

  రిప్లయితొలగించండి
 13. వసంత కిశోర్ గారూ,
  మీరు వాక్యాలను విడగొట్టి వచన కవితలా ఇవ్వడం వల్ల ఎక్కువ చోటు ఆక్రమిస్తున్నది. వ్యాఖ్యలు చదవడానికి మౌజుతో పైకీ క్రిందికీ "బ్లాగు గర్భమందు గంతు లిడ"వలసి వస్తున్నది. మీ వ్యాఖ్యలను ఇలా ఇవ్వవచ్చు కదా!

  శాస్త్రీజీ !
  పద్మవ్యూహం లోకి ఎవరైనా ప్రవేశించొచ్చు ! కావలసిందల్లా వాడి గలిగిన అస్త్ర శస్త్రాలే ! మీ కొత్త వ్యూహం బావుంది !

  శంకరార్యా !
  గృహ గర్భమా ! అబ్బో ! భేషుగ్గా యున్నది !

  వాహ్ ! చంద్రశేఖరా !
  పరీక్షిత్తు మీద ఎక్కు పెట్టిన మీ పూరణమా బాగా యున్నది ! నూటికి నూఱు మార్కులూ మీవే !

  రిప్లయితొలగించండి
 14. 06)
  __________________________________

  నిర్భీతిగ విహరించితి
  గర్భము వచ్చెనని యతివ - గడబిడ పడుచున్ !
  గర్భము ద్రుంచగ దలచిన
  గర్భంబున నున్న బిడ్డ - గంతులు వేసెన్ !
  __________________________________

  రిప్లయితొలగించండి
 15. చంద్ర శేఖర్ గారూ!మొదట కందాన్ని పూర్తి జేసిన మీకే ఆ వంద మార్కులు చెందుతాయి.నాలుగోపేపెర్ జతజేయడంలో పొరబడ్డారంతే.
  కిశోర్ జీ! ధన్యవాదాలు.గాంధారి గర్భాన్ని గంతులు వేయించారు. బాగుంది.

  రిప్లయితొలగించండి
 16. చంద్ర శేఖరుల పద్యం అద్భుతం.

  నా ప్రయత్నం:

  "దర్భో దకంబు జల్లగ
  గర్భంబున నున్న బిడ్డ గంతులు వేసెన్
  అర్భకు లిద్దరు ధరణీ
  గర్భజ కౌ బిడ్డలనిరి" కవి వాల్మీకుల్.

  రిప్లయితొలగించండి
 17. గురువుగారూ గృహ గర్భం అద్భుత ప్రయోగం.

  రిప్లయితొలగించండి
 18. శంకరార్యా !
  చదువుకోడానికి సులువుగా
  ఉంటుందని !
  కాని మీతో గంతులేయిస్తున్నానని
  ఇప్పుడేగా తెలిసింది !
  ప్రయత్నిస్తాను !
  నా ప్రమేయం లేకుండానే వ్రేలు enter మీదికి
  వెళ్ళి పోతోంది !

  రిప్లయితొలగించండి
 19. ధన్యవాదాలు సార్లూ.
  శంకరయ్య మాస్టారూ, శాస్త్రిగారిని, వసంతమహోదయులను అమెరికా పంపించేయండి సార్. వారి స్పీడ్ కి తట్టుకోలేకుండా వున్నాము. కళ్ళు మూసి తెరిచేలోపున ధారగా పద్యాలు కురిపిస్తునారు. ఇక్కడకి వచ్చాక యెలాగూ టైం జోను తేడా వల్ల మీరు సమస్య ఇచ్చే టైముకి నిద్ర పోవటానికి రెడీగా వుంటారు.
  హాస్యానికి అన్నాను గానీ, మీలాంటి వారు తెలుగు గడ్డకే శోభ.

  రిప్లయితొలగించండి
 20. గర్భము తీయించు కొనవలెనని దలచిన
  తల్లి కడుపులోని బిడ్డ :

  07)
  __________________________________

  దౌర్భాగ్యము నాకీ యెడ
  నిర్భాగ్యపు తల్లి కడుపు - నిలిచితి ననుచున్ !
  "దుర్భుద్ధిని ద్రుంచ దలచె"
  గర్భంబున నున్న బిడ్డ - గంతులు వేసెన్ !
  __________________________________

  రిప్లయితొలగించండి
 21. మిస్సన్న మహాశయా !
  లవకుశులతో చక్కగా
  గంతులేయించారు; గర్భంలో !

  రిప్లయితొలగించండి
 22. శంకరార్యా !
  అయినా అంత గంతులెయ్యవలసిన అవసరం ఎందుకుంటుంది?
  ప్రతీ సారీ vertical bar వద్దకు వెళ్ళి button పట్టుకొని పైకీ క్రిందికీ
  move చేస్తారా ? అవసరం లేదు ! mousu రెండు button లకీ మధ్యలో
  wheel ఒకటి వుంటుంది ! అది వాడితే జారుడు బల్ల మీద జారినంత సులువుగా
  పైకీ క్రిందకీ ఎన్నిసార్లయినా తిరగొచ్చు !

  రిప్లయితొలగించండి
 23. అయ్యా ! ఇదీ పరీక్షిత్తు కథే :

  08)
  _______________________________

  దుర్భేద్యంబగు నస్త్రము
  గర్భముపై రాగ; చక్రి - కరుణను గాచెన్
  గర్భము నిలిచెను ! నుత్తర
  గర్భంబున నున్న బిడ్డ - గంతులు వేసెన్ !
  _______________________________

  రిప్లయితొలగించండి
 24. తాగుబోతు తండ్రి తల్లిని తిడుతుంటే
  లోనున్న బిడ్డ :

  09)
  _______________________________

  దుర్భరమౌ శబ్దంబులు
  దుర్భాషలనాడు తండ్రి - దుష్ట వచనముల్ !
  ఆర్భాటము వినలేకయె
  గర్భంబున నున్న బిడ్డ - గంతులు వేసెన్ !
  _______________________________

  రిప్లయితొలగించండి
 25. పిల్ల పాప లేక పిచ్చెక్కి ఏడ్వగ
  తల్లి బడసె తనయు తగిన రీతి
  ఆసుపత్రి యందు యాధునికంబుగ
  గర్భమందు బిడ్డ గంతు లిడెను.

  రిప్లయితొలగించండి
 26. టెస్టు ట్యూబు బేబీ ని పొందారు అని చెప్పడమే ఈ పద్య సారాంశము.

  రిప్లయితొలగించండి
 27. నెలలు నిండి నట్టి నెలతకు స్కానింగు
  వలయును అని చెప్పె వైద్యురాలు
  స్క్రీనుపై నగుపడె శిశువు చిత్రము; తల్లి
  గర్భమందు బిడ్డ గంతు లేయ !

  రిప్లయితొలగించండి
 28. "బుర్ర " గుహలనుగన,బోయిరి దంపతు
  లిరువురు,తమ సుతుడు పోరు సలుప,
  విస్మయమ్ముగల్గె,వింతలన్గనిన,భూ
  గర్భ మందు బిడ్డ గంతు లిడెను!!!

  రిప్లయితొలగించండి
 29. అర్భకంపు బిడ్డ! ఆర్భాట మెరుగదు!
  శంక రార్యు బిడ్డ! (శంక రాభ రణము) సౌమ్య శీలి!
  ముద్దు లొలుకు బిడ్డ! మురియ నంతర్జాల
  గర్భమందు బిడ్డ! గంతు లిడెను.

  రిప్లయితొలగించండి
 30. వసంత మహోదయా ధన్యవాదాలు.
  మీ గర్భస్థ శిశువులందరూ గడుసు పిండాలే.

  రిప్లయితొలగించండి
 31. దుర్భర మని తెలియక
  గర్భము ధరించితిని గాన గండము గడువన్ !
  నిర్భయముగ బిడ్డనుగన
  గర్భంబున నున్న బిడ్డ గంతులు వేసేన్ !

  రిప్లయితొలగించండి
 32. బిడ్డ ఎవరొ తెలియ చెడ్డ చిక్కుగ మారె
  ఆడ శిశువు యనగ హతము జేయ
  తల్లి వేన నీవు తనుజను చంపగ
  గర్బ మందు బిడ్డ గంతు లిడెను

  రిప్లయితొలగించండి
 33. కవి మిత్రులకు వందనాలు.
  వచ్చిన పూరణలలో సగం కందపద్యాలే. దుర్భేద్యమైన "ర్భ" ప్రాసను నిర్భయంగా భేదించిన మీ పూరణలు నాలో ఉత్సాహాన్నీ, మీపై నమ్మకాన్నీ పెంచాయి. పద్య రచనలో మీరంతా నిష్ణాతులవుతున్నందుకు ఆనందంగా ఉంది. అందరికీ ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి
 34. వసంత కిశోర్ గారూ,
  మీ తొమ్మిది పూరణలూ బాగున్నాయి. అభినందనలు.
  మొదటి పూరణలో "పద్మవ్యూహ" మన్నప్పుడు "ద్మ" గురువు అవుతుంది కదా! "అభిమన్యు గర్భము" అన్వయం కుదరదు. నా సవరణ ....
  అర్జునుండు సెప్పె నపుడు పద్మవ్యూహ
  మును సుభద్ర కామె కనులుమూయ
  బాగు గాను వినెను బాలాభిమన్యుండు
  గర్భమందు బిడ్డ - గంతు లిడెను !
  (చూస్తే పద్యం మొత్తాన్ని మార్చి నట్లుగా తోస్తున్నది. కోపం తెచ్చుకోకండి)
  రెండవ పూరణలో నారాయణ మంత్రోపదేశం అద్భుతంగా ఉంది.
  3,4,5వ పూరణలు అన్ని విధాలా బాగున్నాయి.
  ఆరవ పూరణలో "విహరించితి" .... "విహరించగ" అయితే?
  7,8,9 వ పూరణలు బాగున్నాయి.
  ఎనిమిదవ పూరణ సర్వశ్రేష్ఠంగా ఉంది.
  మీకు అభినందన నవరత్నాలు.

  రిప్లయితొలగించండి
 35. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  మీ రెండు పూరణలూ బాగున్నాయి. అభినందనలు.
  మొదటి పూరణలో "అసలు + వద్దు" అనేది "అసలొద్దు" అనడమే కొద్దిగా ఇబ్బంది పెట్టింది.
  రెండవ పూరణ ఉత్తమంగా ఉంది. "బ-భ" ప్రాసను కొందరు ఒప్పుకుంటారు కనుక ఓకే.

  చంద్ర శేఖర్ గారూ,
  శాస్త్రి గారన్నట్లు ఆ క్రెడిట్ మీదే.
  చక్కని పూరణ. అభినందనలు.

  మిస్సన్న గారూ,
  అద్భుతంగా ఉంది మీ పూరణ. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 36. శంకరార్యా !
  మీ చక్కని సలహాలకు, సవరణలకు, ధన్యవాదములు !
  మీరు తప్పులు దిద్దితే కోపమెందుకు ?
  దిద్దక పోతేనే వస్తుంది గాని !

  రిప్లయితొలగించండి
 37. టేకుమళ్ళ వెంకటప్పయ్య గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.

  నాగరాజు రవీందర్ గారూ,
  బాగుంది మీ పూరణ. అభినందనలు.
  "వలయును అని చెప్పె" అనేది "వలయు ననుచు చెప్పె" అంటే సరి!

  మంద పీతాంబర్ గారూ,
  భూగర్భంలో గంతులు వేయించిన మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
  రెండవ పాదంలో ప్రాసయతి తప్పింది. ప్రాసాక్షరానికి ముందు లఘుగురువుల సామ్యాన్నీ పాటించాలి కదా. ఇక్కడ ముందు లఘువుండి, యతి స్థానంలో గురువుంది.
  "లిరువురు,తమ సుతుడు పోరు సలుప" అనేది "లిరువురు,తమ పుత్రు డిష్టపడగ" అంటే సరి!

  మిస్సన్న గారూ,
  అంతర్జాలగర్భంలో గంతులు వేయించిన మీ రేండవ పూరణ మనోహరంగా ఉంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 38. రాజేశ్వరి నేదునూరి గారూ,
  మీ రెండు పూరణలూ బాగున్నాయి. అభినందనలు.
  మొదటి పూరణ రెండవ పాదంలో గణదోషం. కందంలో రెండవ పాదంలో సరిగణంగా జగణం (ధరించి) ఉండకూడదు. అలాగే మూడవ గణం (తినిగాన _ సలం) నలమో , జగణమో ఉండాలి. "గర్భము ధరియించె గాన/ గర్భమును ధరించె గాన/ గర్భము ధరియించితి నని" ఏదైనా ఉండవచ్చు.
  రెండవ పూరణలో "శిశువు + అనగ" యడాగమం రాదు. "శిశు వనంగ" అందాం. "తనూజ" సరియైనదనుకుంటా.

  రిప్లయితొలగించండి
 39. శంకరార్యా !
  నా సవరణను గూడా తిలకించుడు !

  1అ)
  _________________________________

  నిద్ర పోవు చున్న - నెలత గర్భము నుండి
  అర్జునుండు జెప్ప - నర్భకుండు !
  వినెను శ్రద్ధ గాను - వ్యూహ రచనమంత !
  గర్భమందు బిడ్డ - గంతు లిడెను !
  _________________________________
  వ్యూహము = పద్మ వ్యూహము

  రిప్లయితొలగించండి
 40. వసంత కిశోర్ గారూ,
  ఇప్పుడు అన్నివిధాలా మీ పూరణ ఉత్తమంగా ఉంది. సంతోషం!

  రిప్లయితొలగించండి
 41. కిశోర మహోదయా మూడవ పాదంలో యతిని చూడండి.
  (గురువులకు క్షమాపణలతో)

  రిప్లయితొలగించండి
 42. మిస్సన్న మహాశయులకు ధన్యవాదములతో :
  1ఆ )
  _________________________________

  నిద్ర పోవు చున్న - నెలత గర్భము నుండి
  అర్జునుండు జెప్ప - నర్భకుండు
  వినెను వ్యూహ రచన ! - వేడుక మీరగా
  గర్భమందు బిడ్డ - గంతు లిడెను !
  _________________________________
  వ్యూహము = పద్మ వ్యూహము

  రిప్లయితొలగించండి
 43. అర్భకుండుగాగ జనియించె దేవకి
  గర్భమందు; బిడ్డ గంతు లిడెను
  ఆట పాట లెన్నొ ఆడెను పాడెను,
  నందునింట, లీల నటన జూపె!

  అర్భకుడయెనట దేవకి
  గర్భమందు; బిడ్డ గంతు లిడెను
  గర్భగ్రుహముగ జేయుచు
  ఆర్భాటముగను యశోద ఆంగణ మంతన్

  రిప్లయితొలగించండి
 44. మందాకిని గారూ,
  మీ రెండు పూరణలూ చక్కని భావంతో అలరించాయి. అభినందనలు.
  మొదటి పూరణ మొదటి పాదంలో యతిదోషం. "అర్భకుడుగ జనన మందెను దేవకి ...." అందాం.
  రెండవ పూరణలో మీరుకూడ ఆటవెలది పాదాన్ని కాపీ, పేస్ట్ చేసారు. మూడవ పాదంలో గణదోషం ఉంది. "గర్భగృహంబున, మిక్కిలి"అందాం.

  రిప్లయితొలగించండి